
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ షాక్ ఇచ్చింది. ఎయిర్ ఏషియా పైలెట్ల శిక్షణ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతో డీజీసీఏ భారీగా జరిమానా విధించింది. ట్రైనింగ్ సమయంలో పైలట్ల నెపుణ్యతకు సంబంధించిన టెస్ట్(లేదా) ఇన్‌స్ట్రుమెంటేషన్ రేటింగ్ చెక్ తదితరాలను కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎయిర్ ఏషియా చేయడం లేదని తేలడంతో డీజీసీఏ రూ. 20 లక్షల జరిమానా విధించింది.
తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు సదరు ఎయిర్ ఏషియా హెడ్ ట్రైనీని కూడా మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది డీజీసీఏ. ఎయిర్ ఏషియా నియమించిన ఎనిమిది మంది ఎగ్జామినర్‌లకూ కూడా ఒక్కొక్కరికి రూ. 3లక్షలు చొప్పున జరిమాన విధించింది. ఈ మేరకు డీజీసీఏ సంబంధిత మేనేజర్, శిక్షణ అధిపతి, ఎయిర్ ఏషియా నియమించిన ఎగ్జామినర్‌లు తమ విధులను సరిగా నిర్వర్తించనందుకు ఎందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తీసుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు ఎయిర్‌లైన్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారి రాత పూర్వక సమాధానాలను పరిశీలించాకే డీజసీఏ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
(చదవండి: వివాహేతర సంబంధం వివాదం: విషం తాగి పోలీస్టేషన్‌కి వచ్చి..)
Comments
Please login to add a commentAdd a comment