మరో వారం పదిరోజుల్లో బిగ్ బాస్ ఫినాలే ఉండొచ్చు. దీంతో ఈసారి నామినేషన్స్ హడావుడి పెద్దగా లేదు. ఫైనలిస్ట్ అయిన అవినాష్ తప్పితే అందరూ లిస్టులో ఉన్నారు. అంటే గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నట్లే. అయితే బిగ్‌బాస్ ఈ వారమంతా కొన్ని గేమ్స్ పెడుతుంటాడు. వాటిలో ఎవరైతే గెలుస్తారో.. వాళ్లకు ఓట్లు అడుక్కునే అవకాశం దక్కుతుంది. మంగళవారం ఎపిసోడ్‌తో ఈ తంతు మొదలైంది. ఇంతకీ 93వ రోజు ఏమేం జరిగిందనేది హైలైట్స్‌లో చూద్దాం.
(ఇదీ చదవండి: బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్)
అయితే ఓటింగ్ రిక్వెస్ట్ కోసం జంటలుగా కొన్ని ఛాలెంజెస్‌లో పాల్గొనాలి. ఎవరికైతే జంట ఉండదో వారు ఈ ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ జంటలని ఎంచుకొని చెప్పండని బిగ్‌బాస్ చెప్పాడు. అలా అవినాష్-నబీల్, ప్రేరణ-నిఖిల్, విష్ణు-రోహిణి జంటలుగా సెట్ అవగా.. గౌతమ్ ఏకాకిగా మిగిలిపోయాడు. ఇంతలో ట్విస్ట్ ఇచ్చిన నబీల్.. అవినాష్‌ని వదిలేసి గౌతమ్‌తో జోడీ కట్టాడు.
మూడు జంటలకు తొలి పోటీగా 'నా టవర్ ఎత్తయినది' అనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా జంటలు ఎవరికి వాళ్లు ఓ టవర్ నిర్మించాల్సి ఉంటుంది. నిలబెట్టిన దాన్ని వేరే జోడీలు పడగొట్టొచ్చు. బజర్ మోగేసరికి ఎవరిదైతే ఎత్తుగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఇందులో అందరూ బాగానే ఆడతారు గానీ ప్రేరణ-నిఖిల్ తొలి స్థానంలో నిలుస్తారు. రోహిణి-విష్ణుప్రియ రెండో స్థానం సొంతం చేసుకుంటారు. చివర్లో నిలిచిన గౌతమ్-నబీల్.. ఓటు అప్పీల్ రేసు నుంచి తప్పుకొన్నారు.
(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ))
మొదటి పోటీ తర్వాత రెండో పోటీ పెట్టారు. 'టక్ టకాటక్' అనే గేమ్‌లో భాగంగా తమ తమ ప్లేసులో ఉండే డిస్కులు.. పక్క వాళ్ల ప్లేసులోకి తోసేయాలి. ఈ పోటీని ఒక్కొక్కరుగా ఆడాలి. దీంతో ప్రేరణ-నిఖిల్ ఉంటారు. విష్ణు-రోహిణిలలో ఒక్కరే ఆడాలని బిగ్ బాస్ చెప్పగా.. రోహిణి ముందుకొస్తుంది. ఈ పోటీలో గెలిచిన ప్రేరణ.. ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కించుకున్న తొలి విజేతగా నిలిచింది. దీంతో ఈమెని ఇన్ఫినిటీ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ప్రేక్షకుల్ని ఓట్లు అప్పీలు చేసుకోమన్నాడు.
'బిగ్‌బాస్ జర్నీలో ఇక్కడ ఉంటానని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమ, సపోర్ట్ దొరికింది. ఇక్కడికి వచ్చి నాలాగా ఉండాలనుకున్నాను, ఉంటున్నాను. కచ్చితంగా కొన్నిసార్లు తప్పు చేశా. ఎవరూ ఫెర్‌ఫెక్ట్‌గా ఉండరు. నేను తప్పులు చేశాను. ఎవరు చెప్పినా వాటి నుంచి నేర్చుకున్నాను. నా గురించి నాకే కొన్ని మంచి, కొన్ని చెడు అంశాలు తెలిశాయి. ఇప్పటివరకు 13 వారాలు సేవ్ అయ్యాను. ఇది దాటేస్తే ఇక ఫైనల్స్. మీ ఓట్స్ నాకు ఇవ్వండి. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలి మహిళా విన్నర్ అవ్వాలని ఆశ ఉంది. అది మీ వల్లే అవుతుంది. ఓటు మీది గెలుపు నాది' అని ప్రేరణ రిక్వెస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?)
సోమవారం నామినేషన్స్ లేకపోయినా సరే గౌతమ్-నిఖిల్ మధ్య పెద్ద వాగ్వాదమే నడిచింది. 'యష్మిని వాడుకున్నావ్' అని నిఖిల్‌పై నోరు జారిన గౌతమ్.. మంగళవారం ఎపిసోడ్‌లో మాత్రం అందరిముందు క్షమాపణలు చెప్పాడు. ఎవరిది తప్పు ఎవరిది కాదు అని నేను చెప్పను. వాడుకున్నావ్ అన్నది వేరే రకంగా అనలే, గేమ్‌లో నువ్వు ఆటాడుతున్నావ్ అని ఎట్ల అన్నావో నేను వాడుతున్నా అని అట్ల అన్నా.. దానికి నువ్వు హర్ట్ అయ్యావనిపించింది కాబట్టి నేను అన్న ఆ మాటని వెనక్కి తీసుకుంటూ ఆ బాధ్యత వహిస్తూ ఐయామ్ రియల్లీ సారీ నిఖిల్.. మరోసారి నీ దగ్గర నోరు జారకుండా జాగ్రత్త పడతానని గౌతమ్ అన్నాడు.
దీనికి స్పందించిన నిఖిల్.. నాకు తెలినంతవరకూ నిన్న మాట్లాడింది నీది కానీ ఇంకెవరిదైనా పర్సనల్ విషయం నేను తీయలేదు. ఒకవేళ నీకు అలా అనిపించి ఉంటే ఐ యామ్ సారీ. వేరే ఎక్కడా నేను ఇప్పటివరకూ నోరు జారలేదు.. మూస్కొని నొక్కు అన్న మాట వాడినందుకు సారీ.. దానికి నేను నిజంగా సారీ చెబుతున్నా అని చెప్పాడు. వెంటనే ఇద్దరూ ఒకరికొకరు హగ్ ఇచ్చుకున్నారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.
(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment