అశ్వారావుపేట మండల పరిధిలోని గుమ్మడవల్లిలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఇల్లులు దగ్ధమయ్యాయి.
అశ్వారావుపేట మండల పరిధిలోని గుమ్మడవల్లిలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఇల్లులు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన మడకం రాంబాబు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు అంటుకొగా, పక్కనే ఉన్న కట్టం భీముడు, చిచ్చోడు శివ ఇళ్లు కుడా మంటల్లో కాలిపోయాయి. ఈ మూడు ఇల్లులు పూర్తిగా దగ్ధం కాగా దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లింది.