
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతుందన్నారు. ఇదే సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే ఎవరో బాగా తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో చిట్‌బాట్ మాట్లాడుతూ.. తెలంగాణలో కూటమి గురించి బీజేపీ హైకమాండ్ ఆలోచన చేయవద్దు. జనసేన, టీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ నష్టం జరుగుతుంది. అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఇబ్బంది అవుతుంది. బీఆర్‌ఎస్ లాంటి పార్టీలకు లబ్ధి జరుగుతోంది. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతోందన్నారు.
రాజాసింగ్ కామెంట్స్ స్పందిస్తూ..‘తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే అందరికీ తెలుసు. పార్టీ అంతర్గత వ్యవహారాలు వేదికలపై కాకుండా ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. రాజాసింగ్ తెలంగాణ బీజేపీకి ఆస్తి వంటి నాయకులు. ప్రధాని మోదీకి ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టూ పిన్ రిపోర్ట్ వెళ్తుంది. అధిష్ఠానం అంతా గమనిస్తోంది. పార్టీకి మంచి జరిగేది నలుగురిలో చెప్పాలి.. చెడు జరిగేది అధిష్ఠానం చెవిలో చెప్పాలి.
పార్టీ ప్రెసిడెంట్‌గా ఈటల, అరవింద్, రామచందర్ రావు, డీకే అరుణ, రఘునందన్ రావు ఎవరో ఒకరు అవుతారు. అధ్యక్షుడితో పాటు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడితే బాగుంటుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా ఇంచార్జ్‌లను పెట్టాలి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రక్షాళన చేస్తారని వినిపిస్తోంది. అదే జరిగితే కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి మంత్రి పదవులు పోతాయి అంటున్నారు అని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment