'పుష్ప 2' సినిమా ఒకటి రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే టికెట్ సేల్స్, ఫ్యాన్స్ హడావుడి గట్టిగానే ఉంది. మరోవైపు 'పుష్ప 3' ఉంటుందా లేదా అనే విషయమై చాలా సందేహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ ఫొటో అభిమానుల్ని ఇంకాస్త కన్ఫ్యూజన్ చేస్తోంది.
(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)
కొన్నిరోజుల క్రితం 'పుష్ప 3' ఉండొచ్చనే రూమర్స్ వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ మీ హీరో మరో మూడేళ్లు ఇస్తే పార్ట్-3 చేస్తానని బన్నీ ఫ్యాన్స్‌తో అన్నాడు. అంటే చూచాయిగా లేదని చెప్పాడు. ఒకవేళ చేయాలన్నా సరే ఇప్పట్లో అయితే కష్టం. ఎందుకంటే సుకుమార్.. నెక్స్ట్ రామ్ చరణ్‌తో పనిచేస్తాడు. బన్నీ కోసం త్రివిక్రమ్ వెయిటింగ్.
ఇలా మూడో పార్ట్‌పై ఎవరి సందేహాలు వాళ్లకు ఉన్నాయి. ఇంతలో మూవీకి సౌండ్ ఇంజినీర్‌గా చేసిన రసూల్ పొకుట్టి తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. కాకపోతే వెనక స్క్రీన్‌పై మాత్రం 'పుష్ప 3: ద ర్యాంపేజ్' అని ఉంది. ప్రస్తుతానికి మూడో భాగం గురించి కార్డ్ అయితే వేసేస్తారు కానీ ఇప్పట్లో అయితే చేయకపోవచ్చు అని తెలుస్తోంది. ఒకవేళ చేసినా సరే మరో మూడేళ్లు అంటే కష్టమేగా!
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేను.. శోభా శెట్టి కన్నీళ్లు)
Comments
Please login to add a commentAdd a comment