Dutch Director Creates Timelapse Video Of His Daughter Growing Up Over 20 Years, Goes Viral - Sakshi
Sakshi News home page

20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’

Published Tue, Aug 8 2023 10:15 AM | Last Updated on Tue, Aug 8 2023 10:28 AM

Timelapse Video of Daughter Growing up Over 20 Years - Sakshi

సోషల్‌ మీడియాలో అద్భుతమైన ఫొటోలు, వీడియోలు షేర్‌ అవుతుంటాయి. తాజాగా ఒక డచ్‌ డైరెక్టర్‌ షేర్‌ చేసిన వీడియో అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఆ డైరెక్టర్‌ పేరు ఫ్రాన్స్‌ హాఫ్‌మెస్టర్‌. ఆయన ఒక టైమ్‌లాప్స్‌ వీడియో రూపొందించారు. ఈ వీడియో కోసం ఆయన 20 ఏళ్ల పాటు ప్రతీవారం తమ కుమార్తెకు ఫొటోతీస్తూ వచ్చారు. ఆ ఫొటోలన్నింటినీ ఇప్పుడు టైమ్‌లాప్స్‌ వీడియోగా రూపొందించారు. దీనిలో అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌ కనిపిస్తుంది. 

2 నిముషాల 18 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో అతని కుమార్తె చిన్నప్పటి నుంచి ఎలా రూపాంతరం చెందుతూ వచ్చి, నేడు అందమైన అమ్మాయిగా ఎలా మారిందో కనిపిస్తుంది. బాల్యం నుంచి నేటి వరకూ ఆమె ముఖంలో చోటుచేసుకున్న మార్పులను ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ ఫొటోలలో ఆమె స్టయిల్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

డైరెక్టర్‌ ఫ్రాన్స్‌ హాఫ్‌మెస్టర్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియా సైట్‌ రెడిట్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆ తండ్రి కృషిని అభినందిస్తున్నారు. ఒక యూజర్‌... ఈ టైమ్‌ లాప్స్‌ వీడియోను ఆ అమ్మాయి చూసి తెగ మురిసిపోయి ఉంటుందన్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియో @TansuYegen పేరుతో షేర్‌ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక మిలియన్‌మంది వీక్షించగా, 26 వేలకుపైగా లైక్స్‌ వచ్చాయి. 
ఇది కూడా చదవండి: ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement