వినాయకుడి పేరు మీద వచ్చిన సినిమాలివే! | Ganesh Chaturthi 2023: Telugu Movies On Vinayaka Title | Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi: బొజ్జ గణపయ్యపై పాటలేనా.. ఆయన పేరుతో వచ్చిన సినిమాలివే!

Published Mon, Sep 18 2023 11:28 AM | Last Updated on Mon, Sep 18 2023 11:54 AM

Ganesh Chaturthi 2023: Telugu Movies On Vinayaka Title - Sakshi

గణపతిని కొందరు భక్తిశ్రద్ధలతో పూజిస్తే మరికొందరు భయభక్తులతో పూజిస్తారు. ఈయన ఆశీర్వాదం లేకుండా పని మొదలుపెడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఆయన్ను పూజించేవాళ్లు చాలామంది. ఏ విఘ్నాలు లేకుండా పని జరగాలని ప్రేమగా పూజించేవారు కోకొల్లలు. సినిమా రంగంలోనూ గణనాయకుడికి పెద్ద పీటే వేస్తారు. వినాయక పూజతోనే సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. అంతేనా.. సినిమా ప్రారంభంలో కూడా మొదట గణపతిని చూపిస్తూ కొన్నిసార్లు ఆయన పాట కూడా వేస్తారు. అయితే ఈ ట్రెండ్‌ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు.

కానీ బొజ్జగణేశుడిని పూజించడం మాత్రం ఎవరూ విస్మరించడం లేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఆయనంటే అంతిష్టం. సినిమాల్లోనూ గణపతి చాలా పవర్‌ఫుల్‌. కొన్ని కీలక సందర్భాలు ఈయనచుట్టే తిరగ్గా మరికొన్ని ఏకంగా గణపతి గురించే వచ్చాయి. సినిమాల్లో ఆయన గురించి వచ్చిన పాటలు ఇప్పటికీ మండపాల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అసలు గణేశుడి పేరు మీద ఏయే సినిమా టైటిల్స్‌ ఉన్నాయో ఓసారి చూసేద్దాం..

ఉమా చండీ గౌరీ శంకరుల కథ, భూకైలాస్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలు గణేశ్‌ మహత్యాన్ని తెలిపేవి ఉన్నాయి. కానీ ఆయన పేరు మీద మాత్రం కొన్ని సినిమాలే ఉన్నాయి. అవే.. గణపతి, ఓం గణపతి, గణేశ్‌, వినాయక చవితి, విలేజ్‌లో వినాయకుడు, శ్రీ వినాయక విజయం. త్వరలో రాబోతున్న గం గం గణేశా కూడా ఈ లిస్టులో చేరింది. కానీ ఇందులో కొన్ని పేరుకు మాత్రమే ఏకదంతునివి కావడం గమనార్హం.

చదవండి: ఎవర్రా మీరంతా? ఇలా తగులుకున్నారు.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement