
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటుడు సూర్యప్రసాద్ తెలిపారు. హానీ ట్రాప్ చేసి జయరామ్‌ను తీసుకొచ్చారనేది అవాస్తవమని ‘సాక్షి’ టీవీతో చెప్పారు. జనవరి 28 నుండి 31 వరకు రాకేష్ రెడ్డి ఫోన్ కాల్ లిస్ట్‌లో తన నంబర్ ఎక్కువగా ఉండటం కారణంగానే తనను పోలీసులు విచారణకు పిలిచారని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నిటికి తాను సమాధానం చెప్పానన్నారు. రాకేష్ రెడ్డితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, తన సినిమా ప్రమోషన్ కోసమే అతడిని కలిసినట్టు వెల్లడించారు. (జయరాం హత్య జరగ్గానే ఏపీ మంత్రికి రాకేష్ ఫోన్)
ఇప్పటివరకు శిఖా చౌదరిని తాను చూడలేదు, మాట్లాడలేదన్నారు. జయరామ్ హత్య జరిగిన విషయం మీడియాలో చూసి తాను షాక్ అయ్యానన్నారు. హానీ ట్రాప్‌లో తాను ఉన్నాను అన్నప్పుడు బాధ కలిగించిందన్నారు. ‘మీ భర్త హత్య కేసులో నా ప్రేమయం లేదు నమ్మండి’ అంటూ జయరామ్ భార్య పద్మశ్రీని వేడుకున్నారు. తాను నటించిన ‘కలియుగ’ సినిమా ప్రమోషన్ కోసం డబ్బులు సమకూరుస్తాను అంటేనే నేను రాకేష్ రెడ్డిని నమ్మినట్టు చెప్పారు. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచిన సహకరిస్తానని సూర్య అన్నారు. రాకేష్ రెడ్డిని చట్టపరంగా శిక్షించాలని కోరాడు. (రాకేష్ రెడ్డి అక్రమాలు ఇంతంత కాదయా)
Comments
Please login to add a commentAdd a comment