
విజయవాడ, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మీడియాతో మాట్లాడారు.
‘‘మాజీ సీఎంగా వైఎస్ జగన్(YS Jagan Security) కు జెడ్ ఫస్ల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి. కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది. మా ఆందోళనను గవర్నర్‌కు తెలియజేశాం. ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరాం. మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
.. చట్టం తను పని తాను చేసుకునేలా చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు. జగన్‌ను ఇబ్బందిట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు. మా హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా?’’ అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బొత్స నిలదీశారు.



ఎన్నికల కోడ్‌ల్లే భద్రతల్పించలేకపోయామన్న ప్రభుత్వ వాదనను బొత్స తప్పుబట్టారు. జెడ్ ఫ్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి భద్రతకు ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని అన్నారాయన. ఒకవేళ, ఎన్నికల కోడ్ ఉంటే జడ్ ప్లస్ భద్రత కల్పించడం కుదరదు అని ముందుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?. ఇదే ఎన్నికల కోడ్ విజయవాడలో జరిగిన సంగీత విభావరీ సందర్బంగా ఎందుకు అమలు చేయలేదు? రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మిర్చియార్డ్ కు వైయస్ జగన్ వెడితే ఎన్నికల కోడ్ పేరుతో ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు అని బొత్స మండిపడ్డారు.
దయనీయంగా రాష్ట్ర రైతాంగం
వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు మేలు జరగలేదన్న కూటమి నేతల ఆరోపణలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. దాదాపు రూ.20 వేలు ఉన్న క్వింటా మిర్చి నేడు రూ.10 వేల దిగువకు పడిపోయింది. రైతులకు అండగా ఉండేందుకు వెడితే దానిని రాజకీయం చేస్తారా?. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుభరోసాను క్రమం తప్పకుండా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయ్యింది. రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చింది కూడా రైతులకు ఇవ్వలేదు. ఆర్బీకేల ద్వారా మా హయంలో విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఉన్నాం. నేడు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. నేడు దళారీలు రైతులను దోచుకుంటున్నారు. ఎరువులు, విత్తనాల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదని.. వీటన్నింటి వల్ల రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.
బాబు వక్రబుద్ధి బయటపడింది: మేకపాటి
వైఎస్ జగన్ భద్రతా వ్యవహారంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు తన వక్ర బుద్దిని బయట పెడుతున్నారని మండిపడ్డారాయన. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము భద్రత ఇవ్వకపోయి ఉంటే.. అయన కనీసం బయట తిరిగే వారు కాదు. జెడ్ ఫ్లస్ కేటగిరి ఉన్న ప్రతిపక్ష నేతకి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యింది. జగన్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అయన క్రేజ్ తగ్గదు. దేశ రాజకీయాలను ప్రభావితం చెయ్యగల నేత జగన్.
Comments
Please login to add a commentAdd a comment