
సాక్షి, హైదరాబాద్ : వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పని మనిషి, వాచ్ మెన్, స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. శిఖా చౌదరి, జయరాం మధ్య ఉన్న సంబంధాల పై విచారణ సాగినట్లు సమాచారం. ఓ రహస్య ప్రాంతంలో వీరందరినీ పోలీసులు విచారించారు. త్వరలోనే శిఖా చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంది.
మరోవైపు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లని నాంపల్లి కోర్టు జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యడీషియల్ రిమాండ్ విధించింది. వీరిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు పోలీసులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ల కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నిందితులిద్దరిపై వారం రోజుల కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.