ఆడియో కలకలం.. బోధన్‌ ఎమ్మెల్యే బూతు పురాణం | Bodhan MLA Shakeel Abuses Kirana Store Owner Over Phone About Ramzan Tofa Money | Sakshi
Sakshi News home page

ఆడియో కలకలం.. బోధన్‌ ఎమ్మెల్యే బూతు పురాణం

Published Thu, Mar 25 2021 9:56 AM | Last Updated on Thu, Mar 25 2021 10:36 AM

Bodhan MLA Shakeel Abuses Kirana Store Owner Over Phone About Ramzan Tofa Money - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ కిరాణా దుకాణం యజమానిని బూతులు తిడుతూ వేధిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంజాన్‌ పండుగకు ఆర్డర్‌ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన దుకాణం యజమానిపై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ రంజాన్‌ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన  కిరాణా వ్యాపారి అయిన రుద్రంగి మురళీధర్‌కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్‌ చేశారు. ఒక్కోటి రూ.600 రూపాయల చొప్పున 6000 వేల ప్యాకెట్లకు ఆర్డర్‌ ఇవ్వగా.. ఎమ్మెల్యే 36లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంది.

ఈ క్రమంలో షకీల్‌ అడ్వాన్స్‌గా 12 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్‌ నిమిత్తం మురళీధర్‌కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఎమ్మెల్యే షకీల్‌,  కిరాణా వ్యాపారికి 30లక్షల రూపాయల వరకు బాకీ పడ్డారు. తన డబ్బులు ఇప్పించాలని మురళీధర్‌ రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద బాధను చెప్పుకోగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్‌తో రెండు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడించాడు.

ఈ నేపథ్యంలోనే మురళీధర్‌పై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిదిరా..’ అంటూ చెప్పుకోలేని రీతిలో దుర్భాషలాతుడూ కాల్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూతు పురాణాన్ని సెల్‌ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లిబోసుకున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని షాపు పెట్టుకున్నానని, ఎమ్మెల్యే కారణంగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో అధికారులు తన షాపును సీజ్ చేశారని మురళీధర్ తెలిపాడు. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.

చదవండి: వీఆర్‌ఓపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తిట్ల పురాణం!

ఆడియో టేప్ లీక్‌: ఖుష్బూ క్ష‌మాప‌ణ‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement