Chigurupati Jayaram
-
జయరాం హత్య: పోలీసులపై సుప్రీంకోర్టు ఫైర్
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కె.రాకేశ్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసులో ఇతర నిందితులను అరెస్టు చేసి, ఆరోపణలు ఉన్న పోలీసులను అరెస్టు చేయకపోవడాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆయా అధికారుల పాత్రలపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. ♦ జయరాం మృతదేహాన్ని కారులో ఉంచుకున్న రాకేష్‌రెడ్డి తన స్నేహితుడైన అప్పటి నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును కలవడానికి ఆ ఠాణాకు వెళ్లాడు. ఇన్స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయనతో పాటు అప్పటి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిని సంప్రదించాడు. ♦ వీరిద్దరూ ఇచి్చన సలహా మేరకు ఈ హత్యను డ్రంక్ డ్రైవింగ్ నేపథ్యంలో జరిగిన ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం వేసి ఏపీలోని నందిగామకు తీసుకువెళ్లాడు. అక్కడ హైవే పక్కనే కారుతో సహా శవాన్ని వదిలేసి తిరిగి వచ్చాడు. ♦ మొత్తమ్మీద హత్య తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో 13 సార్లు, ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు సంభాషించినట్లు రాకేష్ కాల్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరితో పాటు అప్పట్లో రాయదుర్గం ఠాణా ఇన్స్పెక్టర్గా పని చేసిన రాంబాబుతోనూ రాకేష్‌రెడ్డి సంప్రదింపులు జరిపాడు. ♦ నందిగామలో రిజిస్టర్ అయిన ఈ కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయింది. ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని గత ఏడాది ఫిబ్రవరి 7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆపై అతడికి సహకరించిన మరో ఏడుగురు నిందితులను జైలుకు పంపారు. ♦ రాకేశ్‌రెడ్డితో పాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ♦ వీరితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబు సైతం ఉన్నారు. అయితే వీరిని పోలీసులు అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు మాత్రమే జారీ చేశారు. ♦ అదేమంటే కేసులో వీరి పాత్ర చాలా స్వల్పమంటూ చెప్పి అరెస్టు చేయకుండానే తతంగం పూర్తి చేశారు. సాధారణంగా ఇలాంటి సంచలనాత్మక కేసుల్లో నిందితులు అందరినీ అరెస్టు చేస్తారు. వారి పాత్రలను బట్టి ఆయా సెక్షన్ల కింద అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ♦ జయరాం కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల విషయంలో మాత్రం హైదరాబాద్ పోలీసులు ఇలా చేయలేదు. దీన్నే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ♦ గత ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను హనీట్రాప్ చేసిన రాకేశ్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రోడ్ నెం.10లోని తన ఇంటికి రప్పించాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయన్ను నిర్బంధించి, ఆ మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేశాడు. ♦ ఈ కేసులో పోలీసుల పాత్రపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాఖలయ్యే కౌంటర్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశమే ఇప్పుడు పోలీసులు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. -
శంకరయ్య బాగోతాలు బట్టబయలు
-
శంకరయ్య బాగోతాలు బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో కీలక సమాచారం వెల్లడవుతోంది. ఇప్పటికే సోదాల్లో భారీ స్థాయిలో కూడబెట్టిన ఆస్తులను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో నిందితుడు రాకేష్‌రెడ్డితోనూ శంకరయ్యకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో దుండిగల్ సీఐగా పనిచేస్తున్న సమయంలో శంకరయ్యకు రాకేశ్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి వారి మధ్య లావాదేవీలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇక జయరాం, శిఖ చౌదరీల కాల్ డేటాను సీఐ శంకరయ్య ద్వారా రాకేష్‌రెడ్డి రాబట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. శంకరయ్య ఇలా దొరికిపోయారు షాబాద్ సీఐగా పని చేస్టున్న శంకరయ్య జయరాంరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులు అతని నివాసాల్లో సోదాలు చేపట్టడంతో విస్మయకర విషయాలు తెలుస్తున్నాయి. ఇక శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. శంకరయ్య అతని బందువుల ఇళ్లలో కొనసాగిన ఏసీబీ సోదాల్లో ఈ ఆస్తులను గుర్తించారు. ఒక కోటి 5 లక్షల విలువ చేసే రెండు ఇళ్లు రెండు కోట్ల 28 లక్షల విలువచేసే 11 ఇంటి ప్లాట్స్. 77 లక్షల విలువచేసే 41 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి నిజామాద్, చేవెళ్ల, మిర్యాల గూడలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 7 లక్షల విలువ చేసే మారుతి స్విప్ట్ కారు. 21 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు 17 లక్షల 88 వేల నగదు 6 లక్షల విలువ చేసే ఇతర వస్తువులు 81 వేల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. -
జయరాం హత్య కేసులో విచారణ మొదలు
హైదరాబాద్: పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్యకేసుకు సంబంధించి కోర్టులో విచారణ ప్రారంభమైంది. 23 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. చార్జిషీట్లో ముగ్గురు పోలీసు అధికారులను సైతం నిందితులుగా పేర్కొన్నారు. జయరాంను దారుణంగా హత్య చేసిన రాకేశ్‌రెడ్డిని ఏ–1గా చార్జిషీట్లో చూపించారు. ఇక ఏ–2 గా విశాల్, ఏ–3గా వాచ్‌మన్ శ్రీనివాస్, ఏ–4గా రౌడీషీటర్ నగేశ్, ఏ–5గా సినీ నటుడు సూర్యప్రసాద్, ఏ–6గా సూర్య స్నేహితుడు కిషోర్, ఏ–7గా రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్‌రెడ్డి, ఏ–8గా మాజీ నేత టీడీపీ బీఎన్ రెడ్డి, ఏ–9గా రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డి, ఏ–10గా నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఏ–11గా రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఏ–12గా ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిని చేర్చారు. మొత్తం 73 మంది సాక్షులను విచారించగా.. 11వ సాక్షిగా శిఖా చౌదరి, 13వ సాక్షిగా ఆమె సన్నిహితుడు సంతోష్‌రావులు ఉన్నారు. హనీట్రాప్‌తో జయరాం హత్యకు కుట్రపన్నిన రాకేశ్‌రెడ్డి జనవరి 31న పిడిగుద్దులు గుద్ది ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలను చార్జిషీట్లో జతపర్చారు. ఆ పోలీసుల సూచనలతోనే.. ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల సూచనతోనే మృతదేహాన్ని నందిగామకు తరలించాడని, జయరాంను చిత్రహింసలు పెట్టి చంపిన రాకేశ్.. ఆ మొత్తం దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడని పేర్కొన్నారు. 11 వీడియోలు, 13 ఫొటోలు తీసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆస్పత్రికి తీసుకువెళ్ల.. ప్లీజ్ అంటూ జయరాం ప్రాధేయపడ్డా రాకేశ్ వినిపించుకోలేదు. ప్రతినెలా 50 లక్షలు ఇస్తా నన్ను చంపకుండా వదిలెయ్ అని మొరపెట్టుకున్నట్లు కూడా తేలింది. పాస్‌పోర్ట్ మీ దగ్గరే పెట్టుకో నన్ను ప్రాణాలతో వదిలేయ్ అంటూ కాళ్లావేళ్లా పడ్డ దృశ్యాలు కూడా సమర్పించారు. వీణ అనే పేరుతో తన ఇంటికి జయరాంను రాకేశ్ లంచ్‌కు ఆహ్వానించారు. అయితే జయరాం శరీరంలో ఎటువంటి విషపదార్థాలు లేవని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. శిఖా చౌదరి బీఎండబ్ల్యూ కారును రాకేశ్ ఎత్తుకెళ్లడమే కాకుండా ఆమె కోసం ఖర్చు చేసిన డబ్బును వెనక్కివ్వాలంటూ డిమాండ్ చేసినట్లు కూడా తేలింది. శిఖా చౌదరి కోసం రాకేశ్ పెద్ద ఎత్తున ఖర్చు చేశాడని తేలింది. కిడ్నాప్ చేసి స్కెచ్ విఫలమయ్యాక రాయదుర్గం సీఐ రాంబాబును రాకేశ్ కలిశాడని స్పష్టం చేశారు. ఖాళీ స్టాంప్ పేపర్ల మీద జయరాం సంతకాలు తీసుకున్నట్లు కూడా స్పష్టమైంది. 4.5 కోట్లు జయరాంకు అప్పు ఇచ్చినట్లు అందులో సంతకాలు పెట్టించుకున్నట్లు కూడా తేలింది. మాజీ టీడీపీ నేత బీఎన్.రెడ్డి సమక్షంలో ఈ అగ్రిమెంట్ జరిగిందని స్పష్టమైంది. హత్య చేసిన విషయాన్ని రాయదుర్గం మాజీ సీఐ రాంబాబుకు ఫోన్లో చెప్పడం, కారులో మృతదేహంతో నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఇవన్నీ పోలీసుల దృష్టికి వచ్చాయి. -
జయరాం హత్య కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు సోమవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం 23పేజీల ఛార్జ్‌షీట్‌లో 12మంది నిందితులను పేర్కొన్నారు. ఈ కేసులో 73 మంది సాక్షులుగాను విచారించినట్లు పోలీసులు వెల్లడించారు. ఏ-1గా రాకేష్, ఏ-2గా విశాల్‌ను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అయితే ఈ కేసులో చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖాచౌదరిని 11వ సాక్షిగా పేర్కొన్నారు. హనీ ట్రాప్ ద్వారానే జయరాంను హత్య చేశారని చెప్పారు. అలాగే ఇందులో ముగ్గురు పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు.. వారి సలహా మేరకే జయరాం మృతదేహాన్ని తరలించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 11 వీడియోలు, 13 ఫోటోలను పోలీసులు రాకేశ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. -
ఏడాది పాటు జైల్లోనే రాకేష్ రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. జయరాం హత్యతోపాటు నగరంలో గత మూడేళ్లుగా బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడటంతో జూబ్లీహిల్స్ పోలీసులు పీడీయాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలు, శాస్త్రీయ ఆధారాలు ప్రతిపాదిత నివేదికలో జతపర్చారు. ఇటీవలే రాకేశ్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు నిందితులపై పోలీసులు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 70 మంది సాక్షులను విచారించిన పోలీసులు 388 పేజీల చార్జిషీట్ రూపొందించారు. శాస్త్రీయ ఆధారాలతోపాటు ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సేకరించిన రిపోర్టును కూడా చార్జిషీట్‌తోపాటు జతపర్చారు. రాకేశ్‌రెడ్డితోపాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై చార్జిషీట్ దాఖలైంది. ఈ ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి హనీట్రాప్ చేసిన రాకేశ్‌రెడ్డి రోడ్ నం.10లోని తన ఇంటికి రప్పించి 31వ తేదీన ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆధారాలు తారుమారు చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించే నిమిత్తం ముగ్గురు పోలీసు అధికారుల సలహాలు తీసుకొని జయరాం కారులోనే హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో నందిగామ శివార్లకు చేరుకున్నాడు. మృతదేహాన్ని అక్కడే పడేసి బస్సులో అదే రాత్రి జూబ్లీహిల్స్‌కు వచ్చి ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం కుత్బుల్లాపూర్ చింతల్‌లోని తన ఇంటికి వెళ్లాడు. పక్కా ఆధారాలు సేకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని ఫిబ్రవరి 7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరింత సమాచారం, పురోగతి కోసం ఫిబ్రవరి 13 నుంచి 26వ తేదీ వరకు రాకేశ్‌రెడ్డిని కస్టడీకి తీసుకొని సమాచారాన్ని క్రోడీకరించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాకేష్ రెడ్డిపై పీడీయాక్ట్ నమోదుతో మరో ఏడాదిపాటూ జైల్లోనే ఉండనున్నాడు. -
బీఎన్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం
బంజారాహిల్స్: ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే కాకుండా జయరాంతో సెటిల్మెంట్ చేసుకునేందుకు పలుమార్లు రాకేష్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మాజీ టీడీపీ నేత బీఎన్ రెడ్డి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే బీఎన్ రెడ్డి పేరుతో రాకేష్‌రెడ్డిపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు. జనవరి 31న జయరాం జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని రాకేష్‌రెడ్డి నివాసంలో హత్యకు గురైన విషయం విదితమే. అంతకుముందు రెండు రోజులు బీఎన్ రెడ్డి అక్కడికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య జరిగిన రోజు ఉదయం కూడా బీఎన్ రెడ్డి ఆ ఇంటికి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు అతడిని దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తన కార్యాలయంలో విచారించారు. ఇప్పటికే బీఎన్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. చార్జిషీట్లో బీఎన్ రెడ్డి పేరును చేర్చిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాకేష్‌రెడ్డితో సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా జయరాంపై ఒత్తిడి తేవాలని హత్యకు కొద్ది రోజుల ముందు రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు బీఎన్ రెడ్డి నిందితుడు రాకేష్‌రెడ్డిని తీసుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా బీఎన్ రెడ్డి గత నెలలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. -
రాకేశే హంతకుడు
సాక్షి,హైదరాబాద్: ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కె.రాకేశ్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు నిందితులపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 70 మంది సాక్షులను విచారించిన పోలీసులు 388 పేజీల చార్జిషీట్ రూపొందించారు. శాస్త్రీయ ఆధారాలతోపాటు ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సేకరించిన రిపోర్టును కూడా చార్జిషీట్‌తోపాటు జతపర్చారు. రాకేశ్‌రెడ్డితోపాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై చార్జిషీట్ దాఖలైంది. ఈ ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి హనీట్రాప్ చేసిన రాకేశ్‌రెడ్డి రోడ్ నం.10లోని తన ఇంటికి రప్పించి 31వ తేదీన ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆధారాలు తారుమారు చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించే నిమిత్తం ముగ్గురు పోలీసు అధికారుల సలహాలు తీసుకొని జయరాం కారులోనే హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో నందిగామ శివార్లకు చేరుకున్నాడు. మృతదేహాన్ని అక్కడే పడేసి బస్సులో అదే రాత్రి జూబ్లీహిల్స్‌కు వచ్చి ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం కుత్బుల్లాపూర్ చింతల్‌లోని తన ఇంటికి వెళ్లాడు. పక్కా ఆధారాలు సేకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని ఫిబ్రవరి 7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరింత సమాచారం, పురోగతి కోసం ఫిబ్రవరి 13 నుంచి 26వ తేదీ వరకు రాకేశ్‌రెడ్డిని కస్టడీకి తీసుకొని సమాచారాన్ని క్రోడీకరించారు. ప్రస్తుతం రాకేశ్‌రెడ్డితోపాటు మిగతా ఏడుగురు నిందితులు జైలులో ఉన్నారు. వీరిపై అదనపు చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా పోలీసులు కేసును పటిష్టం చేసే దిశలో ఉన్నారు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకుడి పేరును కూడా అదనపు చార్జ్‌షీటులో చేర్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ కేసులో తీవ్ర వివాదాస్పదమైన రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీసు అధికారుల పేర్లు తొలి చార్జిషీట్లో చేర్చలేదని సమాచారం. రాకేశ్‌పై పీడీ అస్త్రం.. జయరాం హత్యతోపాటు నగరంలో గత మూడేళ్లుగా బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడుతూ రౌడీయిజంతో రెచ్చిపోతున్న రాకేశ్‌రెడ్డిపై పీడీ అస్త్రం ప్రయోగించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కమిటీకి నివేదిక అందజేశారు. పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలు, శాస్త్రీయ ఆధారాలు ప్రతిపాదిత నివేదికలో జతపర్చారు. -
జయరామ్ హత్య కేసులో ముగ్గురు పోలీస్ అధికారులపై వేటు
-
ఏపీ మంత్రులతో రాకేష్‌కు లింకులు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, ప్రవాసభారతీయుడు చిగురుపాటి జయరామ్‌ను హత్యచేసిన రాకేష్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మంత్రులతో సంబంధాలున్నాయని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జయరామ్ హత్యానంతరం హంతకుడు అక్కడి అమాత్యులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తేలిందన్నారు. కేసు దర్యాప్తులో ఏపీ మంత్రులతో ఉన్న పరిచయ కోణాన్నీ పరిగణనలోకి తీసుకుని లోతుగా ఆరా తీస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు. ఈ హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన సందర్భంగా గురువారం విలేకరుల సమా వేశం ఏర్పాటుచేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం. 10లో ఉన్న రాకేష్ ఇంట్లో జనవరి 31న జయరామ్ హత్య జరిగిన విషయం విదితమే. మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లిన రాకేష్ ఏపీలోని నందిగామ సమీపంలో వదిలిపెట్టి వచ్చారు. తొలుత ఏపీలో నమోదైన ఈ కేసు.. ఆపై తెలంగాణకు బదిలీ కావడంతో బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి జయరామ్ హత్యకు ముందు, ఆ తర్వాతా ఏపీ మంత్రులతో మాట్లాడాడు. అయితే హత్యకు సంబంధించిన వివరాలు మాట్లాడారా? మరేదైనా చర్చించారా? అనేది దర్యాప్తులో తేలుతుందని డీసీపీ తెలిపారు. రాకేష్ కాల్ డిటేల్స్ అధ్యయనం చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు, ఆ పార్టీ కీలక వ్యక్తులతో సన్నిహిత సంబంధాలున్నట్లు తేలిందని పేర్కొన్నారు. 4 నెలల క్రితమే ప్లానింగ్! ఆర్థిక వివాదాల నేపథ్యంలో జయరామ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్న రాకేష్.. ఈ ఘాతుకానికి 4 నెలల క్రితమే ప్లాన్ చేశాడు. జయరామ్ వ్యవహార శైలి తెలిసిన రాకేష్ కొత్త సిమ్‌కార్డు తీసుకుని హనీట్రాప్‌ను వీణ పేరుతో అమలుచేశాడు. జయరామ్‌ను ‘జై’అని పిలుస్తూ వాట్సాప్ చాటింగ్ చేశాడు. వీరి మధ్య మొత్తం 170 చాటింగ్స్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. జయరామ్‌ను నిర్భంధించాలని కుట్రపన్నిన రాకేష్.. జనవరి 30న వీణ పేరు తో లంచ్‌కు ఆహ్వానించాడు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌కు వస్తే అక్కడ నుంచి కలిసి వెళ్దామంటూ వాట్సాప్ సందేశం పెట్టాడు. అతడు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో రౌడీషీటర్ నగేష్‌ను రమ్మని పిలిచాడు. ఓ వ్యక్తిని నిర్బంధించి డబ్బు వసూలు చేద్దామన్నాడు. దీనికోసం విశాల్ (నగేష్ సమీప బంధువు)నూ లైఫ్‌సెటిల్ చేస్తానంటూ తనతో కలుపుకున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న చిలకట్ల సూర్యప్రసాద్ (30) అలియాస్ సూర్య తాను నిర్మిస్తున్న కలియుగ సినిమా కోసం అవసరమైన ఆర్థిక సాయం కోసం రాకేష్‌ను ఆశ్రయించాడు. జనవరి 30న రాకేష్‌ను కలిసేందుకు అతడి ఇంటికి వస్తూ తన స్నేహితుడైన ‘కలియుగ’అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్‌ను తీసుకువచ్చాడు. దీంతో నగేష్, విశాల్‌లను ఇంట్లోనే ఉంచిన రాకేష్.. వీరిద్దరినీ తీసుకుని బయలుదేరాడు. జూబ్లీహిల్స్ క్లబ్ వరకు వచ్చాక జయరామ్ కారు నంబర్ కిశోర్‌కు చెప్పి అతడికి అక్కడ దింపేశాడు. అందులో జై అనే వ్యక్తి వస్తారని, అతడిని వీణ మేడం డ్రైవర్ని అంటూ పరిచయం చేసుకుని, అతడి కారులోనే తన ఇంటికి తీసుకురమ్మని రాకేష్ చెప్పడంతో కిశోర్ అలానే చేశాడు. ఇంటికి వచ్చాక సూర్య, కిశోర్‌లు కింది నుంచే వెళ్లిపోగా.. రాకేష్ సహా మిగిలిన ఇద్దరూ జయరామ్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి నిర్బంధించారు. స్టాంపు పేపర్లపై సంతకాలు జయరామ్‌ను బెదిరించిన రాకేష్ కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరామ్‌తో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్ చేసుకున్నాడు. మరుసటి రోజు (జనవరి 31) విశాల్‌తో కలిసి జయరామ్‌ను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. జయరామ్ దేహం ఇంట్లో ఉండగానే రియల్టర్ అంజిరెడ్డి ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విషయం మాట్లాడటానికి అక్కడకు వచ్చాడు. చింతల్లో కేబుల్ వ్యాపారం కూడా చేస్తున్న అంజిరెడ్డి.. ఇంట్లో రాకేష్ మృతదేహం చూసి భయపడ్డాడు. తిరిగి వెళ్తున్న అంజిరెడ్డికి.. జయరామ్ నుంచి సంతకాలు తీసుకున్న ఖాళీ పత్రాలను రాకేష్ ఇచ్చి పంపాడు. ఇలా జయరామ్ కేసులో అంజిరెడ్డి, సూర్య, కిశోర్ నిందితులుగా మారారని డీసీపీ శ్రీనివాస్ పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు. జయరామ్ మేనకోడలు శిఖాచౌదరికి ఈ హత్యతో సంబంధం లేదన్న డీసీపీ.. జయరామ్ భార్య పద్మశ్రీ ఫిర్యాదు మేరకు ఆమెపై నమోదైన కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను విచారించామని.. వారిచ్చిన సమాధానాల ఆధా రంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు. గతంలో ప్రగతి రిసార్ట్స్ యజమానిని బెదిరించి బలవంతంగా భూమిని రాయించుకున్న రాకేష్ అప్పట్లో పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి భయపెట్టించారని డీసీపీ చెప్పారు. చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తు పూర్తికావస్తోందని, 15 రోజుల్లో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తామని తెలిపారు. తెలిసి తప్పు చేయలేదు జయరామ్ హత్య కేసులో గురువారం అరెస్టు అయిన సినీ నటుడు సూర్య విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్‌మీడియాలో బాగా ప్రచారం అవుతోంది. తాను తెలిసి ఏ తప్పూ చేయలేదని ఈ వీడియోలో సూర్య తెలిపాడు. 47 సెకన్ల నిడివితో ఉన్న ఆ వీడియోలో.. ‘హలో అండి నా పేరు సూర్య. ఈ రాకేష్‌రెడ్డి, శిఖా చౌదరి, చిగురుపాటి జయరామ్ కేసులో మాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. యాక్చువల్లీ రాకేష్ నాకు ఫోన్ చేసినప్పుడు కిశోర్ నా పక్కనే ఉన్నాడు. కిశోర్ నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్. నేను మహా అయితే రాకేష్‌ను నాలుగైదుసార్లు కలిశానంతే. కిశోర్ తన పనిలో ఉంటే నేనే అతడికి తీసుకెళ్లాను. ఇక్కడే అన్న పిలిచాడు అంటూ చెప్పి వెళ్లొద్దామని చెప్పి వెళ్లాం. తర్వాత రాకేష్‌రెడ్డి అన్నవాడు మమ్మల్ని ఎలా వాడుకున్నాడో మీకు తెలిసిందే. కిశోర్‌కు డ్రైవింగ్ కూడా రాదు. నేను పిలవడం వల్లే వచ్చాడు. సో.. ప్లీజ్! తెలిసైతే మేము తప్పు చేయలేదు. ప్లీజ్ వీలైతే హెల్ప్ చెయ్యండి’అని అభ్యర్థించాడు. – సూర్య సెల్ఫీ వీడియో -
శిఖా చౌదరికి ఎలాంటి సంబంధం లేదు...
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో అరెస్ట్ అయిన ముగ్గురుని జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ జయరాం హత్యకేసులో వీరి పాత్ర గురించి వివరించారు. జయరామ్‌ను హత్య చేసిన అనంతరం టీడీపీ మంత్రులకు రాకేష్ రెడ్డి ఫోన్ చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. అయితే వారి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. రాకేష్ రెడ్డి ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తామని.. మరో 15 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామన్నారు. కాగా మొత్తం ఈ కేసులో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేశారు. (ఏపీకి చెందిన ఎవరా మంత్రి!?) చీటింగ్ కింద కేసు నమోదు ‘జయరామ్ హత్యకేసులో సూర్య, కిషోర్, అంజిరెడ్డిలు కీలక పాత్ర పోషించారు. కిషోర్ అనే వ్యక్తి హానీ ట్రాప్ చేసి జయరాంను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చారు. వీణ అనే అమ్మాయి పేరు చెప్పి జయరామ్‌ను తీసుకరావాలని సూర్య, కిషోర్‌లకి రాకేష్ రెడ్డి ఆదేశించాడు. దీంతో జయరాంను రాకేష్ రెడ్డిని ఇంటికి తీసుకెళ్లారు. వీరిపై చీటింగ్ కేసు నమోదు చేశాము. హత్య విషయం ముందే తెలిసినా పోలీసులకు అంజిరెడ్డి సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా రాకేష్ రెడ్డి జయరాం వద్ద బలవంతంగా సంతకాలు తీసుకున్న పత్రాలను అంజిరెడ్డి తీసుకెళ్లాడు. శిఖా చౌదరికీ ఈ హత్యకేసుతో ఎలాంటి సంబంధంలేదు. ఆంధ్ర రాజకీయ నాయకులకి రాకేష్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. పోలీసు అధికారులు, రాజకీయం నాయకుల పేర్లు చెప్పి అందరినీ బయపెట్టడం రాకేష్ రెడ్డికి అలవాటు’అంటూ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. (జయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్) మమ్మల్ని వాడుకొని మోసం చేశాడు జయరాం హత్యకేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆర్టిస్టు సూర్య గురువారం మీడియాకు తెలిపారు. కిషోర్‌తో తనకు ఐదేళ్ల నుంచి మంచి స్నేహితుడని, తాను చెప్పడం వల్లే కిషోర్ తనతో రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చాడని పేర్కొన్నారు. అంతకముందు రాకేష్ రెడ్డిని ఐదు సార్లు కలిశానన్నారు. తమను వాడుకొని రాకేష్ రెడ్డి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. -
జయరామ్‌ను హనీట్రాప్ చేయలేదు
-
జయరాం హత్య కేసులో సినీనటుడు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సినీనటుడు సూర్యప్రసాద్, కిశోర్, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాం హత్య విషయం ముందే తెల్సినా అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్ సహకరించడంపై విచారణ చేపట్టారు. ఈ ముగ్గురిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. -
జయరాం హత్యతో సంబంధం లేదు
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యతో తనకు సంబంధం లేదని, హనీ ట్రాప్‌చేసి అతన్ని తీసుకొచ్చాననేది కూడా అవాస్తవమని సినీ నటుడు సూర్యప్రసాద్ తెలిపారు. శనివారం శ్రీనగర్ కాలనీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నిందితుడు రాకేశ్ రెడ్డి కాల్ లిస్టులో తన పేరు ఉండటంతో పోలీసులు విచారణకు పిలిచారని తెలిపారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. రాకేశ్‌తో తనకు సంబంధం ఉన్నది వాస్తవమేనన్నారు. తాను తీసిన కలియుగ సినిమా ప్రమోషన్‌కు రూ.25 లక్షలు అవసరం ఉండటంతో ఓ ఫ్రెండ్ ద్వారా రాకేశ్‌ను కలసి డబ్బులు బదులివ్వాలని అడిగానన్నారు. అందుకు అతను ఒప్పుకున్నాడని, దీని కోసం ఆ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఇచ్చేందుకు అంగీకరించానన్నారు. ఆ డబ్బుల కోసం జనవరి 31న డబ్బులు ఇస్తానంటే వెళ్లినట్లు చెప్పారు. ఇప్పటివరకు శిఖా చౌదరిని చూడలేదన్నారు. జయరాం హత్య జరిగిన విషయాన్ని ఫిబ్రవరి 3న మీడియాలో చూసి షాక్ తిన్నానని చెప్పారు. ఎన్నికలకు ముందు రాకేశ్‌తో పాటు ఆయన స్నేహితులకు కలియుగ సిని మాను ఇంట్లోనే హోం థియేటర్లో చూపించానని వెల్లడించారు. ఈ ఆరోపణలతో తన కుటుంబ సభ్యులు కలత చెందుతున్నారని, బంధువులు, స్నేహితులు సూటిపోటి మాటలతో మానసికంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అందుకే రాకేష్‌రెడ్డిని కలిశా: నటుడు
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటుడు సూర్యప్రసాద్ తెలిపారు. హానీ ట్రాప్ చేసి జయరామ్‌ను తీసుకొచ్చారనేది అవాస్తవమని ‘సాక్షి’ టీవీతో చెప్పారు. జనవరి 28 నుండి 31 వరకు రాకేష్ రెడ్డి ఫోన్ కాల్ లిస్ట్‌లో తన నంబర్ ఎక్కువగా ఉండటం కారణంగానే తనను పోలీసులు విచారణకు పిలిచారని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నిటికి తాను సమాధానం చెప్పానన్నారు. రాకేష్ రెడ్డితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, తన సినిమా ప్రమోషన్ కోసమే అతడిని కలిసినట్టు వెల్లడించారు. (జయరాం హత్య జరగ్గానే ఏపీ మంత్రికి రాకేష్ ఫోన్) ఇప్పటివరకు శిఖా చౌదరిని తాను చూడలేదు, మాట్లాడలేదన్నారు. జయరామ్ హత్య జరిగిన విషయం మీడియాలో చూసి తాను షాక్ అయ్యానన్నారు. హానీ ట్రాప్‌లో తాను ఉన్నాను అన్నప్పుడు బాధ కలిగించిందన్నారు. ‘మీ భర్త హత్య కేసులో నా ప్రేమయం లేదు నమ్మండి’ అంటూ జయరామ్ భార్య పద్మశ్రీని వేడుకున్నారు. తాను నటించిన ‘కలియుగ’ సినిమా ప్రమోషన్ కోసం డబ్బులు సమకూరుస్తాను అంటేనే నేను రాకేష్ రెడ్డిని నమ్మినట్టు చెప్పారు. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచిన సహకరిస్తానని సూర్య అన్నారు. రాకేష్ రెడ్డిని చట్టపరంగా శిక్షించాలని కోరాడు. (రాకేష్ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా) -
ఎవరా ఏపీ మంత్రి!?
సాక్షి, అమరావతి : పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తులో తీగలాగితే పెద్దల డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితుడు రాకేష్ విచారణలో విస్తుగొలిపే నిజాలు వెల్లడిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణాలోని పలువురు పోలీసుల మెడకు చుట్టుకున్న రాకేష్ వ్యవహారం తాజాగా ఏపీలోని టీడీపీ నేతలతో ఉన్న లింకులూ వెలుగుచూస్తున్నాయి. జయరాంను హత్య చేసిన తాను దాని నుంచి బయటపడేందుకు ఏపీలోని ఓ మంత్రి సహాయాన్ని పొందేందుకు ప్రయత్నించానని, అందుకు ఆ మంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ఫోన్లో కోరినట్టు పోలీసు విచారణలో రాకేష్ వెల్లడించినట్టు తెలిసింది. దీంతో ఏపీకి చెందిన ఆ మంత్రి ఎవరన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి నందిగామలో జయరాం మృతదేహం కనుగొన్నప్పుడే టీడీపీ నేతలు కేసును రాకేష్‌రెడ్డి అరెస్టుకే పరిమితం చేసేలా కృష్ణాజిల్లా పోలీసులపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు బలంగా వచ్చాయి. కేసు నుంచి బయటపడేందుకే మంత్రికి ఫోన్ జయరాం హత్యకేసులో తెలంగాణ టీడీపీ నేత బీఎన్‌రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాకేష్ కాల్‌లిస్ట్‌ను పోలీసులు పరిశీలించడంతో ఏపీ మంత్రి ఫోన్ నెంబర్‌కు మాట్లాడిన విషయం బయటపడింది. ఏపీ మంత్రికి ఎందుకు కాల్ చేశావని అడిగితే ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన ఏమైనా సహాయం చేయగలరేమో నేరుగా కలిసి మాట్లాడేందుకు అపాయింట్మెంట్ అడిగినట్టు రాకేష్‌రెడ్డి విచారణలో వెల్లడించినట్టు తేలింది. కాగా, రాకేష్‌రెడ్డి.. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నట్టు ఇటీవల ఫొటోలు చక్కర్లు కొట్టాయి. ఉన్నతస్థాయి పైరవీలకు అధికార టీడీపీ నేతల పరపతిని వాడుకున్నాడని కూడా తెలుస్తోంది. మరోవైపు.. నందిగామ పోలీసులు ఏ మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తారు? అన్న దానిపైనా పోలీసులు కన్నేశారు. నిందితుడికి ఎంత సాన్నిహిత్యం లేకుంటే ఆ మంత్రికి నేరుగా ఫోన్‌చేసి అపాయింట్మెంట్ అడుగుతాడనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాక, సెక్రటేరియేట్‌కు రా కలుద్దామని మంత్రి చెప్పారంటే వారి మధ్య పరిచయం ఎంత బలంగా ఉందో అన్న దానిపైనా విచారణాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘బెదిరించి ప్లాట్లు రాయించుకున్నాడు’ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం మరో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ కాలనీకి చెందిన ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి, ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ జీబీకే రావు, అతని బావమరిది బాబూరావుకు మధ్య బళ్లారిలోని ఫ్యాక్టరీకి సంబంధించి ఆర్థిక విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2017 డిసెంబర్లో రాకేష్ రెడ్డి, బాబూరావుతో పాటు మరికొందరు అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని ప్రగతి రిసార్ట్స్ ప్రధాన కార్యాలయానికి వచ్చాడు. రూ.7.50 కోట్లకు సంబంధించి సెటిల్మెంట్ చేసుకోవాలంటూ లేనిపక్షంలో తన చేతులకు పనిచెప్పాల్సి ఉంటుందని రాకేష్ రెడ్డి జీబీకే రావును బెదిరించాడు. అంతేకాకుండా అతడి భార్యను కిడ్నాప్ చేసేందుకు పథకం పన్నిన రాకేష్ రెడ్డి ఆయన భార్యను గుర్తుపట్ట లేక ఓ మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని గుర్తించి రెండు గంటల్లో వదిలేశారు. అనంతరం జిబీకే రావు కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడు. తనకు పోలీస్ ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు, ఏపీ మంత్రులతో సంబంధాలు ఉన్నాయని తాను ఏం చేసినా ఎవ్వరూ అడిగేవారు లేరని హెచ్చరించాడు. వారిముందే ఏపీకి చెందిన కొందరు మంత్రులు, సిటీలోని కొందరు పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు నటించాడు. తనకు వారంతా అండగా ఉన్నారని విషయం సెటిల్ చేసుకోవాలని బెదిరించాడు. అంతేగాక చిలుకూరు సమీపంలోని ప్రగతి రిసార్ట్స్‌కు చెందిన 16వేల గజాల ప్లాట్లను తన పేరుపై రాయించుకోవడమేగాక జీబీకే రావు భార్య, కుమారుడి బెదిరించి వారితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. డబ్బులు ఇచ్చి పత్రాలు తీసుకెళ్లాలని హెచ్చరించాడు. తాజాగా జయరామ్ హత్యకేసులో రాకేష్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులకు ఈ పత్రాలు లభ్యమయ్యాయి. సదరు ప్లాట్లను వేరొకరికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జయరామ్ హత్యకేసులో రాకేష్ రెడ్డి నిందితుడని తేలడంతో ఈ వ్యవహారంపై జీబీకే రావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాకేష్ రెడ్డి, బాబూరావు తదితరులు తమ కుటుంబ సభ్యులను బెదిరించడమే కాకుండా ప్లాట్లకోసం సంతకం చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు రాకేష్ రెడ్డి బాబూరావు తదితరులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జయరాం హత్య, ఏపీ మంత్రికి రాకేష్ ఫోన్
-
జయరాం హత్య, ఏపీ మంత్రికి రాకేష్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్.. ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఏపీ మంత్రికి ఫోన్ చేసినట్లు స్పష్టమైంది. కేసు దర్యాప్తులో భాగంగా రాకేష్ కాల్ వివరాలు అధ్యయనం చేసిన హైదరాబాద్ పోలీసులు హత్య జరిగిన మరుసటి రోజున నిందితుడి నుంచి సదరు మంత్రికి ఔట్ గోయింగ్ కాల్ ఉన్నట్లు గుర్తించారు. ఓ చిన్న పని ఉందంటూ ఫిబ్రవరి 2న కలుస్తానంటూ నిందితుడు అపాయింట్మెంట్ కోరినట్లు, అందుకు మంత్రి అంగీకరించి విజయవాడ రమ్మని చెప్పినట్లు పోలీసు విచారణలో తేలింది. మంత్రిని కలిసేందుకు నిందితుడు హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు విజయవాడకు విమానం టికెట్ బుక్ చేసుకున్నాడు. అప్పటికే జయరాం హత్య విషయంపై మీడియాలో హంగామా నడుస్తోంది. దీంతో తాను ఇంట్లో ఉంటే పోలీసులకు దొరికిపోతానని గచ్చిబౌలిలో ఉన్న ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని అక్కడ బస చేశాడు. తెల్లవారు జామున రాకేష్ శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతున్న సమయంలోనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏపీ టీడీపీ నేతలతో, మంత్రులతో తనకున్న పరిచయాలతో కేసు నుంచి ఎలాగైనా బయటపడొచ్చనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో హత్య చేసి కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారును నిందితుడు వదిలి వెళ్లాడని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మృతుని భార్య, కుటుంబ సభ్యులు కూడా ఏపీలో అయితే న్యాయం జరగదని, కేసును తారుమారు చేస్తారని ఆరోపించడంతో కేసును తెలంగాణకు బదిలీ చేశారు. ఇప్పుడు వారి ఆరోపణలకు బలం చేకూర్చేలా నిందితుడు మంత్రికి ఫోన్ చేసినట్లు తేలడం చర్చనీయాంశంగా మారింది. మంత్రితో తనకు పరిచయం ఉందని, అయితే ఆ రోజు ఫోన్ చేసినప్పుడు హత్య విషయం చెప్పలేదని రాకేశ్ పేర్కొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఇదిలాఉండగా ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల తారుమారుకు సహకరించిన పోలీసు అధికారులు, చోరీ కేసులో నిందితురాలిగా ఉన్న శిఖా చౌదరిలకు నోటీసులు ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. -
పక్కాపధకం ప్రకారమే జయరాం హత్య
-
జయరాం హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు అయినవారిలో ఎస్ఆర్నగర్ బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్ నేనావత్ నగేష్ అలియాస్ సింగ్ అలియాస్ బాబుసింగ్(35), ఆయన మేనల్లుడు విస్లావత్ విశాల్(20), సుభాష్‌చంద్రారెడ్డి(26) ఉన్నారు. మంగళవారం ఇక్కడ దర్యాప్తు అధికారి కేఎస్ రావుతో కలసి వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. జయరాంను హత్య చేయాలని ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి ముందుగానే పథకం వేసుకొని గత నెల 29న ఎస్ఆర్నగర్ బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్ నేనావత్ నగేష్ అలియాస్ సింగ్ అలియాస్ బాబుసింగ్‌ను తన ఇంటికి పిలిపించాడు. ఇందుకోసం నగేష్ తన మేనల్లుడు విస్లావత్ విశాల్(20)ని రాకేశ్‌రెడ్డికి పరిచయం చేశాడు. రాకేశ్‌రెడ్డి దిండుతో జయరాం ముఖంపై ఒత్తిపెట్టి ఊపిరాడకుండా చేయగా విశాల్ చేతులను గట్టిగా పట్టుకున్నాడు. పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించిన ఘటనను నగేష్ వీడియో తీశాడు. మహబూబ్‌నగర్ జిల్లా న్యూటౌన్ శేషాద్రినగర్‌కు చెందిన లక్ష్మిరెడ్డి సుభాష్‌చంద్రారెడ్డి(26) అల్వాల్ పంచశీల్కాలనీలోని హైటెన్షన్ రోడ్డులో ఉంటున్నాడు. బీటెక్ చదువుకున్న సుభాష్‌చంద్రారెడ్డి ఆఫీస్ అసిస్టెంట్‌గా రాకేశ్‌రెడ్డితో కలసి ఉంటున్నాడు. సుభాష్‌చంద్రారెడ్డి సిమ్‌నే రాకేశ్‌రెడ్డి తన వ్యక్తిగత కార్యకలాపాలకు వాడుతున్నాడు. అదే ఫోన్‌తో వీడియోలను సుభాష్చంద్రారెడ్డికి పంపించాడు. ఈ ముగ్గురు జయరాం హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జయరాంను బెదిరించి ఆయన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఆ తర్వాతనే చంపేద్దామనుకున్నారు. హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్ వద్ద బెదిరించి తెప్పించిన డబ్బులతోపాటు సంతకాలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను తీసుకున్నారు. హత్యకు ముందు ఒక ఇన్స్పెక్టర్, ఆ తర్వాత మరో ఇన్స్పెక్టర్ సలహాలను రాకేశ్‌రెడ్డి తీసుకున్నాడు. ఈ హత్య కేసులో ఐదుగురు పోలీసు అధికారులను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసులు, రాంబాబులతోపాటు మరో వ్యక్తి వివరణ తీసుకున్నారు. శిఖాచౌదరిని ఏడు గంటలపాటు విచారించగా, జయరాం హత్య కేసులో ప్రత్యక్షంగా తన పాత్ర ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. రూ.1.3 కోట్లు శిఖా కోసం తాను ఖర్చు చేసినట్లు రాకేశ్‌రెడ్డి చెప్పగా అలాంటిదేమీ లేదని శిఖా కొట్టిపారేసింది. శిఖాచౌదరి స్నేహితుడు సంతోష్ ద్వారా రాకేశ్‌రెడ్డి పరిచయమయ్యాడు. జయరాం హత్యకేసులో టీడీపీ నేత బీఎన్‌రెడ్డి పాత్రపై ఇంకా విచారిస్తున్నారు. జయరాం హత్య కేసులో శిఖాకు సంబంధముందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
‘జయరాంను హత్య చేస్తూ వీడియో తీశారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాల్, నగేశ్, సుభాష్ చంద్రారెడ్డిలను అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జయరాం హత్య కేసు విచారణపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జయరాం హత్య జరిగిన సమయంలో విశాల్ అనే వ్యక్తి రాకేష్‌తోనే ఉన్నారని చెప్పారు. హత్య చేసే సమయంలో నగేష్ అనే వ్యక్తి మొబైల్లో వీడియో తీశారని.. ఆ దృశ్యాలను సేకరించామని డీసీపీ తెలిపారు. జయరాంను రాకేష్ హత్య చేస్తున్న ఫోటోలను, వీడియోను సుభాష్‌కు పంపారని చెప్పారు. సుభాష్ చంద్రారెడ్డి అనే వ్యక్తి రాకేష్ రెడ్డి స్నేహితుడని, అతని నుంచి మర్డర్‌కు సంబంధించిన వస్తువులను స్వాదీనం చేసుకున్నామన్నారు. పథకం ప్రకారమే జయరాంను కిడ్నాప్ చేసి హత్య చేశారని చెప్పారు. జయరాంను బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకొని అనంతరం హత్య చేశారని చేశారని వివరించారు. హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి ఒక్కరే జయరాం డెడ్ బాడీని తీసుకెళ్లారన్నారు. జయరాంను చిత్రహింసలకు గురిచేసి ఖాళీ బాండు పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి రాకేశ్‌రెడ్డిని పూర్తిగా విచారించామని.. శిఖా చౌదరిపై ఆయన ఎలాంటి ఆరోపణలు చేయలేదని తెలిపారు. ఈ హత్య జరిగిన విషయాన్ని శిఖా చౌదరికి కారు డ్రైవర్ ఫోన్ ద్వారా తెలిపాడన్నారు. జయరాం ఇంట్లోకి అక్రమంగా చొరబడి, డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారనే ఫిర్యాదుపై శిఖా చౌదరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందన్నారు. జయరాం హత్య కేసులో పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయంపై విచారణ కొనసాగుతుందన్నారు. ఐదు మంది పోలీసులకు నోటీసులు ఇచ్చామని, వారిని విచారిస్తామని వెల్లడించారు. (జయరామ్ హత్యకేసు; తెరపైకి కొత్త వ్యక్తి) -
శిఖాచౌదరిపై కేసు నమోదు
హైదరాబాద్: చిగురుపాటి జయరామ్ హత్య కేసుకు సంబంధించి ఆయన మేనకోడలు శిఖా చౌదరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసినరోజు రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–44లోని తన ఇంట్లోకి శిఖాచౌదరి దౌర్జన్యంగా ప్రవేశించి బీరువాలోంచి పత్రాలు ఎత్తుకెళ్లిందని, తనను బెదిరింపులకు గురిచేస్తోందని ఆయన భార్య పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆధారాలివ్వాలని పోలీసులు సూచించడంతో పద్మశ్రీ తండ్రి పిచ్చయ్యచౌదరి ద్వారా సోమవారం పలు ఆధా రాలు అందజేశారు. జయరామ్ మరణవార్త విన్న వెం టనే ఆయన ఇంటికి వెళ్లానని, అక్కడున్న తన ప్రాజెక్టు కాగితాలు తీసుకున్నానని, ఆ సమయంలో వాచ్‌మన్‌నూ లోపలకు తీసుకువెళ్లానని పోలీసుల విచారణలో శిఖాచౌదరి అంగీకరించారు. ఆమె డ్రైవర్, పనిమనిషి, వాచ్‌మన్‌ను విచారించిన అనంతరం ప్రధాన నింది తుడు రాకేష్‌రెడ్డినీ శిఖాచౌదరితో సంబంధాలపై ఆరా తీశారు. జయరామ్ హత్య ఘటనలో శిఖాచౌదరి పాత్ర ఉందని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమె తనను బెదిరిస్తోందని, పలువురితో ఫోన్లు చేయించి భయభ్రాంతులకు గురిచేయిస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాల ని కోరుతూ పద్మశ్రీ మరోమారు పోలీసులను ఆశ్ర యించారు. ఈ మేరకు పద్మశ్రీ తండ్రి ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటన్నింటి నేపథ్యంలోనే శిఖాచౌదరిపై తాజాగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేత రెండోరోజూ విచారణ జయరామ్ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌తో సన్ని హిత సంబంధాలు ఉండటమే కాకుండా పలు సెటిల్మెంట్లు, బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, తెలంగాణ టీఎన్టీయూసీ అధ్యక్షుడు బీఎన్‌రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు రెండోరోజైన సోమవారమూ విచారించారు. బంజారాహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో 3 గంటలపాటు ఆయన్ను విచారించారు. రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు రాకేశ్‌రెడ్డిని తీసుకొని వెళ్లడానికి కారణాలేమిటి? జయరామ్‌తో సెటిల్మెంట్ గురించి ఏం చెప్పాడు? అని ప్రశ్నిం చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రాకేశ్ పరిచయమయ్యాడని, ఖైరతాబాద్ సీటు ఇప్పిస్తానని ఆశచూపాడని బీఎన్‌రెడ్డి పోలీసులకు చెప్పాడు. గత నెల 30న జయరామ్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–10లోని రాకేశ్‌రెడ్డి ఇంటికి వచ్చినప్పుడు మీరూ అక్కడ ఉన్నారట కదా? అని ప్రశ్నించగా తాను ఆ రోజు వెళ్లలేదని బీఎన్‌రెడ్డి చెప్పాడు. హత్య జరగడానికి ఒకరోజు ముందు జయరామ్‌ను బెదిరించేందుకు, రూ.4.50 కోట్ల వ్యవహారం సెటిల్మెంట్ చేసేందుకు బీఎన్‌రెడ్డి వెళ్లినట్లుగా ఉన్న ఆధారాలు చూపడంతో ఆయన ఖిన్నుడైనట్లు తెలిసింది. తనకు జయరాం రూ.4.50కోట్లు ఇవ్వాలని, వాటిని వసూలు చేసి పెడితే ఎన్నికల ఖర్చులకు రూ.2 కోట్లు ఇస్తానని రాకేష్ చెప్పడంతో సెటిల్మెంట్కు బీఎన్‌రెడ్డి ముందు కొచ్చాడని తెలుస్తున్నది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాలని బీఎన్‌రెడ్డికి పోలీసులు స్పష్టం చేశారు. ఇతర రాజకీయ పార్టీల నేతలెవరైనా రాకేష్‌తో పరిచయాలు కలిగి ఉన్నారా? అని కూడా పోలీసులు ఆరా తీశారు. మొత్తానికి ఈ కేసు కొత్త రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జయరామ్ హత్యకేసు; తెరపైకి కొత్త వ్యక్తి
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో మరో కొత్త వ్యక్తి తెరపైకి వచ్చారు. సుభాష్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జయరామ్ హత్య అనంతరం సుభాష్ రెడ్డి కి రాకేశ్‌రెడ్డి ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నగేష్, విశాల్, సుభాష్ రెడ్డిలను పోలీసులు రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. శిఖా చౌదరిపై మరోసారి ఫిర్యాదు జయరాం హత్యకు గురైన తర్వాత ఆయన ఇంట్లో నుంచి శిఖా చౌదరి కీలక పత్రాలు తీసుకెళ్లినట్టు ఆయన భార్య పద్మశ్రీ మరోసారి ఫిర్యాదు చేశారు. తాను అమెరికాకు వెళ్లిపోవడంతో తన తండ్రి పిచ్చయ్య చౌదరితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. శిఖా చౌదరిపై ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఆధారాలను పోలీసులకు ఆయన సమర్పించారు. ఫిర్యాదు ఆధారంగా శిఖా చౌదరిపై కేసు నమోదు చేయనున్నారు. కొనసాగుతున్న దర్యాప్తు కాగా, ఈ కేసులో ఇప్పటివరకు100 మందిని పోలీసులు విచారించించారు. నిందితుడితో టచ్‌లో ఉన్న పోలీసు అధికారులపై ఇప్పటికే బదిలీ వేటు వేశారు. మరోవైపు రెండో రోజు కూడా టీడీపీ నాయకుడు బిఎన్ రెడ్డిని పోలీసులు విచారించారు. (‘జయరాం కేసు’లో విచారణకు హాజరైన టీడీపీ నేత) -
‘జయరాం కేసు’లో విచారణకు హాజరైన టీడీపీ నేత
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో సన్నిహిత సంబం ధాలున్నాయన్న వాటిపై ఆరా తీసేందు కు, ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయన్నదాన్ని తెలుసుకునేందుకు నగర టీడీపీ సీనియర్ నేత, తెలంగాణ టీడీపీ టీఎన్టీయూసీ అధ్యక్షుడు బీఎన్.రెడ్డిని ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావు కార్యాలయంలో గంటన్నరపాటు బీఎన్.రెడ్డిని విచారించిన పోలీసులు రాకేష్‌రెడ్డి ఎలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం,అతడిని రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు తీసుకెళ్లడానికి గల కారణాలేంటి అన్న మూడు అంశాలపైనే విచారణ చేశారు. ఇరవై రోజుల కిందట బీఎన్.రెడ్డి తన స్నేహితుడు రాకేశ్‌రెడ్డిని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ రాంబాబుతో గంటపాటు మంతనాలు జరిపారు. రాంబాబు తనకు బాగా తెలుసునని ఏ పనై నా చేసిపెడతాడంటూ బీఎన్.రెడ్డి నమ్మించడం తో రాకేశ్‌రెడ్డి తన కారులోనే రాయదుర్గం పీఎస్‌కు అతనితో వెళ్లాడు. జయరాం సెటిల్మెంట్లో తనకు సహకరించాలని రాకేశ్‌రెడ్డి సీఐ రాంబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలి విచారణ లో రాంబాబు ఇదే విషయాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్‌కు తెలియజేశారు. దీంతో బీఎన్.రెడ్డిని విచారణకు హాజరుకావాలని శుక్రవా రం రాత్రి ఫోన్ చేయగా ఆయన ఆదివారం విచారణకు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తాను ఖైరతాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడు రాకేశ్‌రెడ్డి పరిచయం అయ్యాడని ఆయన కూడా టీడీపీ నేత కావడంతో పలుమార్లు మాట్లాడినట్లు, అంతకుమించి తమ మధ్య ఏమీలేదని బీఎన్.రెడ్డి పోలీసులకు తెలిపారు. మొత్తానికి ఈ కేసులో పలువురు టీడీపీ నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది. -
ముగిసిన రాకేశ్‌రెడ్డి పోలీసు కస్టడీ
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో పాటు డ్రైవర్ శ్రీనివాస్ పోలీసు కస్టడీ శనివారం ముగిసింది. బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావుతోపాటు వెస్ట్‌జోన్ డీసీపీ ఎఆర్.శ్రీనివాస్ నిందితులను 8 రోజులపాటు విచారించారు. శనివారం వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరితో పాటు రౌడీషీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులు, రాంబాబును కూడా విచారించారు. జయరాంను హత్య చేశాక సీఐ రాంబాబు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి 2 సార్లు రాకేశ్‌తో మాట్లాడినట్లు తేలింది. ఏసీపీ మల్లారెడ్డి విచారణ సందర్భంగా.. బంజారాహిల్స్ సీఐ గోవిందరెడ్డి తనకు రాకేశ్‌ను పరిచయం చేశా రంటూ పోలీసులకు చెప్పారు. దీంతో గోవిందరెడ్డి, హరిశ్చంద్రారెడ్డిని సీసీఎస్‌కు అటాచ్ చేస్తూ శుక్రవా రం ఉత్తర్వులిచ్చారు. జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యా దు మేరకు శిఖా చౌదరి, ఆమె పని మనిషి, వాచ్మెన్ల నుంచి సమాచారం సేకరించారు. సినీనటుడు సూర్య ప్రసాద్‌ను విచారించారు. ఇక రాకేశ్ మిత్రులు నాగ వెంకటేష్, శంకర్, సింగ్‌లను విచారించాలని భావిస్తు న్నారు. రాకేశ్‌తో సన్నిహిత సంబంధాలున్న ఓ నేత ను కూడా ఆదివారం విచారించే అవకాశముంది. -
బయటపడుతున్న రాకేష్‌రెడ్డి అక్రమాలు
-
రాకేష్ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యలో ప్రధాన సూత్రధారి రాకేష్‌రెడ్డి అక్రమాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. కస్టడీలో భాగంగా రాకేష్ రెడ్డిని విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులకు ఆశ్చర్యపోయే రీతిలో అతడి అక్రమ లీలలు తెలుస్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు, హత్యలతో గత ఏడాదిన్నర కాలంగా అటు పోలీసులతోను, ఇటు అధికారులతోను సంబంధాలు పెట్టుకొని రాకేష్ రెడ్డి ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. జయరాంను హత్య చేసిన తర్వాత రాకేష్‌రెడ్డి ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం ఇన్స్పెక్టర్ రాంబాబు, నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న ఘటనలో ఆ ముగ్గురినీ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా రాకేష్‌రెడ్డితో సంబంధాలున్నట్లు కాల్‌డేటాలో తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు చింతల్, కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన శ్రీధర్, రాజేశ్ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గురువారం విచారించారు. రాకేష్‌రెడ్డితో వారికి ఎలాంటి సంబంధాలున్నాయి? ఎప్పటి నుంచి పరిచయం అన్నదానిపై ఆరా తీశారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అక్రమాలు, కబ్జాలకు పాల్పడినట్లు తెలిసింది. వీటిపై కూడా ఆరా తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణకు సంతోష్‌రావు కూడా.. అనంతరం శిఖా చౌదరి సన్నిహితుడు సంతోష్‌రావు అలియాస్ శ్రీకాంత్‌రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. జయరాం గత నెల 31న హత్యకు గురికాగా అదేరోజు రాత్రి శిఖా చౌదరి తన స్నేహితుడు సంతోష్‌రావుతో అనంతగిరి ప్రాంతానికి నైట్‌రైడింగ్‌కు వెళ్ళినట్లు చెప్పడంతో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు సంతోష్‌రావును పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఆమెతో ఎలాంటి సంబంధాలున్నాయి? ఎప్పటి నుంచి సంబంధాలున్నాయి? జయరాం హత్య జరిగిన విషయం ఎప్పుడు తెలిసింది? హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరిని కలిశారా అన్న కోణంలో విచారణ జరిగింది. వీరిద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు ఉండేవన్న దానిపై కూడా ఆరా తీశారు. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ఇటు సంతోష్‌రావును వేర్వేరుగా నాలుగు గంటల పాటు విచారించారు. శుక్ర, శని వారాల్లో కూడా ఇంకో 30 మంది వరకు విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరందరికీ పోలీసులు ఫోన్లు చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. రాకేష్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న పలువురు రాజకీయ నాయకులు కూడా విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జయరాం కేసు: రౌడీషీటర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసుతో సంబంధం ఉన్న నగేష్, విశాల్ అనే ఇద్దరు రౌడీ షీటర్ల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జయరాం హత్యకేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులకు ఆరో రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు ఆయనతో సంబంధాలున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. జయరాం హత్యకు ముందు 48 గంటలు, తర్వాత 48 గంటలు రాకేష్ రెడ్డితో టచ్‌లో ఉన్నవారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితురాలు శ్రిఖా చౌదరీ స్టేట్మెంట్ను పోలీసులు మరోసారి రికార్డు చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు 60 మందిని పోలీసులు విచారించారు. శనివారం అనుమానం ఉన్న మరి కొద్ది మందిని కూడా విచారిస్తామని పోలీసులు వెల్లడించారు. జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..! నగేశ్ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్ -
ఖాకీ, ఖద్దరు ప్రమేయంపై ఆరా!
హైదరాబాద్: ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు రెండో అంకానికి తెరలేపారు. ఇప్పటి వరకు రాకేశ్‌రెడ్డి వ్యవహారం, హత్య జరిగిన తీరు, ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారి వివరాలు ఆరా తీశారు. ఇక నుంచి రాకేశ్‌రెడ్డికి సహకరించినట్లు, అతడితో సంబంధాలు నెరపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాకీలు, ‘ఖద్దరు’పై దృష్టి పెట్టారు. ప్రాథమికంగా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట, రాయదుర్గం ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబుల్ని దర్యాప్తు అధికారి కె.శ్రీనివాసరావు బుధవారం విచారించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు పోలీసు అధికారుల్నీ త్వరలో విచారించే అవకాశం ఉందని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. రాకేశ్‌రెడ్డితో కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలో వారినీ విచారణకు పిలవాలని భావిస్తున్నారు. మల్లారెడ్డితో పాటు శ్రీనివాసులు, రాంబాబుల్ని పోలీసులు బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల పాటు విచారించారు. హత్య జరగక ముందు, జరిగిన తర్వాత రాకేశ్‌రెడ్డి చేసిన ఫోన్‌కాల్స్ ఆధారంగా విచారణ జరిగింది. గొడవ విషయాన్నే చెప్పాడు... మల్లారెడ్డి తన వాంగ్మూలంలో.. ‘రాకేశ్‌రెడ్డి ఫోన్ చేసినప్పుడు స్నేహితుల మధ్య గొడవ విషయాన్ని చెప్పాడు. అతడు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోయా. ఈ నేపథ్యంలో మిస్డ్‌కాల్ చూసుకుని నేనే చేశా’అని పేర్కొన్నారని తెలిసింది. హత్య చేసిన రోజు రాకేశ్ తన వద్దకు వచ్చాడని, అయితే తాను ఆ సమయంలో పోలీసుస్టేషన్లో లేనని శ్రీనివాసులు తెలిపారు. తాను ఓ కూల్చివేత వద్ద ఉంటే రాకేశ్ అక్కడకొచ్చి కలిశాడని, కారు దూరంగా ఆపడంతో అందులో శవం ఉందన్న విషయం తాను గుర్తించలేదని పేర్కొన్నట్లు తెలిసింది. రాంబాబు సైతం రాకేశ్ తనతో మాట్లాడిన విషయం వాస్తవమే అని అంగీకరించినప్పటికీ హత్య విషయం చెప్పలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. వీరి వాంగ్మూలాల్లోని వాస్తవాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరాన్ని బట్టి మరోసారి వీరిని పిలిచి విచారించాలని, వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాకేశ్ నుంచి ఫోన్ అందుకున్న రాంబాబు మరో ఇన్స్పెక్టర్కు ఫోన్ చేశారని, ఆయన కూడా రాకేశ్‌కు కాల్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. అయితే విషయాన్ని ధ్రువీకరించిన పోలీసులు మరో ఇద్దరు పోలీసుల్ని విచారించనున్నారని మాత్రం చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, మరో నేత.. జయరామ్ భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదులోని ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు అంటున్నారు. రాకేశ్... జయరామ్‌ను హత్య చేసిన విషయం మీడియాలో వచ్చేంత వరకు తమకు తెలియదని విచారణ నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులు పేర్కొన్నట్లు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. హత్య జరిగిన తర్వాత రాజకీయ నేతలతో రాకేశ్‌రెడ్డి మాట్లాడిన డాటాను కూడా సేకరించిన పోలీసులు ఆ వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మాజీ ఎమ్మెల్యేని, మరో రాజకీయ నాయకుడిని ప్రశ్నించాలని యోచిస్తున్నారు. జయరామ్ హత్యలో సినీ నటుడు సూర్య ప్రసాద్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైతే చర్యలు తప్పవని పేర్కొంటున్నారు. అతడు కేవలం జయరామ్‌ను మభ్యపెట్టి రాకేశ్ వద్దకు తీసుకొచ్చినట్లు తెలుస్తోందని, భవిష్యత్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. శిఖా చౌదరి, జయరామ్ బ్యాంకు స్టేట్మెంట్లను బట్టి వారి మధ్య రూ.లక్షల్లో లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు. జయరామ్ తన అకౌంట్ నుంచి నేరుగా శిఖా చౌదరి అకౌంట్‌కు డబ్బులు పంపినట్లు తేల్చారు. -
‘పోలీసుల పాత్ర ఉంటే వారిపై చర్యలు’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పోలీసుల పాత్ర ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ ఎఆర్ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌లను తప్పించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. కేసుతో సంబంధం ఉన్న అధికారులనుంచి అన్ని విషయాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు. హత్య జరగకముందు జరిగిన తరువాత కాల్ డేటా ఆధారంగా వారిని ప్రశ్నించినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాకేశ్ రెడ్డి.. స్నేహితుల మధ్య గొడవ విషయాన్ని మాత్రమే ఫోన్ కాల్లో చెప్పినట్లు ఏసీపీ తెలిపాడు. రాకేశ్ రెడ్డి.. మల్లారెడ్డికి కాల్ చేస్తే మొదట లిఫ్ట్ చెయ్యలేదు. తరువాత మిస్డ్ కాల్స్ చూసుకొని మల్లారెడ్డి రాకేశ్ రెడ్డికి కాల్ చేశాడు. నటుడు సూర్య ప్రసాద్ మభ్య పెట్టి జయరాంను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చాడు. రాకేష్‌తో టచ్‌లో ఉన్న మరి కొంత మంది పోలీస్ ఉన్నతాధికారులను కూడా విచారణకి పిలుస్తాం. జయరామ్ భార్య పద్మ శ్రీతో మేము టచ్‌లో ఉన్నాము. ఆమెకు ఉన్న అనుమానాలను తీర్చుతాము. రాయదుర్గం సీఐ ఫోన్ కాల్ తరువాత జూబ్లీహిల్స్ పోలీసులకు రాకేశ్ ఫోన్ చేశాడు. రాకేశ్ రెడ్డికి టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయనేది వాస్తవం. అన్ని పార్టీల నేతలతో రాకేశ్ టచ్‌లో ఉన్నాడు. హత్య జరిగిన తరువాత రాజకీయ నేతలలెరితోనూ రాకేశ్ మాట్లాడలేదు. 53 ఎకరాల భూమిలో 6 ఎకరాలు రాకేశ్ రెడ్డి కబ్జా చెయ్యాలని ప్రయత్నం చేశాడని’ వెల్లడించారు. -
‘పోలీసుల పాత్ర ఉంటే వారిపై చర్యలు’
-
రాకేష్ రెడ్డి నా దగ్గరకొచ్చి మాట్లాడాడు: సీఐ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు బుధవారం విచారణకు హాజరు అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్ ఇవాళ విచారణకు వచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి ...జయరామ్ హత్యకు ముందు, అనంతరం పోలీస్ అధికారులతో ఫోన్లలో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ఓ పోలీస్ అధికారి నిందితుడికి సలహా ఇవ్వడంపై విచారణ అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. మొదట జయరామ్ కేసును పరిచయమున్న పోలీసు అధికారుల సాయంతో రాకేష్ రెడ్డి పోలీస్ స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకున్నప్పటికీ.. అది కుదరకపోవడంతో జూబ్లీహిల్స్‌లో తన ఇంట్లోనే హత్య చేశాడు. మరోవైపు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం నిందితులతో క్రైమ్ రీ–కన్స్ట్రక్షన్ నిర్వహించారు. (స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకుని!) రాకేష్ రెడ్డి నా దగ్గరకొచ్చి మాట్లాడాడు: సీఐ శ్రీనివాస్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ శ్రీనివాస్... రాకేష్ రెడ్డి తన దగ్గరకు వచ్చి మాట్లాడినట్లు అంగీకరించారు. అయితే జయరామ్ హత్య విషయం తనతో చెప్పలేదని అన్నారు. గతంలో ఉన్న పరిచయంతోనే రాకేష్ రెడ్డి తన దగ్గరకు వచ్చాడని, అయితే తాను తర్వాత మాట్లాడతానని చెప్పడంతో వెళ్లిపోయినట్లు సీఐ తెలిపారు. ఆ తర్వాత తనతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. -
స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకుని!
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యకు ముందు ఓ అధికారి, తర్వాత మరో అధికారితో రాకేష్‌రెడ్డి సంభాషించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇన్స్పెక్టర్ హోదాల్లో ఉన్న ఈ ఇద్దరితోపాటు మరో ఏసీపీని పిలిచి విచారించాలని నిర్ణయించారు. బుధ, గురువారాల్లో ఈ విచారణ జరనగనుందని సమాచారం. మొదట జయరామ్ కేసును పరిచయమున్న పోలీసు అధికారుల సాయంతో స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకున్నప్పటికీ.. అది కుదరకపోవడంతో జూబ్లీహిల్స్‌లో తన ఇంట్లోనే రాకేష్ హత్యచేశాడని తెలిసింది. మరోవైపు, కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం నిందితులతో క్రైమ్ రీ–కన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఇందులో భాగంగా నిందితులను జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 లోని రాకేష్ ఇంటి నుంచి నందిగామ వరకు తీసుకువెళ్లి వచ్చారు. జయరామ్‌ను వీణా పేరుతో ‘హనీట్రాప్’ చేసిన రాకేష్.. ఆయన్ను బంధించడానికి సహకరించాల్సిందిగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న అధికారిని సంప్రదించాడు. జయరామ్‌ను తీసుకొచ్చి పోలీసుస్టేషన్లోనే ఉంచాలని, ఆపై డబ్బు వసూలుతోపాటు పత్రాలపై సంతకాలు తీసుకుందామని అన్నాడు. అయితే అలా చేయడం తనకు ఇబ్బందికరంగా మారుతుందని ఆ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి చెప్పాడు. దీంతో తానే రంగంలోకి దిగిన రాకేష్ గత నెల 30న జయరామ్‌ను జూబ్లీహిల్స్ క్లబ్ వరకు రప్పించి తన ఇంటికి వచ్చేలా ప్లాన్ వేశాడు. రెండ్రోజులపాటు బంధించి! ఆహారం, మద్యం అందిస్తూ రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు. తొలుత కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్ పేపర్లపై బలవంతంగా జయరామ్‌తో సంతకాలు చేయించుకున్న రాకేష్.. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరామ్‌తో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్ చేసుకున్నాడు. ఈ డబ్బును తన ఇంట్లో తానే జయరామ్‌కు ఇస్తున్నట్లు నటిస్తూ విశాల్‌తో వీడియో రికార్డింగ్ చేయించాడు. జయరామ్ తన దగ్గర అప్పు తీసుకున్నాడని చెప్పేందుకు ఆధారంగా ఉంటుందనే ఈ వీడియా ప్లాన్ వేశాడు. ఆ సమయంలోనూ సైబరాబాద్ ఇన్స్పెక్టర్కు కాల్ చేసిన రాకేష్.. ఆ ఫోన్ జయరామ్‌కు ఇచ్చి మాట్లా డించాడు. అప్పుడు మాట్లాడిన సదరు పోలీసు అధికారి.. రాకేష్ ఇవ్వాల్సిన, అతడు కోరిన మొత్తం ఇవ్వాలంటూ జయరామ్‌ను హెచ్చరించాడు. హైదరాబాద్ టు నందిగామ హత్య చేశాక జయరాం శవాన్ని ఆయన కారులోనే పెట్టుకుని నల్ల కుంట పోలీసుస్టేషన్‌కు రాకేష్ వెళ్లాడు. తనకు పరిచయస్తుడైన ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుకు ఫోన్ చేశాడు. తాను ఆంధ్రమహిళా సభ ఆస్పత్రి వద్ద ఉన్నానంటూ చెప్పడంతో అక్కడకు వెళ్లిన రాకేష్ కారు దూరంగా ఆపి ఇన్స్పెక్టర్ను కలిశాడు. హత్య విషయం ఆయనకు చెప్పగా.. దాన్ని అతిగా మద్యం సేవించడంతో జరిగిన రోడ్డు ప్రమాదంగా మార్చాలని సూచించాడు. హైదరాబాద్ లేదా చుట్టుపక్కల అలా చేస్తే సీసీటీవీలు ఇతర ఆధారాలతో పోలీసులు పట్టుకుంటారని, ఏపీకి తీసుకువెళ్లి సీన్ క్రియేట్ చేయమని సలహా ఇచ్చాడు. దీంతో రాకేష్ విజయవాడ వైపు బయలుదేరాడు. మధ్యలో రాకేష్‌కు ఏసీపీ మల్లారెడ్డి ఫోన్ చేశాడు. ఆదిభట్లలో ఉన్న ఓ ల్యాండ్ వివాదం నేపథ్యంలో వీరికి పరిచయం ఉంది. ఆపై నందిగామ వరకు వెళ్లి ఓ బార్లో బీరు బాటిళ్లు కొని ఐతవరంలో రోడ్డు కిందకు కారు వదిలేసి వెనక్కు వచ్చేశాడు. గతంలో రాకేష్ ఇంట్లో క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు మంగళవారం అక్కడినుంచి నల్లకుంటకు, నందిగామ, ఐతవరం వరకు వెళ్లి ఈ ప్రక్రియ చేసి వచ్చారు. వీరి వెంట నిందితులు సైతం ఉన్నారు. విచారణలో నింది తులు చెప్పిన వివరాలు, రీ–కన్స్ట్రక్షన్లో గుర్తించినవి ఒకేలా ఉన్నాయ ని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్ని మరో 2రోజుల్లో పిలిచి విచారించాలని నిర్ణయించారు. -
జయరామ్ హత్య కేసులో 50 మందిని విచారించాం
-
జయరాం హత్య కేసులో పోలీసుల పాత్రపై విచారణ
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని తన ప్లాట్‌లో గత నెల 31న కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాంను హత్య చేసిన అనంతరం నిందితుడు రాకేష్‌రెడ్డి ఐదుగురు పోలీసు అధికారులతో మాట్లాడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ తెలిపారు. సదరు అధికారులను విచారిస్తామని ఏ పరిస్థితుల్లో వారు మాట్లాడాల్సి వచ్చిందో విశ్లేషించేందుకు కాల్‌డేటాను పరిశీలించనున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్, రౌడీషీటర్ నగేష్, అతడి అల్లుడు విశాల్, సినీ నటుడు సూర్యలను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం కేసు పురోగతిని వెల్లడించారు. పోలీసు అధికారుల ప్రమేయంపై త్వరలోనే విచారణ చేపడతామన్నారు. గత నాలుగు రోజులుగా ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించామని, బ్యాంకు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలించినట్లు తెలిపారు. రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లతోపాటు రౌడీషీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్ నిందితులుగా ఉన్నారన్నారు. రాకేష్‌రెడ్డి, జయరాంకు డబ్బులు ఇచ్చాడనే విషయంపై స్పష్టత రాలేదన్నారు. ఇప్పటి వరకు 50 మందిని విచారించామని, పద్మశ్రీ ఫిర్యాదుపై కూడా విచారణ జరుగుతుందన్నారు. జయరాం, షికా చౌదరి మధ్య కొన్ని బ్యాంకు లావాదేవీలు జరిగాయని, అయితే హత్యతో వాటికి సంబంధం ఉన్నట్లు చెప్పలేమన్నారు. రాకేష్‌రెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని అతడికి ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్ లేదని అన్నీ నగదు లావాదేవీలు చేసినట్లు డీసీపీ పేర్కొన్నాడు. -
రాకేశ్‌రెడ్డికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు
సాక్షి, బంజారాహిల్స్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి ఇప్పటివరకు సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, ఇప్పటివరకు అన్ని క్యాష్ లావాదేవీలు మాత్రమే చేశాడని, అతను గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం విలేకరులకు తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి చాలామందిని విచారించామని, పలువురి బ్యాంకు ఖాత్యాలు, ఇతర పత్రాలను పరిశీలించామని ఈ కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు రౌడీషీటర్ నగేష్, అతని అల్లుడు విశాల్ ప్రేమయం ఉందని విచారణలో తేలిందని తెలిపారు. పోలీస్ అధికారుల ప్రమేయంపైనా త్వరలోనే విచారణ జరుపుతామని వెల్లడించారు. రాకేశ్ రెడ్డి జయరామ్‌కు డబ్బులు ఇచ్చాడా? అనే విషయంపై స్పష్టత రాలేదని, ఇప్పటివరకు 50 మందికిపైగా విచారించామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డి గతంలో పోలీసులతో మంతనాలు జరిపిన విషయం వాస్తవమేనని ఏఆర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. హత్య జరిగిన తరువాత ఐదుగురు పోలీసులతో రాకేశ్ మాట్లాడాడని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇబ్రహీపట్నం సీఐ, నల్లకుంట ఎస్సైలను విచారిస్తామని తెలిపారు. జయరామ్ భార్య పద్మశ్రీ ఫిర్యాదుపై కూడా విచారణ జరుగుతోందని, జయరాం, శిఖా చౌదరి మధ్య కొన్ని బ్యాంక్ లావాదేవీలు జరిగాయని తెలిపారు. కానీ ఆయన హత్యకు ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్లు ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ కేసులో ఇంకెవరికైనా ప్రమేయముందా? అనేదానిపై కాల్‌డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
జయరామ్‌ను హత్యచేస్తూ వీడియో!
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసు విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితుడు రాకేష్ రెడ్డిలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. పక్కా పథకం ప్రకారమే జయరామ్‌ను హతమార్చినట్లు ఇప్పటికే నిర్థారణకు వచ్చిన పోలీసులు...అందుకు సంబంధించి ఓ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. జయరామ్ హత్యకు ముందు ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయిస్తున్నప్పడు, హత్య చేస్తున్నప్పడు నిందితుడు తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసినట్లు గుర్తించిన పోలీసులు... ఆ సమయంలో రౌడీ షీటర్ నగేష్, అతడి మేనల్లుడు విశాల్ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. కాగా ఏ పని చేసినా రాకేష్ రెడ్డికి వీడియో తీసే అలవాటు ఉండటంతో ...ఇప్పుడు ఆ వీడియోనే అతడి కష్టాలు తెచ్చిపెట్టింది. మరోవైపు ఈ కేసులో నిందితుడు రాకేష్ రెడ్డికి పోలీస్ అధికారుల మధ్య సంబంధాలపై కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం ఏపీసీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌కు ఇప్పటికే నోటీసులు అందాయి. వీరిని బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేయనున్నారు. అలాగే ఈ కేసులో అయిదుగురి ప్రమేయం ఉన్నట్లు ఓ నిర్థారణకు వచ్చిన పోలీసులు ఓ వైపు సంబంధించి అనుమానితులను విచారిస్తూనే మరోవైపు రాకేష్‌రెడ్డి కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన రోజు, ఆ తెల్లవారి, అంతకుముందు వారం రోజులు ఎవరెవరికి ఫోన్లు చేశారనే వివరాలను సేకరిస్తున్నారు. హత్య ఘటన కంటే ముందు వారం రోజులు, ఆ తర్వాత రెండు రోజులు చేసిన మొత్తం 300 పైగా కాల్స్ వివరాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఎనిమిది రోజుల కస్టడీలో పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని, కేసులో పురోగతి కనిపిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. -
రాకేష్ పోలీస్ కస్టడీ పొడిగింపు
హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కవకుంట్ల రాకేష్‌రెడ్డి, మరో నిందితుడు దున్న శ్రీనివాస్‌లను మరో 8 రోజులపాటు పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇప్పటికే మూడు రోజులపాటు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు విచారించినా దర్యాప్తులో పెద్దగా పురోగతి కనిపించలేదు. మరింత సమాచారం, క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సమయం కావాలని, అందుకే వీరిద్దరి కస్టడీని పొడిగించాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులుకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు శనివారం ఉదయం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ పొడిగింపునకు అనుమతిస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను పోలీసులు జైలు సూపరింటెండెంట్‌కు అందజేసి మళ్లీ వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. హత్యలో ఐదుగురి పాత్ర... జయరాం హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులను ఒక్కొక్కరిని గుర్తిస్తున్నట్లు తెలుస్తున్నది. నగేష్ అనే రౌడీషీటర్ అల్లుడు విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సినీనటుడు సూర్య పోలీసుల అదుపులోనే ఉన్నాడు. రాకేష్‌రెడ్డి ఇంట్లో హత్య జరిగిన రోజున డైనింగ్ టేబుల్‌పై ఐదు ప్లేట్లు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ హత్యలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ల పాత్రలను గుర్తించారు. ఇంకో ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొకరు ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. కేసుకు సంబంధించి అనుమానితులను విచారిస్తూనే రాకేష్‌రెడ్డి కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన రోజు, ఆ తెల్లవారి, అంతకుముందు వారం రోజులు ఎవరెవరికి ఫోన్లు చేశారనే వివరాలను సేకరిస్తున్నారు. హత్య ఘటన కంటే ముందు వారం రోజులు, ఆ తర్వాత రెండు రోజులు చేసిన మొత్తం 300 పైగా కాల్స్ వివరాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ 8 రోజుల కస్టడీలో పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని, కేసులో పురోగతి కనిపిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా రాకేష్‌రెడ్డిని విచారించడానికి బంజారాహిల్స్ ఠాణాకు రానున్నారు. -
జయరామ్ హత్యకేసు: వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు
-
అతడి ఇంట్లో శవాన్ని చూసి పారిపోయారు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఈ హత్యకేసుకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లకు చెందిన ఓ కౌన్సిలర్ భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంజిరెడ్డి, శ్రీను, రాములు అనే వ్యక్తులు రాకేష్‌రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాకేష్ రెడ్డి తనకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అంజిరెడ్డి వెల్లడించాడు. రాకేష్ రెడ్డి.. జయరాంను హత్య చేసిన తర్వాత అంజిరెడ్డిని ఇంటికి పిలిపించాడని, రాకేష్ ఇంట్లో జయరాం మృతదేహాన్ని చూసిన అంజిరెడ్డి, అతని మిత్రులు అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసు విచారణలో తేలింది. హత్య జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచిన కారణంగా అంజిరెడ్డి, అతని మిత్రులను పోలీసులు విచారిస్తున్నారు. జయరాం హత్యకేసు ప్రధాన నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టు మరోసారి 8 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. పోలీసులు నిందితులను చంచల్ గూడ జైలునుంచి బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించనున్నారు. -
టీడీపీ కీలక నేతలతో రాకేష్‌కు సన్నిహిత సంబంధాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కస్టడీని నాంపల్లి కోర్టు పొడిగించింది. ఈ కేసు విచారణలో భాగంగా రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్ కస్టడీ ముగియడంతో పోలీసులు శనివారం వారిని కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరిని మరో ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు రాకేష్ రెడ్డి అక్రమాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, పోలీసు అధికారులతో పాటు, రౌడీ షీటర్‌తో ఉన్న సంబంధాలు ఇలా ఎన్నో కీలక విషయాలు వెలుగు చూశాయని పోలీసులు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ చేయడం కోసం రాకేష్ రెడ్డి కస్టడీని పొడగించాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అందుకు కోర్టు అనుమతినిస్తూ ఫిబ్రవరి 23 వరకు రాకేష్ రెడ్డితో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టీడీపీ కీలక నేతలతో రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రాకేష్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసిందన్నారు పోలీసు అధికారులు. ఈ క్రమంలో పదవులు, సీట్లు ఇప్పిస్తానంటూ పలువురు నాయకులతో రాకేష్ రెడ్డి బేరసారాలు జరిపాడని.. భారీగా నగదు చేతులు మారినట్లు గుర్తించామన్నారు. రాకేష్ వ్యవహారం బయటకు రావడంతో తమకు న్యాయం చేయాలంటూ ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరిగిందని పోలీసులు తెలిపారు. -
కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం రాకేష్..!
సాక్షి, హైదరాబాద్: నగరశివార్లలోని టెట్రాన్ కంపెనీసహా ఖాయిలాపడ్డ పరిశ్రమల భూముల్ని కబ్జా చేయడానికే జయరాం హత్యకు రాకేష్‌రెడ్డి కుట్ర చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆఖరి నిమిషం వరకు ఇతర నిందితులకూ తెలియకుండా రాకేష్ గోప్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. వీణ పేరుతో ‘హనీట్రాప్’చేసి జయరాంను జూబ్లీహిల్స్ క్లబ్ వద్దకు రాకేష్ రెడ్డి రప్పించాడు. అక్కడి నుంచి అతడిని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఇంటికి తీసుకొచ్చింది మాత్రం కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలుస్తోంది. రాకేష్ రెడ్డితో పాటు నిందితులు శ్రీనివాస్, నగేష్, విశాల్‌ల పాత్రపై ఇప్పటికే స్పష్టత వచ్చినప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్ సూర్య, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీను, రామ్‌ల పాత్రపై లోతుగా ఆరా తీస్తున్నారు. జయరాం భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు, విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా శిఖా చౌదరిపై చోరీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. లోతుగా విచారించడం కోసం రాకేష్, శ్రీనివాస్‌ల కస్టడీ గడువును మరో మూడు రోజులు పొడిగించాల్సిందిగా కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 15 ఎకరాల భూమిపై కన్నేసి! జయరాం,అతడి భార్య పద్మశ్రీ ప్రవాస భారతీయులుగా ఉండటం, కంపెనీల వ్యవహారాలు చక్కబెట్టడంలో శిఖా చౌదరి విఫలం కావడంతో టెట్రాన్తో పాటు మరో కంపెనీ సైతం లాకౌట్లోకి వెళ్లాయి. కంపెనీలు పని చేయకపోయినా అవి విస్తరించి ఉన్న దాదాపు 15 ఎకరాల స్థలాలు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. వీరి నేపథ్యం మొత్తం తెలిసిన రాకేష్ రెడ్డి ఆ భూముల్ని కబ్జా చేయాలని భావించాడు. దానికి మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలోనే ఇతడికి జయరాం అమెరికా నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయనతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకుని చంపేస్తేనే తన పథకం పారుతుందని భావించిన రాకేష్.. జనవరి చివరి వారంలోనే హత్యకు కుట్రపన్నాడు. అయితే ఈ విషయాన్ని ఆఖరి నిమిషం వరకు ఎవరికీ చెప్పలేదు. జయరామ్ వ్యవహారశైలి తెలిసిన రాకేష్‌రెడ్డి కొత్త సిమ్‌కార్డు తీసుకుని వీణ పేరుతో జయరాంను ‘జై’అని పిలుస్తూ చాటింగ్ చేయడం మొదలెట్టాడు. వీరి మధ్య మొత్తం 170 చాటింగ్స్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ ఒక మాట చెప్పి బుక్కయ్యారు జయరాంను నిర్భంధించాలని కుట్రపన్నిన రాకేష్.. వీణా పేరుతో జనవరి 30న లంచ్‌కు పిలిచాడు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌కు వస్తే అక్కడ నుంచి కలిసి వెళ్దామంటూ వాట్సాప్ సందేశం పెట్టాడు. అతడు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో రౌడీషీటర్ నగేష్‌ను రమ్మని పిలిచాడు. ఓ వ్యక్తిని నిర్భంధించి డబ్బు వసూలు చేద్దామని అతడితో చెప్పాడు. నగేష్ తన సమీప బంధువు విశాల్‌కు ఫోన్‌చేసి నీ లైఫ్ సెటిల్ చేస్తానంటూ తనతో కలుపుకున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ సూర్యకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా రాకేష్‌తో పరిచయం ఉంది. గత నెల 30న రాకేష్‌ను కలిసేందుకు వచ్చిన సూర్య.. తనతోపాటు స్నేహితుడైన అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్‌ను తీసుకువచ్చాడు. దీంతో నగేష్, విశాల్‌లను ఇంట్లోనే ఉంచిన రాకేష్.. వీరిద్దరినీ తీసుకుని బయలుదేరాడు. జూబ్లీహిల్స్ క్లబ్ వరకు వచ్చిన తర్వాత జయరాం కారు నెంబర్ కిషోర్‌కు చెప్పి అతడిని అక్కడ దింపేశాడు. అందులో జై అనే వ్యక్తి వస్తారని, అతడిని వీణ మేడం డ్రైవర్ని అంటూ పరిచయం చేసుకుని, అతడి కారులోనే తన ఇంటికి తీసుకురమ్మని రాకేష్ చెప్పడంతో కిషోర్ అలానే చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత సూర్య, కిషోర్‌లు కింది నుంచే వెళ్లిపోగా.. రాకేష్ సహా మిగిలిన ఇద్దరూ జయరాంను ఇంటి పై భాగంలో ఉన్న గదిలోకి తీసుకువెళ్లి నిర్భంధించారు. హత్య చేస్తారనే విషయం సూర్య, కిషోర్‌లకు తెలియకపోయినా వీణ డ్రైవర్ అంటూ ఒకరు అబద్దం చెప్పగా.. మరొకరు సహకరించారు. దీంతో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సంబంధించి న్యాయసలహా తీసుకుంటున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు శవాన్ని చూసినా చెప్పక పోవడంతో తొలుత కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్ పేపర్లపై బలవంతంగా జయరామ్‌తో సంతకాలు చేయించుకున్న రాకేష్‌రెడ్డి.. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరాంతో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10లక్షల నుంచి కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్ చేసుకున్నాడు. మరుసటి రోజు జయరాంను చంపేద్దామని రాకేష్ అనడంతో.. నగేష్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత విశాల్, రాకేష్‌లు దిండుతో ముఖంపై నొక్కి జయరాంను హత్య చేశారు. మృతదేహం ఇంట్లో ఉండగానే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీను, రామ్‌లు రాకేష్‌రెడ్డి వద్దకు వచ్చారు. తనకు ఇవ్వాల్సిన రూ.10లక్షలు అడగటం కోసం అంజిరెడ్డి మిగిలిన ఇద్దరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. మృతదేహాన్ని చూసిన ఈ ముగ్గురూ భయపడి పారిపోయారు. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం తెలిసిన నేరాన్ని దాచి పెట్టడం కిందికి వస్తుంది. ఇది కూడా నేరమే కావడంతో వీరి విషయంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దర్యాప్తు అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఓ స్థలానికి సంబంధించి రాకేష్‌కు అంజిరెడ్డి రూ.10లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ల్యాండ్ డీల్ సెటిల్ కాకపోవడంతో తన డబ్బు ఇవ్వాల్సిందిగా అతడు రాకేష్‌పై ఒత్తిడి చేస్తూ అతడి ఇంటికి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ను బయటే కలిశాడు తన వాచ్మెన్/డ్రైవర్ శ్రీనివాస్‌తో క్రైమ్ సీన్‌ను శుభ్రం చేయించిన రాకేష్.. శవాన్ని జయరాం కారులోనే పెట్టుకుని బయలుదేరాడు. నల్లకుంట పోలీసుస్టేషన్ వరకు వెళ్లిన ఇతడు ఫోన్ ద్వారా ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును సంప్రదించాడు. చింతల్ లో వీరిద్దని నివాసాలు సమీపంలోనే కావడంలో ఒకరితో మరొకరికి పరిచయముంది. ఆ సమయంతో ఇన్స్పెక్టర్ వేరే ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో అక్కడకు వెళ్లిన రాకేష్ కారును దూరంగా ఆపి దగ్గరకు వెళ్లాడు. ఆపై హత్య విషయం ఆయనకు చెప్పగా.. తప్పతాగి జరిగిన ప్రమాదంగా చిత్రీకరిం చాలని సీఐ సూచించారు. హైదరాబాద్ చుట్టు పక్కల అలా చేస్తే సీసీ కెమెరాలు ఇతర ఆధారాలతో పోలీసులు పట్టుకుంటారని.. ఏపీకి వెళ్లి సీన్ క్రియేట్ చేయాలని చెప్పాడు. దీంతో రాకేష్ విజయవాడ వైపు బయలుదేరాడు. దారి మధ్యలో ఉండగా రాకేష్‌కు ఏసీపీ మల్లారెడ్డి ఫోన్ చేశాడు (ఆదిభట్లలో ఉన్న ఓ ల్యాండ్ వివాదంలో వీరికి పరిచయం ఏర్పడింది). దీంతో హత్యతోపాటు.. సీన్ క్రియేట్ చేసేందుకు ఓ స్నేహితుడు సాయం చేశారంటూ మల్లారెడ్డికి రాకేష్ వివరించారు. ఆపై నందిగామలో బీరు కొని.. ఐతవరంలో రోడ్డు కిందకు కారును తోసి రాకేష్ వెనక్కు వచ్చేశాడు. ఆ డబ్బుపై పొంతనలేని కథనాలు జయరాం హత్య కేసులో నందిగామ పోలీ సుల విచారణలో రాకేష్ రూ.4.17 కోట్ల ఆర్థిక లావాదేవీలను తెరపైకి తెచ్చాడు. ఇందులో రూ.80 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా పంపానన్నాడు. అక్కడి పోలీసులు అది వాస్తవమేనని ధ్రువీకరిం చారు. హత్యలోనూ రాకేష్, శ్రీనివాస్‌ల పాత్ర మాత్రమే ఉందని తేల్చేశారు. కేసు హైదరాబాద్‌కు బదిలీ అయ్యాక బంజారాహిల్స్ ఏసీపీ నేతృత్వంలో జరిగిన విచారణలో ఇతరుల పాత్ర ఉన్నట్లు తేలింది. జయరాంకు ఇచ్చిన డబ్బుపై రాకేష్ స్పష్టత ఇవ్వలేదు. తొలుత ఈ మొత్తాన్ని అంజిరెడ్డి సమక్షంలో ఇచ్చానని చెప్పాడు. అంజిరెడ్డి సమక్షంలో రాకేష్‌ను విచారించగా ఇది అబద్ధమని తేలింది. ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఓ వ్యక్తి ఖాతా నుంచి జయరాం అమెరికా ఖాతాకు బదిలీ చేయించానని అన్నాడు. ఈ హత్యలో శిఖాచౌదరి పాత్రలేదని నిర్ధారించారు. జయరాం మరణవార్త విన్న వెంటనే ఆయన ఇంటికి వెళ్లి తన ప్రాజెక్టు కాగితాలు తీసుకున్నా నని ఆమె అంగీకరిస్తున్నారు. దీనిపై జయరాం భార్య పద్మశ్రీ ఓ ఫిర్యాదూ ఇచ్చారు. ఈ పరి ణామాల నేపథ్యంలో శిఖాచౌదరిపై చోరీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. -
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో కొత్త డ్రామా తెర మీదకు తెచ్చాడు. తాను అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బు ఖర్చు చేయించడమే కాకుండా, పెళ్లికి నిరాకరించిన జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిపై కోపంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో తవ్వినకొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హత్యకేసులో రాకేష్ రెడ్డితో పాటు డ్రైవర్ శ్రీనివాస్, విశాల్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. శిఖా చౌదరి బ్రేకప్ చెప్పడంతో.. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...‘శిఖా చౌదరి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోపాటు, రాకేష్ రెడ్డికి బ్రేకప్ చెప్పి దూరం పెట్టడంతో అతడు కోపం పెంచుకున్నాడు. దీంతో శిఖా చౌదరికి ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆమెపై ఒత్తిడి పెంచాడు. అంతేకాకుండా ఆమెకు జయరామ్ బహుమతిగా ఇచ్చిన కారును రాకేష్ రెడ్డి తీసుకు వెళ్లాడు. ఈ విషయాన్ని శిఖా చౌదరి తన మేనమామకు చెప్పడంతో ఆ డబ్బులు తాను ఇస్తానని జయరామ్ హామీ ఇచ్చి, కారు తిరిగి శిఖాకు ఇప్పించాడు. ఆ తర్వాత జయరామ్‌ను డబ్బులు అడిగితే సరిగా స్పందించకపోవడంతో ఎలాగైనా ఆ డబ్బులు వసూలు చేయడానికి రాకేష్ రెడ్డి పథకం వేశాడు. దీంతో జయరామ్ కుటుంబంతో పాటు, ఆయన ఆస్తులపై రెక్కీ నిర్వహించాడు. ఎలాగైనా జయరామ్‌ను బెదిరించి ఆస్తి కొట్టేసి, ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు. హనీ ట్రాప్‌తో పక్కా స్కెచ్ ఇందుకోసం జయరామ్ అమెరికా నుంచి రాగానే రాకేశ్ రెడ్డి ‘హనీ ట్రాప్‘ చేసి, ఇంటికి వచ్చేలా ప్లాన్ చేశాడు. ఇందుకోసం అతడు తన డ్రైవర్ శ్రీనివాస్, రౌడీ షీటర్ నగేష్, అతడి మేనల్లుడు విశాల్, జూనియర్ ఆర్టిస్ట్ సూర్యప్రసాద్ సాయం తీసుకున్నాడు. జయరామ్‌ను 19 గంటల పాటు తన ఇంట్లో నిర్భందించాడు. ఆ సమయంలో డబ్బులు అడగగా...జయరామ్ రూ.6 లక్షలు సమకూర్చాడు. తనను వదిలిపెడితే రూ.10 కోట్లు ఇస్తానని జయరామ్ ఆఫర్ చేసినా రాకేష్ రెడ్డి నిరాకరించాడు. అంతేకాకుండా నిన్ను చంపితే నాకు రూ.100 కోట్లు వస్తాయంటూ... అతడితో ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని దారుణంగా హతమార్చాడు. ఈ హత్యకు డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు విశాల్ కూడా సహరించాడు. ఆ తర్వాత హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని కారులో కృష్ణాజిల్లా నందిగామకు వెళ్లాడు. ఆ తర్వాత కారు అక్కడే వదిలేసి తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. విశాల్ లైఫ్ సెటిల్ చేస్తానంటూ.. రాకేష్ రెడ్డి తాను చేస్తున్న అక్రమ దందాలకు రౌడీ షీటర్ నగేష్ సాయం తీసుకునేవాడు. ఆ నేపథ్యంలో అతడి మేనల్లుడు విశాల్‌తో పరిచయం అయింది. నీ లైఫ్ సెటిల్ చేస్తానంటూ ఆశచూపించిన రాకేష్ రెడ్డి... జయరామ్ హత్యకు విశాల్ సాయం తీసుకున్నాడు. అంతేకాకుండా హత్య కేసులో నీ పేరు రాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. జయరామ్ హత్య తర్వాత ఆస్తులను లిటిగేషన్ చేస్తామని, అతడి భార్య పద్మశ్రీతో సెటిల్మెంట్ చేసుకుందామని విశాల్ ఆశ చూపించిన రాకేష్ చిట్టచివరికి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ఆది నుంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఈ ఎపిసోడ్లో జయరామ్ హత్యకు శిఖా చౌదరి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పథకం ప్రకారం రప్పించి, బంధించి..!
-
పథకం ప్రకారమే జయరామ్ హత్య
-
దిండుతో నొక్కి చంపేశారు!
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్ హత్య పక్కా పథకం ప్రకారం జరిగిందేనని పోలీసులు తేల్చారు. హత్యచేయాలన్న ఉద్దేశంతోనే ‘హనీ ట్రాప్’ద్వారా పిలిపించిన రాకేష్‌రెడ్డి తదితరులు కొన్ని బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని ఆపై దిండుతో ముఖంపై నొక్కి హతమార్చారని తెలిసింది. దాదాపు 11 మంది పోలీసులతో సంబంధాలు కలిగి ఉన్న రాకేష్‌రెడ్డి వారితో పాటు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అనేక మందిని బెదిరించి డబ్బు కాజేసినట్లు, మోసాలకు పాల్పడినట్లు తేలింది. గురువారం సికింద్రాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే బాధితుడు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, జయరామ్ హత్య కేసుకు సంబంధించి మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. గురువారం సాయంత్రానికి రాకేష్, శ్రీనివాస్‌లతో పాటు విశాల్, రౌడీషీటర్ నగేష్‌ల పాత్రలపై ఆధారాలు లభించాయని తెలిసింది. మరోపక్క ఈ కేసులో శిఖాచౌదరిని దాదాపు 7 గంటల పాటు విచారించిన పోలీసులు.. రాత్రి 8 గంటలకు ఆమెను విడిచిపెట్టారు. అసలు జయరాంకు డబ్బు ఇచ్చాడా? ఈ ఘటనకు ప్రధాన కారణం రాకేష్‌రెడ్డి, జయరామ్ మధ్య ఉన్న ఆర్ధిక వివాదాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తేల్చారు. 2016–18 మధ్య రాకేష్ పలు దఫాల్లో జయరామ్‌కు రూ.4.17 కోట్లు ఇచ్చాడని, ఇందులో రూ.80లక్షలు ఒకసారి, 40లక్షలను రెండుసార్లు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశాడని వెల్లడించారు. ఇదే విషయాన్ని నిందితుల అరెస్టు నేపథ్యంలో విడుదల చేసి అధికారిక ప్రెస్‌నోట్‌లోనూ పొందుపరిచారు. అయితే కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయిన తర్వాత నిందితులను విచారిస్తున్న హైదరాబాద్ పోలీసులకు ఈ ఆర్థికలావాదేవీలకు సంబంధించి ఆధారాలేవీ లభించలేదు. దీంతో గురువారం శిఖా చౌదరిని సైతం పోలీసుస్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సైతం లభించకపోవడం, రాకేష్ సరైన వివరాలు వెల్లడించకపోవడంతో పోలీసులు జయరామ్ బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. వీటిలో కూడా ఎక్కడా ఆ స్థాయిలో లావాదేవీలు లేవని భావిస్తున్నారు. దీంతో హత్య వెనుక మరేదైనా కారణం ఉందా? లేక జయరాం ఆస్తిని కాజేయడానికి బెదిరిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దిండుతో ముఖంపై ఒత్తి పెట్టడంతో! రాకేష్ రెడ్డి తదితరులు గత 31వ తేదీ ఆర్థిక లావాదేవీల విషయమై జయరామ్‌తో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో వీరు జయరామ్‌పై దాడి చేయడంతో ఆయన కూర్చున్న ప్రాంతంలోనే పడిపోయారు. అనంతరం దిండుతో జయరామ్ ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని శ్రీనివాస్ సాయంతో జయరామ్ కారులోకి మార్చి రాకేష్ ఒక్కడే దాదాపు 5గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ 11 మంది పోలీసులతో మాట్లాడాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం రాకేష్ ఇంట్లో క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. కస్టడీలో ఉన్న నిందితులతో పాటు కొత్తగా పట్టుకున్న వారినీ తీసుకువెళ్లి క్లూస్ టీమ్ సమక్షంలో దీన్ని చేపట్టారు. ఈ తతంగం దాదాపు 40 నిమిషాలు జరిగింది. మరోపక్క రాకేష్ రెడ్డి బ్యాంక్ అకౌంట్‌ను స్తంభింపజేసిన అధికారులు సెల్ఫోన్లు, రెండు కార్లను, ఇంటిని సైతం సీజ్ చేశారు. జయరామ్ హత్య కేసులో శిఖాచౌదరితోపాటు మరో నలుగురిని విచారించామని పోలీసులు తెలిపారు. జయరామ్ కంపెనీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నామని, కొన్ని పత్రాలు కూడా తెప్పించి పరిశీలించామన్నారు. నాలుగున్నర కోట్లు జయరామ్‌కి అప్పు ఇచ్చే స్థోమత రాకేశ్‌కు ఉందా? అన్న కోణంలోనూ విచారణ జరుగుతోందన్నారు. అవసరమైతే శిఖాచౌదరిని మరింత లోతుగా విచారిస్తామన్నారు. పలువురు పోలీసు అధికారులపై కూడా ఆరోపణలున్నాని వీటినీ పరిశీలిస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కోస్టల్ బ్యాంకు ఉద్యోగులను కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం రప్పించి, బంధించి..! ఏపీ పోలీసుల విచారణలో రాకేష్‌రెడ్డి ఈ హత్య జరిగిన తీరును వివరిస్తూ.. అనుకోని పరిస్థితుల్లో జరిగిన పెనుగులాటతో జయరామ్ చనిపోయాడని, తనతో పాటు తన వాచ్‌మన్ శ్రీనివాస్‌కు మాత్రమే ఇందు లో ప్రమేయం ఉందని చెప్పాడు. దీన్నే అధికారులు కూడా నిర్ధారించారు. అయితే తెలంగాణ విచారణలో అనేక కొత్త విషయా లు బయటకొస్తున్నాయి. జయరామ్‌ను ‘హనీ ట్రాప్’ చేయడం కోసం రాకేష్‌రెడ్డి తన స్నేహితుడైన జూనియర్ ఆర్టిస్ట్ సూర్యను వినియోగించుకున్నాడని వెల్లడైంది. అతడి తో గత నెల 29 రాత్రి జయరామ్‌కు ఫోన్ చేయించిన రాకేష్.. ఓ యువతి విషయం చర్చించేలా చేశాడు. దీంతో మరుసటి రోజు జయరామ్ స్వయంగా ఆ జూనియర్ ఆర్టిస్ట్ కు కాల్ చేశారు. దీంతో జయరాంను తీసు కుని తన ఇంటికి రావాల్సిందిగా ఆర్టిస్ట్‌కు రాకేశ్ సూచించాడు. జయరాంను ఇంటికి తీసుకొచ్చే సమయానికే.. రాకేష్ ఇంట్లో వాచ్‌మన్ శ్రీనివాస్‌తోపాటు ఎస్సార్‌నగర్ రౌడీషీటర్ నగేష్, విశాల్ అనే మరో వ్యక్తి ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ నుంచి వెళ్లిపోగా.. మిగిలిన వారు జయరామ్‌ను బలవంతంగా లోపలకు తీసుకువెళ్లారు. 30, 31 తేదీల్లో జయరామ్‌ను ఆ ఇంట్లోనే నిర్బంధించి డ బ్బు కోసం అనేక మందికి ఫోన్లు చేయిం చారు. బలవంతంగా 10 ఖాళీ బాండ్ పేపర్ల పై సంతకాలు చేయించుకున్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల కోసం సిరిసిల్లకు చెందిన గడ్డం శ్రీను, అంజిరెడ్డి, చొక్కారామ్లు రాకేశ్ ఇంటికి వచ్చారు. అక్కడ వీరికి జయరామ్ తారసపడినా.. ఏమీ మాట్లాడలేదని తెలిసింది. పోలీసులు గురువారం సూర్యను అదుపులోకి తీసుకుని విచారించారు. -
ఇప్పుడు అవన్నీ చెప్పలేను : శిఖా చౌదరి
సాక్షి, హైదరాబాద్ : ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల కోసమే ఈ హత్య జరిగిందని అందరూ భావించినప్పటికీ.... రాకేష్ రెడ్డి ఒక్క రూపాయి కూడా జయరామ్‌కి ఇవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని గురువారం పోలీసులు విచారించారు. ఏసీపీ కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు శిఖాను ప్రశ్నించారు. శిఖా ఆర్థిక లావాదేవీలు, విలాసవంతమైన జీవితంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రాకేష్‌రెడ్డితో శిఖా పరిచయం, జయరాం భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణలపై శిఖా చౌదరిని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా విచారణ అనంతరం శిఖా చౌదరి మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పినట్లు తెలిపారు. అవసరమైన సమయంలో మళ్లీ తప్పకుండా మీడియా ఎదుటకు వస్తానని, ప్రస్తుతం విచారణలో అడిగిన విషయాలు చెప్పలేనని పేర్కొన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వ్యాఖ్యానించారు. ఇక జయరాం హత్యలో కమెడియన్ సూర్యప్రసాద్ అలియాస్ డుంబు కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. మంచి అమ్మాయి ఉందంటూ అతడే జయరాంను రాకేష్ ఇంటికి తీసుకువెళ్లినట్లుగా సమాచారం. ఇక రాకేష్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 30 మందిని పోలీసులు విచారించారు. -
బయటపడుతున్నా రాకేష్ రెడ్డి లీలలు
-
‘శిఖా చౌదరిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పాడు’
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో రాకేష్ అరెస్టు కావడంతో అతడి బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ఎస్సార్ నగర్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే రియల్టర్ దగ్గర రాకేష్‌రెడ్డి కోటీ యాభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అప్పు తిరిగి చెల్లించమని అడిగితే పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడేవాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా అప్పు ఎగ్గొట్టేందుకు రాకేష్‌రెడ్డి అమ్మాయిలను ఎరవేసే ప్రయత్నాలు చేస్తాడని వెల్లడించాడు. ‘శిఖా చౌదరిని పెళ్లి చేసుకుంటున్నా అంటూ చెప్పుకుని తిరిగేవాడు. జయరాంకు అప్పు ఇచ్చే స్థోమత రాకేష్‌కు లేదు. అతడి వద్ద నాలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసేవాడు. నా దగ్గర కోటిన్నర తీసుకున్నాడు ’ అని సాక్షి టీవీతో రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. కాగా జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ద్వారా అతడికి స్నేహితుడైన రాకేష్... జయరామ్ ఆస్తిపై కన్నేసి అతడిని హత్య చేసిన సంగతి తెలిసిందే. రాకేష్ రెడ్డితో పాటు హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ నగేశ్ కూడా జయరాం హత్యలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
నగేశ్ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్
-
నగేశ్ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో తవ్విన కొద్ది అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ నగేశ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జయరామ్‌ను హత్య చేసిన రోజు ఘటనా స్థలంలో నగేశ్ ఉండటమే కాకుండా హత్యకు సహకరించినట్లు సమాచారం. అలాగే జయరామ్‌ను ట్రాప్ చేసేందుకు అమ్మాయి పేరుతో రాకేష్ రెడ్డితో పాటు నగేశ్ కూడా వాట్సాప్ చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే జయరామ్‌ను బయటకు రప్పించి, కిడ్నాప్ చేయడమే కాకుండా, అతడితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయ్యాయి. ఇప్పటికే నగేశ్‌పై ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ రౌడీ షీటర్ కేసు నమోదైంది. గత కొంతకాలంగా రాకేష్ రెడ్డి...నగేశ్‌తో కలిసి దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. (జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...) ఇక జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పరిచయమయ్యాక ఆమె ద్వారా రాకేష్‌కు జయరాం స్నేహితుడు అయ్యాడు. ఈ నేపథ్యంలో జయరామ్ ఆస్తిపై కన్నేసిన రాకేష్...ఎలాగైనా ఆస్తిని చేజిక్కించుకోవాలని భారీ స్కెచ్ వేశాడు. అందుకోసం నగేశ్ సహకారం కూడా తీసుకున్నాడు. పోలీసులు తమ విచారణలో భాగంగా నగేశ్‌తో పాటు సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి, చొక్కారామ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. జయరామ్ హత్యకు ముందు, ఆ తర్వాత రాకేష్ రెడ్డి వీరితో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. మరోవైపు నిందితుడు రాకేష్ రెడ్డి నివాసంలో పోలీసులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 10లోని రాకేష్ నివాసంలో పోలీసులు.. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే హత్య జరిగిన ప్రాంతంలో నిందితుల వాంగ్ములం నమోదు చేశారు. రాకేష్ రెడ్డి నివాసంతో పాటు, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన రోజు రాకేష్ ఇంటికి పలువురు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు కృష్ణాజిల్లా నందిగామ టోల్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్‌ను సేకరించారు. -
ఏసీపీ కార్యాలయానికి శిఖా చౌదరి
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై, వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని కూడా గురువారం పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఏసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగనుంది. కాగా మొదటి రోజు విచారణలో భాగంగా ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 30 మందిని పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా సినీ నటుడు, కమెడియన్ సూర్య ప్రసాద్ అలియాస్ డుంబును కూడా విచారించినట్లు తెలుస్తోంది. (జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...) సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు జయరాం హత్యకు ముందు రాకేష్ రెడ్డి రోజు జరిపిన కాల్ లిస్టు ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన నాడు రాకేష్‌రెడ్డి ఇంట్లో జరిగిన సీన్‌ను రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. కాగా ఈ విచారణలో సీసీ కెమెరాలు కీలకంగా మారనున్నాయి. ఇక ఈ కేసులో శిఖా చౌదరి పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపనున్నారు. -
పక్కా ప్లాన్‌తో జయరామ్‌ను ట్రాప్ చేసా
-
జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు..వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఇప్పటివరకూ ఆర్థిక లావాదేవీల కోసమే ఈ హత్య జరిగిందని అందరూ భావించినప్పటికీ.... రాకేష్ రెడ్డి ఒక్క రూపాయి కూడా జయరామ్‌కి ఇవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. బెదిరింపులతో జయరామ్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలన్న పథకంతోనే అతడిని రాకేష్ రెడ్డి ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను నిందితుడు రంగంలోకి దింపి, వాళ్లు తనకు అప్పుగా డబ్బు ఇచ్చినట్లు రాకేష్ రెడ్డి సాక్ష్యాలు సృష్టించాడు. అంతేకాకుండా జయరామ్ హత్యకు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సహరించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చింతల్ రౌడీ షీటర్‌తో పాటు మొత్తం ఏడుగురు వ్యక్తులను వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా జయరామ్‌ను హత్య చేసిన తర్వాత కొన్ని గంటలపాటు శవాన్ని కారులో వేసుకుని నగరంలోనే రాకేష్ సంచరించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అతడు 11మంది పోలీస్ అధికారులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం వారితో అతడు ఫోన్లో మాట్లాడినట్లు విచారణలో వెల్లడి కాగా, వారిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు. దీంతో పోలీస్ అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరికీ నోటీసులు జారీ చేసిన పోలీసులు నిన్న ఆమెను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి పిలిపించి, మహిళా పోలీసుల సహకారంతో ఇద్దరు నిందితులతో కలిపి విచారించారు. -
పథకం ప్రకారం రప్పించి...
-
నోట్లో బీరు పోసి.. ప్రమాదంగా చిత్రీకరించు!
సాక్షి, హైదరాబాద్: ‘‘శవం నోట్లో మద్యం పోసి, ప్రమాదంగా చిత్రీకరించు. ఈ క్రైమ్ సీన్ ఆంధ్రప్రదేశ్‌కు మారిస్తే మంచిది. కారులో శవాన్ని తీసుకుని ఒక్కడివే వెళ్లు. టోల్గేట్ల వద్ద, మద్యం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు’’– కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు నిందితుడు రాకేష్‌రెడ్డికి పోలీసు అధికారులు ఇచ్చిన సూచనలివి. జయరామ్ గతనెల 31న జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని రాకేష్ ఇంట్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్‌తోపాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు బుధవారం వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, దర్యాప్తు అధికారిగా కె.శ్రీనివాసరావు జరిపిన విచారణలో పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. జయరామ్‌ను హత్య చేసిన తర్వాత కొన్ని గంటల పాటు శవాన్ని కారులో వేసుకుని నగరంలోనే సంచరించినట్లు వెల్లడైంది. పథకం ప్రకారం రప్పించి... గతంలో జయరామ్‌పై కేసు నమోదు కావడంతో ఆయన కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక అవసరాల నిమిత్తం తన మేనకోడలు శిఖా చౌదరికి సన్నిహితుడైన రాకేష్ నుంచి మూడు దఫాల్లో రూ.4.17 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వడ్డీతో కలిపి మొత్తం రూ.6 కోట్లు గతేడాది అక్టోబర్‌లో ఇవ్వాల్సి ఉండగా జయరామ్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో గతనెల 29న జయరామ్ నగరానికి వచ్చినట్టు తెలియడంతో ఫోన్ ద్వారా ఆయన్ను సంప్రదించేందుకు రాకేష్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే జయరామ్ తనను పట్టించుకోవట్లేదని భావించి, ఆయన్ను ట్రాప్ చేయడానికి ఓ కొత్త సిమ్‌కార్డు తీసుకుని వీణ పేరుతో చాటింగ్ చేశాడు. తర్వాత పథకం ప్రకారం గతనెల 30న జయరామ్‌ను ఒంటరిగా తన ఇంటికి రప్పించి నిర్బంధించాడు. ఆ మరుసటి రోజు వరకు అక్కడే ఉంచాడు. 31న మధ్యాహ్నం డబ్బు విషయంలో జరిగిన గొడవ నేపథ్యంలో రాకేష్ దాడి చేయడంతో జయరామ్ ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వాచ్‌మన్ శ్రీనివాస్ సహకారంతో శవాన్ని కారులో ఎక్కించుకుని సాయంత్రం వరకు నగరంలోని అనేక ప్రాంతాల్లో తిరిగాడు. తన స్నేహితుడైన ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును కలవడానికి నల్లకుంట ఠాణాకు వెళ్లిన రాకేష్.. శవం ఉన్న కారుతో అక్కడే దాదాపు 40 నిమిషాలు వేచి చూశాడు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో ఆయనతోపాటు ఏసీపీ మల్లారెడ్డిని సంప్రదించాడు. వీరిద్దరూ ఇచ్చిన సలహా మేరకు ఈ హత్యను డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేపథ్యంలో జరిగిన ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం వేశాడు. ఏసీపీ, ఇన్స్పెక్టర్ ఇచ్చిన సలహాల మేరకు జయరామ్ శవం నోట్లో, వస్త్రాల పైనా మద్యం పోయడంతో పాటు ఆయన కారులో, చేతుల్లో మద్యం సీసాలు ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే తాను విజయవాడ వస్తున్నట్లు జయరామ్ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడన్న సంగతి తెలుసుకున్న రాకేష్.. అదే విషయాన్ని ఈ ఖాకీలకు చెప్పాడు. దీంతో క్రైమ్ సీన్‌ను ఏపీకి మారిస్తే మంచిదని వారు సలహా ఇవ్వడంతో మృతదేహం ఉన్న కారును తీసుకుని విజయవాడ వైపు బయలుదేరాడు. మద్యం ఖరీదు చేయడానికి, కారుతో సహా శవాన్ని వదిలేయడానికి అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ నందిగామ వరకు వెళ్లాడు. 31వ తేదీ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో నందిగామ పాతబస్టాండ్ వద్ద ఉన్న విజయబార్కు వెళ్లి మద్యం బాటిళ్లు కావాలని కోరాడు. వారు మద్యం ఇవ్వడానికి నిరాకరించడంతో బీరు సీసాలు కొనుగోలు చేసుకుని తిరిగి కారులో బయలుదేరాడు. ఐతవరం వద్దకు చేరుకున్న తర్వాత వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపి, వెనుక సీట్లో ఉన్న మృతదేహాన్ని డ్రైవింగ్ సీటులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో శవం నోట్లో, వస్త్రాలపై బీరు పోసి.. జయరామ్ చేతిలో బీరు సీసా పెట్టాడు. అనంతరం కారును రోడ్డు మార్జిన్ కంటే కిందికి తీసుకెళ్లి వదిలేశాడు. అక్కడ నుంచి బస్సులో తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. ఆ డబ్బుపై పోలీసుల ఆరా... ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరికీ నోటీసులు జారీ చేసిన పోలీసులు బుధవారం ఆమెను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి పిలిపించారు. మహిళా పోలీసుల సహకారంతో ఇద్దరు నిందితులతో కలిపి ఆమెను విచారించారు. దర్యాప్తు అధికారులు ప్రధానంగా రూ.4.17 కోట్ల విషయాన్ని కూపీ లాగుతున్నారు. ఆ నగదు ఎవరిది? ఎక్కడ నుంచి తీసుకొచ్చారు తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. భారీ మొత్తం కావడంతో దీనిపై ఆదాయపుపన్ను శాఖ అధికారులకూ సమాచారం ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే ఈ హత్యలో శిఖా చౌదరి పాత్ర ఏమైనా ఉందా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. రాకేష్ వెల్లడించిన అంశాలు, కాల్ డేటాలో లభించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుంటున్న పోలీసులు ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఏసీపీ మల్లారెడ్డిలకూ నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించారు. హత్య తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో 13 సార్లు, ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు సంభాషించినట్లు రాకేష్ కాల్ రికార్డుల ద్వారా వెల్లడైంది. గురు, శుక్రవారాల్లోనూ రాకేష్, శ్రీనివాస్‌లు తమ కస్టడీలో ఉండనుండటంతో ఆ సమయంలోనే ఇద్దరు ఖాకీలను విచారించాలని యోచిస్తున్నారు. -
కీలక విషయాలు వెల్లడించిన రాకేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యకేసు విచారణను హైదరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. కోర్టు ఆదేశాలతో ఈ కేసులో నిందితులుగా ఉన్న రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. డబ్బుల కోసమే జయరామ్‌ను ఇంటికి పిలిచి నిర్భంధించినట్టు రాకేశ్ పోలీసులకు తెలిపాడు. జయరామ్‌ను వేధిస్తే డబ్బులు వసూలు అవుతాయని భావించి.. అందరికీ ఫోన్ కాల్స్ చేపించానని చెప్పాడు. జనవరి 31వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు జయరామ్‌ను కొట్టడంతో.. అతను మృతి చెందినట్టు ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాత జయరామ్ మృతదేహాన్ని కారులో ఉంచుకుని హైదరాబాద్‌లో తిరిగానని తెలిపాడు. హత్య జరిగిన తర్వాత ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు మాట్లాడినట్టు.. అదే రోజు నల్లకుంట సీఐ శ్రీనివాస్‌కు 13 సార్లు ఫోన్ చేసినట్టు పేర్కొన్నాడు. బీర్ బాటిల్స్ కోని దాన్ని జయరామ్ ఒంటిపై, మూతిపై పోసి.. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నట్టు చెప్పాడు. -
కస్టడీకి జయరామ్ హత్య కేసు నిందితులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యకేసు దర్యాప్తును జూబ్లీహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. ఓవైపు నిందితులను విచారించేందుకు సన్నాహాలు చేస్తూనే మరోవైపు ఈ కేసులో కీలక సాక్షులను ప్రశ్నిస్తూ పోలీసులు వాంగ్మూలాల నమోదు ప్రారంభించారు. హత్య కేసు నిందితులుగా ఉన్న రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లు ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగా వీరిని తదుపరి విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. దీంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంటామని కేసు దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు చెప్పారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీరిద్దరితో ‘క్రైమ్‌సీన్ రీ–కన్స్ట్రక్షన్’చేయనున్నారు. నిందితుల విచారణ నేపథ్యంలో జయరామ్ హత్యలో శిఖా చౌదరితో పాటు ఇతరుల పాత్ర, పోలీసు అధికారులైన ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల ప్రమేయంపై ఆరా తీయనున్నారు. జయరామ్ భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణల పైనా లోతైన విచారణ అవసరమని పోలీసులు నిర్ణయించారు. శిఖా చౌదరి నివసిస్తున్న విల్లాకు గత నెల 29న జయరామ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ రోజు ఆయన ఎందుకు అక్కడకు వెళ్లారనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇంటి వద్ద ఏం జరిగింది? అనే అంశాలు తెలుసుకోవడానికి శిఖా చౌదరి ఇంట్లో పని మనిషిని పోలీసులు విచారించారు. ఆమె నుంచి వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. ఈమెతో పాటు మరికొందరి వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు శిఖా చౌదరికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. -
పోలీసుల కస్టడీలో రాకేష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులోని నిందితులను మూడురోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను రెండు వారాలపాటు కస్టడీలోకి అనుమతించాలని కోరుతూ నాంపల్లి కోర్టు జడ్జి ముందు జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు. విచారించిన కోర్టు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు పోలీసులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ల కస్టడీలోకి తీసుకుంటారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారించనున్నారు. -
జయరాం హత్య కేసు; కస్టడీకి రాకేష్, శ్రీనివాస్
-
జయరాం,శిఖా చౌదరి మధ్య సంబంధాలపై విచారణ
-
నగరానికి జయరామ్ కేసు నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం పీటీ వారెంట్‌పై నందిగామ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. జయరామ్ హత్య గత నెల 31న జూబ్లీహిల్స్‌లోని రాకేష్‌రెడ్డి ఇంట్లో జరిగింది. దీనికి సంబంధించి నందిగామ పోలీసులు రాకేష్‌తో పాటు వాచ్‌మన్ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారు. పెనుగులాట, పిడిగుద్దులతో ఈ దారుణం జరిగిందని తేల్చారు. ఆపై గత గురువారం ఈ కేసు హైదరాబాద్‌కు బదిలీ కావడంతో జూబ్లీహిల్స్ ఠాణాలో రీ–రిజిస్టర్ చేశారు. నిందితుల్ని సైతం తమకు అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకుని నందిగామ వెళ్లిన బృందం రెండు రోజులు వేచి చూసింది. ఎట్టకేలకు సోమవారం నందిగామ జైలులో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు నిందితుల్ని హైదరాబాద్ తీసుకువచ్చారు. వీరిని ఎల్బీ నగర్‌లోని న్యాయమూర్తి ఇంట్లో ఆయన ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. జయరామ్ హత్యలో శిఖా చౌదరితో పాటు ఇతరుల పాత్ర, పోలీసు అధికారులైన ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల ప్రమేయాలు తెలియాలంటే నిందితుల్ని విచారించాల్సి ఉంది. దీంతో పాటు ఈ కేసులో బయటకు రాకుండా ఉండిపోయిన వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి, జయరామ్ భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణలపైన కూడా లోతైన విచారణ అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
జయరాం హత్య కేసు.. రహస్య ప్రాంతంలో విచారణ
సాక్షి, హైదరాబాద్ : వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పని మనిషి, వాచ్ మెన్, స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. శిఖా చౌదరి, జయరాం మధ్య ఉన్న సంబంధాల పై విచారణ సాగినట్లు సమాచారం. ఓ రహస్య ప్రాంతంలో వీరందరినీ పోలీసులు విచారించారు. త్వరలోనే శిఖా చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లని నాంపల్లి కోర్టు జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యడీషియల్ రిమాండ్ విధించింది. వీరిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు పోలీసులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ల కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నిందితులిద్దరిపై వారం రోజుల కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
శిఖాచౌదరే సూత్రధారి
హైదరాబాద్: దారుణ హత్యకు గురైన కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ప్రవా సాంధ్రుడు చిగురుపాటి జయరామ్ (55) భార్య పద్మశ్రీని బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాస్‌రావు మరోసారి విచారించారు. పద్మశ్రీ ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తన భర్త హత్యలో కుట్ర దాగి ఉందని ఆమె వెల్లడించారు. ఈ హత్యలో ఆయన మేనకోడలు శిఖా చౌదరి కీలక సూత్రధారి అని, రాకేశ్‌రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమేనని పద్మశ్రీ స్పష్టం చేశారు. తన భర్త ఉమనైజర్ కాదని వెల్లడించారు. పద్మశ్రీ నుంచి జయరామ్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు విచారణ కోసం తీసుకున్నారు. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో శిఖా చౌదరిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ముందుగా ఆమెకు సెక్షన్ 41(ఏ) కింద విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వనున్నారు. ఇందుకోసం పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. -
జయరాం హత్యలో ఐదుగురి పాత్ర?
-
జయరామ్ హత్యలో ఐదుగురు?
హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యలో మరికొందరి పాత్ర కూడా ఉందా? ఘటన జరిగిన సమయంలో ఐదుగురు వ్యక్తులు అక్కడే ఉన్నారా? వారంతా కలిసే జయరామ్‌ను అంతమొందించారా? ఇవీ ఈ కేసులో తాజాగా తలెత్తిన అనుమానాలు. ఈ విషయాల్ని నిర్ధారించుకోవడానికి, అసలు ఆ రోజు ఏం జరిగిందనే అంశాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి గురువారం రాత్రి 93/2019 నెంబర్‌తో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతానికి నందిగామ పోలీసులు నమోదు చేసిన తొమ్మిది సెక్షన్లను కొనసాగిస్తామని, భవిష్యత్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరికొన్ని చేరుస్తామని తెలిపారు. జయరామ్ గతనెల 31న జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని రాకేష్ నివాసంలో హత్యకు గురికాగా, ఆయన మృతదేహం కృష్ణా జిల్లా నందిగామ లో మరుసటిరోజు కనిపించింది. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన నందిగామ పోలీసులు రాకేష్‌తోపాటు వాచ్మెన్ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారు. పెనుగులాట, పిడిగుద్దుల వల్లే జయరామ్ మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో జయరామ్ భార్య పద్మశ్రీ విజ్ఞప్తి మేరకు ఈ కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఈ హత్యలో ఐదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం నిర్ధారించుకోవడానికి ప్రస్తుతం ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని నిర్ణయించారు. శుక్రవారం నాంపల్లి న్యాయస్థానం నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఓ ప్రత్యేక బృందం ఏపీ వెళ్లి అక్కడి కోర్టు అనుమతితో జైల్లో ఉన్న నిందితులను ఇక్కడకు తీసుకురానుంది. పద్మశ్రీ వాంగ్మూలం నమోదు.. జయరామ్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆయన భార్య పద్మశ్రీ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు నేతృత్వంలోని దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.44లో ఉన్న జయరామ్ నివాసానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడినట్టు సమాచారం. ఈ కేసులో శిఖాచౌదరి ప్రమేయం ఉన్నట్లు బలమైన అనుమానాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. తన భర్త హత్య జరిగిన రోజు రాత్రి శిఖా చౌదరి తన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి బీరువాలో ఉన్న కీలక డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్టు పద్మశ్రీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను విచారిస్తేనే ఈ హత్యకు గల కారణాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏపీ పోలీసులు చెబుతున్న అంశాలు నమ్మశక్యంగా లేవని తన వాంగ్మూలంలో స్పష్టంచేసినట్టు సమాచారం. దర్యాప్తు అధికారులు దాదాపు రెండు గంటల పాటు పద్మశ్రీతో మాట్లాడి అన్ని వివరాలూ నమోదు చేసుకున్నారు. జయరామ్ అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు..? చివరగా ఆమెతో ఎప్పుడు మాట్లాడారు..? హత్య జరిగిన తర్వాత ఈ విషయంలో ఆమెకు ఎప్పుడు, ఎవరి ద్వారా తెలిసింది? శిఖా చౌదరి వ్యవహారశైలి ఏమిటి వంటి వివరాలు సేకరించారు. శిఖాచౌదరిని విచారిస్తాం జయరామ్ హత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలనూ పరిశీలించామని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ పోలీసుల దర్యాప్తు అంశాలతోపాటు జయరామ్ భార్య పద్మశ్రీ పిటిషన్లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ సాగిస్తామని వెల్లడించారు. ఏపీ పోలీసులు అరెస్టు చేసిన నిందితులిద్దరినీ కస్టడీకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారెవ్వరూ తప్పించుకోలేరని స్పష్టంచేశారు. శిఖాచౌదరిని కూడా విచారిస్తామని చెప్పారు. -
మళ్లీ అదే మాట చెప్పిన జయరాం భార్య
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణలో భాగంగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు శుక్రవారం జయరాం భార్య పద్మశ్రీ వాంగ్మూలం తీసుకున్నారు. తన భర్త హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉందని ఆమె పునరుద్ఘాటించారు. (శిఖా చౌదరి ప్లాన్, రాకేష్ రెడ్డి యాక్షన్) మరోవైపు శిఖా చౌదరికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, మరో నిందితుడు శ్రీనివాస్‌లను తమకు అప్పగించాలని జూబ్లీహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో రేపు ఇద్దరు నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఇద్దరిని తమ కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులిద్దరితో క్రైమ్ సీన్ రీ కంస్ట్రక్షన్ చేయనున్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం జయరాంను తానే హత్య చేశానని రాకేశ్‌రెడ్డి తమ విచారణలో ఒప్పుకున్నట్టు ఏపీ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. జయరాం భార్య పద్మశ్రీ విజ్ఞప్తి మేరకు ఈ కేసు దర్యాప్తుకు తెలంగాణ పోలీసులకు అప్పగించారు. -
నేను షాక్ అయ్యాను: శిఖా చౌదరి
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన మేనకోడలు శిఖా చౌదరి స్పష్టం చేశారు. తన మేనమామ ఇంట్లో నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకు వెళ్లలేదని ఆమె తెలిపారు. వాళ్ల ఇంటికి చాలామంది వచ్చి వెళుతుంటారని అన్నారు. శిఖా చౌదరి ’సాక్షి’తో మాట్లాడుతూ..జయరామ్ వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదని, ఎక్కువగా కంపెనీ వ్యవహారాల గురించి తాము మాట్లాడుకునేవారిమని వెల్లడించారు. తాను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానని, అయితే జయరామ్‌కు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు. నేను షాక్ అయ్యాను... జయరామ్ తనకు ఎప్పుడూ వాట్సాప్ కాల్ చేసేవారని, అలాంటిది ఆయన ఒకసారి ఇండియన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ చేశారని శిఖా చౌదరి చెప్పారు. తనకు అర్జెంట్‌గా కోటి రూపాయలు కావాలని అడగటంతో షాక్ అయినట్లు ఆమె తెలిపారు. తాను రూ.4 కోట్లు అప్పు చేశానని, వాళ్లు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, అన్ని విషయాలు చెబుతానని చెప్పారన్నారు. అంతలోనే హత్య జరిగిందని శిఖా చౌదరి పేర్కొన్నారు. కాగా తన భర్త చావుకు శిఖా చౌదిరే కారణమని మృతుడు చిగురుపాటి జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపించారు. అంతేకాకుండా ఈ కేసును తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టాలని ఆమె కోరారు. (జయరామ్ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!) జయరామ్ బంధువుల ఫిర్యాదు మేరకు ఈ హత్యకేసును తెలంగాణ పోలీసులు మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించనున్నారు. శిఖా చౌదరిని పోలీసులు విచారించనున్నారు. హత్య వెనక దాగిన కుట్ర, జయరాం కుటుంబం లేవనెత్తిన అనుమానాల నివృత్తిపై పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని హైదరాబాద్ తరలించి, విచారణ జరపనున్నారు. -
శిఖాచౌదరిని విచారించనున్న తెలంగాణ పోలీసులు
-
జయరామ్ హత్య కేసుతో నాకు సంబంధం లేదు
-
శిఖాను విచారించనున్న హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని నందిగామ పోలీసుల నుంచి తెలంగాణలోని హైదరాబాద్ పోలీసులకు ఈ కేసు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు శిఖా చౌదరి ప్రియుడే అని ఏపీ పోలీసులు తేల్చగా.. జయరామ్ భార్య పద్మశ్రీ దానిని ఖండించారు. జయరామ్ మేనకోడలు శిఖా పాత్రే ఈ కేసులో ప్రధానంగా ఉందని.. తన భర్త చావుకు శిఖాయే కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జయరామ్ హత్యకేసును మొదటినుంచి దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. జయరామ్ మామయ్య గుత్తా పిచ్చయ్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 419, 342, 346, 348, 302, 201, రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేసుకున్నారు. ఏపీలో ఉన్న కేసు నిందితులను ఈరోజు హైదరాబాద్‌కు తరలించనున్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం శిఖాను పోలీసులు విచారించనున్నారు. (జయరామ్ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!) కీలకంగా మారనున్న ‘రీ–కన్స్ట్రక్షన్’... రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్‌లు, పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. జయరామ్ కారును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. శిఖా చౌదరి ప్రియుడి ఫ్లాట్ నుంచి ఐతవరం టోల్గేట్ వరకు సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ ప్రక్రియ కీలకం కానుంది. శిఖా ఇంట్లో అనేక అంశాలు పరిశీలించ నున్నారు. ఆపై గొడవ జరిగిన తీరు, మృతదేహాన్ని కారులోకి వాచ్‌మన్ సాయంతో తరలించిన తీరు సహా నందిగామ వరకు జరిగిన పరిణామాలను సరిచూస్తారు. ఈలోపే పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ సేకరించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో సీసీ కెమెరాలు కీలకం కానున్నాయి. జయరామ్‌తో పాటు, నిందితుల కాల్ లిస్ట్, సెల్‌ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా కేసును విచారించనున్నారు. హత్య వెనక దాగిన కుట్ర, జయరాం కుటుంబం లేవనెత్తిన అనుమానాల నివృత్తిపై పోలీసులు దృష్టి పెట్టారు. -
జయరామ్ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు ఆంధ్ర ప్రదేశ్‌లోని నందిగామ పోలీసుల నుంచి తెలంగాణలోని హైదరాబాద్ పోలీసులకు బదిలీ అయింది. ఈ ఫైల్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి చేరుకోవడంతో గురు వారం కొత్వాల్ అంజనీకుమార్ వెస్ట్‌జోన్ పోలీసులతో సమీక్షించారు. నేరస్థలం జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని రాకేష్‌రెడ్డి నివాసంలో కావడంతో కేసును ప్రాథమికంగా అక్కడి పోలీసులకే అప్పగించనున్నారు. ఈ కేసులో ఉన్న అనేక అనుమానాల నివృత్తి కోసం ఆది నుంచీ దర్యాప్తు చేయాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. నాటకీయ పరిణామాలపై దృష్టి.. కృష్ణాజిల్లా నందిగామలో ఈ నెల 1న జయ రామ్ మృతదేహం లభించిన నాటి నుంచి ఏపీ పోలీసుల దర్యాప్తులో అనేక నాటకీయ పరి ణామాలు చోటు చేసుకున్నాయి. జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ప్రధాన అనుమానితురాలు అనే వార్తలు తొలుత వెలువడ్డాయి. అయితే మంగళవారం రాకేష్‌రెడ్డి, వాచ్‌మన్ శ్రీనివాస్రెడ్డిల్ని మాత్రమే నిందితులుగా ప్రక టిస్తూ అరెస్టు చేశారు. శిఖాను గుట్టుచప్పుడు కాకుండా ఏపీ నుంచి హైదరాబాద్‌కు పంపిం చేశారు. వీటిపై దృష్టి పెట్టనున్న సిటీ పోలీసులు శిఖా చౌదరినీ విచారించాలని భావిస్తున్నారు. గత నెల 31న శిఖా జయరామ్ ఇంట్లోకి బల వంతంగా ప్రవేశించి బీరువాలో నుంచి విలువైన పత్రాలు, భూమి పత్రాలు తీసుకువెళ్లినట్లు హతుడి భార్య పద్మశ్రీ ఆరోపించారు. దీనిపై ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిఖాను ప్రశ్నించే సమయంలో వీటి గుట్టు విప్పాలని నగర పోలీసులు నిర్ణయించారు. కాపాడటానికే ఆ కారణాలా? జయరామ్ హత్య కేసుకు చెందిన వివరాలు వెల్లడిం చిన కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి.. జయరామ్ రాకేష్‌రెడ్డి నుంచి తీసుకున్న రూ.4.17 కోట్ల కోసమే ఈ హత్య జరిగినట్లు తెలిపారు. దీని పైనా సిటీ పోలీసులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. రాకేష్‌కు ‘చినబాబు’తో సహా తెలుగుదేశం పార్టీలోని అనేక మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు వెలువడ్డాయి. దీంతో రాకేష్‌ను పరోక్షంగా, ఇతరులను ప్రత్యక్షంగా కాపాడ టానికే ఈ కారణాలు చెప్పారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటి నివృత్తికి నిందితుల్ని కస్టడీలోకి తీసుకోనున్నారు. దీనికోసం జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైన తర్వాత నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకోనున్నారు. ఆపై నిందితుల్ని ఏపీ జైలు నుంచి తీసుకువచ్చి ఇక్కడి ప్రక్రియలు పూర్తిచేసుకొని వారిద్దరినీ విచారించాలని నిర్ణయించారు. కీలకంగా మారనున్న ‘రీ–కన్స్ట్రక్షన్’... జయరామ్ హత్య కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు చేపట్టనున్న క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ ప్రక్రియ కీలకం కానుంది. రాకేష్ ఇంట్లో అనేక అంశాలు పరిశీలించ నున్నారు. ఆపై గొడవ జరిగిన తీరు, మృతదేహాన్ని కారులోకి వాచ్‌మన్ సాయంతో తరలించిన తీరు సహా నందిగామ వరకు జరిగిన పరిణామాలను సరిచూస్తారు. ఈలోపే పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ సేకరించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దసపల్లా గుట్టు విప్పాలని నిర్ణయం.. జయరామ్ హత్యకు మూలాలు దసపల్లా హోటల్లోనూ ఉన్నాయి. గత నెల 29, 30, 31 తేదీల్లో దసపల్లా హోటల్లో జయరామ్‌కు చెందిన కీలక పరిణామాలు జరిగాయి. ఆ రోజు అక్కడ సమావేశమైనవారిలో హతుడు, నిందితుడు, మరికొందరు ఉన్నారని తెలుస్తోంది. తెల్లచొక్కా ధరించిన ఓ వ్యక్తి సీసీఫుటేజీలో కనిపించినా ఏపీ పోలీసుల దర్యాప్తులో ఈ వివరాలు బయటకు రాలేదు. 31న జయరామ్‌కు ఓ వ్యక్తి రూ.6 లక్షలు అక్కడకు తెచ్చి ఇచ్చారు. అతనెవరు.. దాన్ని తీసుకున్న ఓ యువతి ఎవరు? అనేదీ తేలాల్సి ఉంది. హోటల్లో గది ఎవరి పేరిట బుక్ అయి ఉంది? అనే వివరాలు పోలీసులు తెలుసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 44 నుంచి రాకేష్‌రెడ్డి ఇంటి వరకు సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించి ఆ రోజు జయరామ్ ఎన్ని గంటలకు వెళ్లారు, మృత దేహాన్ని కారులో ఏ సమయంలో బయటికి తీసుకొచ్చారు? అనే అంశాలు తెలుసుకోనున్నారు. శిఖా చౌదరికి ఆ హత్యతో సంబంధం ఉంది: పద్మశ్రీ ఆంధ్రా పోలీసుల విచారణ సరిగ్గాలేదనే తన భర్త జయరామ్ హత్యకేసును తెలంగాణ పోలీసులకు అప్పగించాలని ఫిర్యాదు చేసానని పద్మశ్రీ వెల్ల డిం చారు. గురువారం ఆమె జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లోని తన నివాసంలో మీడియాతో మాట్లా డారు. ఈరోజు తమ పెళ్లిరోజని, గతంలో తన భర్తతో ఉన్న అనుబంధం తలచుకొని కుమిలి పోయానని వెల్లడించారు. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించు కోలేకపోతున్నానని, ఇంకా తన పిల్లలు తేరుకోలేదన్నారు. జయ రామ్ మర ణిస్తే ఘటనాస్థలానికి వెళ్లకుండా శిఖాచౌదరి తమ ఇంటికి ఎం దుకు వచ్చిందని, తమతో ఎలాంటి సంబంధం లేనివాళ్లతో ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. ఈ విష యాన్ని తెలంగాణ పోలీ సులు, ప్రభుత్వం విచా రణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. శిఖాచౌదరికి ఈ కేసుతో సంబంధం లేదని చెప్పడం అన్యాయ మన్నారు. 2014లో శిఖా తమ కుటుంబంలోకి వచ్చింద న్నారు. ఆమె కుటుంబం మొత్తానికి జయరామ్ హత్యలో భాగముందన్నారు. కొన్ని ఒత్తిడులకు లొంగి రాకేష్‌రెడ్డిపై కేసును రుద్దారన్నారు. రాకేష్ ఎవరో తనకు తెలియదనీ, ఆయనకు ఇవ్వాల్సిన డబ్బుల గూర్చీ తెలీదన్నారు. శిఖాకు ఎవరు సహకరిస్తున్నారో తేల్చాలని కోరారు. ఎక్స్‌ప్రెస్ టీవీలో శిఖాకు అంతపెద్ద హోదా ఇవ్వడం సరికాదని తానే తొలగించానన్నారు. దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ జయరామ్ హత్య కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావును నియమించాం. గురువారం కృష్ణా జిల్లా ఎస్పీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక మెసెంజర్ కేసు ఫైల్ తీసుకువచ్చి అప్పగించాడు. జూబ్లీహిల్స్ ఠాణాలో రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తాం. ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చిన జయరామ్ భార్య పద్మశ్రీ తెలంగాణ, హైదరాబాద్ పోలీసులపై తనకు అపారమైన నమ్మకం ఉందని అన్నారు. దీన్ని నిలబెట్టుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేసి వీలైనంత త్వరలో పూర్తి చేస్తాం. – అంజనీకుమార్, హైదరాబాద్ కొత్వాల్ ఖాకీల పాత్రపైనా సమగ్రంగా... జయరామ్ హత్య ఎపిసోడ్లో హైదరాబాద్‌లో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీని వాసులు, రాచకొండకు చెందిన ఏసీపీ మల్లారెడ్డిల పాత్ర తీవ్ర సంచలనం సృష్టిం చింది. జయరామ్ మృతదేహం తరలింపునకు గాను తాను వారిద్దరికీ ఫోన్లు చేశానని, వారిచ్చిన సలహాల మేరకే వ్యవహరించానని రాకేష్‌రెడ్డి ఏపీ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అంతే కాకుండా ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు నల్లకుంట స్టేషనులో ఉన్నప్పుడే మృతదేహం తరలిస్తున్న కారును రాకేష్ అక్కడకు తీసుకువెళ్లాడని, బయటే ఉండి ఆయనకు ఫోన్ చేశాడని తెలుస్తోంది. అయితే వీటిని ఇద్దరు అధికారులు ఖండిస్తున్నారు. ఈ వివరాల ఆరా కోసం అవసరమైతే వారిద్దరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. -
జయరాం కేసులో నిజాలను వెలికితీస్తాం : సీపీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ అయ్యిందని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ స్పెషల్ మెసెంజర్ ద్వారా తమకు సమాచారం చేరిందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యలేదని.. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి న్యాయం ఆశిస్తున్నానంటూ జయరాం సతీమణి పద్మశ్రీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. కేసును తెలంగాణకు బదిలీ చేయాలని పద్మశ్రీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. (శిఖా చౌదరే చేయించింది: జయరాం భార్య) తమపై జయరాం భార్య ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు. కేసుపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడుతామన్నారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుందని చెప్పారు. జయరాం హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను కూడా విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిలో ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలను వెలుగుతీస్తామని సీపీ పేర్కొన్నారు. -
హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉంది
-
శిఖా చౌదరే చేయించింది: జయరాం భార్య
సాక్షి, హైదరాబాద్: తన భర్త హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉందని ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిఖా ప్రమేయం లేకుంటే తన భర్త చనిపోయేవారు కాదని అన్నారు. తమ ఆస్తులు లాక్కునేందుకే ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయిందని ఆమె ఆరోపించారు. ఆమె వ్యవహారం చూసి తన భర్తకు ప్రాణహాని ఉందని ఐదేళ్ల క్రితమే భయపడినట్టు వెల్లడించారు. హత్యకు ప్లాన్ చేసింది శిఖాయేనని స్పష్టం చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. పేద అమ్మాయి అయిన శిఖా చౌదరి నేడు బిఎండబ్ల్యూ కారులో ఎలా తిరుగుతోందని ప్రశ్నించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిందని, డబ్బు కోసం ఆమె ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు. అలాంటి అమ్మాయి తమ ఇంట్లో ఉండటం దురదృష్టమన్నారు. జయరాం చనిపోయిన కబురు తెలిసినా తర్వాత నందిగామ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. జయరాం ఇంటికి వెళ్లి పలు కీలక పత్రాలు, విలువైన వస్తువులు తీసుకుపోయిందని ఆరోపించారు. ఎక్స్‌ప్రెస్ టీవీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాతే ఆ చానల్ నాశమైందన్నారు. (శిఖా ప్రియుడే హంతకుడు) రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. జయరాంకు రాకేష్‌రెడ్డి నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చారనడంతో వాస్తవం లేదని చెప్పారు. శిఖా చౌదరికే చెక్ పవర్ ఉందని వెల్లడించారు. తన భర్త అంత్యక్రియలకు ఆయన తరపు దగ్గర బంధువులు ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయరాంకు మహిళలతో సంబంధాలున్నాయని వింటుంటే బాధగా ఉందని పద్మశ్రీ అన్నారు. తన భర్తతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. (ఎవరీ రాకేష్ రెడ్డి..?) -
జయరాం హత్య కేసులో మరో మలుపు
-
జయరాం కేసు తెలంగాణకు బదిలీ
సాక్షి, అమరావతి బ్యూరో: వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకం ప్రకారం జయరాంను ఇంటికి రప్పించి హత్య చేసిన రాకేష్‌రెడ్డి.. ఆ తర్వాత ఇద్దరు తెలంగాణ పోలీసు అధికారుల సలహా మేరకు మృతదేహాన్ని ఏపీకి తీసుకొచ్చి ప్రమాద ఘటనగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఈ çఘట న వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన మేన కోడలు శిఖాచౌదరి చుట్టే కేసు తిరిగింది. కేసు నుంచి శిఖాను బయటపడేసేందుకు ఏపీలోని కొందరు టీడీపీ నేతలు యత్నిస్తున్నారనే ప్రచా రం జరిగింది. చివరకు రాకేశ్ నిందితుడని నందిగామ పోలీసులు పేర్కొనగా.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జయరాం భార్య పద్మశ్రీ చెప్పడంతో కేసు మరో కీలక మలుపు తిరిగింది. అన్నీ అనుమానాలే..? అమెరికా పౌరసత్వమున్న జయరాంకు వందల కోట్ల ఆస్తులున్నాయి. ఆ స్థాయి వ్యక్తి రాకేష్ వద్ద రూ. 4.17 కోట్లు ఎందుకు అప్పుగా తీసుకున్నాడన్న అంశం ప్రశ్నగా మిగిలిపోయింది. శిఖాని పెళ్లిచేసుకోవాలని భావించిన రాకేష్ కేవలం డబ్బు కోసమే జయరాంను హత్య చేశాడా? జయరాంను హత్య చేశాక ఆ సమాచారం శిఖాకి చెప్పలేదా? హత్య విషయాన్ని తెలంగాణ పోలీ సులకు చెబితే వారెందుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు? శిఖా పాత్రపై అనేక ఆరోపణలు వెల్లువెత్తినా.. ఏపీ పోలీసులు ఎందు కు నిర్లక్ష్యం చేశారు? అంటూ పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నందిగామ పోలీసులు హైదరాబాద్‌లో రాకేష్, జయరాం నివాసాల్లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. జయరాం కాల్‌డేటా ఆయన ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరితో కలిశారు? అన్న కోణం లోనూ ఆధారాలు సేకరించారు. హత్యానేరాన్ని అంగీకరిస్తూ రాకేష్ వాగ్మూలంలో ఇచ్చిన సమా చారానికి, పోలీసులు సేకరించిన ఆధారాలకు ఎక్కడ పొంతన లేదని తెలుస్తోంది. సాంకేతికంగానూ సాక్ష్యాల సేకరణ కష్టంగా మారిందని, ఈ సా«క్ష్యాలతో కేసు నిలబడదని, నేరస్తులు తప్పించుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కేసులో సాంకేతికంగా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని జిల్లా ఎస్పీ త్రిపాఠి పేర్కొనడం నిపుణుల వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. నిందితులకు రిమాండ్ జయరాం హత్య కేసులో నిందితు లైన కవకుంట్ల రాకేష్, దున్నే శ్రీనివాస్‌లను నందిగామ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చామని ఎస్హెచ్ఓ వెంకటరమణ తెలిపారు. నిందితులకు 20వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. కేసు తెలంగాణతో ముడిపడడం వల్లే బదిలీ: ఏపీ ప్రభుత్వం సాక్షి, అమరావతి: చిగురుపాటి జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని, కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం కేసును తెలంగాణకు అప్పగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడడంతో కేసుపై ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. -
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ
-
జయరామ్ హత్యకేసులో కీలక మలుపు..!
సాక్షి, హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జయరామ్ హత్య కేసులో మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై మృతుని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్త చేశారు. కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు.(ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు) కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడి ఉండడంతోనే జయరామ్ కేసును బదిలీ చేసినట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో కేసును బదిలీ చేయకుండా మరింత వివాదాలకు తావు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జయరామ్ హత్య కేసులో శిఖాకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు చెప్పడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మేనకోడలు శిఖా, సొంత అక్కనుంచి ప్రాణహాని ఉందంటూ జయరామ్ గతంలో తనతో చెప్పినట్టు పద్మశ్రీ మీడియాకు వెల్లడించారు. శాస్త్రీయంగా ఉండాలనే బదిలీ : డీజీపీ కేసు బదిలీ గురించి ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ..‘చిగురుపాటి జయరామ్ హత్యకేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నాం. ఈ మేరకు న్యాయపరమైన అనుమతులు రాగానే కేసు బదిలీ అవుతుంది. హత్యా ఘటన హైదరాబాద్‌లో జరిగిన నేపథ్యంలో కేసు దర్యాప్తు అక్కడ నుంచి జరగడమే శాస్త్రీయంగా ఉంటుంది’ అని చెప్పారు. -
హత్య జరిగింది జూబ్లీహిల్స్లోనే..
బంజారాహిల్స్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిరుగుపాటి జయరాం హత్య జూబ్లీహిల్స్‌లో జరిగినట్లు తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో రాకేష్‌రెడ్డి గత నెల 31వ తేదీన వ్యాపార లావాదేవీలపై మాట్లాడకుందామని తన ఇంటికి పిలిచి ముందస్తు పథకం ప్రకారం దారుణంగా హత్యచేసినట్లు వెల్లడికావడంతో ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించింది. నిన్న మొన్నటి దాకా హత్య ఎక్కడ జరిగిందో తెలియక ఈ ఘటన అయోమయానికి గురికాగా మంగళవారం నందిగామ పోలీసులు హత్య జరిగింది జూబ్లీహిల్స్లోనే అని నిర్థారించడంతో మిస్టరీ వీడింది. రాకేష్‌రెడ్డి తన ఇంటికి జయరాంను పిలిపించడం ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడం మాట మాటా పెరగడంతో ఈ హత్య జరిగినట్లు స్పష్టమైంది. వాచ్‌మన్ శ్రీనివాస్‌తో కలిసి రాకేష్‌రెడ్డి మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించిన విషయం తెలిసి కాలనీవాసులతో పాటు స్థానిక పోలీసులు నిర్ఘాంత పోతున్నారు. ఒక ఇంట్లో హత్య జరిగి..ఆ శవాన్ని కారులో తీసుకుపోతున్నా చుట్టుపక్కల ఏ ఒక్కరికీ తెలియకపోవడం చూస్తుంటే జూబ్లీహిల్స్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ హత్య తమ ఇంటిపక్కనే జరిగిందని తెలిసేసరికి పొరుగున ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. ఇప్పుడంతా ఇదే చర్చ కొనసాగుతున్నది. నెలలో రెండు మూడు వారాలు రాకేష్‌రెడ్డి ఇంట్లో సెటిల్మెంట్లు జరుగుతుంటాయని రాత్రిపూటనే చాలామంది వచ్చిపోతుంటారని స్థానికులు తెలిపారు. ప్రతి రోజు ఖరీదైన కార్లలో యువతులు ఇక్కడికి వస్తుంటారని, తరచూ మద్యం పార్టీలు జరుగుతుంటాయని ఇదంతా తమకు సాధారణమైన విషమే అయినా హత్య జరిగిందని తెలిసేసరికి భయబ్రాంతులకు గురయ్యామని స్థానికులు తెలిపారు. విందు వినోదాలకు పోలీసులు కూడా వస్తుంటారని వారు తెలిపారు.