
భువనేశ్వర్: రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోరుతూ ఒడిశా సీఎం పట్నాయక్ మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మహిళా సాధికారత లేకుండా ఏ సమాజం, రాష్ట్రం, దేశం ముందుకు సాగవని ఆయన ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి సభ్యులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 1992లో తన తండ్రి, మాజీ సీఎం బిజూ పట్నాయక్ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారికి రాజకీయ నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కల్పించారని తెలిపారు.