
విలక్షణ నటుడు మోహన్‌బాబు వాయిస్ చాలా గంభీరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకు నిదర్శనం సినిమాల్లో ఆయన చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్సే. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మోహన్‌బాబు ఉద్వేగభరితంగా డైలాగులు చెబుతారు. ఇప్పుడు భక్తి భావంతో ఆయన చెప్పే మాటలను వినబోతున్నాం. ఈ నెల 22న వినాయక చవితి. ఈ సందర్భంగా గణేశుడి పూజా విధానంతో కూడిన ఓ ఆడియో మోహన్‌బాబు గళంతో రానుంది. వినాయక చవితి పండగకు ఒక రోజు ముందు ఈ నెల 21న ఈ ఆడియో విడుదలవుతుంది. మోహన్‌బాబు గళంలో వినాయక పూజా విధానాన్ని వింటూ పండగను జరుపుకోవడం ఆయన అభిమానులకు ఓ మంచి అనుభూతి అని చెప్పొచ్చు.