
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంకా దొరసాని అహంకారం తగ్గలేదని విమర్శించారు రాకేష్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రాకేష్ రెడ్డి..‘దొరలు.. దొరసానికి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు వచ్చింది. కవిత దొర అహంకారం మానుకో. కేసిఆర్..రేవంత్ రెడ్డి హిందూ ద్రోహులు. కుంభమేళాకు ఎందుకు పోలేదో చెప్పాలి. హిందువులను కేసీఆర్..రేవంత్ రెడ్డి అవమానించారు. అందుకే హిందువులు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారు’అని మండిపడ్డారు.
కొన్నిరోజుల క్రితం సీఎం రేవంత్ పై రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డిడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు రాకేశ్‌రెడ్డి. కిషన్‌రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదంటూ ధ్వజమెత్తారు.‘ మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్న వ్యక్తి రేవంత్. పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్‌రెడ్డి.
కిషన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కిషన్‌రెడ్డిది. నిజాయితీలో మచ్చలేని వ్యక్తి కిషన్‌రెడ్డిడ్డి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కు గట్టి సమాధానం చెబుతాం. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే మేమేందుకు నిధులిస్తాం. అవినీతి ప్రాజెక్టుల తప్ప, ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణకు నిధులిచ్చి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment