గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తన చాంబర్‌లో బొత్సతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. మా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. శాసనసభ, శాసన మండలి లో ప్రజల కోసం నిలబడతాం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చెయ్యాలి. మేము ప్రజల గొంతుక గా సభలో వ్యవహరిస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపాం. రాష్ట్రంలో జరుగుతున్న దమన కాండ ను దేశానికి చాటి చెప్పారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి. కేసులు పెడుతున్నారు..పెట్టుకొనివ్వండి. ప్రభుత్వం లో వాళ్లే ఉన్నారు కదా. విచారణలు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం’’ అని అన్నారాయన.
అంతకు ముందు.. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారాయన. ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు పలువురు ఉన్నారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కూటమి కుట్రలు చేసి అభ్యర్థిని నిలబెడదామని భావించినప్పటికీ.. వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మద్ధతు ఉండడం.. ఆ పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశంతో ఆ పార్టీ నేతలంతా ఏకతాటిపై నిలబడి బొత్సను గెలిపించుకున్నారు. మూడేళ్లపాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment