అందరికీ క్యాచీగా ఉండే పేరుతో సినిమా | PadmaSri Movie Motion Poster Released | Sakshi
Sakshi News home page

అందరికీ క్యాచీగా ఉండే పేరుతో సినిమా

Published Tue, Mar 16 2021 2:55 PM | Last Updated on Tue, Mar 16 2021 2:58 PM

PadmaSri Movie Motion Poster Released - Sakshi

'వైఫ్' చిత్ర దర్శకులు, రచయిత, నటులు రావిపల్లి రాంబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం 'పద్మశ్రీ' చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించింది. ఈ సందర్భంగా రాంబాబు గారు మాట్లాడుతూ "తన అభిమాన ఆత్మీయుడు, అయిన ఎస్. ఎస్. పట్నాయక్ చిత్ర దర్శకునిగా మారడమే కాకుండా సొంతంగా ఎస్.ఎస్.పిక్చర్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది"  అని తెలిపారు. అనంతరం పద్మశ్రీ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నాగేశ్వర రావు, దేవి ప్రసాద్, వీరశంకర్, మోహన్ గౌడ్, చిత్తరంజన్, వర్ధమాన నటుడు దినేష్ తదితరులు హాజరయ్యారు.

అందరికీ క్యాచీగా ఉండే పేరు పద్మశ్రీ, పోస్టర్స్ కూడా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి అని దర్శకులు శివ నాగేశ్వరావు ప్రశంసించారు. అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఎంతోమంది నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు గుర్తింపు అవకాశాలు లభిస్తాయని దర్శకులు దేవి ప్రసాద్‌ అన్నారు! పద్మశ్రీ అనే టైటిల్‌తోనే దర్శక నిర్మాతలు సగం సక్సెస్ సాధించేశారని దర్శకులు వీర శంకర్ కొనియాడారు!

చిత్ర రచయిత, దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుంచి ప్రతి విషయానికి ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించకుండా తనపై ఎంతో.. పూర్తి నమ్మకంతో సహాయ సహకారాలు అందించిన చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస రావు, కో ప్రొడ్యూసర్స్ మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యాక్షన్ ఓరియంటెడ్ హారర్ కామెడీ ఫిలిం పద్మశ్రీ కి నిర్మాత: సదాశివుని శిరీష, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, సంగీతం: జాన్ పోట్ల

చదవండి: టాప్‌లెస్‌ లుక్కులో బాలీవుడ్‌ బాంబ్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌

నాగ్‌పై ముద్దులు కురిపించిన అమల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement