మరో ఒకటి రెండు రోజుల్లో 'పుష్ప 2' థియేటర్లలోకి రాబోతుంది. రిలీజయ్యేంత వరకు అంతా టెన్షన్ టెన్షనే. ఫైనల్ మిక్స్ ఇప్పుడు పూర్తయినట్లు చెప్పారు. కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎంతలా రూమర్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ విషయమై షాకింగ్ విషయం ఒకటి వైరల్ అవుతోంది.
'పుష్ప' సినిమాలకు మ్యూజిక్ అంతా దేవిశ్రీ ప్రసాదే. అయితే పార్ట్-2 విషయంలో టైమ్ దగ్గర పడుతుండేసరికి తమన్, అజనీష్ లోక్‌నాథ్, శామ్ సీఎస్ తదితరులు కూడా పనిచేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం బాలకృష్ణ 'డాకు మహరాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన తమన్.. తాను కూడా 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు చెప్పాడు.
(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)
కానీ ఇప్పుడు 'పుష్ప 2' ఫైనల్ మిక్సింగ్ అంతా పూర్తయిన తర్వతా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. సినిమా కోసం కేవలం దేవి, శామ్ సీఎస్ మాత్రమే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని, మిగిలిన వాళ్లిచ్చిన ఔట్‌పుట్ ఉపయోగించుకోలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎందుకంటే సినిమా టైటిల్ కార్డ్స్‌లో పేర్లు పడతాయిగా!
హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దాదాపు అందరూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించే ప్రస్తావించారు తప్పితే మరో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడొస్తున్న రూమర్స్ చూస్తే బహుశా నిజమే అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ))
Comments
Please login to add a commentAdd a comment