
సాక్షి, విజయవాడ: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం ఆమోదించారు.
కాగా, ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో నామినేట్ చేయబడిన కర్రి పద్మశ్రీ , కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జీవోను జారీ చేశారు. గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చాదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ పదవీ కాలం జూలై 20వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా వీరిరువురిని నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీచేశారు.
ఇది కూడా చదవండి: సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు: ఎంపీ విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment