Patnaik
-
సీఎం పట్నాయక్‌కు అగ్ని పరీక్ష
దేశంలోని తూర్పు రాష్ట్రమైన ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ తిరిగి అధికారంలోకి వస్తుందా? లేక అక్కడి ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వబోతున్నారా? అనేది జూన్ 4న తేలిపోనుంది.ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13 నుంచి జూన్ ఒకటి మధ్య నాలుగు దశల్లో జరిగాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అందించిన ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం రాష్ట్రంలో బీజేపీ 18 నుంచి 20 సీట్లు గెలుచుకుంటుందని, బీజేడీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. నేటి చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం ఒడిశాలోని మొత్తం 16 స్థానాలను బీజేపీ గెలుచుకోనుంది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 15 నుంచి 18 సీట్లు గెలుచుకోనుండగా, బీజేడీ 3 నుంచి 7 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే ఒడిశాలో బీజేపీ, బీజేడీ పార్టీలకు సమాన స్థానాలు వస్తాయనే అంచనాలున్నాయి.ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించింది. అయితే 147 మంది సభ్యుల ఒడిశా అసెంబ్లీలో అధికార మార్పు ఖాయమని బీజేపీ చెబుతోంది. కాగా ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ప్రకటించిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ప్రకారం నవీన్ పట్నాయక్ అధికార పార్టీ బిజూ జనతా దళ్‌కు 62 నుంచి 80 సీట్లు రావచ్చు. మరోవైపు బీజేపీకి కూడా 62 నుంచి 80 సీట్లు వస్తాయనే అంచనాలున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఐదు నుండి ఎనిమిది స్థానాలను గెలుచుకోనుంది. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న విధంగానే ఫలితాలుంటే ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి. -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్‌ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్‌ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
అందరికీ క్యాచీగా ఉండే పేరుతో సినిమా
'వైఫ్' చిత్ర దర్శకులు, రచయిత, నటులు రావిపల్లి రాంబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం 'పద్మశ్రీ' చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించింది. ఈ సందర్భంగా రాంబాబు గారు మాట్లాడుతూ "తన అభిమాన ఆత్మీయుడు, అయిన ఎస్. ఎస్. పట్నాయక్ చిత్ర దర్శకునిగా మారడమే కాకుండా సొంతంగా ఎస్.ఎస్.పిక్చర్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది" అని తెలిపారు. అనంతరం పద్మశ్రీ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నాగేశ్వర రావు, దేవి ప్రసాద్, వీరశంకర్, మోహన్ గౌడ్, చిత్తరంజన్, వర్ధమాన నటుడు దినేష్ తదితరులు హాజరయ్యారు. అందరికీ క్యాచీగా ఉండే పేరు పద్మశ్రీ, పోస్టర్స్ కూడా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి అని దర్శకులు శివ నాగేశ్వరావు ప్రశంసించారు. అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఎంతోమంది నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు గుర్తింపు అవకాశాలు లభిస్తాయని దర్శకులు దేవి ప్రసాద్ అన్నారు! పద్మశ్రీ అనే టైటిల్‌తోనే దర్శక నిర్మాతలు సగం సక్సెస్ సాధించేశారని దర్శకులు వీర శంకర్ కొనియాడారు! చిత్ర రచయిత, దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుంచి ప్రతి విషయానికి ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించకుండా తనపై ఎంతో.. పూర్తి నమ్మకంతో సహాయ సహకారాలు అందించిన చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస రావు, కో ప్రొడ్యూసర్స్ మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యాక్షన్ ఓరియంటెడ్ హారర్ కామెడీ ఫిలిం పద్మశ్రీ కి నిర్మాత: సదాశివుని శిరీష, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, సంగీతం: జాన్ పోట్ల చదవండి: టాప్‌లెస్ లుక్కులో బాలీవుడ్ బాంబ్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నాగ్‌పై ముద్దులు కురిపించిన అమల -
అలోక్ వర్మపై అన్ని నిరాధార ఆరోపణలే!
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణను సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ శనివారం మీడియా ముందు స్పష్టం చేశారు. కేవలం సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా చేసిన ఆరోపణ లపైనే అలోక్ వర్మపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు జరిపి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిందని, ఆ నివేదికలోని అంశాలకు తనకు ఎంత మాత్రం సంబంధం లేదని పట్నాయక్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను లిఖిత పూర్వకంగా సుప్రీం కోర్టుకు తెలియజేశానని చెప్పారు. అంతేకాకుండా అలోక్ వర్మపై సీవీసీ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా కూడా అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని శుక్రవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించడం మరింత షాకింగ్ న్యూస్. అలోక్ వర్మపై వేటు గురించి ఆయన మాట్లాడుతూ సీబీఐపై రాజకీయ పెత్తనం కొనసాగినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘సీబీఐ యజమాని మాటలను పలికే పంజరంలో రామ చిలక’ అంటూ 2013లో వ్యాఖ్యానించినదీ కూడా జస్టిస్ ఆర్ఎం లోధానే. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలను విశ్వసించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ సమర్పించిన నివేదిక ఆధారంగానే ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. విచారణను ఇటు సీవీసీ తరఫున అటు సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన జస్టిస్ లోధా, జస్టిస్ పట్నాయక్, ఇద్దరూ ఆధారాలు లేవని ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ నుంచి సుప్రీం కోర్టుకు, కోర్టు నుంచి ప్రధాని కార్యాలయానికి నివేదిక ఎలా వెళ్లిందన్నది కోటి రూకల ప్రశ్న. సీవీసీ కూడా పంజరంలో రామ చిలకేనా? వర్మపై తీసుకున్న నిర్ణయాన్ని పునర్ సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టే ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీకి సూచించినప్పటికీ వర్మను తొలగిస్తూ ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటేనని పట్నాయక్ అన్నారు. అన్ని అంశాలను అన్ని కోణాల నుంచి పరిశీలించి ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీవీసీ అభిప్రాయమే తుది అభిప్రాయం ఎందుకు అవుతుందని, విచారణను పర్యవేక్షించిన తన నివేదికను పరిగణలోకి తీసుకోవచ్చుగదా! అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సుప్రీం కోర్టుకు అందజేసిన పట్నాయక్ నివేదికను సుప్రీం కోర్టు ప్రధాని కార్యాలయానికి పంపి ఉండకపోవచ్చు. పంపినా పట్టించుకోక పోవచ్చు. నరేంద్ర మోదీకి మంచి విశ్వాసపాత్రుడైన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి అలోక్ వర్మ ప్రయత్నించడం, అలోక్ వర్మపైనే రాకేశ్ అస్థాన ప్రత్యారోపణలు చేయడంతో సీబీఐలో ముసలం పుట్టడం, వారిద్దరిని బలవంతపు సెలవుపై మోదీ సర్కార్ పంపించడం, అలోక్ వర్మ తనపై చర్యను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. చదవండి: అలోక్ వర్మపై వేటు, సవాలక్ష ప్రశ్నలు -
మహిళా రిజర్వేషన్‌పై ఒడిశా సీఎం తీర్మానం
భువనేశ్వర్: రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోరుతూ ఒడిశా సీఎం పట్నాయక్ మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మహిళా సాధికారత లేకుండా ఏ సమాజం, రాష్ట్రం, దేశం ముందుకు సాగవని ఆయన ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి సభ్యులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 1992లో తన తండ్రి, మాజీ సీఎం బిజూ పట్నాయక్ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారికి రాజకీయ నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. -
మన్మోహన్ సింగ్ అల్లుడికి మోదీ కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అల్లుడుడికి ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇంటెలిజెన్స్ వర్గాలకు, లా ఎన్ఫోర్స్మెంట్ ఎజెన్సీలకు ఆన్ లైన్ సమాచారం అందించే అత్యంత కీలకమైన దేశ ఇంటెలిజెన్స్ విభాగ నాట్‌గ్రిడ్(ది నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్)కు పూర్తి స్థాయిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏకే పట్నాయక్ మోదీ సర్కారులో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. మోదీ సర్కార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నాట్ గ్రిడ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిద్వారానే భారత ఇంటెలిజెన్స్ సమాచారం దానికి సంబంధించిన సంస్థలకు బట్వాడా అవుతుంటుంది. గుజరాత్ కు చెందిన పట్నాయక్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అల్లుడు. చాలా కాలంగా ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. అంతకుముందు అడిషనల్ డైరెక్టర్ గా సేవలందించారు. తాజా నియామకంతో నాట్ గ్రిడ్ వ్యవహారం మొత్తం కూడా ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంది. 2018 డిసెంబర్ 31 వరకు నాట్ గ్రిడ్ సీఈవోగా పట్నాయక్ బాధ్యతలు నిర్వహిస్తారు. అది ఆయన పదవీ విరమణ పొందే రోజు. -
జల విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్రం పర్యవేక్షణ
కృష్ణా, గోదావరి నదీ బోర్డుల్లో విద్యుత్ ఇంజనీర్లను సభ్యులుగా నియమించాలని కేంద్రం నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలకు పరిష్కారం చూపే దిశగా చర్యలు గోదావరి బోర్డులో సభ్యునిగా పట్నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు త్వరలో కృష్ణాబోర్డులోనూ సభ్యుడి నియామకం సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఆధారపడిన విద్యుత్ ప్రాజెక్టులపై నిరంతర పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగిం చింది. జల విద్యుత్ వాటాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిత్యకృత్యం గా మారిన వివాదాలకు పరిష్కారం చూపే దిశ గా తొలి అడుగు వేసింది. ప్రాజెక్టుల నీటి విని యోగంతో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి, విని యోగం, వాటాల సక్రమ పంపిణీ బాధ్యతలను చూసేందుకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలో ప్రత్యేకంగా విద్యుత్ ఇంజ నీర్లను సభ్యులుగా నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సీనియర్ అధికారి బి.పట్నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా బోర్డులో సైతం త్వరలోనే సభ్యుడిని నియమిస్తామని మౌఖికం గా తెలియజేసింది. ఇప్పటికే బోర్డుల పరిధిలో ఉన్న చైర్మన్, సభ్య కార్యదర్శులతో పాటు విద్యుత్‌రంగ సభ్యుడు సైతం బోర్డు సమావేశాల్లో తీసుకునే కీలక నిర్ణయాల్లో భాగంకానున్నారు. నిత్యం కీచులాటలే..: గోదావరి బేసిన్లో ఉన్న ఎగువ, దిగువ సీలేరు, కృష్ణా జలాలపై ఆధారపడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో జల విద్యుదుత్పత్తి విషయమై రెండు రాష్ట్రాలు నిత్యం కీచులాడుతూనే ఉన్నాయి. సీలేరులో 700 మెగావాట్లు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి కోసం నీటి వాడకం వివాదాలపై బోర్డు స్వయం గా కలగజేసుకున్నా ఇంతవరకు ఎలాంటి ఫలి తం రాలేదు. దీంతో రెండు రాష్ట్రాలు కేంద్రమే ప రిష్కరించాలని కోరాయి. సీలేరులో ఏపీ విద్యుదుత్పత్తి చేస్తున్నా వాటి వివరాలేవీ బయటకు వెల్లడించడం లేదు. దీనిపై బోర్డు కలుగజేసుకొని స్వయంగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ను సంప్రదించినా వివాదానికి తెరపడలేదు. శ్రీశైలంపై వాదోపవాదాలు..: ఇక శ్రీశైలం లో నీటి వాడకంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 554 అడుగులేనని, అంతకు మంచి విద్యుత్ అవసరాలకు వాడుకోవడానికి వీలులేదని ఏపీ అభ్యంతరం తెలుపుతుండగా, గతంలోని జీవోల ఆధారంగా తమకు 534 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందని తెలంగాణ గట్టిగా చెబుతోంది. సాగర్‌పైనా ఇరు రాష్ట్రాల మధ్య వివాదమే సాగుతోంది. వరుస వివాదాలు, ఫిర్యాదులపై బోర్డు తీసుకున్న చొరవ ఏమాత్రం ఫలించలేదు. సీలేరు వివాదంలో స్వయంగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ చైర్మన్ నీరజా మాథూర్ కల్పిం చుకొని నివేదిక కోరినా ఏపీనుంచి స్పందన లేని కారణంగా అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో జల విద్యుదుత్పత్తిపై నిరంతర పర్యవేక్షణ, ని యంత్రణ ఉండేలా చూసేందుకు కొత్తగా విద్యు త్రంగ సీనియర్ ఇంజనీర్ని నియమించాలని కేంద్ర ప్రాధికార సంస్థ కేంద్ర విద్యుత్ శాఖను కోరింది. దీనికి కేంద్ర జల సంఘం అంగీకారం తెలుపడంతో కేంద్ర విద్యుత్ శాఖ, నదీ యాజ మాన్య బోర్డుల్లో విద్యుత్ అనుబంధ సభ్యుల నియామకాలకు ఒకే చెప్పింది. దీనిలో భాగంగా గోదావరి బోర్డులో పట్నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా, త్వరలోనే కృష్ణా బోర్డులో సైతం సభ్యుడి నియామకం ఉంటుందని నీటి పారుదల అధికారులకు సమాచారం పంపింది. -
విభజనలో రాజకీయ వర్గాలతో చర్చను గాలికొదిలేశారు: నవీన్ పట్నాయక్