సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో ఏపీకి నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు దక్కే అవకాశం అవకాశముంది. టీడీపీ నుంచి మగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. నాలుగు మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ కోసం టీడీపీ యత్నాలు సాగిస్తోంది.
టీడీపీకి రెండు మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది. టీడీపీకి కేంద్రంలో చక్రం తప్పే అవకాశం వచ్చినా కీలక శాఖలు దక్కటం అనుమానమే. ఉక్కు శాఖ, పౌర విమానయాన శాఖలు టీడీపీకి దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.
ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన నాయుడు, గోదావరి జిల్లాల నుంచి గంటి హరీష్, పుట్టా మహేష్ యాదవ్, కోస్తా జిల్లాల నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, రాయలసీమ నుంచి బికె పార్ధసారధి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో పురందేశ్వరి పేరు బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. చంద్రబాబు లాబీయింగ్‌తో కేంద్ర మంత్రి వర్గంలో సీఎం రమేష్ చోటు కోసం యత్నిస్తున్నారు. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment