shakeel
-
పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు సాహిల్
-
హైకోర్టు ఆదేశాలు : షకీల్ కుమారుడు విచారణకు సహకరించాల్సిందే
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ఎదుట సాహిల్ హాజరు కావాలని సూచించింది. గతంలో, ప్రజా భవన్ గేట్లను తన కారుతో ఢీకొట్టాడంటూ సాహిల్‌పై పంజాగుట్ట పోలీసులకు కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో సాహిల్ దుబాయ్ వెళ్లాడు. అక్కడే ఉంటున్నాడు. అయితే, ఈ కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా సాహిల్ దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు సహకరించాలని సాహిల్‌కు ఆదేజాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే గత డిసెంబర్ నెల 23వ తేదీన వేకువజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహనం మితిమీరిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న మిగిలినవారిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితులను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సాహిల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పై విధంగా స్పందించింది. దీంతో, కోర్టు ఆదేశాలతో సాహిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రానున్నాడు. -
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న రాహిల్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు 20 వేల షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే హైకోర్టు ఆదేశాలను పాటించాలని రాహిల్‌కు సూచించింది. ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. కాగా ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రాహిల్ దుబాయ్‌కు పారిపోయాడు. అతడి కోసం గత కొంత కాలం గాలించిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా(ఏప్రిల్ 8న) పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జీ ముందు హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. -
ప్రజా భవన్ కేసు: రహేల్‌కు రిమాండ్ విధింపు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రహేల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రహేల్ కోసం గత కొంత కాలంగా పోలీసులు గాలిస్తున్నారు. అరెస్ట్ అనంతరం రహేల్‌ను పోలీసులు.. జడ్జీ ఎదుట హాజరుపరిచారు. దీంతో, ఈనెల 22 వరకు రహేల్‌కు రిమాండ్ విధించారు. అనంతరం, రహేల్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ప్రగతి భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్‌కు పారిపోయాడు. దీంతో, రహేల్‌కు ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ప్రగతి భవన్ వద్ద జరిగిన ప్రమాదంలో రహేల్‌ను తప్పించేందుకు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్టు చూపించారు నిందితులు. కానీ, అసలు నిందితుడు రహేల్గానే పోలీసులు గుర్తించారు. అసలేం జరిగిందంటే.. డిసెంబర్ 23 2023వ తేదీన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్(ప్రస్తుత ప్రజా భవన్) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రగతి భవన్ వద్ద ఉన్న బారికేడ్లపైకి దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని నిందితులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహేల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తెలిసింది. అయితే పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకోవడంతో నిందితుడు కావాలనే తప్పిపోయాడా ఎవరైనా తప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అసలు నిందితుడు రహేల్ అని తేల్చారు. మరో కేసులో రహేల్.. జూబ్లీహిల్స్‌లో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో షకీల్ కొడుకే రహేల్ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహీంద్రా థార్ వాహనం రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో షకీల్ వాహనంగా తేలింది. అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్ ప్రకటన ఇచ్చారు. మరోవైపు అఫ్రాన్ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. తాజాగా దర్యాప్తులో ఆరోజు కారు నడిపింది రహేల్ అని పోలీసులు గుర్తించారు. మరోవైపు.. అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లి బాధితులను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్ సీట్ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి రాహేల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. -
షకీల్ కొడుకు రాహిల్ కేసులో కొత్త ట్విస్ట్.. తెరపైకి మరో కేసు
సాక్షి, హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది. జూబ్లీహిల్స్‌లో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో షకీల్ కొడుకే రాహిల్ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహీంద్రా థార్ వాహనం రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో షకీల్ వాహనంగా తేలింది. అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్ ప్రకటన ఇచ్చారు. మరోవైపు అఫ్రాన్ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. తాజాగా దర్యాప్తులో ఆరోజు కారు నడిపింది రాహిల్ అని పోలీసులు గుర్తించారు. మరోవైపు.. అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లి బాధితులను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్ సీట్ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి రాహిల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా.. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజాభవన్ సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న షకీల్, రాహిల్‌కు ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయిన సంగతి తెలిసిందే. -
Panjagutta PS: సిబ్బందిపై వేటు వెనక కారణాలివే?
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్ లోని మొత్తం 86 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు పోలీస్ కమీషనర్. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ లో ఉన్న 80శాతం సిబ్బందిని బదిలీచేస్తూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్‌ఫర్స్‌తో పోలీసులు అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. సిటీలో ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ శోభన్ అనే కొత్త ఇన్స్పెక్టర్ ని సీఐగా నియమించారు. ఈరోజు పీఎస్‌లోని ఆరుగురు ఎస్సైలు, 9 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సీపీ. పీఎస్‌లో మొత్తంగా వందకు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈరోజు ట్రాన్స్ ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ ఫర్ చేశారు. ట్రాన్స్ ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సీపీ. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైమ్ లో పంజాగుట్ట పోలీసులు ఏమరపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం అదింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమీషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి, రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు -
‘రోడ్డు ప్రమాదం’ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ ఎదురుగా గత నెల ఆఖరివారంలో చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమీర్ నిందితుడిగా మారారు. కుమారుడు రహీల్ అమీర్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు చేసిన కుట్రకు ఆయనే సూత్రధారని దర్యాప్తు అ«ధికారులు తేల్చారు. ఈ ‘ఎస్కేప్ ఎపిసోడ్’లో మాజీ ఎమ్మెల్యే సహా పదిమంది పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అసలేం జరిగిందంటే.. రహీల్ అతడి స్నేహితుడితో పాటు ఇద్దరు యువతులతో కలిసి గత నెల 24వ తేదీ తెల్లవారుజామున బీఎండబ్ల్యూ కారులో (టీఎస్ 13 ఈటీ 0777) బేగంపేట వైపు నుంచి పంజగుట్ట వైపు వస్తున్నారు. ఆ సమయంలో కారును రహిల్నే నడుపుతున్నాడు. తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో ఈ కారు ప్రజాభవన్ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్ వద్ద బారికేడ్లను మితిమీరిన వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు, బారికేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు. అక్కడకు చేరుకున్న పంజగుట్ట పోలీసులు రహీల్‌ను ఠాణాకు తీసుకువచ్చారు. ఈలోపు విషయం ఫోన్ ద్వారా దుబాయ్‌లో ఉన్న తండ్రి షకీల్‌కు రహీల్ చెప్పాడు. ఆయన రంగంలోకి దిగి తన కుమారుడి స్థానంలో తన ఇంట్లో డ్రైవర్ అబ్దుల్ ఆరిఫ్‌ను ఉంచాలని పథకం వేశారు. దీన్ని అమలులో పెట్టడం కోసం రహీల్ స్నేహితులైన అర్బాజ్, సాహిల్‌తో పాటు మరి కొందరిని రంగంలోకి దింపారు. అర్బాజ్, సోహైల్‌లు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటికి వెళ్లి అక్కడున్న ఆరిఫ్‌ను తీసుకుని పంజగుట్ట ట్రాఫిక్ ఠాణా వద్దకు వచ్చారు. పోలీసులూ సహకరించడంతో అప్పటికే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం రహీల్ స్థానంలో ఆరిఫ్‌ను ఉంచారు. సీసీ ఫుటేజ్‌తో అసలు వాస్తవం వెలుగులోకి ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం కావడంతో కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ డీసీపీ ఎం.విజయ్‌కుమార్ సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అసలు కథ వెలుగులోకి వచ్చి పంజగుట్ట ఇన్స్పెక్టర్గా పని చేసిన దుర్గారావుపై సస్పెన్సన్ వేటు పడింది. ఆరిఫ్‌ను అప్పుడే అరెస్టు చేసి రహీల్‌పై అదనపు సెక్షన్ల కింద ఆరోపణలు చేర్చారు. ఈ ఎస్కేప్ వ్యవహారం దర్యాప్తు నేపథ్యంలో షకీల్‌తో పాటు అర్బాజ్, సాహిల్, మరో ఏడుగురి పాత్ర తాజాగా వెలుగులోకి వచి్చంది. దీంతో అర్బాజ్, సోహైల్‌ను సోమవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో షకీల్‌ను నిందితుడిగా చేరుస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు. నిందితులపై అదనపు సెక్షన్లతో కేసులు ఇప్పటికే రహీల్‌పై లుక్ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ అయి ఉంది. తాజాగా షకీల్‌తో పాటు రహీల్ ఎస్కేప్‌కు సహకరించి, దుబాయ్ పారిపోయిన మరో ఇద్దరి పైనా బుధవారం జారీ చేశారు. తొలుత పంజగుట్ట పోలీసులు ఆరిఫ్పై మూడు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తులో వెలుగులోకి వచి్చన అంశాల నేపథ్యంలో నిందితులపై ఐపీసీ, ఎంవీ యాక్ట్ల్లోని మరో 14 సెక్షన్లను జోడించారు. -
ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్(పాత ప్రగతి భవన్) ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ దుబాయ్‌కు పారిపోయేందుకు షకీల్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాద ఘటన తర్వాత.. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు మొత్తం పది ముంది సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. అందులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇందులో షకీల్ కూడా తన కొడుకు కోసం సహకరించినట్లు గుర్తించారు. ఇక.. ఇప్పటికే సాహిల్ అలియాస్ రాహిల్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజా భవన్ ముందు సాహిల్ గత నెల 23వ తేదీన కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను తన కారుతో ఢీకొట్టాడు. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక.. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపైనా వేటు వేశారు. ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు -
TS: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో హై కోర్టు కీలక తీర్పు
సాక్షి,హైదరాబాద్ : ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్‌ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17న సోహైల్ పోలీసుల ముందు హాజరు కావాలని తెలిపింది. పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద తనపై నమోదైన ర్యాష్ డ్రైవింగ్ కేసు కేసు కొట్టివేయాలని సోహైల్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించింది. ర్యాష్ డ్రైవింగ్ కేసుకే తన క్లయింట్‌పై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారని సోహైల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సొహైల్ 15 కేసులు ఉన్నట్టు చూపించారన్నారు. అయితే చేయని తప్పుకి దుబాయ్ ఎందుకు పారిపోయారని హైకోర్టు ప్రశ్నించింది. తప్పుడు కేసు పెట్టి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతోనే సోహైల్ దుబాయ్ వెళ్లాడని న్యాయవాది కోర్టుకు బదులిచ్చారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద గత డిసెంబర్ 23న సోహైల్ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను సోహైల్ కారు ఢీ కొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు సోహైల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. దీనిపై విమర్శలు రావడంతో పంజాగుట్ట సీఐని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. అప్పటికే దుబాయ్ పారిపోయిన సోహైల్‌ను అరెస్టు చేసేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదీచదవండి..కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ -
‘ప్రజాభవన్’ ఘటనలో కొత్త కోణం
హైదరాబాద్, సాక్షి: బేగంపేట ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న చోటుచేసుకున్న ర్యాష్ డ్రైవింగ్ కేసులో.. ప్రధాన నిందితుడు సాహిల్‌ను తప్పించి మరొకరిని నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడిని ఎలా తప్పించారనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన రోజున రాత్రి విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ దుర్గారావు.. ఘటనాస్థలం నుంచి సాహిల్‌ను కారులో పంజాగుట్ట ఠాణాకు తీసుకొచ్చారు. కానిస్టేబుల్‌కు అప్పగించి, పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు బ్రీత్ఎనలైజర్ పరీక్ష కోసం పంపారు. ఈక్రమంలో నిందితుడు తప్పించుకొని, అప్పటికే బయటున్న కారులో ఇంటికి వెళ్లాడు. తమ డ్రైవర్‌ను తన స్థానంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపాడు. అతడితో ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు వాంగ్మూలం ఇప్పించేలా పురిగొల్పాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూశాక కూడా ఉన్నతాధికారులకు ఇన్స్పెక్టర్ అసలు విషయం చెప్పకుండా గోప్యత పాటించినట్టు తేలింది. నిందితుడు తప్పించుకొని ముంబయికి, అక్కడి నుంచి దుబాయ్ పారిపోయేందుకు సహకరించినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. దర్యాప్తును పక్కదారి పట్టించడంలో ఇన్స్పెక్టర్ కీలకంగా వ్యవహరించినట్టు పంజాగుట్ట ఠాణా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారాలు సేకరించారు. ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు గుర్తించాకనే.. ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈవ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇదీ చదవండి: మోస్ట్‌వాంటెడ్‌గా నాడు షకీల్.. నేడు సాహిల్!! -
మాజీ ఎమ్మెల్యే షకీల్ కోడుకు ఆక్సిడెంట్ చేసులో భారీ ట్విస్ట్
-
భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో చూసుకుందామని బెదిరిస్తే భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరు అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. దీంతో, ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా, బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయటపెడుతున్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి.. వెనుక నుండి కాదు. నేనెవరి మీదా తప్పుడు కేసులు పెట్టలేదు. ఎంఐఎం కౌనిల్సర్లు నామీద ముమ్మాటికీ హత్యాయత్నం చేశారు. ప్లాన్ ప్రకారమే ఆరోజు నామీద దాడి చేసి చంపాలనుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులపై సంఘ విద్రోహా కేసులు ఉన్నాయి. దొంగతనం, రౌడీయిజం, మర్డర్ ఇలా చాలా కేసులు వారిపై ఉన్నాయి. బోధన్ బీఆర్ఎస్ రాజకీయ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి నాపై కుట్రలు చేస్తున్నారు. ఈ హత్యాయత్నం కేసులో పోలీసులే నిజానిజాలు తేలుస్తారు. ఈసారి ఎన్నికల్లో తేల్చుకుందాం. బోధన్ ప్రజలు నాతోనే ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అరెస్ట్ అయిన వారంతా కవిత గెలుపు కోసం పనిచేశారు: ఎంఐఎం ఒవైసీ -
బోధన్ ఎమ్మెల్యే vs మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీ వార్
-
నిజామాబాద్: ముంపు గ్రామల్లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పర్యటన
-
జూబ్లీహిల్స్ ప్రమాదం.. కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బాలుడి మృతికి కారణమైన బండిలో.. ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. రాహిల్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీపీ సుదర్శన్ వివరాలను వెల్లడించారు.. ఫిలింనగర్ నుండి ఇన్ ఆర్బిట్ మాల్ మీదుగా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఎంఎల్ఏ కొడుకు రాహిల్ ఉన్నాడు. రాహిల్ తో పాటు అఫ్నాన్, నాజ్ మొత్తం ముగ్గురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పారిపోయారు. నిందితులు పారిపోయిన రూట్ లో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించాం. అన్ని రకాల ఎవిడెన్స్ సేకరించాం. ప్రమాదం జరిగిన టైంలో కారు నడిపింది అఫ్నాన్. రాహిల్ పక్కనే ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కారు నడిపింది అఫ్నాన్ అని నిర్ధారించుకున్నాం. ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ప్రధాన కారణాలని ఏసీపీ వెల్లడించారు. గురువారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు మహేంద్ర థార్ వేగంగా దూసుకొచ్చింది. ఆ టైంలో రోడ్డు దాటుతున్న కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ రెండు నెలల బిడ్డ కిందపడి.. మృతి చెందిన విషయం తెలిసిందే. బండిపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో కేసు ఆసక్తికరంగా మారింది. కాజల్ చౌహాన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆపై పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకేనంటూ ప్రచారం మొదలైంది. అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారి మృతి చెందడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు తమ బంధువులదని, ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ కారులో తన కొడుకు లేడని ఎమ్మెల్యే షకీల్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ కారులో తమ బంధువులు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే శుక్రవారం వివరణ ఇవ్వగా.. అందులో ఆయన కొడుకు కూడా ఉన్నాడంటూ తాజాగా పోలీసులు ప్రకటించడం విశేషం. -
చట్టపరంగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు: ఎమ్మెల్యే షకీల్
హైదరాబాద్: బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్న కారు జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై తనకు ఎటువంటి సంబంధం లేదని ఈరోజు(శుక్రవారం) ఉదయం పేర్కొన్న బోధన్ ఎమ్మెల్యే షకీల్.. ఆ కారు తమ బంధువులదని మరొకసారి వెల్లడించారు. సాక్షి’తో మాట్లాడిన ఆయన.. ప్రమాదానికి గురైన కారు తమ బంధువులదని, ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు, ఇటీవలే కారును తమ బంధువులు కొనుగోలు చేశారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పానని,చట్టపరంగా పోలీసులు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి చనిపోవడం బాధిస్తుందన్నారు. కాగా,మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే రోడ్డుపై బుడగలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో వారు వ్యాపారం ముగించుకుని జూబ్లీహిల్స్ వైపు వెళ్తుండగా.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి మహేంద్రా థార్ కారు జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వైపు అతివేగంగా వచ్చి వారిని ఢీకొంది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ కుమారుడు అశ్వతోష్ (2 నెలలు) తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కాజల్, సారికా చౌహాన్, సుష్మా భోస్లేలను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదానికి కారణమైన మీర్జాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీర్జాతోపాటు అతని కుమారుడ్ని కూడా అరెస్ట్ చేశారు. -
ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సం.. స్పందించిన బోధన్ ఎమ్మెల్యే
బంజారాహిల్స్: బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్న కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో అభంశుభం తెలియని 2 నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే రోడ్డుపై బుడగలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో వారు వ్యాపారం ముగించుకుని జూబ్లీహిల్స్ వైపు వెళ్తుండగా.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి మహేంద్రా థార్ కారు జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వైపు అతివేగంగా వచ్చి వారిని ఢీకొంది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ కుమారుడు అశ్వతోష్ (2 నెలలు) తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కాజల్, సారికా చౌహాన్, సుష్మా భోస్లేలను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. చదవండి: Hyderabad: ఈ రోజు రాత్రి ఆ మూడు ఫ్లైఓవర్లు మినహా అన్నీ బంద్ . ఎందుకంటే అయితే ఈ ఘటనపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ఈ ప్రమాదంతో తనకెలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే స్టికర్‌ను మిత్రుడు మీర్జా అనే వ్యక్తికి ఇచ్చినట్లు,అది అతనికి సంబందించిన కారని తెలిపారు. ఆ కారు ఓ ప్రైవేట్ ఇన్ఫ్రా కంపెనీ పేరు మీద ఉందని అన్నారు. ఒక మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెట్టడం వల్లనే యాక్సిడెంట్ అయిందని తనకు తెలిసిందన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా విచారణ జరపాలని ఎమ్మెల్యే కోరారు. -
‘బల్సిందా నీ.. ఊర్కో బే’ బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ బోధన్/ బాన్సువాడ: ‘బలిసిందా నీది.. ఊరుకో బే బాడ్ఖావ్.. ఏం మాట్లాడుతున్నావు..’ అంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ ఓ కిరాణా వ్యాపారిని బూతులు తిట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సరిగ్గా మాట్లాడండి’ అంటూ వ్యాపారి వారించినా వినకుండా ఎమ్మెల్యే ఆగ్రహంతో దూషణలకు దిగారు. డబ్బులు ఇచ్చానంటూ గద్దించారు. దీంతో మసీదు ఎక్కి ఆ మాట చెప్పాలని వ్యాపారి పేర్కొన్నారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తాను మధ్యతరగతికి చెందిన వాడినని వాపోయారు. ఈ నేపథ్యంలోనే తనకు ఎమ్మెల్యే నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని, లేదంటే ఎమ్మెల్యే నివాసం ఎదుట నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మురళీధర్ అనే ఈ వ్యాపారి సోమవారం బోధన్ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు బోధన్ పోలీసులు నిరాకరించడంతో గురువారం బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని, తనకు ఎమ్మెల్యేతో ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎప్పుడో రంజాన్ తోఫా కిట్ల డబ్బులు.. 2018లో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు సరుకులతో కూడిన తోఫా కిట్ల సరఫరాకు సంబంధించి వ్యాపారి మురళీధర్‌తో ఎమ్మెల్యే షకీల్ రూ.36 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.12 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.24 లక్షలు 3 నెలల్లో ఇస్తామని చెప్పారు. కానీ ఈ డబ్బుల కోసం తాను పలుమార్లు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినా స్పందించలేదని మురళీధర్ వాపోతున్నారు. అలాగే, 2019లో ఫుడ్ క్యాటరింగ్‌కు సంబంధించి మరో రూ.5 లక్షలు కూడా తనకు రావాలన్నారు. ఈ డబ్బుల కోసం పలుమార్లు హైదరాబాద్‌కు వెళ్లి అడిగినా.. ఎమ్మెల్యే దాటవేశారని తెలిపారు. చివరకు తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడంతో, ఎమ్మెల్యే స్నేహితుడికి ఫోన్ చేసి తన బాధను వెళ్లగక్కానని, స్నేహితుడి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే తనతో మాట్లాడారని వ్యాపారి తెలిపారు. బూతు మాటలతో తిట్టడంతో పాటు ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పారన్నారు. తాను అప్పులు తెచ్చి సరుకులు సరఫరా చేశానని, తన వద్ద డబ్బులు లేక అవి తీర్చలేదని, వడ్డీ కూడా కట్టకపోవడంతో తన షాపు వేలం వేస్తున్నారని వాపోయారు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు: ఎమ్మెల్యే తాను మురళీధర్‌కు పది పైసలు కూడా బాకీ లేనని, ఇదంతా తన రాజకీయ ప్రత్యర్థులు చేసిన కుట్ర అని షకీల్ అమేర్ సాక్షి ప్రతినిధితో అన్నారు. ప్రత్యర్థుల ప్రోద్బలంతోనే ఇలా చేస్తున్నారని చెప్పారు. అతనికి తానే లిఫ్ట్ ఇచ్చానని, ఇప్పుడు తననే బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. తాను 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేదలను ఆదుకున్నానని, తాను బాకీ ఉన్నానని అనడం తప్పు మాట అని అమేర్ పేర్కొన్నారు. -
వైరల్‌గా మారిన బోదన్ ఎమ్మెల్యే షకీల్ బూతు పూరాణం
-
ఆడియో కలకలం.. బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి, నిజామాబాద్: బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ కిరాణా దుకాణం యజమానిని బూతులు తిడుతూ వేధిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంజాన్ పండుగకు ఆర్డర్ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన దుకాణం యజమానిపై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్ రంజాన్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కిరాణా వ్యాపారి అయిన రుద్రంగి మురళీధర్‌కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశారు. ఒక్కోటి రూ.600 రూపాయల చొప్పున 6000 వేల ప్యాకెట్లకు ఆర్డర్ ఇవ్వగా.. ఎమ్మెల్యే 36లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో షకీల్ అడ్వాన్స్‌గా 12 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్ నిమిత్తం మురళీధర్‌కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఎమ్మెల్యే షకీల్, కిరాణా వ్యాపారికి 30లక్షల రూపాయల వరకు బాకీ పడ్డారు. తన డబ్బులు ఇప్పించాలని మురళీధర్ రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద బాధను చెప్పుకోగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్‌తో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడించాడు. ఈ నేపథ్యంలోనే మురళీధర్‌పై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిదిరా..’ అంటూ చెప్పుకోలేని రీతిలో దుర్భాషలాతుడూ కాల్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూతు పురాణాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లిబోసుకున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని షాపు పెట్టుకున్నానని, ఎమ్మెల్యే కారణంగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో అధికారులు తన షాపును సీజ్ చేశారని మురళీధర్ తెలిపాడు. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. చదవండి: వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం! ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ -
నిరూపిస్తే రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, నిజామాబాద్ : బోధన్‌లో రోహింగ్యాలు ఉన్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఛాలెంజ్ చేశారు. బోధన్‌లో బంగ్లాదేశ్ వాసులు కొందరు అక్రమ పత్రాలతో పాసు పోర్టులు పొందిన విషయంపై ఆయన మాట్లాడారు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. ఒకే ఇంటి నంబర్ మీద 32కు పైగా పాసు పోర్టులు పొందుతుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పాసుపోర్టుల అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.. ఎంపీ అరవింద్ కేంద్రంలోని బీజేపీకి చెందిన ఎంపీ కాబట్టి ఆయన కేంద్రంతో మాట్లాడి పాసుపోర్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పార్టీ మార్పుపై ఎమ్మెల్యే షకీల్ వివరణ
సాక్షి, నిజామాబాద్: తాను టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. పార్టీ మార్పుపై వస్తున్నదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేశారు. తెలంగాణలో తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ అయ్యారు. వీరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షకీల్ త్వరలోనే బీజేపీలో చేరతారని వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై వస్తున్న ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా షకీల్ స్పందించారు. ‘నాపై వస్తున్న వార్తలు అవాస్తవం. నేను టీఆర్ఎస్లోనే కొనసాగుతా. నాకు మంత్రిపదవి రానందుకు అసంతృప్తి ఉందనే ప్రచారం కూడా సరైంది కాదు. వ్యక్తిగత పనిమీద అరవింద్‌ను కలిశాను. నేను బీజేపీలో కానీ కాంగ్రెస్‌లో కానీ చేరను, ఆ ఆలోచనలే లేవు. నాకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. 12 ఏళ్ళుగా కేసీఆర్‌తో కలిసి నడుస్తున్నాం. జీవితాంతం ఇదేవిధంగా ఉంటాం. సమయం వచ్చినప్పుడు, దేవుడు కరుణించినప్పుడు అవకాశాలు అవే వస్తాయి’ అంటూ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. కాగా తెలంగాణ కేబినెట్ విస్తరణ తర్వాత రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్లో మొదలైన అలకలు, అసంతృప్తుల పర్వం మొదలైన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో గులాబీ బాస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారంత బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అలక! చదవండి: కమలదళం వలస బలం! -
కేసీఆర్ నా గాడ్ ఫాదర్
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అలక!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ విస్తరణ తర్వాత రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్లో మొదలైన అలకలు, అసంతృప్తుల పర్వం అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్.. గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. ఆ భేటీకి సంబంధించిన ఫొటోను అరవింద్ స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే షకీల్ తనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చిన ఫోటోను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అరవింద్ షేర్ చేశారు. ‘టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఈ రోజు నా నివాసానికి వచ్చారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు నిజామాబాద్ జిల్లా రాజకీయాలపైనా విస్తృతంగా చర్చించాం’అని ట్విట్టర్లో అరవింద్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో షకీల్ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు షకీల్ కూడా తన ఆవేదనను కొందరు సన్నిహితులతో పంచుకున్నట్లు సమాచారం. ‘టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలకు విలువ లేదు. ఆత్మాభిమానం చంపుకుని బతకలేను. తెలంగాణలో టీఆర్ఎస్కు చెందిన ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేనైనా మంత్రి పదవి ఇవ్వలేదు. ఎంఐఎం నేతల సూచనలకు అనుగుణంగా టీఆర్ఎస్ అధిష్టానం నడుచుకుంటోంది. బోధన్ నుంచి మూడు పర్యాయాలు పోటీ చేసి రెండు సార్లు గెలుపొందా. కీలక సమయంలో పార్టీ వెంట నడిచా. జిల్లాలో రాజకీయ దిగ్గజం సుదర్శన్‌రెడ్డిని ఓడించినా నాకు గుర్తింపు దక్కలేదు’అని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. బీజేపీలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం ఏదైనా ఉంటుందని ఆయన చెప్పినట్టు తెలిసింది. సోమవారం మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నట్టు సమాచారం. ఎంపీ అరవింద్‌తో భేటీ, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో షకీల్ చేరిక ఖాయమైనట్లుగానే తెలుస్తోంది. పార్టీ పరిణామాలపై కేసీఆర్ దృష్టి..? పార్టీలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లోతుగా దృష్టి సారించినట్లు సమాచారం. జిల్లాల వారీగా పార్టీ నేతల కదలికలు, మనోగతం తదితరాలపై ఆరా తీస్తూ.. అసమ్మతికి దారితీస్తున్న పరిణామాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలవారీగా పార్టీలో ఉన్న కీలక నేతలు, వారి నేపథ్యం, ప్రస్తుతం అనుభవిస్తున్న పదవి, పదవులు ఆశిస్తున్న వారు తదితర కోణాల్లో సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే బాధ్యతను అనునిత్యం తనతో ఉండే కీలక నేతకు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ఇటీవలి కాలంలో పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల్లో కొందరితో సీఎం కేసీఆర్ మాట్లాడగా.. మరికొందరిని పిలిపించి కారణాలు తెలుసుకునే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. గులాబీ జెండాకు మేమే ఓనర్లం అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటెల రాజేందర్‌తో సీఎం కేసీఆర్ ఈనెల 8న ప్రగతిభవన్‌లో సుమారు అరగంట పాటు భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులకు కీలక పదవులు ఇస్తామంటూ ప్రకటించడం ద్వారా అసమ్మతికి మొదట్లో చెక్ పెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నించారు.అసమ్మతిస్వరం వినిపిస్తున్న నేతలతో పాటు పదవులు ఆశిస్తున్న నేతలు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అలాగే జిల్లాలవారీగా పలువురు కీలక నేతలకు ఫోన్లు చేసి తనను కలవాలని కేటీఆర్ ఆదేశిస్తున్నట్టు సమాచారం. ఇకపై నో చిట్ చాట్..! తెలంగాణ భవన్, అసెంబ్లీ లాబీల్లో తమకు ఎదురవుతున్న మీడియాతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెడుతుండటంతో ఇకపై ‘చిట్ చాట్’కు దూరంగా ఉండాలని కేటీఆర్ సూచించినట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, బాల్క సుమన్, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి తదితరులు అసెంబ్లీ లాబీలో చేసిన వ్యాఖ్యలు మీడియాలో రావడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కేసీఆర్ నా గాడ్‌ఫాదర్: షకీల్ సీఎం కేసీఆర్ తన పొలిటికల్ గాడ్ ఫాదర్ అని, ఆయన ఆశీస్సులతోనే రెండు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైనట్లు షకీల్ పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. గురువారం రాత్రి ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో షకీల్ భేటీ అయ్యారు. అనంతరం తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం బోధన్‌కు మంజూరు చేసిన రూరల్ అర్బన్ స్కీమ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ను ఆయన నివాసంలో కలిశాను. మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాం. దీనిపై టీవీ, సోషల్ మీడియాలో నేను పార్టీ మారినట్లు ప్రచారం జరిగింది’’అని షకీల్ అందులో వివరించారు. -
భాయ్ ఎంటర్ అయితే ఇంక అంతే..!
-
గుండెపోటుతో నయీమ్ అనుచరుడి మృతి
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు రౌడీషీటర్ షకీల్ సోమవారం అర్ధరాత్రి మేడ్చల్‌లోని మెడిసిటీ ఆసుపత్రిలో మృతిచెందాడు. షకీల్ మాజీ మావోయిస్టు సాంబశివుడి హత్యకేసులో ప్రధాన నిందితుడు. షకీల్‌పై 150 పైగా కేసులు ఉన్నాయి. మృతదేహాన్ని నల్గొండ జిల్లా భువనగిరి త రలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
షకీల్, బిల్లాలపై హత్యాయత్నం కేసు కొట్టివేత
గుజరాత్ పోలీసుల మీద దాడికేసులో హైదరాబాద్ నగరానికి చెందిన మౌతసిన్ బిల్లా, షకీల్లపై కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. అయితే ఇదే కేసులో మరో ముగ్గురికి మాత్రం నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. బలియుద్దీన్, వలియుద్దీన్, షఫీద్ అనే ముగ్గురికి ఈ శిక్ష విధించారు. 2004 సంవత్సరంలో డీజీపీ కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో.. గుజరాత్ పోలీసుల మీద హత్యాయత్నం చేశారంటూ మౌతసిన్ బిల్లా, షకీల్‌ల మీద కేసు నమోదైంది. 2004 సంవత్సరంలో గుజరాత్ హోం శాఖ మంత్రి హరేన్ పాండ్పయ హత్య కేసులో నసీరుద్దీన్ షాను గుజరాత్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. నసీరుద్దీన్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ డీజీపీ ఆఫీసు ముందు ఆందోళన కారులు ధర్నా చేసి.. గుజరాత్ పోలీసులు మీద దాడి చేశారు. దాంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా, మౌతసిన్ బిల్లా సోదరుడు సలీం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అటు మౌతసిన్ బిల్లా, షకీల్లపై హత్యాయత్నం కేసు నమోదు కాగా... గుజరాత్ పోలీసులపై హత్యకేసు నమోదైంది. రెండో కేసు విషయం ఏమైందీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.