Vinayaka Chaviti
-
గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్..
దేశంలో వినాయక చతుర్థి సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ గణేష్ చతుర్థికి.. వినాయక విగ్రహాల విక్రయాలు ఏకంగా 10 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ 'జెప్టో' గణాంకాల ప్రకారం.. వినాయక విగ్రహాలు మాత్రమే కాకుండా రెడీమేడ్ మోదకాలు గంటకు 1500 అమ్ముడైనట్లు.. మోదకాల అచ్చులు కూడా గంటకు 500 అమ్ముడయ్యాయని సమాచారం. ప్రధాన నగరాల్లో ఎక్కువ స్వీట్ ఆర్డర్స్ పొందిన నగరంగా బెంగళూరు రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత స్థానాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి.ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జెప్టో.. భారతదేశం అంతటా 10,000 పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాలను విక్రయించింది. వంద శాతం పర్యావరణ అనుకూల విగ్రహాలను అందించడానికి జెప్టో 100 మందికిపైగా స్థానిక కళాకారులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ గత 24 గంటల్లోనే జెప్టో 70,000కు పైగా స్వీట్లను విక్రయించింది. మోదకాలు అమ్మకాలలో ముంబై ముందంజలో ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్‌లలో లడ్డూల ఎక్కువగా అమ్ముడైనట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే.. మోదకాలు అమ్మకాలు ఐదు రెట్లు, లడ్డూల విక్రయాలు 2.5 రెట్లు, మిఠాయిలు అమ్మకాలు రెండు రెట్లు, పూజా సామాగ్రి రెండు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. -
పండగ కిక్కు.. కొత్త లుక్కు
వినాయక చవితికి వినాయకుడికి విభిన్న రకాల వంటకాలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అలాగే ఈ పండక్కి వినాయకుడిని స్మరించుకుంటూ ‘పండగ కిక్కు..కొత్త లుక్కు’ అంటూ కొందరు సినిమా యూనిట్ వారు పలు రకాల అప్డేట్స్ ఇచ్చారు. వీటిలో కొన్ని ఈ విధంగా.. బీచ్‌లో సైంధవ్ బీచ్‌లో సేద తీరు తున్నారు వెంకటేశ్. ఆయన హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూ΄పొందుతున్న ‘సైంధవ్’ కొత్త పొస్టర్ విడుదలైంది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా నటిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య, బాల నటి సారా కీలక పా త్రధారులు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్. వీడు టైగర్... రవితేజ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని రెండో పా ట ‘వీడు..’ను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించి, రవితేజ పొస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. రామ్.. కల్ట్ మామా ‘బిట్టు బిట్టు బాడీ మొత్తం రెడ్డూ చిల్లి సాల్టు..’ అంటూ సాగే పా ట ‘స్కంద’ చిత్రంలోనిది. రామ్ హీరోగా బోయపా టి శ్రీను దర్శకత్వంలో రూ΄పొందుతున్న చిత్రమిది. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లు. ఈ సినిమాలో రామ్, ఊర్వశీ రౌతేలా కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం ‘కల్ట్ మామా’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా హేమచంద్ర, రమ్య బెహ్రా, మహా పా డారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ల సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. టీజర్ రెడీ ‘యానిమల్’ మూవీ టీజర్ రెడీ అవుతోంది. ఈ నెల 28న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ పొస్టర్‌ను విడుదల చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మది దోచేసిందే... ‘మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా...’ అంటూ హీరో కల్యాణ్ రామ్ పా డారు. కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ నటిస్తున్న ‘డెవిల్’లోని పా ట ఇది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబరు 24న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి ‘మాయే చేశావే..’ పా ట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరకల్పనలో ఆర్వీ సత్య రాసిన ఈ పా టను సిధ్ శ్రీరామ్ పా డారు. దేఖో ముంబై దోస్తీ మజా... కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘దేఖో ముంబై దోస్తీ మజా..’ పా ట లిరికల్ వీడియోను హీరో రవితేజ రిలీజ్ చేశారు. అమ్రిష్ గణేష్ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్, మేఘ్ ఉట్– వాట్ సాహిత్యం అందించగా, అద్నాన్ సమీ, పా యల్ దేవ్ ఈ పా టను పా డారు. అంజనాద్రిలో... తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన ‘హను–మాన్’ పొస్టర్ రిలీజైంది. ‘‘అంజనాద్రి అనే ఊహాత్మక ప్రదేశంలో ఈ సినిమా ఉంటంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. -
వినాయకుడి పేరు మీద వచ్చిన సినిమాలివే!
గణపతిని కొందరు భక్తిశ్రద్ధలతో పూజిస్తే మరికొందరు భయభక్తులతో పూజిస్తారు. ఈయన ఆశీర్వాదం లేకుండా పని మొదలుపెడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఆయన్ను పూజించేవాళ్లు చాలామంది. ఏ విఘ్నాలు లేకుండా పని జరగాలని ప్రేమగా పూజించేవారు కోకొల్లలు. సినిమా రంగంలోనూ గణనాయకుడికి పెద్ద పీటే వేస్తారు. వినాయక పూజతోనే సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. అంతేనా.. సినిమా ప్రారంభంలో కూడా మొదట గణపతిని చూపిస్తూ కొన్నిసార్లు ఆయన పాట కూడా వేస్తారు. అయితే ఈ ట్రెండ్ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. కానీ బొజ్జగణేశుడిని పూజించడం మాత్రం ఎవరూ విస్మరించడం లేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఆయనంటే అంతిష్టం. సినిమాల్లోనూ గణపతి చాలా పవర్ఫుల్. కొన్ని కీలక సందర్భాలు ఈయనచుట్టే తిరగ్గా మరికొన్ని ఏకంగా గణపతి గురించే వచ్చాయి. సినిమాల్లో ఆయన గురించి వచ్చిన పాటలు ఇప్పటికీ మండపాల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అసలు గణేశుడి పేరు మీద ఏయే సినిమా టైటిల్స్ ఉన్నాయో ఓసారి చూసేద్దాం.. ఉమా చండీ గౌరీ శంకరుల కథ, భూకైలాస్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలు గణేశ్ మహత్యాన్ని తెలిపేవి ఉన్నాయి. కానీ ఆయన పేరు మీద మాత్రం కొన్ని సినిమాలే ఉన్నాయి. అవే.. గణపతి, ఓం గణపతి, గణేశ్, వినాయక చవితి, విలేజ్‌లో వినాయకుడు, శ్రీ వినాయక విజయం. త్వరలో రాబోతున్న గం గం గణేశా కూడా ఈ లిస్టులో చేరింది. కానీ ఇందులో కొన్ని పేరుకు మాత్రమే ఏకదంతునివి కావడం గమనార్హం. చదవండి: ఎవర్రా మీరంతా? ఇలా తగులుకున్నారు.. ఆడేసుకుంటున్న నెటిజన్స్! -
చంద్రగిరిలో 1,060 భారీ వినాయక విగ్రహాల పంపిణీ
తిరుపతి రూరల్: వినాయక చవితిని పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో పేపర్, బంకమట్టితో తయారు చేసిన 1,060 భారీ వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని తిరుచానూరు మార్కెట్ యార్డులో శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని పల్లెలకు చెందిన యువకులు స్థానికులతో కలిసి వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు సంకల్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా విగ్రహాల కోసం 1,060 వినతులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దృష్టికొచ్చాయి. దాదాపు 25 వేల మంది యువత ఇందులో భాగస్వాములవుతున్నారు. పల్లెల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు యువతను ఆధ్యాత్మికత వైపు నడిపించాలని గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి.. వినాయక విగ్రహాలను సొంత నిధులతో తయారు చేయించి ఉచితంగా అందిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు చెందిన నిపుణులైన 160 మంది కార్మికులు ఏడు నెలలుగా నిర్విరామంగా శ్రమించి వీటిని తయారు చేశారు. ప్రతి సచివాలయానికి పది చొప్పున పల్లెలకు పంపించేందుకు సిద్ధం చేసిన విగ్రహాలతో కూడిన వాహనాలను ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ మోహిత్‌రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. వీటిని తీసుకెళ్లేందుకు నియోజకవర్గంవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది యువకులు విగ్రహాల పంపిణీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సాటి మరెవరూ లేరని కొనియాడారు. హిందూ ధర్మాన్ని పెంపొందించేలా చెవిరెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. కాగా, మట్టి విగ్రహాలను ఆదివారం నియోజకవర్గంలో ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. -
వినాయక చవితి.. పిల్లల పండగ
మనిషి జీవితం అనుభవాల పుట్ట. అనుభవాలకంటేే అనుభూతులేే బాగుంటాాయి. అంటేే ఏ విషయమైనా అది అనుభవించేేటప్పటి కంటేే అవి గుర్తు తెచ్చుకున్నప్పుడే ఎక్కువ ఆనందిస్తామనిపిస్తుంది. అందుకే కొంత వయసొచ్చాక మనం చేసే కొన్ని పనులు.. గతించిన మధుర జ్ఞాపకాలని మళ్లీ పునరుజ్జీవం చేసేందుకు.. తద్వారా మళ్లీ అలాంటి ఆనందం పొందేందుకూ చేసే ప్రయత్నాలు అనిపిస్తుంది. అయితే ఒకప్పుడు పొందిన ఆనందానుభూతి మళ్లీ కలుగుతుందా అంటే అనుమానాస్పదమే.. చాలా సార్లు ఆశాభంగమే మిగులుతుంది. నా చిన్నప్పుడు మా తాతగారింటి దగ్గరలో తామరలు.. కలువలతో నిండిన చెరువు వుండేది. మా ఇంటి దగ్గర బయలు దేరి తాతగారుండే వీథి మలుపు తిరుగుతూనే,తామరపూల సువాసనను మోసుకొచ్చే చల్లని గాలి మేను తాకేది, ఆ దారిని వెళ్లినప్పుడల్లా, ఆ అనుభూతి కోసం వెదుక్కునే దానిని. ఎప్పుడో ఒకసారి మాత్రమే అది దక్కేది. ఆ తర్వాతర్వాత.. కలువలూ, తామరలూ పోయి ఉత్త చెరువుగా మారింది. చేపల పెంపకానికి ఇప్పుడదీ లేదు.. పిచ్చి మొక్కలు పెరిగి పెద్దగుంటలా మిగిలింది. కానీ నాలో ఆ చిన్ననాటి జ్ఞాపకం పదిలంగానే వుంది. అలాగే మొట్టమొదటి సారి అరవిచ్చిన జాజులనో, మల్లెలనో.. అరచేతిలో తీసుకున్నపుడు చుట్టుముట్టిన వాటి సన్నని పరిమళం ఎన్నటికీ మరువదు మనసు. ఇప్పుడు వాటిని చేతిలోకి తీసుకున్నా పరిమళించేది ఆనాటి జ్ఞాపకాలే . కొంత పెద్దయిన తర్వాత పండగలంటే ఉత్సాహం పోతుంది. నిరాసక్తంగా అనిపిస్తుంది. అందరికీ అంతేనేమో అనుకుంటా. కానీ వినాయక చవితి మాత్రం ఎందుకో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రతి వినాయక చవితి పండగకు నా చిన్ననాటి జ్ఞాపకాలు పునరుజ్జీవితమవుతూ వుంటాయి. ఆ రోజు పొద్దున్నే"ఇవాళ పండగ లేలే "అంటూ అమ్మ నిద్ర లేపంగానే,బయటకు వచ్చి చూస్తే ఆకాశం నీలంగా చల్లగా హాయిగా అనిపించేది. గబా గబా మొహం కడిగేసి.. పత్రి కోసం పిల్లలందరం కలిసి సంచులు తీసుకుని బయలు దేరే వాళ్లం,(ఇప్పటిలాగా పత్రి కట్టలు కొనే వాళ్లం కాదు) సరే వేణు గోపాల స్వామి గుడి దగ్గరకు వచ్చే సరికి గుడి గోడల మీద, గుడి ఆవరణలోనూ అంతా కోలాహలంగా అరుస్తూ పిల్ల మూకలు.. "అరేయ్ గన్నేరు పూలు కొయ్యండ్రా అంటూనో,జమ్మి కొమ్మలు తెంపండిరా అంటూనో, మారేడు దళాలు కూడా కావాలోయ్ అంటూనో " పిల్లలు అరుస్తుంటే కొంతమంది చెట్లెక్కలేని పెద్దలు కింద నిలబడి "బాబూ నాకో రెండు రెమ్మలు ఇటు పడెయ్యి నాయనా" అంటుండే వారు.మేము గుళ్లో పత్రి సేకరించాక.. ఆ ఆవరణ అంతా పెరిగిన టపాకాయల మొక్కల నుండీ సన్నగా బారుగా వుండే కాయలు కోసి అక్కడవుండే నూతిలో వేసి అవి ఠప్ ఠప్ మని మోగుతుంటే చప్పట్లు కొట్టి నవ్వుకునే వాళ్లం. ఇక అక్కడ నుండీ చెరువు దగ్గర కొచ్చేటప్పటికి ఈత వచ్చిన పిల్లలు ,అప్పటికే చెరువులో ఈదుతూ కలువలూ తామరలూ తెంపుతూ వుండేవాళ్లు ,ఈతరాని నా లాంటి పిల్లలు ఒడ్డు నుండి "నాకా తెల్లకలువ తెచ్చిపెట్టవా అనీ,ఆ ఎర్ర కలవ మొగ్గ చేతి కందేంత దూరంలో వుందనీ,ఆ తెల్ల తామర దగ్గరలోనే వుందనీ" కేకలు వేస్తూ సందడి చేస్తూ వుండే వాళ్లం. అలా చెరువు దగ్గరనుండీ బయలు దేరి,డొంక దారి పట్టేటప్పటికి, అప్పటికే అక్కడ పిల్లలనిపూచిన,కాసిన చెట్లుండేవి,"అదుగో ఆ వెలగ కొమ్మ కాయతో సహా కొయ్యాలి"అని కింద నుండి ఎవరో కేకేసే వారు(వెలగచెట్టు నిలువుగా చాలా ఎత్తులో వుంటుంది, ఎక్కడం చాలా కష్టం) "మామిడి రెమ్మలు మాకూ నాలుగందుకో" అనే వారింకొకరు, "మాష్టారూ ఉత్తరేణి అంటే ఇదేనా?దూర్వార అంటే ఈ గరిక పోచలేనా? అరె జిల్లేడు కొమ్మలతో జాగ్రత్త పాలు కంట్లో పడితేకళ్లు పోతాయి" ఇలాంటి సలహాలతో, సహాయాలతో ఎలాగో మోపెడు పత్రితో ఇల్లు జేరేటప్పటికి ఉదయం పది గంటలయ్యేది. అప్పటికే అమ్మ పూజకన్నీ సిధ్ధం చేసి వుంచేది,ఈ లోగా వీథిలో ఎవరో "వినాయకుళ్లోయ్ "అంటూ మట్టి వినాయకుళ్లమ్మొచ్చేవారు,ఇంట్లో పెద్ద బొమ్మలొకటో రెండో వున్నా తప్పని సరిగా ఆ మట్టి వినాయకుణ్ణి ప్రతి సంవత్సరం కొనాల్సిందే. "తొందరగా స్నానాలు చేసి అక్కడ పెట్టిన పట్టుబట్టలు కట్టుకోండర్రా "అని అమ్మ పెట్టే కేకతో స్నానం ముగించి.. చదువుకునే క్లాస్ పుస్తకాలలో పసుపుతో శ్రీ రాసి బొట్లు బెట్టి దేవుడు ముందు పెట్టే వాళ్లం. అలా చేస్తే బాగా చదువు వస్తుందని చెప్పేవాళ్లు. పుస్తకాలు చదవకుండానే చదువెలా వస్తుందనే సందేహాలూ, ప్రశ్నలూ లేనే లేవు చెప్పింది చేసెయ్యడమే. అమ్మ పిండివంటలు తయారు చేస్తూ వుండేది పూజ మేమే మొదలు పెట్ఠేవాళ్లం "వినాయక వ్రత కల్పం "పుస్తకం సహాయంతో,సగం పూజ అయ్యే సరికి వినాయకుడి వాహనం సంగతేమో కానీ మాకే కడుపుల్లో ఎలకలు పరిగెత్తుతూ వుండేవి,అయినా సరే పట్టుదలగా ,అమ్మ అరటి పండు కాస్త నోట్టో వేసుకోవచ్చే అన్నా సరే నిష్ఠగా పూజ చేశారనిపించుకోవాలని,చివరి వరకూ పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా పూజ ముగించే వాళ్లం. ఇక భోజనం చేసిన దగ్గర నుండి ఇంకో పెద్ద పనుండేది. అది ఇరుగు పొరుగుల ఇళ్లకెళ్లి వాళ్ల వినాయకుణ్ణి చూసి రావడం. అప్పట్లో మాకు ఇలా వీథుల్లో పెద్ద పెద్ద వినాయకుళ్లని నిలబెట్టడం.. వారం రోజులపాటు మైకుల్లో మెదడు బయటకు వచ్చే పాటలు పెట్టి ఊదర కొట్టడం ఉండేవి కావు. ఎవరిళ్లల్లో వాళ్లు పూజ చేసుకోవడం, స్నేహితుల ఇళ్లకెళ్లి వాళ్ల దేవుణ్ణి చూసి, మా పిండి వంటలు వాళ్లూ వాళ్ల పిండి వంటలు మేమూ మెక్కడం, మూడో రోజో అయిదో రోజో దేవుణ్ణి మొక్కల్లో పెట్టడమో ,చెరువులో కలపడమో ఇంతే.. ఎప్పుడు బయలు దేరిందో ఈ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టే సంస్కృతి ? నాకు తెలిసి ఇది మనది కాదు. ఇప్పుడు పండగ రోజు పొద్దున్నే పత్రి కోసం వెళ్లే పిల్లలెవరూ కనబడడం లేదు. వేణుగోపాల స్వామి గుడి గోడలు వెలవెల బోతున్నాయి. చెరువులో ఈతకొట్టే పిల్లలూ లేరు. కలువలూ తామరలూ కనుమరుగయ్యాయి. పత్రి కావలసిన వాళ్లకి పదో ఇరవయ్యో పెడితే బజారులో కావలసినంత పత్రి, కలువలు తామరలూ కూడా అమ్మకానికి దొరుకుతాయి. వీథి వీథినా పెద్ద పెద్ద వినాయకుళ్లు కొలువుదీరి వుంటున్నారు. ఒక వీథిని మించి ఇంకో వీథి పోటీ పడుతున్నాయి. నిమజ్జనాల రోజయితే, చెప్పే పనే లేదు పెద్ద పేద్ద మైకులతో,టపాసుల సందడితో, తూగి పోతూ జనం వేసే చిందులతోవినాయకుణ్ణి సాగనంపే కార్యక్రమం ఒక పెద్ద జాతర లాగ జరుపుతున్నారు. ఈ రోజు నాకు ఎందుకో ,పాపం పుణ్యం తెలియని ,అమాయక మైన అయిదారేళ్ల వయసులో మేము సంబరంగా జరుపుకున్న పండగ గుర్తొస్తోంది. వినాయక చవితి నా దృష్టిలో పిల్లలు సామూహికంగా కలిసి ఆడుకునే ఒక ఆట, అంతే కాదు ఎలక నుండీ ఏనుగు దాకా ప్రకృతి లో ఒక భాగమే, అవి కూడా పూజ్యనీయాలే అని చెప్పే పండగ అందుకే నాకు వినాయక చవితి ఇష్టమైన పండగ. - భార్గవి -
గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ ముస్తాబు
-
మోండాలో సెల్‌ఫోన్ దొంగల హల్చల్.. సీసీ కెమెరాలో రికార్డు
సాక్షి, బన్సీలాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మార్కెట్‌కు వివిధ రకాల కొనుగోళ్ల కోసం వచ్చేవారి సెల్ఫోన్లను దొంగలు తస్కరిస్తున్నారు. కనురెప్పపాటులో ఫోన్లు మాయం అవుతున్నాయి. ఇటీవల వినాయకచవితి సందర్భంగా మార్కెట్‌కు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రాకతో మార్కెట్ జన సంద్రంగా మారింది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటే దొంగలు మరో వైపు తమ పని కానిచ్చేశారు. ► బోయిగూడ కట్టెలమండి ప్రాంత నివాసి పాకాల రమేష్ మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తుండగా దొంగ పూలు కొంటున్నట్టు నటిస్తూ రమేష్ షర్ట్ జేబులో ఉన్న విలువైన సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ► సదరు దొంగ వ్యూహాత్మకంగా వచ్చి సంచి అడ్డుగా పెట్టి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అదే రోజు మరో ఇద్దరి సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మోండా మార్కెట్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ రైళ్లలో ఇట్టే మాయమవుతున్నారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు ►నిత్యం వేలాది మంది ప్రజల రాకపోకలు...వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటే మోండా మార్కెట్లో పోలీసు నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొంగలు అడ్డూఅదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ►మోండా మార్కెట్లో కనీసం పండగ వేళల్లో అయినా పోలీసు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తే జాగ్రత్తగా ఉంటారని పలువురు సాక్షితో వాపోయారు. ► మోండా మార్కెట్‌కు వచ్చిన అనేకమంది డబ్బు, సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ► ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. గట్టి నిఘా : క్రైమ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మోండా మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో సివిల్‌డ్రెస్‌లో పోలీసు సిబ్బందిని ఉంచాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం మార్కెట్‌కు వచ్చేటప్పుడు ప్రజలు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదు. చదవండి: షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు -
మహా గణపతిం మనసా స్మరామి...
-
రెండోవేవ్ ఇంకా ముగియలేదు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ రెండో వేవ్ కేసులు తగ్గుముఖం పట్టలేదనీ, ఆ తీవ్రత ఇప్పటికీ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. మొత్తమ్మీద కేసుల తీవ్రతలో తగ్గుదల 50% కంటే కొద్దిగా తక్కువగా ఉందని వివరించింది. దేశంలోని 35 జిల్లాల్లో వారం పాజిటివిటీ రేట్ 10%పైనే ఉండగా, మరో 30 జిల్లాల్లో 5–10% మధ్యన నమోదవుతోందని వెల్లడించింది. గత వారం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 68.59% ఒక్క కేరళ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘వినాయక చవితితో ప్రారంభం కానున్న ఈ పండుగల సీజన్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు తక్కువ సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొనాలి. అదేవిధంగా, మరీ అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు’అని తెలిపారు. ‘దేశంలోని 58 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 18% మందికి రెండో డోసు కూడా పూర్తయింది. 24 గంటల్లో వేసిన 86.51 లక్షల డోసులను కలుపుకుని, ఇప్పటి వరకు దేశంలో 72 కోట్ల డోసుల టీకా వేశారు’అని తెలిపింది. ఇప్పటి వరకు సిక్కిం, దాద్రానగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో 18 ఏళ్లు నిండిన వారందరికీ కనీసం ఒక్క డోస్ కోవిడ్ టీకా వేసినట్లు తెలిపారు. కాగా, స్కూళ్లను తిరిగి తెరిచేందుకు విద్యార్థులందరికీ వ్యాక్సిన్ కచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదని వారు వివరించారు. అయితే, ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది, తల్లిదండ్రులు టీకా వేయించుకోవడం మంచిదని తెలిపారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కోవిడ్ బాధిత చిన్నారుల్లో మరణాల రేటు తక్కువగా ఉండటం, వ్యాధి బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేని వారే ఎక్కువగా ఉండటం వంటి కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధమైన వైఖరితో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను చిన్నారులకు కూడా వినియోగించేందుకు అవసరమైన శాస్త్రతీయ పరమైన ధ్రువీకరణ దిశగా ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది’ అని వారన్నారు. 99% ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 84% మందికి రెండో డోసు కూడా పూర్తయిందన్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ మొదటి డోసు, 80 శాతం మందికి రెండో డోసు కూడా పూర్తయిందని తెలిపారు. రోజువారీ కేసుల్లో 14% పెరుగుదల న్యూఢిల్లీ: దేశంలోని కరోనా కేసుల్లో గురువారం ఒక్క రోజే 14% పెరుగుదల నమోదైంది. 24 గంటల్లో 43,263 కొత్త కేసులు నిర్థారణ కావడంతో మొత్తం కేసులు 3,31,39,981కు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. కోవిడ్ బారిన పడిన మరో 338 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 4,41,749కు పెరిగాయని పేర్కొంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,93,614కు పెరగ్గా మొత్తం కేసుల్లో ఇవి 1.19%గా ఉన్నాయని తెలిపింది. -
మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి
-
Stock Market: లాభాల స్వీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్లలో ఈ వారం లాభాల స్వీకరణ జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సూచీల రికార్డు ర్యాలీతో అనేక షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా (శుక్రవారం) స్టాక్ ఎక్చ్సేంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నిఫ్టీ 17,350 స్థాయిని నిలుపుకుంటే మరిన్ని లాభాలకు అవకాశం ఉంది. అప్‌ట్రెండ్ కొనసాగితే 17,500–17,600 శ్రేణిని పరీక్షించవచ్చు. దిగువ స్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,600 వద్ద మరో కీలక మద్దతు ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ తెలిపారు. సూచీల కదలికకు ఇవే కీలకం.. దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలే సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని వారంటున్నారు. ఫెడ్ ట్యాపరింగ్, కరోనా కేసుల నమోదు వార్తలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు తదితర సాదారణ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారింవచ్చు. సానుకూలతలూ ఉన్నాయ్... జీడీపీతో సహా ఇటీవల కేంద్రం విడుదల విడుదలు చేసిన స్థూల ఆరి్థక గణాంకాలన్నీ మార్కెట్ వర్గాలను మెప్పించాయి. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో తిరిగి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ అంశాలతో అంతర్లీనంగా సెంటిమెంట్ సానుకూలంగానే ఉంది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు దేశీయంగా అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జరగడంతో గతవారంలో సెన్సెక్స్ 2005 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 618 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిసిందే. భారత్ వైపు ఎఫ్ఐఐల చూపు ... భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆగస్టులో మొత్తం రూ.16,459 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,083 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.14,376 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. డెట్ విభాగంలో ఆగస్టు పెట్టుబడులు ఈ ఏడాదిలోనే అత్యధికం కావడం విశేషం. ‘‘భారత్, అమెరికా బాండ్ ఈల్డ్స్ మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. డాలర్ రూపాయి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈక్విటీ మార్కెట్ అధిక విలువ వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిణామాలను విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలుగా మలుచుకున్నారు. అని జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఇష్యూ బాటలో వ్యాప్కోస్ జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే పీఎస్‌యూ వ్యాప్కోస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. మార్చికల్లా ఇష్యూను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా ప్రభుత్వం వ్యాప్కోస్లో 25 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది. ఇదే యోచనలో నేషనల్ సీడ్స్ : కాగా.. ఇదే ఐపీఓ బాటలోనే మరో పీఎస్‌యూ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్(ఎన్ఎస్సీ)లోనూ 25 శాతం వాటాను ఆఫర్ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రతిపాదించిన విషయం విదితమే. -
హైదరాబాద్‌లో ఘర్షణ: గణేశుడి విగ్రహం ధ్వంసం?
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావం ఈసారి వినాయక చవితి మీద బాగానే పడింది. గళ్లీకో రూపంలో దర్శనమిచ్చే గణపయ్య ఇప్పుడు ఊరంతా వెతికినా కనిపించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే హైదరాబాద్‌లో గణేశుడిని ప్రతిష్టాపించే క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. వినాయకుని విగ్రహం ముందే రెండు గ్రూపులవారు ఒకరినొకరు తన్నుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు వారించినప్పటికీ ఎవరూ వినిపించుకునే పరిస్థితిలోనే లేరు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే గణేశుడిని ప్రతిష్టించడం కొందరికి ఇష్టం లేదని, దీంతో హిందూ వ్యతిరేక శక్తులు గొడవకు దిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రతిమను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇది నిజమేనని నమ్మిన నెటిజన్లు ఆ ఇరు వర్గాలను హిందూ, ముస్లింలుగా భావిస్తూ, ఈ ఘర్షణకు మతం రంగు పులుముతున్నారు. కానీ వాస్తవాలను పరిశీలిస్తే ఈ ప్రచారంలో నిజం లేదని తేలింది. ఈ గొడవకు ముస్లిం వ్యక్తులకు సంబంధమే లేదని నిర్ధారణ అయింది. (ఏనుగు అతడిపైకి ఎలా వచ్చిందో చూడండి) అసలేం జరిగిందంటే.. మొఘల్‌పురలోని బాలగంజ్ ప్రాంతంలో 20 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలోనే గణపయ్యను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం ఆ మండపానికి సమీపంలోని భూమిని ఓ వ్యక్తి కొనుగోలు చేసి నివాసమేర్పరుచుకున్నారు. ఇంటి ముందే ఉండే మండపంలో జరిగే వేడుకల వల్ల తమ కుటుంబ గోపత్య దెబ్బ తింటోందని ఆయన స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని నెలల క్రితం వాళ్లు అక్కడ మండపాన్ని తీసివేశారు. ఇదిలా వుండగా తాజాగా వినాయక చవితి రోజు ఎప్పటిలాగే విగ్రహాన్ని తీసుకుని ఆ మండపం ప్రాంతానికి చేరుకోగా సదరు వ్యక్తి, ఆయన కుటుంబం వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ రాజుకుందని ఓ పోలీసు తెలిపారు. అంతేకాక గణేశుడి విగ్రహం దారి మధ్యలోనే విరిగిపోయినట్లు బాలాగంజ్ ఆలయ కమిటీ సభ్యుడు జిత్తూ తెలిపారు. (ఆ దెయ్యం బొమ్మ తిరిగి వచ్చేసిందా?) వాస్తవం: హైదరాబాద్‌లోని మొఘల్‌పురలో వినాయక చవితి నాడు జరిగిన ఘర్షణ హిందువులకు మధ్యే జరిగింది. This is happening in Hyderabad & not Pakistan Some local goons were opposing to the installation of Shri Ganesha’s statue & damaged it too,then some brothers had to bash them KCR thinks that he’s the next Nizam is teaming up with Razakars#AntiHinduKCR pic.twitter.com/0gEIQJ4IRX — Ashish Jaggi (@AshishJaggi_1) August 23, 2020 -
అందుకే ఈ ఆడియో!
సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి చవితి నేడు. ఈ సందర్భంగా భక్తులందరూ గణనాథుడి కథను చదివి, వినాయక వ్రత కల్పాన్ని పాటిస్తారు. గంభీరమైన స్వరం ఉన్న నటుడు మంచు మోహన్‌బాబు వినాయక చవితి పూజను తన గళంతో వినిపించారు. దాన్ని ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘నేనిష్టపడే పండగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం నా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితుల్ని మా ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలు చదివి, కథను వినిపించడం నాకు అలవాటు. నా పెద్ద కుమారుడు విష్ణువర్థన్ బాబు ఈ వినాయక కథను అందరికీ వినిపించవలసిందిగా కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుడి కథను వినిపిస్తున్నాను’’ అన్నారు మోహన్ బాబు. వినాయకుని జననం, విఘ్నాలకు అధిపతి ఎవరు? చంద్రునికి పార్వతీదేవి శాపం, శమంతకోపాఖ్యానం: ద్వాపరయుగం, భాద్రపద శుద్ధ చవితి మహత్యం, వినాయక వ్రతకల్పం వంటివి చెబుతూ ఈ ఆడియోను విడుదల చేశారు. -
వైరల్: ఈ గణేశుడు డిఫరెంట్ గురూ!
ముంబై: కరోనా వల్ల పండగల రూపు రేఖలే మారిపోతున్నాయి. అసలే వినాయక చవితి పండగ దగ్గర్లో ఉంది. కానీ ఈ సారి గణేశుని పండగ ప్రతి ఏడాదిలా కాకుండా పూర్తి భిన్నంగా జరగనుంది. పెద్ద హడావుడి లేకుండా, జన సమూహాలను ఎక్కువ సేపు గుమిగూడనీయకుండా నిశ్శబ్ధంగా పూజా ప్రసాద కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే విఘ్న నాయకుడు ప్రజల రక్షణ కోసం శానిటైజర్ ప్రసాదిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందో కళాకారునికి. అనుకున్నదే తడవుగా శానిటైజర్ వినాయకుడిని తయారు చేశాడు. ఈ విగ్రహం ముందుకు వెళ్లిన భక్తులు చేయి చాచగానే వారిపై శానిటైజర్ పడేలా రూపొందించాడు. ముంబైకి చెందిన కళాకారుడు నితిన్ రామ్‌దాస్ చౌదరి రూపొందించిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. (తుది మెరుగుల్లో ధన్వంతరి గణపతి) ప్రతి ఏడాది ఆయన భిన్న గణేశుని ప్రతిమలను రూపొందిస్తాడు. ఈ సారి కరోనా కాలం నడుస్తుండటంతో అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శానిటైజర్ డిస్పెన్సర్ ప్రతిమను తయారు చేశాడు. ఈ విగ్రహాలు తయారు చేయడానికి దేశం నలుమూలల నుంచి ముడిసరుకును తీసుకొస్తానంటున్నాడు. అలాగే ఈ శానిటైజర్ వినాయకుడి ప్రతిమలో లైట్లు కూడా పొందుపరిచానని తెలిపాడు. వీటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని పేర్కొన్నాడు. "గణేశుడు మన సమస్యలను పటాపంచలు చేస్తాడని బలంగా విశ్వసిస్తాం. అందుకే ఆ దేవుని ఆయుధంగా శానిటైజర్‌ను ప్రతిమలో పొందుపరిచా. ఇది మన నుంచి వైరస్‌ను పారద్రోలుతుందనడానికి సూచిక" అని తెలిపాడు. (‘ముఖానికి మాస్కు లేదా.. అయితే ఈ యంత్రం పెట్టేస్తుంది’) -
భక్తి భావంతో...
విలక్షణ నటుడు మోహన్‌బాబు వాయిస్ చాలా గంభీరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకు నిదర్శనం సినిమాల్లో ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్సే. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మోహన్‌బాబు ఉద్వేగభరితంగా డైలాగులు చెబుతారు. ఇప్పుడు భక్తి భావంతో ఆయన చెప్పే మాటలను వినబోతున్నాం. ఈ నెల 22న వినాయక చవితి. ఈ సందర్భంగా గణేశుడి పూజా విధానంతో కూడిన ఓ ఆడియో మోహన్‌బాబు గళంతో రానుంది. వినాయక చవితి పండగకు ఒక రోజు ముందు ఈ నెల 21న ఈ ఆడియో విడుదలవుతుంది. మోహన్‌బాబు గళంలో వినాయక పూజా విధానాన్ని వింటూ పండగను జరుపుకోవడం ఆయన అభిమానులకు ఓ మంచి అనుభూతి అని చెప్పొచ్చు. -
వైరల్: కొత్త పెళ్లి కూతురుగా నిహారిక
ఇప్పటికే దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగగా త్వరలోనే మెగా ఫ్యామిలీలోనూ పెళ్లి పనులు మొదలవ్వనున్నాయి. కొణిదెల నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక తన మెడలో కోరుకున్న వరుడితో మూడు ముళ్లు వేయించుకోనున్నారు. తన చేయి పట్టి ఏడడుగులు నడవబోయే ఆ పెళ్లి కొడుకు గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డ అని సోషల్ మీడియాలో ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ప్రేమ జంట ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే పెళ్లి తేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ ఓ షోలో పెళ్లి కూతురుగా ముస్తాబైన నిహారిక తెగ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె తండ్రి నాగబాబే జడ్జి కావడం విశేషం. వినాయక చవితి సందర్భంగా "బాపు బొమ్మకు పెళ్లంట" అని ప్రత్యేక కార్యక్రమం రాబోతోంది. (హ్యాపీ బర్త్‌డే.. లవ్ : నిహారిక) దీనికి సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ షోలో నిహారిక పల్లకి నుంచి దిగారు. ఎప్పుడూ పంచ్‌లతో ఎదుటివారిని మాట్లాడకుండా చేసే నిహారిక కాబోయే భర్త గురించి అడిగేసరికి సిగ్గుల మొగ్గయ్యారు. భర్తతో కలిసి ప్రోగ్రామ్‌కు విచ్చేసిన యాంకర్ అనసూయ.. నిహారికకు ముందస్తు కానుకను కూడా అందించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్‌తో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్ బాబా భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఇదిలా వుంటే నిహారిక, చైతన్యల నిశ్చితార్థం నేడు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరణాల అచ్చ తెలుగు అమ్మాయి నిహారిక కొత్త పెళ్లి కూతురిగా తయారైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (కుమారి శ్రీమతి కానుంది) -
కొత్త కార్ల ‘పండుగ’!
రోనా కష్టకాలంలోనూ కొత్త కార్లు రోడెక్కడానికి సిద్ధమయ్యాయి. పండుగ సీజన్‌ను సెంటిమెంట్‌ను ఆసరా చేసుకొని ప్రముఖ కార్ల కంపెనీలు భారత మార్కెట్లోకి దాదాపు 12రకాల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్యూవీ)మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌లో ఈ ఆగస్ట్ 22న వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. సాధారణంగా కార్ల కంపెనీలు పండుగ సీజన్‌ను క్యాష్‌ను చేసుకునేందుకు తమ కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. ఈసారి కంపెనీలకు పండుగ సీజన్ మరింత కీలకం కానుంది. కరోనా అనంతరం కార్లకు పెరిగిన డిమాండ్‌తో పాటు అంటువ్యాధి కారణంగా ఏర్పడిన అంతరాయంతో ఈసారి విక్రయాలు భారీగా ఉండవచ్చని కంపెనీలు ఆశిస్తున్నాయి. హ్యుందాయ్ నుంచి 4 మోడళ్లు పండుగ సీజన్ సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ ఎస్యూవీ విభాగంలో 4మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కంపెనీ తన ప్లాంట్లలో 3 షిఫ్టుల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ‘‘ఈ ఆగస్ట్‌లో కంపెనీ నిర్వహణ సామర్థ్యం 90–92శాతంగా ఉంది. రానున్నరోజుల్లో మరింత పెంచే అవకాశం ఉంది. సెప్టెంబర్ నాటికి ప్రీ–కోవిడ్ స్థాయి ఉత్పత్తిని అందుకుంటాము’’ అని హ్యుందాయ్ మోటర్ ఇండియా తెలిపింది. టొయోటా నుంచి బడ్జెట్ కారు: దీపావళి పండుగ సందర్భంగా జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ భారత మార్కెట్లోకి బడ్జెట్ కారును విడుదల చేయనుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి ’అర్బన్ క్రూయిజర్’ అనే పేరును ఖరారు చేసింది. ఈ మోడల్ కారు ధర రూ.8నుంచి రూ. 11లక్షల మధ్య ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అం చనా. కొత్తగా కారును కొనాలనుకునేవారు ఈ మో డల్ పట్ల ఆకర్షితులవుతారని కంపెనీ ఆశిస్తోంది. కియా నుంచి కూడా... దక్షిణ కొరియా దిగ్గజం కియా మోటర్స్ కూడా వచ్చే సెప్టెంబర్‌లో కాంపాక్ట్ ఎస్యూవీ ‘సోనెట్’ను విడుదల చేయనుంది. భారత్‌లో సెల్టోస్, కార్నివాల్ తర్వాత ‘సోనెట్’ మూడో మోడల్ కావడం విశేషం. దేశీయ మార్కెట్లో హ్యుం దాయ్ వెన్యూ, మారుతీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడళ్లతో ఇది పోటీ పడే అవకాశం ఉంది. ఈ మోడల్ ధర రూ.7నుంచి రూ.12లక్షల మధ్య ఉండొచ్చు. ఆగస్ట్ 15న మహీంద్రా థార్ లాంచ్ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా కంపెనీ తన కొత్త మోడల్ 2020 థార్ మోడల్ కారును ఆగస్ట్ 15న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సిన 2020 థార్ మోడల్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ థార్ మోడల్ కారు డీజిల్, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో లభిస్తోంది. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ సబ్–కాంపాక్ట్ విభాగంలో తన కొత్త మోడల్ కారును దీపావళికి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అలాగే ఎంజీ గ్లస్టర్, డస్టర్ ఎస్‌యూవీలు ఈ పండుగ సీజన్లో భారత్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. -
వినాయకుడిని పూజించే 21 రకాల పత్రాలు
సాక్షి, మంచిర్యాల: ప్రకృతిని పరిరక్షించుకోవాలని చాటే అతి పెద్ద పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి రోజున వినాయకుడిని 21 పత్రాలతో పూజించడం సంప్రదాయం. వాటి విశిష్టత...పూజ సందర్భంలో పఠించాల్సిన మంత్రాలను ఓసారి పరిశీలిద్దాం. ఓం సముఖాయ నమః మాచీపత్రం: తెలుగులో దీనిని మాచపత్రి అంటారు. చామంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి. ఇవి దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కంటి, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. ఓం గణాధిపాయనమః బృహతీ పత్రం: దీనిని ములక, వాకుడాకు అంటారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర, నేత్ర, వ్యాధశులను నయంచేస్తుంది. దంతధావనానికి కూడా ఉపయోగిస్తారు. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం: బిల్వపత్రం అంటే మారెడు ఆకు. ఇవి శివుడికి, మహాలక్ష్మికి కూడా ఇష్టమైనవిగా వేద పండితులు చెబుతుంటారు. ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధాన్ని తగ్గిస్తుంది. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం: దూర్వాయుగ్మం అంటే గరిక. ఇది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శ మొలలను నివారిస్తుంది. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం: దత్తూర అంటే ఉమ్మెత్త మొక్క. ఇది సెగ గడ్డలు, స్తనవాపు, చర్మ, శ్వాసకోశ వ్యాధులు, పెనుకొరుకుడు, నొప్పులు, రుతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం: బదరీ పత్రం అంటే రేగు ఆకు. జీర్ణకోశ, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడుతోంది. రోగ నిరోదక శక్తిని పెంపొందిస్తుంది. ఓం గుహాగ్రజాయనమః అపామార్గపత్రం: తెలుగులో ఉత్తరేణి అంటారు. ఇది దంత ధావనానికి, పిప్పి పన్పు, చెవి పోటు, రక్తం కారుట, అర్శ మొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్ళను నివారిస్తాయి. ఓం గజకర్ణాయనమః తులసీపత్రం: హిందువులు దేవతార్చనలో వీటిని విధిగా వాడతారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్నునొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం: చూతపత్రం అంటే మా మిడిఆకు. ఈ ఆకులకు శుభకార్యాల్లో విశిష్టస్థానం ఉంది. ఇది రక్త విరేచనాలు, చర్మవ్యాధులు, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు ఉపయోగపడుతోంది. ఓం వికటాయ నమః కరవీరపత్రం: దీనినే గన్నెరు అంటారు. దీని పువ్వులు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఇది కణుతులు, తేలుకాట్లు, విషకీటకాల కాట్లు, దురద, కంటి, చర్మ సంబంద వ్యాధులను తగ్గిస్తుంది. ఓం భిన్నదంతాయనమః విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రం గు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. ఇది జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గిస్తుంది. ఓం వటవే నమః దాడిమీ పత్రం: దాడిమీ అంటే దానిమ్మ మొక్క. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీ ఫల నైవెద్యం ఎంతో ఇష్టం. అతిసారం, విరేచనాలు, దగ్గు కామెర్లు, అర్శ మొలలు, ముక్కు నుంచి రక్తం కారటం వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. దీని మానుతో చెక్కే విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. ఇది అజీర్తి, పొట్ట సంబందిత వ్యాధులు, చర్మవ్యాధులు, కంటి వ్యాధులను తగ్గిస్తుంది. ఓం పాలచంద్రాయ నమః మరువక పత్రం: దవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా సువాసన వెదజల్లడం దీని ప్రత్యేకత. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, జుట్టు రాలడం, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. ఓం హేరంభాయ నమః సింధువారపత్రం: వీటినే వావిలి అంటారు. ఇవి జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్ఛవ్యాధి, ప్రసవం అనంతరం వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం: దీనిని లతా దూర్వా, దేవ కాంచనం అంటారు. మూర్ఛ, కఫం, పొట్ట సంబందిత వ్యాధులు, నులిపురుగులను నివారిస్తుంది. దీని ఆకులను ఆహారంగా కూడా వినియోగిస్తారు. ఓం ఇభవక్రాయ నమః శమీపత్రం: జమ్మిచెట్టు ఆకులను శమీ పత్రాలంటారు. ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులను నివారించేందుకు ఉపయోగపడుతుంది. ఓం వినాయక నమః అశ్వత్థపత్రం: రావి ఆకులను అశ్వత్థ పత్రాలంటారు. ఇవి మలబద్దకం, కామెర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, నోటి పూత, చర్మవ్యాధులను నివారిస్తుంది. జీర్ణశక్తిని, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం: తెల్లమద్ది ఆకులను అర్జున పత్రాలంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. ఇది అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం. చర్మ వ్యాధులు, కీళ్లనొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు బాగా పనిచేస్తుంది. ఓం కపిలాయ నమః అర్కపత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రాలంటారు. శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఇవి చర్మవ్యాధులు, సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, చెవి పోటు, కోరింత దగ్గు, దంతశూరి, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు వ్రణాలను తగ్గిస్తాయి. -
కాణిపాకం వినాయకుడికి బంగారు రథం
సాక్షి, చిత్తూరు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం చేయించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి రూ. 6కోట్ల వ్యయంతో బంగారు రథం తయారికి అనుమతి ఇచ్చామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత నాణ్యతతో రథాన్ని తయారు చేయిస్తున్నట్లుగా వివరించారు. ఇక పోతే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 2-22 వరకు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభంగా జరపనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు వసతి, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అంతేకాక ఆలయంలో పరిశుభ్రత పాటించాలని ఈవో, ఇతర అధికారులను శ్రీనివాసరావు ఆదేశించారు. -
జై..జై గణేశా!
-
బాలాపూర్‌లో వినాయక చవితి సందడి
-
ఏపీలో వినాయక చవితి శోభ
-
తెలంగాణలో వినాయక చవితి శోభ
-
ఖైరతాబాద్‌కు తరలిన తాపేశ్వరం లడ్డూ
హైదరాబాద్ : ఖైరతాబాద్ గణనాథుని కోసం తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామానికి చెందిన సురుచి ఫుడ్స్ తయారు చేసిన లడ్డూను ప్రత్యేక వాహనంలో ఆదివారం తరలించారు. ఆరేళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా స్వామివారికి సురుచి సంస్థ లడ్డూను కానుకగా సమర్పించింది. ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు ఈ ఏడాది 500 కిలోల లడ్డూను సిద్ధం చేశారు. సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతోపాటు 19 మంది సిబ్బంది గణపతి మాలధారణ చేసి ఈ లడ్డూ తయారు చేశారు. కాజూ పేస్టును ఉపయోగించి లడ్డూ పైభాగాన్ని దేవతామూర్తుల రూపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మల్లిబాబు, భారతి దంపతులు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం క్రేన్‌తో లడ్డూను అత్యంత జాగ్రత్తగా ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ గ్రామంలో అత్యంత కోలాహలంగా ఈ లడ్డూను ఊరేగించారు. లడ్డూ తరలింపును తిలకించేందుకు స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేడు గాజువాకకు మహాలడ్డూ తరలింపు విశాఖ జిల్లా గాజువాకలో ప్రతిష్ఠించనున్న మహాగణపతికి సురుచి ఫుడ్స్ కానుకగా అందజేస్తున్న మహాలడ్డూను సోమవారం ఉదయం తరలించనున్నారు. 12.50 టన్నుల బరువుతో రూపొందించనున్న ఈ మహాలడ్డూ తయారీలో ఆదివారం ఉదయం నుంచి సిబ్బంది నిమగ్నమయ్యారు. తుది మెరుగుల అనంతరం ప్రత్యేక వాహనంలో గాజువాక తరలించనున్నట్టు మల్లిబాబు తెలిపారు. -
వినాయకుడి చుట్టూ ఎలుక ప్రదక్షిణలు
వినాయక చవితి రోజున భక్తులకు వినాయకుడు ఎంత ముఖ్యమో.. ఆయన వాహనమైన ఎలుక కూడా అంతే ముఖ్యం. అనింద్యుడు అనే మూషికాన్ని వినాయకుడికి పరమశివుడు వాహనంగా ఇచ్చినట్లు వినాయకచవితి కథలో చెబుతారు. ఇప్పుడు అనంతపురం జిల్లా గుంతకల్లులో ఒక ఎలుక వినాయకుడి విగ్రహం చుట్టూ తిరుగుతూ, అక్కడే ఆయన తొండం మీద నివాసం ఏర్పరుచుకుని భక్తులు సమర్పించిన ప్రసాదాలు తింటూ అలాగే ఉండిపోయింది. వినాయక చవితి సందర్భంగా గుంతకల్లు లోని మునిసిపల్ బాలుర హైస్కూల్ సమీపంలో ఒక వినాయక మండపం ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడకు ఓ చిన్న ఎలుక వచ్చింది. వచ్చిందే తడవుగా విఘ్నేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. దాంతో భక్తులు పరమానంద భరితులయ్యారు. గణపతి బప్పా మోరియా.. ఆధా లడ్డూ ఖాలియా అంటూ ఆ మూషికానికి మరిన్ని లడ్డూలు, ఉండ్రాళ్లు పెట్టసాగారు. ఈ విషయం ఆనోట, ఈ నోట అందరికీ తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా జనం రావడం మొదలుపెట్టారు. స్వయంగా వినాయకుడే ఈ ఎలుక రూపంలో వచ్చి తమకు దర్శనం ఇచ్చాడంటూ మురిసిపోయారు. శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఆ ఎలుక ఆ విగ్రహం వద్దే ఉండటం విశేషం! -
చవితి చంద్రుడు రాలేదు!!
భాద్రపద శుద్ధ చవితి.. అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు తప్పవని, ఏదో ఒక అపనింద భరించాల్సి ఉంటుందని అంటారు. అయితే, శుక్రవారం నాడు దాదాపుగా రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు పట్టి కుండపోతగా వర్షం కురవడంతో అసలు చవితి చంద్రుడే కనిపించలేదు! ఉమ్మడి రాజధాని నగరమైన హైదరాబాద్‌లో అయితే సాయంత్రం నుంచి మబ్బు బాగా పట్టి అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు కూడా వర్షం అడపాదడపా కురుస్తూనే ఉంది. చాలాచోట్ల మండపాలు తడిసిపోయాయి. అయినా భక్తులు అలాగే వర్షంలో తడుస్తూనే విఘ్ననాయకుడికి పూజలు చేశారు. ఈసారి మాత్రమే వినాయకచవితికి చంద్రడు కనిపించలేదని, ప్రతిసారీ తప్పనిసరిగా వస్తాడని పలువురు అర్చకులు కూడా అన్నారు. అయితే.. వినాయక చవితి రోజున పూజ చేసుకుని, కథ విని అక్షింతలు వేసుకుంటే చంద్రుడిని చూసినా ఎలాంటి సమస్య ఉండబోదని వారు చెప్పారు. మొత్తానికి కావాలని చూడాలనుకున్నవారికి కూడా చవితి చంద్రుడు కనిపించకపోవడం ఈసారి విశేషం! -
బీజేపీ కార్యాలయంలో వినాయకచవితి వేడుకలు
-
ఏడాదంతా వినాయక నవరాత్రులే...
వినాయకచవితి.. ప్రపంచమంతా భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రమే ఈ పండుగ జరుపుకుంటారు. చవితి నుంచి నవరాత్రుల సంబురాల్లో తేలిపోతారు. పండుగ రోజు పూజించే వినాయకుడి విగ్రహాలు వారం ముందు నుంచే కొంటుంటారు. అయితే వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన శేఖర్‌కు మాత్రం ఏడాదంతా వినాయక నవరాత్రులే. ఆ రోజు.. ఈ రోజు.. అని చూడకుండా గణపతి ప్రతిమలు కొనుగోలు చేస్తూనే ఉంటారు. వెరైటీ వినాయకుడి విగ్రహం కనిపిస్తే చాలు అది ఆయన ఇంటికి చేరాల్సిందే. 1973 నుంచి ఇప్పటి వరకు ఆయన సేకరించిన లంబోదరుడి రూపాలు 16 వేలకు పైగానే ఉన్నాయి. ఇలా సేకరించిన ఏకదంతుడి మూర్తులతో మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తానంటున్న శేఖర్ ను ‘సిటీప్లస్’ పలకరించింది. చిన్నతనం నుంచే వినాయకుడంటే భక్తి. స్నేహితులతో కలసి గణేశ్ ఉత్సవాలను ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాణ్ని. మట్టి విగ్రహాలు తయారు చేసి పూజించేవాళ్లం. 1973లో మా కుటుంబసభ్యులతో షిర్డీకి వెళ్లాను. బాబా దేవాలయం పక్కనే ఓ వ్యక్తి గణేశ్ ప్రతిమలు సేకరించడం చూశా. మా అమ్మానాన్నలు నాకూ ఓ వినాయకుడి విగ్రహం కొని గిఫ్ట్‌గా ఇచ్చారు. దాని ధర 50 పైసలే. ఆ రోజు నుంచే వినాయక మూర్తులంటే ఆసక్తి ఏర్పడింది. విఘ్నేశ్వరుడి ప్రతిమ వెరైటీగా ఎక్కడ కనిపించినా కొనేవాణ్ని. మా ఇంట్లో కూడా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. జనరల్ బజార్, ఆర్పీ రోడ్, మోండా మార్కెట్ వెళ్లినప్పుడు విగ్రహాలు సేకరించేవాణ్ని. అలా నా చదువు పూర్తయింది. ఎస్బీఐలో ఉద్యోగం వచ్చింది. పెళ్లి అయింది. వినాయక విగ్రహాల సేకరణ మాత్రం ఆపలేదు. రారా గణేశా.. దేశవ్యాప్తంగా ఎక్కడ వెరైటీ గణపతి ప్రతిమ ఉందని తెలిసినా కొనుగోలు చేసేవాణ్ని. ఇప్పటికీ బ్యాంక్ లోన్ తీసుకుని మరీ దేశవిదేశాల నుంచి బొజ్జ గణపయ్య ప్రతిమలు సేకరిస్తున్నా. యూఎస్ఏ, జపాన్, చైనా, అఫ్ఘానిస్థాన్, సింగపూర్, ఇండోనేసియా, మలేసియా, ఈజిప్ట్, నేపాల్, శ్రీలంక, బాలి దీవులు, టిబెట్, కంబోడియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్.. ఇలా పలు దేశాల నుంచి తరలివచ్చిన గణనాథులు మా ఇంట్లో కొలువుదీరారు. చిన్నాపెద్దా సైజుల్లో మొత్తానికి 16 వేల ప్రతిమలు సేకరించాను. వీటితో పాటు వివిధ సైజుల్లో 18,342 వినాయక ఫొటోగ్రాఫ్‌లు, 1,096 పోస్టర్లు, 165 గణేశ్ పుస్తకాలు, 180 కీ చైన్లు, 155 ఆడియో, వీడియో క్యాసెట్లు కూడా సేకరించాను. ఎన్నో రూపాలు.. మరెన్నో రికార్డ్‌లు.. బంగారం, రజతం, కాంస్యం, ఇత్తడి, కంచు, అల్యూమినియం, టైటా, క్రిస్టల్, గ్లాస్, కోరల్, గ్రానైట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, శాండల్‌వుడ్ ఇలా రకరకాల ముడిపదార్థాలతో తయారైన గణపతి ప్రతిమలున్నాయి. తమిళనాడు లోని కుంభకోణం, స్వామిమలైలో లభించే విగ్రహాలు చాలా బాగుంటాయి. ఈ విగ్రహాల కలె క్షన్ ఇప్పటికే ఎన్నో రికార్డులు అధిగమించింది. ఈ ఏడాది యూనిక్ వరల్డ్ రికార్డ్స్, అమేజింగ్ వరల్డ్ రికార్డ్. రిపబ్లిక్ రికార్డ్ హోల్డర్లు వచ్చాయి. గత ఐదేళ్ల నుంచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్, అసిస్ట్ వరల్డ్ రికార్డ్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లు సొంతం చేసుకున్నా. వినాయక మ్యూజియం ప్రస్తుతం ఈ విగ్రహాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. లక్ష ప్రతిమల సేకరణే నా లక్ష్యం. మా ఇంటిపై పెద ్ద హాల్ నిర్మించి ఈ విగ్రహాలు అందులో ఉంచాలనుకుంటున్నా. ఈ మ్యూజియం వినాయకుడి రూపాలు, విశిష్టత గురించి అందరికీ తెలియజేస్తుందని నా నమ్మకం. పంచముఖ గణపతి ఆలయాన్ని నిర్మించాలని ఉంది. ఏకదంతుడి ప్రతిమల కలెక్షన్‌తో భవిష్యత్తులో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పుతా. ..:: వాంకె శ్రీనివాస్ ఫొటోలు: జి.రాజేష్ -
ఆ గణపతికి 259 కోట్ల బీమా!!
వినాయక చవితి వచ్చేస్తోంది. మహారాష్ట్రలో.. అందులోనూ ముంబై మహానగరంలో సందడికి ఏమాత్రం కొదవ లేదు. అక్కడ ఓ మండపాన్ని ఏకంగా రోజుకు 50 కోట్ల రూపాయలకు బీమా చేశారు. జీఎస్బీ సేవా మండల్ ఆధ్వర్యంలో కింగ్స్ సర్కిల్లో ఏర్పాటుచేసిన ఈ మండపంలో గణపతిని ఐదు రోజుల పాటు ఉంచుతారు. మొత్తం 259 కోట్లకు ఈ మండపాన్ని, అందులో గణపతిని బీమా చేశారు. కేవలం విగ్రహం మీద ఉన్న బంగారమే దాదాపు 22 కోట్ల రూపాయల విలువైనది కావడంతో ఈ భారీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేశారు. ఇందులో విగ్రహానికి, దానిమీదున్న బంగారానికి, మండపానికి, భక్తులకు కూడా బీమా ఉంటుంది. అగ్నిప్రమాదం, ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలు.. ఇలా ఏం జరిగినా బీమా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఉత్సవాలు మొదలైన తొలిరోజు నుంచి బీమా కవరేజి మొదలవుతుంది. చిట్టచివరి రోజున ట్రస్టీలు విగ్రహానికి అలంకరించిన ఆభరణాలను మళ్లీ బ్యాంకు లాకర్లో భద్రపరిచేవరకు కవరేజి కొనసాగుతుంది. ఆ తర్వాతే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తారు. ఇందుకు తాము చెల్లిస్తున్న ప్రీమియం లక్షల్లోనే ఉంటుంది గానీ, అదెంతో మాత్రం వెల్లడించబోమని జీఎస్బీ మండల్ సీనియర్ ట్రస్టీ సతీష్ నాయక్ తెలిపారు. మరోవైపు నగరంలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా మండపాన్ని 51 కోట్లకు బీమా చేయించారు. దీనికి 12 లక్షల ప్రీమియం కడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే జీఎస్బీ మండపానికి ప్రీమియం కనీసం 50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా రెండు కోట్ల పాలసీలకు అయితే 2.5 లక్షల వరకు ప్రీమియం ఉంటుందని, కానీ ఈ మండపాలకు వేరే ప్రీమియం ఉంటుందని ఓ అధికారి చెప్పారు. -
ది ప్రైమ్ టైమ్ షో 26th Oct 2013
-
ఘనంగా వినాయకుని నిమజ్జనం
వేలూరు, న్యూస్‌లైన్: హిందూ మున్నని ఆధ్వర్యంలో వేలూరు పట్టణంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జనం భారీ పోలీస్ బందోబస్తు నడుమ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మున్నని, హిందూ మక్కల్ పార్టీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో వినాయక చవతి వేడుకలను ఘనం గా నిర్వహించారు. వేలూరు జిల్లాలో సుమారు రెండువేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించగా హిందూ మున్నని అధ్వర్యంలో 1200 విగ్రహాలను ప్రతిష్టిం చారు. వీటిని ప్రతి సంవత్సరం మూడు, ఐదు, ఏడవ రోజున విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి సదుపేరి చెరువులో నిమజ్జనం చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సత్‌వాచ్చారి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి సుమారు 150 పెద్ద వినాయకుని విగ్రహాల ఊరేగింపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హిందూ మున్నని నేత మహేష్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ ఊరేగింపు సైదాపేట మురుగన్ ఆలయం, మెయిన్ బజారు వీధి, కిరుబానంద వారియార్ వీధి, కొనవట్టం తదితర ప్రాంతాల మీదుగా భారీ పోలీస్ బందోబస్తు నడుమ సదుపేరి చెరువు వద్దకు చేరుకుంది. అనంతరం చెరువు వద్ద విగ్రహాలకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Special edition on 'Praja kavi kloji'
-
విదేశాల్లో మన వినాయకుడు
-
సికింద్రాబాద్ గణపతి ఆలయంలో రద్దీ
-
ఎక్కడ చూసినా మట్టి బొజ్జ గణపయ్యలే
-
ఖైరతాబాద్ వినాయకుడికి గవర్నర్ దంపతుల తొలి పూజ
-
కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవ శోభ
-
The Head Line Show 9th Sept 2013
-
రాష్ట్రమంతటా గణపతి ఉత్సవాలు
-
ఖైరతాబాద్ వినాయకుడు