padma sri
-
AP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ
సాక్షి, విజయవాడ: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం ఆమోదించారు. కాగా, ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో నామినేట్ చేయబడిన కర్రి పద్మశ్రీ , కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జీవోను జారీ చేశారు. గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చాదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ పదవీ కాలం జూలై 20వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా వీరిరువురిని నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఇది కూడా చదవండి: సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు: ఎంపీ విజయసాయిరెడ్డి -
మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానాన్ని కల్పించిన ఘనత సీఎం జగన్ దే
-
జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్‌తోనే సినిమాలోకి వచ్చా : దర్శకుడు
సాక్షి, హైదరాబాద్ : ఎస్.ఎస్. పట్నాయక్ దర్శకత్వం వహించిన పద్మశ్రీ సినిమా విడుదలయ్యింది. ఫిలింఛాంబర్లో ప్రముఖ పాత్రికేయులు చేతులమీదుగా ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. పట్నాయక్ మాట్లాడుతూ ఈ రోజు తన జన్మదినం అని, ఈ జన్మదిన వేడుకను ఇలా ట్రైలర్ లాంచ్ ద్వారా పాత్రికేయులు నడుమ ఫిలింఛాంబర్లో జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తను కూడా జర్నలిజం బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చిన వ్యక్తిని కాబట్టి జర్నలిస్ట్ కష్టనష్టాలు సాధకబాధకాలు తనకు తెలుసు కాబట్టి తన పుట్టిన రోజు నాడు జర్నలిస్టుల చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ ని విడుదల చేయడంఒక గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరోగా పరిచయమైన కిషోర్ కుమార్, హీరోయిన్ సంధ్యారాణి మాట్లాడుతూ... ఈ చిత్రం ఒక కొత్త ప్రయోగాత్మక చిత్రం అని ఈ చిత్రం విడుదల తర్వాత వారికి మరెన్నో అవకాశాలు వస్తాయని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ చిత్ర సహనిర్మాత కొత్తకోట బాలకృష్ణ మాట్లాడుతూ అంతా కొత్త వారైనా నటీనటులతో ఇంత చక్కగా దర్శకుడు చేయించడం దర్శకునికి చిన్ననాటి స్నేహితులు గా తను ఎంతో గర్వపడుతున్నానని తన ఆనందాన్ని, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అయితే ఈ కార్యక్రమాన్ని మొదటిగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంతో పద్మశ్రీ టీం ప్రారంభించింది. అయితే సినిమా మనిషికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో అదే విధంగా మనలో ఉండే శుభ్రత పరిసరాల శుభ్రత అనేది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని కరోనా బారి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని నేపథ్యంలో కరోనా కి భయపడొద్దు జాగ్రత్తపడండి అంటూ పద్మశ్రీ టీం ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ దగ్గర నుండి స్వచ్ఛభారత్ ని కొనసాగిస్తూ పరిసరాలను శుభ్రం చేసింది. -
ట్రైలర్: ‘మొగలిరేకులు’ సాగర్ హీరోగా సినిమా
బుల్లితెరలో నటించి మహిళల ఆదరాభిమానం పొందిన నటుడు సాగర్ ఆర్కే నాయుడు ఇప్పుడు వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సాగర్ తొలిసారిగా హీరోగా నటిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తుండగా సాగర్ హీరోగా ‘షాదీ ముబారక్’ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘మొగిలిరేకులు, చక్రవాకం’ సీరియల్స్‌తో పేరు పొందిన సాగర్ నటించిన ‘షాదీ ముబారక్’ ట్రైలర్‌ను గురువారం నిర్మాత దిల్ రాజు విడుదల చేశాడు. ‘సిద్ధం కండి.. ప్రేమ రైడ్‌కు హార్దిక స్వాగతం పలికేందుకు’ అని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. కొత్త దర్శకుడు పద్మశ్రీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లి చూపుల నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఉంది. సాగర్‌కు జోడీగా దృశ్య రఘునాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్నారై పాత్రలో సాగర్ నటిస్తున్నాడు. ఒకే రోజు మూడు పెళ్లి సంబంధాలు చూసేందుకు వెళ్లి సాగర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో సినిమా కథ ఉన్నట్టు తెలుస్తోంది. అందంగా.. ఆహ్లాదకరంగా ట్రైలర్ రూపొందించారు. ఈ సినిమాను మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
ఎస్పీ బాలుకు పద్మాంజలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత గాయకుడు, గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యంను ప్రతిష్టాత్మక ‘పద్మ విభూషణ్’ వరించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబె సహా మరో ఆరుగురు కూడా భారత ప్రభుత్వం ప్రకటించే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ ‘పద్మ విభూషణ్’కు ఎంపికయ్యారు. ఎస్పీ బాలుకు తమిళనాడు తరఫున ఈ పురస్కారం లభించడం గమనార్హం. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన 119 మందికి కేంద్ర ప్రభుత్వం సోమవారం 2021 సంవత్సరానికి గానూ ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 10 మందిని పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. సైకత శిల్పి సుదర్శన్ సాహూ, ప్రధాని మాజీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రులు తరుణ్ గొగోయి(అస్సాం), కేశూభాయి పటేల్(గుజరాత్), లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్, ప్రముఖ గాయని కేఎస్ చిత్రలకు పద్మ భూషణ్ వరించింది. ఈ సంవత్సరం పద్మ అవార్డులు పొందిన వారిలో 29 మంది మహిళలున్నారు. విదేశీ/ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మందిని భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. ఒక ట్రాన్స్‌జెండర్ కూడా ఈ ఏడాది పద్మ పురస్కారం పొందారు. ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది. మాజీ గవర్నర్, దివంగత మృదుల సిన్హా, మాజీ కేంద్రమంత్రి బిజోయ చక్రవర్తిలకు పద్మ శ్రీ పురస్కారం ప్రకటించారు. పద్మ పురస్కారాలు పొందిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి.. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామికి కళలు విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాశరావుకు సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిడుమోలు సుమతికి కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. తెలంగాణ నుంచి కళల విభాగంలో కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక భారతరత్న రావాలి ‘పాడనా తీయగా కమ్మని ఒక పాట. పాటగా బ్రతకనా మీ అందరి నోటా...’అంటూ ‘వాసు’సినిమాలో పాడారు యస్పీ బాల సుబ్రహ్మణ్యం. గత ఏడాది చివర్లో కోవిడ్ వల్ల అనారోగ్యం పాలై ఆయన మరణించిన విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటగా మనతోనే ఎప్పుడూ ఉంటారు. సంగీత కళాకారుడిగా ఆయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం యస్పీబీకి మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. గాయకుడిగా సుమారు 40 వేల పాటలు పాడారాయన. సుమారు 50 ఏళ్ల కాలాన్ని సినిమాలకు పాడటానికే అంకితం చేయడం విశేషం. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా, నటుడిగా యస్పీబీ ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అందుకున్నారాయన. యస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని, ఆయన మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి. తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు కూడా ఆ వాదనను సమర్థించాయి. సౌతిండియా నైటింగేల్ ‘బొంబాయి’సినిమాలో ‘కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే...’అంటూ పాడారు చిత్ర. చనిపోయే ముందు అందరూ తప్పక వినాల్సిన 100 పాటలు అంటూ బ్రిటీష్ మేగజీన్ ‘ది గార్డియన్’చేసిన 100 పాటల జాబితాలో ఈ పాట ఉంది. ఇలా గాయని చిత్ర పాడిన పాటలు భాషలకు అతీతంగా శ్రోతల్ని చేరుతూనే ఉన్నాయి. అందుకే ఆమెను సౌతిండియా నైటింగేల్ అన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చిత్రకు పద్మ భూషణ్ ప్రకటించింది. గాయనిగా సుమారు 25 వేల పాటలు ఆలపించారు చిత్ర. 1979లో మలయాళ ప్రైవేట్ ఆల్బమ్‌తో గాయనిగా మారారు చిత్ర. 2005లో పద్మశ్రీ అందుకున్నారు. ‘సింధు భైరవి’అనే తమిళ అనువాద చిత్రంలో ‘పాడలేను పల్లవైనా..’పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నో పల్లవులు. చరణాలు పాడుతూనే ఉన్నారామె. -
'పద్మ' అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ : భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ నామినేష్లన స్వీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వచ్చే ఏడాది (2021) గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించనున్న పద్మ పురస్కారాలకు ఆన్లైన్ నామినేషన్లు లేదా సిఫారసులకు ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గడువు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. నామినేషన్లు లేదా సిఫారసులను కేవలం ఆన్లైన్ ద్వారా, పద్మ పురస్కారాల పోర్టల్ ద్వారా స్వీకరిస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేర్లతో ఇచ్చే పద్మ పురస్కారాలు, పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవాలు. పద్మ పోర్టల్ అందుబాటులో ఉన్న నిర్ణీత నమూనా ప్రకారం నామినేషన్లు లేదా సిఫారసులు ఉండాలి. నామినేట్ లేదా సిఫారసు చేస్తున్న వ్యక్తి, సంబంధింత రంగంలో సాధించిన విజయాలు లేదా సేవల గురించి 800 పదాలకు మించకుండా స్పష్టంగా రాయాలి. సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న అర్హులైన మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు వంటి ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రయత్నాలు చేయమని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, అత్యున్నత సంస్థలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. నామినేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 15న ముగుస్తుందని ఈలోగా దరఖాస్తులు పంపాల్సిందిగా పేర్కొంది. 1954 నుంచి మొదలైన ఈ అవార్డుల పర్వం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా కొనసాగుతోంది. జాతి, వృత్తి, స్థానం, లింగ భేదం లేకుండా కళ,సాహిత్యం, విద్య,క్రీడలు, సామాజికం, సైన్స్ అండ్ టెక్నాటజీ సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించినవారు పద్మ అవార్డులకు అర్హులు. అంతేకాకుండా సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్నవారిని గుర్తించి వారి వివరాలను నమోదు చేయాల్సిందిగా ఇప్పటికే కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలు, పద్మ అవార్డుల గ్రహీతలకు కేంద్ర హోంశాఖ కోరింది. అంతేకాకుండా పౌరులు కూడా స్వతహాగా నామినేషన్లు దాఖలు చేయొచ్చని పేర్కొంది. గరిష్టంగా 800 పదాలకు మించకుండా సిఫారసులో సూచించిన ఫార్మాట్ తరహాలో పద్మ అవార్డుల పోర్టల్‌లో సంబంధిత వివరాలను నమోదు చేయాలని తెలిపింది. (కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం ) -
కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి
అమృత్సర్: మహ్మమారి కరోనా వైరస్ సోకి పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా (62) కన్నుమూశారు. ఇటీవల లండన్ నుంచి తిరిగివచ్చిన ఈయనకు బుధవారం వైద్యులు పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పంజాబ్‌లోని గురునానక్ దేవ్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తుండగా.. గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ కారణంగానే నిర్మల్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిర్మల్ సింగ్ మృతిలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కాగా ఆయనతో పాటు పాజిటివ్‌గా తేలిన మరో నలుగురు పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిర్మల్ సింగ్ ఖల్సా పంజాబ్‌లోని అమృత్సర్ దేవాలయంలో అత్యున్నత పదవిలో కొన్నేళ్ల పాటు కొనసాగారు. ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కాగా మరోవైపు దేశంలో కరోనా వైరస్ రోజురోజూకూ విజృభిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1980కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 58మంది మృతి చెందారు. -
జయరాం హత్యలో ఐదుగురి పాత్ర?
-
జయరామ్ హత్యలో ఐదుగురు?
హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యలో మరికొందరి పాత్ర కూడా ఉందా? ఘటన జరిగిన సమయంలో ఐదుగురు వ్యక్తులు అక్కడే ఉన్నారా? వారంతా కలిసే జయరామ్‌ను అంతమొందించారా? ఇవీ ఈ కేసులో తాజాగా తలెత్తిన అనుమానాలు. ఈ విషయాల్ని నిర్ధారించుకోవడానికి, అసలు ఆ రోజు ఏం జరిగిందనే అంశాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి గురువారం రాత్రి 93/2019 నెంబర్‌తో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతానికి నందిగామ పోలీసులు నమోదు చేసిన తొమ్మిది సెక్షన్లను కొనసాగిస్తామని, భవిష్యత్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరికొన్ని చేరుస్తామని తెలిపారు. జయరామ్ గతనెల 31న జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని రాకేష్ నివాసంలో హత్యకు గురికాగా, ఆయన మృతదేహం కృష్ణా జిల్లా నందిగామ లో మరుసటిరోజు కనిపించింది. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన నందిగామ పోలీసులు రాకేష్‌తోపాటు వాచ్మెన్ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారు. పెనుగులాట, పిడిగుద్దుల వల్లే జయరామ్ మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో జయరామ్ భార్య పద్మశ్రీ విజ్ఞప్తి మేరకు ఈ కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఈ హత్యలో ఐదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం నిర్ధారించుకోవడానికి ప్రస్తుతం ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని నిర్ణయించారు. శుక్రవారం నాంపల్లి న్యాయస్థానం నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఓ ప్రత్యేక బృందం ఏపీ వెళ్లి అక్కడి కోర్టు అనుమతితో జైల్లో ఉన్న నిందితులను ఇక్కడకు తీసుకురానుంది. పద్మశ్రీ వాంగ్మూలం నమోదు.. జయరామ్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆయన భార్య పద్మశ్రీ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు నేతృత్వంలోని దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.44లో ఉన్న జయరామ్ నివాసానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడినట్టు సమాచారం. ఈ కేసులో శిఖాచౌదరి ప్రమేయం ఉన్నట్లు బలమైన అనుమానాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. తన భర్త హత్య జరిగిన రోజు రాత్రి శిఖా చౌదరి తన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి బీరువాలో ఉన్న కీలక డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్టు పద్మశ్రీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను విచారిస్తేనే ఈ హత్యకు గల కారణాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏపీ పోలీసులు చెబుతున్న అంశాలు నమ్మశక్యంగా లేవని తన వాంగ్మూలంలో స్పష్టంచేసినట్టు సమాచారం. దర్యాప్తు అధికారులు దాదాపు రెండు గంటల పాటు పద్మశ్రీతో మాట్లాడి అన్ని వివరాలూ నమోదు చేసుకున్నారు. జయరామ్ అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు..? చివరగా ఆమెతో ఎప్పుడు మాట్లాడారు..? హత్య జరిగిన తర్వాత ఈ విషయంలో ఆమెకు ఎప్పుడు, ఎవరి ద్వారా తెలిసింది? శిఖా చౌదరి వ్యవహారశైలి ఏమిటి వంటి వివరాలు సేకరించారు. శిఖాచౌదరిని విచారిస్తాం జయరామ్ హత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలనూ పరిశీలించామని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ పోలీసుల దర్యాప్తు అంశాలతోపాటు జయరామ్ భార్య పద్మశ్రీ పిటిషన్లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ సాగిస్తామని వెల్లడించారు. ఏపీ పోలీసులు అరెస్టు చేసిన నిందితులిద్దరినీ కస్టడీకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారెవ్వరూ తప్పించుకోలేరని స్పష్టంచేశారు. శిఖాచౌదరిని కూడా విచారిస్తామని చెప్పారు. -
నేను షాక్ అయ్యాను: శిఖా చౌదరి
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన మేనకోడలు శిఖా చౌదరి స్పష్టం చేశారు. తన మేనమామ ఇంట్లో నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకు వెళ్లలేదని ఆమె తెలిపారు. వాళ్ల ఇంటికి చాలామంది వచ్చి వెళుతుంటారని అన్నారు. శిఖా చౌదరి ’సాక్షి’తో మాట్లాడుతూ..జయరామ్ వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదని, ఎక్కువగా కంపెనీ వ్యవహారాల గురించి తాము మాట్లాడుకునేవారిమని వెల్లడించారు. తాను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానని, అయితే జయరామ్‌కు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు. నేను షాక్ అయ్యాను... జయరామ్ తనకు ఎప్పుడూ వాట్సాప్ కాల్ చేసేవారని, అలాంటిది ఆయన ఒకసారి ఇండియన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ చేశారని శిఖా చౌదరి చెప్పారు. తనకు అర్జెంట్‌గా కోటి రూపాయలు కావాలని అడగటంతో షాక్ అయినట్లు ఆమె తెలిపారు. తాను రూ.4 కోట్లు అప్పు చేశానని, వాళ్లు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, అన్ని విషయాలు చెబుతానని చెప్పారన్నారు. అంతలోనే హత్య జరిగిందని శిఖా చౌదరి పేర్కొన్నారు. కాగా తన భర్త చావుకు శిఖా చౌదిరే కారణమని మృతుడు చిగురుపాటి జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపించారు. అంతేకాకుండా ఈ కేసును తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టాలని ఆమె కోరారు. (జయరామ్ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!) జయరామ్ బంధువుల ఫిర్యాదు మేరకు ఈ హత్యకేసును తెలంగాణ పోలీసులు మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించనున్నారు. శిఖా చౌదరిని పోలీసులు విచారించనున్నారు. హత్య వెనక దాగిన కుట్ర, జయరాం కుటుంబం లేవనెత్తిన అనుమానాల నివృత్తిపై పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని హైదరాబాద్ తరలించి, విచారణ జరపనున్నారు. -
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ
-
జయరామ్ హత్యకేసులో కీలక మలుపు..!
సాక్షి, హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జయరామ్ హత్య కేసులో మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై మృతుని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్త చేశారు. కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు.(ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు) కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడి ఉండడంతోనే జయరామ్ కేసును బదిలీ చేసినట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో కేసును బదిలీ చేయకుండా మరింత వివాదాలకు తావు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జయరామ్ హత్య కేసులో శిఖాకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు చెప్పడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మేనకోడలు శిఖా, సొంత అక్కనుంచి ప్రాణహాని ఉందంటూ జయరామ్ గతంలో తనతో చెప్పినట్టు పద్మశ్రీ మీడియాకు వెల్లడించారు. శాస్త్రీయంగా ఉండాలనే బదిలీ : డీజీపీ కేసు బదిలీ గురించి ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ..‘చిగురుపాటి జయరామ్ హత్యకేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నాం. ఈ మేరకు న్యాయపరమైన అనుమతులు రాగానే కేసు బదిలీ అవుతుంది. హత్యా ఘటన హైదరాబాద్‌లో జరిగిన నేపథ్యంలో కేసు దర్యాప్తు అక్కడ నుంచి జరగడమే శాస్త్రీయంగా ఉంటుంది’ అని చెప్పారు. -
తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలి
-
ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు
హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తన భర్తకు విషమిచ్చారని తొలుత అన్నారని, ఆ తర్వాత కొట్టారని, ఇంకోసారి బీరుసీసా కథ అల్లారని.. ఇలా ఏపీ పోలీసులు రోజుకో డ్రామాతో కేసును నీరుగార్చారని మండిపడ్డారు. తన భర్త పోస్టుమార్టం నివేదిక కావాలని గత నాలుగు రోజులుగా నందిగామ పోలీసులను కోరుతున్నా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ హత్య జరిగినందున, ఇక్కడి పోలీసులే దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష వేసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ హత్య కేసులో తన భర్త మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉన్నా, కొంతమంది వ్యక్తులు ఆమెను తప్పించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నానని స్పష్టం చేశారు. ఒక్క మనిషి ప్రాణం ఖరీదు రూ.6 లక్షలు, రూ.80 లక్షలు, రూ.నాలుగు కోట్లు, ఒక డాలరా అంటూ కన్నీటిపర్యంతమ య్యారు. మేనమామ చనిపోయాడని తెలిస్తే శిఖాచౌదరి ఘటనాస్థలికి వెళ్లకుండా తమ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి బీరువాలోని విలువైన పత్రాలు తీసుకెళ్లడమే అనుమానాలకు తావిస్తోందని పద్మశ్రీ పేర్కొన్నారు. కేసు నుంచి శిఖా చౌదరిని తప్పించేందుకు ఏపీలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. హత్య హైదరాబాద్‌లో జరిగితే కేసును ఏపీలో దర్యాప్తు చేయడమేంటో తనకు అర్థం కావడంలేదన్నారు. అందుకే తనకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. 30 ఏళ్ల తమ వైవాహిక జీవితం ఆనందకరంగా ఉండేదని, తన భర్త హత్యతో ఇద్దరు పిల్లలు తండ్రి లేని వారయ్యారని, తమ కుటుంబం రోడ్డున పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పద్మశ్రీ ఫిర్యాదు స్వీకరించిన అనంతరం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరిచంద్రరెడ్డి.. ఆమెను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
ప్రేక్షక హృదయ నిశ్శబ్దానికి ప్రతిధ్వనిని
‘‘నాకు ‘పద్మశ్రీ’ అవార్డు రావడం వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, నా పేరు సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీతారామశాస్త్రికి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి, ఎందుకు ఇవ్వాలో కేంద్రానికి సకాలంలో వివరిస్తూ తమ అభ్యర్థనలను పంపిన వేలాది మందికి పేరు పేరునా ధన్యవాదాలు. నాకు అవార్డు రావడం వేడుకగా, పండగలా భావిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించిన సందర్భంగా గురువారం సీతారామశాస్త్రి హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► ‘పద్మశ్రీ’ అవార్డు ఎంతది అన్న విషయం పక్కనపెడితే ఈ అవార్డు నాకు రావాలని కోరుకున్న తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. 30ఏళ్లుగా నేను సాగిస్తున్న ఈ సాహితీ వ్యవసాయానికి ఫలసాయంగా నాకు పద్మ అవార్డు రావాలనేది వారి ఆకాంక్ష, ఆశీర్వాదం, కోరిక.. ఇవన్నీ కలిపి ఈ రూపంలో వచ్చాయి అనుకుంటున్నాను. వారి ఆనందానికి కారణమైన నా సాహితీ వ్యవసాయం పట్ల నాకు ఒకింత వినయంతో కూడిన గర్వం కలిగింది. నాకు గీత రచయితగా జన్మనిచ్చిన దర్శకులు విశ్వనాథ్‌గారి చరణాలకు నమస్కరిస్తున్నా. నేను ఇక్కడికి వచ్చి పాటలు రాయాలని తలపించిన మా మాస్టారును తలచుకుంటున్నా. ఈ వేడుకను పై నుంచి చూస్తున్న నాన్నగారికి నమస్కరిస్తున్నా. ► ‘మాటలతో చెప్పడానికి అవకాశం లేని, సరిపోని భాష మూగబోయే స్థితిలో మాటల్ని వాహిక చేసుకుంటూ కనిపించని భావాన్ని అనిపింపజేసే ప్రక్రియ పాట’ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఈ రంగంలోకి వచ్చాను. శోకం, క్రోదం, కోపం... ఇలాంటి దేశ, కాల అతీతమైన కొన్ని భావాలు ఉన్నాయి. సంఘటనలు, వ్యక్తులు, స్థలాలు... వీటిపై పాట రాయడం ఆసక్తి లేదు. పద్యం రాయాలని కానీ లేదా వచన కవిత్వం కానీ రాయాలని అప్పట్లో ఉండేది. ► నాకు చంధస్సు, పద్యం రాయడం రాదు కనక పాట రూపంలో నా అభిప్రాయాలను వ్యక్తపరిచేవాడిని. మెచ్చుకున్నవాళ్లూ నొచ్చుకున్నవాళ్లూ ఉన్నారు. నేనేమీ సంస్కృతాన్ని ఒక సన్నిధానంలో చదువుకున్నవాడినేం కాదు.. వినికిడి పాండిత్యం. మా నాన్నగారు మహా పండితులు. ఆయన సహచర్యం, భగవద్గీత ఇత్యాది వాటివల్ల నా భావాలకు అవసరమైన పద సంపద దొరికింది. అది అందరి దగ్గర ఉంది. నేను కఠినమైన భాషలో రాస్తాను అని చాలా మంది అంటుంటారు. కానీ, అలా రాయడం నాకు రాదు. ► విశ్వనాథ్‌గారి సినిమాకు సంబంధించి ఓ సారి విలేకర్ల సమావేశం జరిగింది. అప్పుడు ‘సిరివెన్నెల’ పాట చదువుతారు అన్నారు నొక్కి. అప్పుడు చదివాను. అక్కడి నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. అప్పుడు ఒక రకమైన బతుకు జీవుడా భావం అనిపించింది. జన్మ ధన్యమైన భావం కలిగింది. ► నా ప్రతి పాటను అవార్డుగానే భావిస్తాను. పాట ఎలా కావాలో తెలిస్తే దర్శక–నిర్మాతలే తీసుకునేవారు. ఎలా ఉండాలో చెప్పడానికే 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. సినిమా కోసమే కాదు.. నా కోసం కూడా నేను పని చేస్తున్నా. ఆ శ్రద్ధ, ఆ భయం ఉన్నాయి. వీటికి భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయి. పాట పట్ల నాకు ఉన్న భయం, భక్తి... నా పాట పంచామృతం. ► పద్మం బురదలో వికసిస్తుంది. గళం అశ్లీల మాటలను ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ బురదలో పూసిన ప్రతి పాట కూడా ఒక పద్మంలా ఉండాలని కోరుకుంటాను నేను. సరస్వతీదేవి కూర్చొనే ఆసనం పద్మం. నా ప్రతి పాట సరస్వతీదేవి పీఠం కావాలనే కోరికతో శ్రద్ధతోనే చేశాను. ఇకపై కూడా అలానే చేస్తాను. ► మీ (ప్రేక్షకులు) హృదయాల్లో నిక్షిప్తమైన, మీకు ఇష్టమైన భావాలను నేను పలికిస్తున్నాను కాబట్టి మీరు స్పందిస్తున్నారు. మీకు నచ్చని మాటలు మాట్లాడితే మెచ్చుకునేవారు కాదు. సీతారామశాస్త్రి మంచి పాటలు రాస్తారు అనే భావనకు వెళితే రేపు నేను తప్పు చేసినా మీ కంట పడదు. మీ గుండెల్లోని నిశ్శబ్దానికి ప్రతిధ్వని నేను. సినిమా కథ జీవితాల్లో నుంచే వస్తుంది. కాకపోతే కాస్త డ్రామా ఉంటుంది. ఎక్కడైతే మాట మూగబోతుందో అక్కడ పాట ఆలాపన మొదలవుతుంది అంటూ ‘సిరివెన్నెల’ తరంగాలు అనే పుస్తకం రాశాను. ► పద్మ అవార్డుని ఆశించలేదు. నా ప్రతి పాటను నేను అవార్డుగానే భావిస్తాను. ఎంతో మంది అభిమానించారు. వారి హృదయ స్పందనకన్నా పెద్ద అవార్డు ఉంటుందని అనుకోను. అవార్డు కోసం నేను ఎప్పుడూ అప్లై చేసుకోలేదు. నా ప్రతి పాట నాకు నచ్చుతుంది. ‘లాలిజో..లాలిజో ఊరుకో పాపాయి, గుమ్మాడి గుమ్మాడి...’ ఇలా అనేక పాటలు ఉన్నాయి. ► ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను అభిమానిస్తారు. నేను వ్యక్తిత్వానికి విలువిస్తాను. నువ్వు ఏం సాధించావ్? అంటే మానవ వ్యవసాయం చేసి హృదయాల్లో స్థానం సంపాదించానని చెబుతాను. రాజ్యం సంపాదించడం కంటే ఒక మనిషి హృదయంలో విలువైన స్థానం సంపాదించడానికే నేను ఇష్టపడతాను. ► నేనే నం.1... లాంటి పాటలు రాయడానికి ఇష్టపడను. ఎందుకంటే తెర ఆడే వరకే ఆ మాట మిగులుతుంది. కథానాయకుడిని పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు ‘గెలుపంటే పసిడి పతకాల తీరం కాదురా..’ అని రాశాను. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం అని ఓ సందర్భంలో రాశాను. పాత్రకు సరిపోతుంది. కేవలం ఆ ఒక్క సందర్భానికి మాత్రమే కాకుండా అన్ని సందర్భాలకు అన్వయించవచ్చు. ► ఆకలేస్తుందని భయపడుతుంటాం. భయపడితే ఆకలి తీరుతుందా? ప్రకృతి కఠినంగానే ఉంటుంది. భయానికి ఎంత స్థానం ఇవ్వాలో తెలుసుకోవాలి. అలా ఏయే భావాలకు ఏయే స్థానాలు ఇవ్వాలో తెలిస్తే ‘ఇవాళ ఉన్నటువంటి ఇన్‌బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. ఇలాంటి భావాలను పంచుకునేందుకు నాకు సినిమా రంగం దొరికింది. నేను సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. సినిమా అన్నది నాటక శాస్త్రానికి యాంత్రిక స్వరూపం. ఒకే చోట.. చాలా చోట్లా ప్రదర్శించవచ్చు. సాహిత్యంలో అనేక రకాలున్నాయి. కథ, సాహిత్యం, నవల.. ఇలా పలు రకాలున్నాయి. నాటకానికి ఇంకా ముఖ్య స్థానం ఉంది. సినిమా వల్ల సమాజం పాడవుతుంది అంటారు. సినిమా వల్ల సమాజం బాగుపడుతుంది. సినిమా సమాజానికి అద్దం మాత్రమే. సినిమా కొత్తగా చూపించేది ఉండదు. 5 రూపాయలతో పెన్సిల్ తయారు చేసి, దాన్ని 7 రూపాయలకు అమ్మరు. ఆ శ్రమకు విలువ కట్టకుండా భౌతికంగా వెచ్చించే సమయానికి డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ఇది ధర్మమైన వ్యాపారం చేస్తున్నాను అనే గర్వం పోవడం మన దురదృష్టం. ఒక్కసారి ఆ గర్వాన్ని మళ్లీ భావిస్తే తెలుగు సినిమా తన వైభవాన్ని చాటుతుందని అనుకుంటా. ► పాట రాయడం ప్రసవ వేదన అంటారు. ఏ పనిలో కష్టం లేదు? కష్టపడకుండా ఏదీ రాదు. అమూల్యం అన్నదానికి రెండర్థాలున్నాయి. పొగరుగా ధ్వనించవచ్చు. పల్లవి నుంచి పాటలోని ఆఖరి వాక్యం వరకూ పాడుకుంటూ తమ జీవితాల్లోకి అన్వయించుకుంటూ ఆనందిస్తున్న వాళ్ల సంతోషానికి విలువ ఏం ఉంటుంది? పారితోషికం ఆలోచించకుండా, ఆశించకుండా పాటలు రాసిన సందర్భాలున్నాయి. అది త్యాగం అనుకోను. నా బాధ్యత అని భావిస్తాను. నేను సైతం అని సహాయం చేస్తాను. ► కాలం మారదు. కాలం మారితే మనం బతకలేం. పంచభూతాలే మారనప్పుడు మనం మారడమేంటి? సభ్యంగా పూర్తిగా ప్యాంటు వేసుకునే దగ్గరి నుంచి చిరిగినవే వేసుకుంటున్నాం. ట్రెండ్ అండీ.. అంటారు. మన సమాజం తాలూకు సంస్కృతులు ఓవర్‌ల్యాప్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ అంటే వల. మౌస్ అంటుంటాం. ఎలుక తోక పట్టుకొని ముందుకు వెళ్లడం ఏంటి? చాటింగ్ అంటూ మాట్లాడటం మానేశాం. తెలుగులో ఎకిమీడ (రాజా) అని రాస్తే పట్టించుకోం. అదేదో ఫారిన్ భాష నుంచి కసరసకరస అని రాస్తే అర్రే బహు బాగుందే అని ఫీల్ అవుతుంటాం. తెలుగు వాళ్లు తమ తాలూకా ఉనికిని కోల్పోవడానికి ఎక్కువగా ముచ్చటపడుతుంటారు. ఇలాంటి తలకిందుల చేష్టలు కూడా మళ్లీ మామూలుగా అయిపోతాయనే అనుకుంటున్నాను. ► ఒక పాట బయటకు రావడానికి దర్శక–నిర్మాతలు, సంగీత దర్శకుడు, రచయిత అభిప్రాయాలు కలవాలి. దీన్నే సాంఘిక జీవనానికి అన్వయిస్తే ఈ మధ్య మా అభిప్రాయాలు కుదరడం లేదని విడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అభిప్రాయం కలవని ఇద్దరూ సాగించే ప్రయాణమే పెళ్లి అంటాను. నచ్చనది చెబుతూ నచ్చినవి స్వీకరించడమే ప్రయాణం. జీవితం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. సినిమా రంగం కూడా అలానే. ► ట్యూన్‌కి రాయడమే ఆది నుంచి ఉన్నది . సినిమా నేర్పింది కాదిది. మనకు నూట ఒక్క వృత్తాలు ఉన్నాయి. ఇవన్నీ ట్యూన్లే. కవి చెప్పదలుచుకున్న భావానికి ఎటువంటి నడకైతే బావుంటుందో నువ్వే ఎంచుకొని అది రాయి. ట్యూన్‌కి రాయడం సాధారణ ప్రక్రియ. ట్యూన్ ఓకే చేసేశాం సార్ అంటుంటారు. ఓకే చేయాల్సింది నేను కదయ్యా అనిపిస్తుంది (నవ్వుతూ). ► నిర్మాత సంకల్పంలో లోపం ఉండదు. మంచి సినిమా తీయాలనే అనుకుంటారు.. అందరూ గౌరవించాలి. నేను నిర్మాతల రచయితను. ఇది వరకు పాటను రాత్రిళ్లు రాసేవాడిని. ఆరోగ్య రీత్యా ఇప్పుడు కొంచెం తగ్గించాను. అయినప్పటికీ రాత్రుళ్లే రాస్తున్నాను. పాట ఎందుకు? కథ అడగని పాట ఎందుకు? ఇటీవల హిట్ అయిన సినిమాల్లో పాటలు గుర్తున్నాయా? వస్తున్నా సరే క్షమించి కూర్చుంటున్నారు. అంత అక్కర్లేని, ఆనందింపజేయలేని పాట పెట్టే బదులు ఆ పాటకు అయ్యే ఖర్చు మిగిల్చుకోవచ్చుగా. ఈ విషయం నిర్మాతలకు చెప్పాలి అనిపిస్తుంది. ఆరు నుంచి నాలుగుకు పడిపోయాయి. ఇప్పుడు మూడు అయ్యాయి. మెల్లిగా పల్లవి, ఆ తర్వాత రెండు వాక్యాలు చిత్రీకరిస్తున్నారు. పాట ఎందుకుండాలో, ఎప్పుడుండాలో అని కూర్చుని ఆలోచించి అవసరమైతే పెట్టండి. పాటలు ఎప్పటికీ ఉంటాయి. మనిషి ఉన్నంతకాలం పాటలుంటాయి. ఆ భావాల్ని రాయను ఏ పరిస్థితుల్లోనూ స్త్రీని కించపరచలేను. ఆమె పాత్ర ఏదైనా అవ్వొచ్చు. సెక్స్ వర్కర్ అవ్వొచ్చు. క్లబ్ డ్యాన్సర్ అవ్వొచ్చు. ఎంత ఘాటు శృంగారం అయినా, మోటు శృంగారం అయినా రాస్తాను. అది కూడా నా తల్లితోటి, చెల్లితోటి వినగలిగేలా రాస్తాను. అలాగే కుర్రకారుని రెచ్చగొట్టే పాటల్ని రాయను. జీవితం ఏదైనా నేర్పుతుంది. బలవంతంగా జీవితం నేర్పే పాఠాల్ని వదిలేసి వయసు మళ్లే దాకా నాలుగు గోడల మధ్య చదివేదే చదువు అంటున్నాం. మనకు నాలుగు భాషలు రావు. ఆటో డ్రైవర్‌కి వస్తాయి. ఎలా? అవసరం. పాట పదాలలో లేదు. మాటల్లో కానీ, అక్షరాల్లో కానీ లేదు. వాటి పోహళింపు మధ్య ఉన్న నిశ్శబ్దంలో ఉంది పాట. కేవలం పదాల పదాల ప్రయోగం నుంచి బయట పడినప్పుడే సినీ గీత రచయితలు మంచి పాటలు రాయగలుగుతారు. -
మరో సీనియర్ నటి మృతి
కోల్‌కతా: బెంగాలీ ప్రముఖ నటి సుప్రియా దేవి(85) కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రిత్విక్ ఘటక్ దర్శకత్వం వహించిన ‘మేఘే ఢాకా తారా’ చిత్రంలో నీతా అనే పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. 1933లో మిచ్‌కినాలో జన్మించిన సుప్రియా దేవి 1952లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 55 ఏళ్లు ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో చౌరింగీ, బాగ్ బందీ ఖేలా, సన్యాసి రాజ్, దేబ్దాస్ లాంటి క్లాసిక్ చిత్రాలున్నాయి. 2007లో విడుదలైన నేమ్‌సేక్ చిత్రంలో చివరిసారి నటించారు. దేవికి పద్మశ్రీ అవార్డుతో పాటు బెంగాల్ ప్రభుత్వ పౌర పురస్కారం బంగా విభూషణ్ లభించాయి. శుక్రవారమే అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
‘పద్మశ్రీ’ని తిరిగిచ్చేసిన రచయిత్రి
మత అసహనంపై కొనసాగుతున్న రచయితల ఆగ్రహం ♦ అకాడమీ అవార్డ్‌ను వాపస్ చేసిన మరికొందరు సాహిత్యకారులు ♦ రచయితలపై మండిపడ్డ ఆరెస్సెస్; లౌకిక వ్యాధి గ్రస్తులని వ్యాఖ్య న్యూఢిల్లీ: సమాజంలో పెరుగుతున్న మతపరమైన అసహనం, భావప్రకటన స్వేచ్ఛపై దాడులకు వ్యతిరేకంగా ప్రముఖ సాహిత్యకారుల నిరసనల పర్వం కొనసాగుతోంది. దాద్రీ ఘటన, హేతువాదులు కల్బుర్గి, ధబోల్కర్, పన్సారేల హత్య, తాజాగా సుధీంద్ర కులకర్ణిపై శివసైనికుల దాడి.. తదితర హింసాత్మక ఘటనలపై నిరసనగా తామందుకున్న సాహిత్య పురస్కారాలను తిరిగివ్వడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. మంగళవారం ప్రఖ్యాత పంజాబీ రచయిత్రి దాలిప్ కౌర్ తివానా 2004లో తానందుకున్న పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేశారు. ముస్లింలపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. భావ ప్రకటనపై దాడిని ఖండిస్తూ.. కార్ల్ మార్క్స్ రచనల ప్రభావం రష్యా విప్లవంపై గణనీయంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సాహిత్య అకాడమీ అవార్డ్‌ను తిరిగిస్తున్న వారి జాబితాలో కన్నడ రచయిత, హంపీ వర్సిటీ ప్రొఫెసర్ రహమత్ తరికెరి, మరాఠీ రచయిత్రి ప్రాధన్య పవార్, హిందీ అనువాదకుడు చమన్‌లాల్, అస్సాం రచయితలు నిరుపమ బోర్గొహెన్, హోమెన్ బోర్గొహెన్ కూడా చేరారు. కల్బుర్గి, దభోల్కర్, గోవింద్ పన్సారేల హత్య, ఘర్‌వాపసీ, దాద్రీ ఘటన, చర్చ్‌లపై దాడులు, సుధీంద్రపై శివసేన దాడి.. మొదలైన ఘటనలకు నిరసనగా అవార్డ్‌ను తిరిగివ్వాలని నిర్ణయించుకున్నట్లు తరికెరి తెలిపారు. ఈ ఘటనలు అసహన సమాజాన్ని రూపొందించే క్రమంలో జరిగినవన్నారు. గత సంవత్సరంన్నరగా సమాజంలో పెరుగుతున్న అసహనం, నియంతృత్వ ధోరణులకు నిరసనగా అవార్డ్‌ను తిరిగిస్తున్నట్లు పవార్ అన్నారు. అకాడమీ అవార్డ్‌తో పాటు తానందుకున్న అన్ని సాహిత్య పురస్కారాలను తిరిగిచ్చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తక్షణమే అకాడమీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఒరియా రచయిత రాజేంద్ర పాండా డిమాండ్ చేశారు. ఇప్పటివరకు దాదాపు 28 మంది రచయితలు తమ అవార్డ్‌లను వెనక్కివ్వగా, సాహిత్య అకాడమీ అధికార పదవుల నుంచి ఐదుగురు రచయితలు వైదొలగారు. మోదీ మాట్లాడాలి.. రష్దీ: అకాడమీ పురస్కారాలను వెనక్కిచ్చేస్తున్న రచయితలకు మద్దతిచ్చిన రచయిత, బుకర్ అవార్డ్ గ్రహీత సల్మాన్ రష్దీని దారుణంగా దూషిస్తూ ట్వీటర్లో సందేశాలు వెల్లువెత్తాయి. వాటిపై.. ‘మోదీ మూర్ఖ అభిమానులారా.. మీకో విషయం స్పష్టం చేయాలి. నేను ఏ పార్టీకీ మద్దతివ్వను. భావప్రకటన స్వేచ్ఛను హరించే ఏ చర్యనైనా నిరసిస్తాను. స్వేచ్ఛే నా పార్టీ. మునుపెన్నడూ చూడని క్రూర హింస భారత సమాజంలోకి చొచ్చుకువస్తోంది. ప్రధాని దేనిపైనైనా మాట్లాడగలరు. ఈ ఘటనలపైనా మాట్లాడితే బావుంటుంది’ అని అన్నారు. వారు లౌకిక వ్యాధిగ్రస్తులు.. అకాడమీ అవార్డులను రచయితలు తిరిగివ్వడంపై ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’ విమర్శించింది. ‘సెక్యులర్ వ్యాధిగ్రస్తులైన కొందరు రోగులు దేశాన్ని, హిందూత్వాన్ని నాశనం చేసేందుకు చేతులు కలిపారు’ అని పేర్కొంది. ‘సిక్కులను ఊచకోత కోసినవారి నుంచి అవార్డులు అందుకోవడంలో వారికి ఏ సమస్యా లేదం’టూ ఎద్దేవా చేసింది. ఈ లౌకికవాదుల దృష్టిలో హిందువులకు ఎలాంటి మానవహక్కులు ఉండవంటూ ధ్వజమెత్తింది. అకాడమీ అవార్డ్‌లను తిరిగివ్వడంపై మరో ప్రముఖ రచయిత చేతన్ భగత్ స్పందిస్తూ.. అవార్డు స్వీకరించి, తర్వాత తిరిగిచ్చేయడం అవార్డును, న్యాయనిర్ణేతలను అవమానించడమేనన్నారు. ఇదీ రాజకీయమేనని, ప్రచార యావేనని ఘాటుగా విమర్శించారు. పురస్కారాలను తిరిగిస్తున్న రచయితలు రచనలు చేయడం ఆపేయాలన్న సాంస్కృతిక శమంత్రి మహేశ్ శర్మ వ్యాఖ్యపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమయింది. ఆయన అహంభావానికి అది అద్దంపడుతోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. దాంతో, అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా తానెవరినీ నిరోధించలేనంటూ శర్మ చెప్పారు. పాక్ పాఠాలు అవసరం లేదు: భారత్ బహుళత్వ సంస్కృతిపై పాకిస్తాన్ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం తమకు లేదని భారత్ పేర్కొంది. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడాలంటే ఉగ్రవాదానికి దూరంగా ఉండడమే కీలకమంది. కసూరి పుస్తకావిష్కరణకు అడ్డంకులు, పాక్ గాయకుడు గులాం అలీ కచేరీ రద్దు వంటివి పునరావృతం కావొద్దని పాక్ పేర్కొన్న నేపథ్యంలో భారత్ పై వ్యాఖ్యలు చేసింది. దాద్రీ స్వల్ప ఘటన: బీజేపీ ఎంపీ ‘దాద్రీ స్వల్ప ఘటన’ అని బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ అన్నారు. దాద్రీ వంటి చిన్న ఘటనలను భారత్ చక్కగా హ్యాండిల్ చేయగలదని పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లింలతో పాటు ఇతర మతాల వారి అభిప్రాయాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ స్వభావాన్ని తెలియజేస్తున్నాయని కాంగ్రెస్ తదితర విపక్షాలు మండిపడ్డాయి. దాద్రీ చిన్న ఘటన అయితే ఇంకేది పెద్ద ఘటన అని సమాజ్‌వాదీ పార్టీ ప్రశ్నించింది. దీనిపై బీజేపీ క్షమాపణ చెప్పాలంది. కులకర్ణి మరో కసబ్: శివసేన మాతో సమస్య ఉంటే అధికారం నుంచి తప్పుకోవచ్చంటూ బీజేపీకి సలహా ముంబై: పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన సుధీంద్ర కులకర్ణిని పాక్ ఉగ్రవాదితో పోలుస్తూ ‘మరో కసబ్’గా శివసేన అభివర్ణించింది. సుధీంద్రపై దాడి విషయంలో సేనను విమర్శించిన సీఎం ఫడ్నవిస్ మహారాష్ట్రను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారంది. ‘కులకర్ణి లాంటి వాళ్లు ఉగ్రవాదులకంటే ప్రమాదం. దేశాన్ని నాశనం చేయడమే అలాంటివారి లక్ష్యం. అలాంటివారు దేశంలో ఉంటే కసబ్‌లాంటి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించాల్సిన అవసరం పాక్‌కు ఉండదు’ అని తన పత్రిక ‘సామ్నా’లో విమర్శించింది. కశ్మీర్ వేర్పాటువాదులను ఒక్కటి చేసింది కసూరీనేనంది. పాక్ నుంచి వచ్చిన కసూరికి భద్రత కల్పించి 26/11 దాడుల్లో మరణించిన అమరవీరులను ఫడ్నవిస్ అవమానించారని సేన ఎంపీ సంజయ్ రౌత్ ఆన్నారు. ‘శివసేన జాతీయవాదం, దేశభక్తితో సమస్య ఉంటే మహారాష్ట్రలో అధికారంలో నుంచి బీజేపీ తప్పుకోవచ్చ’న్నారు. రాష్ట్రంలో బీజేపీ, సేనల సంకీర్ణం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సేన విమర్శలపై స్పందిస్తూ.. తాను పాక్ ఏజెంట్‌ను కాదని, శాంతికి ప్రతినిధినని సుధీంద్ర పేర్కొన్నారు. సుధీంద్రపై సిరా దాడి చేసిన ఆరుగురు శివసైనికులను ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే సన్మానించారు. -
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు
నాగండ్ల (ఇంకొల్లు), న్యూస్‌లైన్: బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించిన పుల్లెల గోపీచంద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును శనివారం ప్రకటించడంతో ఆయన స్వగ్రామం ఇంకొల్లు మండలం నాగండ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ కీర్తి కిరీటంలో ఇప్పటికే ఎన్నో అవార్డులున్నాయి. గతంలో అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్త్న్ర, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డులు ఆయనకు లభించాయి. గోపీచంద్ ప్రాథమిక విద్య ఒంగోలులోనే పద్మభూషణుడు పూర్తిచేశారు. ఉన్నత విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. పిన్ని మాంచాల ప్రోద్బలంతో అన్నదమ్ములు బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచారు. గోపీచంద్, ఆయన అన్న రాజశేఖర్ ఇద్దరూ డబుల్స్ ఆడుతూ జాతీయ క్రీడాకారులుగా మంచి గుర్తింపు పొందారు. రాజశేఖర్‌కు ఐటీఐ సీటు లభించడంతో క్రీడలకు స్వస్తి పలికారు. తల్లి సుబ్బరావమ్మ గృహిణి కాగా తండ్రి పుల్లెల శుభాష్‌చంద్రబోస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు లభించడంతో ఆయన స్వగ్రామంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలు గోరంట్ల వీరయ్య, ఆదిలక్ష్మిలతో పాటు ఆలిండియా బ్యాడ్మింటన్ కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, బాబాయిలు సోమేపల్లి రామ్మోహన్రావు, మార్కండేయులు, కొరిటాల శివప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
హాస్య పద్మాలు
అపురూపం ‘నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వలేకపోవడం రోగం’... అనేవారెప్పుడూ జంధ్యాలగారు. నవ్వించడం నటులకి అంత తేలిక కాదు. నవ్వించగలిగిన నటులకి మిగిలిన అన్ని రసాలు అభినయించడం తేలికే! అటువంటి హాస్యాన్ని పండించి మెప్పించిన హాస్యనటులు తెలుగులో ఎందరో! వారంతా ప్రజల గుర్తింపునూ పొందారు. వారిలో కొందరు ప్రభుత్వ గుర్తింపునూ పొందారు! ‘పద్మవిభూషణ్’, ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’. ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను 1954 నుండి భారత ప్రభుత్వం ప్రదానం చేస్తూ వస్తోంది. దక్షిణాదిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందిన తొలి హాస్యనటుడు శ్రీ రేలంగి వెంకట్రామయ్య. ఆ తరువాత కాలంలో అల్లు రామలింగయ్య, బ్రహ్మానందంలు అందుకున్నారు. ఆ రోజుల్లో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ఉన్న స్టార్ కమెడియన్ శ్రీ రేలంగి! 1970లో ఆయన, నాటి రాష్ట్రపతి వి.వి.గిరి నుండి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే యాభై సంవత్సరాల పాటు 1,013 చిత్రాలలో నవ్వించారు శ్రీ అల్లు రామలింగయ్య. ఆయన, 1990లో నాటి భారత రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. హీరో ఎవరైనా సరే... బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్! ఇది ప్రస్తుతం బ్రహ్మానందం స్థాయి! 28 సంవత్సరాల సినీ జీవితంలో అప్పుడే వెయ్యి సినిమాలకు దగ్గరవుతున్న బ్రహ్మానందం ‘పద్మశ్రీ’ బిరుదును 2009లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారం పొందుతోన్న బ్రహ్మానందం అప్పుడు గాని... ఇప్పుడు గాని తెలుగులో ఉన్నంత మంది హాస్యనటులు మరే భాషలోనూ లేరు! అలాగే ముగ్గురు హాస్యనటులు ‘పద్మ’ పురస్కారాలను మరే భాషలోనూ అందుకున్న గుర్తూ లేదు!! హ్యాట్సాఫ్ టూ తెలుగు హాస్యనటులు!!! -నిర్వహణ: సంజయ్ కిషోర్