రాచకొండ సీపీ ముందు విచారణకు హాజరైన మంచు మనోజ్ కీలక విషయాలు వెల్లడించారు. తానెప్పుడూ ఆస్తులు అడగలేదని.. నాపై కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. జల్‌పల్లిలోని మా ఇంట్లోనే అమ్మ ఉందని.. ఆస్పత్రికి వెళ్లలేదని.. ఈ విషయంపై అబద్ధాలు చెబుతున్నారని మనోజ్ తెలిపారు.
కూర్చోని మాట్లాడుకోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని మంచు మనోజ్ వెల్లడించారు. సిపీని కలిసి జరిగిందంతా వివరించినట్లు తెలిపారు. నా వైపు నుంచి ఎలాంటి గొడవ జరగదని సీపీకి చెప్పినట్లు వివరించారు. మీడియా ప్రతినిధులపై దాడి జరగడం దురదృష్టకరమని.. నాన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నానని మనోజ్ అన్నారు. ఇవాళ సాయంత్రం ప్రెస్‌మీట్‌లో అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.
కాగా.. మంగళవార మోహన్ బాబు ఇంటి వద్ద గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద మనోజ్‌ను సెక్యూరిటీ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఫ్యామిలీలో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు గన్స్ సీజ్ చేశారు. అంతేకాకుండా సీపీ ముందు హాజరవ్వాలని మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment