సాక్షి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో ఓ కారు స్వైరవిహారం చేసింది. ఇద్దరు పిల్లలను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. పిల్లలు గాయపడడంతో ఆ కారుని ఆపడానికి ప్రయత్నించిన రెండు వాహనాలను కూడా ఢీకొట్టి కారును నడుపుతున్న వ్యక్తి తప్పించుకుని వెళ్లిపోయాడు. పారిపోతున్న వాహనదారుడిని అశ్వారావుపేటలో స్థానికులు అడ్డగించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ గా గుర్తించారు.
కారు స్వైరవిహారం: ఇద్దరు పిల్లలకు గాయాలు
Published Sun, Jan 28 2018 11:50 AM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment