‘ప్రజాభవన్‌’ ఘటనలో కొత్త కోణం | Praja Bhavan Incident: How Shkeel Son Escaped | Sakshi
Sakshi News home page

‘ప్రజాభవన్‌’ ఘటనలో కొత్త కోణం: మాజీ ఎమ్మెల్యే తనయుడిని ఎలా తప్పించారంటే!

Published Fri, Dec 29 2023 8:49 AM | Last Updated on Fri, Dec 29 2023 1:11 PM

Praja Bhavan Incident: How Shkeel Son Escaped - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: బేగంపేట ప్రజాభవన్‌ వద్ద ఈ నెల 23న చోటుచేసుకున్న ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో.. ప్రధాన నిందితుడు సాహిల్‌ను తప్పించి మరొకరిని నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడిని ఎలా తప్పించారనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది.  

ప్రమాదం జరిగిన రోజున రాత్రి విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు.. ఘటనాస్థలం నుంచి సాహిల్‌ను కారులో పంజాగుట్ట ఠాణాకు తీసుకొచ్చారు. కానిస్టేబుల్‌కు అప్పగించి, పక్కనే ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు బ్రీత్‌ఎనలైజర్‌ పరీక్ష కోసం పంపారు. ఈక్రమంలో నిందితుడు తప్పించుకొని, అప్పటికే బయటున్న కారులో ఇంటికి వెళ్లాడు. తమ డ్రైవర్‌ను తన స్థానంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపాడు. అతడితో ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు వాంగ్మూలం ఇప్పించేలా పురిగొల్పాడు.

ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూశాక కూడా ఉన్నతాధికారులకు ఇన్‌స్పెక్టర్‌ అసలు విషయం చెప్పకుండా గోప్యత పాటించినట్టు తేలింది. నిందితుడు తప్పించుకొని ముంబయికి, అక్కడి నుంచి దుబాయ్‌ పారిపోయేందుకు సహకరించినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. దర్యాప్తును పక్కదారి పట్టించడంలో ఇన్‌స్పెక్టర్‌ కీలకంగా వ్యవహరించినట్టు పంజాగుట్ట ఠాణా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారాలు సేకరించారు. ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు గుర్తించాకనే.. ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావును సస్పెండ్‌ చేసినట్టు సమాచారం. ఈవ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: మోస్ట్‌వాంటెడ్‌గా నాడు షకీల్‌.. నేడు సాహిల్‌!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement