
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
కాగా, శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చింది. పార్టీ పరంగా కూడా నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పవన్‌కళ్యాణ్ ఆదేశించారు.’ అని తెలిపింది. కాగా, ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా నాగబాబును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెట్టారు. గతంలో నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఆ పోస్టుల వెనుక.. మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ కూడా నడిచింది.
2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్‌కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు. మొత్తం మీద తమ్ముడి సాయంతో నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారమాట..

అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!@NagaBabuOffl @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) March 6, 2025
Comments
Please login to add a commentAdd a comment