దమ్మపేట/ములకలపల్లి: జిల్లాలో ఇప్పటివరకు 34 డెంగీ కేసులు నమోదయ్యాయని, మరణాలు మాత్రం సంభవించలేదని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ములకలపల్లి మండలంలోని మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..జ్వరం వచ్చిన 24 గంటల వ్యవధిలోనే మలేరియా టెస్ట్ చేయించాలన్నారు.
డెంగీ జ్వరమొస్తే 105, 106 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, వరుసగా ఐదు రోజులపాటు జ్వరమొస్తే డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల కోసం ఏడు లక్షల డెంగీ పరీక్ష (ఆర్‌డీటీ) కిట్లు వచ్చాయని, మలేరియా నివారణకు ఈమాల్ ఇంజెక్షన్లు అందుబాటలో ఉన్నాయని తెలిపారు. ఏజ్వరమొచ్చినా ప్లేట్‌లెట్లు తగ్గుతాయని, కంగారు చెందొద్దని తెలిపారు. 50వేలకుపైగా ప్లేట్‌లెట్లు తగ్గితేనే కొత్తగా ఎక్కించాల్సి ఉంటుందన్నారు. రూ.30 లక్షలతో మొదటి విడత 959 గ్రామాల్లో, రెండో విడత 600 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేసినట్లు వివరించారు. ఆయన వెంట స్థానిక వైద్యాధికారి గోపాల్, హెచ్‌ఈఓ వెంకటేశ్వరరావు, సిబ్బంది వున్నారు.
గిరిజన గురుకుల పాఠశాల సందర్శన..
దమ్మపేటలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబు సందర్శించారు. పాఠశాల విద్యార్థి నరేందర్ డెంగీ జ్వరంతో చనిపోలేదని తెలిపారు. ఎలా చనిపోయాడనేది మమత ఆస్పత్రి నుంచి నింవేదిక రావాల్సి ఉందని తెలిపారు. పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు. ఆయన వంఎట వైద్య, ఆరోగ్యశాఖ సత్తుపల్లి క్లష్టర్ ఇన్‌చార్జ్ భాస్కర్‌నాయక్, దమ్మపేట వైద్యాధికారి కిషోర్, రామారావు ఉన్నారు.
జిల్లాలో 34 డెంగీ కేసులు
Published Thu, Sep 18 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement
Advertisement