అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. హైప్ విషయంలో తిరుగులేదు కానీ టికెట్ రేట్ల దగ్గరే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఆర్మూర్ భాజపా ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇప్పుడు ఈ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)
'పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధం. ఎర్రచందనం లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు లాగా చూపించారు. దీంతో యూత్ చాలా చెట్లు నరికేశారు. ఇప్పుడు 'పుష్ప 2'కి ఇంకెన్ని నరికేస్తారో? సినిమా వల్ల యువత చెడిపోతోంది. అల్లు అర్జున్, సుకుమార్‌ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి' అని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి.
ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే రెచ్చిపోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథాంశంతో 'పుష్ప' సినిమాల్ని తీశారు. తొలి భాగం రిలీజైనప్పుడు పలు విమర్శలు వచ్చినప్పటికీ.. ఈ తరహాలో అదీ కూడా ఓ ఎమ్మెల్యే మాట్లాడటం ఇప్పుడు షాకింగ్‌గా ఉంది.
(ఇదీ చదవండి: నిఖిల్‌ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్)
Comments
Please login to add a commentAdd a comment