కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి అనుకోని పరిస్థితుల్లో హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఎలిమేనేషన్ ప్రక్రియలో తాను సేవ్ అయినప్పటికీ హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ భరించలేకున్నానంటూ తనను బిగ్ బాస్ నుంచి బయటకు పంపాలని హౌస్ట్ కిచ్చా సుదీప్‌ను కోరింది. అయితే, తాను బయటకు రావడానికి గల కారణాలు తెలిపి హౌస్ నుంచి వచ్చేసింది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో తనదైన గేమ్‌తో ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన శోభా శెట్టి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి టాలీవుడ్ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇక్కడి బిగ్‌బాస్‌లో శివంగిలా సత్తా చాటిన ఆమె ఎందుకు బయటకొచ్చిందో ఇలా పేర్కొంది. కేవలం రెండు వారాల పాటు మాత్రమే ఉన్న శోభ.. తన అనారోగ్య కారణాల వల్ల షో నుంచి బయటకు వచ్చేసింది. బిగ్‌బాస్‌లో గేమ్ ఆడాలని ఉంది కానీ ఆరోగ్యం సహకరించడం లేదని ఆమె పేర్కొంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన షోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది.
'నా బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. ఆటపై దృష్టి పెట్టేందుకు ఆరోగ్యం సహకరించడం లేదు. ముందుకు వెళ్లాలనే సంకల్పం ఉన్నప్పటికీ, శరీరం దానిని ముందుకు సాగనివ్వడం లేదు. నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, జీవిత బాధ్యతలతో ముందుకు సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నాపై చూపిన మీ ప్రేమ, మద్దతుకు నేను ఎప్పటికీ కృతతో ఉంటాను. నేను తెలిసి లేదా తెలియక ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నా అభిమానులకు, కలర్స్ కన్నడ టీమ్‌తో పాటు మన ప్రియమైన కిచ్చా సుదీప్ సర్‌కి ధన్యవాదాలు' అని శోభా శెట్టి పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment