కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జయరామ్ హత్య కేసులో మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై మృతుని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్త చేశారు. కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.