lapse
-
సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్
DGCA finds lapses in Air India టాటా నేతృత్వంలోని ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిరిండియా విమానాల్లో అంతర్గత భద్రతా ఆడిట్లలో లోపాలను కనుగొంది.ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. జూలై 25- 26 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఎయిరిండియా కార్యాలయ తనిఖీల్లో DRFలో లోపాలను ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్ తెలిపారు.కొనసాగుతున్న విచారణ కారణంగా, తాము వివరాలను వెల్లడించలేమని పేర్కొన్నారు. DGCAకి సమర్పించిన తనిఖీ నివేదిక ప్రకారం, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎగ్జామినేషన్ (పైలట్లు ఆల్కహాల్ తీసుకున్నారా?లేదా?అనే పరీక్ష)కు సంబంధించి స్పాట్ చెక్‌ను నిర్వహించి నప్పటికీ, అంతర్గత ఆడిటర్ మాండేటరీ చెక్‌లిస్ట్ ప్రకారం వ్యవహరింలేదని, కొన్ని తప్పుడునివేదికలను అందించిందని టీం ఆరోపించింది. అలాగే క్యాబిన్ నిఘా, కార్గో, ర్యాంప్ అండ్ లోడ్ వంటి పలు అంశాల్లో క్రమం తప్పకుండా సేఫ్టీ స్పాట్ చెక్‌లను నిర్వహించాల్సి ఉంది, అయితే 13 సేఫ్టీ పాయింట్ల తనిఖీల్లో మొత్తం 13 కేసుల్లో ఎయిర్‌లైన్ తప్పుడు నివేదికలు సిద్ధం చేసిందని రిపోర్ట్ చేసింది. (లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్) అయితే సాధారణ భద్రతా నిబంధనలకు లోబడే తమ విధానాలున్నాయని ఎయిరిండియా ప్రతినిధి స్పందించారు. ఈ విషయాన్ని నిరంతరం అంచనా వేయడానికి, మరింత బలోపేతం చేసుందుకు తాము ఇలా ఆడిట్లలో చురుకుగా పాల్గొంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సంబంధిత అధికారి లేవనెత్తిన ఏవైనా విషయాలను ఎయిర్‌లైన్ నేరుగా పరిశీలిస్తుందన్నారు. -
20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’
సోషల్ మీడియాలో అద్భుతమైన ఫొటోలు, వీడియోలు షేర్ అవుతుంటాయి. తాజాగా ఒక డచ్ డైరెక్టర్ షేర్ చేసిన వీడియో అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఆ డైరెక్టర్ పేరు ఫ్రాన్స్ హాఫ్‌మెస్టర్. ఆయన ఒక టైమ్‌లాప్స్ వీడియో రూపొందించారు. ఈ వీడియో కోసం ఆయన 20 ఏళ్ల పాటు ప్రతీవారం తమ కుమార్తెకు ఫొటోతీస్తూ వచ్చారు. ఆ ఫొటోలన్నింటినీ ఇప్పుడు టైమ్‌లాప్స్ వీడియోగా రూపొందించారు. దీనిలో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. 2 నిముషాల 18 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో అతని కుమార్తె చిన్నప్పటి నుంచి ఎలా రూపాంతరం చెందుతూ వచ్చి, నేడు అందమైన అమ్మాయిగా ఎలా మారిందో కనిపిస్తుంది. బాల్యం నుంచి నేటి వరకూ ఆమె ముఖంలో చోటుచేసుకున్న మార్పులను ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ ఫొటోలలో ఆమె స్టయిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ ఫ్రాన్స్ హాఫ్‌మెస్టర్ ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ రెడిట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆ తండ్రి కృషిని అభినందిస్తున్నారు. ఒక యూజర్... ఈ టైమ్ లాప్స్ వీడియోను ఆ అమ్మాయి చూసి తెగ మురిసిపోయి ఉంటుందన్నారు. ట్విట్టర్లో ఈ వీడియో @TansuYegen పేరుతో షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక మిలియన్‌మంది వీక్షించగా, 26 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం! The father filmed his daughter's photo every week until she turned 20. 📸 pic.twitter.com/MNmOpEx0sk — Tansu YEĞEN (@TansuYegen) August 7, 2023 -
నిఘా లేదు.. సర్వర్ లేదు! కీలకమైన టీఎస్పీఎస్సీలో ‘సెక్యూరిటీ’ లోపాలు
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ఉన్న అనేక సెక్యూరిటీ లోపాలను గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమరి్పంచాలని నిర్ణయించారు. పరీక్ష పేపర్లను దొంగిలించిన టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు పి.ప్రవీణ్‌కుమార్ వాటిని తన పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నాడు. అందరికీ దాని యాక్సెస్ లేకుండా చేయడానికి డేటా లాక్ చేసి ఉంచాడు. దీన్నిబట్టి చూస్తే టీఎస్పీఎస్సీ తన డేటా రక్షణ కోసం ఈ మాత్రం చర్యలు కూడా తీసుకోలేదని స్పష్టమవుతోంది. కార్యాలయంలో నిఘా వ్యవస్థ, కంప్యూటర్లకు సర్వర్ లేకపోవడం విస్మయపరుస్తోంది. గేటు వద్దనే యాక్సెస్ కంట్రోల్.. టీఎస్పీఎస్సీలోనికి వెళ్లే వారిని కేవలం గేటు వద్ద, ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఆపి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాలు దాటి ముందుకు వెళ్లిన వ్యక్తి.. ఎక్కడకు వెళ్తున్నాడు? ఎవరిని కలుస్తున్నాడు? తదితరాలు పరిశీలించే అవకాశం కమిషన్‌లో లేదని పోలీసులు గుర్తించారు. కమిషన్ ప్రాంగణంలోని అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా వాటిలో కొన్ని సరిగ్గా పని చేయట్లేదు. పరీక్ష పత్రాలు ఉండే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ రెండో అంతస్తులో ఉంది. అయితే అక్కడ ఒక్క కెమెరా కూడా లేదు. దీంతో సెక్షన్లోకి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరిని కలిసారు? అనేది సాంకేతికంగా గుర్తించే అవకాశం లేకుండా పోయింది. సర్వర్ లేకపోవడంతో నిఘా కరువు.. లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే పరీక్షలు నిర్వహించే టీఎస్పీఎస్సీలో దాదాపు 130 వరకు కంప్యూటర్లు ఉన్నాయి. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు పెన్‌డ్రైవ్ యాక్సెస్ కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి విభాగాల్లో కంపూటర్లను ల్యాన్ ద్వారా కనెక్ట్ చేయరు. పెన్‌డ్రైవ్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా సర్వర్ ఏర్పాటు చేసుకుని దాని ఆధారంగానే నెట్వర్క్ నిర్వహిస్తారు. ఇలా చేస్తే ఎవరు ఏ కంప్యూటర్ ద్వారా ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది తేలిగ్గా గుర్తించవచ్చు. కమిషన్‌లో ఇలాంటి వ్యవస్థ లేకపోవడం లీకు వీరులకు కలిసి వచి్చంది. మరోపక్క సైబర్ దాడులు, కంప్యూటర్ సేఫ్టీ, పాస్వర్డ్స్, యూజర్ ఐడీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ఏ అంశం పైనా సిబ్బందికి కనీస అవగాహన కూడా లేకపోవడం గమనార్హం. సైబర్ ఆడిటింగ్ ఉన్నట్లా..? లేనట్లా..? టీఎస్పీఎస్సీ లాంటి కీలక సంస్థలకు అనునిత్యం సైబర్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సరీ్వసెస్ (టీఎస్టీఎస్) ఆ«దీనంలోని నిపుణులు క్రమం తప్పకుండా దీన్ని నిర్వహించాలి. అక్కడి కంప్యూటర్లు, సర్వర్లు, ఫైర్ వాల్స్ తదితరాలను పరీక్షించి సమకాలీన సైబర్ దాడులు తట్టుకోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయా? లేదా అన్నది తేల్చి నివేదిక ఇవ్వడంతో పాటు అవసరమైన సిఫారసులు కూడా చేయాల్సి ఉంది. అయితే ఈ ఆడిట్ జరుగుతోందా? సిఫారసులు చేస్తున్నారా? చేస్తే కమిషన్ పట్టించుకుంటోందా? తదితర అంశాలు జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే లీకేజీలపై స్పష్టత వచ్చే పరిస్థితి నెలకొంది. చదవండి: మరో సంచలనం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా? -
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ ఝలక్!
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ షాక్ ఇచ్చింది. ఎయిర్ ఏషియా పైలెట్ల శిక్షణ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతో డీజీసీఏ భారీగా జరిమానా విధించింది. ట్రైనింగ్ సమయంలో పైలట్ల నెపుణ్యతకు సంబంధించిన టెస్ట్(లేదా) ఇన్స్ట్రుమెంటేషన్ రేటింగ్ చెక్ తదితరాలను కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎయిర్ ఏషియా చేయడం లేదని తేలడంతో డీజీసీఏ రూ. 20 లక్షల జరిమానా విధించింది. తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు సదరు ఎయిర్ ఏషియా హెడ్ ట్రైనీని కూడా మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది డీజీసీఏ. ఎయిర్ ఏషియా నియమించిన ఎనిమిది మంది ఎగ్జామినర్లకూ కూడా ఒక్కొక్కరికి రూ. 3లక్షలు చొప్పున జరిమాన విధించింది. ఈ మేరకు డీజీసీఏ సంబంధిత మేనేజర్, శిక్షణ అధిపతి, ఎయిర్ ఏషియా నియమించిన ఎగ్జామినర్లు తమ విధులను సరిగా నిర్వర్తించనందుకు ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు ఎయిర్‌లైన్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారి రాత పూర్వక సమాధానాలను పరిశీలించాకే డీజసీఏ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. (చదవండి: వివాహేతర సంబంధం వివాదం: విషం తాగి పోలీస్టేషన్‌కి వచ్చి..) -
ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం.. ఆయన వల్లే!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదట్లో పంజాబ్ పర్యటన సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసనలతో కొద్దిసేపు ఆయన కాన్వాయ్ నిలిచిపోవడం తీవ్ర దుమారం చెలరేగింది. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఘటనపై సుప్రీం కోర్టు ఓ కమిటీని నియమించగా.. ఆ కమిటీ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఆ రిపోర్ట్‌ను ఇవాళ(గురువారం) సుప్రీం ధర్మాసనం బయటపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యం వ్యవహారానికి సంబంధించి.. ఫెరోజ్‌పూర్(ఫిరోజ్‌పూర్) ఎస్ఎస్పీ(సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్) నిర్లక్ష్యమే కారణమని నివేదిక వెల్లడించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఇందూ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ సుప్రీం కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. కమిటీ నివేదికను చదివి వినిపించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన బెంచ్.. సరిపడా సిబ్బంది ఉన్నా ఫెరోజ్‌పూర్ ఎస్ఎస్పీ విధి నిర్వహణలో విఫలం అయ్యారని, అదీగాక ప్రధాని మోదీ పర్యటన గురించి రెండు గంటల ముందే ఆయనకు(ఫెరోజ్‌పూర్ ఎస్ఎస్పీ) సమాచారం ఉన్నా సరైన చర్యలు చేపట్టలేకపోయారని కమిటీ నివేదిక పేర్కొందని తెలిపారు. ఇది సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యం ఎంత మాత్రంకాదని, కేవలం పంజాబ్ పోలీస్ అధికారి వైఫల్యమని తమ దర్యాప్తులో స్పష్టంగా తేలిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, తద్వారా సంబంధిత చర్యలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం తెలిపింది. ఇదిలా ఉంటే.. జనవరి 5వ తేదీ, 2022 పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ కాన్వాయ్.. రైతుల నిరసనలతో ఫెరోజ్‌పూర్-మోగా మార్గంలో పియారియానా రోడ్డు ఓవర్‌బ్రిడ్జిపై సుమారు 20 నిమిషాలపాటు ఆగిపోయింది. ఊహించని ఈ ఘటనపై ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధానికి ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో భద్రతపై ఆందోళన వ్యక్తం అయ్యింది. విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో ఓ కమిటీని నియమించగా.. అందుకు సంబంధించిన నివేదికను కూడా సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇదీ చదవండి: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు -
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..!
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! కోవిడ్‌తో పాటు ఆర్ధిక కారణాలతో కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసీ) పాలసీదారులకు కల్పించిన విషయం తెలిసిందే. మార్చి 25, 2022తో పాలసీల పునరుద్దరణ గడువు ముగియనుంది. కొంత ఆలస్య రుసుము చెల్లించడంతో ఆగిపోయిన పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్ఐసీ అధికారిక ప్రకటన చేసింది. సకాలంలో బీమా ప్రీమియం చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25, 2022లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పించింది. పాలసీ రివైవల్ క్యాంపెయిన్‌లో భాగంగా.. నిర్దిష్ట నిబంధనలు, షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుంచి 5 సంవత్సరాలలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్, పాలసీ టర్మ్ పూర్తికాని పాలసీలను పునరుద్ధరించవచ్చును.వీటికి కొత్త ఆలస్య రుసుములో కూడా రాయితీను అందిస్తోంది ఎల్ఐసీ. అర్హతగల పాలసీలకు ఆలస్య రుసుములో రాయితీలు ఇలా ఉన్నాయి. రూ. 1,00,000 వరకు- ఆలస్య రుసుములో రాయితీ- 20%, గరిష్ట రాయితీ- రూ. 2000. రూ.1,00,001 నుంచి రూ.3,00,000 వరకు- ఆలస్య రుసుములో రాయితీ 25%, గరిష్ట రాయితీ- రూ.2,500. రూ. 3,00,001 అంతకంటే ఎక్కువ పాలసీలపై- ఆలస్య రుసుములో రాయితీ 30%, గరిష్ట రాయితీ రూ. 3000. చదవండి: ఇన్సురెన్స్ ప్రీమియంపై జీఎస్టీను తగ్గించండి -
చేతిలో రూ. కోట్లు ఉన్నా..
అడుగడుగుకో సమస్య.. అభివృద్ధిలో వెనుకంజ.. వరుస కరువు.. బయటపడే అవకాశం ఉన్నా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. చేతిలో కోట్లాది రూపాయల నిధులున్నా.. ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం. ఒకటి కాదు.. రెండు కాదు.. వంద కోట్ల నిధులు మూలుగుతున్నా.. రెండేళ్లలో ఖర్చు చేసిన మొత్తం రూ.2కోట్లు. నిధుల వినియోగం ప్రతిపాదనల దశ దాటకపోవడం.. ఉన్నతాధికారి సూచించే మార్పులు, చేర్పులతోనే కాలం గడిచిపోవడం చూస్తే.. అభివృద్ధి పట్ల అధికారుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. కర్నూలు(అగ్రికల్చర్): అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, కరువు పీడిత గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి కింద ఏటా రూ.50 కోట్లు కేటాయిస్తోంది. ఇలా జిల్లాకు 2014-15లో రూ.50 కోట్లు, 2015-16లో రూ.50 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ఆరు నెలల క్రితమే వివిధ శాఖలకు కేటాయించినా ఇప్పటి వరకు అభివృద్ది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపాదనల దశలోనే ఉండిపోయాయి. జిల్లా ట్రెజరీ పీడీ ఖాతాలో ఈ నిధులు మూలుగుతున్నా వినియోగించుకోవడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిధులు పీడీ ఖాతాలో ఉండటం వల్ల ల్యాప్స్ అయ్యే అవకాశం లేకపోయినా.. వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం గమనార్హం. 2014-15లో విడుదలయిన రూ.50కోట్లను వివిధ శాఖలకు కేటాయించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.16.60 కోట్లు, ఏపీఎస్ఐడీసీకి రూ.14.24 కోట్లు, సెరికల్చర్‌కు రూ.4.18 కోట్లు, హార్టికల్చర్‌కు రూ.4.53 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.6.22 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.3.08 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.1.71కోట్లు, డీఆర్డీఏకు రూ.21.8 లక్షలు, ఏపీఎంఐపీకి రూ.21 లక్షల ప్రకారం కేటాయింపులు చేపట్టారు. కానీ ఇంతవరకు ఆర్డబ్ల్యూఎస్, హార్టికల్చర్, సెరికల్చర్, ట్రాన్స్‌కో నుంచి రూ.23 కోట్లకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.2కోట్లు మాత్రమే వ్యయం చేయగలిగారు. అన్ని శాఖల అధికారులు ప్రత్యేక అభివృద్ధి నిధులను జిల్లా కలెక్టర్ ఆమోదంతోనే ఖర్చు చేయాల్సి ఉంది. కొన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు ఇస్తున్న మార్పులతోనే గడిచిపోతున్నట్లు తెలుస్తోంది. 2015-16 నిధుల వినియోగం ఎప్పుడో.. 2014-15లో విడుదలయిన నిధులకే మోక్షం లేదు.. ఇక 2015-16లో విడుదలయిన నిధులను ఎప్పటికి ఖర్చు చేస్తారనేది వేయి డాలర్ల ప్రశ్న. ఈ ఏడాది విడుదల చేసిన రూ.50 కోట్లలో జిల్లా నీటి యాజమాన్య సంస్థకు రూ.25కోట్లు, ఆర్‌డబ్ల్యుఎస్‌కు రూ.24.50 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.47.50 లక్షలు కేటాయించారు. ఇప్పటికీ ఈ నిధుల వినియోగం ప్రతిపాదనల దశలోనే ఉండటం గమనార్హం. జిల్లాలో రైతుల అభ్యున్నతికి, వ్యవసాయంలో అధిక ఉత్పాదకత సాధించడానికి, నీటి సమస్య పరిష్కారానికి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతా మాటలు జిల్లా యంత్రాంగం చెప్పే మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. ఫాంపాండ్ తవ్వించుకున్న రైతులకు సబ్సిడీపై ఆయిల్ ఇంజిన్లు, థైవాన్ స్ప్రేయర్లు ఇస్తామని ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించాలని నిర్ణయించారు. కాని ఇంతవరకు ఏ ఒక్క రైతుకు ఆయిల్ ఇంజన్లు, థైవాన్ స్ప్రేయర్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఇలా పట్టుపరిశ్రమ అభివృద్ధికి, పాడిరైతుల అభ్యున్నతికి ఎన్నో వరాలు ప్రకటించారు. అయితే ఏదీ కార్యరూపం దాల్చని పరిస్థితి. ఈ నిధులు వినియోగంపైనే భవిష్యత్.. ఇప్పటి వరకు జిల్లాకు విడుదల చేసిన రూ.100 కోట్లు వ్యయం చేస్తేనే 2016-17 ఆర్థిక సంవత్సరం నిధులు రూ.50 కోట్లు విడుదల అవుతాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ సంవత్సరం విడుదల చేసిన నిధులను అదే ఏడాది మార్చిలోపు వినియోగించాల్సి ఉంది. కానీ అలా చేయాకుండా నిధులను పీడీ ఖాతాలో ఉంచుకొని కాలం గడుపుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం నిధులు విడుదల అవుతాయా... లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.