Dammapeta
-
జడల రామలింగేశ్వర స్వామి మొక్కు.. 12 అడుగుల జుట్టు..
-
ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి: సీఎం కేసీఆర్
-
దేశం మెచ్చిన సీఎం.. కేసీఆర్
సాక్షి, దమ్మపేట: రాష్ట్రంలో చేపట్టిన ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో భారతదేశం మొత్తం సీఎం కేసీఆర్‌ను శభాష్ అంటోందని.. ఒక ముఖ్యమంత్రికి ఇంతకన్నా కీర్తీ ఏముంటుందని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆర్లపెంట, లచ్చాపురం గ్రామాల్లో రూ.28 లక్షలతో నిర్మాణం చేసిన ఆరోగ్య ఉపకేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. దేశం అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికల ద్వారా గ్రామాల అభివృద్ధికి రూపొందించిన 30 రోజుల ప్రణాళిక విజయవంతం అయిందని చెప్పారు. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీతారామ పేరుతో చేపట్టిన శాశ్వత ప్రాజెక్టు నిర్మాణం అయితే ఉమ్మడి జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుం దని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని మాటల్లో చూపారని, తెలంగాణలో సీఎం కేసీఆర్ చేతల్లో చూపిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ...దమ్మపేట పూర్తి గిరిజన ప్రాం తం కావడంతో గిరిజనులంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించా రు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఎంపీపీ సోయం ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శిరీష, ఎంపీడీఓ రవికుమార్, పట్వారీగూడెం, దమ్మపేట వైద్యులు డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ శ్రీహర్ష, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, మాజీ ఎంపీపీలు అల్లం వెంకమ్మ, పానుగంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం సృష్టించాడు. బస్సులోని మహిళ కండక్టర్‌పై దాడికి యత్నించడమే కాకుండా, ఒక ప్రయణికున్ని కూడా గాయపరిచాడు. జిల్లాలోని దమ్మపేట మండలం మండలపల్లి, ముష్టిబండా మధ్య ఈ ఘటన చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట రింగ్‌రోడ్డు వద్ద బస్సు ఎక్కిన సైకో.. సత్తుపల్లికి టికెట్ ఇవ్వమని కండక్టర్‌ను అడిగాడు. అందుకు కండక్టర్ డబ్బులు అడగ్గా.. డబ్బులు లేవని చెప్పి దాడికి యత్నించాడని ప్రయాణికులు చెబుతున్నారు. పైగా కత్తితో బెదిరిస్తూ హల్చల్ చేసిన సైకో.. కొద్దిసేపటికే బస్సు దిగి పారిపోయాడు. తర్వాత సైకోను వెంబడించిన ప్రయాణికులు అక్కడికి దగ్గర్లోని మామిడి తోటలో సైకోను అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న రాజుకు స్వల్ప గాయలైనట్టు గా తెలుస్తోంది. -
నాడు వాల్ రైటింగ్.. నేడు సోషల్ మీడియా
సాక్షి, దమ్మపేట: ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం నిర్వహించే ప్రతి కార్యక్రమానికీ లెక్కలు చెప్పాల్సిందేనని అప్పటి ఎన్నికల ప్రధానాధికారి టీఎన్ శేషన్ ఆదేశించారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రచార తీరులో మార్పులు సంతరించుకుంటూ వస్తున్నాయి. అధికార యంత్రాంగం కూడా నిఘా ఉంచడంతో సమావేశాలను ఆత్మీయ సమ్మేళనాలుగా, విందులను సహపంక్తి భోజనాలుగా పేర్లు మార్చుతూ గుట్టుచప్పుడు కాకుండా జరుపుతున్నారు. గోడలపై రాతలు ఎన్నికలంటే గోడలపై రాతలు.. అభ్యర్థుల ఫొటోలు ఉన్న పోస్టర్లు.. పగలు, రాత్రి మైకుల హోరు, రోడ్ల పొడవునా బ్యానర్లు తోరణాల్లాగా కట్టేవారు. పరీక్షల సమయంలోనూ చదువుకునే విద్యార్థులు సైతం మైకుల హోరు భరించలేక గ్రామాలకు దూరంగా వెళ్లిపోయేవారు. ఖాళీ ప్రదేశాల్లో చదువుకునేవారు. ఇదంతా ఒకప్పటి ఎన్నికలు. అనుమతులు తప్పనిసరి గోడలపై రాతలు రాయాలన్నా, ప్రచార పోస్టర్లు వేయించాలన్నా, బ్యానర్లు కట్టాలన్నా, మైకు హోరెత్తించాలన్నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. వాహనాల్లో తిరగాలంటే వ్యయం ఎంతో చెప్పాల్సిందే. గోడలపై రాతలకు సంబంధిత యాజమాని అనుమతి ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం గోడలపై రాతలు దాదాపుగా ఎవరూ రాయడంలేదు. ఇటీవల వరకు ఫ్లెక్సీలు పెట్టేవారు. ఇప్పుడు అవి కూడా తగ్గిపోతున్నాయి. ప్రచార రథాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ.. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉండటంతో అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మెసేజ్‌ల ద్వారా కోరుతున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం, ముందస్తు సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. కొందరు పంపే ఫొటోలు, అభ్యర్థులపై వ్యంగ్య వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తున్నాయని పలువురు ఓటర్లు వాపోతున్నారు. విద్యార్థుల వద్దకు.. విద్యార్థులకు ప్రస్తుతం పరీక్ష కాలం. అభ్యర్థులకు కూడా ఐదేళ్ల భవితవ్యం నిర్ణయించే ఎన్నికలు పరీక్ష వంటిదే. దాంతో యువత ఎక్కడ ఉంటారో అక్కడికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు వెళుతున్నారు. ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మీ ఓటుతో పాటు మీ ఇంటనున్న వారికి, చుట్టుపక్కల వారికి చెప్పి తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయించాలంటూ కోరుతున్నారు. -
దమ్మపేట పోలీసులు.. ప్రకృతి ప్రేమికులు..!
సాక్షి, దమ్మపేట: మనుషుల రక్షణే కాకుండా ప్రకృతి రక్షణకు ఇక్కడి పోలీసులు నడుం బిగించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుతున్నారు. నిత్యం చెట్ల రక్షణ కోసం సమయాన్ని కేటాయిస్తూ దమ్మపేట పోలీస్‌స్టేషన్‌ను పచ్చదనంతో నింపారు. దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి పక్కనే పోలీస్‌స్టేషన్ పచ్చదనంతో చూపరులను ఆకట్టుకుంటున్నది. హరితహారంలో భాగంగా అప్పటి ఎస్ఐ ఎం.నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విడతలవారీగా మొక్కలు నాటుతూ వాటి పరిరక్షణ చేపట్టారు. ఇక్కడి మొక్కలపై ఎస్ఐ జలకం ప్రవీణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మొక్కలను పోలీసులు దత్తత తీసుకున్నారు. ఇక్కడ గానుగ, దానిమ్మ, వేప, కొబ్బరి మొక్కలను నాటారు. క్రోటన్తో పాటు ప్రత్యేక పూల మొక్కలను నర్సరీల నుంచి కొనుగోలు చేసి స్టేషన్ ముందు అందమైన గార్డెన్ రూపొందించారు. ఎదిగిన ప్రతి చెట్టుకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేశారు. పచ్చదనంతో ప్రశాంత వాతావరణం పచ్చదనంతో ప్రశాంత వాతావరణం ఉంటుందని అంటున్నారు ఎస్సై జలకం ప్రవీణ్. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘చెట్ల నీడన చేరితే మన అలసట తీరుతుంది. పచ్చని చెట్లు ఆహ్లాదాన్నిస్తాయి. ఆలోచనలపై సానుకూల ప్రభావం చూపుతాయి. బాధ, కోపం, ఆవేశంతో ఎన్నో గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఆహ్లాద వాతావరణంలో మంచి ఆలోచనలు, మనుషుల్లో మార్పు రావడానికి ఇక్కడి పచ్చదనం కొంత దోహదపడుతోంది’’ అన్నారు. -
ఖమ్మం: ఓటరు ఎటువైపో...!
సాక్షి, దమ్మపేట: ముందస్తు ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ మొదలైంది. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఇక్కడ పోటీని ప్రధాన అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే, పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్, ప్రజాకూటమి(టీడీపీ)కిఅశ్వారావుపేటలో గట్టి పట్టుంది. బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు, టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై గెలుపొందారు. ఆ తరువాత,. టీఆర్ఎస్లోకి తాటి వెళ్లారు. ఇప్పుడు కూడా వీరిద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి ఎలాగైనా ఇక్కడ నుంచి గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని తాటి, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన తాను కూటమి బలంతో గెలవాలని మెచ్చా నాగేశ్వరరావు.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కూటమి అభ్యర్థి నామినేషన్‌కు, శుక్రవారం దమ్మపేటలో నిర్వహించిన సభకు భారీగా జనం భారీగా వచ్చారు. దీంతో, గెలుపు తమదేనన్న ధీమా కూటమిలో కనిపిస్తోంది. దమ్మపేట: మందలపల్లి ప్రచారంలో ఏపీ ఎమ్మెల్యే వీరాంజనేయులు బీజేపీ ఉధృత ప్రచారం ఈ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ పోటీ చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా స్థానికుడైన డాక్టర్ భూక్యా ప్రసాదరావు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు ధీటుగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. గత నెల మొదటి వారంలో దమ్మపేటలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుతో పోలింగ్ కేంద్రాల సభ్యుల సమ్మేళనం పేరుతో భారీ సభ జరిగింది. అభ్యర్థి కూడా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ ముగ్గురిలో.. ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో.. ! ఆదరించండి ... అభివృద్ధి చేస్తా.. అన్నపురెడ్డిపల్లి: పెంట్లంలో మాట్లాడుతున్న భూక్యా ప్రసాద్ అన్నపురెడ్డిపల్లి: తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్ధి భూక్యా ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆయన ఆదివారం మండలవ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అవినీతిరహితపాలన అందిస్తున్న బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు. పార్టీ మండల అ«ధ్యక్షుడు బాల్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, డీ.వెంకటేశ్వర్లు, రాజు పాల్గొన్నారు. కూటమి ఇంటింటి ప్రచారం అన్నపురెడ్డిపల్లి: మర్రిగూడెంలో కూటమి నాయకుల ప్రచారం అన్నపురెడ్డిపల్లి: మండలంలోని మర్రిగూడెం, ఎర్రగుంట గ్రామాలలో ఆదివారం మహాకూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు పర్సా వెంకటేశ్వర్లు, ఇనపనూరి రాంబాబు, వీరబోయిన వెంకటేశ్వర్లు,వీరబోయిన నాగేశ్వరరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ ఇంటింటి ప్రచారం .. అన్నపురెడ్డిపల్లి: మండలంలోని అబ్బుగూడెం, మర్రిగూడెం, బుచ్చన్నగూడెం గ్రామాలలో ఆదివారం న్యూడెమోక్రసీ అభ్యర్థి కంగాల కల్లయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే పోడుభూముల రక్షణకు, రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూములను లాక్కుందని విమర్శించారు. నాయకులు పద్దం శ్రీను, వీరరాఘవులు, కాక శివా, సీతయ్య, విజయ్, మడకం నగేష్ తదితరులు పాల్గొన్నారు. రేణుకాచౌదరి వర్గీయుల ర్యాలీ .. చండ్రుగొండలో రేణుకాచౌదరి వర్గీయుల బైక్ ర్యాలీ చండ్రుగొండ: కూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ప్రచారంలో ఇప్పటివరకు పాల్గొనకుండా అలకపాన్పు ఎక్కిన కాంగ్రెస్ పార్టీలోని రేణుకాచౌదరి వర్గీయులు.. శాంతించారు. ఆమె వర్గం నాయకుడైన సంకా రామారావు, తన అనుచరులతో కలిసి ఆదివారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆ తరువాత, ఇమ్మడి రామయ్యబంజర్లోని మామిడితోటలో సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపుకు కృషి చేద్దామని సంకా రామారావు అన్నారు. నాయకులు నరుకుళ్ళ వెంకటనారాయణ, కాశీరాం, ఈసం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరిక ములకలపల్లి: ఆదివాసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోండ్రు సుందర్రావు ఆదివారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దమ్మపేట మండలంలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో ఆయనను తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం చండ్రుగొండ: టీఆర్ఎస్ నాయకులు ఆదివారం మంగపేట, చాపరాలపల్లి, పూసుగూడెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు పాలకుర్తి ప్రసాద్, నాయకులు మునీశ్వరరావు, జగదీష్, ప్రకాష్, లోకేష్, తాటి రవి, కుంజా రవి, ఉదయ్, పద్దం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీని ఆదరించండి.. ములకలపల్లి: ట్రాక్టర్ నడుపుతున్న రమేష్‌నాయక్ (బీఎస్పీ) ములకలపల్లి: బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)ని ఓటర్లు ఆదరించాలని అశ్వారావుపేట అభ్యర్థి బాణోతు రమేష్ నాయక్ కోరారు. మండలంలోని పూసుగూడెంలో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. నాయకులు ఇంచార్జ్ గద్దల రవి, రాంబాబు, మోహన్, మంగీలాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అవకాశవాద పార్టీలను ఓడించండి .. చండ్రుగొండ: న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ దృశ్యం చండ్రుగొండ: అవకాశవాద పార్టీలను ఓడించాలని న్యూడెమోక్రసీపార్టీ రాష్ట్ర నాయకుడు కె.రంగారెడ్డి కోరారు. పార్టీ అభ్యర్థి కంగాల కల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇక్కడ ర్యాలీ, సభ జరిగాయి. సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న న్యూడెమోక్రసీ అభ్యర్థి కల్లయ్యను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే ఉమర్, వరికూటి వెంకట్రావ్, తోలెం వెంకటేశ్వర్లు, పొడెం భద్రమ్మ, బాబురావు, కుంజా వెంకటేశ్వర్లు, భద్రు, ముత్తారావు పాల్గొన్నారు. బీజేపీ ప్రచారం ములకలపల్లి: బీజేపీ అభ్యర్థి డాక్టర్ భూక్యా ప్రసాదరావును గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి డాక్టర్ ఉదయజ్యోతి ఆదివారం ములకలపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అద్యక్షుడు అనుమల శ్రీనివాస్, నాయకులు నాగుబండి సందీప్, నారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే ప్రచారం దమ్మపేట: ప్రజాకూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులతో కలిసి, మందలపల్లిలో ఆదివారం సాయంత్రం ఆంధ్రాలోని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రచారం చేశారు. మెచ్చా సతీమణి శ్యామల, నాయకులు గన్నమనేని నాగేశ్వరరావు, గారపాటి సూర్యనారాయణ, అనురాధ, సైదా, కొండపల్లి కృష్ణమూర్తి, నల్లగుళ్ల కిరణ్, రత్నకుమారి, బలుసు గోపి, పల్లెల గాంధీ తదితరులు పాల్గొన్నారు. బీఏస్పీ ప్రచారం అశ్వారావుపేటరూరల్: బీఏస్పీ అభ్యర్థి బాణోత్ రమేష్ నాయక్ ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. తనను గెలిపించాలని కోరారు. నాయకులు గద్దల రవి, రాంబాబు, మోహన్, మంగీలాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
చెట్టు మీద పడి వ్యక్తి మృతి
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం నల్లకుంటలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై రోడ్డు పక్కన ఎండిన చెట్టు మీద పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు చిన్నగొల్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి(30)గా గుర్తించారు. -
నిండు నూరేళ్లు..
దమ్మపేట : శతమానం భవతి..నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించు అని చెబుతుండే మాట ఈయన విషయంలో మార్చాలి. ఎందుకంటే..అంతకుమించి అనాల్సి ఉంటుంది. దమ్మపేట మండలంలోని వడ్లగూడెం గ్రామానికి చెందిన పాటేటి గంగరాజు (రాజబాబు) వయస్సు అక్షరాల వంద సంవత్సరాలు. రేపు..అంటే 12వ తేదీన ఆయన 101వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. 12-07-1918న పాలేటి వీరవెంకయ్య, శేషాచలం దంపతుల ఏడుగురు సంతానంలో ఈయన మూడో వాడు. అందరూ మగ సంతానమే కాగా..మిగతావారంతా 60-70 ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఈయన బాల్యం వడ్లగూడెంలో, హైస్కూల్ విద్య ఏలూరులో పూర్తి చేసుకున్నారు. ఉన్నత విద్య అంతా హైదరాబాద్‌లో కొనసాగింది. అప్పటి నిజాం ప్రభుత్వంలో బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 40ఏళ్లు విధులు నిర్వహించారు. అక్కడ ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామం వడ్లగూడెంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు సంతానం. భార్య, ఒక కుమారుడు గతంలో మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యులంతా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈయన స్థానికంగా ఉంటున్నారు. కుమారులు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవళ్లు, మునిమనవళ్లు కలుపుకుని..మొత్తం 60మందికిపైగా ఈయన కుటుంబసభ్యులుగా వివిధ ప్రాంతాల్లో ఉండడం విశేషం. వేడుక చేస్తాం.. మా బాబాయిని చూస్తుంటే..ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా భలే ఉన్నారే అనిపిస్తుంది. నేటి తరం వివిధ అనారోగ్యాలతో సతమవుతున్నా ఆనాటి ఆహారం..పనుల వల్ల ఇప్పటికీ ఈయన మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. అందరినీ పలకరిస్తారు. ఊరివారితో ముచ్చటిస్తూ..బాగోగులు తెలుసుకుంటూ..ముని మనవళ్లతో ఆడుకుంటారు. ఇన్నేళ్లు బతికిన పెద్దాయన్ను సత్కరించాలని అనుకున్నాం. ఊరి వాళ్లు, సరిహద్దు ఊరు సీతానగరం వాళ్లు కూడా సంబరం చేద్దామంటున్నారు. అంతా గురువారం రోజు వేడుక చేస్తాం. - పాలేటి చంద్రశేఖర్, సూర్యనారాయణ. పెసరట్టు ఇష్టం.. నేను చిన్నప్పటి నుంచి ప్రత్యేకించి ఆహార నియమాలేమీ పాటించలేదు. కానీ..కాయకష్టం చేసేటోన్ని. అప్పటి రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేవు. ప్రతిదీ చెమటోడ్చాల్సి వచ్చేది. అదే..నాకు మంచి ఆయుష్షును ఇచ్చింది. ఇప్పటికీ మాంసాహారం తింటాను. చికెన్, మటన్ లాగిస్తాను. పెసరట్టు అంటే చాలా ఇష్టం. మూడు రకాల చట్నీలు కావాలి. పని మనిషి ఆలస్యమైతే..నేనే కొన్నిసార్లు చిన్నపాటి అల్పాహారం చేసుకుంటా. -
పథకం వేసి.. ప్రాణం తీసి
దమ్మపేట: మండలంలోని అంకంపాలెం శివారు ఆర్లపెంట సమీపంలోని అడవుల్లో ఒకచోట ఎప్పటివో పెద్ద పెద్ద పైపులు. వాటిలో ఒకదానిలో ఓ యువకుడి మృతదేహం. గత నెల 29న అతడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు వెళ్లారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అతడిని, సత్తుపల్లి మండలం గాంధీనగరం గ్రామస్తుడైన ఆటో డ్రైవర్ బైట శివ(28)గా గుర్తించారు. దర్యాప్తు చేపట్టారు. మిస్టరీని ఛేదించారు. వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో అశ్వారావుపేట సీఐ ఎం.అబ్బయ్య ఇలా వివరించారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు గాంధీనగరం గ్రామానికి చెందిన బైట శివ, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యతో శివకు వివాహేతర సంబంధం ఉన్నదని ములకలపల్లి మండలంలోని దారావారిగుంపు గ్రామస్తుడైన బండారు నగేష్ అనుమానించాడు. దీనిని తీవ్రంగా పరిగణించాడు. శివను ఎలాగైనా చంపాలని నగేష్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన వదిన కీసరి పున్నమ్మతో చెప్పాడు. తన మిత్రుడైన కొర్రి రామకృష్ణకు కూడా చెప్పాడు. సహకరించాలని కోరాడు. వారిద్దరూ అంగీకరించారు. ముగ్గురూ కలిసి పథకం వేశారు. ఈ పథకంలో భాగంగా, శివతో పున్న మ్మ మూడు రోజులపాటు ఫోన్ సంభాషణ సాగించింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నీతో మాట్లాడాలని ఉంది’ అని నమ్మించింది. శివ పూర్తిగా నమ్మాడు. ‘ఎక్కడ కలుసుకుందాం..?’ అని ఆమె అడిగింది. గత నెల 27వ తేదీన శివకు ఫోన్ చేసింది. తాను ఆర్లపెంట శివారులోని వినాయకపురం రోడ్డు వద్దనున్న ఇందిరాసాగర్ పాత పైపుల వద్దకు (అదే రోజు) రాత్రి వేళ వస్తానని, అక్కడ కలుసుకుందామని చెప్పింది. అతడు సరేనన్నాడు. ఈ విషయాన్ని బండారు నగేష్, తన మిత్రుడైన కొర్రి రామకృష్ణకు చెప్పాడు. నగేష్, పున్నమ్మ, రామకృష్ణ కలిసి ఆటోలో సత్తుపల్లి వచ్చారు. చీకటి పడిన తరువాత అక్కడి నుంచి వినాయకపురం రోడ్డు వద్దకు చేరుకున్నారు. తమ ఆటోను చెట్ల పొదల్లో దాచారు. శివ కోసం ఎదుచూస్తున్నారు. రాత్రి వేళ.. చిమ్మ చీకటి. ఇందిరాసాగర్ పాత పైపుల వద్దకు శివ వచ్చాడు. పున్నమ్మతో మాట్లాడుతున్నాడు. అప్పటివరకూ ఒకపక్కన దాక్కున్న నగేష్, రామకృష్ణ బయటికొచ్చారు. శివపై ఒక్కసారిగా దాడి చేశారు. ముక్కుపై బలంగా గుద్దారు. అతడి కాళ్లను రామకృష్ణ గట్టిగా పట్టుకోగా, గొంతును నగేష్ నులిమి చంపాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకుగాను నోట్లో పురుగు మందు పోశారు. అక్కడి నుంచి ఆ ముగ్గురూ ఆటోలో పారిపోయారు. ఈ సమాచారమందుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.దర్యాప్తు ప్రారంభించారు. అతడిని, ఆటో డ్రైవర్ శివగా గుర్తించారు. మండలంలోని పట్వారీగూడెం వద్ద వాహనాలను పోలీసులు సోమవారం తనిఖీ చేస్తున్నారు. అటుగా ఓ ఆటో వచ్చింది. పోలీసులను చూడడంతోనే, అందులోని ముగ్గురు కిందకు దూకి పారిపోతున్నారు. పోలీసులు వెంబడించి పట్టుకుని గట్టిగా ప్రశ్నించారు. శివను తాము హత్య చేసినట్టుగా చెప్పారు. ఎందుకు, ఎలా చంపిందీ పూసగుచ్చినట్టుగా వివరించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకు అప్పగించారు. సమావేశంలో ఎస్ఐ జలకం ప్రవీణ్, ఏఎస్ఐ సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ చౌదరి, కానిస్టేబుల్ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
కారు స్వైరవిహారం: ఇద్దరు పిల్లలకు గాయాలు
సాక్షి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో ఓ కారు స్వైరవిహారం చేసింది. ఇద్దరు పిల్లలను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. పిల్లలు గాయపడడంతో ఆ కారుని ఆపడానికి ప్రయత్నించిన రెండు వాహనాలను కూడా ఢీకొట్టి కారును నడుపుతున్న వ్యక్తి తప్పించుకుని వెళ్లిపోయాడు. పారిపోతున్న వాహనదారుడిని అశ్వారావుపేటలో స్థానికులు అడ్డగించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ గా గుర్తించారు. -
ఎస్ఐలకు గెజిటెడ్ హోదా... హామీ ఏమైంది..?
దమ్మపేట: ‘‘ఎస్సైలకు గెజిటెడ్ హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? దాని అమలును ప్రభుత్వం మరిచిపోరుుందా..?’’ అని, వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం అసెంబ్లీ జీరో ఆవర్‌లో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనితోపాటు, పోలీసు సిబ్బందికి సంబంధించిన పలు సమస్యలపై ఆయన 20 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ వివరాలను ఆయన ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. ‘‘టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్ఐ)లకు గెజిటెడ్ హోదా కల్పిస్తామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. దీని అమలును ప్రభుత్వం మరిచిపోరుుందా...? ఎస్ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు బయట విధులకు వెళితే టీఏ, డీఏ ఇవ్వాలి. కానీ అరకొరగా మాత్రమే ఇస్తున్నారు. పాత నిబంధనల ప్రకారంగా ఎస్ఐకు రెండువేలు, కానిస్టేబుళ్లకు 1050 రూపాయలు ఇస్తున్నారు. ఇవి ఎలా సరిపోతారుు..? పోలీస్ సిబ్బంది యూనిఫాం కోసం ప్రభుత్వం ఏడాదికి రెండువేలు కేటాయిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో దుస్తుల ధరలు ఆకాశాన్నంటున్నారుు. ఈ పరిస్థితిలో ఈ మొత్తం ఏ మేరకు సరిపోతుందో ప్రభుత్వమే ఆలోచించాలి. తక్కువ జీతాలతో పోలీసుల జీవనం కష్టంగా మారుతోంది. పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం అరకొరగా వేతనాలు ఇస్తోంది. వారి జీవనం ఎలా సాగుతుంది? హోంగార్డులకు వేతనంగా నెలకు 15వేల రూపాయలు ఇవ్వాలి’’ అని కోరినట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమమివ్వాలి ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమమివ్వాలని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏ విధంగా ఇస్తారో స్పష్టం చేయాలి’’ అని ఆయన కోరారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటి ప్రశ్నగా దీనిని తాటి వెంకటేశ్వర్లు లేవనెత్తారు. ‘‘ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలి, బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి. ఇది ప్రభుత్వానికి సాధ్యమా..?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు భూములుండవు. భూములు లేని వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఈ పరిస్థితిలో ఆయా వర్గాల పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహాన్నిస్తుందో సభలో చెప్పాలి’’ అని కోరారు. ‘‘ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి. ప్రభుత్వ భూములను కేటాయించాలి. మార్జిన్ మనీ కూడా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గిరిజన, దళిత పారిశ్రామికవేత్తలకు మంచి ప్రోత్సాహం అందిన విషయూన్ని గుర్తు చేశారు. అదే విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం కూడా అనుసరించాలని కోరారు. -
జిల్లాలో 34 డెంగీ కేసులు
దమ్మపేట/ములకలపల్లి: జిల్లాలో ఇప్పటివరకు 34 డెంగీ కేసులు నమోదయ్యాయని, మరణాలు మాత్రం సంభవించలేదని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ములకలపల్లి మండలంలోని మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..జ్వరం వచ్చిన 24 గంటల వ్యవధిలోనే మలేరియా టెస్ట్ చేయించాలన్నారు. డెంగీ జ్వరమొస్తే 105, 106 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, వరుసగా ఐదు రోజులపాటు జ్వరమొస్తే డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల కోసం ఏడు లక్షల డెంగీ పరీక్ష (ఆర్డీటీ) కిట్లు వచ్చాయని, మలేరియా నివారణకు ఈమాల్ ఇంజెక్షన్లు అందుబాటలో ఉన్నాయని తెలిపారు. ఏజ్వరమొచ్చినా ప్లేట్లెట్లు తగ్గుతాయని, కంగారు చెందొద్దని తెలిపారు. 50వేలకుపైగా ప్లేట్లెట్లు తగ్గితేనే కొత్తగా ఎక్కించాల్సి ఉంటుందన్నారు. రూ.30 లక్షలతో మొదటి విడత 959 గ్రామాల్లో, రెండో విడత 600 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేసినట్లు వివరించారు. ఆయన వెంట స్థానిక వైద్యాధికారి గోపాల్, హెచ్ఈఓ వెంకటేశ్వరరావు, సిబ్బంది వున్నారు. గిరిజన గురుకుల పాఠశాల సందర్శన.. దమ్మపేటలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబు సందర్శించారు. పాఠశాల విద్యార్థి నరేందర్ డెంగీ జ్వరంతో చనిపోలేదని తెలిపారు. ఎలా చనిపోయాడనేది మమత ఆస్పత్రి నుంచి నింవేదిక రావాల్సి ఉందని తెలిపారు. పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు. ఆయన వంఎట వైద్య, ఆరోగ్యశాఖ సత్తుపల్లి క్లష్టర్ ఇన్చార్జ్ భాస్కర్‌నాయక్, దమ్మపేట వైద్యాధికారి కిషోర్, రామారావు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ విజయం
దమ్మపేట, న్యూస్‌లైన్ : దమ్మపేట మండలం జమేదార్ బంజర్, లింగాలపల్లి పంచాయతీల లో ఎన్నికల పోరు శనివారం హోరాహోరీగా జరిగింది. జమేదార్‌బంజర్‌లో వైఎస్ఆర్ కాం గ్రెస్ మద్దతుదారు దండి దుర్గ టీడీపీ మద్దతుదారు రాచూరి రేఖపై 80 ఓట్ల ఆధిక్యతతో గెలుపొం దారు. ఇక్కడ 1072 ఓట్లకు గాను, 998 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుర్గకు 422 ఓట్లు రాగా, రేఖకు 342 ఓట్లు వచ్చాయి. న్యూడెమోక్రసీ మద్దతుతో పోటీచేసిన ఘంటా దుర్గకు 174 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 10 వార్డులకు గాను వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు 6 వార్డులు, టీడీపీ 2, న్యూడెమోక్రసీ బలపర్చిన వారు 2 వార్డుల్లో గెలుపొందారు. లింగాలపల్లిలో 927 ఓట్లకు గాను, 837 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ న్యూడెమోక్రసీ మద్దతుతో పోటీ చేసిన సున్నం లక్ష్మి విజయం సాధించారు. ఆమెకు 376 ఓట్లు రాగా, తెలుగుదేశం బలపర్చిన వాడె లతకు 243 ఓట్లు వచ్చా యి. వైఎస్సార్ సీపీ బలపర్చిన సోయం చిలకమ్మకు 177 ఓట్లు వచ్చాయి. న్యూడెమోక్రసీ మద్దతుదారులు 8 వార్డులు, టీడీపీ బలపర్చిన వారు 2 వార్డులను గెలుచుకున్నారు. ఈ రెండు పంచాయితీల్లోనూ టీడీపీ మండల నాయకులంతా బృందంగా ఏర్పడి ప్రచా రం చేసినా ఓటర్లు పెద్దగా స్పందించలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయి. జమేదార్ బంజర్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడంతో ఆ పార్టీ మరో పంచాయతీని తన ఖాతాలో జమచేసుకుంది. ఫలితాల అనంతరం ఆ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సోయం వీరభద్రం, నాయకులు దారా యుగంధర్, జూపల్లి ఉపేంద్రబాబు, చిన్నశెట్టి యుగంధర్, పగడాల రాంబాబు, పాకనాటి శ్రీను, ఓంకార కృష్ణకుమార్, చవ్వా పోలారావు, చక్రాల మల్లేశ్వరరావు, ఎస్కె షుకూర్, పాశం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు సోయం రాజబా బు, జంగాల సర్వేశ్వరరావు పాల్గొన్నారు.