Rambabu
-
సోషల్ మీడియా యాక్టివిస్టులను పరామర్శించిన YSRCP నేతలు
-
Rambabu Muppidi: జ్యూట్ బ్యాగులపైన భారతీయ కళ
కళాకారులు మనదైన ఆత్మను కళ ద్వారా జీవం పోస్తారు. ఆ కళను నలుగురికి పరిచయం చేయడమే కాకుండా దానిని ఉపాధి వనరుగా మార్చి మరికొంత మందికి చేయూతగా నిలుస్తున్నారు డాక్టర్ ముప్పిడి రాంబాబు. హైదరాబాద్ రాయదుర్గంలో ఉంటున్న ఈ కళాకారుడు ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరేళ్లుగా మహిళలకు, యువతకు జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో ఉచితంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని మహిళలకు శిక్షణ ఇస్తున్న సందర్భంగా భారతీయ కళను జ్యూట్ బ్యాగుల మీదకు ఏ విధంగా తీసుకువస్తున్నారో తెలియజేశారు.‘‘జ్యూట్ బ్యాగుల తయారీ సాధారణమే కదా అనుకుంటారు. కానీ, ఇండియన్ ఆర్ట్ మోటిఫ్స్ కలంకారీ, చేర్యాల, వర్లీ, గోండు, పటచిత్ర, మధుబని... డిజైన్స్‌ను ఉపయోగిస్తూ, స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా జ్యూట్ మీదకు తీసుకువస్తున్నాం. దీని ద్వారా జ్యూట్కి కొత్త కళ వస్తుంది. అలాగే, మొన్నటి ఏరువాక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని రైతు పొలం పనులకు వెళ్లే డిజైన్ని తీసుకువచ్చాను. ఈ కళ ద్వారా పర్యావరణ హితం, మనదైన ఆత్మను పరిచయం చేస్తున్నాం.ఉపాధికి మార్గంకరీంనగర్, ఏలూరు, జంగారెడ్డి గూడెం, పార్వతీ పురం, బొబ్బలి.. మొదలైన ప్రాంతాలలో ఉచితంగా శిక్షణ ఇస్తూ వచ్చాను. నేషనల్ జ్యూట్ బోర్డ్ వాళ్లునన్ను సర్టిఫైడ్ డిజైనర్‌గా తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ స్కిల్ క్రాఫ్ట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ప్రస్తుతం మన్యం జిల్లా పార్వతీపురంలో 24 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. 45 రోజుల శిక్షణ కార్యక్రమంలో బ్యాగుల తయారీ, స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుంటున్నారు. ఇప్పటికే బ్యాగుల తయారీ నేర్చుకున్నవారు, సొంతంగా ఉపాధి మార్గాలను పొందుతున్నారు. ఈ స్కిల్ ప్రోగ్రామ్‌లో పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నవారు ఉన్నారు. బ్యాగులే కాకుండా పాదరక్షలు, లెదర్ బ్యాగులు, వైర్లతో చెయిర్లు, ఇతర యాక్సెసరీస్ తయారుచేస్తుంటాను. వీటితో కంప్యూటర్ ఆధారిత త్రీడీ సాఫ్ట్వేర్ డిజైన్లు కూడా ΄్లాన్ చేస్తుంటాను.కళాకారులను కలిసి...మా ఊరు పశ్చిమగోదావరి దగ్గరిలోని జంగారెడ్డి గూడెం. సినిమా నటుల బ్యానర్లను సృజనాత్మకంగా తయారు చేసి, అందించిన కుటుంబం మాది. నాకున్న పెయింటింగ్ ఆసక్తిని మా అన్నయ్య శ్రీనిసవాసరావు గుర్తించాడు. దీంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పైన పూర్తి దృష్టి పెట్టాను. ముంబయ్ నిప్ట్ నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ చేశాను. స్కూల్ చదువు నుంచి డాక్టరేట్ చేసేవరకు మా అన్నయ్యప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎఫ్‌డిఐలో ఉద్యోగం చేస్తున్నాను. సాంకేతికంగానూ భారతీయ కళను క్రాఫ్ట్ తయారీలో ఎలా మేళవించవచ్చో పరిశోధన, ్రపాక్టీస్ చేస్తుంటాను. రాబోయే తరాల కోసం క్రాఫ్ట్స్‌ని డిజిటలైజేషన్ చేసే పనిలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హస్తకళాకారులను నేరుగా కలుసుకొని చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని అందుకున్నాను. నా పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో మన కళ, కళాకారుల ప్రత్యేకతను తెలియ జేయడం అదృష్టంగా భావిస్తాను. ఏటి కొ΄్పాక కొయ్యబొమ్మల కళాకారులతో కలిసి, బొమ్మల తయారీ నేర్చుకున్నాను. నేను తయారు చేసిన కొయ్య బొమ్మలకు డిజైన్లకు, పేపర్ బాస్కెట్ డిజైన్స్‌కి పేటెంట్ హక్కులు ΄పొందాను. కళను భవిష్యత్తు తరాలు గుర్తించేలా మరింత సృజనతో మెరుగ్గా తీర్చిదిద్దాలని.. దీని ద్వారా యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నాను’ అని చె΄్పారు రాంబాబు. ఈ కళాకారుడు తన పనిలో సంపూర్ణ విజయాన్ని సాధించాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
Hyderabad: ముక్కువోని దీక్షతో..ముక్కే.. కుంచై..
⇒కొనతేలిన ముక్కునే కుంచెగా.. అబ్బురపరుస్తున్న చిత్రకారుడు⇒ఆకర్షించే వందలాది నాసిక చిత్రాలు..⇒అబ్దుల్‌కలాం ప్రశంసలు.. మరెన్నో అవార్డులు, బిరుదులు..⇒సత్యవోలు రాంబాబు అసాధారణ ప్రతిభ.. ఇప్పటి వరకూ పెన్సిల్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, నెయిల్ ఆర్ట్, బ్రష్ ఆర్ట్, నైఫ్ ఆర్ట్, ఆఖరికి కాళ్లతోనూ బొమ్మలు వేసేవాళ్లను.. ఇలా.. అనేక రకాల పెయింటింగ్స్ వినుంటాం... కానీ అతను ముక్కునే కుంచెగా ఎంచుకున్నాడు.. ముక్కుతో ఆర్ట్ ఎలా వేస్తారండీ బాబూ అనొచ్చు... అదే ఇందులో ఉన్న గొప్పతనం.. పూర్తిగా చూస్తూ వేస్తేనే చాలా కష్టమనిపించే ఆర్ట్‌ని ముక్కుతో వేయడమంటే.. ఎంతో టాలెంట్, కృషి, పట్టుదల ఉండాలి.. ఎందరో ప్రముఖుల చిత్రాలను సైతం తన ముక్కుతో గీసి వారికి అభిమానాన్ని చూరగొన్నాడు. అతడే నిజాంపేటకు చెందిన సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ సత్యవోలు రాంబాబు. తన చిత్రకళా ప్రస్థానంలో ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.. ఆయన గురించి మరిన్ని వివరాలు మీ కోసం... డాక్టరో..యాక్టరో..సాఫ్ట్‌వేరో..ఇలా తాము ఎంచుకున్న రంగాన్ని ఏలేసేయాలన్న కసితో నగరానికి వచ్చేవారెందరో..వారందరి లాగే ఓ యువకుడు చిత్ర కళను తన ఊపిరిగా చేసుకుని, భుజాన ఓ సంచి..అందులో కొన్ని ఖాళీ పేపర్లు.. నాలుగైదు పెన్సిళ్లు.. చాలన్నట్లు హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. చిత్రకళ కడుపు నింపుతుందా ‘భాయ్’.. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా.. అన్నవాళ్లు నోరెళ్లబెట్టేలా చేశాడు.. ఎంచుకున్న కళే జీవితంగా బతికాడు.. రాణించాడు.. మరెందరికో ఆదర్శంగా నిలిచాడు.. అయితే అందరిలా గుర్తింపు తెచ్చుకుంటే మజా ఏంటి అనుకున్నాడో ఏమో.. కొనదేలిన నాసికాన్నే తన కుంచెగా ఎంచుకున్నాడు. క్షణాల్లో ఔరా.. అనే చిత్రాలను సాక్షాత్కరింపజేస్తున్నాడు.ముక్కుతో ఏడేళ్ల సాధన తన కెరీర్లో మామూలు చిత్రకారుడిగా మిగిలిపోకూడదని తన మస్తిష్కంలో మెదిలిన ఆలోచనే నాసికా చిత్రకారుడిగా మలిచింది. ఏడేళ్ల పాటు సాధన చేసి ముక్కును కుంచెగా చేసుకుని వందలాది బొమ్మలను గీసి ఎందరో మన్ననలను పొందారు. ముక్కుతో బొమ్మలు గీసే అరుదైన చిత్రకారుడంటూ అతని ప్రతిభను గుర్తించిన బీబీసీ వార్తా సంస్థ సైతం ప్రశంసించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజల సమక్షంలో నాసికా చిత్రాలు గీశారు. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ సమక్షంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం బొమ్మను చిత్రించి శభాష్ అనిపించుకున్నారు. అబ్దుల్‌కలాం సైతం అబ్బురపడి ప్రశంసిస్తూ రాంబాబుకు లేఖ రాశారు.లైవ్‌లోనూ మేటిగా.. ఒకవైపు నృత్య విన్యాసాలు.. వాటిని అనుకరిస్తూ మరోవైపు ముక్కుతో చిత్రాలు గీయడమంటే ఆషామాషీ కాదు. సంగీత, నృత్య, చిత్ర సంగమంగా గతంలో డిజైర్స్ పేరిట రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాంబాబు అసాధారణ ప్రతిభను కనబరిచారు. వేదికపై నృత్యకారిణులు లయబద్ధంగా నృత్యాలు చేస్తుంటే రాంబాబు నాట్యభంగిమలు, హావభావాలను, ముఖ కవళికలను చకచకా చిత్రించి ఔరా అనిపించారు. రెండు నిమిషాలకో చిత్రం చొప్పున కేవలం పది నిమిషాల్లో ఐదు నృత్య భంగిమలకు ప్రాణం పోసి చూపరులను ఆకట్టుకున్నారు.ఎన్నో అవార్డులు.. ప్రశంసలు..👉 ఏషియా వేదిక్ రీసెర్చ్ యూనివర్శిటీ నాసికా చిత్రలేఖనం, సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్.👉 మానవతా స్వచ్ఛంద సంస్థ అమలాపురం వారిచే చిత్రకళా రత్న అవార్డు.👉 లంక ఆర్ట్స్థియేటర్ వారిచే నాసిక చిత్రకళా రత్న.👉 యువ కళావాహిని వారిచే స్వామి వివేకానంద అఛీవ్మెంట్ అవార్డు.👉 లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిచే బెస్ట్ టీచర్ అవార్డు.👉 ఇన్నర్ వీల్ క్లబ్ వారిచే బెస్ట్ ఆరి్టస్ట్ అవార్డు. 👉 సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ వారిచే గురుబ్రహ్మ అవార్డు.👉 లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి బెస్ట్ సరీ్వసు అవార్డు.👉 సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ నుంచి బెస్ట్ హ్యూమానిటీ అవార్డు.👉 ఏపీ స్టేట్ కల్చరల్ సొసైటీ నుంచి స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు. 👉 కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ నుంచి కళాప్రతిభ అవార్డు. 👉 సుధా ఆర్ట్స్ అకాడమీ నుంచి కళానిధి అవార్డు. 👉 జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నుంచి కళాభిషేకం అవార్డు. 👉 మెగా రికార్డ్స్ సంస్థ నుంచి కళా ప్రతిభ మూర్తి, ఏఎన్ఆర్ అచీవ్మెంట్ అవార్డు. 👉 యశోద ఫౌండేషన్ నుంచి కళారత్న అవార్డు.విశ్వగురు అవార్డ్స్‌ను స్థాపించి..విభిన్న రంగాల్లో మేటిగా సేవలందించే వారిని గుర్తించి వారిలో నూతనోత్తేజాన్ని కలిగించాలన్న ఉద్దేశ్యంతో విశ్వగురు అవార్డ్స్‌ను నెలకొల్పి ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఏటేటా ఎంపిక చేసిన వారికి ఈ అవార్డులను అందించి సన్మానించడం ఆనవాయితీ. అలాగే నిజాంపేటలో సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ద్వారా చిత్రకళ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శిక్షణ అందిస్తున్నారు.రెండు దశాబ్దాల క్రితం..ఓ 20 ఏళ్ల క్రితం..అసలు చిత్రకళ అంటే అంతగా పట్టించుకోని రోజులు.. పశి్చమ గోదావరి జిల్లా వేగివాడకు చెందిన సత్యవోలు రాంబాబు పాఠశాల స్థాయిలో చిత్రకళపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. తన గురువు ఇజ్రాయిల్ ప్రేరణతో పాఠశాల స్థాయిలోనే లోయర్, హయ్యర్ పూర్తి చేశారు. 20 ఏళ్ల ప్రాయంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుని చిత్రకళపై తనకున్న అభీష్టాన్ని చాటిచెప్పాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. చదివింది ఇంటరీ్మడియెట్ అయినా కళలో తనకున్న ప్రావీణ్యాన్నే నమ్ముకుని హైదరాబాద్ వచ్చేశాడు. అడపాదడపా జరిగే పోటీల్లో పాల్గొనడం, అక్కడ ఇచ్చే పారితోíÙకంతో జీవితాన్ని నెట్టుకురావడం చేశాడు. ఇంటర్‌తో ఆగిపోయిన చదువును కొనగించాలని డిగ్రీలో చేరి మరోవైపు చిత్రకళను కొనసాగించారు. అలా తన ప్రస్థానం మొదలై ఎందరికో ఆ కళను పంచే స్థాయికి ఎదిగారు. -
స్పోర్ట్స్ న్యూస్: ‘పారిస్’ మార్క్‌ను దాటిన రాంబాబు..
న్యూఢిల్లీ: భారత రేస్ వాకర్ రాంబాబు పారిస్ 20 కిలో మీటర్ల రేసులో పారిస్ ఒలింపిక్స్ అర్హత టైమింగ్‌ను అందుకున్నాడు. స్లొవేకియాలో జరుగుతున్న టూర్ గోల్డ్ లెవల్ ఈవెంట్లో రాంబాబు మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌ను 1 గంటా 20 నిమిషాల్లో రాంబాబు పూర్తి చేశాడు. పెరూ, ఈక్వెడార్ అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పారిస్ క్వాలిఫయింగ్ టైమింగ్ 1 గంటా 20 నిమిషాల 10 సెకన్లుగా ఉంది. అయితే ఈ ప్రదర్శనతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాంబాబు నేరుగా ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లేదు. అతనికంటే ముందే ఆరుగురు భారత రేస్ వాకర్లు అర్హత టైమింగ్‌ను సాధించారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం దేశంనుంచి గరిష్టంగా ముగ్గురికే పాల్గొనే అవకాశం ఉంది. ఇవి చదవండి: నేడు జరిగే WPL లో.. కొత్త విజేత ఎవరో!? -
మహిళలపై వికృత చేష్టలు బయటపడ్డ టీడీపీ నేత బాగోతం
-
సినీ నిర్మాత కోసం.. సీసీఎస్ వేట! అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో చాక్లెట్ల వ్యాపారంతో మొదలు పెట్టి, హైదరాబాద్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దందా స్థాపించి, మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) దందాలోకి దిగి, డిపాజిట్ల పేరుతో వందల మంది నుంచి రూ.540 కోట్లు వసూలు చేసిన కేసులో తెలుగు సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు నిందితుడిగా మారారు. ఈ స్కామ్ సూత్రధారి రాంబాబు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నారాయణరావును మూడో నిందితుడిగా చేర్చిన సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం ఈ కేసులో అరెస్టు అయిన రాంబాబు, పెనుమత్స కృష్ణం రాజులను తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఎంసీజీ దందా చేసేందుకు రాంబాబు రాధారామ్ ఏజెన్సీస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇద్దరు నిందితులు తమ వ్యాపార విస్తరణ కోసమంటూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. వీరికి 6 నుంచి 13 శాతం వడ్డీతో డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఓ దశలో వ్యాపారంలో వచ్చే లాభాలు పంచడానికి, వడ్డీలు చెల్లించడానికి సరిపోలేదు. దీంతో తమ వద్ద కొత్తగా పెట్టుబడి పెట్టే వారి సొమ్మును పాత ఇన్వెస్టర్లకు చెల్లించడం మొదలెట్టారు. చివరకు చెల్లింపులు చేయలేక డిపాజిటర్లను మోసం చేశారు. తమ కోసం బాధితులు తిరుగుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశారనే విషయం తెలియడంతో రాంబాబు తన కంపెనీ చార్టెట్ అకౌంటెంట్ ద్వారా అట్లూరి నారాయణరావును సంప్రదించాడు. సినీ నిర్మాతగా ఉన్న అతను తనకు రాజకీయాలతో పాటు పోలీసు విభాగంలో చాలా పలుకుబడి ఉందని, అది వినియోగించి కేసు లేకుండా చేస్తానని రాంబాబుకు హామీ ఇచ్చాడు. ఇందుకుగాను రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసాల తర్వాత రూ.2 కోట్లకు అంగీకరించిన నారాయణ రావు అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆపై కొన్ని ప్రయత్నాలు చేసినా నిందితులకు కేసు విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోయాడు. దీంతో ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి బయటపడదామని రాంబాబుకు సలహా ఇచ్చాడు. అతడు అంగీకరించడంతో ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ కథ నడపాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడతో పాటు నగరంలోనే ఈ స్కామ్ మొత్తం జరిగింది. బాధితులు సైతం ఇక్కడి వారే ఉన్నారు. అయితే నారాయణరావు మాత్రం ఖమ్మం కోర్టులో అక్కడి న్యాయవాదితో ఐపీ దాఖలు చేయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఓపక్క ఈ పనులు చేస్తూనే మరోపక్క రాంబాబు నుంచి వీలైనంత మొత్తం వసూలు చేసుకోవాలని భావించాడు. అతడి నుంచి రూ.కోటి విలువైన బంగారు ఆఖరణాలు తీసుకున్న నారాయణరావు వాటిని పాతబస్తీలో కరిగించి, రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు లోతుగా విచారించడంతో అట్లూరి నారాయణ రావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో ఇతడిని మూడో నిందితుడిగా చేర్చిన అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. -
Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి
మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. నిజానికి అతడి కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్‌లో 35 కిలోమీటర్ల రేస్‌వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఓ ఊరి ఆత్మకథ
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. మల్లి మాట్లాడుతూ– ‘‘ఒక ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ తన కథ తానే చెబితే ఎలా ఉంటుంది? అనేది చిత్రకథాంశం’’ అన్నారు. ‘‘మంచి యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేష్ భార్గవ్. -
ఇటు ముందస్తు బెయిల్ తిరస్కరణ.. అటు 41ఏ నోటీసులు
-
ఖమ్మం జిల్లా కల్లూరులో ఎస్ఐ Vs హోంగార్డు..
కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన హోంగార్డు సిరసాని రాంబాబు(సస్పెన్షన్‌లో ఉన్నారు) తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా జిల్లా హోంగార్డుల వాట్సాప్ గ్రూప్‌లో శుక్రవారం మెసేజ్ పెట్టడం పోలీసు శాఖలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్ మృతి విషయం మరువకముందే.. ఈ మెసేజ్ పెట్టడం, విషయం ఆనో టా ఈనోటా బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో సిరసాని రాంబాబుతో ‘సాక్షి’మాట్లాడగా, హోంగార్డులు పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, చాలీచాలని జీతంతో ఇబ్బందిపడుతున్నారని వాపోయాడు. కల్లూరులో భూమి విషయంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కొందరు తన తల్లిదండ్రులపై ఫిబ్రవరి 10న దాడి చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ సమయాన వేరే ప్రాంతంలో ఉన్న తాను ఫిబ్రవరి 28న ఎస్ఐ పి.రఘుతో కేసు విషయమై మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్ప డమేకాక ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహ త్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆరోపణల్లో వాస్తవం లేదు: ఎస్ఐ సస్పెండ్ అయిన హోంగార్డు సిరసాని రాంబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కల్లూరు ఎస్ఐ పి.రఘు స్పష్టం చేశారు. భూమి అక్రమంగా ఆయనే ఆక్రమించాడని, ఇతర ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు. గతంలో తోటి హోంగార్డును కొట్టి సస్పెండ్ అయ్యి జైలుకు వెళ్లి రాగా, కొంత కాలానికి విధుల్లో తీసుకున్నట్లు తెలిపారు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోగా, మద్యం సేవించి విధులకు వస్తుండడంతో సస్పెండ్ చేశారని వెల్లడించారు. -
దుర్గగుడి పాలకమండలి సమావేశం.. భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు(సోమవారం) జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలకు మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్డీఎంబీసీ ఛానల్‌ను అందుబాటులోకి తెస్తామని ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. ఇక, పాలక మండలి సమావేశం అనంతరం దుర్గగుడి ఛైర్మన్ రాంబాబు మాట్లాడుతూ.. ‘త్వరలో శివాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తాం. శివాలయంలో రూ.40లక్షల అంచనాలతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తాం. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలను ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోపు చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. దూరప్రాంత భక్తులకు మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రతీ భక్తుడికి అమ్మవారి కుంకుమ ప్రసాదం.. దుర్గగుడి ఫ్లై ఓవర్ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. అలాగే, దుర్గాఘాట్‌ను త్వరలోనే అందుబాటుకి తీసుకువస్తామన్నారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా యూట్యాబ్‌లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్డీఎంబీసీ ఛానల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. పౌర్ణమి నుంచి ప్రతీ భక్తుడికి అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించనున్నట్టు తెలిపారు. 2వేల మంది అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవన్ విస్తరిస్తున్నామన్నారు. అన్నదాన భవన్‌కు రాబోయే నెలరోజుల్లో శంకుస్థాపన చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: వినాయక చవతిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన -
పచ్చ మత్తులో జోగుతున్న ఈనాడు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టనిదే ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు వ్యక్తుల మధ్య ఆవేశకావేశాలతో జరిగిన ఘర్షణకు గంజాయే కారణమని, అది సర్కారు నిర్వాకమని వక్రీకరించింది. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నట్టు అవాస్తవాలతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నంచింది. ‘గంజాయి రాజ్యంలో ముఠాల అరాచకం’ శీర్షికన గురువారం దుష్ప్రచారానికి పూనుకుంది. వాస్తవాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని దమ్మాలవీధికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ కేశవ రాంబాబు ఈ నెల 23న రాత్రి 8.30 గంటలకు తన బైక్‌పై వెళుతూ మార్గం మధ్యలో కొందరు యువకులతో ఘర్షణ పడ్డారు. దిల్లేశ్వరరావు అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ట్రాఫి క్కు అంతరాయం కలిగింది. దీనిపై తన బైక్‌కు దారి ఇవ్వమని రాంబాబు ఆ వేడుకల్లో ఉన్న యువకులను అడిగారు. దాంతో మాధవ్, దేవా, కార్తిక్ అనే యువకులతో రాంబాబుకు వా గ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. దాంతో ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇరువర్గాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో ఆ సామాజికవర్గ పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చారు. ఆ మేరకు రాంబాబు రాజీ లేఖను పోలీసులకు సమర్పంచారు. ఆ లేఖను న్యా యస్థానానికి నివేదించి అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఈనాడు వక్రీకరించి గంజాయి మత్తు లో ఘర్షణ జరిగిందంటూ దుష్ప్రచారం చేసి, చంద్రబాబుకు అనుకూల వాతావరణం సృష్టించా లని పచ్చపాతాన్ని ప్రదర్శించడం దారుణం. -
బుట్టాయిగూడెంలో తమ్ముళ్ల పరువు పాయే.. పాత బిల్లుతో బొక్కబోర్లా!
ద్వారకా తిరుమల: రాష్ట్ర ప్రభుత్వంపై బురద చిమ్మాలన్న దురుద్దేశంతో లేనిది ఉన్నట్టు చూపించేందుకు ప్రయత్నాలు చేసిన టీడీపీ నాయకుడు చివరికి భంగపడ్డారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెంలో జరిగిన ఈ ఘటన వివరాలున్నాయి.. బుట్టాయిగూడేనికి చెందిన నోముల రాంబాబు పూరి గుడిసెకు 2021 అక్టోబర్ నుంచి 2022 నవంబర్ వరకు (13 నెలలకు) రూ.26,660 విద్యుత్ బిల్లు వచ్చిం ది. అతను అధికారులను సంప్రదించగా, అంత బిల్లు రావడానికి మీటరు జంప్ అవడమే కారణమని తెలుసుకున్నారు. 2022 నవంబర్ 30న రూ.16,840 బిల్లును మినహాయించి, మిగిలిన రూ.9,820 చెల్లించాలని సూచించారు. పైగా, రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. అప్పటి నుంచి అతడికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోంది. అయితే రాంబాబు పాత బకాయితో పాటు ఆ తర్వాతి నెలల బిల్లులు కూడా చెల్లించలేదు. అతని బకాయి రూ.10,150కు చేరింది. దీంతో అధికారులు నెల క్రితం అతని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రాంబాబు ఈ నెల 7న రూ.2 వేలు మాత్రమే చెల్లించాడు. అయితే అధికారులు మొత్తం బిల్లు చెల్లించాలని సూచించారు. గోపాలపురం టీడీపీ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు పార్టీ కార్యక్రమంలో భాగంగా గురువారం అక్కడికి వచ్చారు. ఆయనకు రాంబాబు పాత బిల్లు చూపాడు. వెంటనే ఆయన పాత బిల్లు పట్టుకొని పూరి గుడిసెకు వేలల్లో బిల్లు వచ్చిం దంటూ రోడ్డుపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. చివరకు అది పాత బిల్లని తేలడంతో నాలుక్కరుచుకున్నారు. ప్రతి నెలా ఎస్సీ సబ్సిడీ వస్తోంది ప్రభుత్వం గతేడాది డిసెంబర్ రెండో తేదీ నుంచి రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రతి నెలా విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని, అతనికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోందని భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గోపాలకృష్ణ తెలిపారు. పాత బిల్లు బకాయికి సంబంధించి రాంబాబు శనివారం మరో రూ.500 చెల్లించాడని, దాంతో అతడి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. బిల్లు నెలకు రూ.26,660 వచ్చిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. -
‘మూడు తరాల’ మృత్యువాత!
వైరారూరల్: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారిసహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాసరలో బాబుకు అక్షరాభ్యాసం చేయించి స్వస్థలానికి తిరిగి వస్తుండగా వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. వైరా మండలం పినపాక స్టేజీ వద్ద జాతీయ రహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ అతివేగంతో ఢీకొనడంతో అజ్మీరా రాంబాబు (52), ఆయన కుమార్తె బానోతు అంజలి (25), మనవరాలు బానోతు శ్రీవల్లి (18 నెలలు) మృతి చెందారు. ఇదే ఘటనలో బానోతు బాబు, రాణి, స్వాతి, ప్రవీణ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బోడిమల్లె తండాకు చెందిన అజ్మీరా రాంబాబు, వాచ్యానాయక్ తండాకు చెందిన బానోతు బాబు వియ్యంకులు. బాబు, రాణి కుమారుడైన డెంటల్ డాక్టర్ నవీన్‌కుమార్‌తో రాంబాబు కుమార్తె అంజలికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కార్తికేయ, 18 నెలల కుమార్తె శ్రీవల్లి ఉన్నారు. కార్తికేయకు బాసరలో అక్షరాభ్యాసం చేయించేందకు బానోతు బాబు, రాణి దంపతులు వారి కుమారులు నవీన్, ప్రవీణ్, కోడళ్లు అంజలి, స్వాతి, మనవరాలు శ్రీవల్లిని తీసుకుని వియ్యంకుడు అజ్మీరా రాంబాబుతో కలసి బాసర వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి ఖమ్మం చేరుకున్నారు. అక్కడే బంధువుల ఇంట్లో ఉండి శుక్రవారం మధ్యాహ్నం కారులో వాచ్యానాయక్ తండాకు బయలుదేరారు. కారు పినపాక స్టేజీ చేరుకుంటుండగా ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో రాంబాబు, ఆయన మనవరాలు శ్రీవల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె అంజలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడినవారిలో బాబు, ప్రవీణ్, స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ ఎం.ఎ.రెహమాన్, సీఐ తాటిపాముల సురేశ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
‘సాక్షి’ పాత్రికేయులకు హైబిజ్ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి డెస్క్ సాగుబడి’ ఇన్చార్జి పంతంగి రాంబాబు, సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ హైబిజ్ టీవీ మీడియా పురస్కారాలను అందుకున్నారు. హైటెక్స్‌లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హోం మంత్రి మహమూద్ అలీ నుంచి రాంబాబు ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తి దిశగా ఆయన ప్రతి మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని నిర్వహిస్తున్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్‌తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ చానళ్ల పాత్రికేయులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు కూడా పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ మార్కెటింగ్ కేఆర్పీ రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డి – ఐఏఎస్ (వీసీ–ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ – లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి.చక్రధర రావు (ప్రెసిడెంట్–ఐపీఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్–భారతి సిమెంట్స్),వి.రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ–క్రెడాయ్), ఎం.రాజ్‌గోపాల్ (ఎండీ– హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె.సంధ్యారాణి (సీఈవో–హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు పాల్గొన్నారు. -
డబ్బు రికవరీకి నూతన చట్టాలు తేవాలి
కాచిగూడ: బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును ప్రభుత్వమే రికవరీ చేసే విధంగా నూతన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. కెనరా బ్యాంకు ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర సదస్సు ఆదివారం కాచిగూడలోని మున్నూరుకాపు భవన్, మ్యాడం అంజయ్య హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్ రాంబాబు ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతమున్న చట్టలు, న్యాయ వ్యవస్థలోని లొసుగులను అసరా చేసుకుని బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగవేస్తున్నారని, దీంతో బ్యాంకులు దివాలతీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న రూ.83వేల కోట్లను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలాలంటే విచారణకు పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని 3,4 తరగతులలో ఖాళీగా ఉన్న 2లక్షలకు పైగా ఉద్యోగాను వెంటనే బర్తీ చేయాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ భ్యాంకులను నిర్విర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ చేయాలనే అలోచనలను ప్రభుత్వం మానుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసన్, వేణుగోపాల్, కె.శ్రీకృష్ణ, కె.హెచ్. పటా్నయక్, సాయి ప్రసాద్, ఎస్. మధుసూదన్, హరివర్మ, తదితరులు పాల్గొన్నారు. -
వీడిన జీలుగుకల్లు విషాదం మిస్టరీ.. టీడీపీ నేత వంతల రాంబాబు అరెస్టు
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా లోదొడ్డిలో కొద్ది రోజుల క్రితం జీలుగుకల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు టీడీపీ నేత వంతల రాంబాబు అని పోలీసులు తేల్చారు. రంపచోడవరం టీడీపీ ఇన్చార్జ్ వంతల రాజేశ్వరికి వరుసకు సోదరుడైన వంతల రాంబాబు జీలుగు కల్లుకుండలో గడ్డి మందును కలపడం వల్లే ఐదుగురూ మృతి చెందారని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. నిందితుడు రాంబాబును కాపాడేందుకు వంతల రాజేశ్వరి శతవిధాలా ప్రయత్నించారు. పోలీసులు రాంబాబు సహా పలువురిని విచారిస్తోన్న క్రమంలో వంతల రాజేశ్వరి అమాయకులైన గిరిజనులను ఇరికిస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. నిజనిర్ధారణ కమిటీ పేరిట లోదొడ్డిలో హడావుడి చేసిన టీడీపీ నేతలు స్థానికుల ద్వారా అసలు విషయం తెలుసుకుని బిక్కముఖం వేశారు. ఈ మేరకు మంగళవారం కాకినాడలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కేసు వివరాలను వెల్లడించారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డికి చెందిన పొత్తూరు గంగరాజు భార్యతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత వంతల రాంబాబుకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై కనుమ పండుగ నాడు గంగరాజు సోదరుడు లోవరాజు, రాంబాబు మధ్య ఘర్షణ జరిగింది. తన వదినతో సంబంధం సరికాదంటూ రాంబాబును లోవరాజు హెచ్చరించడంతో ఇరువురి మధ్య వివాదం మొదలైంది. కల్లు కుండలో గడ్డి మందు కలిపి.. గంగరాజు భార్య తనతో దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని రాంబాబు అతడిపై కక్ష పెంచుకున్నాడు. గంగరాజుకు చెందిన జీలుగు చెట్టు కల్లు కుండలో ఈ నెల 1 రాత్రి గడ్డి మందు కలిపాడు. ఈ విషయం తెలియని గంగరాజు మరుసటి రోజు ఉదయం చెదల సుగ్రీవు, వేము లోవరాజు, బూసరి సన్యాసిరావు, కుడే ఏసుబాబుతో కలిసి కల్లు సేవించాడు. కొద్దిసేపటికే ఐదుగురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సుగ్రీవు, లోవరాజు, గంగరాజు, సన్యాసిరావు, చికిత్స పొందుతూ ఏసుబాబు మృతి చెందారు. ఈ ఘటనపై జడ్డంగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం ఉదయం నిందితుడు వంతల రాంబాబును అరెస్టు చేసి గడ్డి మందు ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కేసు మిస్టరీని ఛేదించిన రంపచోడవరం అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, కాకినాడ క్రైమ్ డీఎస్పీ ఎస్.రాంబాబులను అభినందించారు. -
అందరికీ క్యాచీగా ఉండే పేరుతో సినిమా
'వైఫ్' చిత్ర దర్శకులు, రచయిత, నటులు రావిపల్లి రాంబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం 'పద్మశ్రీ' చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించింది. ఈ సందర్భంగా రాంబాబు గారు మాట్లాడుతూ "తన అభిమాన ఆత్మీయుడు, అయిన ఎస్. ఎస్. పట్నాయక్ చిత్ర దర్శకునిగా మారడమే కాకుండా సొంతంగా ఎస్.ఎస్.పిక్చర్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది" అని తెలిపారు. అనంతరం పద్మశ్రీ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నాగేశ్వర రావు, దేవి ప్రసాద్, వీరశంకర్, మోహన్ గౌడ్, చిత్తరంజన్, వర్ధమాన నటుడు దినేష్ తదితరులు హాజరయ్యారు. అందరికీ క్యాచీగా ఉండే పేరు పద్మశ్రీ, పోస్టర్స్ కూడా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి అని దర్శకులు శివ నాగేశ్వరావు ప్రశంసించారు. అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఎంతోమంది నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు గుర్తింపు అవకాశాలు లభిస్తాయని దర్శకులు దేవి ప్రసాద్ అన్నారు! పద్మశ్రీ అనే టైటిల్‌తోనే దర్శక నిర్మాతలు సగం సక్సెస్ సాధించేశారని దర్శకులు వీర శంకర్ కొనియాడారు! చిత్ర రచయిత, దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుంచి ప్రతి విషయానికి ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించకుండా తనపై ఎంతో.. పూర్తి నమ్మకంతో సహాయ సహకారాలు అందించిన చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస రావు, కో ప్రొడ్యూసర్స్ మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యాక్షన్ ఓరియంటెడ్ హారర్ కామెడీ ఫిలిం పద్మశ్రీ కి నిర్మాత: సదాశివుని శిరీష, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, సంగీతం: జాన్ పోట్ల చదవండి: టాప్‌లెస్ లుక్కులో బాలీవుడ్ బాంబ్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నాగ్‌పై ముద్దులు కురిపించిన అమల -
రెండు డోసులతోనే పూర్తి రక్షణ
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో పలువురికి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంత డోసు తీసుకోవాలి.. రెండో డోసుకు సమయం ఎంత.. ఎవరు వేసుకోవచ్చు.. ఇలా రకరకాల ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, బాలింతలు వ్యాక్సిన్ తీసుకుంటే దుష్ప్రభావాలుంటాయా.. అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు పలు ప్రశ్నలకు సమాధానాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన వ్యాక్సిన్‌పై ఏమన్నారంటే... (చదవండి: కొత్త వైరస్: ఆ లక్షణాలు కనిపించడం లేదు) ► పారామెడికల్, మెడికల్, పోలీసులు వంటి వారికి మొదటి ప్రాధాన్యం. ► వ్యాక్సిన్‌ను బట్టి రెండో డోసు 21 రోజులకు లేదా 28 రోజులకు ఇస్తారు. ► ఒక మోతాదు మాత్రమే తీసుకుంటే 60 నుంచి 80 శాతమే రక్షణ ఉంటుంది. రెండో మోతాదు కూడా తీసుకోవాలి. ► రెండో మోతాదు తీసుకున్న 10 రోజుల తర్వాత రక్షణ ప్రారంభమవుతుంది. దీని సమర్థత 70 నుంచి 90 శాతం వరకూ ఉంటుంది. ► కరోనా పాజిటివ్ వారూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. యాంటీబాడీస్ వృద్ధి చెందకపోయి ఉంటే వ్యాక్సిన్ అవసరం కావొచ్చు. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ప్రారంభ దశలో టీకా అవసరం లేకపోవచ్చు. మధుమేహం ఉన్నవారు, ఏదైనా అలర్జీతో బాధపడుతున్న వారూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ► ఆల్కహాల్ తీసుకునే వారు వ్యాక్సిన్ తీసుకుంటే.. రోగ నిరోధక ప్రతి స్పందనలను తగ్గించే అవకాశం ఉంది. చిన్న పరిమాణంలో వైన్ లేదా బీర్ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదం లేనట్టు రష్యాలో తేలింది. ► గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయమై ఏ కంపెనీ ఇంకా పరీక్షించలేదు. వీరికి వ్యాక్సిన్ ఇవ్వకూడదని (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) సీడీసీ సలహా ఇచ్చింది. ► ఇప్పటి వరకూ జరిగిన ట్రయల్స్‌ను బట్టి 18 ఏళ్ల వయసు పైబడిన వారికే వ్యాక్సిన్ ఇస్తారు. ప్రస్తుతం 12 ఏళ్ల వారికి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ► ఇది ఎంతకాలం రోగ నిరోధక శక్తినిస్తుందో ఇంకా తెలియదు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. చిన్న చిన్న దుష్ప్రభావాలు అంటే తేలిక పాటి జ్వరం, అలసట వంటివి తప్ప అన్ని టీకాలు సురక్షితమైనవే. ► కోవిన్ అంటే చాలా మందికి తెలియదు. ఇది మొదటి, డిజిటల్ ఎండ్ టు ఎండ్ టీకా పంపిణీ నిర్వహణ వ్యవస్థ. ఇందులో లబ్ధిదారుల నమోదు, ధ్రువీకరణ, వేసే సమయం తదితర వివరాలు పొందుపరుస్తారు. దీనిద్వారా లబ్ధిదారుడి ఫోన్‌కు రూపంలో సమాచారం వస్తుంది. (చదవండి: ఏడాదిని మింగేసిన కరోనా మహమ్మారి) -
జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్: జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. శివ వీధిలో నివాసం ఉండే దంపతులు గంజి రాంబాబు (49), లావణ్య (47) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరోనా ప్రభావం, ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ముంబాయిలో ఓ యాడ్ ఏజెన్సీలో పని చేసే దంపతులు రాంబాబు తండ్రి రాజేశం పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా స్వస్థలం జగిత్యాలకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం దంపతులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లలేదు. మరోవైపు కరోనా ప్రభావంతో ఉన్న ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో ఉన్న ఇంటిని సైతం రాంబాబు..తన సోదరులు విక్రయించే ప్రయత్నం చేయగా గొడవలు జరిగినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెంది వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి దంపతులిద్దరూ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తలుపులు తొలగించి చూడగా... ఇద్దరు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించారు. సంతానలేమి కరోనా ప్రభావం ఆర్థిక ఇబ్బందులే దంపతులు ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మోకరిల్లిన స్వరం
విజయనగరం ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు కరోనా బారిన పడి కోలుకున్నారు. తన పై అధికారులు తనను తిరిగి విధులకు స్వాగతిస్తున్న సందర్భంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఔన్నత్యం మీద సొంతంగా పాట రాసి, బాణీలు సమకూర్చి, పాడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఎస్పీ ఎదుట మోకాళ్లపై కూర్చొని నమస్కరిస్తూ కన్నీళ్లతో ఆమెను కొనియాడారు. ఊహించని ఆ అభివాదానికి ఎస్పీ..స్టేజ్ పై నుంచి అతడి వద్దకు వచ్చి ఆప్యాయంగా చేయిపట్టి పైకి లేపారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న వారందరి కన్నులు చెమ్మగిల్లాయి. రాజకుమారి ఎదుట కన్నీళ్లతో పాటపాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు. ఖాకీ డ్రెస్ వేసుకుంటే చట్టానికి కట్టుబడి, శాంతి భద్రతల సంరక్షణే బాధ్యతగా నడుచుకోవడం తప్ప భావోద్వేగాలకు లోనవడం ఉండదు. అయితే విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి.రాజకుమారి విధి నిర్వహణలో అధికారిగా ఉంటూనే.. సిబ్బందికి ఇంటి పెద్దలా నిలబడుతున్నారు. కష్టం వస్తే ఆదుకుంటున్నారు. ఒక ఆడపడుచుగా పోలీసు కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. అందుకు తాజా నిదర్శనమే కానిస్టేబుల్ రాంబాబు కృతజ్ఞతాభివందనం. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర విధుల్లోని వారితోపాటు.. పోలీసులు కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది పోలీసులు కోవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. ఇళ్లలోనూ, ఆస్పత్రులలోనూ ఐసోలేషన్లోకి వెళ్లిపోయి కొన్నాళ్లపాటు కరోనాతో పోరాడి విజేతలుగా తిరిగి వస్తున్నారు. ఎస్పీ రాజకుమారి ఎదుట మోకరిల్లి నమస్కరిస్తూ పాట పాడుతున్న ఎఆర్ కానిస్టేబుల్ రాంబాబు ఆ సమయంలో వీరి విధులను కూడా ఎస్పీ రాజకుమారి నిర్వహిస్తున్నారు. రేయింబవళ్లు వారి స్థానంలో తనే రోడ్ల మీద పహారా కాస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో సిబ్బంది బాగోగులను వీడియో, టెలీకాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం తెలుసుకుంటున్నారు. తగిన సూచనలు ఇస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు. ఆమె అందించిన తోడ్పాటుతో, ఇచ్చిన స్ఫూర్తితో మానసిక దృఢత్వాన్ని సాధించి జిల్లాలో దాదాపు నాలుగు వందల మంది పోలీసులు కరోనానుంచి బయటపడ్డారు. వాళ్లందర్నీ సత్కరించి, నిత్యావసర సరుకులు అందించి, తిరిగి విధులకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఎస్పీ రాజకుమారి. గతంలో ఎంతోమంది సమర్థులైన అధికారులను చూసి ఉండవచ్చు.. సిన్సియర్ ఆఫీసర్ల వద్ద పనిచేసి ఉండవచ్చు. కానీ.. ఈ కష్టకాలంలో అమ్మలా ఆదరిస్తున్న రాజకుమారి వంటి అధికారి దగ్గర పనిచేయడం తమ అదృష్టం అని విజయనగరం పోలీసులు భావిస్తున్నారు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
డబ్బింగ్ కళాకారుడు రాంబాబు కన్నుమూత
ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, టీవీ సీరియల్ నటుడు రాంబాబు (60) కరోనాతో మంగళవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా గనపవరం మండలం కండ్రిగగూడెంకు చెందిన శ్రీమంతుల రాంబాబు 1960 జూన్ 15న జన్మించారు. 1987–88 మధ్యకాలంలో డీటీపీ ఆపరేటర్‌గా చేసి, ఆ తర్వాత సీనియర్ నటుడు కాకరాల వద్ద డబ్బింగ్లో శిక్షణ పొంది 1993 నుంచి డబ్బింగ్ కళాకారుడిగా కొనసాగారు. ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటితో కలిసి పలు చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. సుమారు వెయ్యి చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పారాయన. అనేక టీవీ సీరియళ్లలోనూ నటించారు. హైదరాబాద్ నుంచి ఇటీవల చెన్నైకు వచ్చిన రాంబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఈయనకు భార్య లక్ష్మి, కుమారుడు జగదీశ్ ఉన్నారు. – సాక్షి, చెన్నై -
సీఎం జగన్‌కు ర్యాపిడ్ టెస్టుపై డాక్టర్ కె.రాంబాబు
-
టీడీపీ నాయకుడి ఇంట్లో నకిలీ మద్యం తయారీ
కర్నూలు డోన్ టౌన్: నకిలీ మద్యం తయారీ గుట్టును ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. ఆదివారం డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు ఉప్పరి రాంబాబు ఇంటిపై దాడి చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో నకిలీ మద్యంతోపాటు తయారీకి ఉపయోగించేముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీలో రాంబాబుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి, డోన్ మండల మాజీ ఎంపీపీ, కొత్తకోట గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాంబాబు..టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. గత ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. ఇక్కడ తయారీ చేసిన నకిలీ మద్యాన్ని జిల్లా అంతటా తరలించేవాడు. అండర్‌గ్రౌండ్ కేంద్రంగా.. ఉడుములపాడులో రాంబాబు నిర్మించిన ఇంటిలోని అండర్ గ్రౌండ్లో నకిలీ మద్యం తయారు చేసేవారు. ఆఫీసర్ చాయిస్, ఇంపీరియల్ బ్లూ, మ్యాక్‌డోల్ విస్కీ..తదితర బ్రాండ్ల పేరుతో స్పిరిట్, క్యారామిల్ పౌడర్, కెమికల్ ఫ్లేవర్ కలిపి మద్యం తయారు చేవారు. ఖాళీ బాటిళ్లు, లేబుల్స్, మూతలు, స్పిరిట్‌తో నిండి ఉన్న క్యాన్లను ఎక్సైజ్ పోలీసులు స్వాదీనం చేసుకొన్నారు. అన్నీ బ్రాండ్లు ఇక్కడే ఈ నెల 7,10వ తేదీల్లో కృష్ణగిరి మండలానికి చెందిన జయపాల్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డిలను అరెస్టుచేసి నకిలీ ఇంపీరియల్ బ్లూ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కర్నూలు కృష్ణానగర్‌లో నకిలీ మద్యం తయారీతో సంబందం ఉన్న హాలహార్వి వీఆర్వో విష్ణువర్దన్ రెడ్డి, కృష్ణమూర్తి, భాస్కర్లను అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారు చేసే కర్ణాటక రాష్ట్రం దర్వాడ్ జిల్లా హాల్వాహో గ్రామానికి చెందిన వినోద్ కలార్పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీపై పూర్తి సమాచారం సేకరించిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు..ఆదివారం ఉడుములపాడు గ్రామంలోని రాంబాబు ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. తీగెలాగితే డొంక కదిలినట్లు నకిలీ మద్యం తయారీదారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. అయితే చాలా ఏళ్ల నుంచి ఈ దందా కొనసాగిస్తున్న అసలు నిందితులను వెలుగులోకి రావాల్సి ఉంది. పూర్తి వివరాలు వెల్లడించలేం నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పట్టుబడిన వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేమని ఎక్సైజ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ లభించిన నకిలీ మధ్యం బాటిళ్లు, ముడి సరుకు వివరాలను తెలపాలంటే కాస్త సమయం పడుతుందని అధికారులంటున్నారు. తదుపరి విచారణ జరిపి.. అసలు నిందితులను అదుపులోకి తీసుకునే వరకు ఈ విషయాన్ని చెప్పలేమని వారు వివరిస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ సీఐ శిరీషాదేవి, డోన్ సీఐ లక్ష్మణదాసు, ఎస్ఐ రమణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, సిబ్బంది సుధాకర్‌రెడ్డి, లాలప్ప, ధనుంజయ, శంకర్ నాయక్‌తో పాటు మరికొంతమంది పాల్గొన్నారు. -
పాటల తోటలో ఒంటరి సేద్యం!
సాక్షి, తెనాలి: కృష్ణాజిల్లాలోని ఓ పల్లెటూరి కుర్రోడు గోసాల రాంబాబు. తెలుగు సినిమా గీత రచయితగా గెలిచాడు. పదేళ్ల సినీజీవితంలో 30 సినిమాల్లో వంద పాటలు రాశాడు. పాటల తోటలో తాను చేసిన ఒంటరి సేద్యం అద్భుతమైన సాహిత్యం అందించిందని చెబుతున్న రాంబాబు సోమవారం తెనాలి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి వెల్లడించిన విశేషాలు ఆయన మాటల్లోనే... ఉద్యోగం పేరుతో సినిమాల వైపు.. కృష్ణాజిల్లా ముసునూరు మండలం వేల్పుచర్ల నా సొంతూరు. తలిదండ్రులు గోసాల దానయ్య, కోటేశ్వరమ్మ. పాటలవైపు మళ్లింది హైస్కూల్లోనే. ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని వేసిన అడుగులు...సినిమా రంగంకేసి నడిచాయి. ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌కి వెళ్లాను. ‘ఉయ్యాల జంపాల’తో అవకాశాలు ‘వియ్యాలవారి కయ్యాలు’కు తొలిసారిగా నాకు పాట రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు రాలేదు. అనంతరం స్నేహితుడు విరించి వర్మతో వరించిన ‘ఉయ్యాల జంపాల’ సినిమా పాట (నిజంగా నేనేనా)తో అవకాశాలు తలుపు తట్టాయి. మజ్నూ చిత్రంలో పాటలకు అభినందనలు అందుకున్నా. డైరెక్టర్ సందీప్‌రెడ్డి ఇచ్చిన స్టోరీ అవుట్‌పుట్స్‌తో ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో రెండు పాటలు రాశాను. నాకు పేరుతో పాటు అవార్డులనూ తెచ్చిపెట్టాయి. యూత్‌కి కనెక్ట్ అయ్యాయి.. అర్జున్‌రెడ్డి సినిమాలో లవ్ బ్రేకప్ పాట యూత్‌కి బాగా కనెక్టయింది. ‘తెలిసెనే నా నువ్వే...నా నువ్వు కాదనీ...తెలిసెనే నేననే నే నేను కాదనీ’ అంటూ ఆరంభమయ్యే పాటది. ఇది సినిమాలో అర్జున్‌రెడ్డి ప్రేమ గురించే అయినా, నా జీవితానికీ అన్వయించొచ్చు. సినిమా టైటిల్స్‌లో పేరు చూసుకుని శభాష్ అంటూ నాకు నేను భుజం తట్టుకోవటానికి పదేళ్లు పట్టింది. సినీ ‘మజిలీ’ బాగుంది.. ఈ ఏడాది నాగచైతన్య, సమంత జంటగా వచ్చిన ‘మజిలీ’ సినిమాలో ‘నా గుండెల్లో ఉండుండి’ అనే పాట, ప్రస్తుతం థియేటర్లలో వున్న ‘కౌసల్య కృష్ణమూర్తి’లో ‘రాకాసి గడుసుపిల్ల’ పాటలు విజయవంతమయ్యాయి. ఆలీ హీరోగా నటించిన పండుగాడి ఫొటో స్టూడియో సినిమాలో అన్ని పాటలూ నేనే రాశాను. ప్రస్తుతం మరో పది సినిమాలకు పాటలు రాస్తున్నాను. అర్జున్‌రెడ్డి సినిమాకు ఉత్తమ గేయరచయితగా ప్రభుత్వ ఉగాది పురస్కారం తీసుకున్నాను. 2018లో ఉదయ్‌కిరణ్ స్మారక అవార్డు, 2019లో మనసుకవి ఆత్రేయ పురస్కారం అందుకున్నాను. -
పెట్రోల్ బంక్ కార్మికుడిపై నిజాంపట్నం ఎస్సై దాడి
సాక్షి, గుంటూరు : పెట్రోల్ బంక్ కార్మికుడిపై నిజాంపట్నం ఎస్సై రాంబాబు రౌడీయిజం ప్రదర్శించారు. తన కారుకు డీజిల్ అప్పుగా పోయలేదని దాడి చేశాడు. బంక్ కార్మికుడు హుమాయూన్‌పై పబ్లిక్‌గా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. రౌడీ షీట్ తెరుస్తానని బెదిరింపులకు దిగారు. హుమాయూన్‌పై రాంబాబు దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. -
దిక్కులేని సిపాయి
కూలీలను వెంటేసుకొని ఆవేశంగా వస్తున్న రాంబాబును చూస్తూ లెక్క ప్రకారం అయితే భూస్వామి భూషయ్య ఒక మోస్తరుగానైనా కంగారుపడిపోవాలి. అదేమి లేకుండా చాలా తేలిగ్గా...‘‘ఏంట్రా అబ్బాయి’’ అన్నాడు.‘‘కూలీలు’’ అని పిడికిళ్లు బిగించినంత పనిచేశాడు రాంబాబు.‘కూలీలు’ అనే చిన్న మాటలోనే చెప్పకనే ఎన్నో విషయాలు చెప్పాడు రాంబాబు. కూలిపోతున్న కూలీల జీవితాల గురించి కావచ్చు, వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు.పట్నంలో చదువుకొని వచ్చిన రాంబాబుకు కూలీలతో పనేమిటి? ఈ రాంబాబు అందరిలాంటోడైతే కూలీలతో పనేమిటి? అనే అనుకోవచ్చు. కానీ రాంబాబు చదువుతో పాటు సమాజాన్ని చదువుకున్నవాడు. అందుకే కూలీల సమస్యలను తన ఇంటి సమస్యగా చేసుకొని భూషయ్య ఇంటికొచ్చాడు.భూషయ్య మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు.‘‘కూలీల సంగతి కూలోడు, రైతుల సంగతి రైతోడు పడతాడు. కుర్రోడివి నీకెందుకు ఈ ఎవ్వారం’’ విసుక్కున్నాడు భూషయ్య.‘‘చదువుకున్నాడని యవ్వారానికి వచ్చాడు’’ వెక్కిరింపుగా అన్నాడు భూషయ్య భజనుడు.‘‘వచ్చి మాత్రం ఏంచేస్తాడు! వరిముక్క చేతికి ఇచ్చి ఏంట్రా ఇది అని అడిగితే వడ్లుగాసే చెట్టు అనేవాడివి నీకెందుకురా...ఎళ్లు’’ రాంబాబును ఊకలా తేలికగా తీసేశాడు భూషయ్య.మరి భజనుడు ఊరుకుంటాడా..‘‘ఇదిగో గాడిద పని గాడిద కుక్క పని కుక్క చేయాలి. తెల్సిందా!’’ అని అరిచాడు.‘‘నువ్వు ఇక్కడ ఉన్నావంటే మర్యాద దక్కదు’’ అని హెచ్చరించాడు కూడా.‘‘వెళ్లిపోకపోతే?’’ కోపంగా అన్నాడు రాంబాబు.‘‘తలగొరుకుడు, సున్నంబొట్లు, గాడిద మీద ఊరేగింపు...చాలా’’ తన మాటలతో రాంబాబును మరింత రెచ్చగొట్టాడు భజనుడు.అంతే...‘‘ఏంట్రా కుశావు’’ అని ఆ భజనుడి వైపు పిడుగులా దూసుకువచ్చాడు రాంబాబు.∙∙ ఏటి ఒడ్డున పాక హోటల్.ఆలివ్‌గ్రీన్ దుస్తుల్లో ఉన్న ఒకాయన టీ తాగుతున్నాడు. ఊరికి కొత్తోడిలా ఉన్నాడు. అప్పుడే అక్కడి వచ్చాడు కామయ్య.‘‘పేరు?’’ అని కొత్తవ్యక్తిని అడిగాడు.‘‘చంద్రశేఖరం’’‘‘చంద్రశేఖరం అని తెల్సండీ. ఊరు?’’‘‘తోలేరు’’‘‘చంద్రశేఖరం... తోలేరు అనే సంగతి తెల్సండి. పని?’’‘‘ప్రభుత్వం వారు నాకు ఈ ఊళ్లో పొలం ఇచ్చారు. దాని కోసం వచ్చాను’’‘‘కరణంగారితో పనన్నమాట. మనం ఉండాలన్నమాట’’‘‘కరణంగారు మీకు తెలుసా?’’‘‘కాకిని, కరణంగారిని తెలియని వారు ఈ ఊళ్లో ఉంటారా! ఎటొచ్చి కొంచెం కమిషన్ అవ్వుద్ది’’‘‘కమిషనా! ఎందుకు?’’‘‘ఎందుకేమిటండీ, కరణంగారితో పని కావాలంటే కామయ్యగోరు కదలాలి. కామయ్యగోరు కదలాలంటే కమిషన్ ఉండాలి. ముందు ఆ కాగితాలు మన చేతిలో పెట్టండి. రేపు రండి. మీ భూమి తీసుకువచ్చి మీ చేతిలో పెడతాను’’అమాయకంగా కామయ్య సాలెగూడులో చిక్కుకుపోయాడు పాపం ఆ మిలిటరీ ఆయన. సూటిగా చెప్పాలంటే మిలిటరీ చంద్రశేఖరం మోసపోయాడు.∙∙ ‘‘కరణంగారు ఈ చేను ఎక్కడుందండీ?’’ చంద్రశేఖరం పొలం గురించి వివరం అడిగాడు రాంబాబు.‘‘ఎక్కడిదంటే...’’ నసిగాడు కరణం.చంద్రశేఖరం పొలాన్ని భూషయ్య నొక్కేశాడని రాంబాబుకు అర్థమెంది.‘‘దీన్నంతా ముత్యాలమ్మ చేను అంటారు. ఇది ఎప్పటి నుంచో భూషయ్య చేతిలో ఉంది’’ అని తనతో పాటు వచ్చిన చంద్రశేఖరానికి చెప్పాడు రాంబాబు.తన చేను గురించి భూషయ్యను అడగడానికి వెళ్లాడు చంద్రశేఖరం.‘‘భూషయ్య గారు ఆ చేను నాది. నాకు పట్టా వచ్చింది. దాన్ని మీరు అట్టి పెట్టుకున్నారు’’భూషయ్య తనదైన శైలిలో ఇలా అన్నాడు...‘‘కిట్టమూర్తి మనం అట్టిపెట్టుకోవడమేమిటయ్యా. అది ముత్యాలమ్మ తల్లిది. కాదంటే ఆ తల్లికే కోపం వస్తది. మనకేం!’’‘‘ఒకనాడు ఏం జరిగిందో తెలుసా? ఆ గట్టు మీద తాడిచెట్టు కల్లు దొంగతనం చేయడానికి ఓ అర్ధాయుష్షు వెధవ చెట్టెక్కాడు’’ అని భజనుడు అన్నాడో లేదో పూజారి టక్కున అందుకున్నాడు...‘‘రక్తం కక్కుకొని టపీమని చావబోయి ఆగాడు. అంటే ఒకటి....అమ్మతల్లి మహత్యం నీకింకా తెలియదు. ఆమె తలుచుకుంటే భూమి దద్దరిల్లుతుంది. ప్రళయం వచ్చేస్తుంది’’‘‘భయంకర శత్రుమూకలను నేలమట్టం చేయడంలో నా కాలు పోయినా ఆ గుండె బలం అలాగే ఉంది. నేను అవిటివాన్ని అయినా ఆ సాహసం అలాగే ఉంది. ప్రభుత్వం నాకు పట్టా ఇచ్చింది. ఆ భూమి నాది’’ అని గట్టిగా అరిచాడు చంద్రశేఖరం.తాటిముంజలు తింటూ తాటికాయలను నరుకుతున్న పనివాడిని చూస్తూ తనదైన శైలిలో స్పందించాడు భూషయ్య...‘‘రేయ్ పోతూ! పట్టా కత్తి చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్లు నరుక్కెళుతుంటే, వొకనాడు అమ్మతల్లి కన్ను విప్పుతుంది. కుండెడు రక్తం భళ్లునా కక్కాలి’’∙∙ ‘‘రాంబాబు... ఆరునూరైనా సరే రేపే మనం చేలో దిగుతున్నాం. పొద్దుటే వచ్చేయ్. చేనులో కలుద్దాం’’ ఆవేశంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు చంద్రశేఖరం.మరుసటి రోజు...చేనులో చంద్రశేఖరం కనిపించలేదు.ఆయన శవం కనిపించింది.కళ్లనీళ్లతో శవాన్ని భుజానికెత్తుకున్నాడు రాంబాబు.దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచాడు...‘‘మీరంతా ఇటు చూడండి. తలలు పక్కకు తిప్పుకోకండి. నా దేశం అని నా జనం అని వెర్రిప్రేమలు పెంచుకొని ఆవేశంతో శత్రువుల మీదికి దూకి కాలు పోగొట్టుకున్న పిచ్చిసిపాయి. అయినా భ్రమలు తీరక ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో వచ్చి ఒంటరిగా చచ్చిన దిక్కులేని సిపాయి. ఇతడ్ని తగిలేయడానికి నాతో రాగలిగిన వారు ఎవరు? మీరా? మీరా?’’ -
ఆదివారం అర్ధరాత్రి
రైల్వేస్టేషన్ దగ్గర చివరి ప్యాసెంజర్ని దింపాక రాంబాబు ఆటోని తన ఇంటి వైపు మళ్లించాడు. ఆ రోజు ఆదివారం. అర్ధరాత్రి దాటింది. రాంబాబు మనసేం బాలేదు. తండ్రికి ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టం అన్నారు. అందుకు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. రాంబాబుకు ఆటో తప్ప మరొక ఆస్తి లేదు. ఆటో పైన కూడా యాభై వేలు అప్పుంది. ఎంత ప్రయత్నించినా అప్పు పుట్టలేదు. ఓ పెద్దాయన హఠాత్తుగా ఆటోకి అడ్డొస్తే సడన్ బ్రేకేసి ఆటో ఆపి, కోపంగా చూశాడు రాంబాబు. బాగా తాగినట్టున్నాడు ముసలివాడు. తూలుతూ వచ్చి ఆటో ఎక్కాడు. మీటర్ తిప్పి ఆటోని ముందుకు కదిలించాడు రాంబాబు. ‘‘ఎక్కడికి?’’ అని రాంబాబు వెనక్కి చూస్తే నిషా ఎక్కువై ముసలివాడు స్పృహ కోల్పోయాడు. తట్టి లేపినా లేవలేదు. ఇక ఆ తాగుబోతుని ఆటోలోంచి దింపేసి తన దారిన తాను వెళ్లిపోవాలనుకున్నాడు రాంబాబు. కానీ రోడ్డు పక్కన దింపేసి వెళితే ఏదైనా వాహనం అతన్ని ఢీకొనవచ్చునని సురక్షితమైన స్థలంలో దింపాలనుకున్నాడు. అర్ధరాత్రి దాటడంతో షాపులన్నీ మూసేసి ఉన్నాయి. జన సంచారమే లేదు. రోడ్డు పక్కన ఓ షాపు ముందు పెద్ద వరండా కనిపించింది. రాంబాబు ఆ షాపు ముందు ఆటో ఆపాడు. అతి కష్టమ్మీద ఆ ముసలివాణ్ని ఆటోలోంచి దింపి వరండాలోకి తీసుకెళ్లాడు. ఓ కట్టమీద అతన్ని పడుకోబెట్టాడు. అంతలో ముసలోడి జేబులోంచి ఓ సెల్‌ఫోన్ కిందపడింది. రాంబాబు ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు. చాలా ఖరీదైన ఫోనది. దాన్ని బట్టి ఆ తాగుబోతు బాగా డబ్బున్నవాడని రాంబాబుకి అర్థమైంది. అప్పుడే అతనికొక వింత ఆలోచన వచ్చింది. ‘ఈ ముసలివాడు ఎక్కడున్నాడో ఇతని కుటుంబ సభ్యులకు తెలియదు. తెల్లవారేవరకూ ఇతనికి మెలకువ వచ్చేలా లేదు. ఈ స్థితిని ఉపయోగించుకుని డబ్బు సంపాదించవచ్చు. ఇప్పుడే ఫోన్ చేసి ముసలివాణ్ని కిడ్నాప్ చేసినట్టు అతని కుటుంబ సభ్యుల్ని నమ్మించగలిగితే చాలు. వారు అడిగినంత ఇచ్చేస్తారు.’ అనుకున్నాడు. ఓ నిర్ణయానికి రాగానే రాంబాబు స్విచాఫ్ అయి ఉన్న ఆ సెల్‌ఫోన్‌ని ఆన్ చేశాడు. ‘హోమ్’ అని ఉన్న నంబర్‌కి డయల్ చేశాడు. అవతల ఫోనెత్తిన వ్యక్తి ఆదుర్దాగా, ‘‘ఎక్కడున్నావు? గంట నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. ఫోన్ ఎందుకు స్విచాఫ్ చేశావు?’’ అన్నాడు. ‘‘చూడు మిస్టర్! మీ నాన్నని కిడ్నాప్ చేశాం. అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఇప్పటికిప్పుడే మాకు లక్ష రూపాయలు తెచ్చివ్వాలి’’ కటువుగా పలికాడు రాంబాబు. ఆ మాటలకు అవతలి వ్యక్తి షాకయ్యాడు. ‘‘మా నాన్ననేం చెయ్యకండి! మీరడిగిన డబ్బు ఇచ్చేస్తాను. ’’ ఆందోళనగా అన్నాడతను. రాంబాబు ముసలతని ఫొటో తీసి ఆ వ్యక్తి ఫోన్‌కు పంపించాడు. ఫొటో చూడగానే, ‘‘డబ్బు ఎక్కడికి తెచ్చివ్వాలి?’’ అంటూ ఆత్రంగా అడిగాడతను. రాంబాబు ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు – ‘‘కొత్తపేట శ్మశానం వెనక గల పాడుబడ్డ మఠం ముందు ఓ మర్రిచెట్టు ఉంది. అరగంటలోగా అక్కడికొచ్చి ఆ చెట్టు కింద డబ్బు పెట్టి వెళ్లిపో’’. తర్వాత రాంబాబు ఆ వ్యక్తి ఫోన్ నంబర్ని తన సెల్లో సేవ్ చేసుకొని ఆ సెల్‌ఫోన్‌ని ముసలతని జేబులో పెట్టేశాడు. ఆటో దగ్గరికొచ్చి అటూ ఇటూ చూశాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. రాంబాబు ఉత్సాహంగా ఆటో స్టార్ట్ చేసి పది నిమిషాల్లో కొత్తపేట శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు. ఆటో ఎవరికీ కనబడకుండా చీకట్లో నిలబెట్టి నడుచుకుంటూ మఠం వెనక్కి వెళ్లాడు. ఓ గోడ వెనక నక్కి డబ్బు తెచ్చే వ్యక్తి కోసం ఎదురుచూడసాగాడు. కాసేపట్లో ఓ కారు అక్కడికొచ్చింది. కారులోంచి దిగిన వ్యక్తి ఓ చిన్న బ్యాగుని మర్రిచెట్టు కింద పెట్టాడు. అటూ ఇటూ చూసి కారెక్కి వెళ్లిపోయాడు. రాంబాబు కాసేపు వేచి ఉండి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత మర్రిచెట్టు దగ్గరికెళ్లి బ్యాగు తీసుకున్నాడు. బ్యాగు తెరిచి చూస్తే పది వంద నోట్ల కట్టలు కనిపించాయి. రాంబాబు ఉత్సాహంగా ఆటో స్టార్ట్ చేసి ఇంటికి బయల్దేరాడు. దారిలో ఓ పబ్లిక్ బూత్ దగ్గర ఆగాడు. తన ఫోన్లో సేవ్ చేసుకున్న నంబర్‌కి పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేశాడు. అవతల ఫోన్ ఎత్తగానే, ‘‘మీ నాన్న నెహ్రూ రోడ్‌లోని ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ షాపు వరండాలో ఉన్నాడు. వెంటనే వెళ్లి అతణ్ని ఇంటికి తీసుకెళ్లు’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. రాత్రికి రాతే లక్ష రూపాయలు చేజిక్కించుకున్న రాంబాబు మరుసటి రోజే ఆ డబ్బుతో తండ్రికి హార్ట్ సర్జరీ చేయించాడు. కానీ ఆ తర్వాతి రోజే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ‘‘కిడ్నాప్, హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం’’ అన్నాడు ఎస్సై విజయ్. ఆ మాటలు విని రాంబాబు హడలిపోయాడు. ‘‘సార్! నేనెవర్నీ చంపలేదు.’’ అన్నాడు భయంగా. ‘‘ఆదివారం రాత్రి గంగాధర్ అనే వ్యక్తి నీ ఆటోలో ఎక్కిన దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. నువ్వతన్ని కిడ్నాప్ చేసి చంపి లక్ష రూపాయలు వసూలు చేశావ్’’ అన్నాడు విజయ్. ‘‘కిడ్నాప్ డ్రామాతో లక్ష రూపాయలు తీసుకున్న మాట నిజమే. కానీ నేనతన్ని చంపలేదు సార్!’’ జరిగినదంతా చెప్పాడు రాంబాబు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక విజయ్‌కి రాంబాబు మాటలపై నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఆదివారం రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో గొంతు నులమటం వల్ల గంగాధర్ చనిపోయాడని రిపోర్టులో ఉంది. సరిగ్గా అదే సమయంలో రాంబాబు గంగాధర్ కొడుకు రఘుకి కొత్తపేటలోని పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసినట్టు రఘు ఫోన్ రికార్డుల్ని బట్టి తెలుస్తోంది. ఒకే సమయంలో రాంబాబు రెండు చోట్ల ఉండటం అసాధ్యంగనుక ఈ హత్య రాంబాబు చెయ్యలేదని ఋజువైంది. దాంతో ఎస్సై విజయ్ తన పరిశోధన దిశను మార్చాడు. గంగాధర్ కొడుకు రఘుని పిలిపించి ప్రశ్నించాడు. ‘‘ఆదివారం రాత్రి మీ నాన్న కిడ్నాప్ అయిన విషయం మీతో పాటు ఇంకా ఎవరెవరికి తెలుసు?’’ అని అడిగాడు. ‘‘నా భార్యకీ, చెల్లికీ, బావకి తెలుసు. బావ వినోద్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. కిడ్నాపర్‌కి డబ్బు ఇవ్వడానికి తను కూడా వస్తానన్నాడు. నేనే వద్దన్నాను’’ అన్నాడు రఘు. ‘‘మీ నాన్న వీలునామా రాశాడా?’’ అడిగాడు విజయ్. ‘‘గత ఏడాది అమ్మ పోయాక నాన్న వ్యాపారమంతా నాకు అప్పగించి మిగతా ఆస్తిపాస్తుల్ని నాకూ, చెల్లికి సమానంగా పంచుతూ వీలునామా రాశాడు. ఆయనకి మేమిద్దరమే సంతానం’’ అన్నాడు రఘు. వీలునామా విషయం తెలిసాక ఎస్సై విజయ్ వినోద్ గురించి కూపీ లాగాడు. ఈ మధ్య వ్యాపారంలో బాగా నష్టాలు రావడంతో వినోద్ పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయాడని తెలిసింది. విజయ్ వెంటనే వినోద్‌ని స్టేషన్‌కి పిలిచి కటువుగా ప్రశ్నించాడు. ‘‘అప్పులు తీర్చడానికి నీకు డబ్బు కావాలి. నీ మామ చనిపోతేనే నీ భార్యకు ఆస్తి వస్తుంది. అందువల్ల నువ్వే ఆయనని చంపేశావ్’’ అన్నాడు. ‘‘కిడ్నాప్ అయినప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు’’ అన్నాడు వినోద్. ‘‘నువ్వే చంపావ్. హతుని మెడపై వేలిముద్రలు లభించాయి’’ చీకట్లో బాణం వేశాడు విజయ్. ‘‘ఎలా లభిస్తాయ్? నేనప్పుడు గ్లౌజులు ధరించాను..’’ గబుక్కున అనేసి నాలుక కరుచుకున్నాడు వినోద్. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని నేరం ఒప్పుకున్నాడు. హత్య ఎలా చేశాడో వివరించాడు – ‘‘నా ఫోన్లో మొబైల్ నంబర్ లొకేటర్ యాప్ ఉంది. దాంతో మావయ్య కిడ్నాప్ అయ్యాడని తెలిశాక ఆయన ఉన్న చోటుకి చేరుకున్నా. స్పృహలో లేని మావయ్యను చూశాక నాకు దుర్బుద్ధి పుట్టింది. ఆయనను చంపేస్తే ఆ నేరం కిడ్నాపర్‌పై పడుతుందనుకున్నాను. వెంటనే నా కారులో ఉన్న గ్లౌజులు ధరించి ఆయన్ని గొంతు పిసికి చంపేశాను. తర్వాత ఏమీ ఎరగనట్టు రఘు ఇంటికి వెళ్లిపోయాను’’ అన్నాడు వినోద్. - మహబూబ్ బాషా -
‘భక్తితో’ తస్కరిస్తూ!
సాక్షి, సిటీబ్యూరో: డబ్బు అవసరమైన ప్రతిసారీ పొద్దున్నే లేస్తాడు... కాలకృత్యాలు తీర్చుకుని తన బైక్‌పై దేవాలయానికి వెళ్తాడు... పూలు, పళ్లు సమర్పించి ‘భక్తితో’ నమస్కరిస్తాడు... పూజారికి దక్షిణ సైతం సమర్పిస్తాడు... ఇంత వరకు బాగానే ఉన్నా అసలు కథ అప్పుడే ప్రారంభిస్తాడు... అదును చూసుకుని గుడిలో ఉన్న దేవతల విగ్రహాలపై ఉన్న ఆభరణాలు తస్కరించి ఉడాయిస్తాడు... ఈ పంథాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక నేరాలు చేసిన గుడిదొంగ ఈమని రాంబాబుపై పీడీ యాక్ట్ ప్రయోగించినా మారలేదు. జైలు నుంచి వస్తూనే ఏపీలోనూ అరెస్టై బెయిల్ పొంది సిటీలో పంజా విసిరాడు. ఇతడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన ఇతను ఆ అడ్డాల్లోనే తిరుగుతూ అందుకు అవసరమైన డబ్బు కోసమే దాదాపు పదేళ్ల క్రితం దొంగగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘరానా దొంగను పట్టుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను డీసీపీ రాధాకిషన్‌రావు అభినందించారు. గుడి పదిలమనే భావనతో... ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, తాటిపాక గ్రామానికి చెందిన రాంబాబుకు రామ్ పవన్ అనే మారు పేరు కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన ఇతగాడు మీర్‌పేటలో స్థిరపడ్డాడు. బతుకుతెరువు కోసం ముత్యాల వ్యాపారం ప్రారంభించినా అందులో వచ్చే సొమ్ము కుటుంబపోషణకే సరిపోయేది కాదు. పదేళ్ల క్రితం ఇతడికి ఏర్పడిన చెడు స్నేహాలతో స్వలింగ సంపర్కుడిగా మారాడు. ఆ తరహాకు చెందిన వారు ఉండే అడ్డాల్లోనే ఎక్కువగా సంచరిస్తూ ఆ పని కోసమే ఖర్చు పెట్టడం మొదలెట్టాడు. ఇలా ఖర్చులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరాలు చేయాలని నిర్ణయించుకున్న ఇతడి దృష్టి చిన్న, మధ్య తరహా దేవాలయాలపై పడింది. వాటిలో రద్దీ, భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో వాటినే టార్గెట్‌గా చేసుకున్నాడు. ఉదయం పూట తన బైక్‌పై బయలుదేరే ఇతను మార్గ మధ్యంలో పూలు, పళ్లు ఖరీదు చేసుకుని వెళ్తాడు. రెండు పంథాల్లో పంజా విసిరి... తాను ఎంచుకున్న దేవాలయం వద్దకు వెళ్లిన తర్వాత చుట్ట పక్కల ఉన్న పరిస్థితులను గమనిస్తాడు. పూజారి అందుబాటులో లేకుంటే తానే గర్భగుడిలోకి ప్రవేశించి పూలు, దండలు, పళ్లు సమర్పిస్తున్నట్లు నటిస్తాడు. అదును చూసుకుని దేవతా విగ్రహాలకు ఉన్న ఆభరణాలు ఎత్తుకుని ఉడాయిస్తాడు. ఒకవేళ పూజారి గుడిలోనే ఉంటే దక్షిణగా రూ.500 ఇస్తూ... చిల్లర తిరిగి ఇవ్వమని కోరతాడు. అది తీసుకురావడానికి పూజారి వెళ్లినప్పుడు తన ‘పని’ పూర్తి చేసుకుని ఆయన తిరిగి వచ్చేలోగా మాయమవుతాడు. హైదరాబాద్‌లో వరుస నేరాలు చేసిన తర్వాత పోలీసులకు చిక్కి అరెస్టైతే మకాం మారుస్తాడు. బెయిల్‌పై వచ్చిన తర్వాత కుటుంబంతో సహా ఏపీకి షిఫ్ట్ అయి అక్కడ నేరాలు ప్రారంభిస్తాడు. అక్కడి పోలీసులు అరెస్టు చేస్తే... బయటకు వచ్చాక సిటీకి మకాం మార్చి ‘పని’ మొదలు పెడతాడు. పీడీ యాక్ట్ ప్రయోగించినా... దేవాలయాలనే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న ఇతని కారణంగా ఒక్కోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 53 నేరాలు చేసిన ఇతడిపై సిటీ పోలీసులు 2015లో పీడీ యాక్ట్ సైతం ప్రయోగించారు. ఆ ఏడాది మార్చ్ నుంచి 2016 అక్టోబర్ వరకు చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇతను బయటకు వచ్చాక ఏపీకి వెళ్లాడు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నాల్లో చోరీలు చేసి అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆ కేసుల్లో బెయిల్ పొందిన తర్వాత నెల రోజుల క్రితమే సిటీకి వచ్చాడు. మళ్లీ చోరీలు ప్రారంభించి గత నెల 26న బేగంబజార్, కాచిగూడలోని భూలక్ష్మీ, పొచమ్మ దేవాలయాల్లో, గత బుధవారం మాదన్నపేటలోని భూలక్ష్మీ గుడిలో, గురువారం కార్ఖానాలోని నాగదేవత టెంపుల్లో పంజా విసిరాడు. కాచిగూడ దేవాలయంలోని సీసీ కెమెరాల్లో ఇతడి కదలికలు రికార్డు కావడంతో వీటి ఆధారంగా రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై కేఎస్ రవి కీలక ఆధారాలు సేకరించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్ వలపన్ని శనివారం నిందితుడిని పట్టుకున్నారు. ఇతడి నుంచి బైక్, 19 గ్రాముల బంగారం, 15 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. -
‘ఉయ్యాల జంపాల’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలతో బ్రేక్
గుంటూరు, తెనాలి: సినిమా పాటతో చదువుకునే రోజుల్నుంచి ప్రయాణం కట్టాడో యువకుడు. పాటను పలవరిస్తూ, కలవరిస్తూ, పాటే జీవితమనుకున్నాడు. తెలుగు సినిమా వేదికగా నిరూపించుకోవాలని కలలుగన్నాడు. చదువు పూర్తవగానే తన కలలు నెరవేర్చుకునేందుకు ఓ సుముహూర్తాన హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. కాలచక్రంలో పదేళ్లు గిర్రున తిరిగాయి. ఒకే ఏడాది పది సినిమాలకు పాటలు రాసే ఘనతను పొందాడు. ఉయ్యాల జంపాల, మజ్నూ, అర్జున్‌రెడ్డి సినిమాలతో యువతరానికి దగ్గరైన ఆ గీత రచయిత గోసాల రాంబాబు. సాదాసీదాగా మన పక్కింటి కుర్రోడిలా కనిపించే ఆ యువకుడి కలం అన్ని రకాల ఎమోషన్లను ప్రతిబింబించే పాటలు రాస్తుందన్న ప్రశంసలు దక్కాయి. తాజాగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమా పాటల నిమిత్తం తెనాలి వచ్చిన రాంబాబు పాటతో తన ప్రయాణాన్ని ఇలా వివరించారు. ఈ ఏడాది పది సినిమాలు... టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు దిలీప్‌రాజా దర్శకత్వంలో తీస్తున్న ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమాకు పాటలు రాస్తున్నా. యాజమాన్య సంగీత దర్శకత్వంలో నాలుగు పాటలు రికార్డయ్యాయి. మొత్తం అయిదుపాటలు. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఉంటాయి. చివరిపాట టైటిల్సాంగ్పై డిస్కషన్‌కు తెనాలి వచ్చాను. గ్రామీణ నేపథ్యంలోని కథ, చక్కని కామెడీతో జంధ్యాల మార్కు సినిమాలో పాటలు రాయడం మంచి అవకాశం. సిచ్యుయేషన్‌కు తగినట్టుగా పాట ఏ విధంగా ఉండాలనేది దర్శకుడు సూచించారు. యాజమాన్య అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. సాయిధరమ్‌తేజ సినిమా ‘తేజ్ ఐ లవ్ యూ’తో ఈ ఏడాది నేను పాటలు రాసిన మూడు సినిమాలు రిలీజయ్యాయి. మరో నాలుగు రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి ఇంకో మూడు సినిమాలకు పాటలు రాస్తున్నా. మొత్తంమీద ఈ ఏడాది పది సినిమాలకు రాసినట్టవుతుంది. యువతరానికి దగ్గర చేసిన సినిమాలు... నిజానికి 2007 నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతూ పాటలు రాస్తున్నా. తొలి గుర్తింపు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వచ్చింది. రాజ్‌తరుణ్, అవికాగోర్ నటించిన ఈ సినిమాకు విరించివర్మ దర్శకుడు. ‘నిజంగా... అది నేనేనా/ ఉయ్యాల జంపాల లూగేను నా ఊహలే’ అన్న పాట నేనొకడిని ఉన్నానని జనానికి తెలియజేసింది. ఇదే దర్శకుడు నానీతో తీసిన ‘మజ్నూ’లో ‘జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే’ లవ్ మెలోడీ సాంగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ పాట చరణంలోని ‘వాలు కనులలోన దాచేసినావా/ ఆ నింగిలోన లేదు నీలం’ చక్కని భావగీతంగా భుజం తట్టారు. అన్నిటికీ మించి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నన్ను యువతరానికి బాగా దగ్గర చేసింది. ‘తెలిసెనే నా నువ్వే...నా నువ్వు కాదనీ...తెలిసెనే నేననే నే నేను కాదనీ’ అంటూ ఆరంభమయ్యే లవ్ బ్రేకప్ పాటతో సినిమా ఆరంభమవుతుంది. అదే సినిమాలో క్లైమాక్స్‌లో కథంతా చెబుతున్నట్టుగా ‘ఊపిరాడుతున్నదే ఉన్నపాటుగా ఇలా...దారేంటో తోచకున్నదే నిన్ను చూడగా ఇలా’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్. ఆ రెండు పాటలు రాసే అవకాశం నిజంగా నా అదృష్టమే. మరో పది సినిమాల్లో అవకాశాలను తెచ్చింది. ఈ సినిమాతోనే నాకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసింది. పాటతో ప్రయాణం రేడియోతోనే... మా స్వగ్రామం ఏలూరు దగ్గర్లోని కృష్ణాజిల్లా గ్రామం వేల్పుచర్ల, సాధారణ పల్లెటూరు. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, దానయ్య. వ్యవసాయ కూలీ కుటుంబం. రెక్కల కష్టంపై ఆధారపడినప్పటికీ నన్నూ, తమ్ముడినీ, చెల్లెలినీ చదివించారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్ చేశాను. పాటపై మమకారం పెరగడానికి కారణం ఇంట్లో రేడియో. తాతయ్య అమ్మకు కొనిచ్చారట. ఇంట్లో ఉన్నంతసేపు రేడియోలో పాటలు వింటూ హమ్ చేసేవాడిని. ఏడోతరగతి నుంచి పదోతరగతి వరకు నాలుగు కి.మీ దూరంలోని హైస్కూలుకు వెళ్లేవాడిని. తర్వాత ఇంటర్, ఇంజినీరింగ్ ఏలూరులో. బస్టాండులో పాటల పుస్తకాలు కొనుక్కుని, అందులో పాటలు పాడుకుంటూ ప్రయాణించేవాడిని. మధ్యమధ్యలో నేనే సొంతంగా పాటలు అల్లుతూ వచ్చాను. ఆ రకంగా పాఠ్యపుస్తకాలతో పాటు పాటతో నా విద్యార్థి జీవితం గడించింది. తర్వాతి జీవితం పాటతోనే సాగించాలనుకుంటూ, 2007లో చదువైపోగానే హైదరాబాద్ బయలుదేరి వెళ్లా. ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి దగ్గర పనిలో చేరడం నా అదృష్టం. అద్భుతమైన ప్రతిభామూర్తి, అర్ధగంటలో పాట రాసేవారు. నేను చేరిన ఆర్నెల్ల తర్వాత ఆయన కాలం చేశారు. 30 సినిమాల్లోవంద పాటలు... 2007లో ఉదయ్‌కిరణ్, శ్రీహరిల ‘వియ్యాలవారి కయ్యాలు’ నా తొలి సినిమా. రమణ గోగుల సంగీత దర్శకుడు. నేను అనుకున్న ట్యూన్‌లోనే పాటని కంపోజ్ చేయడం మంచి అనుభూతి. తర్వాత ‘టిక్‌టిక్‌టిక్’, ‘లవ్ చేస్తున్నా’ వంటి సినిమాలకు రాస్తూ వచ్చాను. ఉయ్యాల జంపాల తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ ‘బందిపోటు’కు ‘ఏదో మాయవై ఉన్నాదే మనసాగనన్నాదే’ మెలోడీ పాట రాశా.మజ్నూ తర్వాత జగపతిబాబు హీరోగా తీసిన ‘పటేల్ సార్’ సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. పద్మాలయ మల్లయ్యగారు కుమారుడు హీరోగా తీసిన సినిమాలో ‘ఓ సజనా ఓ సజనా’ రాశాను. శ్రీకాంత్ ‘నాటుకోడి’లో ‘కన్ను పడిందే, కన్ను పడిందే నీపై నా కన్ను పడిందే’ మాస్ మసాలా పాట రాయించారు. సాయిధరమ్ తేజ సినిమాలో ‘హ్యాపీ ఫ్యామిలీ’ పాటతో ఫ్యామిలీ సాంగ్‌కు అవకాశం లభించింది. ‘ప్రేమెంత పనిచేసెను నారాయణ’, ‘సమీరం’, సీతాపహరణం’ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. మొత్తంమీద 30 సినిమాల్లో వంద పాటలు రాశాను. అందరు హీరోలతో అన్ని రకాల ఎమోషన్లతో రాయాలనేది నా ఆశ... -
దొంగ.. దొంగ వచ్చాడే.. అన్ని దోచుకు వెళతాడే..!
సాక్షి, హైదరాబాద్: ‘దొంగ.. దొంగ వచ్చాడే.. అన్ని దోచుకు వెళతాడే..’అన్న స్టైల్లో కార్లలో వచ్చి, తాళం వేసిన ఇళ్లకు రెక్కీ నిర్వహించి మరీ బంగారు ఆభరణాలు ఎత్తుకెళుతున్న కరుడుగట్టిన దొంగ రాంబాబును సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు రెండు వేర్వేరు ముఠా సభ్యులైన మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి కిలో 54 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు ముఠాల కేసు వివరాలను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం మీడియాకు తెలిపారు. సింగిల్‌గా వస్తాడు.. దోచేస్తాడు ఏపీలోని కృష్ణా జిల్లా పెద్ద పరుపుడికి చెందిన గలెంకి రాంబాబు 2006 నుంచి నగరంలోని సినిమా కాంట్రాక్టర్లకు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన రాంబాబు 2014లో చోరీల బాట పట్టడంతో కూకట్పల్లి, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2016 ఆగస్టులో మళ్లీ అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జైలు నుంచి బయటకు వచ్చిన రాంబాబు నార్సింగ్, సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ ఠాణా పరిధిల్లో తొమ్మిది ఇళ్లలో చోరీలు చేసి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చోరీలు చేసిన కారులోనే వెళ్లి, దొంగతనానికి ఎంచుకున్న ఇంటి తాళాలను ఇనుప రాడ్లతో పగులగొట్టి చోరీలు చేశాడు. ఈ సందర్భంగా అడ్డొచ్చిన వారిపైనా దాడులు చేసేవాడు. ఇతనిపై నిఘా ఉంచిన మాదాపూర్ సీసీఎస్ పోలీసు ఇన్స్పెక్టర్ వి.సుధీర్, ఎస్ఐలు విజయ్ నాయక్, ధరమ్ సింగ్ నేతృత్వంలోని బృందం వలపన్ని కూకట్పల్లి ఠాణా పరిధిలో పట్టుకుంది. అలాగే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలేనికి చెందిన కర్ని మల్లికార్జున్, కట్టెల అనూప్ కుమార్ ముఠాగా ఏర్పడి రాయదుర్గం, సరూర్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, మీర్‌పేటలలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలు చేస్తుండటంతో అప్రమత్తమైన మాదాపూర్ సీసీఎస్ పోలీసులు వీరిని గచ్చిబౌలిలో సోమవారం అరెస్టు చేశారు. రాంబాబుతో పాటు వీరి నుంచి కిలో 54 తులాల బంగారు ఆభరణాలతో పాటు మోటారు సైకిల్, సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర ముఠా.. చోరీల్లో దిట్ట.. మహారాష్ట్ర హింగోలి జిల్లాకు చెందిన బలిరాం విశ్వనాథ్ జాదవ్, పిట్ల అంకుశ్, పర్భణి జిల్లాకు చెందిన సుఖ్‌దేవ్ మారుతీ పవార్లు నాందేడ్‌లో కిన్వత్ తాలూకాలో కూలీలుగా పనిచేసేవారు. ఇదే సమయంలో ఏర్పడిన పరిచయంతో వీరు ముఠాగా ఏర్పడి చోరీల బాట పట్టారు. 2013 నుంచి తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేస్తున్నారు. అయితే హింగోలి జిల్లాలోని బస్మత్ మండలం బబుల్ గౌన్ గ్రామంలో కలసి చోరీలు చేసేందుకు తెలంగాణ రావాలని నిర్ణయించుకొని వీరంతా రైలులో వచ్చారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల వద్ద ఉండి రాత్రి సమయాల్లో చోరీలు చేస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో రోడ్డు పక్కన తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా శామీర్‌పేటలో బంగారు ఆభరణాలు చోరీ చేసిన వీరిని బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి నేతృత్వంలోని బృందం పక్కా వ్యూహంతో పట్టుకుంది. చోరీ చేసే కొన్ని సమయాల్లో వీరు బాధితులపైన కూడా దాడులు చేసిన సందర్భాలున్నాయి. వీరందరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. -
పోలీసుల అదుపులో రాంబాబు
దెందులూరు: సోమవరప్పాడులో మంగళవారం సాయంత్రం మూగ చిన్నారిపై అత్యాచారం చేసిన అదే గ్రామానికి చెందిన బూరాడ రాంబాబును దెందులూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. బుధవారం దెందులూరు ఏఎస్ఐ కుమారస్వామి మాట్లాడుతూ బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 376 క్లాజ్–2 ఐ రెడ్‌విత్ 5(11) ఐపీసీ అండర్ సెక్షన్ రెడ్‌విత్ ఆఫ్ 18 ఫోక్సో 2012 యాక్ట్ సెక్షన్లుగా కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని గురువారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
ద్వేషం
మహబూబ్ బాషా ‘‘కాంతం, నాకు ఛాతిలో నొప్పిగా అన్పిస్తే డాక్టర్ దగ్గరికెళ్లాను. ఈసీజీ, స్కానింగ్, బ్లడ్ టెస్టులు చెయ్యాలన్నాడు. దానికో రెండు వేలు కావాలి, ఇస్తావా?’’ భార్యను వేడుకుంటూ అడిగాడు రాంబాబు.మీకున్న నొప్పి ఏమిటో నాకు బాగా తెలుసు. ఒక్కరోజు తాగకపోతే మీకు ఒళ్లంతా నొప్పులొస్తాయి. అయినా ప్రతి దానికి భార్య ముందు చెయ్యి చాపటానికి మీకు సిగ్గు లేదూ? ఇక నుంచి దేనికీ డబ్బు అడక్కండి. ఏదోఒక ఉద్యోగం వెదుక్కొని మీ అవసరాలు మీరే తీర్చుకోండి’’ నిష్ఠూరంగా అనేసి వంటింట్లోకి వెళ్లిపోయింది కాంతం.భార్య ధోరణి చూసి రాంబాబుకి కడుపు మండింది. అప్పటికప్పుడే ఆమె గొంతు పిసికి చంపెయ్యాలన్నంత కోపమొచ్చింది. కానీ గత్యంతరం లేక కోపాన్ని దిగమింగుకున్నాడు.ఏడాది క్రితం ఉద్యోగంలోంచి డిస్మిస్ అయ్యేవరకు రాంబాబు రాజాలా బతికాడు. పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తూ రెండు చేతులా సంపాదించేవాడు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టేవాడు. రోజూ రాత్రి మందు కొట్టేవాడు. ఇంట్లో అందమైన భార్య ఉన్నా కొత్తదనం కోసం బయట కాల్‌గర్ల్స్‌తో మజా చేసేవాడు. కానీ ఏడాది క్రితం లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి అతని విలాసాలకు బ్రేక్ పడింది. కానీ అలవాటు పడిన ప్రాణం ఎలా ఊరుకుంటుంది? విలాసాల కోసం కొన్నాళ్లు అప్పులు చేశాడు. తర్వాత అప్పుపుట్టకపోవడంతో భార్య ముందు చెయ్యిచాపాడు. కాంతం తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో మరణించారు. కాంతంకి తోబుట్టువులెవరూ లేకపోవడంతో తండ్రి యావదాస్తి ఆమెకే వచ్చింది. భర్త ఉద్యోగం పోయాక ఇంటి ఖర్చులన్నీ తనే భరిస్తోంది. అప్పుడప్పుడు రాంబాబు జేబు ఖర్చులకు కూడా కొంత డబ్బు ఇస్తోంది. కానీ అతని విలాసాలకు చిల్లిగవ్వ ఇవ్వటం లేదు. ఏదైనా ఉద్యోగం చేసి సంపాదించమంటోంది.కానీ అవినీతి ముద్ర పడిన రాంబాబుకి ఉద్యోగం ఎవరిస్తారు? వ్యాపారం చెయ్యాలన్నా దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. సవాలక్ష దురలవాట్లున్న భర్త కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కాంతంకి ఇష్టం లేదు. ఇదే కారణం వల్ల రాంబాబు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. తన సమస్యలన్నీ తీరాలంటే కాంతంని అడ్డు తొలగించుకోవటమొక్కటే మార్గమనుకున్నాడు. కాంతం చనిపోతే ఆమె పేరిట వున్న ఆస్తిపాస్తులన్నీ తనకొచ్చేస్తాయి. అప్పుడు ఉద్యోగం లేకపోయినా జీవితాంతం జల్సాగా బతకొచ్చనుకున్నాడు. ఈ విషయం గురించి బుర్రకి పదును పెట్టి దీర్ఘంగా ఆలోచించాడు. తన సర్వీసులో చూసిన రకరకాల కేసుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.మొత్తానికి భార్యను చంపటానికి నాలుగు మార్గాలు కన్పించాయి రాంబాబుకి. 1. అనారోగ్యం, 2.ప్రమాదం, 3.ఆత్మహత్య, 4 హత్య!తొలి పద్ధతి ఏమంటే కాంతంని విషప్రయోగంతో చంపి దాన్ని గుండెపోటు మరణంగా చూపాలి. కానీ కాంతం వయసు ముప్ఫై ఐదేళ్లే! ఇంత చిన్న వయసులో ఆమెకు ఎటాక్ వచ్చిందంటే ఎవరూ నమ్మరు గనుక ఆ ఆలోచన విరమించుకున్నాడు రాంబాబు. కాంతంని కరెంట్ షాక్‌తో లేదా గ్యాస్ సిలిండర్ పేల్చటం ద్వారా హతమార్చి దాన్ని ప్రమాదంగా చిత్రించటం రెండో పద్ధతి. కానీ ఆమె చావకుండా గాయాలతో బయటపడితే తన గుట్టు రట్టవుతుందని భయపడ్డాడు. ఇక మూడో ప్లాన్ ప్రకారం కాంతం చేత అధిక మోతాదులో బలవంతంగా నిద్రమాత్రలు మింగించి చంపి దాన్ని ఆత్మహత్యగా చూపించాలి. కానీ కాంతంకి ఆత్మహత్య చేసుకోవాల్సినన్ని తీవ్ర సమస్యలేం లేవు. అందువల్ల పోలీసులు తనని అనుమానించవచ్చు. అందుకే ఆ ప్రయత్నం కూడా మానుకున్నాడు.ఇక నాలుగో ప్లాన్ ప్రకారం భార్యను ‘హత్య’ చెయ్యటమొక్కటే సరైన మార్గమనుకున్నాడు రాంబాబు. తను ఊర్లో లేనప్పుడు అర్థరాత్రి పూట తన ఇంట్లో దూరిన దొంగ ఒంటరిగా ఉన్న కాంతాన్ని చంపి దోపిడీ చేసి పారిపోతాడు. ఇలా జరిగితే తనని పోలీసులు అనుమానించరు. కాకపోతే ఈ పని కోసం ఓ కిరాయి హంతకుణ్ని నియమించాల్సి వుంటుంది. వృత్తిరీత్యా గతంలో రాంబాబుకి కొందరు కిరాయి హంతకులతో పరిచయముంది. ఇలాంటి హత్యల్ని వారు చిటికెలో చెయ్యగలరు. కానీ ఈ పనిలో మరొకర్ని వాడుకోవడం రాంబాబుకి ఇష్టం లేదు. కిరాయి హంతకుడు ఏ చిన్న తప్పు చేసినా తన మెడకు చుట్టుకుంటుంది. ఒకవేళ అతను తప్పు చెయ్యకుండా పని ముగించినా తర్వాత తనని జీవితాంతం బ్లాక్మెయిల్ చెయ్యవచ్చు. అందువల్ల ఈ హత్య తనే చెయ్యాలనుకున్నాడు. కానీ ఒకే సమయంలో ఓ చోట హత్య చేసి మరో చోట తను వున్నట్లు ‘ఎలిబీ’ ఎలా సృష్టించుకోవాలి? అని చాలాసేపు దీర్ఘంగా ఆలోచించాక రాంబాబు బుర్రలో ఓ పథకం రూపుదిద్దుకుంది.కొద్దిరోజుల్లో ఆ పథకాన్ని అమలు చేసే అవకాశం కూడా వచ్చింది. ఓ దూరపు బంధువుల పెళ్లికి రమ్మని ముంబై నుంచి రాంబాబు దంపతులకు ఆహ్వానం వచ్చింది. కానీ కాంతం తను రాలేనని చెప్పి భర్తను ఒంటరిగానే వెళ్లమంది. రాంబాబు కోరుకున్నది కూడా అదే. అతను హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ముందే రిజర్వేషన్ చేయించుకొని శనివారం రాత్రి ట్రైనెక్కాడు. ఆ బోగీలో పెద్దగా జనం లేరు. రైలు నగరం దాటగానే రాంబాబు టాయిలెట్లోకి దూరి తన వేషం మార్చుకున్నాడు. ముఖానికి నకిలీ గడ్డం, మీసాలు తగిలించుకొని వేరే దుస్తులు, బూట్లు ధరించాడు. విడిచిన బట్టలు సూట్‌కేసులో వేసుకున్నాడు. తర్వాత తన ఫోన్‌ని స్విచాఫ్ చేసి ఓ స్టేషన్లో దిగిపోయాడు. అక్కడి నుంచి మరో ట్రైన్లో హైదరాబాద్‌కి తిరిగొచ్చాడు. ఓ ఆటో ఎక్కి తన ఇంటికి సమీపంలో దిగాడు.అప్పుడు సమయం అర్ధరాత్రి కావస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అతను కాలినడకన తన ఇంటికి చేరుకున్నాడు. పెరట్లో వున్న పెంపుడు కుక్క యజమాని వాసనని గుర్తు పట్టింది. అందుకే మొరగలేదు. రాంబాబు సూట్‌కేసులోంచి విషం బిస్కెట్లు తీసి కుక్కకు తిన్పించి దాన్ని చంపేశాడు. తర్వాత పెరటి వాకిలి తెరిచి ఇంట్లోకి ప్రవేశించాడు. నెట్టగానే తెరుచుకొనేలా అంతకు ముందే అతను పెరటివాకిలి బోల్టులు లూజ్‌గా చేసి ఉంచాడు. రాంబాబు ఇంట్లోకి ప్రవేశించాక చప్పుడు కాకుండా బెడ్రూం దగ్గరికెళ్లి లోపలికి తొంగి చూశాడు. మంచంపైన కాంతం ఆదమరచి నిద్రపోతోంది. రాంబాబు చేతులకు గ్లౌజులు ధరించి మంచాన్ని సమీపించాడు. ఓ తలగడను కాంతం ముఖంపై వుంచి బలంగా అదిమిపెట్టాడు. ఊపిరాడక కాంతం కాళ్లు చేతులు కొట్టుకుంది. రాంబాబు పట్టు వదల్లేదు. కాసేపట్లో కాంతంలో చలనం ఆగిపోయింది.రాంబాబు వెంటనే కాంతం ఒంటి మీది నగలతో పాటు ఇనుప పెట్టెలోని డబ్బు తీసుకొని తన బ్యాగులో వేసుకున్నాడు. గదిలో దోపిడీ జరిగిన వాతావరణం సృష్టించి వచ్చిన దారిలోనే ఇంట్లోంచి బయటపడ్డాడు. కన్పించిన ట్యాక్సీ ఎక్కి నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. మారు పేరుతో అంతకు ముందే బుక్ చేసిన టికెట్‌తో ముంబై ఫ్లైట్ ఎక్కాడు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ముంబైకి చేరుకునే సమయానికల్లా ముంబైలో ఫ్లైట్ దిగాడు. ఎయిర్పోర్ట్ బయట ఓ నిర్జన ప్రదేశంలో మారువేషం తీసేసి మునుపటి దుస్తులు ధరించాడు. ట్యాక్సీలో పెళ్లి జరిగే చోటుకి చేరుకున్నాడు. అక్కడ తన సెల్‌ఫోన్ స్విచాన్ చేసి భార్య నంబర్‌కి డయిల్ చేశాడు. అతనూహించినట్లే ఎవరూ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. ఆ తర్వాత అంతా రాంబాబు అనుకున్నట్లే జరిగింది. ఉదయం రాంబాబు ఇంటికొచ్చిన పని మనిషి జరిగింది చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించాక అది దోపిడీ కోసం జరిగిన హత్యగానే భావించారు. పోలీసులు ఫోన్ చేసి చెప్పగానే రాంబాబు ముంబై నుంచి వెంటనే ట్యాక్సీలో హైదరాబాద్‌కి తిరిగొచ్చాడు. తను ఊర్లో లేనందువల్లే ఈ ఘోరం జరిగిందని మొసలికన్నీరు కారుస్తూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. హత్య జరిగిన సమయంలో రాంబాబు ప్రయాణంలో వున్నట్లు స్పష్టమైన ఆధారాలుండటంతో పోలీసులు అతన్ని అనుమానించలేదు. రాంబాబు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు.కానీ ఒక్కరోజులో అంతా తారుమారైంది. భార్యను హత్య చేసినందుకు రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పు ఎక్కడ జరిగిందో ఎంత ఆలోచించినా రాంబాబుకి అంతుపట్టలేదు. చివరికి ఇన్స్పెక్టర్ విజయ్ ఆ గుట్టు విప్పాడు. ‘‘గతంలో నువ్వొక పోలీస్ ఆఫీసర్‌వి గనుక ఎంతో తెలివిగా నీ భార్యను చంపి అదే సమయంలో నువ్వు ట్రైన్లో ప్రయాణిస్తున్నట్లు ఎలిబీ సృష్టించుకున్నావ్. కానీ నువ్వు తప్పు చెయ్యకపోయినా నువ్వెక్కిన ట్రైన్ తప్పు చేసింది. సగం దారిలో అది పట్టాలు తప్పింది. దాంతో నీ ప్లాన్ కూడా పట్టాలు తప్పింది. ఆ సంగతి తెలియక నువ్వు రాత్రంతా ట్రైన్లో ప్రయాణించి ఉదయాన్నే ముంబైకి చేరుకున్నానని స్టేట్మెంట్ ఇచ్చేశావ్. కానీ ఆ ట్రైన్ పది గంటలు ఆలస్యంగా ముంబైకి చేరింది. నీ లొకేషన్ తెలియకూడదని నువ్వు తెలివిగా నీ ఫోన్‌ని స్విచాఫ్ చేశావ్. కనీసం ఫోన్ ఆన్ చేసిన తర్వాతైనా నెట్లో చూసి ఉంటే ట్రైన్ ఆగిన సంగతి నీకు తెల్సి ఉండేది. మొత్తం మీద నీ నిర్లక్ష్యమే నిన్ను చట్టానికి పట్టించింది.’’ అన్నాడు ఇనస్పెక్టర్ విజయ్. ఇన్స్పెక్టర్ మాటలకు రాంబాబు అసహనంగా జుట్టు పీక్కున్నాడు. ‘‘వెధవ ట్రైన్లు ఎప్పుడూ ఇంతే... ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో..’’ అని కోపంగా గొణుక్కున్నాడు. ఇంత చిన్న వయసులో ఆమెకు ఎటాక్ వచ్చిందంటే ఎవరూ నమ్మరు గనుక ఆ ఆలోచన విరమించుకున్నాడు రాంబాబు. కాంతంని కరెంట్ షాక్‌తో లేదా గ్యాస్ సిలిండర్ పేల్చటం ద్వారా హతమార్చి దాన్ని ప్రమాదంగా చిత్రించటం రెండో పద్ధతి. -
ముసలి ప్రాణం
‘‘ఏంటిరోయ్ రాంబాబు! తెల్లారకముందే మీయయ్య పల్లకీ భుజానేసుకొని ఊరేగుతున్నావ్?’’ కుక్కిన నులక మంచం భుజాన వేసుకొని వెళ్తున్న రాంబాబును అడిగేడు సుబ్బారావు. ఆ మాటతో రాంబాబు గుండె కలుక్కుమన్నట్టయ్యింది. ఏదో తప్పు చేస్తున్నానన్న అపరాధ భావం వెంటాడుతున్నా బయటకు గాంభీర్యం నటిస్తూ ముందుకు సాగేడు రాంబాబు. రాంబాబును అనుకరిస్తూ రెండు లాల్చీలు, లుంగీలు చేతపట్టుకొని వెళ్ల సాగేడు ఎనిమిది పదుల వయసున్న జగన్నా«థం. ‘‘ఒకప్పుడు ఆయన లేకపోతే ఈ ఊరే లేదు. ఎవులింటిలో ఏ కార్యం జరగాలన్నా ఆ పెద్ద మనిషి అండ లేకపోతే జరిగేది కాదు. ఎవలింటిలో కష్టమైనా తన ఇంటిలో కష్టంలాగ భావించేవాడు. అటువంటి మనిషి కాటికి కాలు చాచుకొని కూర్చొన్న వయస్సులో ఈ కట్టం’’ అని నిట్టూర్చేడు సుబ్బారావు. ‘‘ఆ ముసల్ది సచ్చినకాడి నుంచి ముసిలోడు పాట్లు పడుతున్నాడు’’ అంటూ సుబ్బారావు మాటలకు మాట కలిపేడు సీతంనాయుడు. రాంబాబు వెంట వచ్చిన జగన్నాథాన్ని చూసి ‘‘ఏమేవ్! మా అయ్య వచ్చాడు ఏంకావాలో సూడు’’ అంటూ వంటింట్లో ఉన్న సాయిలక్ష్మిని కేకేశాడు జగన్నాథం పెద్ద కొడుకు నాగభూషణం. ‘‘వత్తే? నన్నేటి సెయ్యమంతవు. తెచ్చిన మంచం గన్నెని ఆ గడపలో ఏసుకొని తొంగోమను. వంట పూర్తయితే సద్దన్నమేస్తాను’’ అంటూ కాస్తంత చిరాకు, నిర్లక్ష్యం కలకలిపినట్లుగా చెప్పింది సాయిలక్ష్మి. సాయిలక్ష్మి స్వయానా రాంబాబు, నాగభూషణంలకు మేనమామ కూతురు. ఆమె మాట కొంచెం కటువుగా అన్పిస్తుంది, మనిషి మంచిదే. తండ్రిని దిగబెట్టేయడంతో తన పనైపోయిందన్నట్లు రాంబాబు అక్కడ నుంచి నెమ్మదిగా జారుకోసాగేడు. ‘‘కరెక్టుగా నెల అంటే నెల. అంతకు మించి ఒక్క పూట కూడా ఎక్కువ ముసలోడ్ని వాళ్లింటి దగ్గర ఉండనివ్వరు. తెల్లారకముందే తెచ్చి ఈ ఇంట్లో తోసేస్తాడు.’’ రుసరుసలాడింది సాయిలక్ష్మి. కోడలి కోపం గురించి తెలిసిన జగన్నాథం కిక్కురుమనకుండా నులక మంచాన్ని ఇంటి ముంజూరు వద్ద వేసుకొని చిల్లుల దుప్పటి గుడ్డ పరుచుకొని పక్క సర్దుకోసాగేడు. నెల రోజులు ఒకరింట్లో, మరో నెల మరొకరింట్లో ఉంచి ముసలోడిగి గంజి పొయ్యాలని చేసుకున్న ఒప్పందం ప్రకారమే రాంబాబు తన తండ్రిని పెద్దోడైన నాగభూషణం ఇంటివద్ద విడిచి పెట్టి వెళ్లేడు. మరో నెల రోజుల తరువాత రాంబాబు ఇంటివద్ద ఇదే మాదిరిగా వదిలి పెట్టి వస్తాడు నాగభూషణం. ఇది కొన్ని నెలల నుంచి సాగుతున్న ప్రహసనమే. అయినా ముసలివాడు ఇంటికొచ్చేసరికి సాయిలక్ష్మిలో ఎక్కడ లేని రుసరుసలు మొదలయ్యాయి. ఒక రోజు సాయంత్రం కాయగూరలు తెచ్చేందుకు బజారుకెళ్లిన నాగభూషణం, వాటితో పాటు మేకమాంసాన్ని తీసుకొచ్చాడు. అది చూసిన జగన్నాథంకి ప్రాణం లేచొచ్చినట్టైంది. ఎన్నాళ్లయిందో నోటికి నీచు వాసన తగిలి. పోనీలే ఈ రోజు మళ్లీ కాస్తంత ఇగురైనా తగులుతుందని అనుకోసాగాడు. ఇంట్లోనుంచి మసాల వాసనలు గుభాళిస్తున్నాయి. జగన్నాథం నోట్లో నుంచి నీళ్లు ఊరుతున్నాయి. ఆకలి రెట్టింపవు తోంది. భోజన సమయం ఎప్పుడవుతుందా అంటూ ఎదురు చూడసాగేడు. ‘‘మావయ్యా! కాళ్లూ, చేతులు కడుక్కో.. అన్నం పెడతా’’ కోడలి నుంచి పిలుపు రాగానే ఎక్కడ లేనంత ఆనందం వచ్చింది జగన్నాథానికి. ‘‘కడుక్కున్నానమ్మా..’’ అంటూ సమాధానమిచ్చేడు. అన్నం, కాయగార పెట్టడంతో ఆశలన్నీ నీరుగారినంత పనైంది. ఒక్క ముక్కయినా తెచ్చి పెట్టకపోతుందా అని అన్నం తిన్నంతవరకూ ఎదురు చూసేడు. మాంసంతో భోజనం చెయ్యడానికి సిద్ధపడ్డ జగన్నాథానికి కాయగూరతో ముద్ద నోటికి పోవడం లేదు. ‘‘అమ్మా... బాబు సాయంత్రం మాంసం తీసుకొచ్చినట్టు ఉన్నాడు..?’’ అడగ్గానే సాయిలక్ష్మికి కరెంటు షాక్ కొట్టినంతపనైంది. కాసేపు ఏం చెప్పాలో పాలుపోలేదు. ‘‘మీ బాబు కేజీలు, కేజీలు మాంసం తేలేదు. తెచ్చిన పావుకేజిలో సగం వండి మనవడికి పెట్టాను. మిగిలినది తెల్లారి వండి పెట్టాలని ఆయించి వదిలేశాను. ఆడికి పూర్తిగా రత్తం నేదట. పండ్లు, గుడ్లు, మాంసం, పాలు ఇవ్వాలని డాట్రుగారు సెప్పినారట. నీకు పెట్టకుండా మేము తినేసినట్టు అడుగుతనవు’’ సమాధానం చెప్పింది. ‘‘నిజమే ఆడు బాగుండాల. మనం తినకపోయినా పరవానేదు. రేపో, మాపో పోయేవోళ్లం. ఏంటో ఇప్పుడి పిల్లలు ఎప్పుడు తింతన్రో, ఎప్పుడు పడుకొంతన్రో.., మరి ఆ పిల్లలకి ఆరోగ్యం ఎక్కడనుంచి వత్తది సెప్పు.. మా రోజుల్లో ఇలాంటి సదువుల్లేవమ్మా..! రాము, నాగభూషణయితే తిన్నంత తిని, అది జీర్ణమైనంత వరకూ ఆడుకునే వాళ్లు. ఇంటిపట్టున చేరకుండా తిరిగే వోళ్లు. బడికెళ్లినా అక్కడ కూడా ఆటలే. ఇప్పుడు పిల్లలకి తినడానికీ టైము నేదు. అది జీర్ణం చేసుకోడానికీ టైము నేదు’’ అంటూ పాత రోజుల్లోకెళ్లిపోయాడు జగన్నాథం. మరుసటి రోజు తెల్లవారు జామయింది. ‘‘ఏమేవ్.. ఎంత పొద్దెక్కిందో సూడు.. ఎడ్లకు దానా పెట్టావా లేదా.. ఏరు తోలాలా వద్దా? ఆ దానా గోళంలో వెయ్యి...’’ అంటూ నిద్ర లేస్తూనే బయటకు వచ్చేడు నాగభూషణం. ఇంటి గడపలో ఓ మూలన ఉన్న కుక్కు మంచంపై ఒత్తికిల్లి పడుకొని మూలుగుతూ కన్పించేడు జగన్నాథం. ‘‘ఏటయ్యింది..?’’ అనుమానంగా వెళ్లి చూశాడు. ‘‘అయ్యా...! ఓరయ్యా...!’’ అంటూ అటూ ఇటూ కదుపుతూ పిలిచాడు. జగన్నాథం నుంచి ఉలుకూ, పలుకూ లేదు. దీంతో గుండె జారినంత పనైంది నాగభూషణానికి. ఒళ్లు కాలిపోతోంది. ముసలోడికి బాగోలేదట్రా అంటూ ఆ నోటా, ఈ నోటా ఊరంతా పాకింది. ఒక్కొక్కరుగా ఊళ్లోని వారంతా వచ్చి మంచం చుట్టూ చేరారు. ఇంతలో పరుగుపరుగున ఊరిలోని వైద్యుడు సూర్యారావును వెంట పెట్టుకొని వచ్చేడు నాగభూషణం. ‘‘ఏం ఫర్వాలేదు. మనిషి బాగా నీరసంగా ఉన్నాడు. సెలైన్ బాటిల్ పెట్టే్టను. మరో అరగంటలో తేరుకుంటాడు’’ అని భరోసా ఇచ్చాడు. దీంతో గ్రామస్తుల ఉత్కంఠకు కొంత తెరపడినట్లు అయింది. డాక్టరు చెప్పినట్లుగానే ఒక సెలైన్ ఎక్కేసరికే జగన్నాథానికి స్పృహ వచ్చింది. అనంతరం కొన్ని మందు బిళ్లలిచ్చి, ‘‘టైముకి మాత్రలు వేయించండి. మంచి తిండి పెట్టండి’’ అంటూ సాయిలక్ష్మి మొహాన ఓ సలహా పడేసిపోయాడు డాక్టరు సూర్యారావు. ‘‘ఆ.. చిన్న కొడుకు ఇంట పంచబక్ష పరమాన్నాల్లు తినొచ్చాడు. మేమే ఆయనగారికి భోజనం పెట్టలేదు’’ అంటూ గొణుక్కొంటూ ఒక్క ఉదుటున ఇంట్లోకి వెళ్లింది సాయిలక్ష్మి. ఇంతలో ఇంటి పక్క ఉన్న అప్పలనరసమ్మను పిలిచి ‘‘చూశావా వదినా! ఈ ముసలి గొరకడికి మేము తిండెట్టనేదట. నువ్వు సూత్తనవు కదా.. ముసలోడికి పెట్టకుండా మేమేమైనా తినెత్తనమా.. మా పరువు ఈదిన పడేయడానికే శనిలాగ దాపురించాడు. మొన్నటికి మొన్న పెసరట్టులు వేశాను. ముసలోడికి తిన్నంత పెట్టమని మీ అన్నయ్య నా పేనాలు తోడేసినాడు. పెట్టానో లేదో ఆ రాత్రంతా అరగకలేదని నానా ఇబ్బంది పడ్డాడు. మంచినీళ్లని, మాత్రలని మాకు నిద్ర లేకుండా చేశాడు. ఆ రోజంతా నిద్ర లేదు. తెల్లారి మరే పని చేతిల పడనే. నాకు ఆరోజంతా నీరసమైపోయింది. సాయి గాడికి కేరేజి వండనేక బడికి పంపించనేకపన్ను. అప్పటికే మీరంతా కూలి పనికి ఎవలి గెంజిబువ్వ పట్టుకొని ఆలు ఎలిపొన్రు. ఈ ఇబ్బందులు ఎవలకీ తెలీవు. పెడితే ఒక బాధ, పెట్టకపోతే మరొక బాధ. చూసినోల్లంతా జగన్నాథం పెద్ద కోడలు ముసలోడికి గెంజి పొయ్యడం నేదని చెవులు కొరుక్కొంటున్నారు. పళ్లు వచ్చినప్పుడు నుంచి తింటున్నాడు. ఇప్పుడు బతికి ఏటి ఉద్దరించేయాలి. బతికినన్నాళ్లూ పోసిన గెంజి తాగి గుట్టుగా బతకడాయె! మేమంట ముసిలోడి ఆస్తి అంతా పడేసుకొని సరిగా గెంజికూడా పొయ్యడం నేదట. ఎదురింటి సూరమ్మ, అచ్చియ్యమ్మ చెవులు కొరుక్కొంటున్నారు. కాదు...! మాకేటి ఇచ్చేసినాడు. ఉన్న ఆరెకరాల భూమిలో ఎకరన్నర భూమి అమ్మీసి చిన్న కూతురికి పెళ్లి చేసినాడు. ముసిల్దాని బంగారమంతా దాని పంచనే పడేసినాడు. మిగిలిన దానిని మాకు పంచి ఇచ్చినాడు. పదవులు దానికి బదవులు మాకు. అంత తగలెట్టినాడు ఒక రోజైనా అది గెంజిపోసిందా.. మమ్మల్ని సాధిస్తున్నాడు’’ అంటూ చెప్పిన మాటలన్నింటికీ అప్పలనరసమ్మ తలాడిస్తూ వచ్చింది. రాత్రి 8 గంటలు కావస్తోంది. ‘‘అమ్మా మా లచ్చిమీ ఆకలి సంపేస్తుందమ్మా.. సచ్చి నీ కడుపున పుడతాను బుక్కెడు గంజి వెయ్యమ్మా...’’ కేకలేసేడు జగన్నాథం. రాత్రి ఏడు గంటల వరకూ కూలిపనిలో ఉండి ఇంటికొచ్చిన సాయిలక్ష్మి ఇంటిపని, వంటపనిలో బిజీ అయిపోయింది. అప్పుడే అన్నం ఎసరు పోసింది. పొయిలో కర్రలు కూడా తడిసి ఉన్నాయి. పొయిలోనుంచి పొగ తప్ప సరిగా మంట రావడం లేదు. ముసలోడి అరుపులు చూసి ఆమెలో గాబర పెరిగిపోయింది. ‘‘తెత్తానుండు మామయ్యా..’’ అంటూనే, చిరాగ్గా ‘‘ఇప్పుడు పుట్టింది చాలదా? ఇప్పుడు అనుభవించిన దరిద్రం చాలు నాయనా. మళ్లీ మళ్లీ ఇదే చాకిరీ చెయ్యాలా..’’ అంటూ గొణుక్కో సాగింది. ఒకరోజు ఉన్నట్టుండి సాయిలక్ష్మి కన్నవారింటికి వెళ్లాల్సి రావడంతో నాగభూషణం, సాయిలక్ష్మి కుటుంబ సమేతంగా బయల్దేరారు. చెరో నెల చొప్పున ఇద్దరి కొడుకుల వద్ద ఉంచాలనుకున్నారే తప్ప ఇలా ఊరెళ్లినప్పుడు ముసలోణ్ని ఎవరి దగ్గర ఉంచాలనే విషయం మాట్లాడుకోలేదు. ఒప్పందంలో లేకపోయినా మధ్యంతరంగా వండిపెట్టే బాధ్యతను చిన్నకోడలు కామేశ్వరి కాదనలేకపోయింది. జగన్నాథానికి టైముకి భోజనం తెచ్చి వడ్డించేది. దీంతో కామేశ్వరి జగన్నాథం దగ్గర నసగడం ప్రారంభించింది. ‘‘ఆలు ఊరెల్లి నేటికి పది రోజులైపోయింది. నాకు ఏమైనా పని లేదా..? ఈ పది రోజులూ పనికెళ్లలేదు. నేను కూలికి పోతే నీకు మధ్యాహ్నం గెంజిపోసినోలు ఉండరు. నిన్ను వదిలీలేను. పనినీ వదల్లేను. ఏటో మా బతుకులు’’ అంటూ నిట్టూర్చసాగింది. ఆరోజు రాత్రి ఎప్పటిలాగానే అన్నం తీసుకొని వచ్చిన కామేశ్వరికి జగన్నాథం కన్పించలేదు. ఏమయ్యాడో అర్థం కాలేదు. ఊళ్లో ఆ చివరా, ఈ చివరా ఆరా తీసింది. అందరి ఇళ్లకూ వెళ్లి అడగసాగింది. జాడ కానరాలేదు. సాయంత్రం ఏడు గంటలు అవుతోంది. పొరుగూరు నుంచి సాయిలక్ష్మి తండ్రి సన్యాసినాయుడు వచ్చేడు. ఆయన మొహంలో అంతకుముందెప్పుడూ అంత కోపాన్ని చూడలేదు. ‘‘అమ్మా, అన్నయ్య ఎలా ఉన్నారు నాన్నా?’’ సాయిలక్ష్మి పలకరింపునకు ఏం బదులివ్వలేదు. ‘‘రాంబాబుని ఒకసారి రమ్మని చెప్పమ్మా’’ ఆదేశించేడు సన్యాసినాయుడు. ఇంతలో రాంబాబు అక్కడకు చేరుకున్నాడు. ‘‘మీ తండ్రిని పెంచలేకపోతున్నారా..! బొబ్బిలి రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకొని బతుకుతున్నాడట. కన్పించిన వాళ్లంతా ‘మీ వీరకాడు అడుక్కొంటున్నాడు’ అంటుంటే తల తీసేసినట్లు అయిపోతోంది. కన్న తండ్రినే పెంచుకోలేని దద్దమ్మలేట్రా మీరు? ఒక పూట తినీ, తినకుండా మిమ్మల్ని ఇంతటోల్ని చేసిన మీయయ్యకు చివరి రోజుల్లో గొప్ప ఆనందాన్ని మిగుల్చుతున్నార్రా..! మీకూ మీ కొడుకులున్నారు గదరా.. మీరూ ముసలోలవుతారు. కొద్దిగా భూమీ ఆకాశం సూడండ్రా.. మరీ ఇంత మూర్ఖంగా ఉండకూడదురా..’’ మందలించేడు. ‘‘అవును మామ.. మేం మూర్ఖులమే. చదువుకోని మూర్ఖులం. నిండా ముంచినా యవసాయాన్నే నమ్ముకున్న మూర్ఖులం. ఆరుగాలం పండిన పంట వరదల్లో కొట్టుకుపోయింది. చేతికి చిల్లిగవ్వ కూడా రాలేదు. పైగా అంతవరకూ పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. పురుగుమందులు, ఎరువులు, విత్తనాల కొనుగోలుకు అప్పులిచ్చిన వారి అప్పు తీర్చేందుకు కూలినే నమ్ముకుంటున్న మూర్ఖులం. పిల్లల కాన్వెంటు ఫీజులు చెల్లించలేక అక్కడ మాన్పించేసి, ఇంటిదగ్గర కూడా సరైన తిండిపెట్టలేక గవర్మెంటు హాస్టళ్లో చేర్పించేసిన మూర్ఖులం. ఇంత జరిగినా ఊరుని, యవసాయాన్ని వదిలి వలస పోలేని మూర్ఖులం. అప్పులోళ్ల బాధలు భరించలేక చావకుండా బతుకుతున్న మూర్ఖులం..’’ అంటూ బోరున విలపించేడు రాంబాబు. వారి బాధను విన్న సన్యాసినాయుడు వెంటనే అక్కడ నుంచి బయల్దేరి జగన్నాథం వద్దకెళ్లాడు. తనతో పాటు తమ ఇంటికి రావాలని బతిమలాడేడు. ‘‘నా కొడుకుల బతుకు తెరువుకోసం ఎకరో, రెండెకరాలో భూమి ఇస్తే చాలు వాళ్ల రెక్కల కష్టంతో బతికేస్తారనుకున్నాను. వారి రెక్కలనే విరిచేస్తున్నాననుకోనేదు. పంట చేతికి రానేదు. పీకల్లోతు అప్పుల్లో ములిగిపోనారు. ఆలు రైతు బిడ్డలు కదా...! చావనైనా సత్తారు.. గాని నమ్మినోళ్లకు మోసం సెయ్యరు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఇచ్చిన వారి అప్పులు తీర్సడానికి కూలిపనులకెల్తన్రు. ఆల పనులకు నేను అడ్డు కాకూడదు. అందుకే నేను వొచ్చీశాను. నాకు ఎవులూ ఇబ్బంది పెట్టనేదు. నేనే ఇబ్బందిగా మారగూడదనే వొచ్చీశాను. ఏం పర్వానేదు బావ. నాకు చేతకాక, బతకనేక మీ ఇంటికొచ్చీశానని నలుగురి దగ్గరా అపవాదు నాకొద్దు. ఇన్నాళ్లూ ఎలాగో బతికాను. ఈ చివరి రోజులు ఎలాగో ఒకనాగ గడిపేత్తను.’’ అంటూ ఇంతలో వచ్చిన పూరీ, తిరుపతి ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన ప్రయాణికుల వద్దకెళ్లి అడుక్కోవడం ప్రారంభించేడు జగన్నాథం. ఏం చెయ్యాలో తెలీక నిస్సహాయంగా వెనుదిరిగేడు సన్యాసినాయుడు. - గుల్ల తిరుపతిరావు -
‘వదులుకున్న’ దానికోసమే అడ్డదారి!
-
‘వదులుకున్న’ దానికోసమే అడ్డదారి!
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ కావాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌తో అడ్డదారి తొక్కిన ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం జీవితంలో సినిమాటిక్ అంశాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి 2015 సివిల్ సర్వీసెస్‌లో కరీం ఐఏఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్న ర్యాంకు సాధించినా.. వద్దనుకుని ఐపీఎస్‌కు వచ్చారు. దీనికి ఓ సినిమాలో పాత్ర ఆయనకు స్ఫూర్తి కలిగించినట్లు పోలీసులు చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ తర్వాత పోలీసు ఉద్యోగం వద్దనుకుని ఐఏఎస్ అధికారి కావాలని భావించారు. దీనికోసం పాల్పడిన హైటెక్ కాపీయింగ్‌కూ మరో చిత్రంలో సన్నివేశమే స్ఫూర్తి అని గుర్తించినట్లు చెన్నై పోలీసులు చెప్తున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న చెన్నై పోలీసు విభాగానికి చెందిన డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని బృందం లా ఎక్స్‌లెన్సీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌తో పాటు దీని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రాంబాబు ఇంట్లోనూ సోదాలు చేసింది. సాయంత్రానికి కరీం భార్య జోయ్సీ జోయ్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి విమానంలో చెన్నైకి తరలించింది. రాంబాబును సైతం తమ వెంట తీసుకువెళ్లిన చెన్నై పోలీసులు.. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా అతని అరెస్టుపై నిర్ణయం తీసుకుం టామన్నారు. ప్రమాదం తర్వాత మారిన లక్ష్యం తన కోచింగ్ సెంటర్లో ఎకనమిక్స్ ఫ్యాకల్టీగా పని చేసిన జోయ్సీ జోయ్‌ను కరీం వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కరీం.. ఫిట్నెస్ సమస్య కారణంగా తాను పోలీసు అధికారిగా పనికిరానని భావించినట్లు, అందుకే ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కావాలని నిర్ణయించుకున్నట్లు అతడి స్నేహితులు చెన్నై పోలీసులకు తెలిపారు. తాజాగా అనుసరించిన హైటెక్ కాపీయింగ్‌కు కూడా ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది. ‘మున్నాభాయ్ ఎంబీబీ ఎస్’ చిత్రం తమిళ వెర్షన్ ‘వసూల్ రాజా ఎంబీబీఎస్’ సినిమాలో చూపిన సీన్ మాదిరిగానే తన భార్య, రాంబాబుతో కలసి కాపీయింగ్‌కు ప్లాన్ చేశాడని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లోని లా ఎక్స్‌లెన్సీ ఐఏఎస్ ట్రైనింగ్ అకాడెమీకి జోయ్సీ విజి టింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యం లో ఆమెను హైదరాబాద్ పంపిన కరీం.. రాంబాబుతో కలసి తన హైటెక్ కాపీయింగ్‌కు సహక రించేలా చూశారు. కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సమాచారం తో సోమవారం కరీంను చెన్నైలో పట్టుకున్న అక్కడి పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న జోయ్సీ, రాంబాబు లకు సంబంధించిన సమా చారం ఇక్కడి పోలీసులకు అందించారు. దీంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ‘లా ఎక్స్‌లెన్సీ’లో సోదాలు.. మంగళవారం నగరానికి వచ్చిన చెన్నై పోలీసు విభాగం డీసీపీ అరవిందన్ నేతృత్వంలోని బృందం కరీం భార్య జోయ్‌సీని అరెస్టు చేసింది. అశోక్‌నగర్ చౌరస్తాలో ఉన్న లా ఎక్స్‌లెన్సీ కార్యాలయంతో పాటు దాని ఎండీ రాంబాబు ఇంట్లోనూ సోదాలు చేసింది. హైటెక్ కాపీయింగ్‌కు వినియోగించిన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుంది. జోయ్‌సీని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై చెన్నైకు తీసుకువెళ్లారు. ఈమెను బుధవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తామని ప్రత్యేక బృందం అధికారి తెలిపారు. ఐపీఎస్ తొలగింపు? న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి సఫీర్ కరీంను సర్వీసు నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అతను సరైన వివరణ ఇవ్వకుంటే వేటు తప్పదని హోం మంత్రిత్వ శాఖ ఓ అధికారి హెచ్చరించారు. పరీక్ష సమయం లో ఆయన ప్రవర్తన గురించి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ‘అలాంటి వ్యక్తికి ఐపీఎస్ లాంటి సర్వీసులో ఉండే అర్హత లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగా నే ఆయనపై చర్యలను ప్రారంభిస్తాం. తన వాదనలు వినిపించేందుకు ఆయనకో అవకాశమిస్తాం’ అని ఆ అధికారి వెల్లడించారు. ఐపీఎస్‌కు ‘కమిషనర్’ స్ఫూర్తి కేరళలోని అలూవ ప్రాంతానికి చెందిన కరీం త్రిసూర్‌లోని మెట్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశాడు. అప్పట్లో క్యాట్ పరీక్ష కూడా రాసిన కరీం అందులో టాపర్‌గా నిలిచాడు. 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘కమిషనర్’లోని పాత్రతో స్ఫూర్తి పొందిన కరీం ఐపీఎస్ అధికారి కావాలని నిర్ణయించుకున్నాడు. 2014లో అశోక్‌నగర్‌లో లా ఎక్స్‌లెన్సీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న రాంబాబుతో కలసి తిరువనంతపురంలో కరీమ్స్ లా ఎక్స్‌లెన్సీ పేరుతో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అందులో తాను కోచింగ్ తీసుకుంటూనే మరికొందరు అభ్యర్థులకూ తర్ఫీదు ఇచ్చాడు. ఆ ఏడాది తన వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులతో కలిసే సివిల్స్ రాసిన కరీం.. తన విద్యార్థులైన 20 మందితో కలసి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఆరు మార్కుల తేడాతో మౌఖిక పరీక్షకు అర్హత సాధించలేకపోయాడు. 2015లో మరోసారి సివిల్స్ రాసిన కరీంకు జాతీయ స్థాయిలో 112వ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకుతో ఐఏఎస్ అయ్యే అవకాశం ఉన్నా.. ‘కమిషనర్’ స్ఫూర్తితో తన తొలి ప్రాధాన్యం ఐపీఎస్కే ఇచ్చి పోలీసు అధికారిగా మారాడు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న నంగునేరి సబ్–డివిజన్‌కు ఏఎస్పీగా పని చేస్తున్నాడు. -
నవ్వుల పంచంగం
పుట్టిన తిథీ వేళా విశేషం, ప్రదేశం, నక్షత్రం... ఇవేవీ తెలియకున్నా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడం అంటే అందరికీ ఆసక్తి. అందుకే ప్రతి ఒక్కరూ రాశిఫలాలు చూస్తుంటారు. అసలు రాశిఫలాలు ఎలా ఉన్నా... ఈ రోజు సంతోషంగా ఉంటే... అదే వరసలో మిగతా రోజులన్నీ ఆనందంగా నడుస్తాయన్న నియమం ప్రకారం మిమ్మల్ని నవ్విస్తూ, ఆనందంగా ఉంచుతూ, సంతోషాలు పంచుతూ ఉంచాలన్న సంకల్పంతోనే ఈ ‘సకల జనుల రాశి ఫలాలు’! ఇవి ఎవరికైనా వర్తిస్తాయి. అందరికీ పనిచేస్తాయి. ఏదో ఒక దశలో ఇవి మీ జీవితంలో నిజమై మిమ్మల్ని అబ్బురపరుస్తాయన్న గ్యారంటీ కూడా ఇస్తున్నాం. సరదాగా చదువుకోండి. నిజమైనప్పుడు థ్రిల్లవ్వుకోండి. ఎవరి మనోభావాలూ కించపరచకుండా కేవలం అందరూ ఆనందంగా చదువుకోవడమే ఈ ప్రయత్నం, ప్రయోగం... తప్పక కలిగిస్తుంది మీకు నవ్వుల యోగం! మేషం : ఈ రాశి చిహ్నం మేకపోతుకు చిరు గడ్డం ఉన్నట్లుగానే లోకంలోని ఉద్యోగ వ్యాపారుల్లో చాలామందిది చిరు ఆదాయమే. అది పెరిగే అవకాశం ఎప్పటికైనా ఉంది. అందరికీ గడ్డం పెరిగే అవకాశం ఉంది కాబట్టి గీసుకునే అవకాశం తప్పక ఉంటుంది. ఆ సమయంలో బ్లేడ్ వాడేటప్పుడు అప్రమత్తత అవసరం. నిర్లక్ష్యం వహిస్తే తెగే అవకాశం ఉంది. చెంపలపై షేవింగ్ క్రీమ్ పూసుకునే సమయంలో పెద్దగా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. అయినా నురుగు ముక్కులోకి, నోట్లోకి పోకుండా చూసుకోవాలి. వృషభం : ఈ రాశి చిహ్నమైన వృషభానికి ఉన్నట్లే చాలా మందికి గంగడోలు ఉంటుంది. అయితే ఇది రాశిచిహ్నం లోని మెడపైన ఉంటే మనుషులకు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటుంది. దాన్ని వాడుకభాషలో పొట్టగా వ్యవహరిస్తారు. పొట్టను గంగడోలుకు ప్రత్యామ్నాయం అనుకొని నిమురుకోవడం అంత మంచిది కాదు. అది దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంది. సామ్యంలో ఒకేలా అనిపించినా గంగడోలు, పొట్ట వేర్వేరు అని గ్రహించాలి. పొట్టను నయానో, భయాన్నో అరగదీయడానికీ, కరగదీయడానికీ ప్రయత్నించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. మిథునం : ఎండలు తీవ్రంగా ఉన్నందున ఈ రాశి చిహ్నంలోని బొమ్మల్లా తమ ఆత్మీయులు దగ్గరైనా ఆలింగనం చేసుకుంటే చెమట పట్టవచ్చు. ఫలితంగా అసౌకర్యం. పాత స్నేహితుల కలయికతో ఇరానీ చాయ్ తాగడానికి కేఫ్‌కు వెళ్తే అక్కడ కొందరు సిగరెట్లు తాగుతూ పొగ« దారాళంగా ఊదుతుంటారు. ‘ఈ నగరానికి ఏమైంది’ యాడ్ పెద్దగా ప్రయోజన మివ్వలేదని తెలుస్తుంది. ఈలోపు ముక్కులోకి పొగ దూరిపోయి దగ్గులు, తుమ్ములు ధారాళంగా వస్తాయి. శ్వాసకోశవ్యాధులకు తగినంత అవకాశం ఉన్నందున సిగరెట్ల షాపు దరిదాపులకు పోరాదు. అయినా అదేపనిగా పోతే ఆస్తినష్టంతో పాటు ఆరోగ్యభంగమూ కలిగే అవకాశం ఉంది. కర్కాటకం : దూరప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఎక్కడికి వెళ్లాలో తెలియనప్పుడు ఈ రాశి పేరుకు దగ్గరగా ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కర్కాటక రాశివారు ప్రయాణం కట్టడంలో తప్పు లేదు. చాలామందికి పరోఠా లేదా రోటీ తినాలనే సంకల్పం నెరవేరదు. అయినా నిరాశ పడాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా బిసిబేలాబాత్ ఉండనే ఉంటుంది. ప్రత్యామ్నాయం అంటేనే ఆశాజనకం అన్నమాట. సింహం : గడ్డం చేసుకున్నా, చేసుకోకపోయినా మనుషులూ, సింహం సేమ్ టు సేమ్ అని నిర్లక్ష్యం వహించరాదు. పేలు పడే ప్రమాదం ఉన్నందున జూలు చిన్నగా కత్తిరించుకోవడమే మంచి ఫలితాన్నిస్తుంది. సింహం లాంటి మనస్తత్వంతో ఎప్పుడూ ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు గత్యంతరం లేక పక్కనే ఉన్న సందులోకి షార్ట్‌కట్‌గా వెళ్లడానికి, మీ వాహనాన్ని ‘కీప్ రైట్’ అంటూ రోడ్డుకు కుడివైపుగా నడుపుతారు. రాంగ్ రూట్లో వెళ్తూ కూడా... తాము కీపు రైటు అనుసరిస్తున్నందున ‘రైట్ వే’లోనే వాహనం నడుపుతున్నందున సంతృప్తి చెందుతారు. కన్య : ఈ ఏడాది కన్య రాశి వారికి కూడా ‘ధన’‘కనక’ ‘వస్తు’ ‘వాహన’ యోగం సమృద్ధిగా ఉంది. అయితే బ్యాంకు నిర్ణయాల కారణంగా ధనాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి వాహనం కొనే అవకాశాలూ కలిసిరావు. ఒకవేళ వాహనం కొనే అవకాశం ఉన్నా... క్షణక్షణానికి మారుతుండే చమురు ధరల వల్ల వాహనం కొన్నా పెద్దగా ఫలితం ఉండదు. డబ్బును ఇతరుల దగ్గర పెట్టి పెట్టుబడులు పెట్టే మదుపరులకూ కలిసి రాదు. డబ్బును ఆదా చేసుకుని కళ్లముందు ఉంచుకోవాలనుకునే పొదుపరులనూ దరిద్రమూ వదిలిపోదు. తుల : ప్యాంటుకు ఇరువైపులా సమానంగా ఉండే జేబుల్లోన ఈ రాశికి చెందిన వారు వస్తువులను కొలచినట్లుగా, ఒక పద్ధతిగా పెట్టుకుంటారు. అయితే ఆసారి కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లడం మరచి పోతారు. అయినా బాధపడరు. అకస్మాత్తుగా నగదు అవసరం పడుతుంది. ఏటీఎంలోకి వెళ్లి జేబు చూసుకుంటే డెబిట్ కార్డు మరచిపోయినట్లుగా గ్రహిస్తారు. అయినప్పటికీ ‘నో క్యాష్’ బోర్డు కనిపించడంతో కార్డు మరచినా స్థిమితపడతారు. వృశ్చికం: మనిషి అన్నాక ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే స్ట్రిక్ట్ మనస్తత్వం మీది. కానీ అప్పుడప్పుడు పక్కనే ఉన్న సందులోకి ప్రవేశించడానికి రూల్స్ ఉల్లంఘిస్తారు. ప్రాతఃకాలంలో పెద్దగా ట్రాఫిక్ లేనప్పుడు, అంత ఎక్కువగా రద్దీ లేనప్పుడు ఇలా ఎవరికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను అతిక్రమించడం అన్నది నేరమో, పొరబాటో కాదని... అది కేవలం సర్దుబాటు అని నిర్వచిస్తారు. మీ వాదనతో చాలామంది ఏకీభవించడం వల్ల వారందరినీ మీరు ప్రభావితం చేయగలుగుతారు. ఎవరూ మీ మాట వినరని ఆత్మన్యూనత పొందే మీకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారని గ్రహించి ఆనందిస్తారు. ధనుస్సు: విద్యార్థులకు స్థానోన్నతులు. ఉద్యోగులకు స్థానభ్రంశాలు. వేసవిలో కొత్త సినిమాల రిలీజ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. అంటే ఆఫీసు సీటులో కంటే సినిమాలో సీటులో ఎక్కువగా కనిపిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు కూడా ఎక్కువే. అనగా కొత్త సినిమాలకు టిక్కెట్ల కోసం కార్పొరేట్ బుకింగ్స్‌లో ఎక్కువ మొత్తాలు చెల్లించి బాల్కనీలో ఉన్నతస్థానాల్లో కూర్చుంటారు. ఇంటర్వెల్లో పాప్‌కార్న్ తింటారు. పాప్‌కార్న్ ధర తెలిసి హాహాకారాలు చేస్తారు. మకరం : ఈ రాశిచిహ్నమైన మొసలి లాగే చాలామందికి ‘పట్టు’దల ఎక్కువ. అందుకే ఎంతకూ తగ్గకూడదనే ఉద్దేశంతో రూ.100 విలువ చేయని టిక్కెట్టును మొదటి ఆటకే చూడాలని రూ. 10,000 లకు కొంటారు. మొసలి అటు నీళ్లూ, ఇటు నేల మీద ఉన్నట్లే... ఈ సినిమా జీవులు వీలును బట్టి అయితే మల్టీప్లెక్సులూ లేకపోతే థియేటర్లలో కనిపిస్తారు. బాక్సాఫీసు క్యూలో సమయం మందకొడిగానూ, సినిమాలో అది వేగంగా నడుస్తుంది. కుంభం : కుండలో మన్ను, కావడిలో కొయ్య... ఇదే జీవితసారమని తత్వం గ్రహిస్తారు. ఈ గ్రహింపును కాగితపు నోటుకూ, డెబిట్ కార్డునకూ అన్వయిస్తారు. పేపర్లో కాగితం ఉన్నా... కార్డులో ప్లాస్టిక్ ఉన్నా అంతా డబ్బే అని గ్రహిస్తారు. పొడవు పొడవు ఏటీఎం క్యూలలో నిలబడి, తోసుకొని బోర్లాపడి పళ్లూడగొట్టుకోవడం కంటే, చేతిలో ఉన్న కార్డును ఉపయోగించి నిలబడి కుంభం నీళ్లు తాగినంతతేలిగ్గా డబ్బూడగొట్టుకోవడం మేలని తెలుసుకుంటారు. మీనం : ఇటీవలి పరిణామాల తర్వాత మనుషులంతా కొద్దిపాటి నీళ్లలో సర్దుకున్న చేపల్లా తమ బతుకు తాము బతుకుతున్నారు. ఈ చేపలకు సేవలందించాలనే సత్పురుషులు కొందరు... ‘‘కస్టమర్ల మరింత సమర్థ సేవ కోసం బ్యాంకు సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేశామనీ, తమ వివరాలన్నీ వివరంగా చెబితే డబ్బులు ఇంటికే అందించి, ఖాతాదారుల నిద్రకు సైతం అంతరాయం కూడా కలిగించకుండా బెడ్డు మీదే డబ్బులు రాశిగా పోసి వెళ్తామని నమ్మించే ఆషాఢభూతులు పెరిగారు. ఖర్మగాలి నమ్మితే... మిమ్మల్ని తమ మొబైల్షేపు గేలాలకు వేలాడేసుకొని కోసుకొని కూరొండుకు తినేస్తారు జాగ్రత్త. – రాంబాబు -
స్వెటర్... బెటర్!
‘‘ఎలాగూ కాసిన్ని రోజుల్లో చలికాలం వెళ్లిపోబోతోంది. పెద్ద పెద్ద వాళ్లకు ట్విట్టరు కామెంట్ పెట్టడం అన్నది ఎలాగైతే స్టేటస్‌కు సంబంధించిన అంశమో.... మనలాంటి మధ్యతరగతి వాళ్లకు సై్టలుకొట్టే స్టేటస్‌ను ప్రసాదిస్తుందిరా స్వెట్టర్! కానీ ఆ భోగం, వైభోగం ఇంకా కొద్ది రోజులే కదా’’ అంటూ ఏదో తాత్విక ధోరణిలో మాట్లాడుతూ, బాధపడుతూ ఉండగా మా రాంబాబు గాడిని కలిశాను నేను. ‘‘ఏమైంద్రా అంత బాధగా ఉన్నావ్?’’ అడిగా. ‘‘కొన్ని డ్యామేజీల నుంచి సైలెంటుగా పరువును కాపాడే అతి గొప్ప వస్త్రవిశేషమైన స్వెట్టరుకు ఇవే నా జేజేలు’’ అంటూ కాస్త ఆవేశపడ్డాడు రాంబాబు. ‘‘స్వెట్టరు వేసుకునేది గడగడ వణికించే చలిలో కాస్త వేడిగా. కంఫర్ట్‌గా ఉండటం కోసం. అంతే. దాంతో దక్కే పరువేమిట్రా బాబూ కొత్తగా?’’ అడిగా. ‘‘నీకు తెలియదు ఉరుకో. స్వెటర్ పరువు కాపాడే తీరే వేరురా. నాకు కొన్ని షర్ట్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్నింటికి చంకలో కాస్త కుట్లు ఊడిపోయి ఉండటమో, మధ్య బటన్ ఊడితగలడటమో వంటి అనర్థాలు జరిగి కొంత కొంత లోపాలుండటంతో తక్షణం తొడగలేని చొక్కాలవి. అయితే ఆ చొక్కల బొక్కలను కప్పేస్తూ ఎలాగూ మన స్వెట్టరు తొడిగేస్తాం కాబట్టి మన స్వెటర్ చలి నుంచి రక్షించడం అన్న ప్రాథమిక బాధ్యతను మాత్రమే గాక... పరువు పోకుండానూ అనుబంధ బాధ్యతలనూ నిర్వహిస్తుంటుంది. అంతటి సౌకర్యం ఉన్న ఆ స్వెట్టరును నాల్రోజుల్లో మూలకు పడేయాల్సి వస్తోంది కదా అని కాస్త విచారంగా ఉంది. నిజానికి దాన్ని మడతేసి వచ్చే ఏడాది దాకా బీరువాలో పెడుతున్నందుకు కాదు బాధ. అది లేనందువల్ల మరో నాలుగు షర్ట్లు.... రిపేరు చేయించే వరకూ అందుబాటులో ఉండవు కదా అన్నదే రా నా దిగులు’’ అన్నాడు రాంబాబు ‘‘పోన్లే ఆ త్వరగా ఆ నాలుగు షర్టులూ రిపేరు చేయించుకో. ఎప్పటికైనా తప్పదు కదా’’ అంటూ ఓదార్చబోయాన్నేనను. ‘‘నో... నో... ఎలాగూ ఆ తర్వాత కూడ మన కల్చరల్ ఎలిమెంటు అయిన ఆ మహనీయ స్వెటర్‌ను అలాగే కంటిన్యూ చేద్దామని నా ఉద్దేశం’’ అన్నాడు వాడు. ‘‘అది మన కల్చరల్ ఎలిమెంటా?’’ఆశ్చర్యంగా అడిగా. ‘‘అవును రా... స్వెటర్ మన సంప్రదాయ వస్త్ర విశేషం. సాంస్కృతిక చిహ్నం’’ ఏమాత్రం తొణక్కుండా జవాబిచ్చాడు. ‘‘అదెలా? స్వెటర్ అన్నది విదేశీయుల వస్త్రవిశేషం కదా’’ ‘‘అప్పుడెప్పుడో పూర్వకాలం నుంచి గొంగడి కప్పుకోవడం అన్నది మన సంస్కృతిలో భాగం. పశువులను కాయడానికి వెళ్లేవాళ్లూ, పొలానికి కాపలా పడుకునేవారూ గొంగడిని వాడటం నీకు తెలియదా? మరప్పుడు అది మన సాంస్కృతిక, సాంప్రదాయక వస్త్రవిశేషం కాకుండా ఎలా ఉంటుంది’’ ‘‘గొంగడి మాట నేను మాట్లాడటం లేదు. నువ్వు స్వెటర్‌ను మన సంప్రదాయ వస్త్రం అంటున్నావు కదా. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు’’ ‘‘పిచ్చివాడా... స్వెటర్ అంటే ఏమనుకుంటున్నావు. గొంగడి తాను తీసుకొని చొక్కా రూపంలో కుట్టిస్తే అది స్వెటర్ అయినట్టే కదా! నీకో సత్యం చెబుతా విను. కుట్టిస్తే స్వెటర్... వదిలేస్తే గొంగళి... కావాలనుకుంటే ఇప్పట్నుంచి గద్దర్‌గారు గొంగళికి ప్రత్యామ్నాయంగా స్వెటర్ వాడొచ్చు. అంతగా తొడుక్కోవడం ఇష్టం లేదనుకో. హ్యాపీగా భుజం మీద వేసుకోవచ్చు. అప్పుడది అచ్చం గొంగళిలాగే కనిపిస్తుంది. కాకపోతే బ్లాక్ కలర్ గొంగళి క్లాత్‌తో కుట్టిస్తే మేలు. నాకు ఇంకో ఆలోచన కూడా వచ్చింది రా. అదే జరిగి ఉంటే అసలు కురుక్షేత్ర మహాభారత యుద్ధమే జరిగి ఉండేదికాదు’’‘‘ఏమిట్రా... ఇతిహాసాన్నే నివారించేంత అంత గొప్ప ఐడియా?’’ అంతులేని ఆశ్చర్యంతో అడిగా. ‘‘ఏం లేదురా.... ఒరేయ్... అలనాటి వస్త్రాపహరణం టైమ్‌లో ద్రౌపది గనక స్వెటర్ తొడుక్కొని ఉండి ఉన్నట్లయితే, లాగడానికి కొంగూ ఉండదు. గుంజడానికి చెంగూ దొరకదు. దాంతో దుశ్శాసనుడు అసలు వస్త్రాపహరణమే చేయలేకపోయేవాడు. దాంతో పాండవులకు అవమానమూ, మనకు మహాభారత యుద్ధమూ తప్పేవి. పైగా ఇన్సిడెంటు జరిగింది ఢిల్లీలోనే కాబట్టి అక్కడ కూలింగ్ ఎక్కువగానే ఉండేది కదా. ద్రౌపదికి అటు చలీ తప్పేది... ఇటు పాండవులకు అవమానమూ తప్పేది. దాంతో యుద్ధమూ తప్పేది’’ చెప్పాడు రాంబాబు. ‘‘ఒరేయ్... ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని విన్నాను... గానీ నీ ఐడియా యుద్ధాన్నే తప్పించేదని ఇప్పుడే నాకు తెలిసింది రా. కానీ ఇలా తప్పుడు ఇమేజినేషన్స్ చేస్తుంటే నీ ఇమేజి దెబ్బతింటుంది చూడు’’ అంటూ హెచ్చరించాడు వాణ్ణి. – యాసీన్ -
మిణుగురు రాంబాబు!
‘‘మా ఫ్రెండ్ ఒకడు బాగా కొడుతుంటాడు రా..?’’ సెస్పెన్స్ మెయింటెయిన్ చేయడానికి నాందిగా మా రాంబాబుగాడు ఈ స్టైలు వాక్య నిర్మాణం చేస్తుంటాడు. అందుకే వాడి ధోరణి పట్ల నాకు మండింది. వాడికీ కాస్త నా మంట అంటేలా చేద్దామని నా ఉద్దేశం. అందుకే వాడికి ఘాటుగా బదులిస్తున్నట్టు... ‘‘ఏంటి పోజులు కొట్టడమా? స్టైలు కొట్టడమా? మాంసం కొట్టడమా లేక కంప్యూటర్ మీద టైప్ కొట్టడమా?. స్పెసిఫిక్‌గా ఇదీ అని చెప్పాలిరా’’ అన్నాను. ‘‘ఎక్కడున్నావురా బాబు నువ్వు... ఇవన్నీ ఎప్పుడో పాతబడిపోయాయి. సిక్స్ కొట్టడం కూడా సచిన్ నాటికే పాతబడిపోయింది. వాడు ఫేస్బుక్లో ‘లైక్’లు కొడుతుంటాడు. అదీ ఇప్పటి ట్రెండ్’’ అన్నాడు వాడు నా అంచనాలకు అందకుండా. ‘‘అవున్లే... చాలా మంది తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్లు ఫేస్‌బుక్‌ను ముఖ పుస్తకం అంటుంటారు. అవునట. అస్తమానం ఆ పుస్తకంలో గడపటం కూడా ఒక వేలం వెర్రిరా...’’ అంటూ ఉండగానే... ‘‘నో... నో... దాన్ని ముఖపుస్తకం అనడమూ తప్పే. దాంట్లో గడపటం వేలం వెర్రీ అనుకోవడమూ తప్పే’’ అంటూ నా మాటలకు అడ్డొచ్చాడు రాంబాబుగాడు. ‘‘మరి ఒప్పు ఏమిట్రా’’ అడిగా. ‘‘దాన్ని కేవలం ముఖ పుస్తకం అనకూడదు రా. ముఖ గ్రంథం అనాలి. అయినా అది పుస్తకం లెవెల్‌కు చాలా ఎక్కువ. గ్రంథం అనడం కూడా సరైనది కాదనుకో. అదొక ఉద్గ్రంథం. ఒక వాంగ్మయం. ఒక కావ్యం... ఒక ఇతిహా...’’ అంటూ వాడు తన్మయంగా అనబోతుంటే... ‘‘ఒరేయ్... మరీ అంతగా పొగడకు. దాంతో టైమ్ వేస్ట్ తప్ప మరే ఉపయోగమూ లేదు’’ అంటూ నేను రెట్టించబోతుండగా మళ్లీ నా మాటలకు అడ్డొచ్చాడు. ‘‘చూడు గురూ... ఎదురుగా ఉంటే నేను మాట్లాడబోతుంటే ఎందుకో అందరూ తప్పుకు తిరుగుతుంటారు. కానీ ఫేస్బుక్... అదే ముఖ పుస్తకంలో ముఖం చాటేయడానికి అవకాశమే లేదు. పైగా ఫేస్బుక్లో నా ముఖం చూడకుండా నా గురించి తెలియకుండా ఉన్నవాడెవడైనా నన్నే లైక్ చేస్తారు. ఎందుకంటే విచ్చలవిడిగా, ఎలాంటి అరమరికలు లేకుండా నేను ధారాళంగా లైక్‌లు కొడుతుంటా కాబట్టి...’’ అంటూ చెప్పబోతుంటే ‘‘అసలు అలా లైక్‌లు కొట్టడంలో ఏదైనా అర్థం ఉంది. నిజంగా బాగుంటే కొట్టాలిగానీ... కానీ నువ్వు కొట్టే లైక్‌ల ఆధారంగానే నీ గురించి తెలియని వాళ్లు నిన్ను నువ్వు వాళ్ల అభిమానాన్ని అనుమానించాలి’’ అన్నాను. ‘‘ఫేస్బుక్లో ఉన్నవాళ్లకు అవన్నీ ఎందుకు రా. నేను వాళ్లవి లైక్ చేస్తాను. కాబట్టి వాళ్లూ ఇతోధికంగా... బార్టర్ సిస్టమ్‌లో లాగా నన్నూ లైక్ చేస్తుంటారు. ఇంకో విషయం చెప్పనా?’’ ‘‘చెప్పు’’ ‘‘అసలు నువ్వు ఎప్పుడైనా నా పుట్టినరోజు గుర్తుపెట్టుకున్నావా? అంతెందుకు నీ సొంతపెళ్లాం పుట్టినరోజైనా గుర్తుండదు కదరా నీకు. కానీ ఫేస్ బుక్ ప్రతిరోజూ ఎవడెవడి పుట్టిన రోజునో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నాకు గుర్తు చేస్తుంది. దాంతో వాళ్లు నాకు తెలిసిన వాళ్లూ... తెలియని వాళ్లనే తేడా లేకుండా అందరికీ నేను విషెస్ చెబుతా. దాంతో అందరూ నన్నే ఎక్కువ లైక్ చేస్తుంటారు రా. అందుకే నేను నీ కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ అని ఘంటాపథంగా చెప్పగలను. నేనొక స్వేచ్ఛా సైబర్ లైకరిని రా. పైగా నేను త్రికరణశుద్ధిగా ఫేస్‌బుక్‌ను ఫాలో అవుతుంటాను’’ అంటూ ఇంకా గొప్పలు చెప్పుకోబోతుండగా అడ్డుతగిలాను నేను. ‘‘ఒరేయ్... అసలు నీకు త్రికరణశుద్ధి అంటే అర్థం తెలుసా?’’ అడిగా. ‘‘ఓ... కానీ నువ్వు అనుకుంటున్న మనస్సు, వాక్కు, కర్మ మాత్రమే కాదు... ఫేస్బుక్ త్రికరణాలు వేరే ఉన్నాయి. మనస్సుకు నచ్చినదాన్ని లైక్ కొట్టడం త్రికరణాలలో మొదటిది, మనసుకు హత్తుకున్న దాన్ని గురించి మాట్లాడటం అనగా కామెంట్ చేయడం రెండోది. ఇక మూడోదీ, అతి ఉన్నతమైనదీ, గొప్పదీ అయిన కర్మ... షేర్ చేయడం. అనగా ఈ మూడింటినీ ఆచరించడమే రా ఫేస్బుక్ త్రికరణాలూ. ఇవే ఫేస్‌బుక్‌లోని నువ్వు పెట్టిన ఫొటో లేదా పోస్ట్ లేదా కామెంట్ కింది ఉండేవి. చూశావా నీకూ నాకూ తేడా. నువ్వు ఫేస్‌బుక్‌ను యాంత్రికంగా చూస్తావు. కానీ నేను దాన్ని ఒక సత్కర్మలా ఆచరిస్తాను. ఒక వేదాంత ధోరణితో అవలోకిస్తాను. ఇప్పుడు చెప్పు... నేనొక బుక్కర్షినా కాదా’’ అడిగాడు. ‘‘బుక్కర్షి ఏమిట్రా’’ అయోమయంగా అడిగా. ‘‘ఫేస్‌బుక్‌లోనే ఉంటాను కాబట్టి మహర్షి, రాజర్షి టైప్‌లో మొట్టమొదటిసారిగా ఒక పదాన్ని సృష్టిస్తూ బుక్కర్షి అని నన్ను నేను డిక్లేర్ చేసుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘బుక్కర్షి కాదు గానీ... పుస్తకపు పురుగువు రా నువ్వు’’ అన్నాను నేను వాడిని పురుగులాగే చూస్తూ. ‘‘ఓకే నువ్వనుకున్నదే ఖాయం. కానీ ఫేస్బుక్జ్ఞానంతో వెలిగిపోయే స్వయంప్రకాశం ఉన్న ‘మిణుగురు’పురుగునే రా నేనూ’’ అంటూ మళ్లీ కంప్యూటర్లోని ఫేస్బుక్లో ఫేస్ దాచుకున్నాడు వాడు. - యాసీన్ -
ఆర్బీఐ వాస్తవాలు చెప్పాలి: ఏపీటీబీఈఎఫ్
హైదరాబాద్: నోట్ల కష్టాలు ఇప్పట్లో తొలగే అవకాశాలు లేవని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏపీటీబీఈఎఫ్) తెలిపింది. పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) అవలంభిస్తోన్న విధానాలు తప్పుల తడకగా ఉన్నాయని మండి పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 నెలల పాటు జీతాల చెల్లింపు కష్టమేనని ఏపీటీబీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి రాంబాబు అన్నారు. దేశంలోని ముద్రణాలయాలు పూర్తిస్థాయిలో పనిచేసిన నోట్ల కొరత తీరదని తెలిపారు. అరకొరగా ప్రకటిస్తున్న చర్యలు సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడం లేదని చెప్పారు. నగదు కొరత కారణంగా బ్యాంకు ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయని వాపోయారు. ఆర్బీఐ ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 500 నోట్లు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. 15 రోజుల నుంచి నగదు సరఫరా చేస్తుందని వేచి చూసినా ఫలితం లేకపోవడంతో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని రాంబాబు చెప్పారు. పాత నోట్ల మార్పిడిలో అవకతవకలకు పాల్పడుతున్న ప్రైవేటు బ్యాంకులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
ఆర్బీఐ వాస్తవాలు చెప్పాలి: ఏపీటీబీఈఎఫ్
-
తలకాయపై వాట్ ఏ కాయ...!
రాంబాబు గాడికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంటే కాస్త విముఖత. అవి వచ్చి చిన్న చిన్న కిరాణాషాపులను దెబ్బ కొట్టాయని వాడి నమ్మకం. వాడు ఒక షాపింగ్ మాల్ బయట నిలబడి ఉన్నప్పుడు అటుగా వెళ్తూ వాడిని పలకరించా. అలా షాపింగ్ మాల్‌ను తేరిపార చూస్తూ ఉన్నాడు వాడు. ‘‘ఎందుకు రా అలా నిరసనగా చూస్తున్నావ్. అన్నీ ఒకచోటే దొరికేలా చేస్తున్నారు ఈ షాపింగ్మాల్స్వాళ్లు. అలా అందర్నీ ఆకర్షిస్తున్నారు. వారి వ్యాపార సూత్రం వారిది. ఎందుకలా కోపంగా చూస్తున్నావ్’’ అడిగా. ‘‘నేను కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తోందా? అయితే నిన్ను నువ్వు సరిచేసుకో. మొదటిసారి నేను కాస్త వాటిపట్ల ఆరాధనగా చూస్తున్నాను’’ అన్నాడు వాడు. ‘‘ఆరాధనా? ఎందుకలా?’’ బోల్డంత ఆశ్చర్యంగా అడిగా. ‘‘ఒరేయ్... చిన్నప్పుడు నేను వాడిన కుంకుడుకాయలు అక్కడ కనిపించాయి రా. ఇప్పుడంటే షాంపులు షాపింగ్ మాల్స్‌లా వచ్చి కుంకుడు కాయల్లాంటి కిరాణాషాపులను మింగేశాయ్. కానీ ఒకప్పుడు కుండుడు కాయే నా వినోద సాధనం కదరా’’ అన్నాడు వాడు. ‘‘కుంకుళ్లు తలస్నానానికి వాడేవాళ్లం. వినోదం ఏమిటి?’’ బిత్తరపోయి అడిగా. ‘‘నువ్వు చేశావో లేదాగానీ... కుంకుడుగాయ కాస్త పచ్చిగా ఉండగానే మేం తెంపేవాళ్లం. దానిలోకి పిన్నీసు తోకను రివర్స్‌లో గుచ్చి బయటకు తీసి ఊదితే... సబ్బు బుడగల్లా... బుడగలు బుడగలు వచ్చేవి. అలా మా పచ్చిగా ఉన్నప్పుడు అదే మా వినోదం. అంతెందుకు పండి ఎండాక కూడా దాంతోనే ఆడుకుంటూ టైమ్‌పాస్ చేసేవాళ్లం’’ అన్నాడు. ‘‘హెడ్బాత్కు కుంకుళ్లు వాడతారు. అంటే... ఆటకు కుంకుళ్లు ఏమిట్రా నీకు హెడ్‌స్ట్రాంగ్ కాకపోతే’’ అన్నాను. ‘‘నువ్వు హెడ్‌తో ఆలోచిస్తున్నావు. నేను మనసుతో ఆలోచించి చెబుతున్నాను. అప్పట్లో కుంకుడుకాయలు కొట్టడానికి ఒక గుండ్రటి రాయిని ఉంచుకునేవాళ్లం. అదెంత గుండ్రంగా ఉంటే మనకు అంత స్పెషల్. ఆ రాయితో కుంకుడును చితక్కొట్టడంలోనూ ఒక నేర్పును అలవరచుకునేవాళ్లం. లోపల ఉండే కుంకుడు గింజ మాత్రం చితికిపోకుండా... కేవలం పైనున్న తొక్క మాత్రమే నలిగేలా కొట్టడం ఒక ఆర్టు. అలా చిన్నప్పుడు కళాత్మకంగా కొట్టడాన్ని అలవరిచేదేరా కుంకుడు. అందుకే అది ఆర్టు కూడా నేర్పుతుందని నా ఉద్దేశం. అలా ఆర్టిస్టిగ్గా, నేర్పుగా కొట్టిన కుంకుళ్ల నుంచి తీసిన గింజలతో ఆడుకునేవాళ్లం. పైగా నాకు కుంకుడుగింజ అంటే ఒక సినిమా హీరో పట్ల ఉండేంత వర్షిప్ కూడా ఉంది’’ అన్నాడు రాంబాబుగాడు. ‘‘ఓహో... సినీహీరోలంటే నీకు చేదు కదా అందుకే కుంకుడు గింజలతో పోలుస్తున్నావన్నమాట’’ అన్నాన్నేను. ‘‘చేదు కోసం కాదురా... సినిమా మొదట్లో హీరోయిన్లను హీరోలు టీజ్ చేస్తుంటారే. అచ్చం అలాగే కుంకుడు గింజ కూడా చేస్తుంటుంది’’ ‘‘అదెలా?’’ ‘‘నీకు గుర్తుందా. కుంకుడు గింజను బాగా రుద్దీ రుద్దీ టక్కున ఎవరికైనా అంటించామనుకో. వారికి చర్మం చరుక్కుమనేలా కాలేది. అచ్చం హీరో టీజింగ్లాగే. అందుకే నాకు కుంకుడు గింజ అంటే హీరో లాగే. పైగా హీరోలా కుంకుడు త్యాగాలు కూడా చేస్తుంది రా’’ ‘‘నీకు మైండు దొబ్బింది. కుంకుడుకు త్యాగమేమిట్రా?’’ ‘‘నిజం రా... అందరూ త్యాగమంటే కరివేపాకుతో పోల్చుకుంటారు. కనీసం కరివేపాకును తినే టైమ్ వరకైనా గిన్నెలో ఉంచుకుంటారు గానీ... తలను శుభ్రపరిచే ఆ అద్భుతమైన పులుసు అంటే అందరికీ చేదే. కుంకుడు పులుసుకు ఒక్కసారి వాడుకొని దాని పిప్పిని కూడా అచ్చం కరివేపాకులాగా... చింతపండు పులుసులాగా పారేస్తారు. కరివేపాకు అనేదాన్ని వాడుకొని వదిలేస్తున్నామనే సానుభూతి ఉంటుంది. అందుకే ఎట్లీస్ట్ సామెతల్లో భాషవాడకంలో దానితో పోలుస్తుంటారు. కానీ కుంకుడు పులుసు సేవను మాత్రం అప్పటికీ ఎవరూ గుర్తించలేదు. అది అంతరించిపోయాక ఇప్పుడూ ఎవరూ గుర్తుపట్టే పరిస్థితి లేదు’’ అంటూ ఎమోషనల్ అయిపోయి కళ్లనీళ్లు పెట్టుకున్నాడు వాడు. ‘‘ఏడవకు... ఏడవకు... కుంకుడు పునర్వైభవం కోసం మనం పాటుపడదాం లే’’ అన్నాను వాణ్ణి కాస్త ఛీరప్ చేద్దామని. ‘‘ఛీ... ఛీ... ఈ పాడు షాపింగ్ మార్ట్లను చూస్తుంటేనే చిరాకేస్తుంది’’ అంటూ మళ్లీ మాల్స్ మీద కోపం వెళ్లగక్కాడు వాడు. ‘‘అందేట్రా రాంబాబూ... నీ బాల్యజ్ఞాపకాలను గుర్తు చేశాయనీ, కుంకుడు నాస్టాల్జియాకు తోడ్పడ్డాయనీ ఇప్పుడే కదా వాటిపైపు ఆరాధనగా చూశావ్. అంతలోనే ఈ మార్పేమిటి?’’ అడిగా. ‘‘కుంకుడు పునరుద్ధరణ కోసం మరో వీరేశలింగంగారిలా మారిపోదామనుకుంటే ఈ షాపింగ్ మాల్స్ నాకు పోటీ వస్తున్నాయేమిట్రా. నేను పాటు పడదామనుకున్నానా ఫీల్డులోకి వచ్చి నాకు ఆ అవకాశం లేకుండా చేస్తున్నాయిరా ఈ పాడు మాల్స్’’ అంటూ పాత ధోరణికి వచ్చాడు వాడు. వాడి మాటలు వినగానే కుంకుడు రసం కళ్లలోకి, నోట్లోకి వెళ్లినప్పుడు కలిగే ఫీలింగ్ మళ్లీ వచ్చింది. ఏం చేద్దాం? అనుభవించడం తప్ప అప్పుడూ ఇప్పుడూ ఏమీ చేయలేను!! - యాసీన్ -
పీఆర్ ఏఈ రాంబాబుకు విశ్వేశ్వరయ్య అవార్డు
అమలాపురం : ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మెమోరియల్ అవార్డు–2016కు అమలాపురం పంచాయతీరాజ్ ఏఈ అన్యం రాంబాబు ఎంపికయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న 19 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. హైదరాబాద్ మెగా సిటీ నవ్య కల్యాణ వేదిక (మదర్ ఫౌండేషన్) ఈ ఎంపిక చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ అవార్డును తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్. విద్యాసాగర్ చేతుల మీదుగా ఆదివారం రాత్రి అందుకున్నానని రాంబాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కోనసీమలో తీర ప్రాంత గ్రామమైన నక్కారామేశ్వరం నదీపాయపై రూ.8 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 200 మీటర్ల మేర వంతెనను సకాలంతో నిర్మించినందుకు ఈ అవార్డు దక్కింది. ఏపీ నుంచి ఏఈ కేడర్‌లో ఈ అవార్డులకు ఎంపికైన తొమ్మిది మంది రాంబాబు ఒకరు. ఆయనకు అవార్డు రావటంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే ఎ.ఆనందరావు, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పంచాయతీరాజ్ ఎస్ఈ వి.వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు. -
బాబు , వెంకయ్య లిద్దరూ మాట తప్పుతున్నారు
-
హోంగార్డు గుండెపోటుతో మృతి
నిడదవోలు : విధి నిర్వాహణలో ఉన్న ఓ హోంగార్డ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న వి. రాంబాబు (50) విధులు నిర్వర్తిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న సహచర సిబ్బంది వెంటనే స్పందించి... అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రాంబాబు గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు. రాంబాబు మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. -
ఏమాయ చేశారో!
రికార్డుల్లో మాయమవుతున్న రాజధాని రైతుల భూములు ప్రశ్నించిన రైతు రాంబాబుపై కేసు.. శుక్రవారం రాత్రి నుంచి కానరాని రాంబాబు భూ కబ్జాలపై కరపత్రాల కలకలం రాజధాని రైతుల్లో ఆందోళన.. అంతర్మథనం తుళ్లూరు : రాజధానిలో మరో భూమాయ కలకలం రేపింది. రికార్డుల్లో రైతుల భూములు మూడు నుంచి పది సెంట్ల వరకు మాయమవుతున్నాయి. ఈ విషయంపై ప్రశ్నించిన వ్యక్తులను బెదిరిస్తున్నారు. రికార్డులో భూములు తక్కువగా ఉండటం.. ప్రశ్నించిన ఓ వ్యక్తి అదృశ్యమవడం... కొందరు అధికార పార్టీ నేతల భూదందాపై గుర్తుతెలియని వ్యక్తులు కరపత్రాలు పంపిణీ చేయడం... తదితర అంశాలు ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వీటన్నింటిని పరిశీలించిన రైతులు ఎవరు ఏమాయ చేస్తున్నారో.. అని ఆందోళనకు గురవుతున్నారు. భూమిలిచ్చి తప్పు చేశామా.. అని అంతర్మథనానికి గురవుతున్నారు. రాజధాని నిర్మాణంలో తుళ్లూరు మండలం కీలకభూమిక పోషిస్తోంది. ఉద్దండరాయునిపాలెంలోనే రాజధానికి శంకుస్థాపన చేశారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి కేంద్ర బిందువు. అటువంటి మండలంలో రైతులకు రక్షణ కరువైంది. భూములు ఇచ్చిన వారిని పాలకులు, అధికారులు కలిసి మోసం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే వేధిస్తున్నారు. రాంబాబు ఎక్కడ.. తన భూమి రెవెన్యూ రికార్డుల్లో తగ్గించి ఉండటంపై అనంతవరం గ్రామానికి చెందిన రాంబాబు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి సమస్యను తెలియజేయగా... అధికారులు అవమానించి పంపించారు. అవమానభారాన్ని తట్టుకోలేక రాంబాబు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. రైతుకు న్యాయం చేయాల్సిన అధికారులు తిరిగి అతనిపైనే కేసు పెట్టారు. అంతటితో వదలని అధికారులు అరెస్టు చేయించారు. శుక్రవారం రాత్రి అరెస్టయిన రాంబాబు శనివారం రాత్రి వరకు కనిపించలేదు. అతనికి కుటుంబీకులు కూడా కనిపించకపోవటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అనంతవరం గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతుల భూముల్లో కొంత రికార్డుల్లో గల్లంతయ్యాయి. మూడు సెంట్లు కనిపించలేదని అధికారులను అడిగిన పాపానికి రాంబాబుని చిత్రహింసలకు గురి చేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రికార్డుల్లో కనిపించని తమ భూముల విషయం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని చర్చించుకుంటున్నారు. రాంబాబు ఎక్కడ ఉన్నాడనే విషయంపైనా ఉత్కంఠత నెలకొంది. అనంతవరంలో కరపత్రాల పంపిణీ ప్రభుత్వ రికార్డుల్లో భూములు ఓ పక్క మాయమవుతున్నాయి. మరో పక్క గ్రామంలో సుమారు 19 ఎకరాలు కబ్జాకు గురైందని అజ్ఞాత వ్యక్తి శనివారం అనంతవరం గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. అందులో గ్రామానికి చెందిన కొందరి పేర్లను ప్రస్తావించారు. టీడీపీ నాయకులు, అధికారులపై విమర్శలు చేశారు. అదే విధంగా దొంగతనాలు చేసే ఓ వ్యక్తి నాలుగంతస్తుల భవంతి కట్టారని ఆ లేఖలో ప్రశ్నించారు. భూ కబ్జాలు, నయింలా బెదిరింపులు చేస్తున్న విషయాలను ప్రస్తావించారు. మొత్తంగా అనంతవరం గ్రామంలో ఈ మూడు మూడు ఘటనలపై తీవ్ర చర్చనీయాంశమైంది. -
కోడి కూత... రాంబాబు మేత!
హ్యూమర్ ‘‘ఆహా... ఆ గారెలను చూశావా... వాటిని చూస్తుంటే గుండ్రటి నూనె స్విమ్మింగ్‌పూల్‌లో ఈదుతున్న గజ ఈతగాడు ఫెల్ప్స్‌కు తాతల్లా అనిపించడం లేదూ?’’ అన్నాడు మా రాంబాబు గాడు బజ్జీల బండి దగ్గర మూకుడులో వేగుతున్న గారెలను చూస్తూ. నేను జవాబిచ్చేలోగా మళ్లీ వాడే అందుకొని... ‘‘ఒలింపిక్స్‌లో మనకు పతకాలూ అవీ రాకపోతేనేం...! చూశావా..? బాగా వేగి గోల్డ్ కలర్లోకి మారిన ఆ గారెలను చూడు. వాటిని చూస్తుంటే మూకుడు నిండా కళకళలాడుతున్న బంగారు పతకాల్లాగే లేవూ?’’ అన్నాడు వాడు. ‘‘అవున్రా’’ అన్నాను నేను. వాడు పెట్టించిన గారెలు తింటూ వాడితో ఏకీభవించకపోతే బాగుండదని మొహమాటంగా ఏదో అన్నాను. ‘‘అయితే... గారెలకు వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. గారెలకు ఉన్న మంచి పేరు దెబ్బతీయడానికి ఒక వ్యవస్థే పనిచేస్తోంది రా. గారెలకు వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడుస్తోంది. గారెలకు జరుగుతున్న ఈ అన్యాయానికి కుమిలిపోతున్నానురా’’ అన్నాడు రాంబాబు. రోజూ సాయంత్రం కాగానే బజ్జీల బండి వాడి దగ్గరికి వెళ్తుంటాడు వాడు. ఇవ్వాళ నన్ను కూడా తీసుకెళ్లాడు. అక్కడ ప్లేట్లో నిండుగా గారెలు తింటూ మొదట తన్మయత్వంలో మునిగిపోయాడు. అంతలోనే తన తన్మయత్వాన్ని భగ్నం చేసుకొని అకస్మాత్తుగా ఆ మాట చెప్పేసరికి ఆశ్చర్యపోయాను. ‘‘ఎవరురా? గారెలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదెవరు?’’ అడిగాను నేను. ‘‘ఇంకెవరూ డాక్టర్లు. ఎందుకో డాక్టరంతా మూకుమ్మడిగా గారెలను వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు ఇచ్చే ప్రతి సలహాలోనూ మసలుతున్న నూనెలో వేగినవి తినవద్దని అంటూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే మొత్తం వైద్యవర్గాలన్నీ గారెలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు ఉంది’’ అన్నాడు వాడు. ‘‘పండగలు పబ్బాలు వస్తే చేసుకునే వంటకాల్లో గారెలే ముఖ్యమైనవి. డాక్టర్లు కూడా బహుశా గారెలు తింటూనే ఉంటారు. అలాంటప్పుడు వాటికి వ్యతిరేకంగా డాక్టర్లు కుట్ర పన్నుతున్నారని ఎలా అంటావు? ఒకవేళ చేసినా ఆ కుట్ర ఎందుకు నిలుస్తుంది?’’ అడిగా. ‘‘లేదురా. మనలాంటి గారె అభిమానుల మనోభావాలను డాక్టర్లు మాటిమాటికీ గాయపరుస్తున్నారు. అంతేకాదు అనేక మంది గారె కార్మికుల ఉపాధిని కూడా వాళ్లు దెబ్బతీస్తున్నారు. ఇదే డాక్టర్లు చేస్తున్న కుట్ర. వాళ్లు మాటిమాటికీ నూనెలో వేయించేవాటిని తినవద్దని చెబుతున్నారు కదా! తద్వారా పరోక్షంగా గారెలనూ తినవద్దని డాక్టర్లు చెబుతున్నట్లే కదా’’ లాజిక్ లాగాడు వాడు. ‘‘ఒరేయ్... మిరపకాయ బజ్జీలు, బోండాలూ, గారెలూ... ఇవన్నీ నూనెలో వేయించేవే. ప్రత్యేకంగా గారెల మీదే కుట్ర పన్నుతున్నారని నువ్వెలా అంటావ్’’ అడిగాను వాణ్ణి. ‘‘మిరపకాయ బజ్జీలే అనుకో. శనగపిండి వల్ల కొద్దిగా తినగానే కడుపు ఉబ్బినట్టు అవుతుంది. దాంతో ఒకటి రెండు కంటే ఎక్కువగా ఎవ్వడూ తినలేడు. ఇక బోండాలంటావా? అంతగా నైపుణ్యం లేకపోతే పైన ఒక లేయర్ వేగి ఉంటుంది. లోపల పిండి అంతా పచ్చిగానే ఉంటుంది. గారెలనుకో... బల్లపరుపుగా ఉంటాయ్ కాబట్టి అన్నివైపులా సమానంగా కాల్తాయి. అందుకే మిర్చి బజ్జీల బండి మీద ఉన్న అన్నిటికంటే గారెలే బెస్టు. బజ్జీల బండి అని పేరు మాత్రమే వాటిది. రాజ్యమంతా గారెలదే. పైగా మహాభారతంతో పోలిక మరి దేనికైనా ఉందా? బజ్జీలకుందా? బొండాలకుందా? అందుకే ఎవరెన్ని కుట్ర చేసినా సరే... గారెల మనుగడ ఖాయం. పొద్దు కుంగడానికి ఆకాశం... పిండిలో చిల్లు పొడవడానికి మనిషికి వేలు... ఈ రెండూ ఉన్నంత కాలం ఈ సమాజంలో గారెలు ఇలా విలసిల్లుతుంటాయని నా నమ్మకంరా’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘చిల్లుగారెలో పొడవడానికి వేలు ఉన్నంత కాలం గారెలు ఉంటాయన్నావు. అది ఓకే. కానీ పొద్దు పొడవడానికీ... గారెలకూ సంబంధం ఏముంది?’’ అడిగాను. ‘‘పొద్దు కుంగగానే... అనగా సాయంత్రం కాగానే ఎంత పెద్దవాడినైనా అలా బజ్జీల బండి వద్దకు నడిపిస్తుంటాయి గారెలు. పొద్దుపొడుస్తూ ఉండగా కోడికి కూయాలనిపించినట్టుగానే, రోజూ సాయంత్రం అవుతూ ఉండగా... అంటే పొద్దు గుంకుతూ ఉండగానే గారెలు తినాలపిస్తుందిరా. కాళ్లు ఆటోమేటిగ్గా మిర్చిబజ్జీల బండి వైపుకు తిరుగుతున్నాయి. దీంతో నాకు ఒక విషయం అర్థమైంది’’ అన్నాడు వాడు. ‘‘ఏమిటి?’’ ‘‘ఏం లేదురా... కోడికి కూత... నాకు మేత... ఒక నేచురల్ ఇన్స్టింక్ట్రా. కోళ్లు కూస్తున్నంత కాలం ఇలా నేను గారెలూ మేస్తూనే ఉంటా. అలా గారెలు తింటూనే కన్నుమూస్తా’’ అన్నాడు వాడు. - యాసీన్ -
వడదెబ్బకు ఇద్దరి మృతి
ఖమ్మం: ఎండల తీవ్రతకు ఖమ్మం జిల్లాలో సోమవారం ఇద్దరు మృతిచెందారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం మండలం గ్రామానికి చెందిన కోట భూషణం(62) సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. అలాగే, మధిర మండలం మునగాల గ్రామానికి చెందిన కోట రాంబాబు(21) అనే వికలాంగుడు కూడా మృత్యువాతపడ్డాడు. ఎండలు ఎక్కువగా ఉన్నందు వల్ల మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని డాక్టర్లు సలహా సూచిస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం అలిమిల్లి వద్ద ఓ బైక్ అదుపు తప్పి వంతెన పై నుంచి 20 అడుగుల కిందకు పడిపోయింది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న ముగ్గురు గాయపడ్డారు. వీరిలో రాంబాబు (28) పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటరామణ, మోహన్ అనే వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వీరు ముగ్గురూబాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో పెళ్లికి హాజరై గూడూరు మండలం చెన్నూరుకు తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శివారులోని ముత్యాలమ్మ రాయి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక కానిస్టేబుల్ మృతిచెందాడు. సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాంబాబు(42) కాకినాడలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం విధులకు హాజరయ్యేంకుకు ద్విచక్రవాహనంలో వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొంది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
అశ్వారావుపేట మండల పరిధిలోని గుమ్మడవల్లిలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఇల్లులు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన మడకం రాంబాబు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు అంటుకొగా, పక్కనే ఉన్న కట్టం భీముడు, చిచ్చోడు శివ ఇళ్లు కుడా మంటల్లో కాలిపోయాయి. ఈ మూడు ఇల్లులు పూర్తిగా దగ్ధం కాగా దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లింది. -
కాల్‌మనీ వేధింపులు: మరొకరి ఆత్మహత్య
రేపల్లె: కాల్‌మనీ వేధింపులు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లెలో గురువారం వేకువజామున చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కదరవల్లి రాంబాబు(58) స్థానికంగా గరికపాటి రవి అనే వ్యాపారి నుంచి 8 ఏళ్ల క్రితం రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ రుణానికి సంబంధించి వడ్డీయే రూ. 24 లక్షలయింది. మరో వ్యక్తి వేమూరి శ్రీను దగ్గర రూ.1.50 లక్షలు అప్పు తీసుకోగా దానికి వడ్డీ రూ. 2లక్షలకు చేరుకుంది. అప్పుల వారి నుంచి వేధింపులు తీవ్రం కావటంతో ఈనెల 19వ తేదీన తమ స్వగ్రామం బొబ్బర్లంక వెళ్లి పొలంలోనే పురుగు మందు తాగి చనిపోయాడు. మరణ వార్త విని స్వగ్రామానికి చేరుకున్న కుమారుడు తండ్రి చొక్కా జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను గమనించి, ఆమేరకు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చౌడాయపాలెం ఇన్చార్జి ఎస్సై మహ్మద్ షఫీ దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు ఇద్దరు కుమారులు ఉన్నారు -
ఆర్ఎంపీ డాక్టర్ దారుణ హత్య
మద్దిపాడు: ప్రకాశం జిల్లాలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన ఈమని రాంబాబు (35) గ్రామంలో వైద్యం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న ఆయన ఎంతకీ లేవగాక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు తెరిచి చూడగా ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తలపై గొడ్డలితో నరకడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. వివాహేతర సంబంధాలే రాంబాబు హత్యకు దారితీసినట్టు స్థానికులు చెప్పుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
ఏపీలో తుగ్లక్ పాలన నడుస్తోంది
-
ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి
అప్పుల భారం మరో రైతును బలితీసుకుంది. అప్పుల బాధ తాళలేక 10 రోజుల క్రితం ఆత్మహత్యా యత్నం చేసిన రాంబాబు(52) అనే రైతు.. ఆదివారం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట మండలం వేట్ల పాళెం గ్రామానికి చెందిన వాడు. కాగా.. రాంబాబు భీమేశ్వరాలయానికి సంబంధించిన 30 ఏకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం కోసం రూ.10లక్షల దాకా అప్పు చేశాడు. అప్పులు ఇచ్చినవారి వత్తిడి ఎక్కువ కావడంతో తన పేర ఉన్న ఇల్లు, పొలం కూడా అమ్మేశాడు. ఇంకా అప్పు మిగిలి ఉండడంతో పది రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. మృతునికి బార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
మిఠాయి కొట్టున పకోడి పొట్లం!
హ్యూమర్ వస్తూ వస్తూ రైల్వేస్టేషన్లో కొన్న మామిడి తాండ్రను మా రాంబాబు చేతిలో పెట్టగానే... దాన్ని చూసి ‘‘హు...’’ అంటూ రాంబాబు గాడు విరక్తిగా పెదవి విరిచాడు. అది చూసి ఆశ్చర్యపోయాన్నేను. ‘‘మామిడి తాండ్రను చూడగానే తాండ్రపాపారాయుడిని చూసినట్లు జోష్‌లో ఊగిపోయేవాడి. ఆ రుచిని ఆస్వాదించుకుంటూ తినేవాడివి. ఇదేంట్రా ఇలా నిరుత్సాహంగా ఉండిపోయావు?’’ అడిగాను. ‘‘ఇదీ ఒక తాండ్రేనా? అలనాడు పొట్లం కడితే ఈతచాప అచ్చులు తాండ్రపై కనిపించాలి. అలాంటి అచ్చులు లేని తాండ్ర కనిపిస్తే చారల్లేని పులిలా, జూలు లేని సింహంలా బోసిగా అనిపిస్తోందిరా’’ అన్నాడు రాంబాబు. అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా వాడు కిరాణా షాప్ దగ్గర, మిఠాయి దుకాణం దగ్గర... ఇలా రెండు చోట్ల గాల్లోనే దండం పెట్టుకున్నాడు. దార్లో గుడిని చూసినప్పుడు భక్తిపూర్వకంగా పెట్టుకునే నమస్కారంతో పాటు వేళ్ల ఉంగరాలను ముద్దు పెట్టుకోవడం చూసి... ‘‘ఆ షాపుల్లో ఏవైనా నీ ఇష్టదైవాల ఫొటోలున్నాయా?’’ అని అడిగాను. ‘‘లేదురా... మిఠాయి కొట్లో వాడు పకోడీ పొట్లం కట్టే తీరు ఒక అద్భుతం రా. అసలు పకోడీ పొట్లాన్ని ఒక ఉదాహరణగా స్వీకరించి... అత్యంత సీరియస్ సబ్జెక్టు అయిన జర్నలిజం పాఠాలు బోధిస్తారు తెల్సా. మనం న్యూస్ ఇచ్చే సమయంలో వివరాలన్నీ అచ్చం తలకిందులైన పకోడీ పొట్లాంలా ఉండాలని లెసన్ చెబుతారురా. మొదట ప్రధాన వివరాలూ, ఆ తర్వాత అప్రధాన అంశాలూ పకోడీ పొట్లం చేత శీర్షాసనమేయించినట్లుగా ఉండాలంటారు. ఇలా పాఠాల్లో చోటుచేసుకున్న ఆ పొట్లం బతుకు ధన్యం కాదా? త్రిభుజాకారంలో ఉండే ఆ పొట్లంలో మన కాళ్ల పనీ... అనగా లెగ్ వర్క్, జబ్బ సత్తువలూ కనిపించాలంటూ శాస్త్రప్రమాణమైన దాఖలాను చూపుతారు. అంటే పోలిక కోసం ఎంపిక జరిగిన తీరును బట్టి అయినా పొట్లాం మీద మనందరికీ భక్తి కలగాలి కదా’’ అన్నాడు వాడు. ఆ సెటైరు నాకే అని అర్థమైంది. ఎందుకంటే నాకు పకోడీ పెద్దగా ఇష్టముండదు. అదే విషయాన్ని చెప్పా. ‘‘అసలు పకోడీ గురించి ఎవడు మాట్లాడారురా ఇక్కడ. నేను చెప్పేదంతా పొట్లాం గురించే కదా. ఒక్కో పొట్లానికి ఒక్కో నిర్దిష్టమైన విధానముందీ, దీన్ని కట్టేందుకు తగిన పద్ధతుంది. శాస్త్రబద్ధమైన ఈ పద్ధతులేవీ ఫాలో కాకుండా... ఒకప్పటి ఉదాత్తమైన పొట్లాలు కట్టే కళను ఇప్పుడు ప్లాస్టిక్‌తో అపభ్రంశం చేస్తున్నారురా ఈ షాపుల వాళ్లు. ఇందాక నేను నమస్కరించిన కిరాణ షాపులో ఇంకా శాస్త్రోక్తంగా పొట్లాలు కడుతున్నారు’’ అన్నాడు వాడు సశాస్త్రీయమైన పొట్లాల గురించి శంకరాభరణం శంకరశాస్త్రిలా బాధపడుతూ. ‘‘పొట్లాలు కట్టడంలోనూ పద్ధతా?’’ అడిగా ఆశ్చర్యంగా. ‘‘కాదా... మరి? ఆయుర్వేద మందుల్ని చిట్టి చిట్టి పొట్లాల్లా కడతారు. వాటిని నలుచదరాకారపు వైనాన్ని ఎప్పుడైనా గమనించావా? ఆ పొట్లాం కట్టిన తీరుతోనే వైద్యుడి నైపుణ్యం అర్థమవుతుంది. అన్నట్లు... మసాలాదోశను చాపచుట్టినట్లుగా రోల్ చేస్తారు. అలా చేసి, స్తూపాకారంలో పొట్లం కడతారు. బోండాలను, బజ్జీల కాగితపు పొట్లం కట్టే ముందర అరిటాకుతోనో, బాదం ఆకులతో ఫౌండేషన్ వేస్తారు. అనేక దొంతరలుగా ఉండే తందూరీ రోటీలనూ, జొన్న రొట్టెల్ని వృత్తాకారంలోనే కాగితాల్లో చుడతారు. ఇందాక మనం చూసిన ఆ కిరాణ షాపులో పప్పు పొట్లాన్ని క్యూబ్ ఆకారంలో పొట్లాం కడతారు. దాన్ని చూస్తే ఘనాఘన సుందరుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. ఇక బెల్లం అచ్చుల్ని పిరమిడ్ ఆకారాన్ని మధ్యకు కోసినట్లుగా తాటాకు చాపలో చుట్టిపెడతారు. అందుకే బెల్లంపై తాటాకు అచ్చుల్ని చూడకపోయినా, మామిడి తాండ్రపై ఈతచాప కదుములు కనిపించకపోయినా నాకెంతో బెంగగా ఉంటుందిరా. అంతెందుకు కాసిన్ని పూలు బయటికి కనిపించేలా పూలమాల పొట్లాంలోనూ ఓ చమత్కారం ఉంటుంది’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ఒరే బాబూ... పూలూ, కిరాణా పొట్లాల్లోనూ పొట్లకాయలాంటి నిర్మాణ చమత్కృతి చూస్తున్న నిన్నేం అనాలో నాకు తోచడం లేదురా’’ అన్నాను. ‘‘నేను చెప్పేది ఇంకా అయిపోలేదు. ఇక జర్నలిజపు పాఠాలను తన ఒంటిపై అక్షరాలతో అచ్చోసుకున్న ఆ వార్తల కాగితమే, మళ్లీ పకోడీ పొట్లాలకు మూలం కావడంలోని చిత్రం చూశావా? ఎంత మాలావు ఇంగ్లిషు పేపరైనా పాత పేపర్ల వాడి నుంచి చివరకు కిరాణాషాపుకు లేదా కాకాహోటళ్లకు మళ్లుతుంది. అయితే ఇక్కడ కూడా తెలుగు పేపరు కంటే ఇంగ్లిష్ పేపరుకే ఎక్కువ ధర పలకడం చూస్తే బాధేస్తుంది. పొట్లాం దగ్గర కూడా తెలుగు పేపర్ల పట్ల ఇంకా కొనసాగుతున్న ఈ వివక్ష చూస్తే బాధేస్తోందిరా’’ అన్నాడు వాడు. ‘‘చూస్తుంటే కంగారూ సైతం తన బిడ్డను పొట్టకు పొట్లాంలా కట్టుకుంటుందని అనేలా ఉన్నావు’’ అంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాన్నేను. - యాసీన్ -
కౌలు రైతు ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన కౌలురైతు రాంబాబు(33) అప్పుల బాధతో గురువారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అర ఎకరా పొలం ఉన్న రాంబాబు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా సాగు చేస్తున్నాడు. వరుస నష్టాలతో అప్పుల పాలయ్యాడు. పంట సాగుకు చేసిన రూ.5లక్షల అప్పు తీర్చే విధానం తెలియక ఆవేదనకు గురై గురువారం ఉదయం తన పొలంలో పురుగుల మందు సేవించి కుప్పకూలిపోయాడు. గమనించిన రైతులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. -
వేడివేడి నూనెలో చేతులాడిస్తాడు..
తాలింపులో పచ్చిమిర్చీ వేస్తున్నప్పుడో, పిండి వంటలు చేస్తున్నప్పుడో ఒకటీ అరా వేడివేడి నూనె చుక్కలు ఒంటిపై పండితే ప్రాణం పోయినంత పనౌతుంది. అలాంటిది సలసలా కాగే నూనెలో అమాంతం చేయి పెట్టేసి పకోడీలు అవీ వండేస్తుంటాడు రాంబాబు. ఇంతకీ ఎవరీ బాబు? ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ రాంబాబు సొంతూరు. ఆ ఊళ్లోని ఓ వీధి తన ఇంటిముందరే చిన్న పొయ్యి అదీ ఏర్పాటుచేసి పిండి వంటలు అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. 200 డిగ్రీల వేడి నూనెలో చేతులు పెట్టడం, పెట్టినా కాలకపోవడంతో రాంబాబు దగ్గర ఏవో దివ్యశక్తులు ఉన్నట్లు అక్కడి జనం అమ్ముతున్నారు. ఒక విధంగా ఆ నమ్మకం అతడి షాపుకు గిరాకి పెరిగేందుకు కూడా తోడ్పడింది. ఇంతకీ ఏమిటీ మ్యాజిక్? అని రాంబాబునే అడిగితే.. 'మ్యాజిక్కూ లేదూ మాయా లేదు.. అంతా దైవ లీల! ఇరవైఏళ్ల కిందట షాపు ప్రారంభించినప్పటి నుంచీ నా వంటకాలకి మంచి పేరుంది. కొన్ని సార్లు అదుపులేచలేనంత మంది కస్టమర్లు వస్తుంటారు. అలా ఓ బిజీ సాయంత్రాన.. కస్టమర్లకు పదార్థాల్ని త్వరగా అందించాలనే హడావిడిలో పక్కనే జల్లిగంటే ఉన్న సంగతి మర్చిపోయి వేడివేడి నూనెలో చెయ్యిపెట్టి పకోడీని కలిపా! క్షణాల తర్వాత పొరపాటు గుర్తొచ్చి చెయ్యి వెనక్కి తీసుకున్నా. ఆశ్చర్యకరంగా చిత గాయమైనా కాలేదు! ఆ తర్వాత మళ్లీ మళ్లీ వేడివేడి నూనెలో నా చేతిని ముంచా. అయినా ఏమీ కాలేదు. అప్పుడు అర్థమైంది. ఇది దేవుడి లీలని. అప్పటి నుంచి గంటెలు గట్రా పక్కన పారేసి చేత్తోనే పదార్థాలు వండేస్తున్నా. ఇంతకు ముందు కంటే రుచిగా ఉంటున్నాయని పొగుడుతున్నరు కస్టమర్లు' అని వివరిస్తాడు స్ట్రీట్ ఛెఫ్ రాంబాబు. రోజుకు దాదాపు 100 కిలోల పిండి పదార్థాలమ్మే ఆయనకు ఖర్చులన్నీపోనూ 2వేల రూపాయలు మిగులుతాయట! -
'ఈ నల భీముడు కెవ్వు కేక'
అలహాబాద్: వంట చేసే సమయంలో కాస్త దగ్గరగా ఉంటేనే ఆ వేడికి భయపడి దూరంగా జరుగుతుంటాం. అలాంటిది ఏకంగా సలసల కాగే నూనెలో చేతులు ముంచుతూ వంటలు చేస్తే ఎలా ఉంటుంది. మాములుగా అయితే, చర్మం ఊడిపోదూ..! కానీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన రాంబాబు అనే 60 ఏళ్ల వ్యక్తి ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 40 ఏళ్లుగా ఇలాగే తన బజ్జీల బండిదగ్గర పిండివంటలు తయారు చేస్తున్నాడు. గరిటె సహాయం లేకుండా చకచకా ఘుమఘుమలాడే పిండివంటలు చేస్తున్నాడు. ఇది చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు ఆ చర్య ఒక బ్రాండ్ గా మారి తన బండి వద్ద ఎప్పుడూ ఆహార ప్రియుల సందడితో కళకళలాడేలా చేసింది. 200 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉండే ఈ నూనెలో అతడు చేతి వేళ్లను పిండితో ముంచుతాడు. అవి పూర్తిగా కాలాక తీసి పక్కకు వేస్తుంటాడు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కొందరు అతడిని ప్రశ్నించగా 'నేను సలసల కాగే నూనెలో చేతిని ముంచుతూ పకోడీలు తయారుచేసే విధానం చూసేందుకు చాలా దూరం నుంచి వస్తుంటారు. నేను 40 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కాలిన గాయాలు అవలేదు' అంటూ చెప్పాడు. 20 ఏళ్లనాటికే ఆలు బజ్జీలు వేయడం నేర్చుకున్నానని, తన బడ్డీ కొట్టు ఇంత ఫేమస్ అవుతుందని అస్సలు ఊహించలేదని చెప్పాడు. గరిటెతో పిండివంటలు తయారు చేసి వాటిని తీయడం కాస్త ఎక్కువ టైం తీసుకుంటుందని, అందుకే తాను నేరుగా చేతిని ఉపయోగించి స్నాక్స్ తయారు చేయడం ప్రారంభించానని చెప్పాడు. దీంతో ఇప్పటి వరకు అతడు గరిటె లేకుండానే పిండివంటలు చేసి అబ్బుర పరుస్తున్నాడు. -
ముక్కుతో వినాయకుని బొమ్మ గీసేశాడు
హైదరాబాద్: నగరంలోని వీఎన్ఆర్ సద్గురు పాఠశాలలో జరిగిన వినాయక చిత్రమాలికలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ముక్కుతో గణనాధుడి బొమ్మగీసి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పాఠశాలకు చెందిన మాస్టర్ రాంబాబు బ్లాక్ పేయింట్ను ముక్కుసాయంతో వాడుతూ అద్భుతమైన గణనాధుని విగ్రాహాన్ని ఆవిష్కరించారు. -
మాజీ ఎమ్మెల్యే రామారెడ్డికి పుత్రవియోగం
అనపర్తి :అనపర్తి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తేతలి రామారెడ్డి పెద్ద కుమారుడు రామిరెడ్డి అలియాస్ రాంబాబు (54) బుధవారం తెల్లవారు జామున రైలు నుంచి జారిపడి మరణించారు. అనపర్తి రైల్వేస్టేషన్ సమీపంలో వేగంగా వెళుతున్న రైలునుంచి పడిపోయిన రాంబాబు తీవ్రగాయాలకు లోనై సంఘటన స్థలంలోనే మృతి చెందారని సామర్లకోట రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై ఎ. వెంకటేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రాంబాబు వ్యక్తిగత పనుల నిమిత్తం అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి నుంచి శ్రీకాకుళం బయలుదేరారని తెలిపారు. అనపర్తి సమీపంలో రాంబాబు రైలు నుంచి జారిపడ్డారన్నారు. అనపర్తి రైల్వే సిబ్బంది అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్నామని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. అలముకున్న విషాదం.. పలువురి సానుభూతి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి తనయుడు రాంబాబు రైలు నుంచి జారిపడి మృతి చెందిన వార్త తెలియడంతో అనపర్తి, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. మంచికి మారుపేరుగా, అందరికీ ఆప్తునిగా మసలిన రాంబాబు ఇక లేరన్న విషయాన్ని పలువురు పార్టీ కార్యకర్తలు, తేతలి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు రాజకీయనాయకులు అనపర్తిలోని మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి నివాసానికి చేరుకున్నారు. తేతలికి వారు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ీసీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, అనపర్తి నియోజక వర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష మాజీ నేత సత్తి రామారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, రాష్ట్ర రైతు నాయకుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, రామచంద్రపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొవ్వూరి తాతారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు కర్రి రామారెడ్డి (రామన్నతాత), వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్తి వీర్రెడ్డి, రామవరం ఉపసర్పంచ్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కొప్పవరం, పొలమూరు గ్రామాల మాజీ సర్పంచ్‌లు తాడి వెంకట రామకృష్ణారెడ్డి, సత్తి వీర్రాఘవరెడ్డి, మేడపాటి గంగిరెడ్డి తదితరులు తేతలికి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. -
బెజవాడ దుర్గగుడి ఏఈవో సస్పెన్షన్
విజయవాడ: బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆలయ ఏఈవో రాంబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం ఈ మేరకు దేవస్థానం ఈవో నర్సింగరావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల దేవస్థానంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల వేలం ప్రక్రియకు టెండర్లకు పిలిచారు. ఆ క్రమంలో ఏఈవో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో ఏఈవో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. దీంతో రాంబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. -
మా రాంబాబు గాడూ, పులీ... సేమ్ టు సేమ్!
నవ్వింత: ఈ మధ్య మా రాంబాబు గాడి ఆరోగ్యం పాడైంది. అప్పట్నుంచి వాడి మాటలన్నీ చిత్రంగా ఉంటున్నాయి. వాడు చెప్పేవన్నీ పరమ సత్యాలే. దాంతో వినేవారికి ఒకింత ఇబ్బందిగానూ, మరీ మాట్లాడితే వెటకారంగానూ అనిపిస్తున్నాయి. ఒక రోజున వాడూ, నేనూ రోడ్డు మీద పోతున్నాం. దార్లో నాకు తెలిసిన మిత్రుడొకడు కనిపించి నన్ను విష్ చేశాడు. ఏదో లోకం పోకడ కొద్దీ నేను వెంటనే మా రాంబాబుగాణ్ణి వాడికి పరిచయం చేశా. అంతే! వాళ్ల మధ్య జరిగిన సంభాషణ నా మిత్రుణ్ణే కాదు, పరిచయం చేసిన పాపానికి నన్నూ బోల్డంత ఇబ్బంది పెట్టింది. ‘‘ఏం సార్... ఎలా ఉన్నారు?’’ అంటూ ముఖమంతా నవ్వులమయం చేసుకుని స్నేహాన్ని పెంచుకునే దృష్టితో దగ్గరితనాన్ని ప్రదర్శిస్తూ మా రాంబాబుగాణ్ణి అడిగాడు నా మిత్రుడు. ‘‘ఏదో జస్ట్ యావరేజిగా ఉన్నాలెండి’’ అన్నాడు వాడు. ‘‘మీరేం చేస్తున్నారు సార్’’ మళ్లీ అడిగాడు నా స్నేహితుడు. ‘‘ఒళ్లు చేస్తున్నాను’’ అని జవాబిచ్చాడు రాంబాబు. దాంతో మా స్నేహితుడు దెబ్బతిన్నట్టు నా వైపు చూశాడు. అతణ్ణి పక్కకు తీసుకెళ్లి... ‘‘ఈమధ్య రాంబాబు ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడేవో మందులు వాడితే వాటి సైడ్‌ఎఫెక్ట్‌గా లావెక్కాడు. వాడిదంతా ఏదీ దాచుకోకుండా ఫ్రాంక్‌గా చెప్పే తత్వం కాబట్టి నువ్వేమీ అనుకోకు’’ అంటూ సర్దిచెప్పి పంపించా. మరో రోజున మా రాంబాబు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ మా ఇంటి వైపు వస్తుంటే, ‘‘ఎక్కణ్ణించి వస్తున్నావురా’’ అన్నా. వాడు గాఢంగా నిట్టూర్చి... ‘‘హు... అద్దం బద్దలైంది. మూడు ముళ్ల బంధం పటాపంచలైంది. అందుకే మెకానిక్ దగ్గరికి వెళ్లి వస్తున్నా’’ అంటూ అర్జంటుగా వెళ్లిపోయాడు. వెంటనే నా గుండెల్లో రాయి పడింది. ‘వీడేమైనా ఇంట్లో వాళ్లావిడతో గొడవపడ్డాడా? అయినా గొడవ మరీ ముదిరితే సరిదిద్దుకోదలచుకుంటే సైకాలజిస్టు దగ్గరికెళ్లాలి, విడిపోదలచుకుంటే లాయర్ దగ్గరికెళ్లాలి. అంతేగానీ ఇలా మెకానిక్ దగ్గరికెళ్లడం ఏమిటి?’ అంటూ వెంటనే వాళ్లావిడకు ఫోన్ చేసి అడిగా... ‘‘ఈ మూడుముళ్లేమిటీ... చెల్లాచెదురేమిటీ?’’ అని. ‘‘ఏం చెప్పమంటారు అన్నయ్యా! ఇంట్లో బుజ్జిగాడు బంతాట ఆడుతుంటే అది వెళ్లి గోడగడియారానికి తగిలింది. దాని చిన్నముల్లూ, పెద్దముల్లూ, సెకన్లముల్లూ ఊడిపడ్డాయి. వాటిని బాగు చేయించడానికి వెళ్లొస్తానని బయల్దేరారు. బహుశా అదే విషయం మీకు చెప్పి ఉంటారు’’ అంది వాళ్లావిడ. అప్పటికిగాని నా ఆందోళన తగ్గలేదు. అంతటితో ఆగలేదు వాళ్లావిడ. ‘‘ఈమధ్య ఆయన మాటలన్నీ చిత్రంగా ఉంటున్నాయి అన్నయ్యా. మొన్న ఉప్మా చేశా. చట్నీ, పచ్చడీ రెండూ ముందు పెట్టి... ‘దేంతో తింటారండీ అన్నా. దేంతో తింటాం? చేత్తో లేదంటే స్పూన్‌తో’ అన్నారు. ఇంకోరోజు ‘పళ్లు రాలాయి. బుర్ర కుదురుగా ఉండటం లేదు. తల చెదిరిపోతోంది’ అన్నారు. మొదట ఆయన పళ్లకు ఏమైందో, ఆ మాట అన్నందుకు డెంటిస్టు దగ్గరికెళ్లాలా, న్యూరాలజిస్టును సంప్రదించాలా అని సందేహపడే లోపే... ఆయన చేతిలో ఉన్న దువ్వెనను చూస్తే తెలిసింది. రాలిన పళ్లు దువ్వెనవని’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది రాంబాబు వాళ్లావిడ. ఎలాగైనా వాడిని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని అనుకుంది వాళ్లావిడ. ‘‘డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒళ్లు చేస్తున్నా కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డైటింగ్ చేద్దాం ఈసారి’’ అన్నది వాడి డైలాగట. ఇవన్నీ నా ముందు చెప్పుకుని బాధ పడి ‘‘ఏదైనా మంత్రం వేసో, తంత్రం చేసో, మాయతోనో ఆయనను మీరే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలన్నయ్యా’’ అంది. ఇక నాకు తప్పలేదు. మా ఫ్యామిలీ ఫిజీషియన్ గారికి మావాడి విషయాలూ, వాడి లక్షణాలూ ముందే వివరించి ఉంచా. దేవుడి మీద భారం వేసి ఒక్క ప్లాన్ వేశా. హోమియో వైద్యం తరహాలో మనం కూడా వాడి రూట్లోనే వెళ్తే ప్లాన్ వర్కవుట్ అవుతుందనిపించింది. అందుకోసం వాడికి నేను చెప్పిన మాటలివి. ‘‘ఒరేయ్ రాంబాబూ... నాకు తెలిసినంతవరకూ నువ్వూ, పులీ... సేమ్ టు సేమ్ రా. నీకెప్పుడూ ‘పులి తేన్పులు’ వస్తుంటాయి కదా. కాకపోతే పులి పొట్ట ఎప్పుడూ సాఫ్ట్‌గా ఉండి, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ ఈమధ్య నీ పొట్ట కాస్త పెరుగుతూ ఉంది. అదొక్కటే తేడా. మరి నువ్వూ ఎప్పుడూ పులిలా ఉండాలంటే కాస్త ఈ పొట్ట తగ్గేలా చూసుకోవాలి కదా’’ అన్నా. అంతే వాడు వెంటనే డాక్టర్ దగ్గరికి బయల్దేరాడు. - యాసీన్ -
కార్మికుల భద్రతే ధ్యేయం
పరిశ్రమల్లో కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, యంత్రాల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించినట్టు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ (పరిశ్రమల శాఖ)అధికారి కె. రాంబాబు తెలిపారు. పరిశ్రమల యూజమాన్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనలు పాటించాల్సిందేనని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ⇒ సంక్షేమం, యంత్రాల పనితీరుపైనే దృష్టి ⇒ పూర్తిస్థాయిలో జిల్లాలో రెన్యూవల్స్ ⇒ పరిశ్రమల యూజమాన్యాలు నిబంధనలు పాటించాల్సిందే ⇒ ‘సాక్షి’తో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాంబాబు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో ఇప్పటి వరకు 1238 ఫ్యాక్టరీలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాటిలో విద్యుత్ సమస్య, నష్టాలు, కోర్టుల్లో లావాదేవీల కారణంగా 270 ఫ్యాక్టరీల్లో ఉత్తత్పి నిలిచిపోయింది. మిగిలిన 968 ఫ్యాక్టరీలకూ ఈ ఏడాది పూర్తిస్థాయిలో రెన్యూవల్స్ చేయించామని రాంబాబు తెలిపారు. కొత్తగా ఈ ఏడాది మరో 20 ఫ్యాక్టరీలకు లెసైన్సులు మంజూరు చే శామన్నారు. గతంలో సుమారు 280 ఫ్యాక్టరీలు రెన్యూవల్స్ లేకుండానే నడిచినట్టు తమ దృష్టికి వచ్చిందని, కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం, యంత్రాల పనితీరు పరిశీలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పూర్తిస్థాయిలో రెన్యూవల్స్ చేయించామన్నారు. 31 పరిశ్రమలు మూతపడే దిశగా ఉన్నాయన్నారు. సిబ్బంది కష్టాలు తప్పడం లేదు జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో కార్మికుల జీతాలు, వేతనాల అమలు తీరును పరిశీలించేందుకు కార్మికశాఖ చట్టాల్ని అమలు చేస్తుండగా అక్కడి కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. జిల్లా కార్యాలయంలో ఆరు పోస్టులుండగా వాటిలో రెండు పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వాస్తవానికి వేల సంఖ్యలో ఉన్న పరిశ్రమల తీరును పరిశీలించేందుకు కనీసం పదిమంది సిబ్బంది ఉండాల్సిందేనని రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన వివిధ సమావేశాల్లో జిల్లా పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అలాగే పరిశ్రమల శాఖ నిబంధనల్ని సడలించేందుకు, కాంపౌండింగ్ ఫీజును పెంచే విషయంలో కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించే స్వల్ప ఫీజుల విషయంలో కూడా కొంతమంది కోర్టుల్ని ఆశ్రయిస్తున్నట్టు సమాచారముందన్నారు. అయితే తాము మాత్రం వివిధ పరిశ్రమల అధికారులు, యాజమానుల్ని చైతన్యవంతం చేస్తున్నామని, నిబంధనల్ని పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నట్టు రాంబాబు పేర్కొన్నారు. ఇవీ రిజిస్ట్రేషన్ల కమామిషు 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ సెక్షన్ 2 ఎం (1) ప్రకారం విద్యుత్ వినియోగిస్తూ పదిమంది కంటే ఎక్కువ సంఖ్యలో కార్మికులతో పనిచేయిస్తుంటే దానిని ఓ పరిశ్రమగా (మ్యాన్‌ఫ్యాక్చురింగ్ యూనిట్) గుర్తించొచ్చు. అదే విధంగా విద్యుత్ వినియోగం లేకుండా 20 అంత కంటే ఎక్కువ మందితో ఉత్పత్తి చేయిస్తుంటే సెక్షన్ 2 ఎం (2) ప్రకారం ఓ పరిశ్రమగా గుర్తించొచ్చు. అయితే జిల్లాలో చాలా చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తూ పరిశ్రమలేర్పాటు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఇకపై స్పెషల్‌డ్రైవ్ ద్వారా పరిశ్రమల్ని గుర్తించేందుకు సిద్ధమయ్యామని రాంబాబు తెలిపారు. సెంట్రల్ యాక్ట్ ప్రకారం (స్పెషల్ యాక్టు కూడా) పోలీసుల సహాయం లేకుండానే ఏదైనా ఓ పరిశ్రమను తనిఖీ చేసేందుకు, నిబంధనలు ఉల్లంఘిచే వారిపై చర్యలు తీసుకునేందుకు తమకు అధికారం ఉందని స్పష్టం చేశారు. 1961 యాక్ట్ ప్రకారం మెటర్నిటీ బెనిఫిట్స్ కింద మహిళలకు సెలవుతో కూడిన వేతనం ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 ప్రకారం సంస్థ యాజమాన్యం సరైన సమయానికి జీతాలివ్వకపోయినా కార్మికులు తమను సంప్రదించవచ్చని రాంబాబు కోరారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు యంత్ర సామగ్రి పెరిగిందని, సాంకేతిక పరిజ్ఞానం భారీగా అందుబాట్లోకి రావడంతో కార్మికుల సంఖ్య తగ్గిందని అభిప్రాయపడ్డారు. అయితే భద్రతను దృష్టిలో పెట్టుకుని సెక్షన్ 7 (ఏ, డీ) ప్రకారం నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిశ్రమల్లో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో కార్మికులు, యాజమాన్యాలు, సంస్థ ఉద్యోగులు తమ ఇబ్బందుల కోసం సంప్రదించవచ్చన్నారు. -
రియల్ ఎస్టేట్‌పై లోతైన చూపు ‘భూచక్రం’
ఈ దేశంలో నేలను నమ్ముకున్న వాడికంటే నేలను అమ్ముకున్న వాడిదే ఎప్పుడూ పై చేయి కావడం ఒక పెను విషాదం. గ్రామాలు కూడా పట్టణాలుగా అవతరించాలని ఉబలాటపడుతున్న తరుణంలో నేల రియల్ ఎస్టేట్గామారిపోవటం వర్తమాన సత్యమంటారు మధురాంతకం నరేంద్ర తన ‘భూచక్రం’ నవలలో. విస్తరిస్తున్న తిరుపతి పట్టణం శివారు భూముల్ని రియల్ ఎస్టేట్‌గా మార్చుతున్న వైనంపై గతంలో ‘రెండేళ్లు పద్నాలుగు’ పేరుతో ఓ కథా సంకలనం వెలువరించారాయన. ఇందుకు తిరుపతిలో శ్రామికుల జీవనమే నేపథ్యం. దాని కొనసాగింపే ఈ ‘భూచక్రం’ నవల. ఇక్కడ కూడా తిరుపతి పట్టణమే నేపథ్యం. తిరుపతి పట్టణం అనాదిగా మఠాలకు, మఠాధిపతులకు ప్రసిద్ధి. ఒక వందేళ్ల క్రితం చిన్న ఊరుగా ఉన్న తిరుపతి ఆ ఏడుకొండల స్వామికి సమర్పణగా అనేక మంది జమీందార్లు వివిధ మఠాలకు భూములను ఇనాంగా ఇవ్వటంతో తిరుపతి పట్టణంగా ఎదిగిందన్నది ఈ నవల నిరూపించే సత్యాలలో ఒకటి. అందుకే కథనం ఈనాటి రియల్ ఎస్టేట్ వ్యవహారంతో మొదలుపెట్టి వందేళ్లు వెనక్కు వెళుతుంది. కథ నడిచే కొద్దీ మఠాధిపతులకీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకీ పెద్ద తేడా లేదని బోధపడుతుంది. ఈ చక్రవ్యూహంలో కష్టించి పని చేసే రైతు ఎప్పుడూ పరాజితుడే. అమిత్‌రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు తిరుపతిలోని మామగారి ఆస్తుల్ని విక్రయిద్దామనే కోరికతో భార్యతో కలసి తిరుపతి రావటంతో ప్రారంభమవుతుంది నవల. విక్రయం ఉన్న చోట బ్రోకర్ ఉంటాడు కనుక రియల్ ఎస్టేట్ బ్రోకర్ శేషారెడ్డి తారసపడతాడు. అమిత్ రెడ్డి, శేషారెడ్డి కలసి ఆస్తిపత్రాల వెతుకులాటలో మరో పెద్ద బ్రోకర్ వద్దకు వెళతారు. అసలు ఈ ఆస్తి ఎవరిది, అది అమిత్‌రెడ్డి మామగారి ముందు తరాలకు ఎలా సంక్రమించింది అనే గతాన్ని చెప్పటం మొదలుపెడుతుంది ఆ ఇంట్లోని వేపచెట్టు. ఇలా కథ వందేళ్ల వెనక్కు వెళ్లి పొలంగా ఉన్న భూమి ప్లాట్లుగా మారిన వైనం చూపుతుంది. ఈ క్రమంలో అనేక పాత్రలు ప్రవేశిస్తాయి. కిస్తీల పేరుతో కౌలు రైతుల్ని వేధించే మహంతులు, స్త్రీ లోలత్వాన్ని జయించలేని మహంతులు మనకు తారసపడతారు. ఆనాటి కుట్రలు. కుతంత్రాలు మన ముందు వాలతాయి. ఇంత కథా చెప్పిన వేపచెట్టును నిలువునా కూల్చడంతో నవల ముగుస్తుంది. స్త్రీ లోలత్వం, ధనకాంక్షలతో పతనావస్థకు చేరుకున్న సమాజం నేలతల్లి మీద రియల్ ఎస్టేట్ రూపంలో దండయాత్ర చేస్తోందన్నది ‘భూచక్రం’ అంతరార్థం. ఇలాంటి కాంప్లెక్స్ కథని చెప్పటంలో నైపుణ్యం కావాలి. కథనంలో ఉత్కంఠ ఉండాలి. నాటి, నేటి వాతావరణాన్ని పట్టుకోగలగాలి. ఆ నేర్పును, స్కిల్‌ను రచయిత పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తారు. శేషాచలం కొండలు, అలిపిరి దారి మార్గం, వేపచెట్టు మీద కూసే కోకిలలు, మట్టిబాటపై ధూళి మేఘాలు సృష్టించే బొగ్గు బస్సు, కదను తొక్కే వైశాఖమాసపు ఎండ, పుష్యమాసం మధ్యాహ్నం గాలులు... వీటన్నింటినీ కథనంలో జొప్పించి మార్మికతను, మాదకతను పెనవేస్తారు. ఫలితంగా పాఠకుడు ఒక పారవశ్యానికి లోనవుతాడు. పాత్రలన్నీ చిక్కని చిత్తూరు మాండలీకాన్ని అందిపుచ్చుకుంటాయి. ఇంత మంచి నవలను ముఖచిత్రం చిన్నబుచ్చకుండా ఉంటే ఇంకా బాగుండేది. - సిఎస్ రాంబాబు 9490401005 -
ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిన యువకుడి అరెస్ట్
సంగెం : మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పి, వెంటపడి ఆమెను శారీకంగా లోబరుచుకుని.. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరించిన ప్రియుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై అడ్డూరి ప్రవీణ్‌కుమార్ తెలి పారు. మండలంలోని తీగరాజుపల్లి గ్రామానికి చెందిన మోడెం కుమారస్వామి, పుష్ప మ్మ దంపతుల కూతురు శ్వేత(20)కు గవిచర్ల గ్రామానికి చెందిన గుండు సంపత్, లక్ష్మీ దం పతుల కుమారుడు రాంబాబు(22) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత ఇంటర్ వరకు చదవి వరంగల్ నగరంలో ఓ బ్యూటి పార్లల్లో పని చేస్తున్నది. రాంబాబు నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. నిత్యం వరంగల్ న గరానికి బస్సులో వచ్చివెళుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇన్నాళ్లు పెళ్లి చేసుకుంటానని న మ్మించిన రాంబాబు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరితే అందుకు నిరాకరించాడు. దీంతో శ్వేత తన బంధువులతో కలిసి నెల 5న గవిచర్లలో రాంబాబు ఇంటి ఎదుట బంధువులతో కలిసి బైఠాయించి మౌనపోరాటానికి దిగింది. తన కూతురుకు న్యాయం చేయాలని కోరు తూ శ్వేత తల్లి పుష్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు రాం బాబును సోమవారం ఆరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై వెల్లడించారు. -
ఢిల్లీకి రాజైనా... ఉల్లికి దాసుడే!
నవ్వింత ‘‘థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బును ఎలా కనిపెట్టాడో తెలుసా?’’ అకస్మాత్తుగా అడిగాడు మా రాంబాబు. ‘‘చక్కగా ధాబాలో కూర్చుని ఈ ఉల్లిగడ్డను నంజుకుంటూ పరోఠా తినాల్సిన సమయంలో మాట్లాడాల్సిన టాపికా ఇది?’’ అంటూ కాస్త చిరాకు పడ్డాన్నేను. ‘‘ఈ టైమ్‌లోనే ఎందుకంటే... పరోఠాతో పాటు ఇచ్చిన ఈ చిన్న చిన్న చిన్నుల్లి ముక్కల్ని చూశాక ఉల్లి షేపు గుర్తొచ్చింది. దాని షేపు గుర్తురాగానే ఎడిసన్గారికి కూడా ఎలక్ట్రిక్ బల్బు రూపు స్ఫురించి ఉంటుంది. దాంతో బహుశా మనవాడు అచ్చం ఉల్లిగడ్డ షేపులోనే కరెంటు బల్బుకు రూపకల్పన చేసి ఉంటాడనిపించి అలా మాట్లాడానన్నమాట. ఒక్క పరోఠాతో అనేమిటీ... ఉల్లి దోశ తోడ ఉల్లమ్ము రంజిల్లు / ఉల్లి లేక గారెకు రుచియె లేదు / తల్లి కంటే ఉల్లికి ప్రాధాన్యమందుకే / విశ్వదాభిరామ వినురవేమా! అన్నార్రా అందుకే’’ అన్నాడు రాంబాబు. ‘‘ఒరేయ్... ఈ సైన్సు విషయాలూ, ఆ తిండి పద్యాలూ ఆపేసి, హ్యాపీగా సినిమా కబుర్లు చెప్పుకుంటే సరదాగా ఉంటుందీ, తిండితో పాటూ కబుర్లలోనూ మసాలాకు మసాలా’’ అన్నాన్నేను. ‘‘అలాగే... నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ మాటకొస్తే సినిమాలకు మాత్రం... ఉల్లి చేసిన సాయం అంతా ఇంతా ఉందా? హీరో తల్లి కంటతడి పెట్టుకుంటూ ఉండి, తీరా హీరోగారు అది చూసి ఎక్కడ మనసు కష్టపెట్టుకుంటాడో అని సాకును ఉల్లిపాయ మీదకు తోసేసిన సినిమాలు ఎన్ని లేవు? అంతెందుకు... ఓ సినిమాలోనైతే... పెళ్లి చేసి పంపిస్తే తన చెల్లి ఉల్లిపాయ కోసి, కళ్లు మండేలా చేసుకుంటుందని అసలామెకు పెళ్లే చేయనంటాడు ఓ హీరో. సినిమా హీరోల తల్లి పాత్రలను దృష్టిలో పెట్టుకునే మూవీ కథ ముందుకు సాగడానికి ‘తల్లి చేసే మేలు కంటే ఉల్లి చేసే మేలే గొప్ప’ అన్న సామెత పుట్టిందేమోరా. అంతెందుకు మరో హిట్ సినిమాలో వంటింట్లో నుంచి మసాలా వాసనలు రావడం లేదు కాబట్టి హీరోయిన్ వంట చేస్తోందో లేదో అని విందుకు వచ్చిన వాళ్లు భయపడుతుంటే... హీరో వచ్చేసి ఉల్లిని సగానికి కోసి దానిపై దోమల మందు స్ప్రే చేస్తాడు. దాంతో ఘుమఘుమలాడే మసాలా వాసనలు వస్తున్నట్లు ఫీలై అతిథులు తెగ సంతృప్తిపడతారు. అదీ ఉల్లి గొప్పదనం. వంటలోనే కాదు... సినిమాలో మసాలాకూ ఉల్లి కావాల్సిందేరా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఒరేయ్ రాంబాబూ... ఎలా తిప్పి చెప్పినా మళ్లీ ఆవు కథకే వచ్చినట్లుగా ఈ ఉల్లి లొల్లి ఏమిట్రా బాబూ? వదిలేయ్... ఇంకో టాపిక్ ఏదైనా మాట్లాడు. సరదాగా హీరోలనూ, వాళ్ల తల్లులనూ, అతగాడి చెల్లెళ్లనూ వదిలేసి... హాట్‌హాట్‌గా హీరోయిన్ల గురించి మాట్లాడు. వినడానికి ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది’’ అన్నాను మళ్లీ. ‘‘అలాగేరా... నువ్వు చెప్పినట్టే హీరోయిన్స్ గురించే మాట్లాడుకుందాం. హీరోయిన్ను కళ్లప్పగించి చూసేలా చేయాలంటే, ఆడియన్స్ అందరికీ ఆమె గ్లామరస్‌గా కనిపించాలంటే ‘ఉల్లిపొర’లాంటి చీర కట్టాల్సిందే. ఆ తర్వాత ఆ చీరలో తనను వానలో తడపాల్సిందేరా. నిజానికి సమస్త తెలుగు ప్రజలందరూ పల్చటి చీరకు ఉపమానంగా ఉల్లినీ, దాని పైపొరనీ వాడారంటే... దానిపై సినిమావాళ్లతో పాటు అందరికీ ఎంత గౌరవం ఉందో చూశావా?’’ అన్నాడు రాంబాబుగాడు. ఎలాగైనా సరే... వాడు మాట్లాడే టాపిక్ మారుద్దామని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నా. అందుకే ఉల్లితో ఎలాంటి సంబంధం లేని అంశాన్ని డిస్కషన్‌కు తెద్దామనే కృతనిశ్చయంతో ‘‘ఒరేయ్... బంగారం ధర క్రమంగా తగ్గుతోందటరా! ముప్ఫయి రెండు వేలు, ముప్ఫయిమూడు వేల నుంచి దాదాపు పాతికవేలకు వచ్చేసిందట తెలుసా? మీ ఆవిడకు బంగారం కొనాలనుకుంటున్నావ్ కదా. ఇదే మంచి అవకాశం. కొనకపోయావా?’’ అంటూ వాణ్ణి టోటల్‌గా మరోవైపునకు లాక్కుపోయినట్లుగా ఫీలయ్యా. ‘‘బంగారం అంటే గుర్తొచ్చిందీ... అదంటే ఆడవాళ్లకు బలే మోజురా. అందుకే కూరలు వండేటప్పుడూ, తాలింపులు వేసేప్పుడూ ఉల్లిపాయ ముక్కల్ని బంగారు రంగుకు వచ్చేవరకూ వేయిస్తారు. అదేమిటోగానీ... బంగారం రంగు వచ్చేవరకు వేయిస్తేనే వంటకం రుచిగా ఉంటుంది. అంతకంటే మాడితే కూర టేస్టు పోతుంది. ఇలా ఉల్లికీ... వంటనూనెలలో అది బంగారు రంగు పుంజుకోడానికీ... రుచికీ ఉన్న సంబంధమేమిటో తెలియడం లేదురా. ఉల్లీ... చిల్లీ ఈ రెండూ లేకపోతే వంటే లేదురా’’ అంటూ బంగారం మార్కెట్ నుంచి తిరిగి తిరిగి మళ్లీ ఉల్లిదగ్గరికే వచ్చాడు వాడు. ‘‘ఒరేయ్... నేనో కొత్త సామెత సృష్టిద్దామనుకుంటున్నానురా. నువ్వు పొరబాటున ఢిల్లీకి రాజువైనా తల్లికి కొడుకువు అవునో కాదోగానీ, ఉల్లికి మాత్రం దాసుడివేరా’’ అన్నాన్నేను కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా. అన్నట్టు ఈ కన్నీళ్లకు కారణం ఉల్లి మాత్రం కాదు! - యాసీన్ -
రాంబాబుగాడు... వాడి వ్యక్తిత్వ వికాస పాఠాలు!
నవ్వింత ఈమధ్య మా రాంబాబు గాడు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాడు. ‘విజయానికి ఆరు మెట్లు’ చదివాడట. అయితే మెట్ల సంఖ్య ఎక్కువగా ఉందనీ, మరింత షార్ట్ కట్లో ఎవరైనా విజయానికి దారులు సూచిస్తే బాగుండేదనీ వెతుకుతున్నాడు. ‘విజయానికి రెండు మెట్లు’ అనో, ‘విజయానికి మెట్లు లేవ్!’ అనో ఇంకెవరైనా రాశారేమోనని కనుక్కుంటున్నాడు కానీ... ఇప్పటివరకు ఉన్న మెట్ల సంఖ్యలో అదే లీస్టు అని తెలిశాక నిరాశ-నిస్పృహలకు లోనయ్యాడు మనవాడు. ‘‘ఒరేయ్... పుస్తకాలు చదివితే వ్యక్తిత్వం వికసించదు. అదే జరిగితే ఒక లక్షమంది ఒకే పుస్తకాన్ని చదివి, తమ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటే... అందరి తత్వం ఒకేలా మారిపోయేది కదా! కానీ అలా కుదురుతుందా? ఆలోచించు. ఎంత చదివినా, ఏం చేసినా ఎవడి వ్యక్తిత్వం వాడిదే. సొంత ఆలోచనతో ఆయా సందర్భాల్లో ఏది మంచిదో నీ కామన్ సెన్స్‌తో నీకు నువ్వే నిర్ణయించుకోవాల్సిందే తప్ప... నీకు జీవితంలో ఎదురు కాబోయే సంఘటలను ఎవరో ఊహించి ముందుగానే రాయలేరు. సో... వికాసాన్ని చదువుతో సాధించలేం కాబట్టి విచక్షణతో మసలుకో. వివేచనతో బతుకుపో’’ అని చెప్పి చూశా. కానీ వాడు అస్సలు ఒప్పుకోలేదు. అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్న గురజాడ వారి సూక్తిని అనుసరించి ప్రస్తుతానికి వాడి పైత్యానికి వాణ్ణే వదిలేశా. అనగనగా ఓ సింహం వ్యక్తిత్వ వికాస పుస్తకాలను బాగా ఒంటబట్టించుకుందట. అది తన జూలును క్లీన్‌గా షేవ్ చేయించుకునీ, తన గోళ్లను నీట్‌గా ట్రిమ్ చేయించుకునీ... ‘తరతరాలుగా, యుగయుగాలుగా నేను నీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడమే చేస్తున్నా. ఇకపై అలాంటి దుర్మార్గాలు చేయబోన’ంటూ స్నేహపూర్వకంగా ఓ ఏనుగును పలకరిస్తూ దాని తలపెకైక్కి... ‘‘మన స్నేహానికి గుర్తుగా నీకు ‘పంజా మసాజ్’ చేస్తా’’నందట. ఒళ్లు మండిన ఏనుగు ఆ సింహాన్ని పట్టి, తొండంతో చుట్టి దూరంగా విసిరిపారేసిందట. దాంతో కుయ్యోమంటూ ఆ సింహం ‘‘స్టీఫెన్ పాలకోవా రచించిన ‘ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ యానిమల్స్’ లాంటి పుస్తకాలు నేనొక్కదాన్నే చదివితే కుదరదు. సదరు వ్యక్తిత్వ వికాస పాఠాలను ఏనుగు కూడా చదివినప్పుడే వాటికి సార్థకత’’ అని నిట్టూర్చిందట. సింహం గర్జించాలి, పులి గాండ్రించాలి. అప్పుడే వాటి వ్యక్తిత్వం వాటిదిలాగే ఉంటుంది. గర్జించాల్సిన, గాండ్రించాల్సిన జంతువులు కుయ్యోమొర్రోమంటే అడవిలో ఆర్డర్ తప్పుతుందని రాంబాబుగాడికి వివరించా. వాడిపై నా మాటల ప్రభావం కొద్దిగా పడినట్టే అనిపించింది. ఓరోజు మా రాంబాబుగాడింట్లో దొంగ దూరాడు. అర్ధరాత్రి వ్యక్తిత్వ వికాస పుస్తకం చదువుకుంటున్న రాంబాబు దొంగను సాదరంగా ఆహ్వానించాడు. దొంగతనం ఎంత తప్పో సోదాహరణంగా వివరించబోయాడు కానీ... అదంతా సోదిలా అనిపించడంతో సదరు దొంగ రాంబాబు బుర్రపై రామకీర్తనలతో సహా అనేక పాటలను ఏకకాలంలో పలికించి, చేతికందిన వస్తువుల్ని చక్కా పట్టుకుపోయాడు. ‘‘దొంగను చూడగానే పోలీసులకు ఫోన్ చేయాలి, లేదా అరుస్తూ, ఇరుగుపొరుగింటి వాళ్లను పిలుస్తూ హడావుడి చేసి వాణ్ణి పట్టుకునే మార్గం చూడాలిగానీ... ఎవడైనా దొంగకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతారా...?’’అని నేను కోప్పడబోతే... సదరు దొంగ సరిగా ప్రవర్తించకపోవడానికి కారణం వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చదవకపోవడమేననీ, అదేగానీ వాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చదివి ఉంటే తప్పక తన ఉపదేశాలు విని బాగుపడేవాడని బాధపడ్డాడు మా రాంబాబు. ఓరోజున మా రాంబాబు ‘హౌ టు విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్’ అనే డేల్ కార్నెగీ పుస్తకాన్ని తదేక దీక్షతో చదువుతూ ఉండగా నేను వాడింటికి వెళ్లా. ‘‘ఒరేయ్ రాంబాబూ! ఫ్రెండ్స్‌ను గెలవడం ఏమిట్రా? స్నేహితుడంటే వాడేమైనా నీ ప్రత్యర్థా, పగవాడా, పొరుగింటి తగాదాకోరా? నీ ఫ్రెండ్ అంటే నీలోని బలహీనతలనూ, బలాలనూ సమానంగా స్వీకరించి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నింటినీ స్వీకరించేవాడు. నీకు మానసికమైన తోడు. అలాంటి నీ స్నేహితులను ఓడించాల్సిన లేదా గెలవాల్సిన అవసరం ఎందుకొస్తుంది. కాస్త ఆలోచించు’’ అంటూ కౌన్సెలింగ్ చేశా. అలాగే పతంజలి రాసిన ‘‘గెలుపుసరే బతకడం ఎలా?’’ పుస్తకంతో పాటూ, మరికొన్ని రావిశాస్త్రిగారి పుస్తకాల్నీ ఇచ్చా. వ్యక్తిత్వ వికాసం అంటే లోకజ్ఞానం కలిగి ఉండటమని, వ్యక్తిత్వవికాసం పేరిట అందరూ యూనిఫామ్ వేసుకున్నట్లు మూసగా ఉండటం లోపమే కదా! కాబట్టి ఆ పేరుతో లోపజ్ఞానం కలిగి ఉండటం కాదని చెప్పా. ఇలా మా రాంబాబుగాడి రెట‘మత మార్పిడి’ కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఒక బృహద్కృత్యానికి పూనుకున్నా. చూద్దాం ఏమంటాడో వాడు. - యాసీన్ -
రైట్ రూట్ రాంబాబు
పావుగంట సాగే పొట్టి సినిమా.. చిట్టి సందేశం చెబితే చాలనుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా రాంబాబు కాస్త వెరైటీగా ఆలోచించాడు. 15 నిమిషాల్లో ఫీచర్ ఫిలింలో ఉన్న అన్ని ఫ్రేమ్స్ చూపించాలనుకున్నాడు. వెంటనే మంచి కథను ఎంచుకుని.. పెద్ద సినిమా ఎలిమెంట్స్ అన్నింటినీ జొప్పించి షార్ట్ ఫిల్మ్‌గా మలచి అందరినీ మెప్పించాడు. ఒక ప్రేమ కథను సామాజిక కోణంలో చూపిస్తూ రాంబాబు తీసిన చిత్రమే ‘రాంబాబు ఎమ్మెల్యే’. ఇందులో ఎమ్మెల్యే- మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ, మరో ఎమ్మెల్యే- మంచి లక్షణాలున్న అబ్బాయికి మధ్య జరిగే కథ ఈ సినిమా. ఒక జంట ప్రేమ వ్యవహారం నుంచి సమాజంలో నెలకొన్న లంచం, నిరుద్యోగం లాంటి అనేక అంశాలను ఈ సినిమా స్పృశించింది. ఆరు గంటల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. బెస్ట్ ఆఫ్ ఫస్ట్ ‘పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా సినిమా తీయాలనే ఆలోచన రాలేదు. షార్ట్ ఫిలింస్ చూసినపుడు మాత్రం మంచి కాన్సెప్ట్‌తో ఒక్క పొట్టి పిక్చర్ తీయాలనిపించింది. అదే సమయంలో దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా షార్ట్ ఫిలిం కాంపిటీషన్ నిర్వహించారు. అది ఎన్నికల సీజన్ కూడా కావడంతో.. ఎన్నికలకు ముడిపెడుతూ సాగే ఈ కథను ఎంచుకున్నానని, అన్నారు రాంబాబు. గీత మార్చిన రాత కొన్ని సీరియల్స్‌కు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసిన రాంబాబు చిన్నప్పటి నుంచి కథలు రాసేవాడు. ‘పదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాను. బిర్లా ప్లానిటోరియం దగ్గర ఉద్యోగం చేసుకునేవాడిని. ఓసారి అక్కడ ఓ టెలి యాడ్ షూటింగ్ జరుగుతోంది. అది చూసిన నాకు.. ఆ కాన్సెప్ట్ నచ్చక.. ఇది ఇలా చేస్తే బాగుంటుందని వారికి సూచించాను. వారు పేపర్ మీద రాయమన్నారు. నాకు యాడ్ మేకింగ్, స్క్రీన్‌ప్లే అంటే ఏంటో తెలియదు. నేననుకున్నది పేపర్ మీద రాసిచ్చాను. ఆ షూటింగ్ నిర్వహిస్తున్న చంద్ర మేడం అది చూసి తర్వాత నాకు నాలుగు యాడ్స్‌లో రాసే అవకాశం కల్పించారు. అంతేకాదు ఒక చోట అసిస్టెంట్‌గా కూడా చేర్పించార’ని తన ప్రస్థానాన్ని వివరించారు రాంబాబు. కళ -
జిల్లాలో 34 డెంగీ కేసులు
దమ్మపేట/ములకలపల్లి: జిల్లాలో ఇప్పటివరకు 34 డెంగీ కేసులు నమోదయ్యాయని, మరణాలు మాత్రం సంభవించలేదని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ములకలపల్లి మండలంలోని మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..జ్వరం వచ్చిన 24 గంటల వ్యవధిలోనే మలేరియా టెస్ట్ చేయించాలన్నారు. డెంగీ జ్వరమొస్తే 105, 106 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, వరుసగా ఐదు రోజులపాటు జ్వరమొస్తే డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల కోసం ఏడు లక్షల డెంగీ పరీక్ష (ఆర్డీటీ) కిట్లు వచ్చాయని, మలేరియా నివారణకు ఈమాల్ ఇంజెక్షన్లు అందుబాటలో ఉన్నాయని తెలిపారు. ఏజ్వరమొచ్చినా ప్లేట్లెట్లు తగ్గుతాయని, కంగారు చెందొద్దని తెలిపారు. 50వేలకుపైగా ప్లేట్లెట్లు తగ్గితేనే కొత్తగా ఎక్కించాల్సి ఉంటుందన్నారు. రూ.30 లక్షలతో మొదటి విడత 959 గ్రామాల్లో, రెండో విడత 600 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేసినట్లు వివరించారు. ఆయన వెంట స్థానిక వైద్యాధికారి గోపాల్, హెచ్ఈఓ వెంకటేశ్వరరావు, సిబ్బంది వున్నారు. గిరిజన గురుకుల పాఠశాల సందర్శన.. దమ్మపేటలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబు సందర్శించారు. పాఠశాల విద్యార్థి నరేందర్ డెంగీ జ్వరంతో చనిపోలేదని తెలిపారు. ఎలా చనిపోయాడనేది మమత ఆస్పత్రి నుంచి నింవేదిక రావాల్సి ఉందని తెలిపారు. పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు. ఆయన వంఎట వైద్య, ఆరోగ్యశాఖ సత్తుపల్లి క్లష్టర్ ఇన్చార్జ్ భాస్కర్‌నాయక్, దమ్మపేట వైద్యాధికారి కిషోర్, రామారావు ఉన్నారు. -
రాంబాబు రుబాబేంది!
సీనియర్ అసిస్టెంట్ రాంబాబు సస్పెన్షన్ కర్నూలు(అగ్రికల్చర్): పత్తికొండ ఏడీఏ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాంబాబును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ విజయమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ మృతిపై ఆదోని ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. పత్తికొండ ఏడీఏ కార్యాలయంలో ఏడాది నుంచి ఏమి జరుగుతుందనే అంశంపై కూడా విచారణ జరపాలని ఏజేసీ అశోక్‌కుమార్, జేడీఏ ఠాగూర్‌నాయక్‌ను ఆదేశించారు. విచారణ రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటారు. మురళీధర్ అంత్యక్రియల నిర్వహణకు రూ.10వేలు అందజేశారు. జాతీయ ఆహారభద్రత మిషన్ ఇంట్రెస్ట్ అమౌంట్ నుంచి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. శనివారంలోగా వ్యవసాయాధికారులకు పెండింగ్ జీతాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జేడీఏ ఠాగూర్‌నాయక్ హామీ ఇచ్చారు. కర్నూలు(అగ్రికల్చర్): ఆ కార్యాలయంలో ఆయనదే పెత్తనం. సార్ తలుచుకుంటే ఏ పనైనా జరిగిపోవాల్సిందే. పైస్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులందరు సీనియర్ అసిస్టెంట్‌కు లోకువే. తన మాట వినలేదని ఏకంగా 20 మంది ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు అందకుండా అడ్డుకున్న ఘనుడు ఆ పెద్ద మనిషి. పత్తికొండ ఏడీఏ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాంబాబు ఆగడాలకు అంతే లేకుండా పోయింది. అక్కడ తాను చెప్పిందే వేదం అన్నట్లు మోనార్క్‌లా వ్యవహరిస్తున్నాడు.ఆయన వేధింపులు తాళలేక సోమవారం కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ కర్నూలు కలెక్టలేట్ కార్యాలయ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలుగా సిబ్బందికి అందని వేతనాలు.. పత్తికొండ డివిజన్ వ్యవసాయ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాంబాబు తీరుతో డివిజన్లో పనిచేస్తున్న 20 ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు జీతాలు రావడం పది రోజులు ఆలస్యమైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాంటిది నెలలు తరబడి వేతనాలు అందకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరమే. జీతాలు లేకపోగా పెపైచ్చు వేధింపులు కూడా అధికం కావడంతో భరించలేకనే జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కారణంగా నలుగురు వ్యవసాయాధికారులు, 12 మంది ఏఈ ఓలు, ఇద్దరు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఒక అటెండర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2013 నవంబర్‌లో రుక్సానా అనే మహిళ ఏఈఓగా ఉద్యోగంలో చేరింది. ఆమెకు ఇంతవరకు జీతాలు లేవు. జిలానీ బాషా అనే ఏఈఓ గతేడాది జూన్‌లో బదిలీపై పత్తికొండకు వెళ్లాడు. ఈయనకు పది నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. అటెండర్‌కు ఏడు నెలలుగా జీతా లు లేవు. ఉద్యోగుల సర్వీస్ రిజిష్టర్లు ఇతర కీలకమైన రికార్డులు తన కంట్రోల్లో పెట్టుకునేవారు. ఏడీఏ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పని రాంబాబు.. నాలుగు నెలల క్రితం పత్తికొండ ఏడీఏగా పని చేసిన నారాయణ నాయక్‌ను సరెండర్ చేసిన తర్వాత దేవనకొండ ఏఓ శేషాద్రికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే సీనియర్ అసిస్టెంటు రాంబాబు శేషాద్రికి ఇంతవరకు చార్జ్ ఇవ్వలేదు. ఆయనతీరుతో మనస్తాపానికి గురైన శేషాద్రి పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మూడు నాలుగు నెలల క్రితం సీనియర్ అసిస్టెంట్ రాంబాబును సస్పెండ్ చేయాలని జేడీఏ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు సిఫారసు చేసినా ఫలితం లేదు. జూనియర్ అసిస్టెంట్ మరణం కలచివేసింది: శేషాద్రి, ఇన్చార్జ్ ఏడీఏ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ అకాల మరణం కలచి వేసింది. నాలుగు నెలల క్రితం నాకు ఇన్చార్జ్ ఏడీఏగా బాధ్యతలు ఇచ్చారు. అయితే సీనియర్ అసిస్టెంట్ రాంబాబు చార్జ్ ఇవ్వలేదు. నువ్వు వ్యవసాయ అధికారివి మాత్రమే... నీకు ఎలా ఏడీఏ బాధ్యతలు ఇస్తారంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. చార్జీ ఇవ్వనందుకే పత్తికొండకు వెళ్లి విధులు నిర్వహించడం లేదు. నాకు కూడా ఆరు నెలలుగా జీతాలు లేవు. -
పొట్ట పట్టా పొందితే వాడిక పొట్టభద్రుడే!
నవ్వింత మా రాంబాబు పరమ రెటమతస్తుడని తెలుసు. వాడిలోని పిడివాది ఇంత ఉద్ధృతంగా ఉంటాడన్న విషయం, వాడికి ఓ సలహా ఇచ్చేదాకా నాకు తెలియరాలేదు. ‘‘ఒరే రాంబాబూ... పొట్ట కాస్త ముందుకొస్తున్నట్టుంది. కాస్త ఏ వాకింగో, ఎక్సర్సైజో చేయ్‌రా బాబూ’’ అన్నా. అంతే! నన్ను సెక్షన్ నుంచి క్యాంటిన్‌కు తీసుకెళ్లి, చూపించాడు విశ్వరూపం. ‘‘అన్నానికి, దేహానికి జరిగిన ఓ సమరంలో/ అరగడానికీ పెరగడానికీ మధ్యన సంగ్రామంలో/ బెల్టు కట్టుకీ కట్టుబడనిదీ పొట్ట / బస్కీలకూ మెల్టుకానిదీ పొట్ట/ ఇది ఆ దైవమే ఇచ్చిన పొట్టా... అది పెరిగితే తప్పా... తప్పా... తప్పా... నో... నెవర్ ’’ అంటూ సాక్షాత్తూ గ్యాస్ట్రిక్ చౌదరి అవతారం ఎత్తేశాడు. ‘‘ఒరే... ఒరే... తెలీక సలహా ఇచ్చా. వదిలెయ్...’’ అని ప్రాధేయపడితే ఉగ్రావతారం విరమించినా శాంతావతారంలోకి వచ్చే ముందు మరికాసేపు ఆవేశపడ్డాడు. ‘‘ఒరేయ్... పొట్ట కాస్త పెరగ్గానే ప్రతివాడూ సలహాలిచ్చేవాడే. అసలు పొట్టా... దాని మహత్యమేమిటో తెల్సా?’’ ‘‘తర్వాత చెబుదువుగానీ’’ అంటూ తప్పించుకోడానికి చూశాగానీ... నేనే తెచ్చుకున్న తంటా కాబట్టి వీలు కాలేదు. ‘‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు అనే వాడుక మాట విన్నావా? పోనీ వాడికి డొక్కశుద్ధి ఉందండీ అనే నానుడి? మన పూర్వపు రోజుల్లో పొట్ట విజ్ఞానానికి చిహ్నంగా ఉండేదని తెలియడం లేదూ! క్రమంగా అక్షరాలూ, విజ్ఞానం మెదడులో ఉంటాయని ఆధునిక విజ్ఞానశాస్త్రం తేల్చింది కాబట్టి క్రమంగా జ్ఞానానికి పొట్టే కేంద్రమన్న పాత సిద్ధాంతం కొట్టుకుపోయి బ్రెయిన్ సెంట్రిక్ సిద్ధాంతం వచ్చింది. భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మే వాళ్లలా నేనూ ఇప్పటికీ పొట్టే జ్ఞానానికి కేంద్రమనీ, దాన్ని నింపుకోవడం వల్లనే జ్ఞానం వృద్ధి అవుతుందనీ నమ్ముతున్నా.’’ అన్నాడు. ‘‘సరే సరే... ఇకపై నేనూ నమ్మడానికి ప్రయత్నిస్తాన్లే’’ అంటూ వాడిని శాంతపరచడానికి మళ్లీ విఫలయత్నం చేశా. ‘‘పెరిగిన పొట్ట ఒక విజ్ఞానభాండాగారమే కాదు... అది ఒక కళారూపం’’ ‘‘పొట్ట కళారూపం ఏమిట్రా? నీకు మతిగానీ పోయిందా?’’ ‘‘పొట్టపెరిగిన వాణ్ణి ఎప్పుడైనా చూశావా? అంతకుముందు వాడెప్పుడూ తన పొట్టను తానే గమనించడు. కానీ పొట్టంటూ పెరిగాక వాడిలోని ఘటవాద్యకారుడు బయటికి వచ్చేస్తాడు. వేళ్లతో, చేతులతో దానిపై దరువేస్తూ అప్పటివరకూ తనలో నిశ్శబ్దంగా నిబిడీకృతమై ఉన్న అంతర్గత కళాకారుణ్ని బయటకు తీస్తాడు. అలాంటి పొట్ట మీద అనవసరంగా కామెంట్లు చేసి కళాకారుడు పుట్టకముందే వాడిలోని ప్రతిభను దయచేసి తొక్కేయకండ్రా. ప్లీజ్’’ అన్నాడు. ‘‘నీ పొట్టలాగే నీకు మరీ జ్ఞానం కూడా పెరిగి అది వెర్రితలలు వేస్తోంది’’ అంటూ కాస్త కేకలేయబోయా. ‘‘డొక్క చించి డోలు కట్టడం అన్న వాడుక ఎప్పుడైనా విన్నావా, లేదా? అంటే ఏమిటీ? డొక్కలో ఘటవాద్యం, డోలూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డొక్కకూ, డోలుకూ సంబంధం ఉంది కాబట్టే ఆ సామెత పుట్టింది. ఇన్ని తార్కాణాలూ, దృష్టాంతాలూ ఉన్నా అజ్ఞానులు నమ్మర్రా. అంతెందుకు ఎవడైనా బాగుపడటానికి కారణం వాడి పొట్టే’’ ‘‘బాగుపడటానికీ పొట్టకూ సంబంధం ఏమిట్రా రాంబాబూ?’’ ‘‘ఎవడైనా బాగుపడాలనుకుంటే వాడు పొట్టచేతపట్టుకుని పోయి, పొట్ట తిప్పలు పడి పొట్టపోసుకుంటాడు. ఇలాంటివాడే జీవితంలో పైకొస్తాడు. బాగుపడేవాళ్ల పొట్ట కొట్టకండ్రా ప్లీజ్’’ అన్నాడు మళ్లీ ఆవేశం పెంచుకుంటూ. ‘‘ఒరే నువ్వొక్కడివే పొట్టను ఇలా వెనకేసుకొస్తున్నావ్. ఆరోగ్యానికి పొట్ట అంత మంచిది కాదు తెల్సా?’’ ‘‘నాకు చెప్పకు. పొట్ట ఉంటే టక్కు బాగా కుదుర్తుందని చిరుపొట్టకోసం చాలామంది యూత్ ఏవేవో ప్రయాసలు పడతారు. నువ్వెప్పుడైనా పొట్టగలవాడు మోటార్‌సైకిల్ నడుపుతుంటే చూశావా? బండి పెట్రోల్ ట్యాంకు మీద ఓ కుండను జాగ్రత్తగా పెట్టుకుని, కాళ్లూ చేతుల మధ్య దాన్ని దొర్లిపోకుండా ఉంచుకున్నట్లుగా వెళ్తుంటారా పొట్టగలవాళ్లూ! అంతెందుకు వయసు పెరుగున్నకొద్దీ ఏ చదువూ, ఏ డిగ్రీలూ లేకుండానే లోకమనే ఈ విశ్వవిద్యాలయంలో ఒక పరిణతి చెందిన డిగ్రీ ఇచ్చి ఒకణ్ణి పొట్టభద్రుణ్ణి చేస్తుందిరా ఈ జీవితం. కాబట్టి దాన్ని కించపరచకు. వాకింగులంటూ, వ్యాయామాలంటూ సలహాలిచ్చి ఎవ్వడి పొట్టనూ పొట్టనబెట్టుకోకు’’ అంటూ వార్నింగిచ్చాడు మా రాంబాబుగాడు. రాంబాబు ధోరణేమిటి ఇలా పెడసరంగా ఉంది చెప్మా అంటూ కాస్త వాకబు చేశాక విషయం తెలిసింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గలేదట వాడికి. అందుకే ఇలా సమర్థింపుల్లోకి దిగాడట. కొంతమంది అంతే... ఏదైనా వదిలించుకోవడం కుదరకపోతే అదే ఎస్సెట్టంటూ ఎదురుదాడికి దిగుతారు. బట్టతల తప్పదని తెలిశాక దాన్ని సమర్థిస్తూ మాట్లాడినట్టు. వాడూ ఇదే బాపతు. ఏం చేస్తాం. ఎంతైనా మా ఫ్రెండు కదా. వాడి గురించి ఎవడికైనా చెబుదామని అనిపించినా... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని సెలైంటయిపోయా. - యాసీన్ -
తీరంలో ఘోరాలు
చీరాల : వాడరేవు తీర ప్రాంతం నేరాలకు కేంద్రమైంది. గతంలో కొందరు యువకులు వాడరేవుకు వచ్చే ప్రేమికులు, భార్యాభర్తలపై దాడులకు పాల్పడి తీరం వెంట ఉంటే సరుగుడు తోటల్లోకి తీసుకెళ్లి మహిళలపై సామూహిక లైంగికదాడులకు పాల్పడేవారు. కళాశాలలకు చెందిన విద్యార్థినులపై వరుస లైంగికదాడుల ఘటనలు జరగడంతో చివర్లో స్పందించిన పోలీసులు.. లైంగికదాడులకు పాల్పడుతున్న కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కొద్ది నెలలు అటువంటి ఘటనలు జరగలేదు. మళ్లీ కొద్ది రోజులుగా పాత ఘటనలు పునరావృతం అవుతున్నాయి. గత శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 25 ఏళ్ల మహిళ భయంతో పరుగులు తీసకుంటూ రొప్పుతూ వాడరేవు గ్రామంలోకి వచ్చింది. స్థానికులు వచ్చి ఏం జరిగింది? ఎందుకు పరుగెడుతున్నావంటూ ఆమెను ప్రశ్నించడంతో తనతో పాటు వచ్చిన అమ్మాయిని చంపేశారంటూ.. ఏడుస్తూ చీరాల బస్సు ఎక్కింది. కొందరు నెమ్మదిగా ప్రశ్నించగా ఆమె కొన్ని వివరాలు చెప్పి వెళ్లింది. ఉదయం 6 గంటలకు ఇద్దరం కలిసి వచ్చామని, గెస్ట్‌హౌస్ పక్కన ఉన్న సరుగుడు తోటలో ఉండగా కొంతమంది వచ్చి లైంగికదాడికి పాల్పడి తనతో పాటు వచ్చిన మరో అమ్మాయిని చంపేశారని, తనను కూడా చంపాలని చూడగా వారి నుంచి తప్పించుకుని వచ్చినట్లు గ్రామస్తులతో చెప్పింది. 20 రోజుల క్రితం అదే తోటలో ఒక అమ్మాయి హత్యకు గురైందనే ప్రచారం వాడరేవులో జరిగింది. తీరం వెంట ఉండే తోటలు గుబురుగా ఉంటాయి. ప్రేమ జంటలు, ఇతర మహిళలు తీరానికి వచ్చి ఆ తోటల్లోకి వెళ్తుంటారు. ముందు నుంచే కొందరు వారిని అనుసరిస్తూ తోటల వద్దకు వెళ్లగానే అత్యాచారాలకు పాల్పడుతుంటారు. వారి వద్ద ఉండే నగలు, నగదు, సెల్ఫోన్లు దోచుకుంటారు. ఈ తరహా సంఘటనలు అనేకం జరిగాయి. వాడరేవు తీరానికి చుట్టు పక్కల ఉండే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అలా వచ్చి తోటల్లోకి వెళ్లినవారిపై ఆంగతకులు మాటువేసి సామూహిక లైంగికదాడులకు పాల్పడుతుంటారు. గత శుక్రవారం తనతో పాటు వచ్చిన మహిళలను చంపేశారని మరో మహిళ పరుగులు పెడుతూ గ్రామస్తులకు చెప్పడంతో తీరంలో మళ్లీ ఘోరాలు జరుగుతున్నాయని అర్థమైంది. లైంగికదాడులు జరిగిన సమయాల్లో పోలీసులు తీరం వెంట నిఘా పెడుతున్నా అవి కొద్దిరోజులకే పరిమితమవుతున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు పొక్కి అన్ని విధాల పరువు పోతుందని భయంతో మౌనంగానే వెనుతిరుగుతున్నారు. ఈ విషయంపై రూరల్ ఎస్సై రాంబాబును వివరణ కోరగా మహిళ హత్యకు గురైనట్లు సమాచారం అందిందని చెప్పారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ మృతదేహం కనిపించలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు వస్తే విచారిస్తామని ఎస్సై వివరించారు. -
నవ్వింత: చెట్నీస్ అండ్ చెనెక్కాయాస్!
‘‘ఏమిటోరా... న్యాయానికి రోజులు కావివి’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ఎందుకురా?’’ అన్నాన్నేను. ‘‘ఎందుకేమిట్రా... రుచి అంతా చట్నీది. దానికి కారణమైన పల్లీలదీ. కానీ ఆ గొప్పదనం దక్కేది ఇడ్లీకి. ఫలానా హోటల్లో ఇడ్లీ బాగుందంటారుగానీ... చెట్నీ గురించి ఎవడూ మాట్లాడడు. ఈ లోకం తీరే అంత’’ అంటూ నిట్టూర్చాడు.‘‘ఏంట్రా నీ చెట్నీస్ అండ్ చెనెక్కాయాస్ గొడవ?’’ అడిగా. ‘‘కష్టపడేదొకరు, క్రెడిట్టు మరొకరిది’’ ‘‘ఛ... అలాగెందుకు జరుగుతుందిలే. నువ్వు మరీనూ’’ ‘‘ఇప్పుడూ... క్రికెట్టు చూడు. ఒకడు కిందా మీదా పడి క్యాచుపడతాడు. ఒళ్లు దోక్కుపోయేలా కిందపడతాడు. కిరీటం మాత్రం బౌలర్ నెత్తిన పెడతారు. క్యాచేమో వీడు పట్టడమేంటీ? బౌలర్గాడు ఆ ఘనతంతా తనదే అన్నట్లుగా ఆ గొప్పను తన ఖాతాలో వేసుకుని గాల్లో ఆ సోడాలు కొట్టడమేంటీ? ఇడ్లీ దాదాపుగా అన్ని చోట్లా ఒకేలా ఉంటుంది. ఏదైనా హోటల్లో ఇడ్లీ బాగుందని పేరొచ్చిందంటే అక్కడ ఉండే చట్నీ బాగా ఉన్నట్టు లెక్క. అయినా ఎవ్వరూ చట్నీ ఔన్నత్యాన్ని గుర్తించరు. చట్నీ అయితేనేం... దాని మూలమైన చెనెక్కాయ అయితేనేం... క్రెడిట్టునంతా ఇడ్లీకి త్యాగం చేసేసి తాను ప్రేమించిన హీరోను... వాడు ప్రేమించిన హీరోయిన్‌కు కట్టబెట్టేసిన పోజుతో నిశ్శబ్దంగా హొరైజన్లోకి వెళ్లిపోతుందిరా పాపం పల్లికాయ’’ ‘‘కావాలనుకుంటే వేపుకుని మెక్కు. లేదా ఉడకబెట్టుకొని బొక్కు. అంతేగానీ... ప్రతిదానికీ పటం గట్టేసి దానికి లేనిపోని గొప్పలు ఆపాదిస్తావేమిట్రా నువ్వు’’ అని చిరాకు పడ్డాన్నేను. ‘‘లేని గొప్పలు కాదురా... పల్లీలకు ఉన్న గొప్ప అంతా ఇంతా కాదు. అసలు ప్రేమికులు పార్కులో పల్లీలే ఎందుకు తింటారంటావ్? ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవేమోగానీ... ఒక్క తొక్కలో రెండు పిక్కలు ఇముడుతాయి. అంటే ఏమిటన్నమాట.... ఒక్క అఫైర్లోని ఇద్దరు లవర్స్‌ను సింబాలిగ్గా చూపుతుంది పల్లీకాయ. కాబట్టే ప్రేమికులంతా పార్కులో పల్లీలు తింటారు. లవర్స్ ఏమి తిన్నా తినకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ఒక పల్లీని ఒలుచుకుని చెరో గింజా తినే ఉంటారు. ఒకే స్ట్రాతో రెండు కూల్‌డ్రింక్స్ తాగిన ఫీలింగు పెట్టే ఉంటారు. నిజానికి కూల్‌డ్రింక్ కంటే పల్లీ చాలా చీపూ, పైగా తినొచ్చు చాలా సేపు. ఇప్పటికి నడిచిన ప్రేమకథలనన్నింటినీ లెక్కేస్తే వాటన్నింటిలోనూ ప్రేమికుల నాలుకలపై నాట్యమాడిన పల్లీల సంఖ్య కొన్ని కోట్ల టన్నులుంటుందిరా. ఇదీ పల్లీల ప్రేమ ఫిలాసఫీ’’ ‘‘మరి అదేంట్రా... ఎవరిదైనా జీతం తక్కువగా ఉంటే... ఆ.. వాడికొచ్చేదేముంది పీనట్స్ అంటూ పల్లీలను తీసిపారేస్తారేంట్రా?’’ ‘‘అజ్ఞానం కొద్దీ కొందరు అలా చేస్తారుగానీ... పీనట్స్ అంటే ఏమనుకున్నావు. అరకును పేదవాడి ఊటీ అన్నట్టూ... కుండను పేదవాడి ఫ్రిజ్జు అన్నట్టు నిజానికి పల్లీలను పేదవాడి జీడిపప్పు అనాల్రా. గొప్పవాళ్లు జీడిపప్పు వాడే ప్రతిచోటా సామాన్యుడు వేరుసెనగపప్పు వాడతాడంటే వాటి గొప్పతనం ఏమిటో... అవి వేటికి ప్రత్యామ్నాయమో నీకు అర్థం కావడం లేదూ? పైగా జీడిపప్పుకు లేని జాలిగుండె పల్లీలకుంటుంది’’ ‘‘పోను పోనూ నీకు మతిపోతోందిరా రాంబాబూ... పల్లీలకు జాలేమిట్రా?’’ ‘‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుందో కాదోగానీ... అతిథులెక్కువైతే పల్లీకాయ జాలితో కరిగినీరవుతుంది. ఫలితంగా పల్లీచెట్నీ పలచబారుతుంది. అదేగానీ ఎవరైనా వీఐపీగారు టిఫినుకు వస్తే వారి గొప్పదనానికి, గట్టిదనానికీ అనులోమానుపాతంగా సదరు మహనీయుడికి గట్టిచెట్నీ భాగ్యం దక్కుతుంది. అంతటి ‘బీజ’గణితముంది పల్లీల్లో. అందుకే వేరుశెనగ తీరే వేరు. ఇంత లెక్క ఉన్నా సరే... అది మాత్రం చెట్టుకొమ్మలకెక్కి నిక్కి నీలగకుండా... నిశ్శబ్దంగా భూమిలోపలే తన పొట్టు వల్మీకంలో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. దాని వినయాన్ని వర్ణించాలంటే డౌన్ టు ఎర్త్ అనే మాట కూడా చాలదురా... డౌన్ బిలో ద ఎర్త్ అనాలి. ఓ నిశ్శబ్ద నిర్వికల్ప నీరవ సమాధిలో జీవాన్ని నింపుకుని భూమికింద మనుగడ సాగిస్తూ పీకేవరకూ ఒకలాంటి ధ్యానంలో ఉంటుందిరా ఆ మహాగింజ’’ ‘‘ఏమోరా రాంబాబూ... అందరూ పల్లీలో రుచిని మాత్రమే చూస్తారు. నువ్వు మాత్రం ఇంకా ఏమేమో చూస్తావు... అయినా తినాల్సినవి తింటే అందంగానీ... ఇలా అర్థం లేకుండా పొగుడుకుంటే లాభమేముందిరా...’’ ‘‘నేనేం పొగిడానురా... చంద్రుని మీదికి కాలుమోపాలని వెళ్లిన బృందంలోని అలెన్ షెపర్డ్ అనే ఆస్ట్రోనాట్ ఒకాయన వేరుశెనక్కాయల రుచిని వదల్లేక... వాటిని చంద్రుని మీదికి కూడా తీసుకెళ్లాడు. చంద్రుని మీద కూడా కాలుమోపిన ఒకే ఒక గింజరా వేరుశెనక్కాయ! అలా ఆ గింజను తీసుకెళ్లిన ఆ మహనీయుడు ఇకపై తనను ఆస్ట్రోనాట్ అనొద్దనీ, ఆస్ట్రో‘నట్’ అనాలనీ కోరాడట. ఆ మహనీయుడితో పోలిస్తే నేనెంతరా!’’ అంటూ ఎప్పటిలాగే తన వినయగుణాన్ని చాటుకున్నాడు మా రాంబాబుగాడు. - యాసీన్ -
రాంబాబుకు కన్నీటి వీడ్కోలు
మోతె: హిమాచల్‌ప్రదేశ్‌లో విహారయాత్రకు వెళ్లి నదిలో పడి మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థి బానోతు రాంబాబుకు ఆయన స్వగ్రామమైన మోతె మండలం భీక్యాతండాలో మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. రాంబాబు మృతదేహం మంగళవారం తెల్లవారుజామున తీసుకువచ్చారు. ఈ విష యం తెలిసిన వెంటనే గ్రామస్తులతో పాటు మృతుని బంధువులు, మిత్రులు, పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం ఉదయం 9గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. రాంబాబు మృతదేహానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాంబాబు మృతికి కారణమైన హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించి మృతుని కుటుం బానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాంబాబు అంతిమయాత్రలో టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, జెడ్పీటీసీ సభ్యురాలు శీలం ఉమాసైదులు, మోతె మండల కాంగ్రెస్ నాయకులు ఆరె లింగారెడ్డి, గట్టికొప్పుల వీరారెడ్డి, మాతృనాయక్, పి పుల్లారావు, చిన వెంకటరెడ్డి, ఆర్కె నాయక్ గురుకృష్ణ, చంద్రునాయక్, స్వామినాయక్, నర్సింహనాయక్, వీరన్న నాయక్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, మైనంపాటి ప్రభాకర్‌రెడ్డి, కామళ్ల కోట య్య, ఉన్నం సత్యనారాయణరావు, కోట రాంరెడ్డి, మహేష్, హరిబాబు, కృష్ణ, ప్రసాద్, ఇన్చార్జి తహసీల్దార్ హుస్సేన్, ఆర్ఐ శైలజ, గ్రామ సర్పంచ్ గౌని రమణగోపాల్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. -
మలేరియా నివారణకు చర్యలు
కూనవరం: జిల్లాలో మలేరియా నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని డీఎంఓ రాంబాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని క్లస్టర్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 959 హ్యాబిటేషన్లలో యుద్ధప్రాతిపదికన స్ప్రేయింగ్ పనులు చేపట్టనున్నామని అన్నారు. జ్వరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మలేరియా జ్వరంగా నిర్ధారణ అయితే వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స పొందాలని సూచించారు. ప్రతి బుధవారం, శనివారం ఇమ్యూనైజేషన్ రోజుల్లో మలేరియా డే నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. మలేరియా నివారణకు సంబంధించి వైద్యాధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, మలేరియా కిట్స్, మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దోమ తెరలకు ప్రతిపాదనలు.. మలేరియా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాకు 3.50లక్షల దోమ తెరలు అవసరం ఉందని, ఆ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని డీఎంఓ తెలిపారు. అవి రాగానే మారుమూల గ్రామాల్లో పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతీ పీహెచ్సీ పరిధిలో నెట్వర్క్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, ఆశా వర్కర్లకు మొబైల్ ఫోన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఏరియాలో హెల్త్‌అసిస్టెంట్, వైద్యసిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. 1-5 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణిల్లో రిస్క్ కేసులు, మలేరియా పాజిటివ్ కేసులు ఉంటే తక్షణం చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గోదావరి వరదల సమయంలో ప్రత్యేకంగా వైద్యసిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కూనవరం క్లస్టర్ ఆస్పత్రి పరిధిలో 106 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఘరానా దొంగ అరెస్ట్
నక్సలైట్ పేరుతో కిడ్నాప్‌లు, దొంగతనాలు తొలుత రియల్గన్తో... ప్రస్తుతం ఏయిర్గన్తో నిందితుడిపై 30కి పైగా కేసులు నమోదు చాకచక్యంగా పట్టుకున్న కేసముద్రం పోలీసులు కేసముద్రం, న్యూస్‌లైన్ : జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి డబ్బుకోసం అనేక అడ్డదారులు తొక్కాడు. సులువుగా డబ్బు సంపాదించి సమాజంలో ఉన్నత హోదాలో జీవించాలనే ఆశతో నక్సలైట్ అవతారం ఎత్తి రాష్ర్టంలోని పలు జిల్లాల్లో కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ మేరకు మానుకో ట సీఐ వాసాల సతీష్, ఎస్సై రంజిత్‌రావు బుధవారం నిందితుడి వివరాలు వెల్లడించా రు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వానపాకుల రాంబాబు(అలియాస్ ఆజాద్, బాబు) గతంలో అదే మండలంలోని మైనేని మోహన్‌తో తొలుత 9 మందితో ప్రజాసేవా దళాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి 2002లో ఆరు సింగిల్ ఫోర్ పిస్టళ్లను కొనుగోలు చేసి ఖమ్మం పరిసర ప్రాంతాలైన బంగారుచిలుక, ఉలుపునూరు, రేకులగూడెం అటవీ ప్రాంతాల్లో దళ సభ్యులంతా కొద్ది రోజులుగా షూటింగ్‌పై శిక్షణ పొందారు. అనంతరం రాంబాబు పాల్వంచ ప్రాంతంలో ని కేటీపీఎస్ కాంట్రాక్టర్ రమేష్‌ను బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేశారు. అలాగే టేకులపల్లిలోని ఓ క్వారీ యజమానిని బెదిరి స్తూ డబ్బు లు డిమాండ్ చేస్తుండగా అక్కడి పోలీసులు పట్టుకుని ఆమ్స్ యాక్టు కింద అరె స్టు చేసి 6 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన రాంబాబు అదే ఏడాది ఓ కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. అనంతరం 2007లో పాల్వంచలోని కృషి బార్ షాప్ యజమాని రాంమోహన్‌రావును బెదిరిం చి రూ.లక్ష, 2008లో నర్సంపేటలోని రూపా పేపర్ బైండింగ్ ఓనర్ లింగస్వామివద్ద రూ.20 వేలు వసూలు చేశాడు. అలాగే 2012లో ఖానాపురంలోని అగ్రహర్ కాలనీలో రాజు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఎల్‌సీడీని, ఖమ్మం జిల్లాలోని మారెమ్మగుడిలో రూ.30 వేలతోపాటు 2013 జూన్ 23న వెస్ట్ గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన గుండెపల్లి పోలీస్ అనే రైస్ మిల్లు వ్యాపారిని కొట్టి రూ.6.30 లక్షలను వసూలు చేసి పరారయ్యాడు. ఇదిలా ఉం డగా, ప్రస్తుతం బీహర్‌లో కొనుగోలు చేసిన ఏయిర్గన్ను చూపిస్తూ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ని వ్యాపారులను, కిరాణం షాపు యజమానులను, క్వారీ ఓనర్లను బెదిరిస్తూ రూ.2వేల నుంచి మొదలుకుని లక్షల వరకు డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. అలాగే పలు చోట్ల చైన్ స్నాచిం గ్‌కు పాల్పడుతూ చేస్తూ వచ్చాడు. హత్య కేసులో నిందితుడు.. పాల్వంచకు చెందిన నాగేంద్రమ్మ అనే మహిళ ఖమ్మం శివారులో హోటల్ నడుపుతోంది. ఆమె తన అల్లుడైన చింతల సత్యనారాయణతో వివాహేతర సంబంధం పెట్టుకుం ది. దీంతో పెద్దకొడుకు కృష్ణ వీరి వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతూ వస్తున్నాడు. అయితే నాగేంద్రమ్మ హోటల్‌కు తరచు వస్తు న్న రాంబాబును వారు సంప్రదించి తమనుం చి కృష్ణ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కృష్ణను చంపితే రూ.2 లక్షలు ఇస్తామని నాగేంద్రమ్మ, సత్యనారాయణలు ఆశ చూపడంతో రాంబాబు దానికి సరేనన్నాడు. ఈ నేపథ్యంలో 2013 నవంబర్ 11న రాంబాబు.. కృష్ణకు మద్యం తాగించేందుకు బయటికి తీసుకెళ్లి బండరాయితో మోది హతమార్చాడు. కేసముద్రంలో ఇలా చిక్కి... కాగా, రాంబాబు కేసముద్రం మండలంలోని తిమ్మంపేటకు చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి గతంలో పలు దొంగతనాలను పాల్పడ్డాడు. అయితే శ్రీనివాస్ అతడి నుంచి దూరంగా ఉండడంతో రాంబాబు ఒంటరిగా బెదిరింపులకు దిగుతూ దొంగతనాలు చేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 24 కేసముద్రం మార్కెట్ ఎదురుగా ఉన్న ఎలక్ట్రికల్ షాపులో కాపర్ వైరు దొంగిలించాడు. అనంతరం ఓ పల్లి వ్యాపారిని బెదిరించి రూ.14 వేలు, ఈ నెల లో తిమ్మంపేటలోని ఓ ఇటుక బట్టి వ్యాపారిని బెదిరించి రూ.2వేలు వసూలు చేశాడు. అలాగే తోట పుల్లయ్య అనే పల్లి వ్యాపారిని కూడా ఏయిర్గన్తో బెదిరించి తనకు రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే వ్యాపారులందరూ ఇస్తే తాను కూడా డబ్బులు ఇస్తానని చెప్పడంతో వెళ్లిపోయాడు. తర్వాత పసుపు వ్యాపారి రాజన్నను కూడా బెదిరించడంతో అతడు రూ.2వేలు ఇచ్చాడు. ఈ క్రమంలో గత జనవరి 30న సదరు వ్యాపారి రాంబాబు బెది రింపులపై పోలీసులకు ఫిర్యాదు చే శాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రాంబాబు ఎదురుపడ్డాడు. అయితే రాంబాబును పట్టుకునేందు కు పోలీసులు ప్రయత్నిస్తుండగా చేతిలో ఉన్న ఏయిర్గన్ను చూపిస్తూ బెదిరించాడు. దీంతో కానిస్టేబుల్ మంగీలాల్ వెనకవైపు నుంచి వ చ్చి అతడిని పట్టుకున్నాడు. నిందితుడిపై మొత్తం 30కి పైగా కేసులుండడం గమనార్హం. కాగా, అంతర్ రా ష్ట్ర దొంగను పట్టుకున్న మం గీలాల్ను, మరో కానిస్టేబుల్ కుమార్‌ను సీఐ, ఎస్సైలు అభినందించారు. -
ఆ రెండు పార్టీలకే చెల్లు..
ఆ రెండు పార్టీలకే చెల్లు.. ముప్పాళ్ల, : పార్లమెంటులో గురువారం చోటుచేసుకున్న సంఘటనలు దేశచరిత్రకే మాయనిమచ్చని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒకే పార్టీలో ఉంటూ కొందరు ఒకలా.. మరికొందరు మరోలా వ్యవహరించడం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకే చెల్లిందని ఎద్దేవాచేశారు. ఒకరు సమర్థిస్తే మరొకరు వ్యతిరేకిస్తారని, ఇంకొకరు పెప్పర్ చల్లుతారని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారనీ ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న నాటకంలో భాగమేనని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో పెప్పర్ చల్లిన లగడపాటి రాజగోపాల్ ఇంతకు ముందే సోనియా, రాహుల్, ప్రధాని వంటి వారిపై పెప్పర్ చల్లి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా అని అన్నారు. తమ పార్టీ ఎంపీలనే కట్టడి చేసుకోలేని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధిస్తుందని, ఇలాంటి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోవాలని, అలాకాకుండా కాంగ్రెస్‌తో కలసి బిల్లును ఆమోదిస్తే దేశంలో రెండు పార్టీలకూ నూకలు చెల్లినట్టేనని చెప్పారు. జూలై 30వ తేదీనే ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య నాయకులు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
ఆరోగ్య కేంద్రాలలో ‘ఈ-పీహెచ్సీ’
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల పనితీరును పరిశీలించేందుకు ‘ఈ-పీహెచ్సీ’ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు ఐటీడీఏ పీఓ వీరపాండియన్ ప్రకటించారు. దీనికి సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రులలో ఇప్పటికే అమలవుతున్న సాప్ట్‌వేర్‌ను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో వైద్యం, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల పనితీరుపై సంబంధిత అధికారులతో ఐటీడీఏ సమావేశపు మందిరంలో శుక్రవారం పీఓ సమీక్ష సమవేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ -పీహెచ్సీ విధానం ద్వారా వైద్యుల పనితీరు మెరుగవుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అందించే వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్యాధికారుల పనితీరును పరిశీలించేందుకు ప్రతి నెలలో రెండో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. పీహెచ్సీలలో ఏర్పాటు చేసిన బర్త్ వెయింటింగ్ రూంలపై గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు సరిపడినన్ని ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్లకు వేతనాన్ని వారి ఖాతాలలో జమ చేస్తామన్నారు. వైద్యాధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలని, పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు వెంటనే చేయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీహెచ్సీలలో మూమెంట్ రిజిస్టర్లను అప్డేట్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుల్లయ్య, డీఎంఓ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు. -
ఊరంతా జ్వరాలు
నాతవరం, న్యూస్‌లైన్ : జిల్లేడుపూడివాసులను జ్వరాలు పీడిస్తున్నాయి. 25 రోజులుగా మంచానపడి అల్లాడిపోతున్నారు. గ్రామంలోని 1870 మందికి 600కుపైగా జ్వరాలతో బాధపడుతున్నారు. శుక్రవారం విలేకరులు గ్రామాన్ని పరిశీలించినప్పుడు పరిస్థితి దయనీయంగా ఉంది.ప్రతి ఇంటా మూలుగుతున్నవారు కనిపించారు. గ్రామంలో ప్రస్తుతం కె.రాము , కుమారి, రాంబాబు, ఎల్.రమణ , కె.తులసి, పి.సత్యవతి, గౌరి, ఎస్.సత్యవతి, ఎస్.మోహన్, ఎస్.కుమారి, లాలం మావుళ్లమ్మ , కె.రమణ, కె.వెంకటరమణ, యల్లయ్యమ్మ, నాగరాజుల పరిస్థితి దయనీయంగా ఉంది. మరికొందరి పరిస్థితి ఇలాగే ఉంది. 25 రోజులుగా కనీసం వైద్యసేవలకు నోచుకోలేదు. నాలుగుడబ్బులున్నవారు నర్సీపట్నం, తుని ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు పొందుతున్నారు. మరి కొందరు 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళుతున్నారు. పరిస్థితిని పది రోజుల క్రితం సర్పంచ్ లాలం లోవ వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా చర్యలు శూన్యం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రూ.14 వేలయినా జ్వరాలు తగ్గలేదు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాం. రూ.14 వేలు ఖర్చుచేస్తే ఇంటిలో ఇద్దరికి జ్వరాలు తగ్గుముఖం పట్టగా మరో ముగ్గురికి తీవ్రంగా ఉంది. - రమణ, జిల్లేడుపూడి వైద్య శిబిరం నిర్వహించాలి గ్రామంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన వైద్యశిబిరం నిర్వహించాలి. ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించి జ్వరాలు తగ్గేవరకు పర్యవేక్షణ చేపట్టాలి. - కొరుపోలు నూకరాజు, జిల్లేడుపూడి.