ఎల్‌ఐసీ పాలసీదారులకు అలర్ట్..! కోవిడ్‌తో పాటు ఆర్ధిక కారణాలతో కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్‌ఐసీ) పాలసీదారులకు కల్పించిన విషయం తెలిసిందే. మార్చి 25, 2022తో పాలసీల పునరుద్దరణ గడువు ముగియనుంది. కొంత ఆలస్య రుసుము చెల్లించడంతో ఆగిపోయిన పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్‌ఐసీ అధికారిక ప్రకటన చేసింది.
సకాలంలో బీమా ప్రీమియం చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా ఎల్‌ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25, 2022లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని ఎల్‌ఐసీ కల్పించింది. పాలసీ రివైవల్ క్యాంపెయిన్‌లో భాగంగా.. నిర్దిష్ట నిబంధనలు, షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుంచి 5 సంవత్సరాలలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్, పాలసీ టర్మ్ పూర్తికాని పాలసీలను పునరుద్ధరించవచ్చును.వీటికి కొత్త ఆలస్య రుసుములో కూడా రాయితీను అందిస్తోంది ఎల్‌ఐసీ.
అర్హతగల పాలసీలకు ఆలస్య రుసుములో రాయితీలు ఇలా ఉన్నాయి.
- రూ. 1,00,000 వరకు- ఆలస్య రుసుములో రాయితీ- 20%, గరిష్ట రాయితీ- రూ. 2000.
- రూ.1,00,001 నుంచి రూ.3,00,000 వరకు- ఆలస్య రుసుములో రాయితీ 25%, గరిష్ట రాయితీ- రూ.2,500.
- రూ. 3,00,001 అంతకంటే ఎక్కువ పాలసీలపై- ఆలస్య రుసుములో రాయితీ 30%, గరిష్ట రాయితీ రూ. 3000.
Comments
Please login to add a commentAdd a comment