padmasri
-
2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే!
కేంద్రం ప్రకటించిన 132 పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఇందులో వాణిజ్య, పారిశ్రామిక విభాగం నుంచి ఇద్దరికి పద్మ భూషణ్, మరో ఇద్దరికీ పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పద్మ భూషణ్ సీతారాం జిందాల్ - కర్ణాటకకు చెందిన జిందాల్ అల్యూమినియం లిమిటెడ్, సీతారాం జిందాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీతారాం జిందాల్ (SITARAM JINDAL)కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ లభించింది. యంగ్ లియు - ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఫాక్స్‌కాన్ సీఈఓ యంగ్ లియుకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ దక్కింది. భారతదేశంలో పారిశ్రామిక రంగంలో లియు చేసిన కృషికి కేంద్రం ఈ అవార్డుని అందించింది. భారతదేశంలో విస్తృతంగా సేవలందిస్తూ.. ఇప్పటికి సుమారు 40000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇదీ చదవండి: తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు! పద్మశ్రీ కల్పన మోర్పారియా - మహారాష్ట్రకు చెందిన జేపీ మోర్గాన్ ఇండియా సీఈఓ 'కల్పన మోర్పారియా'కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ లభించింది. శశి సోనీ - కర్ణాటకకు చెందిన శశి సోనీకి కూడా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ కైవసం చేసుకుంది. -
సీఎం జగన్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు
సాక్షి, తాడేపల్లి: నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, డా. కుంభా రవిబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం కలిశారు. గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పద్మశ్రీ, రవిబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గవర్నరు కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సభ్యులుగా నియమితులైన కర్రి పద్మశ్రీ, డా.కుంభా రవిబాబు ఎమ్మెల్సీలుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో వీరిరువురితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధి విధానాలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు. -
పశ్చిమగోదావరి జెడ్పీ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ
సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళ అయిన పద్మశ్రీ కి సీఎం జగన్ బీఫామ్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇవాళ జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగ్గా.. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీకి జిల్లా మంత్రులతో పాటు పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు. ‘‘బీసీ మహిళగా నన్ను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. సాధారణ గృహిణి నైన నాకు జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు . కొప్పుల వెలమలకు పెద్దపీట వేస్తూ జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. మెరుగైన పాలన అందించి సీఎం జగన్‌కి మంచి పేరు తీసుకొస్తాను’’ అని గంటా పద్మశ్రీ చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినట్లే వెనుక బడిన వర్గాలకు అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ,అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి అండగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ ప్రతి కార్య కర్త కు మంచి భవిష్యత ఉంటుందని నిరూపించారు. ఒక బీసీ మహిళకు జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. ::ఎమ్మెల్యే ఆళ్ళ నాని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. నాడు జడ్పీ చైర్మన్ గా నాకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. నేడు మంత్రి గా సీఎం జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారు. ఉద్యోగులకు వరాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఈనాడు లాంటి టిష్యూ పేపర్ మరొకరి లేదు. మేము అప్పుల పాలు చేశాము అంటున్నారు. మరి ఆనాడు 20 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు... వారికి కనపడలేదు. 4500 కోట్లు పసుపు కుంకుమ రూపంలో డైవర్ట్ చేశారు చంద్రబాబు. బాబు చేసిన అప్పై మేము తీర్చు తున్నాము. ::: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఈరోజు సామాజిక విప్లవం సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపిస్తుంది. బలహీన వర్గాల చెందిన వ్యక్తి కవురు శ్రీనివాస్ ను శాసనమండలికి పంపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేసి విప్లాత్మకమైన మార్పు తెచ్చారు. :::ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు బీసీలను ముందు పెట్టీ అధికారం అనుభవించేవాడు. ఇప్పుడు బీసీ వెలమ కులస్తులకి జడ్పీ చైర్మన్ కేటాయించి ప్రత్యేక స్థానం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు ఇచ్చి ఆయన రుణo తీర్చుకుందాం ::: ఎంపీ కోటగిరి శ్రీధర్ రెండో మహిళగా.. పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 1936లో జిల్లా బోర్డుగా ఏర్పడింది. 1959 లో జిల్లా ప్రజాపరిషత్‌గా అవతరించింది. అప్పటి నుంచి 21 మంది జెడ్పీ చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో 1995, 2000లో జెడ్పీ చైర్మన్‌గా ఇమ్మణ్ణి రాజేశ్వరి పనిచేయగా.. రెండో మహిళా చైర్‌పర్సన్‌గా పద్మశ్రీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
అందరికీ క్యాచీగా ఉండే పేరుతో సినిమా
'వైఫ్' చిత్ర దర్శకులు, రచయిత, నటులు రావిపల్లి రాంబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం 'పద్మశ్రీ' చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించింది. ఈ సందర్భంగా రాంబాబు గారు మాట్లాడుతూ "తన అభిమాన ఆత్మీయుడు, అయిన ఎస్. ఎస్. పట్నాయక్ చిత్ర దర్శకునిగా మారడమే కాకుండా సొంతంగా ఎస్.ఎస్.పిక్చర్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది" అని తెలిపారు. అనంతరం పద్మశ్రీ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నాగేశ్వర రావు, దేవి ప్రసాద్, వీరశంకర్, మోహన్ గౌడ్, చిత్తరంజన్, వర్ధమాన నటుడు దినేష్ తదితరులు హాజరయ్యారు. అందరికీ క్యాచీగా ఉండే పేరు పద్మశ్రీ, పోస్టర్స్ కూడా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి అని దర్శకులు శివ నాగేశ్వరావు ప్రశంసించారు. అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఎంతోమంది నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు గుర్తింపు అవకాశాలు లభిస్తాయని దర్శకులు దేవి ప్రసాద్ అన్నారు! పద్మశ్రీ అనే టైటిల్‌తోనే దర్శక నిర్మాతలు సగం సక్సెస్ సాధించేశారని దర్శకులు వీర శంకర్ కొనియాడారు! చిత్ర రచయిత, దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుంచి ప్రతి విషయానికి ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించకుండా తనపై ఎంతో.. పూర్తి నమ్మకంతో సహాయ సహకారాలు అందించిన చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస రావు, కో ప్రొడ్యూసర్స్ మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యాక్షన్ ఓరియంటెడ్ హారర్ కామెడీ ఫిలిం పద్మశ్రీ కి నిర్మాత: సదాశివుని శిరీష, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, సంగీతం: జాన్ పోట్ల చదవండి: టాప్‌లెస్ లుక్కులో బాలీవుడ్ బాంబ్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నాగ్‌పై ముద్దులు కురిపించిన అమల -
సీడీపీఓ పద్మ శ్రీ వేధిస్తుందిని అంగన్వాడీల నిరసన
-
శిఖాచౌదరిపై కేసు నమోదు
హైదరాబాద్: చిగురుపాటి జయరామ్ హత్య కేసుకు సంబంధించి ఆయన మేనకోడలు శిఖా చౌదరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసినరోజు రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–44లోని తన ఇంట్లోకి శిఖాచౌదరి దౌర్జన్యంగా ప్రవేశించి బీరువాలోంచి పత్రాలు ఎత్తుకెళ్లిందని, తనను బెదిరింపులకు గురిచేస్తోందని ఆయన భార్య పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆధారాలివ్వాలని పోలీసులు సూచించడంతో పద్మశ్రీ తండ్రి పిచ్చయ్యచౌదరి ద్వారా సోమవారం పలు ఆధా రాలు అందజేశారు. జయరామ్ మరణవార్త విన్న వెం టనే ఆయన ఇంటికి వెళ్లానని, అక్కడున్న తన ప్రాజెక్టు కాగితాలు తీసుకున్నానని, ఆ సమయంలో వాచ్‌మన్‌నూ లోపలకు తీసుకువెళ్లానని పోలీసుల విచారణలో శిఖాచౌదరి అంగీకరించారు. ఆమె డ్రైవర్, పనిమనిషి, వాచ్‌మన్‌ను విచారించిన అనంతరం ప్రధాన నింది తుడు రాకేష్‌రెడ్డినీ శిఖాచౌదరితో సంబంధాలపై ఆరా తీశారు. జయరామ్ హత్య ఘటనలో శిఖాచౌదరి పాత్ర ఉందని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమె తనను బెదిరిస్తోందని, పలువురితో ఫోన్లు చేయించి భయభ్రాంతులకు గురిచేయిస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాల ని కోరుతూ పద్మశ్రీ మరోమారు పోలీసులను ఆశ్ర యించారు. ఈ మేరకు పద్మశ్రీ తండ్రి ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటన్నింటి నేపథ్యంలోనే శిఖాచౌదరిపై తాజాగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేత రెండోరోజూ విచారణ జయరామ్ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌తో సన్ని హిత సంబంధాలు ఉండటమే కాకుండా పలు సెటిల్మెంట్లు, బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, తెలంగాణ టీఎన్టీయూసీ అధ్యక్షుడు బీఎన్‌రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు రెండోరోజైన సోమవారమూ విచారించారు. బంజారాహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో 3 గంటలపాటు ఆయన్ను విచారించారు. రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు రాకేశ్‌రెడ్డిని తీసుకొని వెళ్లడానికి కారణాలేమిటి? జయరామ్‌తో సెటిల్మెంట్ గురించి ఏం చెప్పాడు? అని ప్రశ్నిం చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రాకేశ్ పరిచయమయ్యాడని, ఖైరతాబాద్ సీటు ఇప్పిస్తానని ఆశచూపాడని బీఎన్‌రెడ్డి పోలీసులకు చెప్పాడు. గత నెల 30న జయరామ్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–10లోని రాకేశ్‌రెడ్డి ఇంటికి వచ్చినప్పుడు మీరూ అక్కడ ఉన్నారట కదా? అని ప్రశ్నించగా తాను ఆ రోజు వెళ్లలేదని బీఎన్‌రెడ్డి చెప్పాడు. హత్య జరగడానికి ఒకరోజు ముందు జయరామ్‌ను బెదిరించేందుకు, రూ.4.50 కోట్ల వ్యవహారం సెటిల్మెంట్ చేసేందుకు బీఎన్‌రెడ్డి వెళ్లినట్లుగా ఉన్న ఆధారాలు చూపడంతో ఆయన ఖిన్నుడైనట్లు తెలిసింది. తనకు జయరాం రూ.4.50కోట్లు ఇవ్వాలని, వాటిని వసూలు చేసి పెడితే ఎన్నికల ఖర్చులకు రూ.2 కోట్లు ఇస్తానని రాకేష్ చెప్పడంతో సెటిల్మెంట్కు బీఎన్‌రెడ్డి ముందు కొచ్చాడని తెలుస్తున్నది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాలని బీఎన్‌రెడ్డికి పోలీసులు స్పష్టం చేశారు. ఇతర రాజకీయ పార్టీల నేతలెవరైనా రాకేష్‌తో పరిచయాలు కలిగి ఉన్నారా? అని కూడా పోలీసులు ఆరా తీశారు. మొత్తానికి ఈ కేసు కొత్త రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మళ్లీ అదే మాట చెప్పిన జయరాం భార్య
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణలో భాగంగా బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు శుక్రవారం జయరాం భార్య పద్మశ్రీ వాంగ్మూలం తీసుకున్నారు. తన భర్త హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉందని ఆమె పునరుద్ఘాటించారు. (శిఖా చౌదరి ప్లాన్, రాకేష్ రెడ్డి యాక్షన్) మరోవైపు శిఖా చౌదరికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, మరో నిందితుడు శ్రీనివాస్‌లను తమకు అప్పగించాలని జూబ్లీహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో రేపు ఇద్దరు నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఇద్దరిని తమ కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులిద్దరితో క్రైమ్ సీన్ రీ కంస్ట్రక్షన్ చేయనున్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం జయరాంను తానే హత్య చేశానని రాకేశ్‌రెడ్డి తమ విచారణలో ఒప్పుకున్నట్టు ఏపీ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. జయరాం భార్య పద్మశ్రీ విజ్ఞప్తి మేరకు ఈ కేసు దర్యాప్తుకు తెలంగాణ పోలీసులకు అప్పగించారు. -
శిఖాను విచారించనున్న హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని నందిగామ పోలీసుల నుంచి తెలంగాణలోని హైదరాబాద్ పోలీసులకు ఈ కేసు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు శిఖా చౌదరి ప్రియుడే అని ఏపీ పోలీసులు తేల్చగా.. జయరామ్ భార్య పద్మశ్రీ దానిని ఖండించారు. జయరామ్ మేనకోడలు శిఖా పాత్రే ఈ కేసులో ప్రధానంగా ఉందని.. తన భర్త చావుకు శిఖాయే కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జయరామ్ హత్యకేసును మొదటినుంచి దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. జయరామ్ మామయ్య గుత్తా పిచ్చయ్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 419, 342, 346, 348, 302, 201, రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేసుకున్నారు. ఏపీలో ఉన్న కేసు నిందితులను ఈరోజు హైదరాబాద్‌కు తరలించనున్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం శిఖాను పోలీసులు విచారించనున్నారు. (జయరామ్ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!) కీలకంగా మారనున్న ‘రీ–కన్స్ట్రక్షన్’... రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్‌లు, పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. జయరామ్ కారును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. శిఖా చౌదరి ప్రియుడి ఫ్లాట్ నుంచి ఐతవరం టోల్గేట్ వరకు సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ ప్రక్రియ కీలకం కానుంది. శిఖా ఇంట్లో అనేక అంశాలు పరిశీలించ నున్నారు. ఆపై గొడవ జరిగిన తీరు, మృతదేహాన్ని కారులోకి వాచ్‌మన్ సాయంతో తరలించిన తీరు సహా నందిగామ వరకు జరిగిన పరిణామాలను సరిచూస్తారు. ఈలోపే పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ సేకరించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో సీసీ కెమెరాలు కీలకం కానున్నాయి. జయరామ్‌తో పాటు, నిందితుల కాల్ లిస్ట్, సెల్‌ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా కేసును విచారించనున్నారు. హత్య వెనక దాగిన కుట్ర, జయరాం కుటుంబం లేవనెత్తిన అనుమానాల నివృత్తిపై పోలీసులు దృష్టి పెట్టారు. -
జయరాం కేసులో నిజాలను వెలికితీస్తాం : సీపీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ అయ్యిందని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ స్పెషల్ మెసెంజర్ ద్వారా తమకు సమాచారం చేరిందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యలేదని.. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి న్యాయం ఆశిస్తున్నానంటూ జయరాం సతీమణి పద్మశ్రీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. కేసును తెలంగాణకు బదిలీ చేయాలని పద్మశ్రీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. (శిఖా చౌదరే చేయించింది: జయరాం భార్య) తమపై జయరాం భార్య ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు. కేసుపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడుతామన్నారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుందని చెప్పారు. జయరాం హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను కూడా విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిలో ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలను వెలుగుతీస్తామని సీపీ పేర్కొన్నారు. -
హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉంది
-
శిఖా చౌదరే చేయించింది: జయరాం భార్య
సాక్షి, హైదరాబాద్: తన భర్త హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉందని ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిఖా ప్రమేయం లేకుంటే తన భర్త చనిపోయేవారు కాదని అన్నారు. తమ ఆస్తులు లాక్కునేందుకే ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయిందని ఆమె ఆరోపించారు. ఆమె వ్యవహారం చూసి తన భర్తకు ప్రాణహాని ఉందని ఐదేళ్ల క్రితమే భయపడినట్టు వెల్లడించారు. హత్యకు ప్లాన్ చేసింది శిఖాయేనని స్పష్టం చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. పేద అమ్మాయి అయిన శిఖా చౌదరి నేడు బిఎండబ్ల్యూ కారులో ఎలా తిరుగుతోందని ప్రశ్నించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిందని, డబ్బు కోసం ఆమె ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు. అలాంటి అమ్మాయి తమ ఇంట్లో ఉండటం దురదృష్టమన్నారు. జయరాం చనిపోయిన కబురు తెలిసినా తర్వాత నందిగామ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. జయరాం ఇంటికి వెళ్లి పలు కీలక పత్రాలు, విలువైన వస్తువులు తీసుకుపోయిందని ఆరోపించారు. ఎక్స్‌ప్రెస్ టీవీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాతే ఆ చానల్ నాశమైందన్నారు. (శిఖా ప్రియుడే హంతకుడు) రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. జయరాంకు రాకేష్‌రెడ్డి నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చారనడంతో వాస్తవం లేదని చెప్పారు. శిఖా చౌదరికే చెక్ పవర్ ఉందని వెల్లడించారు. తన భర్త అంత్యక్రియలకు ఆయన తరపు దగ్గర బంధువులు ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయరాంకు మహిళలతో సంబంధాలున్నాయని వింటుంటే బాధగా ఉందని పద్మశ్రీ అన్నారు. తన భర్తతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. (ఎవరీ రాకేష్ రెడ్డి..?) -
‘ఇంత దారుణంగా చంపుతారనుకోలేదు’
సాక్షి, హైదరాబాద్: తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ సోమవారం హైదరాబాద్ పోలీసులను కోరారు. తన భర్తను ఇంత దారుణంగా చంపుతారని ఊహించలేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మీటింగ్ కోసమే తన భర్త అమెరికా నుంచి వచ్చారని తెలిపారు. భర్త బంధువుల వల్లే సమస్యలు వచ్చాయని, తనకు ప్రాణహాని ఉందని 2016లోనే చెప్పారని వెల్లడించారు. సొంత అక్క నుంచే ప్రాణభయం ఉందని జయరాం తనతో చెప్పారని తెలిపారు. శిఖా చౌదరి ప్రమేయం ఎక్కువ కావడంతోనే ఎక్స్‌ప్రెస్ చానల్ బాధ్యతల నుంచి తొలగించినట్టు చెప్పారు. కాగా, జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేయడంలో ఈ కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. విచారణ పూర్తైందని నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని ఏపీ పోలీసులు వెల్లడించారు. (ఎవరీ రాకేష్ రెడ్డి..?) -
నాకు పద్మశ్రీ రావడం ఎంతో సంతోషంగా ఉంది
-
యాడ్ గురు పదమ్సీ మృతి
ముంబై: ప్రముఖ యాడ్ గురు, నటుడు, దర్శకుడు అలెక్ పదమ్సీ(90) కన్నుమూశారు. పదమ్సీ హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో శనివారం అస్వస్థతతో కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన ఖోజా ముస్లిం ధనిక కుటుంబంలో 1928లో పదమ్సీ జన్మించారు. ముంబైలోని సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుకున్నారు. తన జీవిత కాలంలో ముగ్గురు మహిళలు పెరల్ పదమ్సీ, డాలీ ఠాకూర్లను వివాహం చేసుకుని, విడాకులిచ్చారు. అనంతరం షరోన్ ప్రభాకర్‌ను పెళ్లి చేసుకుని, వేరుగా ఉంటున్నారు. వారి ద్వారా నలుగురు సంతానం కలిగారు. సోదరుడు అక్బర్ పదమ్సీ చిత్రకారుడిగా ప్రసిద్ధుడు. వంద బ్రాండ్ల సృష్టికర్త 100కు పైగా బ్రాండ్లకు రూపకల్పన చేసిన పదమ్సీని భారత ప్రకటనల రంగంలో బ్రాండ్ ఫాదర్‌గా భావిస్తారు. ప్రముఖ ప్రకటనల సంస్థ లింటాస్‌కు భారత్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, సంస్థ దక్షిణాసియా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించిన పదమ్సీ చిరకాలం గుర్తుండిపోయే... ‘లలితాజీ’ సర్ఫ్, ‘హమారా బజాజ్’, చెర్రీ బ్లోసమ్ షూ పాలిష్ కోసం ‘చెర్రీ చార్లీ’, ఎమ్మార్ఎఫ్ టైర్ ‘మజిల్ మ్యాన్’, లిరిల్ సబ్బు ప్రకటన తదితరాలు ఆయన సృజనాత్మకతను చాటిచెప్పాయి. ముంబైలోని అడ్వర్టయిజింగ్ క్లబ్ ఆఫ్ ఇండియా ‘అడ్వర్టయిజింగ్ మ్యాన్ ఆఫ్ ద సెంచరీ’ అవార్డుతో పదమ్సీని గౌరవించింది. ప్రకటనల రంగంలో ఆస్కార్గా పరిగణించే ఇంటర్నేషనల్ క్లియో హాల్ ఆఫ్ ఫేమ్‌కు ప్రతిపాదించిన ఏకైక భారతీయుడు. లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ట్రయినింగ్ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రజాదరణ పొందిన ఆయన పుస్తకం ‘ఎ డబుల్ లైఫ్’ బిజినెస్ స్కూళ్లలో బోధనాంశంగా ఉండటం గమనార్హం. నటుడిగా.. తన సోదరుడు బాబీ దర్శకత్వంలో ప్రదర్శించిన మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో మొదటి సారిగా ఏడేళ్ల వయస్సులో నటించారు. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించిన ‘గాంధీ’ సినిమాలో మొహమ్మద్ అలీ జిన్నాగా నటించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అరవయ్యేళ్ల తన కెరీర్లో తుగ్లక్, జీసస్ క్రైస్ట్, ఎవిటా వంటి 70కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. సామాజిక కార్యక్రమాల్లో ముందుండే పదమ్సీని ప్రభుత్వం 2000వ సంవత్సరంలో పద్మశ్రీతో గౌరవించింది. ప్రముఖుల సంతాపం.. ఆయన మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన సంతాప సందేశంలో.. ‘పదమ్సీ సృజ నకు గురువు, యాడ్ ఇండస్ట్రీకి ఆద్యుడు, నాటకరంగ ప్రముఖుడు. ఆయన కుటుంబానికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘పదమ్సీ మరణం విషాదకరం. ఆయన గొప్ప కమ్యూనికేటర్. ప్రకటనలు, నాటక రంగాలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. -
ఎస్సీలంటే అంత చులకనా?
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): ఎస్సీల బాధల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.. వీరికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.. నేను వస్తున్నానని చెప్పినా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రాకపోవడంలోనే పరిస్థితి అర్థం అవుతోంది.. అంటూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు ధ్వజమెత్తారు. పద్మజా ఆసుపత్రిలో తనను మోసం చేసి గర్భంలో రెండు పిండాల్ని ప్రవేశపెట్టారంటూ నేతల నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆమెను రాములు శుక్రవారం పరామర్శించారు. దీనికి ముందు ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నుంచి వివరాలు సేకరించి, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం బాధితురాల్ని పరామర్శించి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, దళిత మహిళను మోసం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు తల్లి అయిన బాధితురాలు నాగలక్ష్మి తిరిగి ఎలా గర్భం ధరించేందుకు ఒప్పుకుంటుందని ప్రశ్నించారు. ఉష అనే అమ్మాయి వీరి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని పద్మశ్రీ ఆసుపత్రి ఎండీ పద్మశ్రీతో కుమ్మక్కై నాగలక్ష్మిని మోసం చేశారనన్నారు. నాగలక్ష్మికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆమె గర్భంలో రెండు పిండాల్ని ప్రవేశపెట్టడం అన్యాయమన్నారు. ఇటువంటి ద్రోహానికి పాల్పడిన వైద్యురాలు పద్మశ్రీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. బాధితురాలకి ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.8 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ గృహం మంజూరు చేయడంతోపాటు ఆమె సంతానం అయిన ముగ్గురికి సాంఘిక శాఖ ద్వారా ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ వేయాలని, 24 గంటల్లో పూర్తి స్థాయి సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు ఆదేశానికి స్పందించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్.రమేష్, కృష్ణా ఆసుపత్రి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి.ఎ.రామరాజు, ప్రభుత్వ విక్టోరియా (ఘోషా) ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవి కమిటీలో సభ్యులుగా ఉంటారు. నా అనుమతి లేకుండా పిండాల్ని ప్రవేశపెట్టారు భర్తగా నా అనుమతి లేకుండా నా భార్య నాగలక్ష్మి గర్భంలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ పద్మశ్రీ రెండు పిండాలను ప్రవేశపెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా చేయడం అన్యాయం. ఇటీవల కుటుంబంలో వచ్చిన కలహాల వల్ల నేను నా స్వంత ఊరు రాజాం వెళ్లి ఉంటున్నాను తప్ప నా భార్యను వదిలేయలేదు. మా ఆర్థిక స్థితి బాగులేకపోవడంతో నా భార్యను మోసం చేసి ఇలా చేసారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న నా కుటుంబం తిరిగి మరొ ఇద్దరిని (తండ్రి ఎవరో తెలియని) ఎలా పెంచగలను. నా కుటుంబానికి తగిన న్యాయం చేయాలి.-నేతల ఆదినారాయణ, బాధితురాలు నాగలక్ష్మి భర్త -
నాగలక్ష్మి ఇష్టంతోనే ‘సరోగసి’
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): సరోగసి నిబంధనల ప్రకారం లీగల్ అగ్రిమెంట్ పరిశీలించిన తర్వాతే అద్దె గర్భంలో ఎంబ్రియో ప్రవేశపెట్టానని పద్మశ్రీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సుధాపద్మశ్రీ అన్నారు. అండాలు తీసుకుంటామని చెప్పి, తనకి తెలియకుండా గర్భంలో పిండాలు ప్రవేశపెట్టారంటూ దళిత మహిళ నేతల నాగలక్ష్మి ప్రగతి శీల మహిళా సంఘం ప్రతినిధులతో కలసి బుధవారం అక్కయ్యపాలెం దరి శాంతిపురంలోని పద్మశ్రీ ఆస్పత్రి వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆస్పత్రి ఎండీ డాక్టర్ సుధా పద్మశ్రీ గురువారం శంకరమఠం రోడ్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓ మహిళ ఆరోపణలు చేయడం, దానికి మహిళా సంఘాలు మద్దతు పలకడం సరికాదన్నారు. తమపై వచ్చిన ఆరోపణలు వాస్తవమా? కాదా? అని అడిగి తాము చెప్పిన సమాధానం సంతృప్తి లేకుంటే ఆందోళన చేస్తే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంసీఎంఆర్ నిబంధనల మేరకు అనుమతులతో ఈ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేశానని తెలిపారు. నేతల నాగలక్ష్మి ఆరోపిస్తున్నట్టుగా తాను ఎలాంటి మత్తు మందు ఇచ్చి, ఆమె గర్భంలో పిల్లలను పెంచడం లేదని స్పష్టం చేశారు. బయలాజికల్ పేరెంట్స్‌తో కలసి నాగలక్ష్మి, కేర్‌టేకర్ కిలాడి ఉషా కలసి మార్చి 22న తన వద్దకు వచ్చారన్నారు. బేబీ కోసం ఫలానా మహిళతో ఒప్పందం చేసుకున్నట్టు లీగల్ అగ్రిమెంట్‌తో వచ్చారని చెప్పారు. నాగలక్ష్మి అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేసిందన్నారు. దీని ఆధారంగానే సరోగసి చేసేందుకు ముందుకు వెళ్లానని స్పష్టం చేశారు. సరోగసి మహిళకు ఇష్టం లేకుండా.. ఆమెకు చెప్పకుండా.. తొమ్మిది నెలల పాటు గర్భంలో పిల్లలను పెంచడం చాలా కష్టమన్నారు. నాగలక్ష్మి ఇష్టపూర్వకంగానే మందులు వేశామన్నారు. ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. 14 రోజుల తర్వాత పరీక్ష చేయగా నాగలక్ష్మి గర్భంలో రెండు పిండాలు పెరుగుతున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. భర్త, పిల్లలు లేరని చెప్పిన నాగలక్ష్మి ఈ నెల 21న భర్తతో కలసి ఆస్పత్రికి వచ్చి, నీరసంగా ఉందని గర్భం తీసే యాలని కోరిందన్నారు. ఒప్పందం కుదుర్చుకు న్న బయలాజికల్ పేరెంట్స్‌తో మాట్లాడుకోవా లని, వారు అంగీకరిస్తే తీసేస్తామని చెప్పామ న్నారు. ఈ విషయంలో డబ్బుల వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నారు. పద్మశ్రీ ఆస్పత్రిలో తనిఖీలు అక్కయ్యపాలెంలోని పద్మశ్రీ ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రోణంకి రమేష్ గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. బయలాజికల్ పేరెంట్స్‌తో నాగలక్ష్మి చేసుకున్న ఒప్పంద పత్రాలు, ఆస్పత్రికి ఉన్న అనుమతులను పరిశీలించారు. నివేదిక అనంతరం కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని డీఎంహెచ్‌వో తెలిపారు. -
సరోగసీ పేరుతో చెలగాటం
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనుమతి లేకుండా సరోగసి పేరిట అద్దె గర్భాల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగుచూసింది. బాధితురాలు నాగలక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... భర్తతో గొడవపడి మధురవాడలో తల్లి వద్ద ఉంటున్న నేతల నాగలక్ష్మికి అదే కాలనీకి చెందిన కిలాడి ఉష ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. నెల నెలా వృథాగా పోయే అండాలు తీసుకొని రూ.20వేలు ఇస్తారని అక్కయ్యపాలెంలోని పద్మశ్రీ ఆస్పత్రికి తీసుకొచ్చింది. కాగితాలపై సంతకాలు చేయించిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చారు. గంటున్నర తర్వాత నాగలక్ష్మికి తెలివి వచ్చాక ప్రశ్నించడంతో... నీ కడుపులో రెండు పిండాలు పెట్టాం, 9 నెలలు మోయాలి, ఆ తర్వాత మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఆస్పత్రి డాక్టర్ సుధా పద్మశ్రీ రూ. 5వేలు నాగలక్ష్మి చేతిలో పెట్టింది. అనంతరం సెల్‌ఫోన్ లాక్కొని, ఆస్పత్రిలో నిర్బంధించారు. ఈ క్రమంలో బాధితురాలు అతికష్టంపై ఈ నెల 21న ఆస్పత్రి నుంచి తప్పించుకొని భర్త వద్దకు చేరుకొంది. తనకు జరిగిన అన్యాయంపై మహిళా సంఘాలతో కలసి అదే రోజు రాత్రి ఫోర్త్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజులు గడిచినా ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు ఎం.లక్ష్మి, ఎస్.వెంకటలక్ష్మి, యు.ఇందిర, ఈ.లక్ష్మి సాయంతో బాధితురాలి కుటుంబం బుధవారం పద్మశ్రీ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా సరోగసీ నిర్వహిస్తున్న ఆస్పత్రి నిర్వాహకులను అరెస్టు చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐని నిలదీసిన మహిళలు ఆస్పత్రి నుంచి తప్పించుకొని బయటపడిన బాధితురాలు నాగలక్ష్మి భర్తతో కలిసి ఫిర్యాదు చేయడానికి సోమవారం ఫోర్త్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు చేసిన తర్వాత బాధితురాలిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించడంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సురేష్ నిర్లక్ష్యం వహించారని మహిళా సంఘాలు ఆరోపించాయి. అనారోగ్యంతో ఉన్న నాగలక్ష్మిని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించకపోగా, మీరే తీసుకెళ్లండని నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీంతో మేమే ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆస్పత్రి ఎదుట జరిగిన ధర్నాకు విచ్చేసిన ఎస్ఐ సురేష్‌ను భాదిత మహిళ కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు చుట్టుముట్టి నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా బాధితురాలికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..? ఆమె ముగ్గురు పిల్లలను ఎవరు చూస్తారని ప్రశ్నించారు. సోమవారం ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. -
100 మీ. విజేత పద్మశ్రీ
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సీహెచ్ పద్మశ్రీ ఆకట్టుకుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె 100మీ. పరుగు ఈవెంట్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన అండర్–16 బాలికల 100మీ. పరుగులో పద్మశ్రీ (ఎస్పీహెచ్ఎస్) లక్ష్యాన్ని 13.4 సెకన్లలో చేరుకొని అగ్రస్థానాన్ని సాధించింది. ఏపీఎస్కు చెందిన స్వప్న (13.7సె.), ఆర్సీహెచ్ఎస్ అథ్లెట్ రియా గ్రేస్ (13.8సె.) తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. అండర్–14 బాలికల 100మీ. రేసులో కె. శిల్ప (14.1 సె.), దియా గంగ్వార్ (14.4 సె.), ఎం. మానస (14.7 సె.) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. బాలుర విభాగంలో రాహుల్ (12.3 సె.) విజేతగా నిలవగా, నితిన్ (12.5 సె.) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రణీత్ (12.6 సె.) మూడో స్థానంలో ఉన్నాడు. -
పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యమివ్వాలి
♦ ఏపీ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ డాక్టర్ బీఎల్ దీక్షితులు ఎచ్చెర్ల: ఇంజినీరింగ్ కళాశాలల్లో పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యమివ్వాలని ఏపీ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ డాక్టర్ బీఎల్ దీక్షితులు పిలుపునిచ్చారు. చిలకపాలేం సమీపంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా ‘రీసెంట్ ట్రెండ్స్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇమేజ్ ప్రొసెసింగ్’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. కార్యక్రమానికి దీక్షితులు రీసోర్సు పర్సన్‌గా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఇమేజ్ ప్రోసెసిగ్ సాంకేతి పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కొత్త ఆవిష్కరణలతో వైద్య, వాతావరణ, రవాణా వంటి రంగాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఆర్థోపెడిక్ విభాగంలో చిన్నలోపంలో ఉన్నా గుర్తించే అధునాతన ఎక్స్‌రే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. రోబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, న్యూరో సైన్స్, క్లోడ్ కంప్యూటరింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. రైల్వే, బ్యాంకింగ్, మెడిసిన్... ఇలా అన్ని రంగాలు ఇమేజ్ ప్రొసెసింగ్ రంగంపై ఆధారపడుతున్నాయని వివరించారు. వైద్య శాస్త్రంలో ముందుగా జబ్బు గుర్తిస్తేనే అందుకు తగ్గ చికిత్స ప్రారంభించగలమన్నారు. ప్రస్తుత విద్యావిధానంలో సైతం మార్పులు అవసరంగా చెప్పారు. విద్యార్థులు తరగతి గదికి పరిమితం కావటం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. నిరంతర పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై విశ్లేషనాత్మక సదస్సులు అవసరంగా చెప్పారు. సదస్సు అనంతరం దీక్షితులను కళాశాల మేనేజ్ మెంట్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు డాక్టర్ బి.మురళీకృష్ణ, డాక్టర్ జి.రమేష్‌బాబు, ప్లేస్ మెంట్ అధికారి డాక్టర్ గణియా రాజేంద్రకుమార్, సీఎస్ఈ ప్రొఫెసర్లు డాక్టర్ టి.వి.మధు సూధనరావు, టంకాల మాణిక్యాలరావులు పాల్గొన్నారు. -
అరుదైన గౌరవం
* జయశంకర్‌కు పద్మవిభూషణ్, అంపశయ్య నవీన్‌కు, అంద్శైకి పద్మశ్రీ * కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు హన్మకొండ కల్చరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దేశంలోని అత్యున్నత అవార్డులకు జిల్లాకు చెందిన ప్రముఖుల పేర్లు అగ్రభాగంలో ఉన్నాయి. పద్మ విభూషణ్ అవార్డు కోసం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, పద్మశ్రీ అవార్డుల కోసం కథానవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, తెలంగాణ వాగ్గేయకారుడు అంద్శై పేర్లను కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేసింది. గతంలో జిల్లాకు చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు పద్మవిభూషణ్, ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరేళ్లవేణుమాధవ్‌కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆ తర్వాత చాలా విరామం ఏర్పడింది. గతంలో అవార్డులకు డాక్టర్ అంపశయ్యనవీన్, ఇంటాక్ జిల్లా కన్వీనర్ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు, చిందు కళాకారుడు గడ్డం శ్రీనివాస్ పేర్లు ప్రతిపాదనలో ఉన్నప్పటికీ.. వారికి రాలేదు. ఆచార్య జయశంకర్.. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 1934 లో జన్మించారు. బనారస్, ఆలీఘర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. కాకతీయ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యావేత్తగా గుర్తింపు పొందారు. ప్రత్యేకించి తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవంగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన ప్రతి పాదనలు, ఎత్తుగడలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాతిపితగా పిలుచుకునే ఆచార్య జయశంకర్‌కు పద్మవిభూషణ్ ఇవ్వడం సమంజసమని తెలంగాణవాదులు, ఆయన అభిమానులు భావిస్తున్నారు. డాక్టర్ అంపశయ్య నవీన్.. కథానవలా రచయిత అంపశయ్యనవీన్ 1941లో జన్మిం చారు. ఆయన అసలుపేరు దొంగరి మల్లయ్య. తను రాసిన నవల పేరుతో అంపశయ్య నవీన్‌గా గుర్తింపు పొందారు. ఆయన 30కిపైగా నవలలు రాశారు. కాలరేఖ నవల సుదీర్ఘమైన తెలంగాణ పోరాట నేపథ్య పరిస్థితులను వివరించేదిగా 16 వందల పేజీలతో ప్రచురించబడింది. ఈ నవలా రచనకు గాను 2004లో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. కేయూ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. తెలంగాణలో మంచి సినిమాలు చూడాలనుకునే వారి కోసం ఆయన కరీంనగర్లో ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసి కొత్త ఉద్యమానికి నాంది పలికారు. గత నాలుగేళ్లుగా నవీన్ పేరిట ఆయన పుట్టినరోజున తెలుగు నవలా సాహిత్య అవార్డులను అందజేస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే నవీన్ పేరు పద్మశ్రీ అవార్డులకోసం ప్రతిపాదించబడినప్పటికీ ఆయనకు రాలేదు. డాక్టర్ అంద్శై... తెలంగాణ జన జీవితంలో ప్రతిష్టాత్మకమైన రీతిలో గుర్తింపు పొందిన వాగ్గేయకారుడు డాక్టర్ అంద్శై. ఆయన అసలు పేరు అందె అయిలయ్య. జనగామ పరిధిలోని రేబర్తి గ్రామంలో 1961లో జన్మించారు. శృంగేరి మఠానికి చెందిన శంకర్‌మహారాజ్ బోధనలతో ప్రభావితుడై ప్రజాకవిగా, ప్రకృతి కవిగా మారారు. 2006లో గంగా సినిమాలో రాసిన పాటకు అంద్శై నంది అవార్డు అందుకున్నారు. 2009లో అంద్శై రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట ఎర్రసముద్రం సినిమాలో ఉపయోగించుకోవడమేకాకుండా... యూనివర్సిటీ స్థాయి డిగ్రీ రెండో సంవత్సరం పాఠ్యాంశంగా చేర్చబడింది. అంద్శై రాసిన ‘పల్లె నీకు వందనాలమ్మో .., గలగల గజ్జెల బండి ఘల్లూ నీది ఓరుగల్లు నీది.., కొమ్మచెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా.., ఎల్లిపొతున్నావా తల్లి.., చూడా చక్కని తల్లి చక్కానీ జాబిల్లి.., జనజాతరలో మనగీతం జనకేతనమై ఎగరాలి’.. పాటలు ఆయనలోని తాత్వికతకు, చైతన్యశీలతకు నిదర్శనంగా కన్పిస్తాయి. అంద్శై రాసిన జయజయహే తెలంగాణ రాష్ట్రగీతంగా ఎంపికైంది. కేయూసీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంద్శైకి పద్మశ్రీ రావల్సిందేనని కళాకారులు, కవులు అంటున్నారు. -
'పద్మశ్రీని అలా వాడొద్దు కదా ? తప్పు కదా ?'
-
మోహన్‌బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: ‘పద్మశ్రీ’ పురస్కారం ఉపసంహరణకు రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న సినీనటుడు, నిర్మాత ఎం.మోహన్‌బాబు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేన్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. గతంలో మరేదైనా సినిమాలో పేరుకు ముందు ‘పద్మశ్రీ’ని వాడి ఉంటే అక్కడా తొలగించాలన్న ఆదేశాలను తాము అమలు చేశామని మోహన్‌బాబు రాతపూర్వకంగా నివేదించారు. దానిని పరిశీ లించిన ధర్మాసనం... ఈ వ్యాజ్యంపై ఇక తదుపరి విచారణ అవసరం లేదంటూ విచారణను ముగించింది. ‘దేనికైనా రెడీ’ సినిమాలోనేగాక, ‘ఝుమ్మంది నాదం’ సినిమాలోనూ పద్మశ్రీని పేరుకు ముందు ఉపయోగించారని, ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించాలంటూ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పిల్ దాఖలు చేయడం తెలిసిందే. -
హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు
-
కోర్టు తుది తీర్పు ఇవ్వలేదు: మోహన్ బాబు
(అనిశెట్టి రామకృష్ణ - అన్నవరం) తన పద్మశ్రీ పురస్కారం వివాదంపై హైకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని ఈరోజు మోహన్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు తుది తీర్పు ఇవ్వకముందే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు. ఓ వివాదం కోర్టు విచారణలో ఉండగా తాను మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు. ఎన్నో మంచి పనులు చేశానని, అందుకే ప్రభుత్వం తనను పద్మశ్రీతో గౌరవించిందన్నారు. భవిష్యత్‌లో తనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు కూడా వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తనను దెబ్బతీయడానికి ఎవరో పన్నిన కుట్ర ఇదని ఆయన అన్నారు. గడ్డి తిన్న ఆవు పాలు ఇస్తుందని, పాలు తాగిన మనిషి విషం కక్కుతాడని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నేతలతో కూడా తనకు సత్ సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. తనకు మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. -
మోహన్ బాబు,బ్రహ్మానందంల పద్మశ్రీలకు చిక్కు