
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం మొదలైంది. ఆయన కుమారుడు, హీరో మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తాను లేని సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురి బర్త్ డేకు రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు తన వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. జల్‌పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.
గతంలోనూ జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటన తర్వాత వరుసగా కేసులు నమోదయ్యాయి. మంచు విష్ణు, మనోజ్‌కు మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సైతం వీరి మధ్య గొడవ మొదలైంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలోనే మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది.
