సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేష్ రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని మండిపడ్డారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించిందన్నారు.
‘కేకే లైన్‌తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకీతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానీ సంస్థతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ప్రధాని మోదీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్లాంట్‌కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment