audio tape
-
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్‌జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్‌జాదా హెచ్చరించారు. -
అవసరమైతే ఆత్మాహుతి దాడులకూ ప్లాన్!..
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇటీవల హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేయడానికి ఈ మాడ్యూల్స్ సిద్ధమయ్యాయని, వీటికి విదేశాల నుంచి ఆదేశాలు అందుతున్నాయని ప్రాథమిక ఆధారాలు లభించాయి. మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్ సహా ముగ్గురి నుంచి రికవరీ చేసిన ఫోన్లను ఏటీఎస్ అధికారులు విశ్లేషించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులకు సిద్ధం కావాలంటూ ఓ వ్యక్తి నుంచి వీరికి ఆదేశాలు అందినట్టు గుర్తించారు. ఫోన్ల నుంచి ఆడియోలు రికవరీ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన 16 మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు సమాచార మారి్పడికి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారని.. ఎప్పటికప్పుడు డేటాను డిలీట్ చేయడం వల్ల కీలకమైన సమాచారమేదీ లభించలేదని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా 50 ఆడియో ఫైళ్లను రికవరీ చేసినట్టు సమాచారం. ఈ ఆడియోల్లో ప్రసంగించిన వ్యక్తి.. ఒకేసారి అనేక మందిని చంపడం (మాస్ కిల్లింగ్), సాబోటేజ్ (విధ్వంసాలు సృష్టించడం), ఎంపిక చేసుకున్న వ్యక్తులను హతమార్చడం (టార్గెట్ కిల్లింగ్)తోపాటు ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తేల్చారు. ఈ ఆడియోలతోపాటు వీరికి అందిన ఆదేశాలు, సూచనల సందేశాలూ రికవరీ అయ్యాయి. ఇక ఈ ఫోన్లకు పాకిస్తాన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని, కాంటాక్ట్స్ లిస్టులోనూ ఆ దేశ నంబర్లు ఉన్నాయని గుర్తించారు. ఆ ఫోన్ నంబర్లు ఎవరివి, ఆడియోల్లోని వ్యక్తి ఎవరు అనేది గుర్తించేందుకు కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కొన్ని ఆడియోల్లో కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన ఆడియోల్లో లండన్‌లోని గ్లాస్గో విమానాశ్రయంపై 2007లో మానవ బాంబు దాడికి ప్రయత్నించిన బెంగళూరు వాసి, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఇతను హిజ్బ్ ఉత్ తెహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ తరఫునే మానవబాంబుగా మారాడు. హైదరాబాద్–¿ోపాల్ మాడ్యూల్ ఉగ్రవాదులూ తొలినాళ్లలో ఇదే ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేశారు. ఈ క్రమంలో ఫోన్లలోని ఆడియోలు హెచ్‌యూటీ హ్యాండ్లర్‌విగా భావిస్తున్నారు. ఇక ఏటీఎస్ విచారిస్తున్న 16 మంది పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. మరో ఐదు రోజులు కస్టడీ కోరాలని ఏటీఎస్ భావిస్తోంది. ఈ కేసులో మరో ముగ్గురు హైదరాబాద్ వాసులను సాక్షులుగా చేరుస్తున్నారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 17 రైళ్లు రద్దు -
కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి...
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి పాదాల వద్ద తాను చేసిన ప్రమాణంతో సీఎం కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ జోస్యం చెప్పారు. కేసీఆర్ తప్పుచేశారు కాబట్టే యాదాద్రికి రాలేదని, మునుగోడులో ఓడిపోతున్నామనే భయంతో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు. ఈ కేసులో కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలందరూ లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ముఖమండపంలో ఉత్సవ విగ్రహాల వద్ద ఆయన ప్రమాణం చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో తనకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అనంతరం కొండ కింద స్వామివారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఆడియో టేపుల పేరుతో తాజాగా మరో కొత్త సినిమా చూపే యత్నం చేసి కేసీఆర్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ యాడ్ చేసినట్లుగా.. చిత్తయిన డ్రామాను రక్తికట్టించేందుకు ఆడియో టేపు పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్ ఆడియో టేపుల్లో చెప్పిన దాని ప్రకారం.. 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్ అని, సంతోష్ అంటే కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్‌కుమార్ అని బండి సంజయ్ చెప్పారు. మునుగోడులో దుకాణం నడవలేదని, హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశాడని, అక్కడా ఫెయిల్ కావడంతో ఢిల్లీ పేరుతో డ్రామా చేయబోతున్నాడన్నారు. లిక్కర్ దందాలో తన బిడ్డను, అవినీతి సొమ్మును ఎలా కాపాడుకోవాలన్నదే సీఎం తపన తప్ప ఇంకేమీ లేదన్నారు. తాను దేవుడిని నమ్ముకున్నానని, కేసీఆర్ దయ్యాలను, అవినీతి సొమ్ముతో కుట్రలు కుతంత్రాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తరువాత టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపాడన్నారు. తడి బట్టలతో ప్రమాణం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పినట్లుగానే బండి సంజయ్ శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్నారు. ముందుగా ఆయన కొండపైకి చేరుకుని అక్కడే బిందెడు నీటితో తల స్నానం చేశారు. తడిబట్టలతోనే శ్రీ స్వామి దర్శనానికి వెళ్లారు. గర్భాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద ప్రమాణం చేశారు. బండి సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలతో ఆందోళన చేశాయి. కాగా, చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలంటూ మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో చేనేత కార్మికులు పోస్ట్‌కార్డులు, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. -
బీజేపీ నేత శ్వేత మృతి కేసులో సంచలన విషయాలు
బీజేపీ నేత శ్వేతా సింగ్ గౌర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన నీచపు బాగోతం బయటపెడుతుందనే ఉద్దేశంతోనే ఆమె భర్తే ఆమెను హత్య చేసి.. అత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడంటూ ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే శ్వేత భర్తను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ బండాకు చెందిన జిల్లా పంచాయితీ సభ్యురాలు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్వేతా సింగ్ గౌర్.. బుధవారం తన ఇంట్లో శవమై కనిపించారు. తన భర్త, బీజేపీ నేత దీపక్ గౌర్ ఇన్వాల్వ్ అయిన ఇంటర్నేషనల్ సె* రాకెట్‌కు సంబంధించి ఆడియో కాల్స్ ఆమె రికార్డు చేసిందని, ఆ భయంతోనే ఆమె బిక్కుబిక్కుమంటూ గడిపిందని శ్వేత కుటుంబం ఆంటోంది. అందుకే తమ బిడ్డను హత్య చేశారని, ఇందులో దీపక్‌తో పాటు అతని తండ్రి, తల్లి, అన్న.. అంతా ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపిస్తోంది. ఈ మేరకు ఫిర్యాదు ఆధారంగా దీపక్ కుటుంబంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. నీచపు పని రష్యా, మొరాకో, ఆఫ్రికా అమ్మాయిలతో కూడిన వ్యభిచార ముఠాలతో దీపక్ లావాదేవీలు జరిపాడని శ్వేత కుటుంబం ఆరోపిస్తోంది. తన భర్త విటులను సంప్రదించిన ఫోన్ కాల్స్‌ను శ్వేత రికార్డు చేసిందని, ఇందుకు సంబంధించి ఫొటోలు, డబ్బు పంపిన వ్యవహారాలను సైతం ఆమె సేకరించింది. ఈ మేరకు మూడు సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్స్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అంతేకాదు.. లక్నోలోని ఎంజే ఇంటర్నేషనల్ హోటల్‌ను అడ్డాగా మార్చుకుని రాసలీలలకు దిగాడని శ్వేత తమతో చెప్పిందని ఆ కుటుంబం అంటోంది. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను హత్య చేశాడని, సీలింగ్‌కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని శ్వేత కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ పూర్తి ఆధారాలను యూపీ పోలీసులకు అప్పగించింది ఆ కుటుంబం. పరువు పోకూడదని అమ్మ భరించింది దీపక్‌కు పలువురు మహిళలతోనే వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయని వీళ్ల ఇద్దరు కూతుళ్లు చెప్తున్నారు. అంతేకాదు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో తమ తండ్రికి మరో వివాహం చేయాలని.. ఆయన కుటుంబం ప్రయత్నించిందని వాళ్లు అంటున్నారు. ఈ విషయమై చాలాసార్లు తమ తల్లి(శ్వేత) మీద దాడి జరిగిందని, కానీ పరువు పోకూడదనే ఉద్దేశంతో ఆమె ఇంతకాలం భరిస్తూ వచ్చిందని ఆ ఇద్దరు కూతుళ్లు అంటున్నారు. అదే టైంలో రాజేష్ అనే వ్యక్తి పేరిట.. దీపక్-శ్వేతల మధ్య ఓ వీడియో వైరల్ కావడం విశేషం. చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం.. -
అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రపన్నారు: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా
-
బాబు శవ రాజకీయాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
-
నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: ఎమ్మెల్యే కిలారి రోశయ్య
-
చంద్రబాబు నాటకం బట్టబయలు
-
Avanthi Srinivas: అది తప్పుడు ఆడియో
సాక్షి, విశాఖపట్నం: సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయిన ఆడియో తనది కాదని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇలా క్రియేట్ చేస్తున్నవారి నిగ్గుతేల్చాలని కోరినట్లు చెప్పారు. విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. మంచితనంతో అంచెలంచెలుగా ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగానని చెప్పారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎవరో కొందరు కుట్ర పన్నారని, దీనివెనుక ఎవరున్నారన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. తాను ఎటువంటి అవినీతిఖి పాల్పడనన్నారు. తన రాజకీయ ఎదుగుదలను, వైఎస్సార్సీపీ సర్కార్ ప్రగతిని చూసి ఓర్వలేక జరిగిన కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు శత్రువులు లేరని చెప్పారు. తాను మహిళతో మాట్లాడిన విషయం వాస్తవం కాదన్నారు. రోజురోజుకు రాజకీయాలు దిగజారుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తనకు దేవుడిపై నమ్మకం ఉందని, ఇలాంటి కుట్రలు ఎవరు పన్నినా అవి ఫలించవని చెప్పారు. తన ప్రత్యర్థి కూడా బాగుండాలి అనుకుంటానన్నారు. తాను తప్పుడు పనులు చేయనని, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతానని చెప్పారు. రాజకీయంగా తనపై పోటీచేసిన ప్రత్యర్థులను కూడా మిత్రులుగానే చూసే వ్యక్తినన్నారు. జిల్లాలో ఏకైక మంత్రిగా తాను చేసే మంచిపనులు, పార్టీ అభివృద్ధి చూడలేకనే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోతో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో మంచి కన్నా చెడు త్వరగా ప్రచారం జరుగుతుందన్నారు. ఇందులో ఎవరున్నా వదిలేది లేదని పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంతవరకు ఎవరూ తన ఎదుగుదలను అడ్డుకోలేరన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలను, రాష్ట్రంలో పార్టీ శ్రేణులను, అభిమానులను కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బవైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రెసిడెంట్ ఆడియో టేప్ లీక్.. రొనాల్డోపై తీవ్ర వ్యాఖ్యలు
లిస్బన్: క్రిస్టియానో రొనాల్డో ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు. అయితే తాజాగా క్రిస్టియానో రొనాల్డో, మేనేజర్ జోస్ మౌరిన్హోలను రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ ఎగతాళి చేసిన ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ఆడియోక టేపులో క్రిస్టియానో రొనాల్డో ఓ ఇడియట్, జబ్బు మనిషి అంటూ విమర్షించారు. ‘‘రొనాల్డో ఓ వెర్రివాడు. ఇడియట్, జబ్బు మనిషి. అందరూ అతడు సాధారణంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ అతను చేయాల్సిన పనులు చేయరు. అతను ఏదో చేస్తాడని మీరు అనుకుంటారు. కానీ ఏమీ చేయడు.’’ అంటూ విమర్షించారు. మెండిస్‌కు , మేనేజర్ జోస్ మౌరిన్హో ఇద్దరికీ రొనాల్డోపై నియంత్రణ లేదు. వారిద్దరికీ చాలా అహంకారం ఉంది. డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. మనం ఈ రోజు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దాంతో వారు గొప్ప వాళ్లుగా కనిపిస్తారు.’’ అంటూ పెరెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
ఆడియో కలకలం.. బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం
సాక్షి, నిజామాబాద్: బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ కిరాణా దుకాణం యజమానిని బూతులు తిడుతూ వేధిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంజాన్ పండుగకు ఆర్డర్ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన దుకాణం యజమానిపై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్ రంజాన్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కిరాణా వ్యాపారి అయిన రుద్రంగి మురళీధర్‌కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశారు. ఒక్కోటి రూ.600 రూపాయల చొప్పున 6000 వేల ప్యాకెట్లకు ఆర్డర్ ఇవ్వగా.. ఎమ్మెల్యే 36లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో షకీల్ అడ్వాన్స్‌గా 12 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్ నిమిత్తం మురళీధర్‌కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఎమ్మెల్యే షకీల్, కిరాణా వ్యాపారికి 30లక్షల రూపాయల వరకు బాకీ పడ్డారు. తన డబ్బులు ఇప్పించాలని మురళీధర్ రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద బాధను చెప్పుకోగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్‌తో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడించాడు. ఈ నేపథ్యంలోనే మురళీధర్‌పై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిదిరా..’ అంటూ చెప్పుకోలేని రీతిలో దుర్భాషలాతుడూ కాల్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూతు పురాణాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లిబోసుకున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని షాపు పెట్టుకున్నానని, ఎమ్మెల్యే కారణంగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో అధికారులు తన షాపును సీజ్ చేశారని మురళీధర్ తెలిపాడు. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. చదవండి: వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం! ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ -
కలకలం రేపుతున్న ఆడియో టేపు
-
న్యాయవాదుల హత్య కేసు: వామన్‌రావు ఆడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టిస్తుంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని, నేనంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. నీవు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావు కామెంట్ చేశారు. పుట్ట మధు, శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని వారంతా మీకు అండగా నిలుస్తారని మరో వ్యక్తి వామన్ రావుతో చెప్పారు. చాలా రోజుల క్రితం రికార్డు అయిన ఆడియో ఇప్పుడు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
-
వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి. వివేకానంద తనను బెదిరించాడని గాజుల రామారం వీఆర్ఓ శ్యామ్ కుమార్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆదేశాలమేరకు విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చినందుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడని అన్నారు. తనపై, రెవెన్యూ శాఖ అధికారులపై ఎమ్మెల్యే తిట్ల పురాణానికి సంబంధించి ఆడియో టేపులను పోలీసులకు అందించానని శ్యామ్ తెలిపారు. ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఎమ్మెల్యే వివేకానందపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్యామ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, అధికారులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలకు సంబంధించినదిగా ఓ ఆడియో టేపు ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇక ఎమ్మెల్యే తీరుపట్ల రెవెన్యూ ఉద్యోగులు మేడ్చల్ కలక్టర్ వద్ద ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్చల్) -
భక్తి భావంతో...
విలక్షణ నటుడు మోహన్‌బాబు వాయిస్ చాలా గంభీరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకు నిదర్శనం సినిమాల్లో ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్సే. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మోహన్‌బాబు ఉద్వేగభరితంగా డైలాగులు చెబుతారు. ఇప్పుడు భక్తి భావంతో ఆయన చెప్పే మాటలను వినబోతున్నాం. ఈ నెల 22న వినాయక చవితి. ఈ సందర్భంగా గణేశుడి పూజా విధానంతో కూడిన ఓ ఆడియో మోహన్‌బాబు గళంతో రానుంది. వినాయక చవితి పండగకు ఒక రోజు ముందు ఈ నెల 21న ఈ ఆడియో విడుదలవుతుంది. మోహన్‌బాబు గళంలో వినాయక పూజా విధానాన్ని వింటూ పండగను జరుపుకోవడం ఆయన అభిమానులకు ఓ మంచి అనుభూతి అని చెప్పొచ్చు. -
నా పిల్లలకు చెప్పు వాళ్లని ప్రేమిస్తున్నానని
వాషింగ్టన్: అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెల్లజాతి పోలీసు కాళ్ల కింద నలిగిపోయి, ఊపిరాడక తుదిశ్వాస విడిచిన జార్జ్ ఫ్లాయిడ్‌కు సంబంధించి ఓ ఆడియో టేప్ బుధవారం రిలీజైంది. దీని ప్రకారం.. అతను ప్రాణాలు విడిచే కొద్ది క్షణాల ముందు తనన చంపవద్దంటూ అధికారులను పదేపదే వేడుకున్నాడు. మరోవైపు అతను పోలీసులను చూసి వణికిపోతూనే వారికి సహకరించాడు. కారు నుంచి కింద పడేసే క్రమంలో అతని నోటి నుంచి రక్తం వచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని పోలీస్ ఆఫీసర్ డెరెక్ చావిన్ అతని మెడపై మోకాలితో గట్టిగా అదుముతూ క్రూరత్వం ప్రదర్శించాడు. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారిన అతను తనకు కరోనా ఉందని, చచ్చిపోతానేమోనని భయంగా ఉందన్నాడు. "నువ్వు మాట్లాడగలుగుతున్నావ్.. కాబట్టి బాగానే ఉన్నావ్లే" అంటూ సదరు పోలీసు కాఠిన్యంగా మాట్లాడాడు. (జాతి వివక్ష అంతమే లక్ష్యం) 'ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటున్నందున ఈ మాత్రమైనా మాట్లాడుతున్నా'నని సమాధానమిస్తూనే సాయం చేయమని అర్థించాడు. అప్పటికీ ఆ పోలీసు వెనక్కు తగ్గకపోవడంతో "వీళ్లు నన్ను చంపబోతున్నారు, నన్ను చంపేస్తారు" అంటూ ఆర్తనాదాలు చేశాడు. "మామా.. ఐ లవ్ యూ... నా పిల్లలకు చెప్పు వాళ్లంటే నాకు ఎంతో ప్రేమ" అని చెప్పాడు. అనంతరం కొన్ని క్షణాల్లోనే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మిన్నియా పోలీసులు అలెగ్జాండర్ కుంగ్, థామస్ లేన్ దగ్గర లభ్యమైన కెమెరాల ద్వారా ఈ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది.ఈ కేసులో వీరితోపాటు చావిన్, టై థావో నిందితులుగా ఉన్నారు. మే 25న పోలీస్ అధికారి ఫ్లాయిడ్ మెడపై సుమారు ఎనిమిది నిమిషాల 46 సెకన్లపాటు మోకాలిని నొక్కిపెట్టి ఉంచడంతో అతడు మరణించిన విషయం తెలిసిందే. (జార్జ్ ఫ్లాయిడ్‌కు ఘన నివాళి ) -
ఆడియో టేప్ లీక్: ఖుష్బూ క్షమాపణ
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ వివాదంలో ఇరుక్కుంది. టీవీ సీరియళ్ల షూటింగ్స్ తిరిగి ప్రారంభించడంపై నిర్మాతల వాట్సాప్ గ్రూపులో ఆమె మాట్లాడిన ఆడియో టేప్ బయటకు లీకైంది. ఇందులో "జర్నలిస్టులకు ఇప్పుడు కోవిడ్ తప్ప ఏ వార్తలూ లేవు. షూటింగ్స్ త్వరలో తిరిగి ప్రారంభం అవుతున్నందున వారు ఫొటోలు, వీడియోల కోసం వెంటపడుతారు. కానీ, అస్సలు ఇవ్వకండి. సొంతంగా కథలు అల్లుతూ మనల్ని చీల్చి చెండాడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి" అని పేర్కొంది. ఖుష్బూ వ్యాఖ్యలపై పాత్రికేయ వర్గాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. దీంతో ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ తన వాయిస్‌ను కొంత ఎడిట్ చేశారని తెలిపింది. (నటి కుష్బూ డాక్టరయ్యారు! ) "నిర్మాతల గ్రూప్‌లో నుంచి ఒకరు దాన్ని కావాలనే లీక్ చేశారు. ఇలాంటి వ్యక్తుల మధ్య ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. జర్నలిస్టులను అగౌరవపర్చడం నా ఉద్దేశ్యం కాదు. కేవలం స్నేహితుల దగ్గర ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడాను. నాకు ప్రెస్ పట్ల ఎంత గౌరవం ఉందన్న విషయం పాత్రికేయులందరికీ తెలుసు. 34 ఏళ్ల సినీ జీవితంలో ఒక్కసారి కూడా వాళ్లను కించపరుస్తూ మాట్లాడలేదు. ఒకవేళ ఎవరినైనా బాధపెట్టుంటే వారికి నా హృదయపూర్వక క్షమాపణలు" అంటూ పేర్కొంది. ఇక ఆడియో క్లిప్ లీక్ చేసిన నిర్మాత ఎవరో తనకు తెలుసని ఖుష్బూ వ్యాఖ్యానించింది. తన మౌనం, క్షమాగుణమే అతనికి పెద్ద శిక్ష అని పేర్కొంది. (వైరస్ బారిన వారియర్స్) -
‘సహనంతోనే సమస్యలు అధిగమిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ : నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మర్కత్ చీఫ్ మౌలానా సాద్ శుక్రవారం ఆడియో సందేశం విడుదల చేశారు. ‘ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో మీరు సహనంగా ఉండాల్సిన అవసరం ఉంది..సహనంతోనే మీరు మీ సమస్యలను అధిగమిస్తార’ని ఈ ఆడియో క్లిప్‌లో మౌలానా బిగ్గరగా చెబుతుండటం వినిపించింది. కాగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ మర్కజ్ అనంతరం కోవిడ్-19 కేసులు దేశవ్యాప్తంగా పెరిగాయని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. మౌలానా సాద్ ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కు చేరగా మృతుల సంఖ్య 437కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1007 కేసులు నమోదవగా, 23 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇక మహమ్మారి బారి నుంచి కోలుకుని 1749 మంది డిశ్చార్జి అయ్యారు. చదవండి : తబ్లిగీ నేతపై ఈడీ కేసు -
యువకుడి కిడ్నాప్.. అడియో టేప్ లీక్!
-
‘పోలీసు ఏజెంట్లకు ప్రజలే శిక్ష వేస్తారు’
సాక్షి, విశాఖపట్నం: ఒరిస్సా రాష్ట్ర మల్కన్‌గిరి జిల్లా జంతురాయి ఘటనపై మావోయిస్టులు స్పందించారు. ఏవోబీ ఎస్‌జడ్‌సీ ఆధికార ప్రతినిధి గణేష్ పేరుతో బుధవారం ఆడియో టేపులు విడుదల అయ్యాయి. జంతురాయి ఘటనపై పోలీసులు అసత్య ప్రచారం చేశారు. పోలీసు ఏజెంట్లు అదమ, జిప్రోను పట్టకొని కొట్టారు. నిరాయుధులు అయిన దళ సభ్యుల్ని చిత్ర హింసలకు గురిచేశారని గణేష్ ఆరోపించారు. అదమను హత్య చేసి.. జిప్రోను పోలీసులకు అప్పగించారన్నారు. పార్టీ ప్రజల పక్షానే ఉంది.. కటాఫ్‌లో పార్టీ సహకారంతో ప్రజలే 50 కిలోమీటర్ల రోడ్డును వేసుకున్నారని అయన తెలిపారు. దీన్ని ఓర్వలేక ప్రజలను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని గణేష్ మండిపడ్డారు. చుట్టు పక్కల గ్రామస్తులు వ్యతిరేకించినా చిత్రహింసలకు గురిచేశారు. ప్రతిగా పోలీసు ఏజెంట్ల ఇళ్లను ప్రజలే తగలబెట్టారు. చేసిన తప్పును జొడంబో గ్రామస్తులు ఒప్పుకున్నారని.. వారిని ప్రజా జీవితంలో జీవించేందుకు పార్టీ ఒప్పుకుందని ఆయన తెలిపారు. పోలీసు ఏజెంట్లకు ప్రజలే శిక్షవేస్తారు. ప్రజలపై పోలీస్ దాడులు ఆపకపోతే ప్రతిఘటన తప్పదు అని ఆ ఆడియో టేపుల్లో గణేష్ హెచ్చరించారు. -
కలకలం రేపుతున్న మల్లారెడ్డి ఆడియో టేపు
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రి మల్లారెడ్డి ఆడియో టేపు కలకలం రేపుతోంది. తనకు టికెట్ ఇచ్చేందుకు మంత్రి మల్లారెడ్డి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని బోడుప్పల్ టీఆర్ఎస్ నేత రాపోలు రాములు ఆరోపిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారని, తన వర్గానికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. టికెట్ కేటాయింపు విషయమై ఆయన మల్లారెడ్డితో మాట్లాడిన ఫోన్‌కాల్‌కు సంబంధించిన ఆడియో టేపు ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో ఈ ఆడియోటేపు అధికార పార్టీలో చర్చనీయాంశమైందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
బయటపడ్డ ఆడియో టేపులు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కుంభకోణానికి సంబంధించిన అక్రమాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరో సంచలన విషయం శనివారం బయటపడింది. డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్ర నాథ్ బెదిరించిన ఆడియో టేపులు బయటకి రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల విచారణంలో ఈ ఆడియో టేపులు బయటకి వచ్చినట్టు సమచారం. వీటి ఆధారంగా కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సురేంద్ర నాథ్, డాక్టర్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈఎస్ఐ డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాథ్ ఒత్తిడి చేశాడు. క్యాంపుల పేరుతో మెడిసిన్ పంపించినట్లు రాసుకొని ఓ రికార్డు తయారుచేయాలని డాక్టర్‌కు చెప్పాడు. అయితే డాక్టర్ ఒప్పుకోకపోవడంతో సెక్షన్ ఆఫీసర్ బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా మరో మహిళా డాక్టర్‌కు కూడా సురేంద్ర ఫోన్ చేసి బెదిరించాడు. ఏడాది తర్వాత క్యాంప్ నిర్వహించినట్లు బిల్లులు తయారు చేయాలని ఆ మహిళా వైద్యురాలిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఏడాది తర్వాత బిల్లులు తయారు చేయలేనని ఆ ఈఎస్ఐ డాక్టర్ తెగేసి చెప్పారు. అయితే డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ బిల్లుల కోసం అడుగుతున్నారని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ డాక్టర్ మాత్రం నిబంధనల ప్రకారమే ముందకు వెళ్తానని సురేంద్రకు స్పష్టంగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగాతున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణితోపాటు వరంగల్ జాయింట్ డైరెక్టర్ కె.పద్మ, అడిషనల్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, రిప్రజెంటేటివ్ శివ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఆమ్ని మెడికల్‌కు చెందిన హరిబాబు అలియాస్ బాబ్జీలను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 455 (ఏ), 465, 468, 471, 420, 120–బీ 34 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 17మంది ఐఎంఎస్ ఉద్యోగులు, ఐదుగురు మెడికల్ కంపెనీల ప్రతినిదులు, ఓ టీవీ చానల్ రిపోర్టర్‌పై ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే.. -
టీచర్స్ మీట్ మిస్‌కావద్దు
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సుదీర్ఘ విరామం తర్వాత మంగళవారం మరో ఆడియో సందేశం విడుదల చేశారు. ఈసారి తమ చిన్నారులపై శ్రద్ధ తీసుకోవాలంటూ సిబ్బందికి హితవు పలికిన ఆయన.. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులకు సహకరించిన వలంటీర్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ‘గణేష్ నవరాత్రి, నిమజ్జనాన్ని సమర్థమంతంగా నిర్వహించిన సిటీ పోలీసుల్ని అభినందిస్తున్నా. ఈ నేపథ్యంలోనే జోన్ల వారీగా బడా ఖానా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మూడింటిలో పూర్తయింది. అన్ని స్థాయిల్లోని సిబ్బంది, అధికారులు కలుసుకునే అవకాశం వీటి వల్ల కలుగుతుంది. ఇటీవల నాతో మాట్లాడి వివిధ స్కూళ్ల ప్రిన్సిపల్స్ చెప్పిన విషయం నన్ను ఆలోచింపజేసింది. తాము క్రమం తప్పకుండా పేరెంట్–టీచర్ మీట్స్ ఏర్పాటు చేస్తామని, అయితే, పోలీసు పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఈ కార్యక్రమాలకు రావట్లేదని ఆ ప్రిన్సిపల్స్ చెప్పుకొచ్చారు. ఇది సరైంది కాదని నేను భావిస్తున్నా. మీ పిల్లలు, కుటుంబం కోసం కాకపోయినా మనందని బంగారు భవిష్యత్ కోసం ప్రతి పోలీసు ఈ మీట్స్‌కు వెళ్ళాలి. వీలున్నంత వరకు భార్యభర్తలు ఇద్దరూ వెళితే ఉత్తమం. అలా కానప్పుడు కనీసం మీ భార్యనైనా పంపండి. ఉపాధ్యాయుల్ని కలిసి మాట్లాడటం వల్ల మీ చిన్నారుల వ్యవహారశైలి, వారి ప్రతిభాపాటవాలు, లోటుపాట్లు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం దొరుకుతుంది. తల్లిదండ్రులకు కుదరకపోతే కనీసం గార్డియన్ని అయినా పంపండి. ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసు వలంటీర్లు చేసిన సేవ అనిర్వచనీయమైంది. పోలీసుకు పోటీగా అద్భుతంగా పనిచేశారు. అలాంటి దాదాపు రెండు వేల మంది వలంటీర్ల జాబితా ప్రస్తుతం మన వద్ద ఉంది. వారితో సంబంధాన్ని కొనసాగించండి. తరచుగా ఠాణాలకు పిలిచి వారితో కాసేపు కూర్చుని టీ తాగండి. మీరు వారి ప్రాంతాలకు వెళ్ళి కలుసుకోండి. తద్వారా వారూ మనలోని భాగమే అని భావన కలిగించండి. వలంటీర్లతో ఈ బంధం శాశ్వతం కావాలి. ఈ క్రతువులో బ్లూకోల్ట్సŠ, పెట్రోల్ కార్స్ సిబ్బంది పాత్ర చాలా కీలకం. వారంలో కనీసం ఒక్కసారైనా వలంటీర్లతో కార్యక్రమం నిర్వహించడం లేదా కలవడం చేయండి. ఈ అంశంపై ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు దృష్టి పెట్టాలి. నగర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయడం ద్వారా హైదరాబాద్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి’ అని అంజనీకుమార్ కోరారు. -
బట్టబయలైన టీడీపీ హత్యా రాజకీయాలు