టికెట్ల లొల్లి.. ఏపీ బీజేపీలో అయోమయం | Possibility Of Changes In Some Seats Allotted To Bjp In Ap | Sakshi
Sakshi News home page

టికెట్ల లొల్లి.. ఏపీ బీజేపీలో అయోమయం

Published Thu, Mar 21 2024 5:31 PM | Last Updated on Thu, Mar 21 2024 7:29 PM

Possibility Of Changes In Some Seats Allotted To Bjp In Ap - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. ఆ పార్టీ సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై బీజేపీలో అయోమయం నెలకొంది. బీజేపీకి కేటాయించిన‌ కొన్ని సీట్లలో మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఓడిపోయే సీట్లని బీజేపీకి ఇచ్చారంటూ ఇప్పటికే అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

గెలిచే సీట్లే ఇవ్వాలంటూ సీనియర్లు పట్టుబడుతున్నారు. సీనియర్ల ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో రెండు రోజుల క్రితం‌ కోర్ కమిటీ చర్చించింది. బీజేపీ గెలిచే సీట్లు ఇవ్వాలంటూ కొన్ని స్ధానాలలో బీజేపీ మార్పులు కోరింది.

బీజేపీ కోరిన సీట్ల కోసం హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మరోసారి సమావేశమయ్యారు. బీజేపీ తాజా ప్రతిపాదనలు, సీట్ల మార్పులపై చర్చించారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఏపీ అభ్యర్ధులపై చర్చించే అవకాశం ఉంది.  ఎల్లుండి కొన్ని స్ధానాలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ
ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి సీటు పురంధేశ్వరి, సోమువీర్రాజు కోరుతుండగా, వైజాగ్‌లో జీవీఎల్ పోటీ చేస్తానంటున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి సీటు కావాలంటున్నారు. రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అరకు టికెట్‌ను కొత్తపల్లి గీత ఆశిస్తున్నారు. ఏలూరు నుంచి పోటీ చేయాలని  ఆంజనేయ చౌదరి భావిస్తున్నారు. తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు సాగిస్తుండగా, విజయనగరం సీటు కేటాయించాలని మాధవ్ కోరుతున్నారు.

ఇదీ చదవండి: పవన్‌పై పోతిన మహేష్‌ తిరుగుబాటు.. రెబల్‌గా పోటీ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement