సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణలో భాగంగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు శుక్రవారం జయరాం భార్య పద్మశ్రీ వాంగ్మూలం తీసుకున్నారు. తన భర్త హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉందని ఆమె పునరుద్ఘాటించారు. (శిఖా చౌదరి ప్లాన్, రాకేష్ రెడ్డి యాక్షన్)
మరోవైపు శిఖా చౌదరికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, మరో నిందితుడు శ్రీనివాస్‌లను తమకు అప్పగించాలని జూబ్లీహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో రేపు ఇద్దరు నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఇద్దరిని తమ కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులిద్దరితో క్రైమ్ సీన్ రీ కంస్ట్రక్షన్ చేయనున్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం జయరాంను తానే హత్య చేశానని రాకేశ్‌రెడ్డి తమ విచారణలో ఒప్పుకున్నట్టు ఏపీ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. జయరాం భార్య పద్మశ్రీ విజ్ఞప్తి మేరకు ఈ కేసు దర్యాప్తుకు తెలంగాణ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment