
దేశంలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు
ఈ నెల 25న నోటిఫికేషన్
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతో పాటు కర్ణాటక, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక్కో స్థానానికి మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో మూడు స్థానాలకు ఎమ్మెల్సీల రాజీనామా కారణంగా, రెండు స్థానాలకు అనర్హత వేటు కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఏపీలో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడగా, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment