abdul nazeer
-
కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు: బొత్స
విజయవాడ, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎంగా వైఎస్ జగన్(YS Jagan Security) కు జెడ్ ఫస్ల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి. కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది. మా ఆందోళనను గవర్నర్‌కు తెలియజేశాం. ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరాం. మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. .. చట్టం తను పని తాను చేసుకునేలా చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు. జగన్‌ను ఇబ్బందిట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు. మా హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా?’’ అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బొత్స నిలదీశారు. ఎన్నికల కోడ్ల్లే భద్రతల్పించలేకపోయామన్న ప్రభుత్వ వాదనను బొత్స తప్పుబట్టారు. జెడ్ ఫ్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి భద్రతకు ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని అన్నారాయన. ఒకవేళ, ఎన్నికల కోడ్ ఉంటే జడ్ ప్లస్ భద్రత కల్పించడం కుదరదు అని ముందుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?. ఇదే ఎన్నికల కోడ్ విజయవాడలో జరిగిన సంగీత విభావరీ సందర్బంగా ఎందుకు అమలు చేయలేదు? రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మిర్చియార్డ్ కు వైయస్ జగన్ వెడితే ఎన్నికల కోడ్ పేరుతో ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు అని బొత్స మండిపడ్డారు. దయనీయంగా రాష్ట్ర రైతాంగంవైఎస్సార్సీపీ హయాంలో రైతులకు మేలు జరగలేదన్న కూటమి నేతల ఆరోపణలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. దాదాపు రూ.20 వేలు ఉన్న క్వింటా మిర్చి నేడు రూ.10 వేల దిగువకు పడిపోయింది. రైతులకు అండగా ఉండేందుకు వెడితే దానిని రాజకీయం చేస్తారా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుభరోసాను క్రమం తప్పకుండా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయ్యింది. రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చింది కూడా రైతులకు ఇవ్వలేదు. ఆర్బీకేల ద్వారా మా హయంలో విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఉన్నాం. నేడు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. నేడు దళారీలు రైతులను దోచుకుంటున్నారు. ఎరువులు, విత్తనాల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదని.. వీటన్నింటి వల్ల రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.బాబు వక్రబుద్ధి బయటపడింది: మేకపాటివైఎస్ జగన్ భద్రతా వ్యవహారంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు తన వక్ర బుద్దిని బయట పెడుతున్నారని మండిపడ్డారాయన. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము భద్రత ఇవ్వకపోయి ఉంటే.. అయన కనీసం బయట తిరిగే వారు కాదు. జెడ్ ఫ్లస్ కేటగిరి ఉన్న ప్రతిపక్ష నేతకి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యింది. జగన్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అయన క్రేజ్ తగ్గదు. దేశ రాజకీయాలను ప్రభావితం చెయ్యగల నేత జగన్. -
గవర్నర్ తో అసత్యాలు, అబాద్ధాలు చదివించింది కూటమి సర్కార్
-
ప్రగతికి పది సూత్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రగతికి పది సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన 76వ గణతంత్ర దిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. ఏడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక, పరిపాలనా గందరగోళంతో దెబ్బతిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం, వనరుల మళ్లింపుతో పాటు దుష్పరిపాలన సాగించడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై పడిందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయని, నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాలనా వ్యవస్థ దెబ్బ తిన్నదన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, ప్రతి సవాలును అవకాశంగా మార్చడం మన బాధ్యతని, ఇందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 రోడ్‌మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొదట ఓట్–ఆన్–అకౌంట్ బడ్జెట్‌ను పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక అడ్డంకులను అధిగమించడం, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రూ.16 లక్షల కోట్ల నుంచి 2047 నాటికి రూ.305 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.పది సూత్రాలు⇒ పేదరికం నిర్మూలనకు పీ 4 విధానం. ⇒ అందరికీ స్వచ్ఛమైన తాగునీరు.⇒ మహిళ, యువత సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి.⇒ యువతను రేపటి అవకాశాలకు సిద్ధం చేస్తూ వేగంగా నైపుణ్య గణన⇒ నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, నీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పులు⇒ 2026 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి⇒ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు మామిడి, అరటి, మిర్చి, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు లాంటి పంట ఉత్పత్తులు ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం.⇒ మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీమోడల్ రవాణా కేంద్రాల అభివృద్ధి.⇒ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024తో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు. 5వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు. పీఎం సూర్య ఘర్ రూఫ్‌టాప్ సోలార్ పథకం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రోత్సాహం.⇒ గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధతిలో పండించే పంటలకు విలువ జోడింపు సౌకర్యాల కల్పన. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల గవర్నర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాల్లో కూడా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.ఇక, తెలంగాణలో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
YS జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
-
చైతన్యస్ఫూర్తి ‘సత్యసాయి’
ప్రశాంతి నిలయం: మానవాళికి నిస్వార్థ సేవలు అందించి, ఆధ్యాత్మిక బోధనలతో సన్మార్గం వైపు పయనింపజేసిన చైతన్యస్ఫూర్తి సత్యసాయి అని గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శనివారం సత్యసాయి బాబా 99వ జయంతి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై మాట్లాడారు. మత సామరస్యాన్ని పాటిస్తూ మానవత్వమే అందరి మతమన్న సందేశంతో మానవాళిని ఏకం చేసేందుకు సత్యసాయి కృషి చేశారన్నారు. నేటి సమాజానికి ఆయన సేవా స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు. ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. సత్యసాయి శతజయంతిని పురస్కరించుకుని ‘సాయికల్పతరు’ పేరుతో చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు.రాష్ట్రంలో 44 వేల ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 33 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారంలో భాగంగా రాగి జావ అందించేందుకు సత్యసాయి ట్రస్ట్ సహకారం అందించడం అభినందనీయమన్నారు. సత్యసాయి మానవాళికి అందించిన సేవలకు గుర్తింపుగా గత ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. బాబా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు దేశంలోని మిగిలిన సేవా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘సత్యసాయి దివ్యాంగ్జన్’ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను గవర్నర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదికను గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 99 కేజీల బర్త్‌డే కేక్‌ను కట్ చేసి భక్తులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, సవిత, హిందుపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు..
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు జరిగిన అన్యాయం మీద గవర్నర్‌కు వైఎస్సార్సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి ,మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా,మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఉన్నారు. -
గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాసిన వైఎస్ జగన్
-
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ లేఖ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. జూలై 22, 2024న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం కొన్ని అంశాలపై చేసిన వక్రీకరణలను వైఎస్ జగన్ లేఖలో వివరించారు.ఏపీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లేఖలో ప్రస్తావించారు. వాస్తవాలను రికార్డులతో సహా లేఖలో వైఎస్ జగన్ తెలియజేశారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కాగ్, ఆర్బీఐ నివేదికల్లోని వాస్తవాలను పొందుపరుస్తూ లేఖ రాశారు. (లేఖ పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రసంగమంతా చంద్రబాబు భజనే: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు గురించి భజన చేయకుండా..రాష్ట్రంలో జరగుతున్న అరాచకపాలన గురించి మాట్లాడితే బాగుండేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తాడేపల్లిలో వైఎస్సాఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ఈ సందర్భంగా తాడిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగమంతా చంద్రబాబు భజనే కనపడింది. ప్రతిపక్ష పార్టీపై దుమ్మెత్తిపోయటానికే సరిపోయిందని మండిపడ్డారు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేదు. అమరావతి, ప్రత్యేక హోదా గురించి కనీస ప్రస్థావనే లేదని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ చెప్తారనుకున్నాం. కానీ దాని గురించి మాట్లాడలేదు. మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ అమలు గురించి కూడా మాట్లాడలేదు. అంటే హామీలన్నింటినీ తుంగలో తొక్కేసినట్టేనని అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి గవర్నర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి వంద కోట్లు కూడా లేవు. కానీ 2024నాటికి ప్రభుత్వ ఖజానాలో రూ.7 వేల కోట్ల పైనే ఉందన్న తోట చంద్రశేఖర్..ఎన్నికల హామీలను చంద్రబాబు ఇప్పటి వరకు అములు చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప గవర్నర్ వాస్తవాలను మరిచిపోయారు. 2014-19 మధ్యలో 54 సంస్థలను ప్రయివేటుపరం చేశారు.వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ధ్వజమెత్తారు.చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహరించడం సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు.షర్మిళ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేయటం సిగ్గుచేటని తెలిపారు.షర్మిల వైఖరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 50 రోజుల్లోనే రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా షర్మిల నోరెందుకు మెదపటం లేదు? చంద్రబాబు కోసమే తప్ప ప్రజల కోసం షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.ఓట్ ఆన్ బడ్జెట్ ఏడు నెలలపాటు నిర్వహించాలనుకోవటం సిగ్గుచేటు.మేనిఫెస్టో పథకాలకు ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ఓట్ ఆన్ బడ్జెట్ పెడుతున్నారు. ప్రజాస్వామ్య యుతంగా మేము నిరసనలు తెలిపితే పోలీసులు మాపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అసెంబ్లీలో ప్లకార్డులను చూపిస్తే చంద్రబాబు వణుకిపోతున్నారు. అరాచకాలపై అసెంబ్లీలో నిలదీశాం.ప్రభుత్వం స్పందించలేదనే బాయ్ కాట్ చేశామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
-
టీడీపీ అరాచకాలు.. గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
-
ఏపీలో అరాచక, ఆటవిక పాలన.. గవర్నర్‌తో భేటీలో వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత సాగుతున్న అరాచక పాలన, పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలపై, వైఎస్సార్సీపీ లక్ష్యంగా చేస్తున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాలతో సహా వినతిపత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సమర్పించారు. ఈ క్రమంలో గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గవర్నర్‌కు అందజేసిన వినతిపత్రంలోని విషయాలు ఇలా ఉన్నాయి.. ‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా మా పార్టీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుంది. వారిని కొట్టడం, చంపడం, దారుణంగా వేధించి భయానక పరిస్థితులు సృష్టించడం వంటివన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారు. వ్యాపార సంస్థలపైనా దాడులు చేస్తున్నారు. చివరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ.. రోడ్డు పక్కనే చిరు వ్యాపారం చేసుకుంటున్న వారినీ వదలడం లేదు. వారిపై దాడులు చేసి, ఉపాధిని దెబ్బ కొడుతున్నారు.కేవలం మా పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, ఆస్తులు, వ్యాపార సంస్థలపై మాత్రమే కాకుండా.. చివరకు ప్రభుత్వ ఆస్తులపైనా వారి దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అలా ప్రభుత్వ ఆస్తులనూ వారు విధ్వంసం చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలతో పాటు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లను సైతం టీడీపీ శ్రేణులు వదిలి పెట్టడం లేదు. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కక్షతోనే, అధికార పక్షం ఈ పని చేస్తోంది. చివరకు రాష్ట్రంలో చాలా చోట్ల దివంగత మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు.తాజాగా, ఈనెల 17న, పల్నాడు జిల్లా వినుకొండలో మా పార్టీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డు మీద ప్రజలందరూ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దారుణ హత్య రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జరిగాయి.వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన వారు, శాసనసభకు ఎన్నికైన వారు, ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకూ రక్షణ కూడా లేకుండా పోయింది. గత గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్పగారిని పరామర్శించడానికి వెళ్లిన మా పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నం చేశాయి. పోలీసుల సమక్షంలోనే ఈదాడి జరిగింది. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం వీటన్నింటితో అందరికీ అర్ధమవుతోంది.రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనిపించడం లేదు. రాజ్యాంగం, చట్టం, పోలీసు వ్యవస్థ.. అన్నీ నిర్వీర్యమయ్యాయి. నామమాత్రంగా మిగిలాయి. అన్నింటికీ భిన్నంగా, చట్ట విరుద్ధంగా అధికార పక్షం ఏర్పాటు చేసుకున్న తమ సొంత రాజ్యాంగ వ్యవస్థ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం గత 45 రోజులుగా ఇక్కడ పని చేస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నాయి.గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అంటే మంచి విద్య, మంచి వైద్యం, రైతుకు భరోసా, అక్కచెల్లెమ్మలకు సాధికారిత, పటిష్టమైన లా అండ్ ఆర్డర్. సుస్థిర, సమగ్రమైన అభివృద్ధి కొనసాగింది. వాటన్నింటిలో ఆనాడు ఈ రాష్ట్రం పేరు గొప్పగా చెప్పుకుంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. రాష్ట్రంలో అరాచకాలు తప్ప, పరిపాలన అనేది ఎక్కడా కనిపించడం లేదు.ప్రభుత్వం ఏర్పాటైన నెలన్నర వ్యవధిలోనే 36 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ వాళ్ల వేధింపులు భరించ లేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వీళ్ల అరాచకాలు భరించలేక దాదాపు 2,700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. ఇవన్నీ కాక, 1,050కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.ఈ ఘటనలన్నీ అనుకోకుండానో లేక యాదృఛ్చికంగానో జరిగిన ఘటనలు కావు. ఒక పథకం ప్రకారం ఒక మోడస్ ఆపరండీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి చేస్తున్న దుర్మార్గాలు ఇవన్నీ. రాష్ట్రంలో అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్నవారు.. పైస్థాయి అధికారులు మొదలు కింది స్థాయి వరకూ సిగ్నల్ పంపారు. ఏకంగా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి రెడ్‌బుక్ పేరిట హోర్డింగులు పెట్టి, నేరుగా దాడులు చేయమని కేడర్‌కు చెప్పకనే చెప్పాడు. వాటిని అడ్డుకోవద్దని అధికారులనూ నిర్దేశించాడు. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ గూండాలు రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాల్సింది పోయి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారు. హత్యలను, దాడులను, అకృత్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు 27 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చేశారంటే.. చంద్రబాబు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి.మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. తక్షణం శాంతిస్థాపన జరగాల్సిన అవసరం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని కోరుతున్నాను. ఈ వినతిపత్రంతో పాటు, పై అంశాలన్నింటికి సంబంధించిన ఫోటోలు, వీడియో సాక్ష్యాలను కూడా మీకు అందజేస్తున్నాను’’ అని వైఎస్ జగన్ వినతిపత్రంలో పేర్కొన్నారు. సంబంధిత వార్త: యావత్ దేశం దృష్టికి 'ఆటవిక పాలన': వైఎస్ జగన్ -
గవర్నర్‌ను కలిసిన ఏపీ కొత్త సీఎస్ నీరభ్‌కుమార్
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌కు నూతన ప్రభుత్వ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, గవర్నర్‌ను కలిశారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వెళ్లిన సీఎస్ నీరభ్.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కాసేపు భేటీ అయ్యారు. సీఎస్‌గా నియమితులైన వేళ.. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీగా తెలుస్తోంది. సంబంధిత వార్త: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్ -
టీడీపీ దాడులపై గవర్నర్ కు YSRCP నేతల ఫిర్యాదు
-
సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: గవర్నర్ అబ్లుల్ నజీర్ ప్రసంగం ఇదే..
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అబ్దుల్ నజీర్ ప్రసంగం ఇలా.. విద్యా రంగం.. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. మనబడి నాడు-నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖలు మార్చాం. విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశాం. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని అమ్మఒడి పథకం తెచ్చాం. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలే లక్ష్యంగా నాడు-నేడు కార్యక్రమం. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా రూ.15వేలు జమ చేస్తున్నాం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు గోరుముద్దకు రూ.4,417కోట్లు ఖర్చు చేశాం. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటి వరకు రూ.3,367 కోట్లు ఖర్చు చేశాం. విద్యా సంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనది. 8,9 తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్ పంపిణీ చేశాం. వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి ఐటీ విధానం. ప్రతీ ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యాబోధన. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు. అత్యున్నత 50 విద్యా స్థంస్థల్లో గుర్తించిన 20 ఫ్యాకల్టీలలో ఏ విభాగంలోనైనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు. ఇప్పటివరకు రూ.1.25 కోట్ల వరకు మొత్తం రీయింబర్స్ చేస్తున్నాం. ప్రభుత్వ కృషితో స్కూల్స్‌లో డ్రాప్ఔట్లు గణనీయంగా తగ్గాయి. వైద్య రంగం.. రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు. 53 ఏరియా ఆసుపత్రులు, తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో వసతులు అభివృద్ది. నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు. ఇప్పటి వరకు 53,126 మంది వైద్యసిబ్బందిని నియమించాం. ఫ్యామిలీ డాక్టర్ కింద 3.03 కోట్ల ఓపీ సేవలు అందించాం. ఇప్పటి వరకు 1.3 కోట్ల గ్రామీణ రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు. ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేశాం. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించాం. ఇప్పటి వరకు 1.32 కోట్ల ప్రత్యేక రోగుల సేవలు అందించాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. వ్యవసాయ రంగం.. రైతులు రాష్ట్రానికి వెన్నముక 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం. రైతు భరోసా కింద రూ.33,300 కోట్లు పంపిణీ. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. ఉచిత పంట బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7802కోట్ల క్లైయిమ్లు. మిచాంగ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు రూ.347.55 కోట్లు విడుదల. జీఎస్డీపీలో వ్యవసాయం వాటా ఏపీలో 36 శాతం కాగా, జాతీయ సగటు 18శాతమే. ఆక్వా రంగం.. రూ.50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌ల ఏర్పాటు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతీ కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో ఏపీ మొదటి స్థానం. వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే రూ.10లక్షల పరిహారం. 20వేల ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద రూ.128 కోట్లు. 61వేల మంది ఆక్వా రైతులకు విద్యుత్ ఛార్జీ రాయితీ రూ.3186కోట్లు. 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్. రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాతో ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా ఏపీ. మహిళా సాధికారత.. మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం 78.84 లక్షల మంది మహిళలకు రూ.25,571 కోట్లు. రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణిలు, 28.62 లక్షల మంది పిల్లలకు లబ్ధి. పౌష్టికాహార పథకాలకు రూ.6688 కోట్లు ఖర్చు. అంగన్వాడీ కేంద్రాలకు రూ.21.82 కోట్ల విలువైన గ్రోత్ మానిటరింగ్ పరికరాలు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్ష మందికి పెన్షన్ అందిస్తున్నాం. రాష్ట్రంలో దిశయాప్ ద్వారా 3040 కేసులు పెన్షన్ కానుక.. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల పెన్షన్ అందిస్తున్నాం. నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ.1961 కోట్లు పెరిగింది. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్లు కేటాయింపు. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,129 కోట్ల పంపిణీ. వైఎస్సార్ కాపునేస్తం కింద రూ.2,029 కోట్లు జమ. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ.1,257.04కోట్లు జమ. ఐదేళ్లలో రూ.75వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. 3,57,844 మంది అర్హుల ఖాతాల్లో రూ.2,029 కోట్లు జమ. రూ.71కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల కొనుగోలు. దీని ద్వారా 3,27,289 మంది తల్లులకు లబ్ది. ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు 10వేలు ఆర్థిక సాయం. జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం 10వేలు అందిస్తోంది. జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం.. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత. పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం. పోలవరం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు 74.01 శాతం పనులు పూర్తి. ఎల్ఏ అండ్ ఆర్ఆర్ పనిలో 22.42 శాతం పూర్తి. రూ.280 కోట్లతో 10 టీఎంసీల చిత్రావతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. అవుకు ప్రాజెక్ట్ రెండో టన్నెల్‌ను పూర్తి చేశాం. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేశాం. పులిచింతల నిర్వాసితులకు రూ.142 కోట్లు చెల్లించాం. 24 గంటల త్రీఫేజ్ కరెంట్ విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు వ్యవసాయ ఫీడర్లు. గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నాం. ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు పగటి పూట కరెంట్. తొమ్మిది గంటల ఉచిత్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. 1221 కి.మీల రోడ్ల మరమ్మతులకు రూ.490కోట్లతో పనులు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన 880 బస్సులు. జగనన్న టౌన్‌షిప్‌ల కోసం ప్రతీ నియోజకవర్గంలో రెండు ఎంఐజీ లేఅవుట్లు. 12,042 ప్లాట్లతో 30 ప్రాజెక్ట్‌లు చేపట్టాం. ఐటీ, విమానయాన, పర్యాటక రంగం.. భోగాపురంలో మే మూడో తేదీన నిర్మాణ పనులు ప్రారంభించాం. మరో 30 నెలల్లో ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు సిద్ధం. ఐటీ రంగాన్ని ప్రొత్సహించేందుకు ఐటీ పాలసీ 2021-24 ప్రవేశపెట్టాం. ఐటీ ఫలాలు చివరి మైలురాయి వరకు చేరేలా కృషి. 200 ఎండబ్ల్యూ డేటా సెంటర్ కోసం రూ.14,694కోట్ల పెట్టుబడి. మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు. పర్యాటక రంగం అభివృద్ధికి ఏపీ టూరిజం పాలసీ 2020-2025 అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై ఫోకస్. 7,290 మందికి ఉపాధి కల్పించేలా రూ.3,685 కోట్ల పెట్టుబడి. వికేంద్రీకరణ.. వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 13 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. 2.6 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు. జగనన్న సురక్ష ద్వారా కోటి ధృవీకరణ పత్రాలను ఇంటి వద్దకే అందించాం. 35,44,866 ఎకరాల భూమి పేదలకు పంపిణీ, హక్కులు కల్పించాం. 20,24,709 మంది భూమి లేని నిరు పేదలకు ప్రయోజనం. మా ప్రభుత్వంలో పేదరికం 11.52 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. -
Live: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
-
AP: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ బీసీఏ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. 7తేదీన ఉదయం 8 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
సుధామూర్తితో కలిసి డాక్టరేట్ అందుకున్న నైనా
భారత టేబుల్ టెన్నిస్ స్టార్, చదువుల తల్లిగా పేరొందిన నైనా జైస్వాల్ డాక్టరేట్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవం సందర్భంగా.. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నైనాకు పీహెచ్డీ డాక్టరేట్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తికి కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. కాగా అత్యంత పిన్న వయసులోనే పీహెచ్డీ పట్టా పుచ్చుకున్న తొలి భారతీయ వ్యక్తిగా నైనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 22 ఏళ్ల వయసులోనే ఈ హైదరాబాదీ ఈ ఫీట్ నమోదు చేశారు. కుటుంబంతో నైనా జైస్వాల్ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ క్రమంలో పీహెచ్డీ పట్టా అందుకుని రికార్డు సాధించారు. కాగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా జైస్వాల్.. చదువులోనూ మేటి. ఎనిమిదేళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. తద్వారా ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు అంతర్జాతీయస్థాయిలో మోటివేషనల్ స్పీకర్‌గా రాణిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు. -
ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
-
అవార్డులు అందజేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
-
సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్
-
ఏపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు అభినందనలు
AP Republic Day 2024 Celebrations Updates.. గవర్నర్ ప్రసంగం ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉండాలి ఐక్యమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పని చేయాలి ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ మన లక్ష్యాల్ని చేరుకోవాలి గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొంది ఒడిదుడుకుల్లో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలు ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారు 56 నెలలుగా గ్రామస్వరాజ్యం దిశగా సంస్కరణలు మారుమూల గ్రామాలకు కూడా సేవలు అందేలా సంస్కరణలు రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం విలేజీ క్లీనిక్స్‌తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్యసేవలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి జగనన్న అమ్మఒడితో ప్రతీ పేద విద్యార్థి చదువుకోగలుగుతున్నారు జగనన విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతోంది ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్‌తో వైద్యం అభినందనీయం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం సమర్థవంతంగా అమలు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోంది రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాం గర్బిణులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరుకుంటున్నాయి పెన్షన్లు, రేషన్ నేరుగా ఇళ్లకే వెళ్లి అందజేత ప్రతీనెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి అందించడం అభినందనీయం పరిపాలన సంస్కరణల్లో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు ప్రతీ ఏడాది స్కూళ్లు తెరవక ముందే విద్యాకానుక అందజేత రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక అందజేత ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు స్కూళ్లలో నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి గ్రామ, వార్డు సచివాలయాలు నేరుగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారు ఏపీ సంక్షేమ పాలనకు నా అభినందనలు ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది ► శకటాల ప్రదర్శన తిలకిస్తున్న గవర్నర్ నజీర్, ఇతరులు ► ప్రత్యేక ఆకర్షణగా సంక్షేమ శకటాలు సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ సాయుధ దళాల పరేడ్‌ను సమీక్ష చేసిన గవర్నర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంక్షేమ పథకాల శకటాలు ►గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియంలో పోలీసు , ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు ►ప్రదర్శనకు సిద్ధమైన వివిధ శాఖలకు చెందిన శకటాలు ►పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ నజీర్ ►జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ► ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు హాజరైన సీఎం జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు ► ఏపీ అసెంబ్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనమండలి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన స్పీకర్, మండలి ఛైర్మన్ ► ఏపీ సచివాలయంలో జెండా ఆవిష్కరణ ఏపీ సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి పాల్గొన్న పలువురు ఉన్నతాధికారులు ► విజయవాడ స్టేడియంలో.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(IGMC)లో మరికాసేపట్లో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు జెండా ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరణ అనంతరం గవర్నర్ ప్రసంగం ► రాజ్‌భవన్‌లో హైటీ కార్యక్రమం రిపబ్లిక్ డే సందర్భంగా సాయంత్రం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఇదీ చదవండి: సీఎం జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం..
-
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం
వైద్య రంగంలో విశ్వసనీయమైన సమాచారా న్ని అందించేందుకు ‘సాక్షి లైఫ్’ను తీసుకొచ్చింది సాక్షి మీడియా గ్రూప్. సమస్త ఆరోగ్య సమచారాన్ని సమగ్రంగా ఆర్టికల్స్, వీడియోల రూపంలో తీర్చిదిద్దింది. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు నిష్ణాతులైన డాక్టర్ల సూచనలు, సలహాలతో పాటు ఆహారం, వ్యాయామాల గురించి వివరంగా ఇందులో నిక్షిప్తం చేసింది. life.sakshi.com పేరుతో వచ్చిన ఈ వెబ్సైట్లో వైద్యరంగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యు ల ఇంటర్వ్యూలు, నిపుణుల సలహాలను వీడియోల రూపంలో యూట్యూబ్‌లో sakshi life ఛానల్లో అప్లోడ్ చేసింది. ‘సాక్షి‘ ఇద్దరి స్పూర్తితో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వైద్యరంగం నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒకరు. రూపాయికే వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన వైఎస్సార్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. మరొకరు డాక్టర్ ఈ.సీ.గంగిరెడ్డి. నిస్వార్థ వైద్య సేవలకు మారుపేరుగా నిలిచి ప్రజల గుండెల్లో కొలువైన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్యం వృత్తి కాదు,ప్రాణం అని నమ్మారు. ఈ ఇద్దరి మహనీయుల స్ఫూర్తితో ‘సాక్షి లైఫ్ ‘ తెలుగు ప్రజల ముందుకు వస్తోంది. ఆరోగ్య సమాచారాన్ని సులువుగా తెలుగు వారందరికీ అందించాలన్నదే ‘సాక్షి’ లక్ష్యం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, శ్రీమతి వై.ఎస్.భారతి రెడ్డి ‘సాక్షి లైఫ్’ వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ ఛానెల్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. సాక్షి లైఫ్ ప్రజలందరి ఆరోగ్య నేస్తం. అందుబాటులో ఉన్న వేర్వేరు వైద్య విధానాల గురించి చెప్పడమే కాదు, అసలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తుంది. life.sakshi.com https://www.youtube.com/@life.sakshi సాక్షి లైఫ్ప్రారంభం సందర్భంగా ప్రముఖ డాక్టర్లు ఏమన్నారంటే... ‘హెల్త్ కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం సాక్షి లైఫ్‌లో ఉంది. ఇది సమాజానికి చాలా అవసరం.’ – డా.డి.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ‘ప్రస్తుతం నమ్మకమైన వైద్య సమాచారం అందుబాటులో లేదు, ఆ లోటును సాక్షి లైఫ్ భర్తీ చేస్తుందనుకుంటున్నాను’ . – డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ‘వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్‌ను తీర్చిదిద్దారు’. – డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ‘ప్రతీ ఒక్కరికి గుండె కీలకం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్‌లో విపులంగా చె΄్పారు’. – డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ‘జీవనశైలిలో మార్పులే రోగాలకు కారణం, ఈ విషయంపై సాక్షి లైఫ్‌లో నిపుణుల సలహాలున్నాయి.’ – డా.గోపీ చంద్ మన్నం, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ ‘ఆరోగ్య రంగానికి సంబంధించిన సరైన సమాచారాన్ని నిపుణులైన వైద్యుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన ‘సాక్షి లైఫ్‘ కు వెల్కమ్’ – డా.కోనేటి నాగేశ్వరరావు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ‘మానసిక సమస్యలు పైకి చెప్పుకోలేని వారికి సాక్షి లైఫ్‌లో నిపుణుల ఇంటర్వ్యూల ద్వారా మంచి అవగాహన కలుగుతుంది, ఆల్ ది బెస్ట్’ – డా. పూర్ణిమ నాగరాజు, సైకియాట్రిస్ట్ ‘ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తడా నికి కారణాలు.. ముందుగా తెలుసుకుంటే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.. ఇలాంటి సమా చారాన్ని సాక్షి లైఫ్ ద్వారా అందిస్తున్నారు.’ – డా.కె. జె.రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విజయవాడ: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కాగా, పీఎస్ఎల్వీ-సీ58పై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందించారు. ఈ సందర్బంగా రాకెట్ విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు చెప్పారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ దేశంగా భారతదేశం అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్ఎల్వీ-సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరింది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని అని ఆకాంక్షించారు. ఇది కూడా చదవండి: పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం -
సీఎం జగన్‌కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life.— Narendra Modi (@narendramodi) December 21, 2023గవర్నర్ శుభాకాంక్షలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday. pic.twitter.com/75KTexNMbI— governorap (@governorap) December 21, 2023 -
అర్హులందరికీ పథకాలు చేరేలా అధికారులు చొరవ చూపాలి: గవర్నర్
సాక్షి, గుంటూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గుంటూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకుని పథకాలు మెరుగ్గా ఉండేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హత ఉండి పథకాలు అందని వారి వివరాలు సేకరించాలని గవర్నర్ సూచించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతం కావడానికి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు -
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో మాట్లాడుతన్న ఏపీ గవర్నర్
-
7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు
-
నవరత్నాలు ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం: గవర్నర్ అబ్దుల్ నజీర్
-
రావు బాల సరస్వతిగారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
శ్రీ గోవిందరాజు చక్రధర్ గారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
శ్రీ పుల్లెల గోపీచంద్ గారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది
-
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణం
సాక్షి,అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాథన్ నరేందర్ సోమవారం ప్రమాణం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్ నరేందర్‌ను గవర్నర్ అభినందించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమ ప్రొసీడింగ్స్‌ను నిర్వహించారు. అనంతరం జస్టిస్ నరేందర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు. కాగా.. రాజ్‌భవన్‌లో జస్టిస్ నరేందర్‌ను అటు గవర్నర్, ఇటు ముఖ్యమంత్రికి జస్టిస్ ధీరజ్ సింగ్ పరిచయం చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో అందరూ పాల్గొన్నారు. 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య జస్టిస్ నరేందర్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. జస్టిస్ నరేందర్ హైకోర్టులో నాలుగో స్థానంలో కొనసాగుతారు. మంగళవారం ఆయన జస్టిస్ దుర్గాప్రసాదరావుతో కలిసి కేసులను విచారిస్తారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే.. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం, తిరిగి రావడంలో జాప్యం జరగడంతో జస్టిస్ నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొనలేకపోయారు. దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ జి.నరేందర్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. ఆలయ ఏఈవో చంద్రశేఖర్ జస్టిస్ నరేందర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు సమర్పించారు. -
Governor Abdul Nazeer: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు (ఫొటోలు)
-
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులతో సీఎం వైఎస్ జగన్
-
గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం జగన్ భేటీ
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నవంబర్ 1న జరగనున్న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం.. ఏపీ హైకోర్టు నూతన జడ్జీల ప్రమాణస్వీకారానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. -
గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం జగన్
-
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి గవర్నర్ ఆరోగ్య స్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారాయన. తీవ్ర కడుపు నొప్పితో సోమవారం మణిపాల్ ఆస్పత్రిలో గవర్నర్ నజీర్ చేరిన సంగతి తెలిసిందే. ఆపై వైద్య పరీక్షల్లో అపెండిసైటిస్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆపై ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఇక తిరుమల బ్రహ్మోత్సవాలతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి పనుల్లో సోమవారం బిజీగా ఉన్న సీఎం జగన్.. అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు గవర్నర్ నజీర్ ఆరోగ్యంపై ఆరా తీస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇవాళ డోన్ పర్యటన ముగించుకుని నేరుగా ఆస్పత్రికే చేరుకున్నారాయన. -
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(65) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల అనంతరం.. గవర్నర్‌కు అపెండిసైటిస్‌గా వైద్యులు ధృవీకరించారు. గవర్నర్ అస్వస్థత గురించి రాజ్‌భవన్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు తొలుత విజయవాడకే వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని ఆయనకు సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం.. అపెండిసైటిస్‌గా తేల్చారు. వెంటనే గవర్నర్ నజీర్‌కు రోబోటిక్ విధానం ద్వారా సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రేపు డిశ్చార్జ్ ఆయన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై.. సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ అస్వస్థత సమాచారం అందుకున్న వెంటనే.. సీఎం జగన్ అధికారులతో మాట్లాడారు.గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
ఏపీ జైళ్ల శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
దొండపర్తి(విశాఖదక్షిణ)/ఆరిలోవ(విశాఖ తూర్పు)/కొవ్వూరు: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్, ఏపీ జైళ్లశాఖ సంయుక్తంగా విశాఖపట్నంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రధానంగా వర్చువల్ విధానంలో కోర్టు కేసుల విచారణను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని చెప్పారు. ఖైదీలను దండించడానికే కాకుండా జైళ్లలో వారి సంక్షేమానికి కూడా చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఖైదీలకు కార్పొరేట్ వైద్యంతోపాటు శిక్ష పూర్తయిన అనంతరం వారి జీవనోపాధికి ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మంచి ఆలోచన అని అన్నారు. ఇటువంటి సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తనతోపాటు పునరావాసానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాత్సవ్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీ‹Ùకుమార్ గుప్తా, అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతులు పాల్గొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రత: హోంమంత్రి వనిత రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబుకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. జైలులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నాయని, అక్కడ చంద్రబాబుకు ఎలాంటి ప్రాణహాని లేదని స్పష్టంచేశారు. ఆయన భద్రత పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. చంద్రబాబు కుంభకోణాలు వరుసగా బయటపడుతున్నప్పటికీ ఇంకా ఆయన నిప్పు అంటూ ప్రజలను నమ్మించాలని టీడీపీ నేతలు, పచ్చమీడియా అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. ఇన్ని కుంభకోణాలకు పాల్పడిన బాబు నిప్పా? అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్కామ్‌లన్నీ బయటపడితే టీడీపీ ఉనికి కోల్పోతుందనే భయంతో లోకేశ్, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. -
ప్రజాస్వామ్యం బలోపేతంలో ఆర్టీఐది కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యం బలోపేతం కావడంలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన 28 బోర్డు ఆఫ్ గవర్నర్లు, సమాచార కమిషన్ల నేషనల్ ఫెడరేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. దేశ ప్రజల ప్రయోజనానికి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపునకు, గోప్యత మినహాయింపునకు దోహదపడుతోందని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోని అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకునే శక్తివంతమైన సాధనం ఆర్టీఐ అని పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా చేస్తూ అవసరమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కును సులభంగా వినియోగించుకునేలా చేస్తోందన్నారు. ఆర్టీఐ పౌరుల ప్రాథమిక హక్కును గుర్తించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేసిందని వివరించారు. అవినీతిని అరికట్టడంలోను, సుపరిపాలన అందించడానికి, అవినీతి, అధికార దుర్వినియోగాలను బహిర్గతం చేయడానికి ఇది సహకరిస్తోందన్నారు. ఏదైనా తప్పు చేస్తే పరిహారం పొందే అధికారం ఇచ్చిందన్నారు. అలాగే బ్యూరోక్రాట్ల జాప్యాన్ని తగ్గించడం, సత్వర సేవలను మెరుగు పరచడం, ప్రభుత్వ అధికారులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అట్టడుగు వర్గాలపై ప్రత్యేక సాధికారత వంటి అంశాల్లో సానుకూల ప్రభావం చూపడానికి ఈ చట్టం దోహదం చేస్తోందన్నారు. ఇంకా వివక్ష, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక యంత్రాంగాన్ని అందించిందని, ఇది సమాచార అంతరాన్ని తగ్గించడంలో సహాయ పడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల కమిషన్లు ఒకే విధమైన అధికారాలు, బాధ్యతలను, ఒకదానితో ఒకటి స్వతంత్రతను కలిగి ఉంటాయన్నారు. ఈ ఫెడరేషన్ కమిషన్లు, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కమిషన్లను సభ్యులుగా చేర్చుకున్నందున కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల మధ్య పరస్పర సంప్రదింపులు సులభతరం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సందేశం పంపించిన సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాచార కమిషన్ల వార్షిక సమావేశానికి తన సందేశాన్ని పంపించారు. ‘ప్రభుత్వం తరఫున మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. దేశం నలుమూలల నుంచీ మీరు విశాఖకు రావడం సంతోషానిస్తోంది. రెండు దశాబ్దాలుగా సమాచార హక్కు చట్టం ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రజాస్వామ్యంలో చట్టం పాత్ర, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనాన్ని పెంచుతోంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా చదివి వినిపించారు. -
యూనివర్సిటీలు సామాజిక బాధ్యత పెంచే కేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని పెంచడమే కాకుండా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచే కేంద్రాలుగా నిలుస్తున్నాయని ఏపీ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏయూ కట్టమంచి రామలింగారెడ్డి కాన్వొకేషన్ హాల్లో శనివారం నిర్వహించిన ఆంధ్ర విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమలు–శాస్త్ర రంగంలో జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున, అవంతి ఫీడ్స్ సంస్థ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్, సాహిత్యం–కళా రంగాలలో ఎస్వీ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్‌లకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ అందించారు. 690 మంది డాక్టరేట్లను, 600 మంది మెడల్స్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాస్టల్, భారత్–ది జీ20 ప్రెసిడెన్షియల్ హాస్టల్, శతాబ్ది క్లాసిక్ హాస్టల్ భవనాల్ని గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. జ్ఞానం అంతఃదృష్టి కలిగి ఉండాలని, దానికి నైతికత జోడిస్తేనే విలువ ద్విగుణీకృతమవుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నత విద్య జ్ఞాననిధిగా మారిందని.. దేశంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలుస్తోందని అన్నారు. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఈ విశ్వవిద్యాలయం సర్ సీఆర్ రెడ్డి, సర్వేపల్లి, డాక్టర్ వీఎస్ కృష్ణ వంటి వారి సారథ్యంలో ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు. ఏయూ అమలు చేస్తున్న నూతన విధానాలను ఇతర విశ్వవిద్యాలయాలు సైతం అమలు చేస్తే ప్రతిభ కలిగిన యువతను దేశంలో స్థిరపడే విధంగా చేయడం సాధ్యమన్నారు. నాక్‌లో ప్రతిసారి అత్యుత్తమ గ్రేడ్ సాధించడం శుభపరిణామమని అభినందించారు. ఏయూ తెలుగు ప్రజలందరిదీ: బొత్స రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ప్రజలందరిదీ అన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని.. విద్య కోసం ఏ రాష్ట్రం చేయనంత ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సమగ్రాభివృద్ధి, విద్యా నైపుణ్యం దిశగా ఏయూ అడుగులు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు అనుగుణంగా ఇంజినీరింగ్, సైన్స్, ఫార్మసీ రంగాల్లో ఆవిష్కరణలు జరిపే సౌలభ్యంతో కూడిన మౌలిక వసతులు కలి్పస్తూ ప్రోటో టైప్, కమర్షియలైజేషన్ దిశగా నడిపిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నెలకొలి్పన నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ 17 స్టార్టప్స్‌కు స్థానం కలి్పంచిందన్నారు. ఏయూ పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయుక్తంగా 54 ఎంఓయూలు చేసుకున్నట్టు చెప్పారు. ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆ పేరు నేటికీ వినిపిస్తుంటుంది: గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, కృష్ణా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఘనంగా నివాళి అర్పించారు. ఈ మేరకు శనివారం గవర్నర్ కార్యాలయం అధికారిక ఎక్స్(ట్విటర్) హ్యాండిల్ ఆయన సందేశం ఉంచింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికత కలిగిన నాయకుడు. రైతులు, పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన పేరుగాంచారు. అందుకే ఆ పేరు నేటికీ వినిపిస్తుంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన అమలు చేసిన ప్రజా-స్నేహపూర్వక సంక్షేమ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer offered rich tributes to Dr. Y.S. Rajasekhara Reddy, Former Chief Minister in united Andhra Pradesh, on his death anniversary. pic.twitter.com/JgSHCGOgxR — governorap (@governorap) September 2, 2023 -
నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువత సొంతం
ఏఎన్‌యూ: సాంకేతికతను సద్వినియోగం చేసుకుని నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువతకు ఉందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ సందేశం ఇస్తూ మానవాళి ప్రయోజనాలు పరిరక్షించే నూతన ఆవిష్కరణలకు యువత కృషిచేయాలని సూచించారు. చదువు, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నైతికత, సామాజిక బాధ్యత కూడా ముఖ్యమని చెప్పారు. యువత నేర్చుకునే సాంకేతిక, నైపుణ్యం కేవలం తమ సొంతానికి మాత్రమే కాకుండా సమాజ హితం కోసం వాడాలని సూచించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సంక్షోభాలకు పరిష్కారం చూపే వైవిధ్యభరితమైన ఆవిష్కరణలు చేయడంతోపాటు వాటి ద్వారా అపారమైన అవకాశాలు సృష్టించాలని సూచించారు. ప్రపంచానికి స్టార్టప్ హబ్‌గా భారత్ నిలిచిందని, ఇది మంచి పరిణామమన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే నిరుద్యోగంతోపాటు అనేక సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. కృత్రిమ మేధస్సు వినియోగం నుంచి బయోటెక్నాలజీ వరకు ప్రతి అంశం మానవాళికి ప్రయోజనం కలిగించేదిగా ఉండాలన్నారు. యూనివర్సిటీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ ఏఎన్‌యూ అభివృద్ధి నివేదికను సమర్పించారు. అనంతరం ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. పలువురు విద్యార్థులకు పీహెచ్‌డీలు, బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు అందించారు. అడిషనల్ డీజీ రవిశంకర్‌కు డాక్టరేట్ ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌కు డాక్టరేట్ పట్టాను గవర్నర్, వీసీ అందించారు. ఏఎన్‌యూ కామర్స్ విభాగంలో ఆచార్య జీఎన్ బ్రహా్మనందం పర్యవేక్షణలో రవిశంకర్ అయ్యన్నార్ పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు డీన్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఏపీ : సాయినాథ్ వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ చెప్పారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల సమస్యలపై తాను 2001–2002 కాలంలో అధ్యయనం చేశానని చెప్పారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభంపై అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీని నియమించారని తెలిపారు. ఈ కమిటీ సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి నిశితంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగ సమస్యలు, వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని తెలిపారు. ఆ సేవలకు దక్కిన గౌరవంగా ఈ డాక్టరేట్‌ను భావిస్తానని సాయినాథ్ తెలిపారు. -
నాగార్జున వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40 స్నాతకోత్సవాలు మంగళవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రోఫిసర్ హేమచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీహెచ్డీ స్కాలర్స్‌కు డాక్టరేట్ పట్టాలు, బంగారు పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందించారు. అలాగే.. ప్రముఖ రచయిత, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్కు గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ నజీర్ ప్రదానం చేశారు. -
రాజ్ భవన్ లో ఎట్ హోమ్..హాజరైన సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
AP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ
సాక్షి, విజయవాడ: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం ఆమోదించారు. కాగా, ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో నామినేట్ చేయబడిన కర్రి పద్మశ్రీ , కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జీవోను జారీ చేశారు. గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చాదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ పదవీ కాలం జూలై 20వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా వీరిరువురిని నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఇది కూడా చదవండి: సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు: ఎంపీ విజయసాయిరెడ్డి -
ఇంటి పేరు గోల్డ్ మెడల్
‘గొడ్ల చావిడిలో పశువుల ఆలనా పాలనా స్త్రీలు చూసినప్పుడు వాటికి వైద్యం మేమెందుకు చేయలేము’ అంటున్నారు నేటి యువతులు.శ్రీ వెంకటేశ్వర పశు వైద్యశాల 12వ స్నాతకోత్సవంలో ‘బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్’ చదివిన లొగుడు ప్రత్యూష ఏకంగా 7 గోల్డ్ మెడల్స్ సాధిస్తే, తీర్థాల హేమనయని 5 గోల్డ్ మెడల్స్సాధించింది.వెటర్నరీ రంగంలో 60 శాతం సీట్లు అమ్మాయిలే సొంతం చేసుకుంటున్నారని పశు వైద్యరంగంలో తమ సామర్థ్యం చూపి ఉపా ధి అవకాశాలు అందుకుంటున్నామని వారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పశువైద్యానికి సంబంధించిన ఏకైక యూనివర్సిటీ– శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. జూలై 22న జరిగిన 12వ స్నాతకోత్సవంలో ‘బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్’ (బి.వి.ఎస్.సి) కోర్సులో ఒకరు ఏడు స్వర్ణాలు, మరొకరు ఐదు స్వర్ణాలు సాధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసలు అందుకున్నారు. ఒకప్పుడు పశు వైద్యంలో మగవారే 90 శాతం ఉండేవారు. నేడు అరవై నుంచి డెబ్బయి శాతం అమ్మాయిలే ఉంటున్నారు. బి.వి.ఎస్.సిలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 200 పై చిలుకు సీట్లు ఉంటే వాటిలో ప్రతి ఏటా అమ్మాయిలే ఎక్కువ సీట్లు ΄పొందుతున్నారు. తిరుపతి, పోద్దుటూరు, గన్నవరం, గరివిడిలలో ఉన్న నాలుగు కాలేజీలు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కిందకే వస్తాయి. సీట్లు తక్కువే అయినా వాటిని ΄పొందుతున్న అమ్మాయిలు ఎక్కువ. ‘ఈ రంగంలో మాకు ఆసక్తి ఉంది. చేయగల సామర్థ్యం ఉంది. అవకాశాల పట్ల ఎరుక ఉంది’ అంటున్నారు వాళ్లు. 7 స్వర్ణాలు సాధించిన ప్రత్యూష, 5 స్వర్ణాలు సాధించిన హేమనయని అంతరంగాలు... ఆంధ్రా నుంచి అమెరికా వరకు అవకాశాలు మనుషులకు వైద్యం చేసే డాక్టర్లు మనుషులకు మాత్రమే చేస్తారు. కాని మేము భిన్న జంతు జీవాలకు వైద్యం చేస్తాం. కుక్క, పిల్లి, ఆవు, గేదె, గుర్రం, గొర్రె... ఒక్కోదానికి ఒక్కో రీతిన వైద్యం చేయాలి. నేడు పశువైద్యం చదివితే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ భద్రత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. లేదంటే కొద్దిపా టి పెట్టుబడితో పెట్ క్లినిక్ పెట్టుకుంటే మంచి ఉపా ధి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఎన్నో ఉపా ధి అవకాశాలు వెటర్నరీ డాక్టర్లకు ఉండటం వల్ల, రిజర్వేషన్ ప్రయోజనం అదనంగా జతై నేడు ఎక్కువమంది అమ్మాయిలు పశువైద్యం చదువుతున్నారు. నేను కూడా ఆ అవగాహనతోనే పోద్దుటూరు వెటర్నరీ కాలేజీలో బి.వి.ఎస్.సి చేశాను. నాకు 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉంది. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొండమంచిలి గ్రామం. నాన్న నా చిన్న వయస్సు నుంచే గల్ఫ్ దేశాలకు వెళ్లారు. నేను బాగా చదవడానికి మా అక్క, అమ్మ ముఖ్య కారకులు. అక్కయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని నాకు అండగా ఉంటోంది. ఇంటర్ వరకు పా లకొల్లులో చదివాను. ఇంటర్ బై.పి.సిలో 987 మార్కులు సాధించి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాను. జంతువుల పట్ల ప్రేమతో ఎలాగైనా వెటర్నరీ డాక్టర్ కావాలని ఎంసెట్ రాసి 1499 ర్యాంకును సాధించాను. ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలని తపన పడేదానిని. రోజుకు సుమారు 4 నుంచి 6 గంటలు చదివాను. సెలవురోజులలో కళాశాలలో ఉన్న లైబ్రరీలను, ల్యాబ్‌లను సందర్శించి ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్‌ను అర్ధం చేసుకుని చదివాను. కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రస్తుతం వెటర్నరీ పీజి చేయాలని ప్రవేశ పరీక్ష రాశాను. భవిష్యత్తులో పశువైద్య అధ్యాపకురాలుగా రాణించాలని ఉంది. – తీర్థాల హేమనయని, బి.వి.ఎస్.సి, 5 బంగారు పతకాల గ్రహీత, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ,ప్రోద్దుటూరు. పశు వ్యాధులను శోధించే సైంటిస్ట్ అవుతాను నేనిప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో ‘ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’లో పిజి సీటు సాధించి వెటర్నరీ మైక్రోబయాలజీ చేస్తుండటం వల్ల మొన్నటి స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోయాను. కాని 7 గోల్డ్ మెడల్స్ సాధించడం మాత్రం సంతోషంగా ఉంది. చదువులో బాగా రాణించాలని రోజుకు ఆరు గంటలు చదివాను. సీనియర్లు, అధ్యాపకులు బాగాప్రోత్సహించారు. బి.వి.ఎస్.సిలో ఐదు సంవత్సరాల్లో 18 సబ్జెక్ట్స్ చదువుతాము. వాటిలో దాదాపు 17 గోల్డ్‌మెడల్స్ ఉంటే నాకు 7 వచ్చాయి. మాది అనంతపురం. మా నాన్న గవర్నమెంట్ టీచర్. నేను తిరుపతి కాలేజీలో బి.వి.ఎస్.సి చేశాను. ఎం.బి.బి.ఎస్ డాక్టర్ కావాలని ఇంటర్లో బై.పి.సి చదివి 969 మార్కులు సాధించాను. నీట్లో సీట్ రాకపోయినా బాధపడలేదు. ఎంసెట్‌లో 1248వ ర్యాంకు సాధించి వెటర్నరీ కళాశాలలో బి.వి.ఎస్.సి డిగ్రీలో చేరాను. మనుషులకు వైద్యం చేసే డాక్టరైనా పశువులకు వైద్యం చేసే డాక్టరైనా డాక్టరే. చిన్నప్పటి నుంచి నాకు మూగజీవాలంటే ఇష్టం. ఆడవాళ్లు పశువుల ఆలనా పా లనా బాగా చూస్తారు. వైద్యం కూడా బాగా చేయగలరని నా నమ్మకం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో పశు వైద్యానికి సంబంధించిన ఇన్ఫ్రా తక్కువే ఉంది. కాని ఇటీవల పెట్స్‌కు డిమాండ్ పెరిగింది. అయితే రేబిస్ వంటి ఏ ఒకటి రెండు వ్యాక్సిన్ల గురించి మాత్రమే కాకుండా పశువులకు సంబంధించిన ఎన్నో వ్యాక్సిన్ల గురించి తగినంత చైతన్యం రావాలి. నాకైతే పశువులకు వచ్చే వ్యాధుల గురించి పరిశోధించే సైంటిస్ట్ కావాలని ఉంది. వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా ఇవి పశువులకు ఎలా జబ్బులు కలిగిస్తాయో పరిశోధనలు కొనసాగుతూ ఉంటే పశువులను కాపా డటమే కాదు వాటి వల్ల మనుషులకు వచ్చే జబ్బులను కూడా నిరోధించి మనుషులనూ కాపా డవచ్చు. – లొడుగు ప్రత్యూష, బి.వి.ఎస్.సి, ఏడు బంగారు పతకాల గ్రహీత, ఎస్.వి. వెటర్నరీ కళాశాల, తిరుపతి -
ఎస్కేయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ నజీర్
సాక్షి, అనంతపురం: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం పర్యటనలో ఉన్నారు. కాగా, ఎస్కే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీలో శ్రీ కృష్ణదేవరాయ విగ్రహానికి గవర్నర్ నజీర్ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నూతన అకాడమీ, హాస్టల్ భవనాలను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఉన్నాయో.. అన్ని అవకాశాలు ఉన్నాయి. విద్య శక్తివంతమైన ఆయుధం అన్న విషయం మరిచిపోవద్దు. కృషి, పట్టుదల, సృజనాత్మకత ఉంటే ఏదైనా సాధించవచ్చు. విద్యార్థులు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి. కేంద్రం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ -
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం
-
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం జగన్ భేటీ (ఫొటోలు)
-
గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం జగన్ భేటీ
సాక్షి, విజయవాడ: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలో రేపు సాయంత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా గౌరవార్థం ప్రభుత్వం తరపున సత్కారం, విందు కార్యక్రమానికి గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు. ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసి ఇటీవలే సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పదోన్నతి పొందారు. -
ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం: గవర్నర్ నజీర్
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, ఏపీలో కూడా యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌భవన్‌లో అధికారులతో కలిసి గవర్నర్ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు స్పెషల్ సీఎస్ అనిల్ కుమార్ సింఘల్ యోగాసనాలు వేశారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం. యోగా ప్రక్రియ ద్వారా మానసిన ప్రశాంతత చేకూరుతుంది. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తి, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగాతో అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఇది కూడా చదవండి: మాతో పొత్తా?.. పద్ధతిగా ఉండదు! చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు -
నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు(బుధవారం) భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వీరి భేటీ జరుగనుంది. ఇది కూడా చదవండి: జూలై 1 నుంచి ‘సచివాలయాల’ వద్ద ప్రత్యేక క్యాంపులు -
AP: రాజ్‌భవన్‌లో ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ దినోత్సవ వేడుకలు
సాక్షి, విజయవాడ: ఏపీ రాజ్‌భవన్‌లో ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ రెడ్ క్రాస్ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్.. కలెక్టర్లతో పాటు పలువురికి మెడల్స్ అందజేశారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం. గ్లోబల్ వార్నింగ్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సిక్కు మత పెద్దలు.. కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ -
కడప జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
-
నేడు తిరుమల, తిరుపతిలో గవర్నర్ నజీర్ పర్యటన
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు(శుక్రవారం) తిరుమల, తిరుపతిలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా తిరుమల శ్రీవారిని గవర్నర్ నజీర్ దర్శించుకోనున్నారు. ఉదయం గం. 11లకు శ్రీవెంకేటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. -
గవర్నర్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సాయంత్రం 5గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజ్‌భవన్ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గవర్నర్‌తో గంటకుపైగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించినట్టు సమాచారం. (చదవండి: ఏప్రిల్ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు) -
అశోక్‌బాబు తల్లి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కొండెపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు తల్లి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సోమవారం ప్రకాశం జిల్లా కారుమంచికి వెళ్లిన సీఎం జగన్.. అశోక్‌బాబు తల్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, సీఎం వైఎస్ జగన్ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చేరుకున్నారు. 28న విశాఖ పర్యటన 28వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌కు చేరుకుని రాత్రి 7–8 గంటల మధ్య జీ–20 ప్రతినిధులతో జరిగే ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘గాలా డిన్నర్’లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
తెలుగు ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉగాది' పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే ఈ నూతన సంవత్సరం.. అందరికీ కొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును తెస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘జీవితంలోని షడ్రుచులను కలగలిపి ఉండే 'ఉగాది పచ్చడి', ఏడాది పొడవునా జీవితం మనకు అందించే అన్ని రకాల అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది. ‘శోభకృతు’ నామ సంవత్సర ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగిస్తుందని నేను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాను’’ అని గవర్నర్ అన్నారు. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ -
వధూవరులను ఆశీర్వదించిన గవర్నర్ నజీర్
మంగళగిరి(గుంటూరు జిల్లా): జస్టిస్ కుంభజడల మన్మథరావు కుమారుడు కౌషిక్ వివాహ రిసెప్షన్‌కు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో కౌషిక్ వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి జరిగింది. వధువు ఉదయ, వరుడు కౌషిక్లను గవర్నర్ ఆశీర్వదించారు. కాగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: రెట్టించిన వృద్ధి -
అసెంబ్లీ సాక్షిగా బుక్కైన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా.. ఇప్పుడేమంటారో?
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ బండారం బయటపడింది. ఎల్లో మీడియా ఫేక్ ప్రచారానికి అసెంబ్లీ వేదికగా మంత్రి బుగ్గన చెక్ పెట్టారు. దీంతో ఎల్లో బ్యాచ్.. ఒక్కసారి షాకై నోరు మూసుకున్నారు. చెరపకురా చెడేవు.. అన్న సామెత పచ్చ బ్యాచ్ పక్కాగా సూట్ అవుతుంది. లేనది ఉన్నట్టు చూపించి నమ్మించాలనే వారి ఐడియాలు ఎప్పుడూ తుస్సుమంటూనే ఉన్నాయి. దీంతో, ఖంగుతినడం పరిపాటిగా మారిపోయింది. అయినప్పటికీ ఫేక్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. అయితే, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలకలేదని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. దీనికి టీడీపీ సభ్యులు వంత పాడారు. దీంతో, ఎల్లో మీడియా ఫేక్ ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ఈ క్రమంలో టీడీపీ తప్పుడు ప్రచారాలకు వీడియోలతో సహా చెక్ పెట్టారు. అసలు వాస్తవాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బయటపెట్టారు. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోరారు. కాగా, గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న వీడియోను మంత్రి బుగ్గన.. అసెంబ్లీలో ప్లే చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని వీడియోతో సహా చూపించారు. టీడీపీవీ అన్ని తప్పుడు ఆరోపణలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదన్నారు. గవర్నర్‌కు ఏవిధంగా సీఎం జగన్ స్వాగతం పలికారో వీడియోలో చూపించారు. దీంతో, టీడీపీ నేతల బండారం బయటపడింది. అనంతరం, స్పీకర్ తమ్మినేని కూడా ప్రోటోకాల్ ప్రకారమే.. గవర్నర్ నజీర్‌ను సీఎం జగన్ స్వాగతం పలికారని చెప్పారు. దీనికి ఆయనే ప్రత్యక్ష సాక్షినని స్పష్టం చేశారు. మరోవైపు.. రాజ్యాంగ వ్యవస్థలపై బురద చల్లేలా టీడీపీ సభ్యులు, ఈనాడు వ్యవహరిస్తున్నాయని ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రికి స్పీకర్ సూచించారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలిపారు. తప్పుడు ప్రచారాలపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు. -
సంక్షేమ సర్కార్
-
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా గొప్పది. అనేక రంగాల్లో మహిళలు తిరుగులేని నాయకత్వాన్ని పోషిస్తున్నారు. మహిళలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు’’ అని గవర్నర్ అన్నారు. విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించారు. ఏపీలో సంక్షేమ పథకాలతో ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనని, మహిళల కోసం సీఎం జగన్ ఒక యజ్ఞం చేస్తున్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మహిళల రక్షణ కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చారని వాసిరెడ్డి పద్మ అన్నారు. చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్ -
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఏపీ గవర్నర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ నూతన గవర్నర్ రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ భేటీ అయ్యారు.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మోదీతో గవర్నర్ నజీర్ సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా నజీర్ కలిశారు. ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు నజీర్. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న(శనివారం) మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కాగా, సాయంత్రం ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. ఏపీకి నూతన గవర్నర్‌గా నియమితులైన సందర్భంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖుల్ని కలుస్తున్నారు నజీర్. -
ప్రధాని మోదీతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ భేటీ
-
నేడు ప్రధానిని కలవనున్న ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్
-
ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన
ఢిల్లీ: ఏపీ నూతన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ జస్టిrస్ అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో గవర్నర్ సమావేశం అవుతున్నారు. ఈ మేరకు ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గవర్నర్ నజీర్ సమావేశమయ్యారు. సాయంత్రం గం. 6.15 ని.లకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌తో నజీర్ సమావేశమయ్యారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం గం. 12.30ని.లకు ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ నజీర్ సమావేశమవుతారు. అనంతరం రేపు సాయంత్రం గం. 6.30 ని.లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నజీర్ భేటీ కానున్నారు. -
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం
-
ఏపీ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ (ఫొటోలు)
-
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
-
ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు. కాగా, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. 1983 లో లా డిగ్రీ అనంతరం ఆయన న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2003 నుంచి 2017 వరకు కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. న్యాయమూర్తిగా పని చేశారు. 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. -
ఏపీ కొత్త గవర్నర్ గా ఇవాళ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
-
విజయవాడ: రాజ్‌భవన్‌కు సీఎం వైఎస్ జగన్ దంపతులు