Ganesh Chaturthi
-
కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు, వీడియో వైరల్
దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఎప్పటి మాదిరే ఈ సారి కూడా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా పాత్రలపై స్పెషల్ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవరతో పాటు పలువురి స్టార్ హీరోల లుక్‌లో ఉన్న గణపతి బొమ్మలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ‘కల్కి’ రూపంలో ఉన్న వినాయకుడే ఈ ఏడాది స్పెషల్ అట్రాక్షన్ నిలిచాడు.కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడుప్రభాస్ హీరోగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ ఏడాది జూన్ 27న విడుదలై..బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, యాస్కిన్‌గా కమల్ నటించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు ప్రత్యేక కారు ‘బుజ్జి’, కాంప్లెక్స్ ప్రదేశాలు అలా గుర్తిండిపోతాయి. ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఓ గణపతి మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వినాయకుడు అశ్వత్థామ రూపంలో ఉండగా.. మందిరం కాంప్లెక్స్ ప్రదేశంలా ఉంది. ‘కల్కి’వినాయకుడు ఎక్కడ ఉన్నాడు?‘కల్కి’ వినాయకుడి విడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అసలు ఈ మందిరం ఎక్కడ ఏర్పాటు చేశారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేసింది తమిళ ప్రజలే. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ మందిరం ఉన్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్ మాదిరి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్‌లో బుజ్జిని కూడా ఉంచారు. లోపల యాస్కిన్ లుక్‌లో ఉన్న కమల్ బొమ్మ పెట్టి.. అమితాబ్ అశ్వత్థామ లుక్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, నుదుటిపై మణి వెలిగిపోతున్నట్లు ఓ లైట్ కూడా సెట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది స్పెషన్ వినాయక విగ్రహం ఇదేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. #wow pic.twitter.com/54ssb41OTm— devipriya (@sairaaj44) September 9, 2024 -
‘చవితి’ సందేశాలు తొలగించిన ప్రిన్సిపాల్ అరెస్ట్
కోటా: రాజస్థాన్‌లోని కోటాలో గల ఒక పాఠశాలలో వాట్సాప్ గ్రూప్‌లోని వినాయక చవితి సందేశాలను తొలగించిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు చుక్కలు చూపించారు. మత సామరస్యానికి ప్రిన్సిపాల్ విఘాతం కలిగిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.వివరాల్లోకి వెళితే కోటా జిల్లాలోని లాటూరి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వాట్సాప్‌లో ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ గ్రూప్‌లో వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు సందేశాలను పంపుతున్నారు. అయితే ప్రిన్సిపాల్ ఆ మెసేజ్‌లను డిలీట్ చేస్తూ వచ్చాడు. దీనికి ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను ఎందుకిలా చేస్తున్నారంటూ నిలదీశారు.విషయం పోలీసుల వరకూ చేరడంతో వారు వివాదం జరుగుతున్న పాఠశాలకు వచ్చారు. ఆందోళన చేస్తున్నవారిని శాంతింపజేశారు. తరువాత ప్రిన్సిపాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేశారు. ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సోషల్ మీడియాలో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు బాపవార్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఉత్తమ్‌సింగ్ తెలిపారు. భరత్ అనే వ్యక్తి ఈ వాట్సాప్ గ్రూప్‌లో గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపాడు. పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపాల్ దానిని తొలగించారు. ఇలాంటి సందేశాలను అతను తొలగిస్తూ వచ్చాడు. కాగా పోలీసులు ప్రిన్సిపాల్‌పై బీఎన్ఎస్సెక్షన్ 196 (మత సామరస్యానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేసుకుని, అరెస్ట్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
గణేశుని భక్తులతో.. గరం గరం ముచ్చట్లు
-
అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు (ఫోటోలు)
-
గం.. గం.. గణేషా!.. ఈ చిత్రాలు చూడండయ్యా
-
శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి.. విశ్వరూపం
ఇంతింతై వటుడింతయై.. అన్నట్లు.. వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు.. అన్నట్లు.. 70 ఏళ్ల ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం కొనసాగుతోంది.. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం నిరి్వగ్నంగా 70 వసంతాలకు చేరుకుంది. యేటా ఒక్కో అడుగు పెంచుకుంటూ 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా రూపుదిద్దుకున్నాడు. యేటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే మహాగణపతి ఈసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్త ముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం, రెండువైపులా 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద.. ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహంతో ఈసారి దర్శనమివ్వనున్నారు. ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేశారు. మహాగణపతి పాదాల చెంత ఆయన వాహనమైన మూషికం ఆకారాలు 3 అడుగులలో దర్శనమిస్తున్నాయి. విగ్రహానికి కుడివైపున 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం విగ్రహ మూర్తులను ఏర్పాటు చేశారు. ఇంతటి అద్భుత రూపాలతో యేటా మహాగణపతిని రూపొందిస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ అంతఃకరణ శుద్ధితో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి గురించి ఆయన పంచుకున్న పలు విశేషాలు.. ప్రపంచవ్యాప్త గుర్తింపు... మహాశక్తి గణపతి వరల్డ్ రికార్డు నెలకొల్పనుంది. అప్పట్లో బాలగంగాధర్ తిలక్ అందరినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకు వాడ వాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటుచేయాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు సింగరి శంకరయ్య ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన ఒక్క అడుగు విగ్రహం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగానే కాక, విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి గణనాథుని వేడుకోవడం విశేషం. సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో.. రిజర్వ్‌బ్యాంక్ ఉద్యోగి ఏసుపాదం 1978లో నా వద్దకు వచ్చి ఖైరతాబాద్‌లో సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో 14 అడుగుల ఎత్తులో వినాయకుడిని తయారు చేయాలని కోరారు. అదే మొట్టమొదటి సారిగా ఆరు బయట స్టేజీపై 14 అడుగుల ఎత్తులో విష్ణు అవతారంలో చేసిన విగ్రహం. అది అందర్నీ ఆకట్టుకోవడంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాననే సంతోషం దక్కింది. 1980లో పంచముఖ వినాయకుడిని సారథి స్టూడియోలో చేసి ఖైరతాబాద్ తీసుకొచ్చాం. 1982లో ఎలుక రథంతో మంటపంలో చక్రాల బండిపై స్టాండ్‌తో తయారుచేశాం. అదే సంవత్సరం సాగర సంగమం సినిమా షూటింగ్లో భాగంగా నటుడు కమల్ హాసన్‌తో పాట చిత్రీకరణ జరిగింది. 1993 నుంచి 1999 వరకూ ఏడు సంవత్సరాల పాటు ఖైరతాబాద్ మహాగణపతికి శిల్పిగా వ్యవహరించలేదు. ఆ ఏడు సంవత్సరాలు ఆరి్టస్టు రంగారావు నేతృత్వంలో మహాగణపతిని తయారుచేశారు. మరలా 2000 నుంచి ఇప్పటి వరకూ నిరి్వరామంగా మహాగణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.లడ్డూ ప్రసాదం నైవేద్యంగా..తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్ మహాగణపతికి 2010లో 500 కిలోల లడ్డూను ప్రసాదంగా చేతిలో ఉంచి భక్తులకు పంచిపెట్టారు. ఆ తరువాత వరుసగా 2400, 3600, 4200 లడ్డూను నైవేద్యంగా ఇచ్చారు. 2015లో 6000 వేల కిలోల లడ్డూ మహాగణపతి చేతిలో 11 రోజులు పూజలందుకోవడం మొట్ట మొదటిసారి ఖైరతాబాద్ మహాగణపతికే సొంతం. ఆ రూపాలు సంతోషాన్నిచ్చాయి.. ఎలుక రథంపై 1982లో చేసిన వినాయకుడి రూపం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆ తరువాత విశ్వరూప, మత్స్య వినాయకుడు, ఈ యేడాది 70 అడుగుల ఎత్తులో చేసిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాలు నాకు ప్రత్యేకం. 2024 ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తులో మట్టితో మహాగణపతిని చేయడం వెనుక ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దివంగత సింగరి సుదర్శన్ భక్తులకు ఇచి్చన మాటను నిలబెట్టేందుకు ఈ విగ్రహాన్ని చేశాను. ఎత్తులో ఇదే చివరి విగ్రహం.. వచ్చే యేడాది నుంచి విగ్రహం ఎత్తు తగ్గుతూ వస్తుంది..నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఖైరతాబాద్ వినాయకుడు, మా నాన్న గారి ఆశీర్వాదంతో నేను ఉన్నన్ని రోజులూ ఖైరతాబాద్ మహాగణపతి ఖ్యాతిని ఏమాత్రం తగ్గకుండా పెంచేందుకు అందరితో కలిసి ముందుకు వెళ్తా. 70 సంవత్సరాలు 70 అడుగులు చేయాలన్న మా నాన్న సింగరి సుదర్శన్ ఆఖరి కోరికను తీరుస్తూ ఆ దిశగా అడుగులు వేయటం సంతోషంగా ఉంది. – సింగరి రాజ్‌కుమార్70 అడుగుల మట్టి వినాయకుడు.. ఈ యేడాది 70 అడుగుల మట్టి వినాయకుడే వరల్డ్ రికార్డు. ఉత్సవ కమిటీ కనీ్వనర్‌గా, ఎన్నో దశాబ్దాలుగా మహాగణపతి సేవలతో వెన్ను దన్నుగా వ్యవహరిస్తున్నా. వైజగ్లో గతంలో 80 అడుగుల వినాయకుడిని చేసినా అక్కడే నిమజ్జనం చేశారు. ఈ సంవత్సరం విజయవాడలో 72 అడుగులు వినాయకుడిని చేశారు. కానీ అక్కడే నిమజ్జనం చేస్తారు. ఇక్కడ 70 అడుగుల మహాగణపతిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం గావిస్తాం. ఇది వరల్డ్ రికార్డు. – సందీప్ రాజ్, ఉత్సవ కమిటీ కనీ్వనర్పుట్టింది అక్కడే.. తమిళనాడు, పరంబలూరు జిల్లా, పుదువేటకుడి గ్రామానికి చెందిన చిన్నస్వామి, మరుదాయి దంపతులకు 8 మంది సంతానం కాగా, వీరిలో రెండో సంతానం చిన్నస్వామి రాజేంద్రన్. పేదరికంలో ఉన్నా కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే చెన్నైకి వచ్చి అక్కడ వేలుస్వామి వద్ద పనిచేయడం ప్రారంభించా. అప్పట్లో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ నటించే పౌరాణిక ఘట్టాలకు సంబంధించిన ఆభరణాలకు స్టోన్స్ అతికించే పనికోసం నా సీనియర్స్‌తో పాటు నన్ను హైదరాబాద్ పంపారు. ఆ సమయంలో నేను చేసిన పనిని గుర్తించి నన్ను ఆరి్టస్టుగా ప్రోత్సహించారు.ఆ గుర్తింపే ఇంటిపేరుగా..ఎప్పుడైతే ఖైరతాబాద్ మహా గణపతికి శిల్పిగా వ్యవహరిస్తూ వచ్చానో ఆ తరువాత నన్ను మహా గణపతి ఆర్టిస్టుగా గుర్తించడం ప్రారంభిచారు. ఇక అదే నాకు ట్రేడ్ మార్క్, ఇంటి పేరులా మారిపోయింది. ఖైరతాబాద్ మహాగణపతిని తయారుచేసే భాగ్యం నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. – చిన్నస్వామి రాజేంద్రన్, ఖైరతాబాద్ మహాగణపతి శిల్పి. -
ఈసారి రూ.25,000 కోట్లు తెస్తున్న గణపతి!
దేశంలో జరిగే అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన ఈ వేడుక వస్తోందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. దేశవ్యాప్తంగా సంబరాన్ని పంచే గణేష్ చతుర్థి.. ఏటా వేలాది కోట్ల రూపాయల వ్యాపారాన్ని అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకూ తోడ్పడుతోంది.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం.. దేశంలో ప్రధాన హిందూ పండుగ అయిన గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సారి రూ.25,000 కోట్ల వ్యాపారం జరుగుందని అంచనా. చైనీస్ ఉత్పత్తులను పూర్తిగా పక్కన పెట్టి దేశీయ వస్తువులను వ్యాపారులు ప్రోత్సహిస్తున్న విషయాన్ని వ్యాపారుల సంఘం గుర్తుచేస్తోంది.దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో సందర్భంగా జరిగే వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందిస్తుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ఎమిరిటస్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.20 లక్షల గణేష్ మంటపాలుఈ సారి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల గణేష్ మంటపాలు ఏర్పాటైనట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా తెలిపారు. 7 లక్షలకు పైగా మంటపాలతో మహారాష్ట్ర ముందంజలో ఉండగా, కర్ణాటక 5 లక్షలతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లు ఒక్కొక్కటి 2 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సెటప్, అలంకరణలు, పూజా కార్యక్రమాలకే ఒక్కో మంటపానికి కనీసం రూ.50,000 ఖర్చవుతుందని, మొత్తం ఖర్చు రూ.10,000 కోట్లు దాటుతుందని ఆయన భావిస్తున్నారు.గణేష్ విగ్రహాల వ్యాపారమే రూ. 500 కోట్లకు పైగా ఉంటుందన్నారు. పూలు, దండలు, కొబ్బరికాయలు వంటి నిత్యావసర వస్తువులు ఆర్థిక వ్యవస్థకు మరో రూ. 500 కోట్లు జోడిస్తాయన్నారు. ఇక లడ్డూలు, ఇతర స్వీట్స్‌కు సంబంధించిన అమ్మకాలు రూ. 2,000 కోట్లకు మించి ఉంటాయని అంచనా. క్యాటరింగ్ వంటి సేవల ద్వారా జరిగే దాదాపు రూ. 3,000 కోట్లు ఉంటుంది.పండుగ సందర్భంగా జరిగే ప్రయాణాలు, బస ఖర్చు సుమారు రూ. 2,000 కోట్లు, పండుగ సంబంధిత వస్తువులైన బట్టలు, ఉపకరణాలు, గృహాలంకరణ, బహుమతి వస్తువుల రిటైల్ విక్రయాలు దాదాపు రూ. 3,000 కోట్లకు చేరవచ్చు. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున పబ్లిక్ ఈవెంట్లను నిర్వహించడం ద్వారా రూ. 5,000 కోట్లు ఆర్జిస్తున్నాయని బీసీ భార్టియా వివరించారు. -
షార్లెట్ లో గణేష్ నిమజ్జనం వేడుకలు
-
Khairatabad Ganesh 2023 Photos: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తజన సందోహం (ఫోటోలు)
-
సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి పూజలు.. లడ్డూ వేలం
సింగపూర్‌లో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుని జయజయద్వానాల మధ్య భక్తి శ్రద్దలతో, ఎంతో అద్యాత్మిక శోభతో ఘనంగా జరిగింది. సుమారు వందమంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించబడి ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుని ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజనంతరం వినాయకచవితి లడ్డు వేలం ఆసక్తికరంగా సాగింది. ఇందులో వీరగ్రూపు లడ్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి..పూజలో పాల్గొన్న పిల్లలందిరికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలు అందించారు. అనంతరం 800 మందికి అన్నిరకాల 21 పత్రిని ఉచితంగా పంచిపెట్టారు. ఈ పూజా కార్యక్రమాన్ని సుమారు 500 ప్రత్యక్షంగా, 5000 మంది అంతర్జాలం ద్వారా వీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
అమెరికాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, 11 రోజుల పాటు..
అమెరికాలోని నార్త్ కరోలినాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హంటర్స్‌విల్లేలోని సాయిమందిర్‌లో గణపతి ప్రతిమను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పెద్ద ఊరేగింపుతో మండపానికి తీసుకువచ్చారు. మహిళల కోలాటాలు, భజనలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన మండపాల్లో గణనాథుడిని ప్రతిష్టించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. విఘ్నేశ్వరుడ్ని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 11 రోజుల పాటు నిత్యపూజలు, మండపంలో రోజుకో అలంకరణ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలతో పాటు 5వ వార్షికోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం, బాబాకి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. -
వాళ్లంతా అంబానీ అంటీలియాలో! కోహ్లి మాత్రం ఆ లీడర్ ఇంట్లో.. వైరల్
Virat Kohli- Anushka Sharma- Gansesh Chatirthi 2023: ఆసియా కప్-2023 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సహా పలువురికి విశ్రాంతి దొరికింది. వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు ఆస్ట్రేలియాతో మూడో వన్డేతో వీరంతా మళ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు రన్‌మెషీన్ విరాట్ కోహ్లి. వినాయక చవితి సందర్భంగా భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి పండుగ జరుపుకొన్నాడు. ముంబైలోని తమ నివాసంలో విరుష్క దంపతులు ఎకో ఫ్రెండ్లీ గణనాథునికి పూజలు చేశారు. వాళ్లంతా అంటీలియాలో హార్దిక్ పాండ్యా, సచిన్ టెండుల్కర్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితరులు.. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట(అంటీలియా) వినాయకుడి పూజలో పాల్గొనగా.. కోహ్లి మాత్రం తమ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక విఘ్నేశ్వరుడి పూజలో కోహ్లి, అనుష్క సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. #WATCH | Indian Cricketer KL Rahul with his wife Athiya Shetty arrive at Mukesh Ambani's residence 'Antilia' in Mumbai to attend Ganesh Chaturthi celebrations #GaneshChaturthi2023 pic.twitter.com/P2t3GXmSCG — ANI (@ANI) September 19, 2023 గోధుమ రంగు ఎరుపు రంగులు మేళవించిన చీర ధరించి అనుష్క నిండుగా కనిపించగా.. కోహ్లి తెలుపు రంగు కుర్తా ధరించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇందుకు స్పందించిన సినీ సెలబ్రిటీలు సమంత రుతుప్రభు, కరిష్మా కపూర్ తదితరులు హార్ట్ ఎమోజీలతో ప్రేమను తెలియజేశారు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) కోహ్లి మాత్రం ఆ లీడర్ ఇంట్లో ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి.. శివసేన నాయకుడు రాహుల్ కనాల్ ఇంట్లో గణేశ్ దర్శనానికి వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులకు అభివాదం చేస్తూ కోహ్లి కారెక్కుతుండగా అభిమానులు అతడిని చూసేందుకు పోటీపడ్డారు. ఈ వీడియోను వైరల్ భయానీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Virat Kohli At Rahul Kanal's Home For Ganpati Darshan.🙏🖤 🎥: @viralbhayani77 #ViratKohli #GaneshChaturthi @imVkohli @Iamrahulkanal pic.twitter.com/IT0FVVQRdX — virat_kohli_18_club (@KohliSensation) September 20, 2023 వన్డే వరల్డ్‌కప్‌కి ముందు కాగా ఆసియా వన్డే కప్-2023లో కోహ్లి పాకిస్తాన్ మీద అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 122 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ స్టార్ బ్యాటర్.. అంతర్జాతీయ కెరీర్లో 77వ సెంచరీ నమెదు చేశాడు. ఇక సెప్టెంబరు 27న ఆసీస్‌తో ఆఖరి వన్డేల్లో మళ్లీ కోహ్లి మెరుపులు చూసే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో అతడు పాల్గొంటాడు. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్
KL Rahul Posts An Adorable Pic With His Wife Athiya Shetty: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. గాయం కారణంగా నెలల తరబడి జట్టు దూరమైన ఈ కర్ణాటక ప్లేయర్.. ఆసియా కప్-2023తో ఘనంగా పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. అయితే, పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో మెగా ఈవెంట్లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్.. అజేయ సెంచరీ(111)తో సత్తా చాటాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. బ్యాట్‌తోనే కాదు వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ఆకట్టుకుని.. వన్డే వరల్డ్‌కప్-2023కి తాను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు చాటిచెప్పాడు ఈ మిడిలార్డర్ బ్యాటర్. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ కంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఏకంగా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సారథి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గైర్హాజరీ నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబరు 22న ఈ సిరీస్ మొదలు కానుండగా.. ఈ మధ్యలో దొరికిన కాస్త విరామ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. భార్య అతియా శెట్టితో కలిసి.. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట గణపతి పూజలో పాల్గొన్నాడు. వైట్కుర్తా.. పైజామా ధరించి రాహుల్ హుందాగా కనిపించగా.. ఎరుపు రంగు చీరలో సంప్రదాయకట్టులో అతియా మెరిసిపోయింది. ఈ క్రమంలో రాహుల్- అతియా తమ అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. హార్ట్ ఎమోజీతో ఇన్‌స్టాలో ఇద్దరూ బుధవారం ఫొటోలను షేర్ చేయగా... నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక పూజలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ దంపతుల వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె, నటి అతియాతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కేఎల్ రాహుల్.. ఈ ఏడాది జనవరిలో ఆమెతో కలిసి ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే. చదవండి: ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే? #WATCH | Indian Cricketer KL Rahul with his wife Athiya Shetty arrive at Mukesh Ambani's residence 'Antilia' in Mumbai to attend Ganesh Chaturthi celebrations #GaneshChaturthi2023 pic.twitter.com/P2t3GXmSCG — ANI (@ANI) September 19, 2023 View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) -
గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్
పవిత్ర గణేష్ చతుర్థిని దేశవ్యాప్తంగా పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ కుటుంబం జరుపుకున్న వినాయక చవితి వేడుకులు విశేషంగా నిలిచాయి. ముంబైలోని వీరి లగ్జరీ నివాసం యాంటిలియా విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే,ఈ ఏడాదికూడా మహారాష్ట్రలోని ముంబైలోని లాల్‌బాగ్‌లో లాల్బాగ్చా రాజా ప్రజలు దర్శనం కోసం అందంగా కొలువు దీరాడు. ప్రతీ ఏడాది అంబానీకుంటుంబంతోపాటు, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ రాజకీయ రంగ ప్రముఖులు ఈ గణపతిని దర్శించుకుంటారు. ఈ ఏడాది మాత్రం ఈ వేడుకను అంబానీ కుటుంబం మరో మెట్టు పైకి తీసుకువెళ్లింది. ముఖేష్ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి లాల్బాగ్చా రాజాను సందర్శించి గణేశుడిని ప్రార్థనలు చేశారని తెలుస్తోంది. (ఫైల్ ఫోటో ) ఈ సందర్బంగా భారీ దండను కూడా బొజ్జ గణపయ్యకు అందించడం విశేషంగా నిలిచింది. తండ్రి కొడుకులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ముఖేష్ అంబానీ నీలిరంగు కుర్తా-పైజామాను ధరించగా, అనంత్ అంబానీ మెరూన్-హ్యూడ్ దుస్తుల్లో విఘ్ననాయకుడి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ ఫోటోలతోపాటు, పాత వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by LalbaugchaRaja (@lalbaugcharaja) -
రిచెస్ట్ గణపతి: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!
Richest Ganpati: దేశంలో ప్రముఖంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. భక్తులు తమ శక్తికొద్దీ గణేషుడి ప్రతిమలు కొలుదీర్చి పూజలు చేస్తారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో గణేష్ చతుర్థి అత్యంత వైభవంగా జరుగుంది. గణేషుడి భారీ విగ్రహాలతోపాటు కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన మంటపాలను ఇక్కడ చూడవచ్చు. ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ తమ 69వ వార్షిక గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో గణేష్ విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) కాగా ఈ సంవత్సరం ఉత్సవాలకు రూ. 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు జీఎస్బీ సేవా మండల్ వైస్ ఛైర్మన్ రాఘవేంద్ర జి భట్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో వెల్లడించారు. గతేడాది రూ. 316.40 కోట్లకు బీమా తీసుకోగా ఈసారి మరింత మొత్తానికి కవరేజీ కవరేజీ తీసుకున్నారు. బీమా ప్యాకేజీలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ ఉంటుంది. మిగిలినది మంటపం, నిర్వాహకులు, భక్తుల భద్రతకు కవరేజీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Maharashtra | 'Richest' Ganpati of Mumbai - by GSB Seva Mandal - installed for the festival of #GaneshChaturthi. The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6 — ANI (@ANI) September 18, 2023 -
వినాయక చవితి స్పెషల్: స్వీట్ సందేశ్ చేసుకోండి ఇలా
స్వీట్ సందేష్ ఇలా చేసుకోండి కావలసినవి: ఉడికించిన చిలగడ దుంప – పెద్దది ఒకటి; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; జీడిపప్పు పొడి – పావు కప్పు; కొబ్బరి పాలు – అరకప్పు; పంచదార – అరకప్పు; యాలకులపొడి – అరటీస్పూను; రోజ్ వాటర్ – టీస్పూను. తయారీ: చిలగడ దుంప తొక్క తీసి ఉండలు లేకుండా మెత్తగా చిదుముకోవాలి ∙చిదుముకున్న చిలగడ దుంప మిశ్రమంలో జీడిపప్పు పొడి వేసి కలపాలి. పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి సుగర్ సిరప్‌ను తయారు చేసుకోవాలి ∙సిరప్ తయార య్యాక కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చినప్పుడు చిలగడదుంప మిశ్రమాన్ని వేసి కలపాలి ∙మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొబ్బరిపాలు వేయాలి ∙మధ్యలో కొబ్బరి పాలతో΄పాటు యాలకులపొడి, రోజ్‌వాటర్ వేసి కలుపుతూ మొత్తం కొబ్బరి పాలు అయిపోయేంత వరకు మగ్గనివ్వాలి ∙ దాదాపు ఇరవై నిమిషాల తరువాత ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసేయాలి ∙ గోరువెచ్చగా ఉన్నప్పుడే మిశ్రమాన్ని చేతులతోగానీ, మౌల్డ్స్లోవేసి నచ్చిన ఆకారంలో వత్తుకుంటే స్వీట్ సందేష్ రెడీ. -
వినాయక చవితి స్పెషల్: కేసి మిథోయ్
కేసి మిథోయ్ కావలసినవి: తాజా బియ్యప్పిండి – రెండు కప్పులు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; పంచదార పొడి – అరకప్పు; యాలకుల పొడి అరటీస్పూను; కొబ్బరి నీళ్లు – అరకప్పు. తయారీ: ►తడి బియ్యప్పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ∙దీనిలో కొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల ΄పొడి వేసి కలపాలి. ► అవసరాన్ని బట్టి కొబ్బరి నీళ్లను కొద్దికొద్దిగా వేసి పిండిని ముద్దలా కలుపుకోవాలి. ► పిండి ముద్దను చిన్న భాగాలుగా చేసి, ఉండలుగా చుట్టుకోవాలి ∙పిండిమొత్తాన్ని ఉండలుగా చుట్టుకుంటే కేసి మిథాయ్ రెడీ. ► కొబ్బరి నీళ్లకు బదులు కొద్దిగా నెయ్యికూడా కలుపుకోవచ్చు ∙రిఫ్రిజిరేటర్లో రెండుమూడురోజుల వరకు ఇవి తాజాగా ఉంటాయి. -
ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదు.. దీని విశిష్టత ఇదే
ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూణెలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం కింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూణె చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోంది. -
రంగులు మార్చుకునే వినాయకుడు..మీరెప్పుడు చూసుండరు!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువుతీరాడు పార్వతీ తనయుడు. రాజ్య రక్షకుడు: రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు. ఒక రోజు రాత్రి అతను నిద్రపోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరిపోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసిపోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు. ఇదీ విశిష్టత: ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ప్రార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్‌లో ఉంది. రంగులు మార్చే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయమే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా... ప్రాశస్త్యం మాత్రం చాలా పెద్దది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. మార్చి నుంచి జూన్ వరకూ నల్లని రంగులో ఉండే ఈ వినాయకుడు జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడి వినాయకుడు తన రంగును మార్చుకు న్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇక చారిత్రక విషయాల కొస్తే... ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం’. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని అంటారు. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం’ రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ వెళ్లాడట. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం’ అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతనమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. దొడ్డ గణపతి ఆలయం, బెంగళూరు బెంగళూరులోని బసవన గుడి బుల్ ఆలయం పక్కనే ఉంది ఈ ఆలయం. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని పిలుస్తుంటారు.విశేషం ఏమిటంటే ... ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. స్వామి వారి అలంకరణ: వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. ఇది చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి. ఆలయ సందర్శన సమయం దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం ఏడు నుంచి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది. వినాయక చవితి నుంచి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. బెంగళూరు లో వాయు, రోడ్డు, విమాన సౌకర్యాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉంది. అలాగే రెండు రైల్వే స్టేషన్ లు – బెంగళూరు సిటీ, యశ్వంతపుర ఉన్నాయి ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు, విమానాలు వస్తుంటాయి. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బెంగళూరు కు బస్సు సౌకర్యం ఉంది. తెలుగు రాష్ట్రాలలో సిద్ధివినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. ఉమాసుతుడు ఇక్కడ సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల ఆలయాలూ ఉన్నాయి. స్థల పురాణం కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం చెబుతోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామం లో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకుని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. క్షేత్ర ప్రత్యేకత అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. దక్షిణాభిముఖంగా దర్శనం..సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. అలాగే దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం. వివిధ ఉత్సవాలు.. ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి... లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం. వివిధ ఆలయాలు... అయినవిల్లి క్షేత్రంలో గణపతి ఆలయంతో పాటు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాలయం, శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవస్వామి ఆలయం, కాలభైరవ ఆలయాలు ఉన్నాయి. ఇలా చేరుకోవాలి... రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. ఇతర సమాచారం.. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8గంటల వరకు తెరిచి ఉంటుంది. అభిషేకం ఉదయం 7 గం.ల నుంచి 11 గం. వరకు జరుగుతుంది. (సాధారణ రోజుల్లో) – డి.వి.రామ్ భాస్కర్ -
మహారాష్ట్రలోని అష్టగణపతి ఆలయాల గురించి మీకు తెలుసా?
గణపతి ఉపాసనకు మహారాష్ట్ర పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో గణపతి క్షేత్రాలు కోకొల్లలు. వాటన్నిటిలోకి అష్టగణపతి క్షేత్రాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఎనిమిది క్షేత్రాలు గణాధిపత్యులకు ముఖ్యమైనవి. ఈ ఎనిమిదీ ‘అష్టగణపతి క్షేత్రాలు‘గా ప్రసిద్ధికెక్కాయి. 1. మయూరేశ్వర గణపతి – పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న ’మోరగావ్’లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది. 2. చింతామణి గణపతి – పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న ’థేపూర్’ చింతామణి గణపతి క్షేత్రం. 3. గిరిజాత్మజ గణపతి – పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న ’లేహ్యాద్రి’ అనే స్థలంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం వెలిసింది. 4. శ్రీ విఘ్నేశ్వర గణపతి – లేహ్యాద్రి సమీపంలోనే ’ఓఝల్’ స్థలంలో ’శ్రీవిఘ్నేశ్వర’ క్షేత్రం వెలిసింది. 5. మహోత్కట గణపతి – పునానుండి 32 మైళ్ళ దూరంలో ’’రాజన్గావ్’’లో మహోత్కట గణపతి ఆలయం ఉంది. 6. భల్లాలేశ్వర గణపతి – మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో ’పాలీ’ అనేచోట భల్లాలేశ్వర గణపతి క్షేత్రం ఉంది. 7. వరదవినాయకుడు – కులాబా జిల్లాలో ’’మహర్’’ అనే స్థలంలో ’’వరదవినాయక’’ ఆలయం ఉంది. 8. సిద్ధివినాయకుడు – అహ్మద్ నగర్ జిల్లాలో ’’సిద్ధటేక్’’ అనే స్థలంలో సిద్ధివినాయక క్షేత్రం వెలిసింది...!! -
వినాయకుడి పేరు మీద వచ్చిన సినిమాలివే!
గణపతిని కొందరు భక్తిశ్రద్ధలతో పూజిస్తే మరికొందరు భయభక్తులతో పూజిస్తారు. ఈయన ఆశీర్వాదం లేకుండా పని మొదలుపెడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఆయన్ను పూజించేవాళ్లు చాలామంది. ఏ విఘ్నాలు లేకుండా పని జరగాలని ప్రేమగా పూజించేవారు కోకొల్లలు. సినిమా రంగంలోనూ గణనాయకుడికి పెద్ద పీటే వేస్తారు. వినాయక పూజతోనే సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. అంతేనా.. సినిమా ప్రారంభంలో కూడా మొదట గణపతిని చూపిస్తూ కొన్నిసార్లు ఆయన పాట కూడా వేస్తారు. అయితే ఈ ట్రెండ్ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. కానీ బొజ్జగణేశుడిని పూజించడం మాత్రం ఎవరూ విస్మరించడం లేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఆయనంటే అంతిష్టం. సినిమాల్లోనూ గణపతి చాలా పవర్ఫుల్. కొన్ని కీలక సందర్భాలు ఈయనచుట్టే తిరగ్గా మరికొన్ని ఏకంగా గణపతి గురించే వచ్చాయి. సినిమాల్లో ఆయన గురించి వచ్చిన పాటలు ఇప్పటికీ మండపాల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అసలు గణేశుడి పేరు మీద ఏయే సినిమా టైటిల్స్ ఉన్నాయో ఓసారి చూసేద్దాం.. ఉమా చండీ గౌరీ శంకరుల కథ, భూకైలాస్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలు గణేశ్ మహత్యాన్ని తెలిపేవి ఉన్నాయి. కానీ ఆయన పేరు మీద మాత్రం కొన్ని సినిమాలే ఉన్నాయి. అవే.. గణపతి, ఓం గణపతి, గణేశ్, వినాయక చవితి, విలేజ్‌లో వినాయకుడు, శ్రీ వినాయక విజయం. త్వరలో రాబోతున్న గం గం గణేశా కూడా ఈ లిస్టులో చేరింది. కానీ ఇందులో కొన్ని పేరుకు మాత్రమే ఏకదంతునివి కావడం గమనార్హం. చదవండి: ఎవర్రా మీరంతా? ఇలా తగులుకున్నారు.. ఆడేసుకుంటున్న నెటిజన్స్! -
ఈ వినాయకుడ్ని దర్శిస్తే..ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతుందట!
అన్ని విఘ్నాలనూ తొలగించే... తొలిపూజలందుకునే దేవుడిగా ప్రసిద్ధికెక్కిన గణపయ్యకు ఎన్నో రూపాలున్నాయి. వింతకాంతులతో వెలుగుతూ చిత్ర విచిత్ర రూపాలతో భాసించే ఆ దేవుణ్ణి అందరూ ఆరాధిస్తారు. గుడికట్టి పూజిస్తారు. ఆ గణనాథుణ్ణి మామూలుగా అందరికీ తెలిసిన ఆకారంలో గాకుండా విశిష్టంగా కనిపించే రూపాలతో దేశవిదేశాలలో అనేక ఆలయాలున్నాయి. వినాయక చవితి సందర్భంగా అరుదైన రూపంతో అగుపించే గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని గురించి తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అక్కడి గణపయ్య విగ్రహం నానాటికీ పెరిగిపోతోందని స్థానికులు చెబుతారు. ఇక్కడే కాదు, మన భారతదేశంలో కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో విగ్రహాలు పెరుగుతాయని భక్తులు విశ్వాసం. కాణిపాకంలో లాగే కర్నూలు జిల్లా యాగంటిలో కూడా నంది విగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని భక్తుల నమ్మకం. అలాగే కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని మధుర్ గ్రామంలోని శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఉత్త్తర కర్నాటకలో కాసర గోడ్ సమీపంలో మధుర్లో అనేక ఆలయాలున్నాయి ఇందులో మహాశివ ఆలయం, మహాగణపతి ఆలయం ముఖ్య మైనవి. ప్రకృతి ఒడిలోకి చేరినట్లు కనిపించే కేరళ... కర్నాటక బార్డర్లో కేరళ కొసన కసార్‌గాడ్ అనే పట్టణం ఉంది. ఈ పట్టణానికి అతి సమీపంలో మధుర్ మహాగణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయం ఆవిర్భావం, చరిత్ర అన్నీ విశేషమే! నిజానికి చెప్పాలంటే ఈ ఆలయంలోని మూలవిరాట్టు ఆ పరమేశ్వరుడు. ఈ శివుని విగ్రహం కూడా ఓ స్వయంభువు గా వెలసినదని చెబుతారు. మధుర్ స్థలపురాణం ప్రకారం మధుర అనే ఒక స్త్రీ పెరుగుతున్నగణపతిని కనుగొన్నది. ఆమె పేరు మీదగానే ఈ ఆలయం మధూరాలయంగా మరియు ’మధుర్ మహాగణపతి ఆలయం’గా ప్రసిద్ది చెందింది. విగ్రహాన్ని ఆమె తొలిసారి చూసింది కనుక ప్రస్తుతం తొలి దర్శనాన్ని ప్రత్యేకించి మహిళకే కల్పిస్తున్నారు. మరి అంతటి మహిమల గల ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ స్థల పురాణం ప్రకారం ఒక పురాణగాథ ఉంది. మధుర్ గణపతి ఆలయ పూజారి పిల్లవాడు ఒక సారి ఈ శివాలయానికి వచ్చాడు. ఆడుకుంటూ, ఆడుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళి, అక్కడి దక్షిణంవైపు ఉన్న గోడమీద వినాయకుని రూపాన్ని సరదాగా చెక్కాడు. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చాడో...తండ్రి చెంత తను కూడా ఉండాలనుకున్నాడో కానీ..ఆ బొమ్మ నుండి ఒక వినాయకుని రూపం ఆవిర్భవించడం మొదలైంది. అంతే కాదు..అలా మొదలైన ఆ రూపం నానాటికీ పెరుగుతోందని, అందుకే ఆ వినాయకుడిని బొడ్డ గణపతి అని పిలుస్తున్నారు. బొడ్డ గణపతి అంటే బొజ్జగణపయ్య అని అర్థం.మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనబడుతుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని గజప్రిస్త’గోపురాలని పిలుస్తారు. ఆలయంలోని చెక్క మీద మహాభారత, రామాయణ ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు. ఆలయ సమయాలు: ఈ ఆలయాన్ని ప్రతి రోజూ ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది. ఇక్కడికి ఆదివారం నాడు భక్త జన సందోహం ఎక్కువ గా రావటం విశేషం.ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. ఈ ఆలయం చరిత్రకు మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే టిప్పుసుల్తాను దాడి. ఒకసారి టిప్పు సుల్తాను తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ దిశగా వచ్చాడట. తిరుగుముఖంలో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడట. కానీ ఈ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోయిందట. అయితే తన సైనికుల తృప్తి కోసం నామకార్థంగా తన ఖడ్గంతో ఆలయం గోడ మీద ఒక వేటు వేసి వెళ్లిపోయాడట. ఇప్పటికీ ఆలయం గోడ మీద టిప్పు సుల్తాను తన ఖడ్గంతో మోదిన గుర్తుని చూడవచ్చు. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టం ఏదైనా కొత్త పనిని ఆరంభించేటప్పుడు, అనుకున్న పనికి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు..... ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పక ఫలితం దక్కుతుందన్నది భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టమట. అందుకనే ఈ స్వామిని దర్శించుకుని ఆయనకు అప్పాలను ప్రసాదంగా సమర్పిస్తే... ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతాయని అంటారు. సహస్రాప్పం పేరుతో స్వామివారికి వేయి అప్పాలను నివేదించే ఆచారమూ ఇక్కడ కనిపిస్తుంది.ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. ఈ ఆలయం కేరళలో ఉన్నా, కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. కర్ణాటకలోని మంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కన్నడిగులు కూడా వేలాదిగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. గోకర్ణం దగ్గర నుంచి సాగే ఆరు వినాయకుని క్షేత్రదర్శనంలో మధుర్ మహాగణపతి ఆలయం కూడా ఓ భాగమే! -
ఈ వినాయకుడ్ని పూజిస్తే వివాహ అడ్డంకులు తొలిగిపోతాయట!
విశిష్ట గణపతికి ... వైవిధ్య రూపాలతో పూజలు పురాణేతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పార్వతీ దేవికి సోదరుని వరస. వినాయకుడు పార్వతీ తనయుడు. శ్రీ కృష్ణుడు మహావిష్ణువు అవతారం. ఈ వరస మేరకు కృష్ణుడు వినాయకుని మేనమామ.అలాటి మేనమామ తన మేనల్లుడి ఒడిలో కూర్చున్న అపూర్వ దర్శనం మీకెప్పుడైనా జరిగిందా ? అలాటి పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలియాలంటే మనం కేరళలోని మళ్ళియూర్ వూరికి వెళ్ళాలి. అక్కడి ఆలయంలో వినాయకుని ఒడిలో బాలకృష్ణుడు ఆసీనుడై భాగవతం వింటున్న అపూర్వ దృశ్యాన్ని మనం చూడగలం.ఇటువంటి దృశ్యం మరెక్కడా దర్శించలేము.వేలసంవత్సరాల ప్రాచీనమైన ఈ ఆలయంలో బీజ గణపతి రూపంలో వినాయకుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం ప్రసిద్ధి చెందడానికి భాగవత అంశగా ప్రసిద్ధి చెందిన శంకరన్ నంబూద్రియే ముఖ్య కారణంగా చెపుతారు. శంకరన్ నంబూద్రి గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామాన్ని పెట్టుకుని పూజిస్తూండేవారు. నిత్యం భాగవత పారాయణం చేసేవారు. ఒకనాడు ఆయనకు తన పూజలో వినాయకుని విగ్రహంలో బాలకృష్ణుని రూపం స్పష్టంగా గోచరించింది. ఆయన తాను చూసిన దృశ్యాన్ని యదాతధంగా చెక్కిన రూపమే ఈనాడు ఆ ఆలయంలో దర్శనమిచ్చే విగ్రహం. తొండం చివర నిమ్మపండు, హస్తాలలో కొడవలి, అంకుశం, తనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు చేత ధరించి తనకు మామ అయిన బాలకృష్ణుని తన ఒడిలో వుంచుకొని దర్శనానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు. గర్భగుడిలో ఇతర దైవ విగ్రహాలు ఏవీ వుండవు. భక్తుల కోరికలను తక్షణమే నెరవేర్చే వరప్రసాది మళ్ళియూరు మహాగణపతి. ఇక్కడ ఇష్టసిద్ధికై చేసే పూజలను ముక్కుట్రి పుష్పాంజలి అంటారు. సకల ఐశ్వర్యాలు కలగడానికి ఉదయాస్తమ పూజ జరుగుతున్నది. కష్టాలు తీరడానికి సహస్ర కలశాభిషేకం జరిపించుకుంటారు.వివాహ అడ్డంకులు లేకుండా వుండడానికీ పళ్ళమాలలు సమర్పిస్తారు. 27 కదళీ ఫలాలతో కట్టే యీ మాలను నక్షత్ర మాల అంటారు. అనారోగ్యాల నివారణకై దడి నివేదన చేస్తారు. బియ్యప్పిండి, చక్కెర, కొబ్బరి కలిపి మోదకంగా తయారు చేసి ఆవిరిలో ఉడికించి నివేదిస్తారు. దీనికే దడి నైవేద్యమని పేరు. ఈ ఆలయంలో పితృదోష పరిహారాలు జరుపుతారు. చవితినాడు చతుర్ధియూటు అనే పితృదోష పరిహార పూజలు జరుపుతారు. సంతాన భాగ్యం కోసం పాలు పాయసం నివేదించి పూజిస్తారు. తులాభార మొక్కు లు కూడా తీర్చుకుంటారు. ఈ ఆలయంలో తొమ్మిది రోజుల ఉత్సవం ఫాల్గుణ మాసంలో ఆరంభమై చైత్రమాసంలో వచ్చే విషూ పండుగతో సంపూర్ణమౌతాయి. వినాయకచవితి పండగను ఘనంగా జరుపుతారు.కేరళలోని కొట్టాయం .. ఎర్నాకుళం మార్గంలో కురుప్పన్దర అనే చోట దిగితే 2 కి.మీ దూరంలోను, కురుప్పన్దర రైల్వేస్టేషన్ నుండి 1/2 కి.మీ దూరంలో మళ్లియూరు మహాగణపతి ఆలయం వున్నది. -
ముక్కోటి దేవుళ్ళలో వినాయకుడికే మొదటి పూజ ఎందుకు? గణాధిపత్యం ఎలా దక్కింది?
కుమారస్వామి అప్పటికే దేవసేనాధిపతిగా ఉన్నాడు. అందువల్ల వినాయకుడికి ప్రమథ గణాధిపత్యం ఇవ్వాలనుకున్నాడు శివుడు.‘నువ్వు నా ప్రమథగణాలకు నాయకుడిగా ఉండు’ అని వినాయకుడితో అన్నాడు శివుడు.‘తండ్రీ! నాయకుడిగా ఉండమంటే సరా? అర్హత నిరూపించుకోనిదే నాయకత్వం స్వీకరించడం ఏమంత సమంజసం? తమ్ముడు ఇప్పటికే దేవసేనాధిపతిగా సేనానాయకత్వంలో ఆరితేరి ఉన్నాడు. అతడికే గణాధిపత్యం కట్టబెడితే బాగుంటుంది’ అన్నాడు వినాయకుడు.‘ఇప్పటికే నీ తమ్ముడు దేవసేనాధిపతిగా ఉన్నాడు గనుకనే నిన్ను ప్రమథగణాలకు నాయకత్వం వహించమంటున్నాను. ఒక్కడే రెండు బాధ్యతలు నిర్వహించడం అతడికి భారంగా మారవచ్చు’ అన్నాడు శివుడు.‘తండ్రీ! అయితే, ఏదైనా పరీక్షపెట్టి, నెగ్గినవారికి నాయకత్వం అప్పగించడం న్యాయంగా ఉంటుంది’ అన్నాడు వినాయకుడు. దేవతలు, ప్రమథులు కలసి వినాయకుడికి, కుమారస్వామికి ఒక పందెం పెట్టారు. ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను సేవించి ముందుగా ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే గణాధిపత్యం అప్పగించాలని తీర్మానించారు.కుమారస్వామి తన మయూరవాహనంపై రివ్వుమని ఎగురుతూ బయలుదేరాడు.వినాయకుడు ఎక్కడికీ కదలకుండా, ఉన్నచోటనే చతికిలబడి కూర్చుండిపోయాడు.అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతంలోకి తీసుకుపోయి, ‘నాయనా! మేమంతా నిన్ను అభిమానిస్తున్న వాళ్లం. నీ ఓటమి మా ఓటమి అవుతుంది. నువ్వెక్కడికీ తిరగనక్కర్లేదు. నేను చెప్పినట్లు చేస్తే చాలు’ అని చెప్పాడు.విష్ణువు సలహాతో వినాయకుడు ఉన్నచోటనే మఠం వేసుకు కూర్చుని, శివపంచాక్షరి మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.కుమారస్వామి వెళ్లిన ప్రతి తీర్థంలోనూ, క్షేత్రంలోనూ వినాయకుడు అతడికి తిరుగుముఖం పడుతూ ఎదురవుతూ వచ్చాడు. ఆశ్చర్యపోతూనే ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను కుమారస్వామి సేవించుకున్నాడు. కైలాసానికి తిరిగివస్తూనే, ‘తండ్రీ! ఈ పందెంలో నేను ఓడిపోయాను. అన్నదే గెలుపు. నీవనుకున్నట్లు అతడికే గణాధిపత్యాన్ని అప్పగించు’ అన్నాడు. కుమారస్వామి కైలాసంలో కొలువుదీరిన దేవతలు, మునులు, ప్రమథగణాల మధ్యకు వచ్చి, ‘పందెంలో మా అన్న వినాయకుడే గెలిచాడు. అతడికి సత్వరమే గణాధిపత్య పట్టాభిషేకం జరగాలి. శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యం’ అని చెప్పాడు. కుమారస్వామి ప్రకటనతో దేవతలందరూ హర్షం వెలిబుచ్చారు. అయితే, ప్రమథగణ ప్రముఖులలో శృంగీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం దీనిని వ్యతిరేకించారు.అదివరకు వినాయకుడు పుత్రగణపతి రూపంలో వారికి గర్వభంగం చేశాడు. ఆ అక్కసుతోనే వారు వినాయకుడికి గణాధిపత్యం కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, ‘మొదటి నుంచి మేము శివుడికి నమ్మినబంట్లుగా ఉంటున్నాం. అలాంటిది వినాయకుడు మాకు ఎలా అధిపతి అవుతాడు? అతడికి తనదంటూ ఎలాంటి బలగమూ లేదు. అతడికి గణాధిపత్య అభిషేకమేమిటి?’ అంటూ నానా మాటలూ అన్నారు.ప్రమథుల కలకలం విన్న శివుడు అక్కడకు చేరుకున్నాడు. వారి మాటలు విని కళ్లెర్రజేశాడు. ‘నా నిర్ణయానికే ఎదురాడేటంత గొప్పవారైపోయారా మీరు?’ అంటూ ఆగ్రహోదగ్రుడయ్యాడు.ఇంత జరుగుతున్నా వినాయకుడు శాంతంగా, ‘నిజమే! నాకు గణాలెక్కడివి? లేవు కాబోలు. అన్నట్లు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొన్ని గణాలు ఉన్నట్లు గుర్తు. ఆ గణాలు ఎక్కడ?’ అన్నాడు. వినాయకుడి నోట ఆ మాట వెలువడగానే, ముమ్మూర్తులా వినాయకుడిని పోలి ఉన్న గజముఖులు కోటాను కోట్లుగా పుట్టుకొచ్చారు. దిక్కులు పిక్కటిల్లేలా వినాయకుడికి జయజయ ధ్వానాలు పలుకుతూ అతడికి బాసటగా వచ్చి నిలుచున్నారు. వారందరూ చతుర్భుజులే! కొందరి చేతుల్లో ఘంటాలు, లేఖినులు, కుంచెలు ఉన్నాయి. ఇంకొందరి చేతుల్లో త్రిశూల కరవాల గదా ధనుర్బాణాది ఆయుధాలు ఉన్నాయి. మరికొందరి చేతుల్లో వీణా వేణు మృదంగ ఢక్కాది వాద్యపరికరాలు ఉన్నాయి. వారిలో కొందరు అరుణపతాకాలను పట్టుకున్నారు. ఇంకొందరు వినాయకుడికి ఛత్ర చామరాలు పట్టారు. వారు రత్నఖచితమైన భద్రసింహాసనాన్ని తీసుకువచ్చి, వినాయకుణ్ణి దానిపై కూర్చుండబెట్టారు. ఈ సంరంభానికి వినాయకుడి వాహనమైన మూషికం సింహాసనం కింద ఆనందంతో చిందులు వేయడం మొదలుపెట్టింది. దేవతలు, మునులు వేదస్తోత్రాలు పఠిస్తుండగా ప్రమథ గణాధిపతిగా వినాయకుడికి ఘనంగా అభిషేకం జరిగింది. ∙సాంఖ్యాయన -
వినాయకుడి వివాహం ఎలా జరిగిందో తెలుసా?మనకు తెలియని కథ..
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం. -
Ganesh Chaturthi 2023: మనం కొలిచే తొలి దైవం ఆయనే..ఆనాటి నుంచే ఆచారం
సమస్త విఘ్నాలను పోగొట్టి,సర్వ విజయాలను,సత్వర ఫలాలను అందించే విఘ్ననాయకుడు వినాయకుడి పండుగను సభక్తి పూర్వకంగా జరుపుకోవడం అఖండ భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం.మనం పూజించే తొలి దైవతం ఆయనే. ఎంతటి నాయకుడైనా వినాయకుడి ముందు సాగిలపడాల్సిందే.తమ ఇచ్ఛలు తీరాలంటే ఈ దేవుడిని కొలవాల్సిందే.భిన్న మతాలు,జాతులు కులాలు,సంస్కృతుల సంగమమైన భారతదేశాన్నిఏకం చేసింది,ఈ నేలపై జీవించేవారినందరినీ ఐక్యంగా నిలిపిందీ సనాతన ధర్మం.సహనం,సమ భావనందానికి ఆధారం."సర్వేజనా సుఖినో భవంతు"అన్న ఆర్యవాక్కులు దానికి మూలాధారం.సర్వజనులు బాగుండాలనే మంచితనం మనవారి రక్షణ కవచం.ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చి,మనల్ని దురాక్రమించారు. వందల ఏళ్ళు ఈ రాజ్యం పరాయి పాలనలో సాగింది.ఎన్నో భాషా సంస్కృతులు వచ్చి చేరాయి.చాలా సంపదను కోల్పోయాం,విష కౌగిళ్ళ మధ్య నలిగిపోయాం.తుచ్ఛ సంస్కృతి వీధుల్లో ఏరులై పారింది.వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం.మన ఉనికిని కాపాడుకున్నాం.మనదైన సంప్రదాయం మృగ్యమవకుండా చూసుకున్నాం.ప్రపంచ దేశాలలో భారత్ ను విశిష్టంగా గౌరవింప చేసింది,వివేకానంద వంటి మహనీయులు ప్రసంగిస్తుంటే ఆంగ్లేయులు సైతం మ్రాన్పడి వినేలా చేసింది మనదైన సంస్కారం.ఈ విశిష్ట విధానమే మన జీవనశైలి,మన పెంపకం.కలిసిమెలిసి వుండే కుటుంబ బంధాలు,గొప్ప వివాహ వ్యవస్థ మన దేశాన్ని సర్వోన్నతంగా నిలిపాయి.అదే మన సనాతన ఆచారంలోని ఔన్నత్యం. ఆచారం అంటే ఆచరించేది.హంగూ అర్భాటాలతో ప్రదర్శించేది కాదు.ఆత్మశుద్ధితో సాగే ఆరోగ్య స్రవంతి.పండుగలు మన జీవితంలో భాగం.హృదయంగమంగా జరుపుకోవడం ఒక యోగం.ఇంతటి ఉదాత్త విధానాల రూపమైన పండుగలు,ఆచారాలు రాజకీయాలకు వేదికలుగా మారడం మారుతున్న సమాజానికి, అడుగంటుతున్న విలువలకు అద్దం పట్టే విషాదం.అనంత కాలప్రవాహంలో,లక్షలాదిసంవత్సరాల మానవ జీవన పయనంలో కరోనా కాలం ఎంతో బాధించింది.ఇప్పుడు నిఫా వైరస్ అంటున్నారు.గతంలోనూ ఇటువంటివి ఎన్నో వచ్చి వెళ్లిపోయాయి.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.మంచిరోజులు వస్తాయి.భక్తి ప్రదర్శన కాదు.ఆత్మగతమైన అనుభూతి,బుద్ధిని ప్రక్షాళనం చేసే సద్గతి,అని మన పూర్వులు చెప్పారు.అఫ్ఘాన్ వంటి దేశాలను చూస్తేవారి రాక్షస ప్రవృత్తే వారిని ఏకాకులను చేసింది. డబ్బు పరంగా అగ్రరాజ్యమనే పేరున్నా,అమెరికాపై ప్రపంచ దేశాలకు విశ్వాసం లేదు.తుపానులా పైకి లేచిన చైనాను ఎవ్వరూ నమ్మరు.మూలక్షేత్రానికే దెబ్బకొడదామని చూసే పాకిస్తాన్ పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు.క్షణక్షణానికి బంధాలు మార్చుకుంటున్న రష్యా తీరూ అంతే.ఒకప్పుడు అనంతమైన సంపదకు,సర్వ విద్యలకు నెలవుగా ఉన్న భారతదేశం,నేటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నప్పటికీ,ప్రపంచం మనల్ని విశ్వసిస్తోంది,గౌరవిస్తోంది.ప్రపంచ తత్త్వశాస్త్రాలను -భారత తత్త్వ సిద్ధాంతాలను తులనాత్మకంగా విశ్లేషించి,భారతీయమైన ఔన్నత్యాన్ని ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో వివరిస్తూ, ప్రసంగం సాగిస్తే! మేధోసమాజమంతా ఆయనకు,ఆయనలోని భారతీయతకు మోకరిల్లింది. భారతీయ తత్త్వం తెలిసినవారే పాలకులుగా ఉండాలన్నది సర్వేపల్లివారి సంకల్పం.కులాలు,మతాలు, ప్రాంతాలు దాటి రాజకీయాలు సాగే పరిస్థితులు నేడు లేనే లేవు.వినాయకచవితి పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్లే నిర్దేశిస్తున్నారు.ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చదు.ప్రజలను తదనుగుణంగా తమవైపు తిప్పుకొని రాజకీయమైన లబ్ధి పొందాలనే దృష్టి తప్ప,సంప్రదాయంపై,ఆచార వ్యవహారాలపై ప్రేమ కాదని తెలుస్తూనే ఉంటుంది.వివాదాలకు కావాల్సినంత ప్రచారం జరుగుతూనే ఉంటుంది.పండుగలను వివాదాలకు,ఆచారాలను రాజకీయాలకు వేదికగా మారని సమాజాన్ని చూడాలన్నది విజ్ఞుల హృదయం.సర్వజనులకు జయావహం,ప్రియంవదమైన వాతావరణం రావడమే పర్వదినం. సర్వ విఘ్నాలను తొలగించి,సకల జనులకు సకల జయాలను కలిగించి,ముప్పులకు ముగింపు పలికి,ప్రగతి ప్రయాణానికి ముహూర్తం పెట్టాలని విఘ్ననాయకుడికి విజ్ఞప్తి చేసుకుందాం.సనాతన ధర్మం, భారతీయత అందించిన సదాచారాల మధ్య,సమభావనతో,సోదర తుల్యంగా సహజీవనం చేద్దాం.పర్వదినం అంటే? సర్వులకు మంచిరోజు.పర్యావరణ హితంగా పండుగ జరుపుకుందాం. సరికొత్త సంకల్పాలకు శ్రీకారం చుడదాం.సిద్ధి దిశగా కృషి సాగిద్దాం. --మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
భక్త కోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య తొలి పూజకు వేళాయింది..
విశాఖపట్నం: భక్త కోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య తొలి పూజకు వేళాయింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబయ్యాయి. మహా నగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో పూర్ణామార్కెట్, అక్కయ్యపాలెం, మధురవాడ, గాజువాక, కంచరపాలెం తదితర ప్రాంతాల్లోని మార్కెట్లు కళకళలాడాయి. ప్రధాన రహదారులకు ఇరువైపులా అమ్మకాలతో సందడి నెలకొంది. పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ సంస్థలు ఇప్పటికే వందలాది మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి. మధురవాడ, కంచరపాలెం, అక్కయ్యపాలెం, గాజువాక, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాల అమ్మకాలు ఆఖరి రోజైన ఆదివారం జోరుగా సాగాయి. విగ్రహాల తరలింపు, పూలు, పండ్లు, పూజా వస్తువుల కొనుగోళ్ల కోసం జనం పెద్ద ఎత్తున రహదారులపైకి చేరడంతో నగరంలోని పలు చోట్ల ఉదయం నుంచే ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వైవిధ్యమూర్తులు.. ఈ సారి కూడా వైవిధ్యభరితమైన విగ్రహమూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బీహెచ్ఈఎల్ దరి గ్లోబెక్స్ థియేటర్స్ వద్ద 112 అడుగుల విగ్రహం, పాతగాజువాక దరి లంకా మైదానంలో 117 అడుగుల విగ్రహం, దొండపర్తిలోని రామాలయం వద్ద 108 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాలు ముస్తాబయ్యాయి. వీటితో పాటు అర్ధనారీశ్వరుడి సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, బహు ముఖ వినాయకుడు, భక్తుల మదిని దోచే వివిధ రకాల భంగిమలు, ఆకృతులతో, చక్కటి రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దిన విగ్రహాలు ఇప్పటికే మండపాలకు చేరుకున్నాయి. సందడిగా మార్కెట్లు.. ధరలకు రెక్కలు వినాయక చవితి సందర్భంగా పూజ కోసం వినియోగించే 21 రకాల పత్రి, బంతి పూలు, మామిడి ఆకులు, మారేడు కాయల అమ్మకాలతో మార్కెట్లలో సందడి నెలకొంది. పండగ సందర్భంగా పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లో బంతిపూలు కిలో రూ.90 వరకు ఉంటే పూల దుకాణాల వద్ద కిలో రూ.150 వరకు విక్రయించారు. పూర్ణా మార్కెట్లో 50 గ్రాముల పువ్వులు రూ.100 పైగా అమ్మకాలు జరిపారు. చామంతి పూలు, గులాబీ, తదితర పువ్వుల ధరలు సైతం భారీగా పెరిగాయి. -
వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే!
వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. అంటే.. మనం ఏ పని చేయ తలపెట్టినా.. ముందు వినాయకున్ని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట. అందుకనే ఎప్పుడూ తొలి పూజ వినాయకుడికే చేస్తారు. చదువు దగ్గర నుంచి కళల వరకు ఏది మొదలుపెట్టాలన్న ఆయన అనుగ్రహం ఉంటేనే సాధ్యం. ఇవాళే గణనాథుని జన్మదినోత్సవం ఈ సందర్భంగా ..ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో చూద్దామా! విధి నిర్వహణే ముందు.. పార్వతి గణేషుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ను కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది కదా. అప్పుడు శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్లబోతే గణేషుడు అడ్డుకుంటాడు. శివుడు తాను ఫలానా అని చెప్పినా గణేషుడు వినడు. తన కర్తవ్యం ఇంట్లోకి ఎవరినీ రాకుండా చూసుకోవాలి. అదే విషయం పార్వతి కూడా వినాయకుడికి చెబుతుంది. కనుకనే సాక్షాత్తూ శివుడే వచ్చినా సరే… గణేషుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణను పూర్తి చేసి తీరుతాడు. ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్యసాధనలో, కెరీర్లో మనం దూసుకెళ్లవచ్చు. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఎలా పని తప్పించుకుని తిరగాలనే చూసే ఉద్యోగులు ప్రమోషన్లు, బోనస్‌లు మాత్రం కావాలని గోల చేస్తుంటారు. ముందు మీ డ్యూటీ సంక్రమంగా చేస్తే మనం కచ్చితంగా ఉన్నత పదవులను పొందగలుగుతాం. తల్లిదండ్రుల కన్నా ఎవరూ ఎక్కువ కాదు.. గణేషుడు, కుమారస్వామిలలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు వారికి ఒక పరీక్ష పెడతారు. వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టి వస్తారో వారే గణాధిపతి అంటారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయల్దేరతాడు. కానీ గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్లుగా భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు. నిజంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేషుడి జీవితంలో జరిగిన ఈ సంఘటన చెబుతుంది. పూజలు అనగానే ఆర్భాటాలు పలికే మనం తల్లిదండ్రుల వద్దకు వచ్చేటప్పటికి ఎంతమంది వినాయకుడిలా అనుసరిస్తున్నారో ఆలిచిస్తే మంచిది. దేవుడు కూడా తల్లిదండ్రులను సేవ తర్వాతే దేవుడు పూజ అని నర్మగర్భంగా చెబుతున్నాడని అర్థం చేసుకోవాలి. తప్పుచేసిన వారిని క్షమించడం.. వినాయకుడు ఒకసారి సుష్టుగా భోజనం చేసి ఆపసోపాలు పడుతూ వెళ్తుంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుడు కోపోద్రిక్తుడై చంద్రున్ని ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండాపొమ్మని చెప్పి శాపం పెడతాడు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్న గణేషుడు చంద్రుడికి ఆ శాపం నుంచి విముక్తి కలిగిస్తూ కేవలం ఒక్క రోజు మాత్రమే కనిపించకుండా పొమ్మని శాపాన్ని మారుస్తాడు. అలా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించాలన్న విషయాన్ని వినాయకుడి జీవితం చెబుతుంది. చేపట్టి పనిని వెంటనే పూర్తిచేయడం.. వేద వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తాళపత్ర గ్రంథాలపై రాశాడన్న సంగతి తెలిసిందే. అయితే తాను ఆ పురాణం మొత్తాన్ని చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆగకూడదని వ్యాసుడు చెబుతాడు. దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగా రాస్తూనే ఉంటాడు. ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే ఘంటం (పెన్ను లాంటిది) విరుగుతుంది. అయినా గణేషుడు తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేస్తాడు. కానీ మధ్యలో ఆగడు. దీన్ని బట్టి మనకు తెలుస్తుందేమిటంటే.. ఏ పనిచేపట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. మధ్యలో ఆగకూడదన్నమాట..! చేపట్టిన పనిని చాలా త్వరగా పూర్తి చేయాలని తెలుపుతోంది ఆత్మ గౌరవం కోల్పోకూడదు.. ఒకసారి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి దేవతలందరూ వెళ్తారు. స్వర్గలోకానికి గణేషున్ని కాపలా ఉంచి అందరూ వెళ్తారు. అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్లిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది. దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్లే దారిలో అన్నీ గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలమయం చేస్తుంది. దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడుతుంది. వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు. అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు. అతను వచ్చి గణేషున్ని ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు. దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు. వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలదించుకుంటారు. వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది. దీంతో వినాయకుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరతారు. అయితే దేవతలు అందరూ తన ఆకారం పట్ల అయిష్టతను ప్రదర్శించినా వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మ గౌరవంతో అలా వ్యవహరించడం.. మనకూ ఆదర్శనీయమే. ఆయనలోని ఆ గుణాన్ని కూడా మనమూ అనుసరించాల్సిందే. ఎవరేమన్నా.. ఏ పరిస్థితిలోనైనా ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆ సత్యాన్ని తెలియజేస్తుంది..! ---ఆర్ లక్ష్మీ లావణ్య (చదవండి: వినాయకుని పూజకు ముఖ్యంగా అవి ఉండాల్సిందే!) -
మట్టిగణపతిని పూజిద్దాం...పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ఒంగోలు:మట్టి గణపతిని పూజిద్దాం...పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన ‘చిన్నారుల చేతుల్లో మట్టిగణపతి’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శనివారం నగర పరిధిలోని సాయిబాబా సెంట్రల్ స్కూల్, క్విస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని మట్టి వినాయక ప్రతిమలు తయారు చేశారు. సాయిబాబా సెంట్రల్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి రాఘవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడమే కాకుండా కళాజాతాలతో సామాజిక చైతన్యం తీసుకొస్తున్నామన్నారు. కాలుష్య నివారణ సామాజిక బాధ్యతగా భావించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొచ్చిన ‘సాక్షి’ మీడియాకు, అదే విధంగా విద్యార్థులకు సాంకేతికతతో కూడిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పించిన సాయిబాబా సెంట్రల్ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. మట్టి గణపతిని పూజించాలనే ఆలోచన చిన్నతనం నుంచే ప్రారంభమైతే అది భవిష్యత్‌లో అద్భుతమైన పర్యావరణ హితానికి తోడ్పడుతుందన్నారు. ఈ ఆలోచనతోనే రేపటి పౌరులలో ఒక మంచి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సాయిబాబా సెంట్రల్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ జీవి భాస్కర్, ప్రిన్సిపాల్ ఎం.మహేష్ మాట్లాడుతూ ఒక మంచి అవగాహన కార్యక్రమానికి తమ స్కూలు వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. చిన్నతనంలో జరిగే కార్యక్రమాలు చిన్నారుల మనస్సులపై బలంగా ముద్రితమవుతాయని తద్వారా మార్పు తప్పక సాధ్యపడుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మట్టి గణపతి తయారీపై విద్యార్థులకు అవగాహన కల్పించగా చిన్నారులు వినాయక ప్రతిమలను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రతిమలను అద్భుతంగా తీర్చిదిద్దిన మొదటి ఐదుగురికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ బ్రాంచి మేనేజర్ శివన్నారాయణ, సర్క్యులేషన్ మేనేజర్ పవన్‌కుమార్, ఎడిషన్ ఇన్చార్జి రవిచంద్ర, యాడ్స్ ఇన్చార్జి శేషిరెడ్డి, ఫొటో గ్రాఫర్ యం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో.. క్విస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో జరిగిన కార్యక్రమాన్ని క్విస్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ గాయత్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం నేడు సమాజానికి పెను సవాల్‌గా మారిందన్నారు. ఒక వైపు పెరుగుతున్న పారిశ్రామికీకరణ ఉపాధి అవకాశాలను పెంచుతుంటే రెండో వైపు అదే రంగం కాలుష్యాన్ని పెంచుతోందన్నారు. ఈ నేపథ్యంలో రెండింటి మధ్య సమతుల్యత ముఖ్యమని, అందుకు మనమంతా మొక్కలు పెంచడం ద్వారా వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచవచ్చన్నారు. వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి వినియోగం తగ్గాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విగ్రహ తయారీపై విద్యార్థులకు అవగాహన కలిగించగా వారు బంక మన్నుతో విగ్రహాలను తయారు చేసి ఔరా అనిపించారు. ఈ సందర్భంగా మట్టి ప్రతిమలను అద్భుతంగా తయారు చేసిన ఐదుగురు విద్యార్థులకు బహుమతులు, మరో ఐదుగురికి మెమొంటోలు అందించారు. కార్యక్రమంలో క్విస్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ వై.హనుమంతరావు, క్విస్ ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దక్షిణామూర్తి, క్విస్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ కె.నాగరాజు, ‘సాక్షి’ బీఎం శివన్నారాయణ, సర్క్యులేషన్ మేనేజర్ పవన్‌కుమార్, యాడ్స్ అసిస్టెంట్ మేనేజర్ శర్మ, క్విస్ కాలేజీ ఏవో సుదర్శన్ తదితరులు పర్యవేక్షించారు. చివరగా విజేతలకు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆర్.సుశీల బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణంపై నేడు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, మెరుగైన పర్యావరణ పరిస్థితులు ఉన్న చోట ఆరోగ్యకర వాతావరణం ఉంటుందన్నారు. జలచరాల ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో చేసిన విగ్రహాలను సముద్రాలలో నిమజ్జనం చేసినప్పుడు జల కాలుష్యం పెరుగుతుంది. దీనివల్ల సముద్రంలో ఉండే జీవులు చనిపోవడం, వాటి ఉత్పత్తిపై ప్రభావం కనిపిస్తుంది. తద్వారా జలచరాల ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది. జల కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి వినియోగాన్ని స్వచ్ఛందంగా మానుకునేందుకు ప్రజలు ముందుకు రావాల్సిన అవసరాన్ని తెలుసుకున్నా. – యు.శివశంకర్, ద్వితీయ బహుమతి విజేత -
గణపయ్యలకు మస్తు డిమాండ్.. జోరుగా అమ్మాకాలు
వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సమయం రెండు రోజులే ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో యువత సందడి చేస్తోంది. కరోనా కారణంగా గత రెండు, మూడు సంవత్సరాలుగా అంతంత మాత్రంగానే విగ్రహాలు నెలకొల్పారు. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితులు సిద్ధమయ్యాయి. దీనికి తోడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం ఉత్సవ నిర్వాహకులకు కలిసొచ్చింది. ఆశావహులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున విగ్రహాలు ఇప్పిస్తున్నారు. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో వినాయక విగ్రహాల అమ్మకాలు ఉన్నట్లు తయారీదారులు చెబుతున్నారు. అయితే మట్టి వినాయకులపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇళ్లలో ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.పండుగ మరో రెండు రోజులు ఉన్నందున ఇంకా పెరిగే అవకాశం ఉంది. ధరలు గత ఏడాది మాదిరిగానే నిర్ణయించామని విగ్రహ తయారీదారులు తెలిపారు. -
బాలాపూర్ గణనాథుడు.. ఈసారి స్పెషల్ ఇదే
బాలాపూర్ గణనాథుని వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏటా గణేశుడి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్వామి వారి చేతిలోని లడ్డూకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది. ఈసారి ఐదు తలల నాగరాజు పడగల కింద స్వామివారిని సుందరంగా రూపొందించారు. విజయవాడ కనకదుర్గ ఆలయ నమూనాలో మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. కోల్‌కతాకు చెందిన కళాకారులు 11 రోజులుగా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. 18 ఫీట్ల ఎత్తుతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు. -
రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో వినాయక చవితి. దీన్నె గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) అని కూడా అంటారు. దేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకొంటారు. పండుగలో భాగంగా వినాయకుడి ప్రతిమను కొలువుదీర్చి ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన పిండి వంటలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. మహారాష్ట్రలో అయితే ప్రధానంగా లడ్డూ, మోదక్, చక్లిలు, పురాన్ పోలీ వంటి వాటితో సహా ఇంకా మరెన్నో సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలు విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!) చాలా మంది ఇంటిపట్టున ఉండి పండుగ జరుపుకొని సంప్రదాయక పిండి వంటకాలను ఇంట్లోనే ఆస్వాదిస్తారు. కానీ కొంతమంది వివిధ కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పండుగ సమయంలో ఈ ప్రత్యేక వంటకాలను వారు ఆస్వాదించలేరు. అటువంటి వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ఆమోదిత ఫుడ్ అగ్రిగేటర్ ‘జూప్’ (Zoop) వినాయక చవితి ప్రత్యేక సంప్రదాయ వంటకాలను అందిస్తుంది. 160కి పైగా రైల్వే స్టేషన్లలో.. దీంతో పండుగ వేళ రైల్లో ప్రయాణిస్తున్నప్పటికీ నోరూరించే పండుగ పిండి వంటలను ఆస్వాదించవచ్చు. ఈ వంటకాలు కావాల్సిన ప్రయాణికులు జూప్ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా గూగుల్ చాట్‌బాట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మహారాష్ట్రలోని 160కి పైగా రైల్వే స్టేషన్లలో వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తారు. -
వినాయక చవితి స్పెషల్: సేమిలా లడ్డు.. ఇలా చేసుకోండి
ఈసారి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు, ఇతర నైవేద్యాలతో పాటు... వైవిధ్యభరితమైన మరెన్నో స్వీట్లను తినిపించి ప్రసన్నం చేసుకుందాం.... సేమియా లడ్డు తయారీకి కావల్సినవి: కావలసినవి: వేయించిన సేమియా – కప్పు; కోవా – అరకప్పు; పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు; రోజ్‌వాటర్ – టీస్పూను; బాదం పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►బాణలిలో పంచదార వేసి సన్నని మంటమీద కరగనివ్వాలి. ► పంచదార కరుగుతున్నప్పుడే కోవా వేసి తిప్పాలి ∙పంచదార కరిగి మిశ్రమం దగ్గర పడినప్పుడు సేమియా, బాదం పలుకులు వేసి కలపాలి. ► అన్ని చక్కగా కలిసిన తరువాత రోజ్‌వాటర్ వేసి మరోసారి కలిపి స్టవ్ మీద నుంచి దించేయాలి ∙ఇప్పుడు మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుంటే వర్మిసెల్లి లడ్డు రెడీ. -
శ్రీ దశ మహా విద్యాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రతియేటా వివిధరూపాల్లో కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం శ్రీ దశ మహావిద్యాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ ప్రతిష్ఠాపన 69వ సంవత్సరం సందర్భంగా మహాగణపతి 63 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పులో ఉండే మహాగణపతి పక్కనే కుడివైపు వరాహాదేవి, ఎడమవైపు సరస్వతిమాత విగ్రహాలు పది అడుగుల ఎత్తు ఉండగా, మహాగణపతి 63 అడుగుల ఎత్తులో నాగశేషుపై నిలబడి ఉండే ఆకారంలో తలపై ఏడు పడగలు, 10 చేతులు ఉంటాయి. మహాగణపతి పక్కన కుడివైపు 18 అడుగుల ఎత్తులో లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలు ఉంటాయి. శ్రీ దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేయడం ప్రత్యేకతగా ఉందని దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ తెలిపారు. అమ్మవారి ఉపాసనలో దశ మహావిద్యలు అధిక ప్రాధాన్యత కలిగినవనీ, విద్యకు గణపతి అనుగ్రహం కావాల్సి ఉన్నందున దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేసినట్లు తెలిపారు. -
నేటి విశేషం.. సంకష్టహర చతుర్థీ
గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి... మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం!!... పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు, సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు... సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:- సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి... సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. సంకట హర చతుర్ధి వ్రత కథ ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి ( వినాయకుని గొప్ప భక్తుడు ) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు... సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది' అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు, ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది, దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. -
ఇర్వింగ్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
అమెరికా వినాయక చవితి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. డల్లాస్ ఇర్వింగ్ సిటీ రివర్ సైడ్ విలేజ్ కమ్యూనిటీలో భక్తులు వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ సభ్యులు నిర్వహించిన ఆరు రోజుల వేడుకల్లో నిత్య పూజలతో, భక్తిశ్రద్ధలతో, మండపంలో రోజుకో అలంకరణతో, పిల్లలు పెద్దల ఆటపాటలతో వేదిక కళకళలాడింది. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎప్పటిలాగా నిర్వహించే వేలం పాట ఈ ఏడాది సైతం జరిగింది. ఈ వేలం పాటులో లడ్డు ధర రూ.13 లక్షలకు పైగా పలికింది. పండుగ ఐదవ రోజు బంతి భోజనాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా నిలిచాయి. తెలుగు సంప్రదాయమైన పంచె కట్టుతో ఉత్సవాల్లో పాల్గొన్న నిర్వాహకులు 300మందికి పైగా అన్నదానం చేశారు. చివరి రోజైన నిమజ్జనం రోజు వినాయకుడి ముందు హోలీ, దాండియా ఆడి వీడ్కోలు పలికారు. -
ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
అగ్నితో స్టంట్ చేయబోయాడు.. ఆసుపత్రి పాలయ్యాడు!
అహ్మదాబాద్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఓ వ్యక్తి చేసిన స్టంట్ వికటించింది. నోట్లో పెట్రోల్ పోసుకుని గాల్లో మంటలు తెప్పించే ప్రయత్నం చేయగా.. ప్రమాదవశాత్తు అతడికే మంటలు అంటుకున్నాయి. గుజురాత్లోని సూరత్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పూజ అనంతరం భక్తులకు తన నైపుణ్యాన్ని చూపించాలనుకున్నాడు ఓ వ్యక్తి. నోట్లో పెట్రోల్ పోసుకుని.. అగ్గిపుల్ల పట్టుకుని గాల్లోకి మంటలు వచ్చేలా పెట్రోల్ ఊదే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ స్టంట్ వికటించి ఒక్కసారిగా ఆ వ్యక్తికే మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న కొందరు వెంటనే అతని చొక్కా విప్పేందుకు సాయం చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్చారు. A young man was accidentally set ablaze while performing stunts trying to breathe fire from his mouth using flammable substances, in Surat’s Parvat Patiya area during a Ganesh Chaturthi celebration. #ganesha #ganeshidols #ganeshji #ganeshutsav #ganpatibappa #ganpati #news pic.twitter.com/1IribHHJyC — oursuratcity (@oursuratcity) August 31, 2022 ఇదీ చదవండి: ఆధార్ కార్డు థీమ్‌తో వినాయకుడి మండపం.. సెల్ఫీలతో భక్తులు ఖుష్! -
వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి?
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం గణేశ చతుర్థి. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ఈ స్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయని ప్రతీతి. భక్తితో పూజిస్తే చాలు అపారమైన కృపావర్షం కురిపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు గురించి కొన్ని విశేషాలు... చదవండి: పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా.. వినాయకుడికి, విద్యకు సంబంధం ఏమిటి? చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు, బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం ఉంది. వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. ‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతావా!’ అని అడిగాడట.‘అలాగే రాస్తాను కానీ, మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా!’ అన్నాడట గణపతి. ‘సరే! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేనూ వేగంగా చెబుతా!’ అన్నాడట వ్యాసుడు. అలా సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది. వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా అనుకోకుండా వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది! తన నిబంధన ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని విచారించాడట వ్యాసుడు. సరే తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలిసుండాలి. అంటే వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో ‘నీ పుట్టినరోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. వారికి సకల విద్యలు అబ్బుతాయి’ అని ఆశీర్వదించాడట. నాటినుంచి వినాయక చవితినాడు చేసే పూజలో పిల్లలు తమ పుస్తకాలను, కలాలను ఉంచి, పుస్తకాలకు పసుపు కుంకుమలు అలంకరించి పూజించడం ఆచారంగా మారింది. క్షేమం, లాభం కూడా.. ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. వీటిలోని ఆంతర్యం ఇదే! వినాయకుని నక్షత్రం ‘హస్త’. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, ఉండ్రాళ్లుగా తయారు చేసి చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి నివేదన చేస్తారు. పత్రిపూజ: అదేవిధంగా వినాయకునిది కన్యారాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రీతికరమైనది. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. మూషిక వాహనం: మూషికం అంటే ఎలుక వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. పంజరంలో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పట్టినప్పుడు మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు – వినాయకుడు. చదవండి: గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము -
విదేశాల్లో వినాయకుడు.. గణేషునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం
కరోనా మహమ్మారితో విలవిల్లాడిపోయి గత రెండేళ్లుగా గణేశుడి ఉత్సవాలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కోవిడ్–19 భయాలు అంతగా లేకపోవడం, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలకి పూర్తిగా అవగాహన రావడంతో హరిద్వార్ నుంచి భువనేశ్వర్ వరకు పెద్ద ఎత్తున విఘ్నాధిపతిని కొలవడానికి ఏర్పాట్లు చేశారు. ఏనుగు తలతో పిల్లల్ని ఆకర్షించే రూపురేఖలతో గణపతి బప్పా కొలువై ఉండడం ఈ పండుగకి విదేశాల్లో కూడా ఎనలేని ప్రాముఖ్యత ఉంది. గణేశుడిపై అధ్యయనం చేసిన కాలిఫోర్నియా ప్రొఫెసర్ రాబర్ట్ ఎల్ బ్రౌన్ ఆగ్నేయాసియాలో 5, 6 శతాబ్దాల్లోనే గణేశుడి ప్రతిమలు శాసనాల్లో కనిపించాయని వెల్లడించారు. పలు ఆసియన్ దేశాల్లో బొజ్జ గణపయ్య ఆరాధన ఎప్పట్నుంచి ఉందో ఆ ప్రొఫెసర్ ఒక ఆరి్టకల్‌లో వివరించారు. భారత్‌లో 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ పాలనలో గణేశుడి ఉత్సవాలు ఘనంగా జరిగేవి. పుణెలో 18వ శతాబ్దంలో పెషావర్లు గణపతి ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఇక స్వాతంత్య్ర పోరాటం సమయంలో హిందువులందరినీ ఏకం చెయ్యడానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఊరేగింపుల్ని దేశవ్యాప్తం చేశారు. కాంబోడియా: 7వ శతాబ్దం నుంచే కాంబోడియా ప్రజలు గణేశుడ్ని ప్రథమ దేవుడిగా తొలి పూజలు అందిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న ఆలయాలన్నీ వినాయకుడికే అంకితమిచ్చారు. భారత్‌లో గణేశ్ చతుర్థి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముందే కాంబోడియాలో గణపతిని కొలడం విశేషం. ఈ దేశంలో గణేశ్ ప్రతిమలు ఎక్కువగా నిల్చొనే భంగిమలో మాత్రమే ప్రతిíÙ్ఠస్తారు. కొన్ని కూడళ్లలో కూడా భారీ సైజులో గణేశుడి విగ్రహాలు కనిపిస్తాయి. థాయ్‌లాండ్: థాయ్‌లాండ్‌లో 10వ శతాబ్దం నుంచే గణపతిని కొలుస్తారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. తమిళం, థాయ్ భాషల్లో రాసిన శాసనాలపై కంచుతో తయారు చేసిన గణేశుడి ప్రతిమ ఫాంగ్ నా ప్రాంతంలో లభించింది. ఈ దేశంలో వ్యాపారస్తులు గణేశుడిని ఎక్కువగా పూజించి బంగారం, మిఠాయిలు సమర్పిస్తూ ఉంటారు. విజయ గణపతిగా కీర్తిస్తారు. సాంస్కృతిక నగరంగా పేరుగాంచిన చాకోఎంగ్సావో నగరం గణేశుడి నగరంగా ఖ్యాతి పొందింది. ఇక్కడ గణేశుడికి 3 ఆలయాలు ఉన్నాయి. బ్యాంకాక్‌లోని సెంట్రల్ వరల్డ్ ఎదురుగా గణేశుడి మండపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. థాయ్ ప్రభుత్వంలోని ఫైన్ ఆర్ట్స్ శాఖ చిహ్నంగా గణేశుడే ఉండడం విశేషం. చైనా: చైనాలో గణేశుడి పురాతన విగ్రహం తన్ హువాంగ్ ప్రాంతంలోని తవ్వకాలలో బయటపడింది. కుంగ్ హుస్సేన్ ప్రాంతంలోని గణేశుడి ఆలయం ఉన్నాయనడానికి 531 కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం చైనాలో గణేశుడి ఒక నెగిటివ్ ఫోర్స్‌గా చూస్తారు. ఏదైనా పనికి అవరోధంగా నిలిచేవాడిగానే చిత్రీకరిస్తూ ఉంటారు. జపాన్: జపాన్‌లో 8వ శతాబ్దంలోనే గణేశుడిని పూజించినట్టు ఆధారాలున్నాయి. అత్యంత శక్తిమంతుడైన దేవుడిగా చూసేవారు. వ్యాపారులు, జూదగాళ్లు, కళాకారులు ఎక్కువగా గణేశుడిని ఆరాధించేవారు. బౌద్ధ ఆరామాలలో గణేశుడి విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. అఫ్గానిస్తాన్: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌కి సమీపంలో గార్జెడ్లో 7–8 శతాబ్దాల్లోనే గణేశుడి విగ్రహం లభ్యమైంది. ఇండో ఆఫ్గాన్ మధ్య సంబంధాలకు ప్రతీకగా ఈ గణేశుడు ఉండేవాడని పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్పారు. టిబెట్: టిబెటన్ బుద్ధిజంలో కూడా గణేశుడి ఆరాధన ఉంది. 11వ శతాబ్దంలో తొలిసారిగా వినాయకుడిపై భారతీయ రచనలు ఎన్నింటినో టిబెటిక్ భాషలోకి అనువదించారు. టిబెట్ పురాణాల్లో కూడా గణేశుడి ప్రస్తావన ఉంది. లామాయిజం వ్యాప్తిలో గణేశుడ్ని కూడా వినియోగించుకున్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: గణేష్.. జోష్ -
మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం… (ఫొటోలు)
-
ఆ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు.. మల్లాది విష్ణు క్లారిటీ
సాక్షి, తాడేపల్లి: వినాయక చవితిని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అబద్దాల కోరుగా మారాడని విమర్శించారు. వినాయకుడిని అడ్డం పెట్టుకుని బీజేపీ, చంద్రబాబు బురద జల్లాలని చూస్తున్నారన్నారు. వినాయక చవితి పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలోనే మండపాలకు విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారన్నారు. సీఎం జగన్ వచ్చాక ఎలాంటి చార్జీలు పెంచలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సోమువీర్రాజు, చంద్రబాబుపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు. సోము వీర్రాజుకు దమ్ముంటే పోలవరానికి నిధులు ఇప్పించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని కోరారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. అబద్ధపు ప్రచారాలు తగదు గణేష్ మండపాల విషయంలో ఎలాంటి రుసుంలు వసూలు చేయడం లేదని దేవాదాయశాఖ తెలిపింది. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయడం తగదని సూచించింది. రుసుంలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ హెచ్చరించింది. చదవండి: (కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల) -
గణేశ్ విగ్రహాల ధరలు పెరిగాయ్... ఎందుకంటే..
ముంబై: పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట గ్యాస్ ధరలతో సతమతమవుతున్న వినాయకుని భక్తులకు గణేశ్ విగ్రహాలు, అలంకరణ సామాగ్రి ధరలు కూడా తోడయ్యాయి. విగ్రహాల తయారీకి ఉపయోగించే నల్ల మట్టి, రంగులు, ఇనుప చువ్వలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ), కలప తదితర సామాగ్రి ధరలు 25–30 శాతం పెరిగాయి. అంతేగాకుండా వర్క్ షాపుల్లో విగ్రహాలను తయారుచేసే కళాకారులు, కార్మికుల జీతాలు కూడా పెంచాల్సి వచ్చింది. ఫలితంగా విగ్రహాల ధరలు పెంచక తప్పలేదని తయారీదారులు అంటున్నారు. విగ్రహాలతోపాటు మండపాల నిర్మాణానికి వినియోగించే వెదురు బొంగులు, ప్లాస్టిక్ పేపర్లు, తాడ్పత్రి, అలాగే «థర్మాకోల్, గ్లూ, రంగురంగుల కాగితాలు, విద్యుత్ దీపాలు, లేజర్ లైట్ల తోరణాలు తదితర అలంకరణ సామాగ్రి ధరలు 10–20 శాతం పెరిగాయి. అదేవిధంగా పూజా సాహిత్యం ధరలు 20–25 శాతం పెరిగాయి. దీంతో ఈ ఏడాది గణేశోత్సవాలు నిర్వహించే పేదలు, మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక అంచనాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఉత్సవాలకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్ధితి వచ్చింది. పెరిగిన సామాగ్రి ధరల ప్రభావం సార్వజనిక గణేశోత్సవ మండళ్లపై అంతగా పడకపోయినప్పటికీ ముఖ్యంగా ఇళ్లలో ప్రతిష్టించుకుని పేదలు, సామాన్య భక్తులపై తీవ్రంగా చూపనుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సార్వజనిక గణేశోత్సవ మండళ్లు, ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు ఉత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. అలంకరణ పనులకు కూడా చాలా తక్కువ స్ధాయిలో ఖర్చు చేశారు. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు, సార్వజనిక మండళ్లు భారీగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ విగ్రహాల ధరలు, అలంకరణ సామాగ్రి ధరలు పెరగడంతో ఉత్సవాలపై నీళ్లు చల్లాల్సిన పరిస్ధితి వచ్చింది. వరదలతో తయారీకి ఇక్కట్లు... గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అన్ని వస్తువులకు భారీగా ధరలు పెరిగాయి. గత సంవత్సరం కేజీ పీఓపీ రూ.130 లభించగా ఇప్పుడు రూ.210పైగా లభిస్తోంది. అంతేగాకుండా రంగుల ధరలు 10–20 శాతం, ఇనుప చువ్వల ధరలు 50–60 శాతం మేర పెరిగాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక జిలాలలో వరదలు వచ్చాయి. అలాగే గుజరాత్లో కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి నుంచి వర్క్ షాపుల్లోకి రావల్సిన కలప నిలిచిపోయింది. దీంతో కొరత ఏర్పడడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. సామాగ్రి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు చేయకతప్పడం లేదు. చౌక ధర సామాగ్రి వినియోగిస్తే విగ్రహాల నాణ్యత దెబ్బతింటుంది. దీంతో గత్యంతరం లేక విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని బడా విగ్రహాల తయారీదారులు అంటున్నారు. వలస కూలీలు తిరిగిరాలేదు.. కరోనా కాలంలో అమలుచేసిన లాక్డౌన్ వల్ల ఉపాధి లేక అనేక మంది కళాకారులు, కార్మికులు స్వగ్రామాలకు తరలిపోయారు. అందులో అనేక మంది తిరిగి రాలేకపోయారు. దీంతో కళాకారులు, కార్మికుల కొరత ఏర్పడింది. వారికి కూడా ఎక్కువ కూలీ, వేతనాలిచ్చి రాష్ట్రానికి రప్పించాల్సిన దుస్ధితి వచ్చింది. ఎక్కువ జీతంతో పనులు చేయించుకోవల్సి వస్తోందని విగ్రహాల తయారీదారుడు రాహుల్ ఘోణే పేర్కొన్నారు. మరో విగ్రహాల తయారిదారుడు ప్రశాంత్ దేశాయ్ మాట్లాడుతూ రెండు, నాలుగు అడుగులోపు విగ్రహాలు తయారు చేయడం కొంత గిట్టుబాటు అవుతుంది. అందులో ఇనుప చువ్వలు, కలప వినియోగం ఉండదు. కాని భారీ విగ్రహాలు తయారు చేయాలంటే ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఇందులో ఇనుప చువ్వలు, కలప పెద్ద మాత్రలో వినియోగించాల్సి ఉంటుంది. దీంతో ధరలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదంటున్నారు. విగ్రహాల డిమాండ్ పెరిగింది. కాని సమయం తక్కువగా ఉండడంతో కళాకారులకు, కార్మికులకు ఓవర్ టైం డబ్బులు చెల్లించడంతో భోజన, బస వసతులు కల్పించి పనులు చేయించుకోవల్సిన పరిస్ధితి వచ్చిందంటున్నారు. ఇలా అన్ని విధాల ఖర్చులు పెరగడంతో విగ్రహాల ధరలు పెంచకతప్పడం లేదని వారు వాపోతున్నారు. -
Ganesh Chaturthi: అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా జరపుకోవాలి! అందుకోసం..
Ganesh Chaturthi 2022: కృష్ణద్వీపంలో నివసించే వేదవ్యాసుడికి మదిలో ఒక కథ మెదిలింది. ఆ కథను అక్షరీకరించాలనుకున్నాడు. తాను నిరాఘాటంగా చెబుతుంటే, ఆపకుండా రాయగలిగే వ్రాయసగాని కోసం చూశాడు. ఈ సత్కార్యం విఘ్ననాయకుడైన వినాయకుని పవిత్ర హస్తాల మీదుగా సాగితే బాగుంటుంది అనుకున్నాడు. నేరుగా వినాయకుడి దగ్గరకు వెళ్లి, ‘నాయనా! నేను మహాభారత రచన చేద్దామనుకుంటున్నాను. నాకు వ్రాయసకాడు కావాలి. నేను వేగంగా చెబుతుంటే, అంతే వేగంగా రచన చేయాలి. ఇలా రాయాలంటే తప్పనిసరిగా వ్రాయసకాడు కూడా జ్ఞాని అయి ఉండాలి. అందుకు నువ్వే తగినవాడివని భావించాను. మన భారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేశా’ అని ఆప్యాయంగా పలకరించాడు. అందుకు ఆ గజాననుడు వినమ్రంగా శిరసు వంచి, మహర్షీ! మీ అంతటివారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుడిని. మీరు ఎప్పుడు సుముహూర్తం నిర్ణయిస్తే అప్పుడే ప్రారంభిద్దాం’ అన్నాడు ఉమాపుత్రుడు. ‘మంచిపనికి ముహూర్తం అక్కర్లేదు నాయనా! తక్షణమే ప్రారంభిద్దాం’ అన్నాడు బాదరాయణుడు. లంబోదరుడు పాదప్రక్షాళనం చేసుకుని, తాళపత్రాలు, ఘంటం చేతబట్టి, ఆదిదంపతులను స్మరించి, మనస్సును భ్రూమధ్యంలో లగ్నం చేసి, రచనకు సన్నద్ధుడయ్యాడు. వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు నిశిత శరాలుగా వెలువడుతున్నాయి, వినాయకుడి ఘంటం అంతే వేగంతో పరుగులు తీస్తోంది. భారత రచన పూర్తయ్యేవరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు. నిర్విఘ్నంగా లక్ష శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడి దగ్గర సెలవు పుచ్చుకుని కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రులను దర్శించాడు. క్షేమసమాచారాలు కనుక్కున్నారు పార్వతీపరమేశ్వరులు. వ్యాసభగవానుడి అద్భుత సృష్టికి తమ కుమారుడు ఘంటం పట్టినందుకు ఆనందపారవశ్యం చెందారు. భూమి మీద భారతం ఉన్నంతకాలం వినాయకుడి పేరు కూడా నిలబడిపోతుందని పరవశించారు ఆది దంపతులు. అమ్మా! ఇంతకాలం వ్యాసభగవానుడి దగ్గర ఉండి, జ్ఞానసముపార్జన చేశాను. ఎంతో విజ్ఞానదాయకమైన భారతాన్ని అందరికంటె ముందుగా తెలుసుకోగలిగాను. అనితర సాధ్యమైన ఇటువంటి రచనను, కొన్ని యుగాలు గడిచినా ఎవ్వరూ రచించలేరమ్మా! ఇంతకాలం మీకు దూరంగా ఉన్నందుకు నేను ఎన్నడూ చింతించలేదమ్మా. మీరు కూడా సంబరపడే ఉంటారు. ఇప్పుడు నా మనసుకి కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తోంది. కొత్త ప్రదేశాలలో పర్యటిస్తే మనసుకి సాంత్వన కలుగుతుంది కదా. అందువల్ల కొంతసేపు భూలోకంలో సంచరించి వస్తానమ్మా. అవును... ఈ రోజు నా పుట్టినరోజు కదమ్మా! ఈ వేడుకలను భూలోక వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా. నీ అనుమతితో భూలోకంలో సంచరించి వస్తానమ్మా’ అన్నాడు గణనాయకుడు. అందుకు పార్వతి, ‘నాయనా! ఇంతకాలం నువ్వు మాకు దూరంగా ఉన్నావు కదా. ఇంక నీ ఎడబాటు భరించలేనురా. నేను కూడా నీ వెంట వస్తాను అని ఆప్యాయంగా కుమారుడిని అక్కున చేర్చుకుని, ‘‘భూలోకవాసులు నిన్ను ఒక్కో సంవత్సరం ఒక్కో కొత్త అవతారంలో చూసుకుంటున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ఎలా పూజిస్తున్నారో కనులారా వీక్షించి ఆనందించాలని ఉంది’ అంది పార్వతి. ‘నా మూషికం మీద ఈ యావత్ప్రపంచం నీకు చూపిస్తానమ్మా. ముందుగా నన్ను ఆశీర్వదించు’ అని తల్లి దగ్గర దీవెనలు అందుకుని, తల్లిని తన వాహనం మీద కూర్చుండబెట్టి బయలుదేరాడు వినాయకుడు. వినాయకుడు భూలోక సంచారానికి బయలుదేరుతున్నాడన్న వార్త తెలిసిన త్రిలోక సంచారి నారదుడు, ఈ సమాచారాన్ని తానే ముందుగా అందరికీ అందించాలని, వినాయకుడి కంటె ముందుగానే తన సామాగ్రితో బయలుదేరాడు. వినాయకుడి వెంట తల్లి కూడా ఉండటం చూసి, వెంటనే ‘తాజా వార్త’ అంటూ ప్రచారం చేసేసి, మళ్లీ వారి వెంట బయలుదేరాడు మరింత సమాచార సేకరణ కోసం. భూలోక సంచారం చేస్తూనే వినాయకుడు పార్వతీదేవితో తనకు వ్యాసుడికి మధ్య జరిగిన అనేక అంశాలను ముద్దుముద్దుగా వివరిస్తూ వచ్చాడు. కుమారుని జ్ఞానానికి తల్లి పరవశించిపోసాగింది. అంతలోనే మళ్లీ, ‘నాయనా! నిన్ను రకరకాల రూపాలుగా విగ్రహాలు చేస్తుంటారు కదా! నీకు కోపం రాదా’ అని ప్రశ్నించింది. వినాయకుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘అమ్మా! నీకు నా మీద ఉండే వాత్సల్యంతో నువ్వు నీకు కావలసిన విధంగా నన్ను అలంకరించుకుంటావు. నీ ఒంటి నలుగు పిండితో నన్ను రూపొందించావు కదా. భూలోక వాసులకు నా మీద చనువుతో కూడిన ప్రేమ ఉంది. నన్ను వారి ఇంటి మనిషిగా భావించి, వారికి నచ్చిన రూపంలో నన్ను అలంకరిస్తుంటారు. అంతేనా! చిత్రకారులు నా మీద వ్యంగ్య చిత్రాలు వేస్తూనే ఉంటాడు, హాస్యకథలు రాస్తూనే ఉంటారు. నేనంటే ప్రీతి కనుకనే వారు ఇన్ని విధాలుగా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు’ అన్నాడు వినాయకుడు. ‘నాయనా! నీ మాటలు బాగానే ఉన్నాయి. నిన్ను కొందరు నులక మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వినాయకుడిగా చూపుతారు, కొందరేమో స్కూటర్ వినాయకుడిగా కొలుస్తారు, మరి కొందరు నీకు నల్ల కళ్లజోడు పెడతారు. కొందరు నువ్వు క్రికెట్ ఆడుతుంటే చూసి మోజుపడుతున్నారు’ అని పార్వతీదేవి ఏకరువు పెడుతుంటే, మధ్యలోనే అడ్డుతగిలి వినాయకుడు, ‘అంతేనా అమ్మా! కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, నాకు పెళ్లి కూడా చేసేశారు, నాలోని సిద్ధి, బుద్ధి లక్షణాలను నా భార్యలుగా చేశారు’ అని నవ్వుతూ పలికాడు. ఆ మాటలకు నారదుడు అడ్డుపడుతూ, ‘అయ్యా! వినాయకా! మీతో కోలాటం ఆడించారు. ఆకులను మీ రూపంగా మలిచారు. ముచ్చటగా మీ ఒడిలో శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టారు’ అంటూ రకరకాల రూపాలను వివరించాడు నారదుడు. నారదుడి మాటలకు ముసిముసిగా తొండం వెనుక నుంచి నవ్వుతూ, ‘త్రిలోక సంచారీ! నా పుట్టినరోజు పేరుతో ఎంతో మంది తమలోని సృజనను వెలికి తీస్తున్నారు. దేవతలలో ఎవ్వరికీ దక్కని ఈ ఘనత నాకు మాత్రమే దక్కింది. నా భక్తులు నన్ను వారి ముద్దుల కుమారుడిగా భావించుకుంటూ, అలంకరిస్తున్నారు. ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధించినా నాకు అందరి మీద ఒకే ప్రేమ ఉంటుంది’ అని పలికాడు గణనాథుడు. ఇంతలోనే నారదుడు మళ్లీ, ‘‘వినాయకా! ఋషులు సైతం నిన్ను విడిచిపెట్టలేదు! నిన్ను షోడశ గణపతులుగా పేర్కొన్నారు. నిరుత్త గణపతి నుంచి మళ్లీ నిరుత్త గణపతిగా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అర్చిస్తున్నారు. ఎంతటి ఘనత గణనాథా నీది. నాది ఒక్కటే చిన్న విన్నపం! నీ పేరు చెప్పుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కొందరు నిన్ను నిందిస్తున్నారు. ఈ నీలాపనిందలు పడకుండా, నీ భక్తులందరికీ నిన్ను మీ అమ్మ రూపొందించినట్టుగా మట్టితోనే తయారుచేయమని ఆశీర్వదించు’ అంటూ నారదుడు సాష్టాంగపడ్డాడు. ‘ఈ సంవత్సరం భాగ్యనగరంలో నన్ను మృత్తిక గణపతిగా రూపుదిద్దారు. ఈ శరీరం పంచభూతాలతో తయారైనదనే వేదాంతాన్ని బోధించటానికే ఈ విగ్రహాల తయారీ. అందుకే అందరూ మట్టితోనే నా రూపం తయారుచేయండి’ అంటూ తల్లి ఒడిలో ఒదిగిపోయాడు లంబోదరుడు. పార్వతీదేవి తల్లి మనసు ఆర్ద్రమైంది. త్వరగా ఇల్లు చేరుకుని కుమారునికి దృష్టి దోషం తగలకుండా, ఉప్పు మిరపకాయలతో ‘ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి’ అంటూ గజాననుడి తల చుట్టూ ముమ్మారులు తిప్పి నిప్పులలో పడవేసింది. నా పేరున జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల పండగ సందర్భంగా ప్రతి పందిరిలోను, భక్తి పాటలను మాత్రమే వేయాలని కోరుకుంటున్నాను. నా పేరున అసభ్యపు పాటలు వింటున్నామని నలుగురూ అనుకోవడం నాకు బాధగా ఉంటుంది. అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నా రూపాన్ని మట్టితోనే తయారుచేసి పూజించండి. నా పేరున కులమతాల కుమ్ములాటలకు దూరంగా ఉండండి. ఇది నా అభ్యర్థన. – వినాయకుడు, కైలాసం సృజన రచన– డా. వైజయంతి పురాణపండ చదవండి: గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే... -
గణేష్ మండపం పెడుతున్నారా? ఈ అనుమతులు తప్పనిసరి
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపాల ఏర్పాటుకు, ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ►బలవంతపు చందాలు, వసూళ్లు చేయరాదు. దర్శనాల టికెట్లు పెట్టకూడదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే డయల్ 100 గానీ ఫిర్యాదు చేయవచ్చు. ►పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీలైనంత మేరకు ప్లాస్టర్ ఆఫ్ కృత్రిమ రంగులు ఉపయోగించిన విగ్రహాలను కొనుగోలు చేయవద్దు. మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేందుకు ప్రాధాన్యమివ్వాలి. ►విగ్రహం సైజు, బరువు, ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు. నిమజ్జనం చేసే తేదీ, కమిటీ సభ్యుల వివరాలను ముందుగానే తెలియజేయాలి. ►దీపారాధనలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ►శబ్దకాలుష్యం అరికట్టేందుకు పాల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమాలు విధిగా పాటించాలి. పగటిపూట 55 డెసిబుల్స్, రాత్రి 45 డెసిబుల్స్ దాటి శబ్దం రాకూడదు. బాక్స్ టైపు స్పీకర్లను మాత్రమే వినియోగించాలి. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. ►కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలి. ►మండపాల ప్రదేశం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. విగ్రహాల దగ్గర వాహనాలు పార్కింగ్ చేయకూడదు. ►ఊరేగింపు సమయంలో అశ్లీల పాటలు వేసినా, డ్యాన్సులు చేసినా, మందుగుండు సామగ్రి కాల్చినా చర్యలు తప్పవు. ►వినాయక నిమజ్జన ఊరేగింపు ప్రారంభించి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి. ►ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలి. -
Eco Friendly Ganesha: వెరైటీ కప్పుల గణపయ్య
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా వినాయక విగ్రహాలను సుద్దా, లేదా మట్టితో తయారు చేస్తారు. కానీ.. నాచారం డివిజన్ బాబానగర్‌కు చెందిన సూర్యప్రకాష్ వివిధ రకాల వస్తువులతో భిన్నవిభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాలనీ వాసులతో కలిసి ప్రతి ఏటా గణనాథుడిని కాలనీలో ప్రతిష్టించేవాడు. తానే స్వయంగా వైరటీగా తయారు చేయాలని నిర్ణయించుకొని 2010లో ప్రారంభించాడు. పర్యావరణ రహిత గణనాథుడిని తయారు చేయాలనే సంకల్పంతోనే వైరటీగా తయారు చేయడానికి శ్రీకారం చుట్టినట్లు సూర్యప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు. 11 ఏళ్లుగా.. 2010 మొదటగా ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని న్యూస్ పేపర్లలతో తయారు చేశాడు. 2011లో 35వేల టీ కప్పులతో, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో రకంగా లక్ష ప్రమీదాలతో, 5 వేల లీటర్ల టాటా వాటర్ ప్యాకెట్ల్‌తో వాటర్ పెడల్స్‌తో 18వేల టిష్యూ పేపర్లతో డోరమెన్ బాల్స్‌తో, 6 వేల ఐస్‌క్రీమ్‌లతో వినాయకుడిని తయారు చేశాడు. రెండేళ్ల క్రితం 20 వేల ఇయర్ బడ్స్‌తో 2021కి మూడు కిలోల కాఫీ గింజలతో తయారు చేశాడు. ఈ సారి 25 వేల టీ కప్పులతో తయారు భారీ వినాయకుడిని తయారు చేస్తున్నట్లు సూర్య ప్రకాష్ పేర్కొన్నాడు. 15 మంది సభ్యులతో.. సూర్యప్రకాష్ తాతా, పెద్ద నాన్న, నాన్న మొదటి నుంచి మంచి ఆర్టిస్ట్‌లు సూర్య ప్రకాష్ ఇంటికి కూడా చిత్రకళ అనే పేరు పెట్టారు. వారింట్లో ఎక్కడా చూసిన బొమ్మలు, మొక్కలే కనిపిస్తాయి. తాను వెరైటీగా తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న చాలా మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కర్నూలు, చిలుక లూరిపేట, తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలు, హైదరాబాద్‌లో కూడా ఆర్డర్స్ మీదా తన 15 మంది టీమ్ సభ్యులతో తయారు చేయడానికి వెళ్తుంటారు. టీకప్ గణనాథుడి తయారీతో తనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. -
వినాయక చవితి స్పెషల్: తిరుపతి బాలాజీ స్టైల్లో 18 అడుగుల ‘స్వర్ణ గణేష్’
లక్నో: వినాయక చవితి పండగ కోసం యావత్ దేశం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 31న గణేష్ చతుర్థి వచ్చింది. పండగ దగ్గరపడుతున్న క్రమంలో గణేషుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కో విధంగా, ఒక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు విఘ్నేశుడు. అయితే, ఈసారి ‘స్వర్ణ గణేష్’ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. బంగారంతో సిద్ధం చేస్తున్న 18 అడుగుల వినాయకుడి విగ్రహం వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌసి ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు ఈ స్వర్ణ గణేషుడి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. 18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నట్లు చెప్పారు అజయ్ ఆర్యా అనే నిర్వాహకుడు. ‘గణేషుడి విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. తిరుపతి బాలాజీ మాదిరిగా బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నాం.’ అని తెలిపారు. బంగారు గణేషుడి విగ్రహం వినాయక చవితి నాటికి పూర్తవుతుందని చెప్పారు అజయ్. #WATCH | 'Swarna Ganesh' adorned with gold is being made in UP's Chandausi for Ganesh Chaturthi "It will be an 18 feet tall idol. It is being prepared with gold decorative items on the lines of Tirupati Balaji," says Ajay Arya, a person associated with the project pic.twitter.com/B5RH2eXTnh — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2022 ఇదీ చదవండి: ఆవు పేడతో వినాయక విగ్రహాలు -
చవితి వేడుకలకు ముస్తాబవుతున్న గణనాథుడు (ఫొటోలు)
-
గణేష్ ఉత్సవాలు: సీపీ ఆనంద్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: బందోబస్తు, భద్రత కోణంలో నగర పోలీసు విభాగానికి అత్యంత కీలకమైన గణేష్ ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఏమరుపాటుకు తావు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కొత్వాల్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. బంజారాహిల్స్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని ఆడిటోరియంలో బుధవారం తొలి సన్నాహాక, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 31న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 9న నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మండపాలు/విగ్రహాలు నిమజ్జనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం సిటీలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీల్లో అనేక మంది కొత్తవారు ఉన్నారు. వీరి గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం బందోబస్తు నిర్వహించడం తొలిసారి. ఈ నేపథ్యంలో ఆనంద్ ఈ సమావేశంలో వారిని ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ‘కోవిడ్ తర్వాత ఈ ఏడాది అనేక పండుగలు, ఇతర ఘట్టాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెమీ ఫైనల్స్ లాంటి వాటిని సమర్థంగా నిర్వహించాం. ఫైనల్ లాంటి గణేష్ బందోబస్త్‌లోనూ కచ్చితంగా రాణిస్తామనే నమ్మకం ఉంది’ అని ఆనంద్ అన్నారు. మండపాల ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు స్థానిక పోలీసుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కొత్వాల్ స్పష్టం చేశారు. ఇతర విభాగాలతో కలిసి సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని ఆనంద్ ఆదేశించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచి అభ్యంతరకర పోస్టులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు సీపీలు డీఎస్ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీలు పి.విశ్వప్రసాద్, ఎం.రమేష్, ఏవీ రంగనాథ్, గజరావ్ భూపాల్, ఠాణాల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా.. నిమజ్జనానికి 3 రకాల కొలనులు సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నిర్వహణతో పాటు మరోవైపు విగ్రహాల నిమజ్జనాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఎక్కడి విగ్రహాలను అక్కడే దగ్గరి ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 75 కొలనుల్ని అధికారులు సిద్ధం చేయనున్నారు. కేవలం గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసమే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్మించిన 25 కొలనులున్నాయి. వీటిని బేబీ పాండ్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు అదనంగా మరో 24 ప్రీఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఆర్పీ (ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్) పాండ్స్‌కు ఇప్పటికే టెండర్లు పిలిచారు. వీటికి ఒక్కో దానికి రూ. 10 లక్షలు వెచ్చించనున్నారు. వీటినే కృత్రిమ తటాకాలుగా కూడా వ్యవహరిస్తున్నారు. 20మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 1.35 మీటర్ల లోతులో ఉండే వీటిలో నాలుగడుగుల ఎత్తు వరకు విగ్రహాలను నిమజ్జనం చేయొచ్చు. వీటితోపాటు ఆయా ప్రాంతాల్లోని అవసరాలకనుగుణంగా గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం మరో 26 ప్రాంతాల్లో చెరువులు తవ్వి, నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు. వీటిని తాత్కాలిక నిమజ్జన కొలనులుగా వ్యవహరిస్తున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం ఇలా మూడు రకాల కొలనుల్ని వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. నిర్వహణ లేక చెత్తా చెదారాలు పేరుకుపోయిన బేబీ పాండ్స్‌ను శుభ్రం చేయడంతోపాటు, తాత్కాలిక చెరువుల కోసం తవ్వకాల పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. ఈ కొలనుల్లో వేసిన విగ్రహాలను ఎప్పటికప్పుడు బయటకు తీసి, తాజా నీరు నింపుతారని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆరు లక్షల మట్టివిగ్రహాలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలు కూడా వినియోగించనుండటంతో చెరువుల్లో నీరు కలుషితం కాకుండా ఉండేందుకు, నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
Hyderabad: 9న గణేష్ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శిస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్లకు అదనంగా మరో 50 పాండ్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు. (క్లిక్: కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై) సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖచీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పీసీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి రఘోత్తంరెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి సుదర్శన్, సికింద్రాబాద్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సందడిగా మెగా రికార్డ్స్ అవార్డుల ప్రదానోత్సవం) -
గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
-
సమయం లేదు గణేశా!.. మరో మూడు నెలలే.. ఏం చేస్తారో ఏంటో?
సాక్షి, హైదరాబాద్: ఆయా సమస్యల పరిష్కారానికి పనులు చేస్తున్న జీహెచ్ఎంసీ.. తీరా గడువు ముంచుకొచ్చేంతవరకూ పనులు చేయకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. వర్షాకాలంలో ముంపు సమస్యల పరిష్కారానికి ఎస్ఎన్డీపీ పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటైనప్పటికీ.. మళ్లీ వర్షాకాలం వస్తుండగా హడావుడిగా ఇప్పుడు పనులు చేస్తున్నారు. గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా రసాయనాలతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలను వాడవద్దని, చెరువుల్లో వాటిని నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించినా అమలు చేయక.. చివరి నిమిషంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికిప్పడు ప్రత్యామ్నాయ మార్గాల్లేవని విన్నవించడంతో అదే చివరి అవకాశంగా హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే. తయారీదారులకు వెళ్లిన ఆదేశాలు.. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని, మట్టితో చేసే విగ్రహాలు సైతం చెరువుల్లో కాకుండా నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీలు అండర్‌టేకింగ్ ఇచ్చాయి. చెరువుల నిమజ్జనాల కోసం బేబి పాండ్స్ వినియోగిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో మరో మూడు మాసాల్లో వినాయకచవితి రానుంది. పీఓపీ విగ్రహాలు తయారు చేయకుండా వాటి తయారీదారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి నగరమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. చదవండి: పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని.. ►పీఓపీ విగ్రహాల తయారీని నిలువరించినా, మట్టితో తయారయ్యే విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నా నగరంలో ఉన్న బేబి పాండ్స్ సరిపోవు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి వీల్లేదు కనుక, ఎక్కడికక్కడ స్థానికంగానే జీహెచ్ఎంసీ డివిజన్లు, కాలనీల వారీగా కృత్రిమ తటాకాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాంటివి ఎన్ని అవసరమవుతాయో అంచనా వేసి ఇప్పట్నుంచే కార్యాచరణ ప్రారంభిస్తేనే అసలు సమయానికి సమస్యలు ఎదురు కావని అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. ►తీరా చివరి నిమిషంలో అంటే సరిపడినన్ని కృత్రిమ తటాకాలు నిర్మించడం గాని.. ప్లాస్టిక్‌వి ఏర్పాటు చేయడం గాని కష్టమంటున్నారు. ప్లాస్టిక్‌వి వినియోగించాలనుకున్నా ముందస్తుగా తయారీ కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ యాక్షన్‌ప్లాన్ ఏమిటో అంతుబట్టడం లేదు. బేబిపాండ్లు, ప్లాస్టిక్ తటాకాల్లో విగ్రహాలను ముంచి,వెంటనే వెలికి తీస్తేనే అవి సరిపోతాయి.లేకుంటే కష్టం. ఇప్పటినుంచే అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏమిటో అంతుపట్టడం లేదు. -
నాడు 15 రోజులపాటు వాహనంపైనే ఖైరతాబాద్ గణేషుడు.. కారణం ఇదే!
సాక్షి, ఖైరతాబాద్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌తోపాటు చెరువుల్లో నిమజ్జనం చేయనివ్వొద్దని హైకోర్టు సూచనలు చేసిన నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా వినాయకుడు కొలువుదీరాడు. ప్రతి ఏటా మహాగణపతిని అత్యంత వైభవంగా..హంగూ ఆర్భాటాలతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్‌కు తరలించి అక్కడే నిమజ్జనం చేస్తున్నారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన క్రేన్లు వేలాది మంది భక్తులు పాల్గొనే నిమజ్జన శోభార్యాలీ మొత్తం గణేష్ ఉత్సవాల్లోనే హైలెట్‌గా నిలుస్తుంది. ఇందుకోసం నిర్వాహకులతోపాటు అధికారులు, పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపడుతుంది. అయితే..ఈసారి నిమజ్జనంపై కోర్టు సూచనల నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అసలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారా..లేకుంటే ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఏర్పాట్లు చేస్తారనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సాగర్‌లోనే నిమజ్జనం: ఉత్సవ కమిటీ ఈసారి కూడా మహాగణపతి నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లోనే జరగాలని, 66 సంవత్సరాలుగా ఇది సంప్రదాయంగా కొనసాగుతోందని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఒక వేళ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతివ్వకుంటే, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు మహాగణపతి విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతామని పేర్కొన్నారు. 1986లో ఇలా... 1986లో 20 అడుగుల ఎత్తులో తయారుచేసిన వినాయకుడిని సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లగా అక్కడ తగిన సౌకర్యాలు కల్పించ లేదు. దీంతో 15 రోజుల పాటు వినాయకుడ్ని అక్కడే వాహనంపైనే ఉంచారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేయడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తలసానికి విన్నపం అఫ్జల్‌గంజ్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విధించిన ఆంక్షల నేపథ్యంలో మంగళవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి చర్చించారు. గణేష్ విగ్రహాల సామూహిక నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో జరిపేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు, ఉపాధ్యక్షులు కరోడీమాల్, కోశాధికారి శ్రీరామ్‌వ్యాస్, రామరాజు, కార్యదర్శులు మహేందర్, శశి, ఆలె భాస్కర్, రూప్‌రాజ్ తదితరులు ఉన్నారు. అంబారీపై ఊరేగింపు.. వచ్చేసారి 70 అడుగుల మట్టి వినాయకుడు వచ్చే సంవత్సరం..2022లో ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో 70 అడుగుల ఎత్తులో తయారుచేస్తాం. ఈ భారీ వినాయకుడిని ఉన్నచోటే నిమజ్జనం చేస్తాం. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని..ఖైరతాబాద్ మహాగణపతిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – సింగరి సుదర్శన్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ 1954 : ఒక అడుగు వేరేచోట కష్టమే... 40 అడుగుల ఎత్తులో ఉన్న భారీ వినాయకుడిని హుస్సేన్‌సాగర్‌లో కాకుండా వేరేచోట నిమజ్జనం చేయడం కష్టమేనని నిపుణులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. మహాగణపతిని నిమజ్జనం చేసేంత విశాలమైన, లోతైన కొలనులు సమీపంలో ఎక్కడా లేవు. ఒకవేళ అంతపెద్ద పాండ్‌ను రూపొందించాలన్నా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అంత సమయమూ లేదు. మరోవైపు మహాగణపతి విగ్రహం మరో ప్రాంతానికి తీసుకెళ్లాలంటే రహదారిలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. ఫ్లై ఓవర్లు, మెట్రో మార్గంలో పిల్లర్లు, విద్యుత్ కేబుళ్లు దాటుకుంటూ తరలించడం అసాధ్యం. ఇది చాలా ఇబ్బందులతో కూడుకున్న పనిగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మహాగణపతి నిమజ్జనం ఎక్కడ, ఎలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంది. గణేష్ మండపాల డిమాండ్ మేరకు వాహనాలు సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జన ఉత్సవాలపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న నిమజ్జనం కోసం ప్రస్తుతం వెయ్యి భారీ వాహనాలను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. గణేష్ మండపాల డిమాండ్ మేరకు అవసరమైన వివిధ రకాల వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సూచన మేరకు నగరంలోని ప్రధాన మండపాల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు భారీ ట్రాలీ వాహనాలు మొదలుకొని టాటాఏస్ వంటి చిన్న వాహనాల వరకు అందజేయనున్నారు. నిమజ్జన వాహనాల కోసం వచ్చే మండపాల నిర్వాహకులకు నగరంలోని 12 చోట్ల వాహనాలను సిద్ధంగా ఉంచుతారు. ► నెక్లెస్‌రోడ్డు. మేడ్చల్, టోలీచౌకి, జూపార్కు, మలక్‌పేట్, కర్మన్‌ఘాట్, నాగోల్, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్చెరు, ఆటోనగర్ నుంచి వాహనాలను తీసుకోవచ్చు. ► 19వ తేదీన నిమజ్జనంజరుగనున్న దృష్ట్యా మండపాల నిర్వాహకులు 18వ తేదీనే వాహనాలను తీసుకెళ్లవచ్చు. ► మరోవైపు వాహనాలను అందజేసేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ రవాణా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జేటీసీ వెల్లడించారు. వాహనాల అద్దె.. ► నిమజ్జనానికి తరలి వచ్చే వాహనాల అద్దెలను సైతం అధికారులు ఖరారు చేశారు. ► భారీ ట్రాలీ లేదా టస్కర్‌లకు రూ.20 వేలు. (డీజిల్ ఖర్చు, డ్రైవర్ బత్తాతో కలిపి) ► 10 నుంచి 12 టైర్ల సామర్ధ్యం ఉన్న హెవీగూడ్స్ వెహికల్స్‌కు రూ. రూ.4000. డీజిల్ ఖర్చు, డ్రైవర్‌కు రూ.500 బత్తా అదనం. ► 6 టైర్ల సామర్ధ్యం కలిగిన లారీలకు రూ.2500, ► మిడిల్ గూడ్స్ వెహికల్స్‌కు రూ.1600, ► డీసీఎం వంటి లైట్‌గూడ్స్ వెహికల్స్‌కు రూ.1300, ► టాటాఏసీలకు రూ.1000 చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. ► వీటితో పాటు ప్రతి వాహనం డ్రైవర్‌కు బత్తా తప్పనిసరిగా ఇవ్వాలి. -
TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS-(సింగపూర్) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలగి అందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా నుండి కాపాడాలని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ అంతర్జాలం ద్వారా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నడికట్ల భాస్కర్, నంగునూరి సౌజన్య, శివ ప్రసాద్ ఆవుల మరియు, రవి కృష్ణ విజాపూర్ వ్యవహరించారు. సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, సునీత రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ లు సంబరాల్లో పాల్గొన్న భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు. -
పాపం గణపయ్య
-
వినాయకుడికి రూ.6 కోట్ల విలువైన 5 కేజీల బంగారు కిరీటం
ముంబై: దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నారు. కోవిడ్ కారణంగా గత ఏడాది ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక వినాయక చవితి ఉత్సవాలు అనగానే ముందుగా ముంబై పేరు గుర్తుకు వస్తుంది. ఇక్కడ పది రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక మహారాష్ట్రలో ముంబై లాల్ బాగ్చా గణేషుడు, పుణెలోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాలు ఎంతో పురాతనమైనవే కాక చాలా ప్రసిద్ధి చెందినవి కూడా. (చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్) వినాయక చవితి సందర్భంగా ముంబై, పుణె ఆలయాల్లో భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హల్వాయి గణపతి మందిరంలో మహా భోగ్ పేరిట భారీ ఎత్తున మోదక్‌లు, మిఠాయిలు ప్రసాదంగా నివేదిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులు హల్వాయి గణపతికి 6 కోట్ల రూపాయల విలువ చేసే 5 కిలోగ్రాముల బంగారు కిరీటాన్ని గణేషుడికి సమర్పించారు. పర్వదినం సందర్భంగా భక్తులు వినాయకుడిని కొత్త దుస్తులు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం బంగారు కిరీటాన్ని అలంకరించారు. 21 కేజీల మహాప్రసాదిన్ని నివేదించారు. (చదవండి: జైలులో భర్త.. పండగ వేడుకల్లో శిల్పాశెట్టి) ఓ వైపు కరోనా భయం.. మరోవైపు వినాయక చవితి ఉత్సవాల కారణంగా ముంబై పోలీసులు సెప్టెంబర్ 10-19 వరకు నగరంలో 144 సెక్షన్ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశించారు. గణపతి ఊరేగింపు వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. అంతేకాక జనాలు ఇళ్ల దగ్గరే వినాయక చవితి జరుపుకోవాలని సూచించారు. ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఆన్లైన్ దర్శనాలు ప్రారంభించారు. ప్రస్తుతం హల్వాయి గణపతి మందిరంలో కూడా హారతి కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. చదవండి: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే.. -
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం జగన్
-
గోదావరి నదీ తీరాన ఇల్లు.. నాడు ఆ వ్యక్తి చేసిన పనితో వినూత్నంగా
Nashik Trupti Gaikwad After Puja Turns Idols Into Toys: జైజై గణేశా! జై కొట్టు గణేశా!! వరములిచ్చు ఓ బొజ్జ గణేశా!!! అని పాటలు పాడుకుని ఆటలు ఆడుకుని వేడుక చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. వేడుక పూర్తయిన తర్వాత ఆ బొజ్జ గణపయ్యను ఏం చేయాలనేదే పెద్ద ప్రశ్న. ఓ దశాబ్దం కిందటి వరకు దగ్గరలో ఉన్న చెరువు, సముద్రం, సరస్సు, కొలను... ఏదో ఒకచోట నీటిలో కలిపేసే వాళ్లం. సింథటిక్ రంగులు, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే హాని పట్ల చైతన్యవంతం అవుతున్న కొద్దీ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అనేక దారులు వెతుక్కుంటున్నాం. అందుకోసం మేధోమధనమే చేస్తున్నాం. మట్టి గణపతిని బకెట్లో నీటిలో వేసి కరిగించి మొక్కలకు పోయడం నుంచి గణపతిని విత్తనాలతో మలిచి, పూజ పూర్తయిన తరవాత పంటమడిగా మార్చడం వరకు ఎన్ని కొత్త ఆలోచనలో. మహారాష్ట్ర, నాసిక్‌కు చెందిన అడ్వొకేట్ తృప్తి గైక్వాడ్ కూడా వినూత్నంగా ఆలోచించారు. ఆమె గణపతి బొమ్మలను రీసైకిల్ చేసి బొమ్మలుగా మారుస్తున్నారు. రెండేళ్ల కిందట మొదలైంది ‘మా ఇల్లు గోదావరి నది తీరాన ఉంది. ఓ రోజు ఓ వ్యక్తి నదికి ఓ భారీ లగేజ్‌తో వచ్చాడు. అందులో ఉన్న వస్తువులన్నింటినీ నదిలో కలిపేయాలనేది అతడి ప్రయత్నం. వీటిని జలమయం చేయవద్దు, రీసైకిల్ చేసి ఉపయోగించుకోదగిన వస్తువులుగా మార్చుకోవచ్చని చెప్పాను. అతడు అంగీకరించాడు. అలా మొదలైన నా ప్రయత్నంలో ఆ తర్వాత గణేశ విగ్రహాల రీసైక్లింగ్ కూడా చేరింది. విగ్రహాల తయారీలో ఉపయోగించిన మెటీరియల్ మొత్తాన్ని వేరు చేసి కొత్త బొమ్మలను చేస్తున్నాం. ఆ బొమ్మలను అల్పాదాయ వర్గాల కాలనీల పిల్లలకు పంచుతున్నాం. ఒక్కోసారి ఒక్కోచోటకు వెళ్లి ఇస్తుంటాం. మా ప్రయత్నం గురించి తెలుసుకున్న వాళ్లు పండుగ తర్వాత వాళ్లంతట వాళ్లే బొమ్మలను తెచ్చి ఇస్తున్నారు. పూనా, నాగపూర్, ముంబయి నుంచి కూడా మాకు గణేశ బొమ్మలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఇరవై వేలకు పైగా విగ్రహాలను కరిగించి పిల్లలు ఆడుకునే బొమ్మలను చేశాం’’ అని చెప్తున్నారు తృప్తి గైక్వాడ్. చదవండి: Ganesh Chaturthi: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే.. -
గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే..
వినాయకుడు వరములు ఇచ్చువాడు. ఇవాళ ప్రపంచానికి ఒక వరం కావాలి. అది గ్లోబల్ వార్మింగ్ వల్ల గతి తప్పుతున్న రుతువులను, ఉష్ణోగ్రతలను అదుపులోకి తేవడం. వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడు. కాని ఒక విషయంలో మాత్రం పదే పదే విఘ్నాలు కలిగించాలి. ఏ విషయంలో? పర్యావరణానికి హాని చేసే ఏ పని ఎవరు మొదలెట్టినా అది జరగకుండా విఘ్నాలు కలిగిస్తూ ఉండాలి. అప్పుడు గిరులు పచ్చగా ఉంటాయి. ఝరులు కళకళలాడుతాయి. వినాయకుడు గణపతి. ఆయన ఏ గణాలకు అధిపతి అయినా అసలు అధిపతిగా ఉండాల్సింది మాత్రం ప్రకృతి గణాలకే. అవి శక్తిమంతమయ్యి మనుషులకు శక్తి ఇవ్వాలి. అది కూడా ఈ వినాయక చవితి పండగ సందర్భంగా మనం కోరుకోవాలి. Bhopal Kanta Yadav Eco Friendly Idol With Cow Dung: భోపాల్‌లోని కాంతా యాదవ్ వినాయకుడి శక్తి ప్రకృతికి అందాలంటే ఏం చేయాలో ఆలోచించింది. ఇంతకాలం ఆమె కుటుంబం దేవతల విగ్రహాలు చేస్తూ బతికింది. అవి దాదాపు పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే పదర్థాలతోనే అయి ఉండేవి. కాని ఈసారి కొత్త పని మొదలెడదాం అనుకుందామె. కొత్త పని అంటే ప్రకృతికి మేలు చేసేదే. వినాయకుడి పూజకు మట్టి విగ్రహం తయారు చేయడం ఒక మంచి ఆలోచన. కాని కాంతా యాదవ్ కొంచెం ముందుకు వెళ్లి వినాయకుడు తిరిగి మొక్కకు శక్తిగా మారే విధంగా విగ్రహం తయారు చేయాలనుకుంది. అందుకు గోమయం (ఆవుపేడ)ను ఎంచుకుంది. ఆవుపేడకు ఒక పవిత్రత ఉంది. దాంతోపాటు ఎరువు స్వభావం కూడా ఉంది. అందుకే కాంత ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం మొదలెట్టింది. ‘ఆవు పేడను ఎండ పెడతాను. తర్వాత దానికి రంపంపొట్టు, మైదా పిండి కలిపి మెత్తటి పదార్థంగా చేసి అచ్చులో పోసి విగ్రహం తయారు చేస్తాను. ఇది తయారు చేయడం పది నిమిషాల పనే అయినా ఆరడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత రంగులు వేస్తాను. విగ్రహం పూజలు అందుకున్నాక నీటి బకెట్టులో సులభంగా నిమజ్జనం అవుతుంది. ఆ తర్వాత ఆ నీటిని మొక్కలకు పోస్తే ఎరువు అవుతుంది. ఈ ఆలోచన చాలామందికి నచ్చింది. అందుకే నా దగ్గరకు వచ్చి చాలామంది బొమ్మలు కొంటున్నారు. అంతే కాదు ఢిల్లీ, పూనా నుంచి కూడా నాకు ఆర్డర్లు వస్తున్నాయి’ అంది కాంత. కాంత ఈ పనిని అందరికీ నేర్పుతుంది. బహుశా వచ్చే సంవత్సరం నాటికి చాలాచోట్ల గోమయ వినాయకుడు దర్శనం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. చదవండి: మహా గణపతిం మనసా స్మరామి... -
గణేష్ చతుర్థి వేడుకలపై యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఆంక్షలు
-
మంచి పనులకు విఘ్నాలు తొలగాలి
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, అందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని, మీరు తలపెట్టే ఏ కార్యమైనా విఘ్నాలు లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు.#HappyGaneshChaturthi — YS Jagan Mohan Reddy (@ysjagan) September 10, 2021 (చదవండి: మహా గణపతిం మనసా స్మరామి...) -
మండపాలకు లంబోదరుడు
-
గణపతి బప్పా మోరియా...
-
వినాయక చవితి వేడుకలపై ఢిల్లీ ఆంక్షలు
న్యూఢిల్లీ: వినాయక చవితి వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వినాయక చవితి ఉత్సవాలపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గణేశ్ చతుర్థికి(సెప్టెంబర్ 10) మరో రెండు రోజులు మాత్రమే సమయమున్న నేపథ్యంలో డిల్లీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. బహిరంగ మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయకుండా జిల్లా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే సామూహిక ప్రదేశాలలో జనాలు భారీగా గుమిగూడకుండా చూడాలని పేర్కొంది. గణేశుడి ఊరేగింపులకు కూడా అనుమతి లేదని ఉత్తర్వులో పేర్కొంది. ప్రజలు ఇంట్లో పండుగను జరుపుకోవాలని డీడీఎంఏ సూచించింది. చదవండి: కోతుల గుంపు దాడి.. భయాందోళనతో బీజేపీ నాయకుడి భార్య మృతి బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు పేలుడు -
ఇంత బాధ్యతారాహిత్యమా? హైకోర్టు తీవ్ర అసంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్న తమ ఆదేశాలపై ప్రభుత్వ స్పందన సరిగా లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిమజ్జనం సమయంలో ఆంక్షలు, నియంత్రణల చర్యలపై తామిచ్చే ఆదేశాలను చూపించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే చేద్దామని భావించినా..ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. జల, వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుందని వ్యాఖ్యానించింది. విచారణకు కొన్ని నిమిషాల ముందు ఉదయం 10.25 నిమిషాలకు జీహెచ్ఎంసీ కమిషనర్ రిజిస్ట్రీలో నివేదిక సమర్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమలు బాధ్యత ఎవరిది? నగర పోలీసు కమిషనర్‌కు నివేదిక సమర్పించే తీరిక కూడా లేనట్టుందంటూ మండిపడింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో చేసిన భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారంగా మారుతోందని, వీటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఇచి్చన సూచనల అమలు బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. కరోనా, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వినాయక మండపాల ఏర్పాటు సమయంలో గుమిగూడకుండా, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై తగిన ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది. చదవండి: పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పును రిజర్వు చేసింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధించాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఇచి్చన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. కొన్ని నిమిషాల ముందు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకే‹Ùకుమార్ నివేదిక సమర్పించారని, మరికొన్ని నిమిషాల్లో నగర పోలీసు కమిషనర్ నివేదిక సమరి్పస్తారని ప్రభుత్వ న్యాయవాది నివేదించడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు దాఖలు చేసిన నివేదిక పరిశీలించే అవకాశం లేదని, నగర పోలీసు కమిషనర్‌కు నివేదికే ఇచ్చే సమయం కూడా లేదా అని మండిపడింది. చదవండి: హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా?.. హైకోర్టు ఆగ్రహం నివేదికలు ఎప్పుడు పరిశీలించాలి? విచారణను బుధవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘నాలుగు రోజుల క్రితం నివేదిక దాఖలు చేయాలని ఆదేశించినా విచారణకు కొన్ని నిమిషాల ముందు నివేదిక ఇచ్చారు. శుక్రవారం నుంచి హైకోర్టుకు సెలవులు. మీరిచ్చే నివేదికలు ఎప్పుడు పరిశీలించాలి ? ఇంకెప్పుడు మేం ఆదేశాలు ఇవ్వాలి ? సోమవారం ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తారా ? చివరి నిమిషంలో ఆదేశాలు ఇచ్చారు అమలు చేయలేకపోయాం అంటారు ? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు ? మీ నివేదికలతో సంబంధం లేకుండానే ఆదే శాలు జారీచేస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సలహాలు కాదు స్పష్టమైన మార్గదర్శకాలివ్వాలి మట్టి విగ్రహాలను మాత్రమే పెట్టుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఎక్కడికక్కడ నిమజ్జనం చేయాలని కోరుతున్నామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. సలహాలు ఇవ్వడం కాదని, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) చేసిన విగ్రహాలను పెట్టకుండా చూడాలని, అలాగే విగ్రహాల ఎత్తును కూడా తగ్గించేలా చూడాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సూచనలు చేసినా వాటిని ఎందుకు అమలు చేయడం లేదని పీసీబీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశి్నంచింది. ఏమిటీ పీసీబీ తీరు? కోరలు లేని పులిలా పీసీబీ వ్యవహరిస్తోందని, పీసీబీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన క్రషర్ యజమానులు తదితరులపై చర్యలు తీసుకున్న తరహాలోనే గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనంలో పీసీబీ సూచనలు ఉల్లంఘించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచింది. సీపీసీబీ సిఫార్సుల నేపథ్యంలో పీవోపీతో చేసిన విగ్రహాలను నిషేధించారా ? అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా..పీవోపీతో చేసిన విగ్రహాలు అంత ప్రమాదకరం కాదని ఎన్జీటీ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పీవోపీ చేసిన విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోతుందని, అలాగే పూడిక పెరిగి బండ్‌కు ప్రమాదం ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది. ఎన్జీటీ ఇచి్చన తీర్పు సముద్రాల్లో విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిందని, చెరువుల్లో నిమజ్జనానికి ఆ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. విగ్రహాల ఎత్తును 5 ఫీట్లకు మించకుండా చూడాలని, భారీ ఖర్చుతో జీహెచ్ఎంసీ నిరి్మంచిన తాత్కాలిక కుంటల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేసేలా చూడాలని పిటిషనర్ వేణుమాధవ్ నివేదించారు. అన్ని విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం ద్వారా పూడిక పెరిగిపోతోందని, చుట్టూ కట్టకు కూడా ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి కూడా హుస్సేన్‌సాగర్ కట్టకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. -
కేబీసీలో దీపికా, ఫరా సందడి: మాంచి మ్యూజికల్ ట్రీట్
సాక్షి, ముంబై: హిందీలో పాపులర్ రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ హవా మామూలుగా లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో ప్రస్తుత సీజన్లో కూడా అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతోంది. కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్-13లో రానున్న ఎపిసోడ్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, న్యత్య దర్శకురాలు ఫరా ఖాన్ సందడి చేయనున్నారు. ముఖ్యంగా రానున్న గణేష్ చతుర్థి సందర్భంగా (శుక్రవారం, సెప్టెంబరు 10) ప్రసారం కానున్న ఎపిసోడ్లో దీపికా, ఫరా ఖాన్ ఈ షోలో హంగామా చేయనున్నారు. తనదైన శైలిలో ఫరా పంచ్‌లు విసురుతోంటే దీపిగా పగలబడి నవ్వుతూ అభిమానులకు కనువిందు చేసింది. ఈ సందర్భంగా అమితాబ్ హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చదవండి : బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్యక్రమంలో మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ ఫైనలిస్టు తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ, విన్నర్ పవన్ దీప్ రాజన్, అరుణితా కంజిలాల్ తమ మ్యూజికల్ ట్రీట్‌తో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. అలాగే పవన్ దీప్ కూడా దీన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రానున్న ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చదవండి : కోటి రూపాయలను తలదన్నే కథ View this post on Instagram A post shared by Pawandeep Rajan (@pawandeeprajan) -
కర్ణాటక: వినాయక చవితి వేడుకలకు ఓకే.. కండిషన్స్ అప్లై
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో బహిరంగ స్థలాల్లో గణేశ్ చతుర్ధి ఉత్సవాలపై ఉత్కంఠ వీడిపోయింది. గరిష్టంగా అయిదు రోజులపాటు మండపాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పలు షరతులతో సమ్మతించింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలనపై పూర్తిగా నిషేధం విధించింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అధ్యక్షతన ఆదివారం బెంగళూరులో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ చవితి పండుగ ఆచరణ గురించి వెల్లడించారు. చదవండి: గణేష్ మండపాల ఏర్పాటులో ఈ జాగ్రత్తలు పాటించండి గణేశ్ ఉత్సవాలకు షరతులు ► కరోనా నియమాలతో సార్వజనిక గణనాథుల విగ్రహాల ప్రతిష్టాపనకు జిల్లా యంత్రాంగం అనుమతి తప్పనిసరి. తాలూకా, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అధికారుల అనుమతి ఉండాలి ►నగర ప్రాంతాల్లో వార్డుకు ఒకచోట మాత్రమే విగ్రహం ఏర్పాటు చేయాలి ►గణేశ ఉత్సవ సంఘాలవారు కోవిడ్ టీకా వేసుకోవాలి ►గణనాథుల మండపాల వద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ అభియాన్ నిర్వహించాలి ►మండపాల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు, డీజేలకు అనుమతిలేదు ►నిమజ్జన సమయంలో వాయిద్యాలు, ఊరేగింపులకు నో ►సరిహద్దు జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉన్నచోటే అనుమతిస్తారు. ►నగరాల్లో అపార్టుమెంట్లలో విగ్రహాలను ప్రతిష్టించవచ్చు. 20 మంది కంటే ఎక్కువ మంది గుంపుగా చేరరాదు. ►రాత్రి 9 గంటల తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి లేదు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి -
కేంద్రం సూచనలతోనే ఏపీలో ఆంక్షలు: నరసింగరావు
సాక్షి, విశాఖపట్నం: వినాయక చవితిపై దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు తెలిపారు. వినాయక చవితి పేరు చెప్పి ఏపీలో బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా కేసులు పెరిగితే బీజేపీ నేతలు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. కాగా త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఏపీలో కూడా కేంద్రం సూచనలతోనే వినాయక చవితిపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. అయితే ప్రజలు ఏమైనా పరవాలేదు, మాకు మత రాజకీయాలే ముఖ్యం అన్నట్లు రాష్ట్రంలోని బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు! -
గణేష్ మండపాల ఏర్పాటులో ఈ జాగ్రత్తలు పాటించండి
సాక్షి, పహాడీషరీఫ్: వినాయక చవితి ఉత్సవాలు అనగానే పక్షం రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలసికట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చిన్నారులలో వినాయక చవితి వేడుకలు పట్టలేనంతా ఉత్తేజాన్ని నింపుతాయి. ఇటు మండప నిర్వాహకులు.. అటు పోలీసు, మున్సిపాలిటీ, జలమండలి, విద్యుత్ విభాగాల అధికారులంతా చవితికి పక్షం రోజుల ముందు నుంచే నిమజ్జనం వరకు ఏర్పాట్లలో తలమునకలు కావాల్సి వస్తుంది. ఉత్సవాలను పురస్కరించుకొని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీసులు మండప నిర్వాహకులతో శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలను పాటించని కారణంగా ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. అప్రమత్తంగా ఉండటమే శ్రీరామ రక్ష అని పోలీసులు పలు సూచలను చేస్తున్నారు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి పకడ్బందీగా మండపాల ఏర్పాటు.. మండపాలకు కర్రలు, ఇనుప పైప్‌లు, రేకులను నాణ్యమైన వాటిని వినియోగించి పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలన్న పోలీసుల సూచనలను మండప నిర్వాహకులు పాటించాలి. ఇలా చేయడం ద్వారా గాలి, దుమారం వచ్చినప్పుడు మండపానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గణనాథుడి వద్ద దీపాలు వెలిగిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి దగ్గరలో అగ్నికి అంటుకునే స్వభావం కలిగిన వ్రస్తాలు, పూలదండలు, అలంకరణ సామగ్రి, పెట్రోల్, కిరోసిన్ లాంటి వాటిని ఉంచరాదు. దీంతో పాటు విద్యుత్ తీగల ముందు మండపాలను ఏర్పాటు చేయరాదు. నిమజ్జనానికి తరలించే సమయంలో గణనాథుడిని వాహనంలోకి ఎక్కేంచే క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉంటుంది. అందుకే అన్ని జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ ప్రమాదాలపై ప్రధాన దృష్టి పెట్టాలి... మండపాల నిర్వాహకులు ఎక్కువ మంది అధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోకుండా స్తంభాలకు వైర్లను వేలాడదీస్తుంటారు. విద్యుత్ ప్రమాదాలు జరిగేందుకు ఇక్కడే బీజం పడుతుంది. వదులుగా ఉన్న వైర్లు గాలి, వానకు కింద పడి విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తాయి. ఇలా కాకుండా అధికారిక కనెక్షన్ తీసుకోవడం ద్వారా విద్యుత్ అధికారులు అక్కడికి వచ్చి స్తంభం నుంచి కనెక్షన్‌ను ఇస్తారు. ఏదైనా విద్యుత్ సమస్య తలెత్తినా వెంటనే వారు స్పందిస్తారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంఖాల్‌లో గతంలో ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది ఈ కోవకు చెందిందే. భక్తిని మాత్రమే ప్రదర్శించాలి... వినాయక చవితి ఉత్సవాలలో నిర్వాహకులు భక్తిరసమైన పాటలను మాత్రమే పెట్టాలి. అలాకాకుండా సినిమా పాటలు పెట్టి పవిత్రతను దెబ్బతీయరాదు. దీంతో పాటు ఉత్సవాలు కొనసాగినన్నీ రోజులు నిర్వాహకులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండి పూజాది కార్యక్రమాలు చేయాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సూచిస్తున్నారు. -
మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితికి నాలుగు రోజుల ముందే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ చరిత్రలోనే ఇది మొదటిసారి. శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి పనులు పూర్తికావడంతో నిర్వాహకులు ఆదివారం కర్రలను పూర్తిగా తొలగించారు. ఏటా వినాయక చవితికి ఒక రోజు ముందు కర్రలు తొలగిస్తారు. కానీ.. ఈసారి నాలుగు రోజుల ముందే వీటిని పూర్తిగా తొలగించారు. చదవండి: ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ముస్తాబవుతున్న ఖైరతాబాద్ -
నేడు ఖైరతాబాద్ మహా గణపతికి నేత్రోత్సవం
-
నేడు ఖైరతాబాద్ మహా గణపతికి నేత్రోత్సవం
శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ నెల 10న వినాయక చవితికి నాలుగైదు రోజుల ముందే పనులు పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా 11 అడుగులకే పరిమితమైన మహాగణపతి విగ్రహ ఎత్తును ఈసారి 40 అడుగులకు పెంచారు. దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ సూచన మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ప్రజలను కాపాడేందుకు శివుడి రుద్ర అవతారమైన పంచముఖ రుద్ర మహాగణపతిగా నామకరణం చేశారు. (చదవండి: పాము, విభూతి, భస్మంతో బురిడీ, రూ.62 లక్షలు గోవిందా!) మహాగణపతి కుడివైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటుచేశారు. కాగా మహా గణపతికి శనివారం ఉదయం 11.30 గంటలకు నేత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. మహాగణపతికి కంటి పాపను పెట్టడం ద్వారా మహాగణపతికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు. –సాక్షి, ఖైరతాబాద్ -
ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ముస్తాబవుతున్న ఖైరతాబాద్
వినాయక చవితి.. ఆ పండుగకు ఉండే జోషే వేరు. గణేష్ మండపాలు, భారీ సెట్టింగులు, వీధికో వినాయకుడు, పెద్దఎత్తున పూజలు ఇలా ప్రతీదిగా సందడిగా ఉంటుంది. ఇక, నవరాత్రుల చివరి రోజున నిర్వహించే శోభాయాత్ర అయితే మామూలుగా ఉండదు. కిలోమీటర్ల మేర బారులు తీరిన గణనాథులను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. నాలుగైదు నెలల ముందు నుంచే విగ్రహాలు తయారైతే, నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. గణపతి బప్పా మోరియా… జైబోలో గణేష్ మహరాజ్ కీ జై… నినాదాలతో దేశమంతా మారుమోగిపోతుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఈ సందడి లేదు. అయితే ఈ ఏడాది మాత్రం వినాయక చవితికి మళ్లీ సందడి కనిపించనుంది. ఈసారి గణేష్ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మహా సంబరానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సెప్టెంబర్ 10న వినాయక చవితి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. గణేష్ విగ్రహాల తయారీ ఊపందుకుంది. ప్రతిమల ముస్తాబు చివరి దశకు చేరుకుంది. నవరాత్రుల బందోబస్తు, సామూహిక నిమజ్జనం తదితర ఏర్పాట్లకు సంబంధించి నగర పోలీసుల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడిని పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో తయారు చేస్తున్నారు. మరి ఆ ఆకారంలో రూపొందించడానికి కారణం ఏంటి?, ఈసారి ఎన్ని అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఖైరతాబాద్ మహా గణపతి తయారీకి సంబంధించిన విశేషాలను శిల్పి రాజేంద్రనాథ్ ‘సాక్షి’ డిజిటల్‌కు వివరించారు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూడండి. -
మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్
సాక్షి, బంజారాహిల్స్: ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 10వ తేదీనుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి తలసాని అధ్యక్షతన గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ప్రభుత్వ విప్ ప్రభాకర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్రవీంద్ర, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు రాఘవరెడ్డి, భగవంతరావు, ఖైరతాబాద్ బాలాపూర్ సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ. .సెప్టెంబర్10న విగ్రహ ప్రతిష్టతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 19న శోభాయాత్రతో నిమజ్జన కార్యక్రమం ముగుస్తుందన్నారు. చదవండి: ‘డబుల్’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్ మాదిరే ఇక్కడ కూడా ఎలాంటి ఆంక్షలు లేవు... ►విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆంక్షలు లేవని, నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లోని అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రతినిధులకు స్పష్టత నిచ్చారు. ►ఈ విషయంలో పోలీసులనుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ►పోలీస్ అధికారులు కూడా ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనిచేసేలా ఆదేశాలివ్వాలని డీజీపీకి మంత్రి సూచించారు. ►ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ధ్వంసం అయ్యాయని ఉత్సవకమిటీ నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్ని సోమవారం సందర్శించి మరమ్మతు పనులు చేపట్టాలని అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. ►ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనానికి గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోలీసులు సహకరించాలని, క్రేన్‌ను ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ విజ్ఞప్తి చేశారు. ►అత్యధిక విగ్రహాలను నిమజ్జనం చేసే హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, మీరాలం చెరువుల్లో పూడిక తొలగింపు పనులను చేపట్టాలని నిర్వాహకులు కోరగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ను ఆదేశించారు. ►దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీబీ ఆధ్వర్యంంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మల్లేశం, వాణీదేవి, దయానంద్ గుప్తా, కాటేపల్లి జనార్దన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటే‹Ù, హోంశాఖ ప్రత్యేక ప్ర«ధాన కార్యదర్శి రవిగుప్తా, మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్‌కుమార్, ఆర్అండ్బీ కార్యదర్శి సునీల్«శర్మ, ఈఎన్సీ గణపతి రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ పాల్గొన్నారు. -
సెప్టెంబర్‌లో 12 బ్యాంక్ హాలీడేస్!
Bank Holidays September 2021: వచ్చే నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 12 క్లోజింగ్ డేస్ రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో దాదాపు ఎక్కువగా మిగతా రాష్ట్రాల పండుగలే ఉండడం విశేషం. సెప్టెంబర్ 8 తిథి ఆఫ్ శ్రీమంత శంకర్దేవ సెప్టెంబర్ 9 తీజ్(హరిటలికా) సెప్టెంబర్ 10 వినాయక చవితి సెప్టెంబర్ 11 గణేశ్ చతుర్థి (2వరోజు) సెప్టెంబర్ 17 కర్మ పూజ సెప్టెంబర్ 20 ఇంద్రజాతర సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి డే చదవండి: హ్యాండ్‌క్యాష్.. అయినా ఈఎంఐలే ఎందుకు? పై లిస్ట్‌లో కేవలం వినాయక చవితి పండుగ నాడు మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంక్ లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తిథి ఆఫ్ శ్రీమంత శంకర్దేవకు గువాహటి, తీజ్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 10న అగర్తల, ఐజ్వాల్, భోపాల్, డెహ్రాడూన్, ఐజ్వాల్, భోపాల్, చంఢీగఢ్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, కొత్త ఢిల్లీ, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలో తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో వినాయక చవితికి సెప్టెంబర్ 10న బ్యాంకులు మూతపడనున్నాయి. అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్, పనాజీ గణేష్చతుర్థి మొదటి రోజుకు, పనాజీలో రెండో రోజుకు కూడా బ్యాంక్ సెలవులు తీసుకోనున్నాయి. కర్మపూజకుగానూ పనాజీ, ఏప్రిల్ 17న కర్మపూజలో భాగంగా రాంచీ, ఇంద్రజాతర కోసం గ్యాంగ్‌టక్, శ్రీ నారాయణ గురు సమాధి డే కొచ్చి-తిరువంతపురంలో బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. సెప్టెంబర్ 11 గణేశ్ చతుర్థి (2వరోజు) సెలవు.. రెండో శనివారం కారణంగా ఓవర్ లాప్స్ కానుంది. ఆర్బీఐ సాధారణంగా తన సెలవులను మూడు కేటగిరీలకు విభజిస్తుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలీడే అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం బ్యాంకులకు సెలవుల్ని నిర్ధారిస్తుంది ఆర్బీఐ. సెప్టెంబర్ 5 – ఆదివారం, సెప్టెంబర్ 11 – రెండవ శనివారం, సెప్టెంబర్ 12 – ఆదివారం, సెప్టెంబర్ 19 – ఆదివారం, సెప్టెంబర్ 25 – నాల్గవ శనివారం, సెప్టెంబర్ 26 – ఆదివారం.. బ్యాంకుల సాధారణ సెలవులు. -
వినాయక చవితి: ‘సూచనలు కాదు.. ఆదేశాలివ్వండి’
సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో వినాయక చవితి ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వినాయక నిమజ్జనంపై పూర్తి వివరాలు సమర్పించాలని మరోసారి హైకోర్టు అధికారులను ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. రసాయనాలతో కూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పేర్కొంది. సెప్టెంబరు1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను హైకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇళ్లల్లోనే మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామన్న ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే సూచనలు కాకుండా స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు తెలిపింది. సెంటిమెంట్లు మంచిదే కానీ, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు1కి హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు ఏపీ గృహ నిర్మాణశాఖ రివర్స్ టెండరింగ్‌తో భారీగా ఆదా -
స్వయంభూ గణేష్: వచ్చే ఏడాదైనా ప్లాన్ చేసుకోండి!
విద్యకు , విజ్ఞానానికి , వినయానికి అధిపతి వినాయకుడు. ఏ కార్యం తలపెట్టినా ముందుగా పూజలు అందుకునేది విఘ్నాలను తొలగించే ఆ బొజ్జ గణపయ్యే. అలాంటి ఆది దేవుడు ‘విఘ్నేశాధిపత్యం’ దక్కించుకున్న భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకొంటాం. చిన్నా, పెద్దా భక్తులందరికీ ఎంతో ఇష్టమైన లంబోదరుడి పండుగ అంటే సంబరాలు మామూలుగా ఉండవు. వాడవాడలా గణనాథులను కొలువుదీర్చి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగే గణేషుని ఉత్సవాలు ముంబైలో మరింత అట్టహాసంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మహమ్మారి కరోనా కారణంగా మునుపటిలా వేడుకలు నిర్వహించే వెసలుబాటు లేకుండా పోయినా.. ఉన్నంతలోనే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ గణపతిని పూజించేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కొలువుదీరిన తాత్కాలిక మంటపాలలో లంబోదరుడి ప్రతిష్టాపన మొదలైంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి రోజుకే పరిమితం గాకుండా మహారాష్ట్రలో ఏడాదంతా పూజలు అందుకునే స్వయంభూ విఘ్నేశ్వరాలయాల(అష్ట వినాయకయాత్ర) గురించి కొన్ని వివరాలు.. 1. శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న సిద్ధాటెక్ పట్టణంలో ఉంది. గజాననుడు ఇక్కడ శ్రీ సిద్ధి వినాయకగా కొలువుదీరాడు. సాధారణంగా అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. అయితే సిద్ధాటెక్లో గల ఈ దేవాలయంలో మాత్రం లంబోదరుడి తొండం కుడివైపునకు తిరిగి కనపడుతుంది. దీనితో పాటు ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. గుడి చుట్టూ పూర్తి ప్రదక్షిణ సుమారుగా 5 కి.మీ.ల వరకు వస్తుంది. 2. శ్రీ మయూరేశ్వర్ మందిర్/శ్రీ మోరేశ్వర్ టెంపుల్ పుణె జిల్లాలోని మోర్గావ్లో ఉంది ఈ ఆలయం. పుణె నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నదీ తీరంలో కొలువుదీరిన అష్టవినాయక యాత్ర టూర్లో ఇది మొదటిది అని చెప్పవచ్చు. ఈ దేవాలయానికి 50 అడుగుల ఎత్తుగల డోమ్ నాలుగు స్తంభాల ఆధారంగా నిలుస్తుంది. ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది. 3. బల్లాలేశ్వర దేవాలయం రాయ్‌గఢ్‌లో జిల్లాలోని పాలి గ్రామంలో కలదు. రోహా నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరస్‌గడ్ కోట, అంబా నదికి మధ్య కొలువుదీరిన ఈ ఆలయంలో గణనాథుడు రాతి సింహానం మీద ఆసీనుడైన బల్లాలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. గజాననుడి అపర భక్తుడైన బల్లాల్ పేరు మీదుగా దీనికి బల్లాలేశ్వర ఆలయం అని నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పాలిలో సంపన్నుడైన వ్యాపారవేత్త కళ్యాణ్, తన భార్య ఇందుమతి, కొడుకు బల్లాల్‌తో కలిసి నివసించేవాడు. ఆ ఊరిలో పిల్లలంతా రాళ్లను దేవతా మూర్తులుగా భావిస్తూ పూజలు చేస్తూ ఆటలాడుకునేవారు. అలా ఓ రోజు గ్రామ శివారులో ఓ పెద్ద రాయిని చూసిన బల్లాల్.. దానిని గణేషుడిగా పేర్కొంటూ పూజలు చేయడం ప్రారంభించాడు. ఆకలిదప్పులు మరచి పిల్లలంతా గణనాథుని స్మరణలో మునిగిపోయి రేయింబవళ్లు అక్కడే ఉండిపోయారు. దీంతో పిల్లల జాడ తెలియక కంగారుపడిన పెద్దలంతా అకకడి చేరుకుని, దీనికంతటికి బల్లాల్ కారణమంటూ తిట్టిపోస్తూ తండ్రి కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన కళ్యాణ్ కొడుకు లాక్కొచ్చి చెట్టుకట్టేసి విపరీతంగా కొట్టాడు. అంతేగాక గణేషుడిగా పూజలు అందుకున్న రాయిని పగులగొట్టాడు. నిన్ను కాపాడటానికి ఎవరూ రారు అంటూ దేవుడిని తిడుతూ బల్లాల్ను అక్కడే వదిలి వెళ్లిపోతాడు. తన ఇష్టదైవాన్ని దూషించడంతో తండ్రిపై కోపగించుకున్న బల్లాల్ అతడి కళ్లు పోవాలని శపిస్తాడు. ఆ తర్వాత ఒక్కడే ఒంటరిగా అక్కడ ఉండిపోయి లంబోదరుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. బల్లాల్ బాధను చూడలేక సాధువు రూపంలో వచ్చిన గజాననుడు అతడి గాయాలన్నింటి మాన్పి, ఏం కావాలో కోరుకోమని అభయమిస్తాడు. ఇందుకు ఆ బాలుడు.. ‘‘నువ్వు ఇక్కడే కొలువుదీరి.. శరణుజొచ్చిన వారిని కాపాడు తండ్రి’’అని కోరతాడు. బల్లాల్ కోరికను మన్నించిన పార్వతీ పుత్రుడు అతడిని ఆలింగనం చేసుకుని, నా పేరు ముందు నీ పేరును జోడించి బల్లాలేశ్వరుడిగా కొలువుదీరతాను అని చెబుతాడు. లంబోదరుడు నిజంగా దేవుడు ఉంటే నిన్ను రక్షిస్తాడని అనికలిసి ఈ దేవాలయాన్ని మోరేశ్వర్ విఠల్ సింద్కర్ 1640లో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 4. గిరిజాత్మజ దేవాలయం పుణె జిల్లాలోని లెన్యాద్రి(గణేష్ పహర్ లేదా సులేమాన్ గుహలు)లో ఉంది. హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీ దేవి పుత్రుడైన(గిరిజ ఆత్మ నుంచి వచ్చినవాడు) వినాయకుడిని కేవ్ నంబర్ 7 వద్ద దర్శించుకోవచ్చు. ఇందుకోసం సుమారు 300 మెట్లు ఎక్కాలి. కాస్త కష్టంతో కూడుకున్నదైనా పైకి వెళ్లినట్లయితే లంబోదరుడితో పాటు కొండ చుట్టుపక్కల గల ప్రకృతి అందాలన వీక్షించవచ్చు. 5. చింతామణి దేవాలయం చింతామణి దేవాలయం ధేయూర్ లో కలదు. పుణెకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి గణపతి బ్రహ్మకుగల చింతను తొలగించే నిమిత్తం ఆయన ధరించిన చింతామణి(ఆభరణం) రూపం కలిగి ఉంటాడు. అష్టవినాయక ఆలయాల్లో ఇది పెద్దది. 6. విఘ్నేశ్వర దేవాలయం పుణెకు 85 కిలోమీటర్ల దూరంలో గల ఓజార్ వద్ద కూకడి నది తీరాన గల విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం, గోపుర శిఖరాన్ని బంగారంతో తయారు చేశారు. ఓజార్ పూనే - నాశిక్ రోడ్ పై గల నారాయణగావ్ మరియు జున్నార్ ల నుండి ఇది 8 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాలనుండి ఓజార్ కు ఆటో రిక్షాలో వెళ్లవచ్చు. 7. మహాగణపతి దేవాలయం పుణె జిల్లాలోని రాజన్గావ్లో కలదు. మహాగణపతి దేవాలయం తూర్పు వైపు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎంతో పెద్దగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడే జయ విజయులనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చూడవచ్చు. 8. వరదావినాయక దేవాలయం మహాడ్ గ్రామంలో వరదా వినాయక దేవాలయం కలదు. పరిసరాల్లో గల ఒక సరస్సు ఒడ్డున లభించిన విగ్రహాన్ని దేవాలయం లోపల ప్రతిష్టించారు. 1725లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పీష్వా పాలకులు దీనిని పునరుద్ధరించారు. 1892 నుంచి ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. స్వయంభూ వినాయకుడితో పాటు మూషిక, నవగ్రహ దేవతలు, శివలింగం కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్ఠాదశ శక్తి పీఠాల వలె అష్ఠ గణపతులు కూడా పురాతనమైనవి. గణేష, ముద్గాల పురాణాలలో వీటి ప్రస్తావన ఉంది. ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే క్షేత్రాలుగా భాసిల్లుతున్న ఈ ఆలయాలను కరోనా అంతమైన తర్వాత హాయిగా కుటుంబంతో కలిసి దర్శించి తరించండి. -
గణేశ్ చుతుర్ధి: సెలబ్రిటీల పూజలు
-
మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం
సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ చూడని కష్టకాలం ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసింది. హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి రానే వచ్చింది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడంతా తమ తమ ఇళ్లల్లోనే లంబోదరుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తగు జాగ్రత్తలతో పండుగ జరుపుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్విటర్ వేదికగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇది తాత్కాలికమే, ధైర్యంగా ఉండండి: చిరంజీవి కరోనా వైరస్ విజృంభణతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అందరి జీవితాలు ప్రభావితమయ్యాయి. ఇది తాత్కాలిక ఇబ్బంది మాత్రమే. మునుపటిలా ఎవరిపనుల్లోకి వాళ్లు వెళ్లే రోజులు త్వరలోనే వస్తాయి. అందరం ధైర్యంగా నిలబడదాం. షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకనే కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) తరపున మూడోసారి సినీ కార్మికులకు సాయం చేసేందుకు నిర్ణయించాం. గణేష్ చతుర్థి నేపథ్యంలో వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 వేల మందికి ఈ సాయం అందుతుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిర్లక్ష్య ధోరణితో ఉంటూ కుటుంబాన్ని, జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టకండి. జాగ్రత్తగా ఉంటూ సురక్షితంగా ఉండండి. ఈ సమయంలో ఆరోగ్యమే అన్నిటికన్నా అతి ముఖ్యమైందని గుర్తుంచుకోండి. సూపర్‌స్టార్ మహేష్ బాబు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాదో వినయపూర్వక అభ్యర్థన. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గుంపులుగా చేరకండి. దయచేసి పర్యావతరణ హిత గణేష్ ప్రతిమలను ప్రతిష్టించండి. అందరూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని కోరుకుంటూ మీ మహేష్. మాస్ మహరాజ రవితేజ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరి కష్టాలు తొలగిపోయి మంచి రోజులు రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. దయచేసి అందరూ పర్యావరణ హిత గణేష్ ప్రతిమలనే ప్రతిష్టించండి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుంపులుగా చేరకుండా జాగ్రత్తలు పాటించండి. క్షేమంగా ఉండండి. -
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత వినాయకుడు. విఘ్నాలను తొలగించి సకల అభిష్టాలను సిద్ధింపజేసే ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని, కరోనాకష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్ధిస్తూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. (చదవండి : వైద్యం.. మరింత చేరువ ) -
దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: అందరితో కలిసి ఇంట్లోనే ఆనందంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు సూచించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుని దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే పండుగ వినాయక చవితి అని అన్నారు. దీని ద్వారా బాలగంగాధర్ తిలక్ సామూహిక సమావేశాలతో జాతీయవాద భావాలను వ్యాప్తి చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మట్టితో చేసిన సహజమైన వినాయకుని ప్రతిమలతో వినాయకచవితి పర్వదినాన్నిమార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్ళలోనే జరుపుకోవాలని సూచించారు. భక్తి ప్రపత్తులతో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మికత, ఆనందాల సమ్మిళితంగా పర్యావరణాన్ని పరిరక్షించే వేడుకగానే ఈ ఉత్సవాలను భావించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతిని-సంస్కృతిని సమతుల్యం చేస్తూ సుసంపన్నమైన మానవాళి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చదవండి: ‘సాక్షి’ చూస్తూ ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేశా తయారీ.. -
గణేష్ విగ్రహాలపై కరోనా ఎఫెక్ట్..
-
ఆస్ట్రేలియాలో గణేష్ చతుర్థి వేడుకలు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. టీమ్ ఎన్విజన్ విద్యార్థులు 14 రోజులు పాటు దేవుడికి దూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి గణేష్ ఉత్సవాలను జరిపారు. దాదాపు 2 వేల మంది తెలుగు విద్యార్థులు, తెలుగు ఎన్ఆర్ఐలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. లేబర్ పార్టీ ఎంపీ నటాలీ హాచిన్స్ కూడా గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ.5 లక్షలకు గణేషుడి లడ్డూను ఆస్ట్రేలియా అల్లుడు సోషల్ మీడియా ఛానల్, డెలీషియస్ మెల్బోర్న్ టీమ్ దక్కించుకుంది. లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బును తెలుగు విద్యార్థుల చారిటీ నిధులుగా వాడుతామని టీమ్ ఎన్విజన్ నిర్వాహకులు అరుణ్ సోనిక్ అండ్ టీమ్ తెలిపారు. -
గణపతి పండగ అంటే ఆమాత్రం ఉంటుంది మరి!
రెండో పీరియడ్ ఫైనలియర్ బీయస్సీ క్లాస్‌లోకి అడుగుపెట్టి ఆశ్చర్యపోయాను. సగం పైన బెంచీలు ఖాళీ. ‘‘ఏమయింది అందరికీ?’’ నా ప్రశ్నకు కోరస్లో సమాధానం... ‘‘మన్నాడు బెనకప్పపండగ్గద మేడమ్. అంతా టవునుకుపొయినారు.’’ ‘‘పండగ ఎల్లుండయితే ఇప్పుడే వినాయకుణ్ణి తెచ్చిపెడతారా?’’ నొసలు చిట్లించాను. ‘‘పెట్టేకి కాదు మేడమ్, అమ్మేకి బొమ్మలు తెచ్చుకుంటారు.’’ సమాధానం నన్ను ఆశ్చర్యపరచలేదు. విత్తనాలప్పుడు, కోతలప్పుడు ఎగవేతలు మామూలే. కరువు తీవ్రమయ్యాక గైర్హాజరీ మరీ పెరిగిపోయింది. బెంగుళూరులో పనుల కోసం పోయి పరీక్షలప్పుడు వస్తారు. మిగిలినకొద్దిమంది కూడా సందర్భానుసారం కుటుంబ ఆర్థికపరిస్థితిని కాస్త ఎగదోయడానికి ఇలా కాలేజీకి నామం పెడుతుంటారు. పిలవక పోయినా వచ్చి కూర్చునే అతిథిలాంటి కరువు అనంతపురం జిల్లా వాళ్ళకు, అందులోనూ ఇంకా వెనుకబడిన కళ్యాణదుర్గంలాంటి ప్రాంతాలకు ఇది మామూలే. వాళ్ళ గైర్హాజరీని ఏమీ అనలేని నిస్సహాయ పరిస్థితి నాలాంటి లెక్చరర్లది. ఓవైపు వీధుల్లో గణపతి విగ్రహాలప్రతిష్టాపన కోసం చందాలు వసూలు చేసి చిందులేసే కుర్రకారు, మరోవైపు బ్రతుకుపోరులో పండగలఆసరా పొందే యువతరం. మనసు పొరల్లోబాధను అలాగేఅదిమిపట్టి, ‘‘ఇంతకూ మీరు తెచ్చే గణపతిబొమ్మలు దేనితో చేస్తారు?’’ అడిగాను. ‘‘ఇదేం ప్రశ్న?’’ అన్నట్టు‘‘పీవోపీ మేడమ్’’ మూకుమ్మడిగా అరిచారు. ‘‘అది పర్యావరణానికిహాని చేస్తుంది తెలుసా? మన ఆరోగ్యానికి కూడా మంచిదికాదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా బంకమట్టి దొరకదా? మనం బంకమట్టితో గణపతి బొమ్మచేద్దాం.’’ ‘‘వానలే లేవుగదా మేడమ్, శరువులన్నీఎండిపొయినాయి, బంకమన్ను యాడదొరుకుతాది?’’ పిల్లలు ఎదురుప్రశ్న వేశారు. ‘‘చూడండ్రా నాయనా ఎక్కడన్నా దొరుకుతుందేమో! మనం ఎకో ఫ్రెండ్లీ వినాయకుణ్ని తయారుచేయాలి.’’ బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా మా కెమిస్ట్రీడిపార్టుమెంటు తరఫున మేం పెట్టుకున్న యాక్టివిటీ అది. ‘‘మా ఊరి కాడ ఉంటాదిలే మేడమ్. రేపేసకస్తాం’’ కంబదూరు నుంచి వచ్చే పిల్లలు హామీ ఇచ్చారు. ‘‘ఎట్లన్న గానీ ఒక గంపకు తీసుకురాండ్రా. తెచ్చినవాళ్ళకు మంచి బహుమతికూడా.’’ ఆశ పెట్టాను. నా మాట వృథాపోలేదు. మరుసటిదినం ఓ పెద్దగోనెసంచికి బంకమట్టి మోసుకొచ్చారు కంబదూరు పిల్లలు. వాళ్ళ ఉత్సాహాన్ని మెచ్చుకొని మంచి పెన్నులు బహుమతిగా ఇచ్చాను. ఆఖరి రెండు పీరియడ్లు బంకమన్నుతో గణపతి విగ్రహాలు చేసేపని పెట్టాము. మొదట రెండు వీడియోలు స్క్రీన్ పైన చూపించాము ఒక ఐడియా కోసం. పిల్లలు గ్రూపులుగా, జంటలుగా, ఒక్కొక్కరుగా ఎవరికీ తోచినట్లు వాళ్ళు ప్రతిమలు చేయడం మొదలు పెట్టారు. వీడియోలో చూపించినట్లు యథాతథంగా చేసేవాళ్ళు కొద్దిమంది, ఎక్కువ మంది వాళ్ళ స్వంత తెలివితో, నైపుణ్యంతో భిన్న రకాలుగా ప్రతిమలు చేశారు. భిన్న ఆకారాల్లో, వేర్వేరు పరిమాణాల్లో 30 ప్రతిమలు తయారయ్యాయి గంటలో. కొలువుతీరిన బొమ్మలు రంగుల్లేకపోయినా ముచ్చట గొలుపుతున్నాయి. ప్రిన్సిపాల్ మేడమ్, ఇతర స్టాఫ్ ఈ పర్యావరణ మిత్ర వినాయకుడి గొప్పతనాన్ని వివరిస్తూ మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన ప్రతిమలను నిమజ్జనం చేసినపుడు నీటి కాలుష్యానికి కారణమవుతాయని, రసాయన రంగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వివరించి చెప్పారు. ‘‘ఇప్పుడీ వినాయకులను ఏం చేద్దాం?’’ అడిగాను. ‘‘మేడమోళ్ళకు, సారోల్లకు ఇస్తాం మేడమ్.’’ అందరినీ పిలిచి తలో ప్రతిమను అందజేశారు. ‘‘మేడమ్, నా గణపతి బొమ్మను మీరే తీసుకోవల్ల.’’ ఫస్టియర్ దేవేంద్ర ఇచ్చాడు. అన్నిటి కంటే చిన్నగా ముద్దుగా ఉంది బొమ్మ. కాదనలేక తీసుకున్నాను గానీ ఏం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. చిన్నప్పట్నుంచీ ఎప్పుడూ వినాయక చవితికి ఇంట్లో విగ్రహం పెట్టిన ఆనవాయితీ లేదు. ‘‘దేవుడి పటాల్లో వినాయకుడి పటం కూడా ఉంది కదా, విగ్రహం అక్కర్లేద’’ నేది అమ్మ. బొద్దుగా ఉన్న మా తమ్ముణ్ణి చూసి, ‘‘వీడికే ఓ తొండం పెడితే సారి, అచ్చు వినాయకుడి లాగానే ఉంటాడు.’’ జోకేవాళ్ళు చుట్టుపక్కల జనం. పెరిగేకొద్దీ పెద్ద కోరికలేమీ లేకపోవటం మూలాన దేవుడితో పనిబడలేదు నాకు, కనుక ఏ దేవుడికీ ఇంట్లో అవకాశం లేకపోయింది. ‘‘ఇప్పుడీ బొమ్మను నేనేం చేసుకోవాలి?’’ నా గురించి తెలిసిన సీనియర్ లెక్చరర్ పార్వతి మేడమ్‌తో అన్నాను. ‘‘ఉండనివ్వమ్మా, పిల్లలంత ప్రేమగా ఇచ్చారు కదా, ఇంట్లో షోకేస్‌లో పెట్టుకో.’’ ఆమె మాటలతో ఖాళీ చాక్ పీస్ డబ్బాలో ప్రతిమ జాగ్రత్తగా పెట్టి, లంచ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను. ‘‘మీ ఇంట్లో కూచో బెట్టినాక ఫోటోలు తీసి వాట్సప్‌లో పెట్టండి మేడమ్.’’ దేవేంద్ర రిక్వెస్ట్‌గా అన్నాడో, కమాండింగా అన్నాడో అర్థం కాలేదు. పంటల్లేక పోయినా ప్రతివాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండుదో, చీప్‌గా దొరికే చైనాదో స్మార్ట్ ఫోన్ మాత్రం తప్పకుండా ఉంటుంది. ‘‘ఈ గణపతి విగ్రహాన్ని ఎలా కూర్చోబెడతారో ఏమీ తెలీదు మేడమ్ నాకు.’’ బస్సులో పక్కనే కూర్చున్న పార్వతి మేడమ్ నా ప్రశ్నతో నవ్వేశారు. ‘‘పద్ధతిగా కూర్చోబెట్టి పూజ చేసే భక్తులెవరూ లేరు. వాళ్ళకు తోచిన ఆకులు, పూవులేవో పెడతారు. నువ్వూ అలాగే నీకు తోచిన పద్ధతిలో డెకరేట్ చేయి. మరీ పర్ఫెక్ట్గా కావాలనుకుంటే క్లాక్ టవర్ దగ్గర దిగు, రకరకాల పత్రాలు, కాయలు, పూలు అమ్ముతుంటారు కొనుక్కెళ్ళు.’’ సలహా ఇచ్చారు. అనంతపురం బైపాస్ దగ్గరికి చేరేసరికి సాయంత్రం నాలుగున్నరయింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం రావడానికి గంటన్నర పడితే, బైపాస్ నుంచి టవున్లోకి వెళ్ళడానికి ట్రాఫిక్ పుణ్యమా అని గంట పట్టింది. క్లాక్ టవర్ చుట్టూ రోడ్ల మీద గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి, పండ్లూ, పూలూ అమ్మే వాళ్ళతో మూడొంతులు రోడ్డు మూసుకుపోయింది. ‘‘పండగొచ్చిందంటే చాలు, జనమంతా రోడ్ల మీదే, కరువెక్కడికి పోతుందో నాకర్థం కాదు.’’ చిరాగ్గా అన్నాను. ‘‘కరువు రోడ్డు మీదికొచ్చింది. సరిగ్గా చూడు, ఆ పత్రీ, పూలూ అమ్మేవాళ్ళంతా పేద రైతులు. కొనేవాళ్ళు మనబోటి ఉద్యోగులు. ఎక్కడెక్కడో కొండల్లో, గుట్టల్లో పత్రీ, ఆకులు ఏరుకొచ్చి, కొనుక్కొచ్చి, అవేవీ దొరకని మన కాంక్రీట్ వనాల్లో భక్తాగ్రేసరులకు అమ్మి పుణ్యం సంపాదించి పెడతారు.’’ పార్వతి మేడమ్ మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. ‘‘వీళ్ళు పాపం రోడ్డుకు పక్కగా కింద కూచునే అమ్ముతున్నారు. ఒక్కసారి డిసెంబరు 31 గుర్తు చేసుకో, ఈ క్లాక్ టవర్ చుట్టూ ఎలా ఉంటుందో...!’’ ఆవిడ మాటలు పూర్తికాకనే పెద్ద పెద్ద బేకరీలు, స్వీట్ షాపులు రోడ్డు మొత్తం ఆక్రమించి, షామియానా వేసి, టేబుళ్లు వేసి, రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో, ఆఫర్లతో హోరెత్తించే నా కళ్ళముందు దృశ్యం మెదిలింది. ‘‘ఆర్ట్స్ కాలేజ్ దిగండి.’’ కండక్టర్ అరుపుతో బస్సు దిగాము ఇద్దరమూ. మళ్ళీ వెనక్కి క్లాక్ టవర్ దగ్గరికొచ్చి అన్నీ చూస్తూ నెమ్మదిగా నడవసాగాము. ‘‘గరిక గావాల్నామ్మా?’’ ‘‘గరిక, పత్రి అన్ని రకాలూ ఉండాయి రామ్మా.’’ అంతా కేకలేసి పిలుస్తున్నారు. కార్పొరేట్ స్టైల్లో నీటుగా ప్యాక్ చేసి బిజినెస్ చేసే టెక్నిక్ తెలియక, నోటిని మాత్రమే నమ్ముకున్నవాళ్ళు పాపం. ఓ పెద్దావిడ దగ్గరికెళ్ళాము. ‘‘ఇదేమాకు? ఇదేంది? అదేంది?’’ నా ప్రశ్నలతో నా అజ్ఞానాన్ని కనిపెట్టేసింది ఆమె. ‘‘ఇది గరిక. ఇది ఉత్రేనాకు. అదేమో బిల్లిబిత్తిరాకు.’’ ‘‘బిల్లిబిత్తిరాకా? అదేంటి మేడమ్, తమాషాగా ఉంది పేరు.’’ నవ్వాను. ‘‘బిల్వపత్రం తల్లీ. అంటే మారేడు ఆకులు. ఇది బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకులు. ఇంకా గన్నేరు, తులసి నీకు తెలుసు కదా.’’ ‘‘ఇవి మా ఇంటి దగ్గర ఉన్నాయి మేడం. ఇది ఉమ్మెత్త కదా. ఇదేమో జిల్లేడు. అంతేనా?’’ నాక్కూడా తెలుసన్నట్లు గర్వంగా చూశా. ‘‘హమ్మయ్య బతికించావు. సరేలేమ్మా, ఇవన్నీ ఎంతకిస్తావు?’’ పెద్దావిడను అడిగారు. ‘‘అన్ని రకాలూ కలిపి నూట యాబై రూపాయలమ్మా.’’ ‘‘డెబ్భై ఇస్తాం, ఇస్తావా లేదా చెప్పు.’’ మేడమ్ బేరంతో దిమ్మ తిరిగింది నాకు. నేనయితే నూటా నలభై, నూటా ముప్పయి కి అడిగి ఉండేదాన్ని. ‘‘నూటా ఇరవై కిస్తా, ఇష్టమైతే కొనుక్కో లేకపోతే లేదు.’’ కరాఖండిగా చెప్పిందామె. ‘‘ఇంకో చోట చూద్దాం రా.’’ పార్వతి మేడమ్ పక్కకు లాక్కెళ్ళారు. ‘‘నూర్రూపాయలిస్తారా?’’ ఆమె మాట వినిపించుకోలేదు. ఇంతలోనే అక్కడేదో గలాటా. ఒకాయన గణపతి విగ్రహాలు చూస్తూ ఓ విగ్రహం జారవిడిచాడు. అది కాస్త పగిలిపోయిందని బండి మీది కుర్రాడి ఏడుపు. ‘‘డబ్బులియ్యి సార్. పడేసింది నువ్వే కదా.’’ అంటూ అతని చెయ్యి పట్టుకొని అరుస్తున్నాడు. ‘‘నువ్వే సరిగ్గా పెట్టుకోలేదు. నేనేంటికిస్తా.’’ బలవంతంగా చెయ్యి విడిపించుకొని పరుగులాంటి నడకతో పారిపోయాడు. కుర్రాడు పట్టుకోవాలని చూశాడు, కానీ వెంటపడదామంటే ఇక్కడ ఇన్ని విగ్రహాలనొదిలి పోలేక తిట్టుకుంటూ వెనక్కి వచ్చాడు. వాడి ముఖంలో మా కాలేజీ పిల్లలు కనిపించారు నాకు. ఇంటిముందు అలకడానికి పసుపుపచ్చ రంగుపొడి ప్యాకెట్లు, ముగ్గుల్లోకి రంగులు బండ్ల మీద అమ్ముతున్నారు. పేడ దొరకడం గగనమైపోవడంతో పాటు, వాసనంటూ కొందరు ముట్టుకోవడం మానేశారు. మంచిదే కదా, నవ్వుకున్నాను. ‘‘ఎలక్కాయలు... ఎలక్కాయలు.’’ మరోబండి మీద వెలగపండ్లు అమ్ముతున్నారు. ‘‘వెలగపండ్లంటే నాకు చాలా ఇష్టం. కొనుక్కుందామా మేడమ్?’’ ‘‘వినాయకుడి కోసమొద్దు నీకోసం కావాలన్నమాట.’’ ‘‘దేవుడి పేరు చెప్పినా, తినేది మనుషులే కదా మేడమ్, వెలగపండుకు చిన్నగా రంధ్రం చేసి బెల్లం కూర్చి కలిపి తింటే భలేగా ఉంటుంది.’’ నా నోట్లో అప్పుడే నీళ్లూరుతున్నాయి. ‘‘అబ్బో నీక్కూడా బాగానే తెలుసే. సరే పద, నీ సరదా ఎందుక్కాదనాలి?’’ అంటూ ‘‘ఎంత కిస్తావు బాబూ వెలగపండ్లు?’’ ‘‘జత ఎనవయ్యమ్మా.’’ ‘‘అయ్యబాబోయ్ ఎనభయ్యా? పదండి మేడమ్ వెళదాం.’’ ‘‘ఎంతిస్తారో సెప్పండమ్మా’’ ‘‘వద్దులే నాయనా, బేరమాడేటట్లు చెప్పావా?’’ అంటూ కదిలాం. ‘‘పండగరోజు ధరలు ఇలాగే ఉంటాయి. తినడం వరకే కావాలంటే రెండు రోజులాగి కొనుక్కో. ధరలు తగ్గిపోతాయి.’’ పార్వతిమేడమ్ సలహా ఇచ్చారు. ‘‘మేడమ్ అటు చూడండి, అక్కడ ఫైనలియర్ ఎమ్పీసి హనుమంతు కదూ, గరిక, పత్రి అమ్ముతున్నది.’’ ‘‘అవునమ్మా. పద చూద్దాం.’’ సెకండియర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు హనుమంతు. ఇటీవల తండ్రి అప్పుల బాధతో, పంటలు రాక ఆత్మహత్య చేసుకున్నాడు. చేనుకు పోవాలంటూ అడపాదడపా క్లాసులు ఎగరగొడుతుంటాడు. ‘‘హనుమంతూ!’’ మమ్మల్ని చూసి తడబడ్డాడు హనుమంతు. ‘‘మేడమ్మీరా? నమస్తే మేడమ్. మా అమ్మకు ప్యానం బాగాలేదు మేడమ్. అందుకే నేను పెట్టినాను.’’ సంజాయిషీ ఇస్తున్నట్లుగా చెప్పాడు. ‘‘పోనీలే హనుమంతూ, అమ్మకు సాయం చేస్తున్నావు. మంచిదేగా. ఎక్కడ్నుంచి తెచ్చావు ఈ సామగ్రంతా?’’ ‘‘మా ఊరవతల గుట్టల్లో పీక్కోనొచ్చినా మేడమ్. ఇంగరోన్ని మా చేని గట్ల మింద ఉండాయి.’’ దాదాపు 10–12 రకాల పత్రి, ఆకులతో పాటు మామిడాకులు, అరిటాకులు కూడా పెట్టుకొని అమ్ముతున్నాడు. ‘‘ఎలా సాగుతోంది వ్యాపారం?’’ పార్వతి మేడమ్ అడిగారు. ‘‘ఏం జరుగుతాది మేడమ్? ఇయ్యన్నీ ఏరుకోచ్చిండేయే గదాని ఉద్దరగ్గావాలంటారు. అయి పీక్కొచ్చేకి దినమంతా గుట్టల్లో తిరిగి, కంపలు గీసుకొని ఎన్నెన్ని తిప్పలు బడినామని. ఏందో పున్న్యానికి ఇచ్చిపోయినట్లు పదో పరకో చేతిలో పెడతారు. ఇంగ బజార్లో గనపతిని నిలబెట్టేకయితే దవుర్జన్నెంగా తీసకపోయే నాకొడుకులే.’’ బాధ, కోపం కలిపి చెప్పాడు. ‘‘మొత్తం అన్ని రకాలూ కలిపి ఎంతవుతుంది?’’ నా ప్రశ్నకు ఇబ్బంది పడుతూ, ‘‘మీకేం గావాల్నో తీసుకోండి మేడమ్.’’ చెప్పాడు. ‘‘నేను కొనటానికి కాదురా, వివరం కోసం అడుగుతున్నాను.’’ పార్వతి మేడమ్నవ్వుతూ, ‘‘మీ మేడమ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు లేరా, చెప్పు.’’ అన్నారు. ‘‘అరిటాకు, మామిడాకులు అన్నీ కలిసి యాబై రూపాయలు మేడమ్. అయినా ఎవరూ అన్నీ కొనక్క పోరు. ఏవో అగ్గవకు సిక్కేవి తీసక పోతారంతే.’’ ‘‘సరే, నాకు రకానికింత అన్నీ ఇవ్వు.’’ నా మాటలకు హనుమంతు ఆశ్చర్యంగా చూశాడు. ‘‘ఇవ్వు నాయనా, మీ మేడమ్ మొదటి సారి వినాయక చవితి చేసుకోబోతోంది.’’ పార్వతి మేడమ్ మాటలతో వాడు మరింత అయోమయంలో పడ్డాడు. ‘‘ఇవ్వు హనుమంతూ,’’ నా మాటలతో అన్నీ ఓ కవర్లో సర్ది అరిటాకు మాత్రం చుట్టి చేతికిచ్చాడు. ఐదొందల నోటు తీసి హనుమంతు చేతిలో పెట్టాను. ‘‘వొద్దు మేడమ్, మీ తాన తీసుకోరాదు.’’ తిరిగి కవర్లో పెట్టాడు. ‘‘గురువుల మాట కాదనరాదు, తీసుకో.’’ భయపెట్టి చేతిలో ఉంచి ఆటో పిలిచాను. ‘‘మేడమ్ చిల్లర.’’ ‘‘రేపు మీ వినాయకుడికి కుడుములు చేసి నైవేద్యంగా పెట్టు.’’ అంటూ వెనక్కి చూడకుండా ఆటో ఎక్కేశాము. - ఎం.ప్రగతి -
పండగ వేళ
-
వినాయక వీడ్కోలు!
-
పండగ వేళ
-
పండగ వేళ
-
‘మహా’భక్త సందోహం..
-
పండగ వేళ
-
పండగ వేళ
-
పండగ వేళ
-
తరలివచ్చిన తారాగణం
-
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గణపతి పూజ
-
నేటి నుంచి వినాయకచవితి వేడుకలు
-
వినాయక ఉత్సవాలకు సిటీ సిద్ధం
-
బడ బడ బడా దబ దబ దబా
వినాయకచవితి వస్తుందంటే లేదా వచ్చిందంటే బాగా గుర్తుకు వచ్చేది బడ బడ బడా...దబ దబ దబా!ఏ ప్రాంతంలోనైనా ఉందో లేక మా ప్రాంతంలో మాత్రమే ఉందో తెలియదుగానీ చవితి రోజు తిట్లు తింటే శుభం జరుగుతుందనే గట్టి నమ్మకం మా ఊళ్లో ఉండేది. ‘ఇంట్లో వాళ్లు, బంధువుల తిట్లు పనికిరావు. కేవలం బయటి వాళ్ల తిట్లే వర్కవుటవుతాయి’ అనేది కూడా మరో నమ్మకం.మా ఊళ్లో ముక్కోపి రావుగోపాలరావు అని అంతెత్తు మనిషి ఉండేవాడు. ఆయన అసలు పేరు గోపాలు. విలన్లా ఉంటాడని, కంచుకంఠం ఆయన సొంతంఅని కావచ్చు....గోపాలును అందరూ రావుగోపాల్రావు అని పిలుచుకునేవాళ్లు.వినాయకచవితి రోజు ఈ రావుగోపాల్రావు(రా.గో)కు బాగా గిరాకీ ఉండేది.ఏ కారణం లేకుండానే కోపం తెచ్చుకునే రావుగోపాల్‌రావుకి ఆరోజు కావాలని చిరాకో, కోపమో తెప్పించేవారు ఊరి జనాలు. అవి ఎలా ఉండేవంటే....ఒకడు రా.గోని చూసి వెటకారంగా నవ్వేవాడు.మరొకడు ఆయన ముందే ఆయన గొంతును అనుకరించి వెక్కిరించేవాడు.ఇంకొకడు... ఆయన లాల్చి లాగి దూరంగా పరుగెత్తేవాడు.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! తిట్టి తిట్టీ ఆయన అలిసిపోయేవాడే తప్ప, ఆయన్ని కవ్వించి తిట్లు తినాలనుకునే కస్టమర్లకు మాత్రం ఆరోజు కొరత ఉండేది కాదు. ఇక ఇలా కాదు అనుకొని పండుగవస్తే చాలు ఏ చుట్టాల ఇంటికో, స్నేహితుల ఇంటికో వెళ్లి నోరు దాచుకునేవాడు రా.గో ‘‘ఎన్ని పండుగలకని ఇలా పారిపోతావు? ఏదో పరిష్కారం ఆలోచించు’’ అని చుట్ట వెలిగించాడు ఆయన ఆత్మీయుడు ఆముదం. ఈయన అసలు పేరు ఇది కాదు. ముఖం ఎప్పుడూ జిడ్డోడుతుందని ముద్దుగా ఆముదం అని పిలుచుకుంటారు జనాలు.‘‘ఏంజేయమంటావురా ఆముదం? ఈ పండుగ నా సావు కొచ్చింది’’ అని చుట్ట వెలిగించాడు రా.గోఅప్పుడు ఆముదం ఆయన చెవిలో ఏదో ఊదాడు.రా.గో ముఖం చిచ్చుబుడ్డి కంటే పవర్‌ఫుల్‌గా వెలిగిపోయింది!ఆరోజు వినాయకచవితి.కొత్త దుస్తులు ధరించి పాత వీధుల వెంట నడవసాగాడు రా.గో‘‘మనిషికో మాట.... నీకో దెబ్బ’’ అన్నాడు ఎదురుగా వస్తున్నవాడు పళ్లు ఇకిలిస్తు!సర్రుమని కాలింది రా.గోకు!అయినా సరే కూల్‌గా నవ్వాడు. అంతే కాదు తనను తిట్టిన వాడికి నమస్కారం పెట్టాడు. రా.గోలో ఊహించని ఈ సంస్కారానికి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అదిరిపడ్డాడు తిట్టినోడు!రా.గో సరిగ్గా సర్కారు బావి దగ్గరకు వచ్చాడో లేదో.... న్యూస్‌పేపర్‌ను ఉండలా చుట్టి ముఖం మీదికి బాల్లా విసిరాడు ఒకడు. అయినా సరే... కూల్‌గా నవ్వాడు రా.గో. స్పీడ్‌గా నడవడం రా.గో అలవాటు. నడుస్తున్న దారిలో ఎవరో అరటి తొక్క విసిరారు. అది తొక్కి భారీ శబ్దంతో కిందపడిపోయాడు రా.గో. అయినా సరే ఓపికగా లేచాడే తప్ప ఎవరినీ తిట్టిన పాపాన పోలేదు.... ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని జరిగినా తనలో ‘కూల్’ని హీట్ కానివ్వలేదు రా.గో. దీంతో కవ్వింపు కస్టమర్లు తగ్గారు.‘అబ్బే! ఈయన్ను నమ్ముకొని లాభం లేదు’ అనుకునే పరిస్థితి వచ్చింది.చవితి రోజు తిట్లు తినడానికి ఉపయోగించే టెక్నిక్‌లలో రా.గో టెక్నిక్ కంటే పాపులర్ టెక్నిక్ ఒకటి ఉంది. అదే ‘బడ బడ బడా... దబ దబ దబా’ టెక్నిక్. దీనిలో భాగంగా ఇంటి మీద రాళ్లు వేస్తారు. తద్వారా ఆ ఇంటి వాళ్ల నుంచి తాజా తిట్లు తింటారు.ఆరోజుల్లో డాబా ఇండ్ల కంటే పెంకుటిళ్లు, రేకుల ఇండ్లే ఎక్కువ కదా.అర్ధరాత్రి తరువాత... బడ బడ బడా దబదబదబామని శబ్దాలు వినిపించేవి. ఇరుగింటి వాడు పొరుగింటి వాడి రేకుల ఇల్లు మీద విధిగా నాలుగు రాళ్లు వేసేవాడు. ఆ సమయంలో ఆసియా ఖండంలోనే అరుదైన తిట్లు వినిపించేవి. ఆ తిట్ల ధాటికి ఎంతోమందికి నిద్ర కరువయ్యేది. ఒకవైపు తిట్ల వర్షం... మరోవైపు పిడుగు శబ్దాల్లాంటి రాళ్ల చప్పుళ్లతో చవితి రాత్రి కాస్తా శివరాత్రి అయ్యేది!కొందరు మాత్రం ‘తిట్లఫలం’ దుండగులకు దక్కవద్దు అనే కారణంతో తమ ఇంటి మీద ఎన్ని రాళ్లు విసిరినా చిన్న తిటై్టనా తిట్టే వాళ్లు కాదు. అలాంటి వాళ్లలో లింగయ్య ఒకడు. ఆయనది రేకుల ఇల్లు. ఆయన ఇంటి మీద ఎవరైనా రాళ్లు విసిరితే...‘‘మీరు రాళ్లు కాదు...గుట్టలేసినా తిట్టను’’ అని గట్టిగా అరిచి ఇంట్లోకి వెళ్లి మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. ఇప్పుడు మీకు ఒక దొంగోడి గురించి చెబుతాను.‘శివరాత్రి రోజు దొంగతనం చేయవద్దు’ అనేది జూనియర్ దొంగలకు సీనియర్లు ఇచ్చే సీరియస్ సలహా. కానీ ‘చవితి రోజు దొంగతనం చేయవద్దు’ అంటూ ఎలాంటి రూల్ లేకపోవడంతో ఒక అప్రెంటీస్ దొంగ చవితిరోజు మా ఊళ్లో దొంగతనానికి వచ్చాడు. తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ఈ దొంగ అర్ధరాత్రి దాటిన తరువాత ఒక పెంకుటిల్లు ఎక్కాడు. ఈ ఇంటి పక్కనే ఒక రేకుల ఇల్లు ఉంది. ఆ టైమ్‌లోనే ఎవడో రేకుల ఇంటి మీదికి ఒక రాయి విసిరాడు. ఆ రాయి దొంగను ‘హాయ్’ అని పలకరించి వెళ్లింది తప్ప పెద్దగా గాయపరచలేదు. ఇక రెండోసారి దూసుకువచ్చిన పెద్ద రాయి మాత్రం దొంగ హెడ్‌ను ఆప్యాయంగా ముద్దాడింది. అంతే...‘వామ్మో!!!’ అని ఊరు నిద్రలేచేలా అరిచాడు దొంగోడు.చుట్టుపక్కల వాళ్లందరూ పరుగెత్తుకు వచ్చారు. వాడిని కిందికి దించారు.‘‘ఇల్లు ఎందుకు ఎక్కావురా?’’ అని అడిగాడు ఒకడు.‘‘దూడగడ్డి కోసం ఎక్కి ఉంటాడు’’ అన్నాడు పక్కోడు.నవ్వులే నవ్వులు!‘‘ముందు నీ పేరేమిటో చెప్పు’’ అని ఆ అమాయకపు దొంగ కళ్లలోకి భయంకరంగా చూస్తూ అడిగాడు కాస్త దిట్టంగా ఉన్నవాడు.‘‘నా పేరు...నా పేరు...’’ అని భయంభయంగా దొంగ తడబడుతుంటే వెనక నుంచి ఎవడో ‘దొంగ’ అని అరిచాడు.మళ్లీ నవ్వులే నవ్వులు!!మామూలుగానైతే పెద్ద దొంగ, చిన్న దొంగ, ఒక మోస్తరు దొంగ, తేలికపాటి దొంగ... అనే తేడా లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు దొరికితేచాలు దొంగను కుమ్మేస్తారు. ఎముకల్లో నుంచి సున్నం తీసి మరుసటి రోజు రథం ముగ్గు వేస్తారు. పండుగపూట హింస ఎందుకు అనుకున్నారో ఏమో.... దొంగోడి ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు. పైగా వాడి చేతిలో ఉండ్రాళ్ల సంచి పెట్టి మరీ ఊరు దాటించారు. ఏ దొంగకు పడుతుంది ఇంత అదృష్టం! – యాకుబ్ పాషా -
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్ : వినాయక నిమజ్జనం చేస్తుండగా నగరంలో అపశృతి చోటు చేసుకుంది. ముందున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్ లో ఆదివారం ట్రాక్టర్‌పై గణేశుడిని నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ముందు యువకులు నృత్యాలు చేస్తున్నారు. అంతలోనే ట్రాక్టర్ అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లి మహేశ్ అనే బాలుడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మహేశ్‌ను వెంటనే నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు బాలురకు గాయాలు కాగా వారికి చికిత్స చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సంతాన, సౌభాగ్య ప్రదాత.. సిద్ధివినాయకుడు
ముంబైతోపాటు దేశవ్యాప్తంగా శ్రీ సిద్ధివినాయకుని గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తికాదు. రెండు శతాబ్దాలకు పైగా పురాతనమైన ఈ ఆలయం గత మూడు, నాలుగు దశాబ్దాలలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. అరేబియా సముద్రం అంచున ఏడు ద్వీపాలు కలిసిపోయి ముంబై ఏర్పడగా మాహీం ద్వీపంపై ప్రభాదేవి పరిసరాల్లో ఈ శ్రీ సిద్ధి వినాయకుని ఆలయం ఉంది. ‘నవసాచా, నవసాల పావునారా’ (భక్తితో కోరిన కోరికలు తీర్చే దైవంగా) శ్రీ సిద్ధివినాయకుడు ప్రసిద్ధి. కోరిన కోరికలు తీర్చే దైవంగా పేరున్న ఈ స్వామి ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఆలయం మూసివేసే వరకు భక్తుల రాకపోకలతో సందడిగా ఉంటుంది. అంతేకాదు, దేశంలోని అత్యంత సంపన్నమైన దేవాలయాలలో ఒకటిగా శ్రీ సిద్ధి వినాయకాలయం విరాజిల్లుతోంది. ఆలయ చరిత్ర... ప్రభాదేవి పరిసరాల్లో ఉన్న ఈ సిద్ధి వినాయకుని ఆలయాన్ని 1801 నవంబర్ 19 న ఇటుకలతో నిర్మించారు. ఆలయంలోని శ్రీ సిద్ధివినాయకుని విగ్రహం 2.6 అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో ఉంది. నాలుగు చేతులతో ఉన్న ఈ విగ్రహాన్ని ఒకే నల్లరాతితో చెక్కారు. ఒక చేతిలో కమలం, ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో జపమాల, ఇంకో చేతిలో కుడుములతో ఉన్న పాత్ర ఉన్నాయి. కుడి, ఎడమలకు శ్రీ సిద్ధి, బుద్ధి దేవతల విగ్రహాలున్నాయి. సిద్ధివినాయకుని తొండం కుడివైపు ఉండడం విశేషం. ఈ సిద్ధి వినాయకుడు కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందాడు. హనుమాన్ ఆలయం.. 1951 ప్రాంతంలో సయానీ రోడ్డు వెడల్పు చేసే సమయంలో మండపం ఉండే ప్రాంతంలో హనుమంతుని విగ్రహం బయటపడింది. దీంతో అక్కడ ఓ చిన్న గుడిని నిర్మించారు. ప్రస్తుత ఆలయ స్వరూపం.. ముంబై నడి ఒడ్డున ప్రభాదేవి పరిసరాలలో శ్రీ సిద్ధివినాయకుని ఆలయం గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు పైన అయిదంతస్తుల్లో నిర్మాణం చేశారు. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయాన్ని మరోసారి జీర్ణోద్ధారణ చేశారు. శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థుల చేతుల మీదుగా ఆలయ కలశ ప్రతిష్ఠాపన జరిగింది. ప్రస్తుతం అష్ణకోణాల్లో ఉన్న గర్భగుడి, 3.65 మీటర్ల ఎత్తుతో ఉన్న మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఈ ప్రవేశ ద్వారాలపై గల శిల్పకళ మంత్రముగ్ధులను చేసేలా ఉంటుంది. సుమారు ఒక మీటరు ఎత్తులో ఉండే కమలంపై ఆసీనులైన వినాయకుని విగ్రహం ఉంది. బంగారం తాపడంతో నాలుగు స్తంభాలతో తయారు చేసిన చిన్న మండపం కింద శ్రీ సిద్ధివినాయకుని విగ్రహం ఉంచారు. శ్రీ సిద్ధి, బుద్ధి దేవతలతోపాటు ఒకవైపు శివలింగం, మరోవైపు గణేషుని ప్రతిమలున్నాయి. మంటపం పైన శివపార్వతుల విగ్రహాలనుంచారు. మొత్తం 37 గోపురాలపై బంగారు కలశాలను ప్రతిష్ఠాపన చేశారు. ఇక్కడి నుంచి నేరుగా భారీ క్యూలలో దర్శనం చేసుకోలేని భక్తులు శ్రీ సిద్ధి వినాయకుని ముఖదర్శనం చేసుకునేందుకు వీలు కల్పించారు. పక్కనే హనుమాన్ ఆలయం ఉంది. ఇతర అయిదు అంతస్తులలో ఆలయం ట్రస్టీ కార్యాలయం, మహానైవేద్య, పూజా, వంటగృహం, గ్రంథాలయం, అర్చకుల విశ్రాంతి గదులున్నాయి. విద్య, విఙ్ఞానానికి సంబంధించిన సుమారు 8000కుపైగా గ్రంథాలతో మందిరంలో గ్రంథాలయాన్ని, డిజిటల్ టెక్నాలజీ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీలను కూడా ప్రారంభించారు. అనేక స్వచ్ఛంద సేవలు... శ్రీ సిద్ధివినాయకుని ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణం, బ్లడ్ బ్యాంకు, వరద బాధితులకు, కరువు ప్రాంతాలవారికి, విద్యార్థులకు ఉపకార వేతనాలు, వైద్యసేవలు అందిస్తున్నారు. ఎలా చేరుకోవాలి... ముంబైకి దేశవిదేశాల నుంచి రోడ్డు, రైలు, విమానాల ద్వారా చేరుకోవచ్చు. ముంబై నడిబొడ్డున దాదర్ రైల్వేస్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ సిద్ధి వినాయకుని ఆలయాన్ని చేరుకునేందుకు ముంబై నుంచి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి లోకల్ రైళ్లు, బెస్టు (సిటీ) బస్సులూ ఉన్నాయి. ప్రత్యేక దినాలు... శ్రీ సిద్ధివినాయకుని ఆలయంలో ప్రధానంగా ప్రతి మంగళవారంతో పాటు ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి, అదే విధంగా అంగారక సంకష్టి చతుర్థి మొదలగు పర్వదినాలలో ప్రత్యేకపూజలు జరుపుతారు. – గుండారి శ్రీనివాస్, సాక్షి, ముంబై -
వినాయక మంటపంలో గొంతు కోసుకుని..!
సాక్షి, తిరువళ్లూరు : వినాయకుడి విగ్రహం వద్ద గొంతు కోసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని మనవాలనగర్‌లో కలకలం సృస్టించింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతానికి చెందిన వెంకట్రామన్ కుమారుడు శోభన్‌బాబు(35). ఇతనికి వివాహం కాలేదు. ఎనిమిది నెలల క్రితం వెంకట్రామన్ అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటినుండి మానసికస్థితి సరిగాలేని శోభన్‌బాబు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి పదిగంటల సమయంలో మనవాలనగర్ సిగ్నల్ వద్ద ఉన్న వినాయకుడి విగ్రహం వద్ద తచ్చాడుతూ కనిపించాడు. అనంతరం వినాయక మండపం వద్ద అవసరాల కోసం ఉంచిన బ్లేడుతో ఒక్కసారిగా గొంతు కోసుకున్నాడు. రక్తస్రావం కావడంతో గట్టిగా కేకలు వేస్తూ కింద పడిపోయాడు. స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సూచన మేరకు చెన్నైకి తరలించగా అక్కడే చిక్సిత పొందుతూ మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన మనవాలనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వినాయక చవితి: స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో స్మార్ట్ ఫోన్ల ఫై ఆఫర్లు కురిపిస్తున్నాయి. వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లపై దాదాపు 8నుంచి 45 శాతం డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. లెనోవా ఎ 6699 ప్లస్ (బ్లాక్) : లెనోవో స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందిస్తున్న డిస్కౌంట్ 27శాతం అంటూ కేవలం రూ.6,240 కే దీన్ని సొంతం చేసుకోవచ్చు. అసలు ధర రూ. 8,499 నోకియా 6: నోకియా 6 (32జీబీ)స్మార్ట్‌ఫోన్ ఈ రోజు అమెజాన్ లో సేల్ కి అందుబాటులో ఉంది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలైన ఈసేల్ రూ.14,999 ధరలో అందుబాటులోఉంది. శాంసంగ్ ఆన్ 7 ప్రొ: ఈ శాంసంగ్ ఆన్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌పై ద అమెజాన్ ఇస్తున్న 5శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 9,490 అంటే రూ. 8,990 కు పొందవచ్చు . మోటో ఈ 4వజనరేషన్: దీనిపై కేవలం ఫ్లిప్‌కార్ట్ లో 6 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 8,999 లకు లభ్యం లెనోవో వైబ్ కే 5: ఫ్లిప్‌కార్ట్‌లో 16శాతం తగ్గింపుతో రూ. 9,999 లకు లభ్యం. అసలు ధర రూ.11,999 వీటితో పాటు లెనోవా జెడ్ 2 స్మార్ట్‌ఫోన్‌పై 40శాతం, ఆపిల్ ఐఫోన్ 6 మీద 44 శాతం, 6ఎస్ 23 శాతం దాకా డిస్కౌంట్, శాంసంగ్ గెలాక్సీ 6శాతం, కూల్ ప్యాడ్ నెట్ 5 మీద 8 శాతం దాకా డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఈ తగ్గింపు ఆఫర్లపై పూర్తి వివరాలకు వెబ్సైట్లను సందర్శించగలరు. -
వినాయకచవితి చందా వివాదం
► పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ ► వాహనాన్ని ధ్వంసం చేసిన గ్రామస్తులు ► ప్రాణభయంతో పరుగులు తీసిన పోలీసులు బుచ్చినాయుడుకండ్రిగ : వినాయక చవితి చందా విషయమై పోలీసులు, గ్రామస్తుల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటన మండలంలోని పద్మావతిపురం వద్ద ఆదివారం జరిగింది. కొంతమంది యువకులు కేటీరోడ్డుపై వెళుతున్న వాహనాలను వినాయక చవితి చందా వసూలు చేస్తున్నారు. ఆదివారం తిరుపతికి చెందిన ఎర్రచందనం టాస్క్ఫోర్సు ఎస్ఐ ఆదినారాయణరెడ్డి సిబ్బందితో కలిసి చెన్నై నుంచి ఎర్రచందనం స్మగ్లరును తీసుకుని వ్యాన్‌లో తిరుపతికి వెళుతున్నారు. ఆ వ్యాన ును యువకులు అడ్డుకున్నారు. పోలీసు సిబ్బంది రూ.10 ఇచ్చారు. దీంతో యువకులు పోలీసు సిబ్బందిని దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఒక యువకుడిపై కానిస్టేబుల్ చెయ్యి చేసుకున్నాడు. దీంతో యువకులకు, టాస్క్ ఫోర్సు సిబ్బంది మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది తెలుసుకున్న పద్మావతిపురం గ్రామస్తులు, యువకులతో కలిసి టాస్క్ఫోర్సు సిబ్బందిపై దాడికి దిగారు. పోలీసులమని చెప్పినా వినకుండా వాహనాన్ని ధ్వంసం చేశారు. భయందోళనకు గురైన టాస్క్ఫోర్సు సిబ్బంది వ్యాన్ వదిలేసి బస్సు ఎక్కి బుచ్చినాయుడుకండ్రిగలోని పోలీసుస్టేషన్‌కు వచ్చి ఎస్ఐ రామ్మోహన్‌కు వివరించారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వ్యాన్‌ను తీసుకుని పోలీసుస్టేషన్‌కు వచ్చారు. జరిగిన గొడవను జిల్లా అధికారుల దృష్టికి తెలియజేశామని, వారి అదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. -
బుల్లి గణపతుల బండి.. బయల్దేరిందండీ
ఒకవైపు ఖైరతాబాద్ వినాయకుడి లాంటి 58 అడుగుల మహాగణపతులను అత్యంత జాగ్రత్తగా భారీ వాహనం మీద, పెద్ద క్రేన్ల సాయంతో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుంటే.. మరోవైపు బుల్లి బుల్లి గణపతి విగ్రహాలతో కూడిన ఒక బండి జియాగూడ నుంచి బయల్దేరింది. దాదాపు 30కి పైగా గణపతి విగ్రహాలను ఈ బండిలో తరలించారు. ముందు.. చిన్నచిన్న నాలుగు చక్రాల బండ్లు సిద్ధం చేసి, వాటిమీద ముఖమల్ క్లాత్ పరిచి, ఆపైన విగ్రహాలను ఉంచారు. వర్షంలో విగ్రహాలు తడవకుండా.. వాటికి రక్షణగా పాలిథిన్ కవర్లను కూడా చుట్టారు. ఈ చిన్నచిన్న బండ్లు అన్నింటినీ రైలు బోగీలలాగ ఒకదాంతో ఒకదానికి అనుసంధానం చేశారు. మొట్టమొదటి బండి మీద ఎలుక వాహనాన్ని కూడా పెట్టారు. ఈ బండికి రక్షణగా ఒక రోప్ పార్టీని (గణపతి భక్తులు) కూడా ఏర్పాటుచేశారు. వాళ్లు అటూ ఇటూ రెండు తాళ్లు పట్టుకుని.. బండికి గానీ, గణపతి విగ్రహాలకు గానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తుండగా.. జియాగూడ ప్రాంతం నుంచి ఎంజే మార్కెట్ మీదుగా వినాయక సాగర్ వరకు తీసుకెళ్లారు. బుల్లి బుల్లి గణపతి విగ్రహాలతో కూడిన ఈ వెరైటీ రైలు బండిని చూసి అటుగా వెళ్లేవాళ్లంతా ముచ్చట పడుతూ ఆ బండితో సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. -
గణేష్ బందోబస్తులో విధులు నిర్వర్తిస్తూ..
వరంగల్: హైదరాబాద్‌లో గణేష్ బందోబస్తు కోసం వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ అస్వస్థతకు గురై మృతిచెందాడు. జిల్లాలోని ములుగు మండలం సర్వాపురం గ్రామానికి చెందిన ఎ. ముత్తయ్య తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గణేష్ బందోబస్తు సందర్భంగా విధులు నిర్వర్తించడానికి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో డ్యూటీలో ఉండగా.. అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని హన్మకొండ జయ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. -
నేను... భాద్రపద మాసాన్ని...
చాంద్రమానం ప్రకారం పున్నమి చంద్రుడు ఉత్తరాభాద్ర లేదా పూర్వాభాద్ర నక్షత్రాలలో సంచరిస్తుంటాడు కాబట్టి నాకా పేరు వచ్చింది. మొదటి పదిహేను రోజులూ దేవతల పక్షం... రెండో పదిహేను రోజులూ పితృదేతల పక్షంగా నన్ను అంటే భాద్రపద మాసాన్ని గుర్తుంచుకుంటారందరూ. అయితే నన్ను శూన్యమాసమని, శుభకార్యాలకు పనికిరానని చాలామంది చిన్నచూపు చూస్తారు కానీ, దేవతలలో ప్రథమ పూజనీయుడైన వినాయకుడు ఉద్భవించినదీ, విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇచ్చి, లోకపూజ్యుడిని చేసిందీ ఈ మాసంలోనే అని ఎవరికీ గుర్తురావెందుకో! వినాయక చవితి మర్నాడే కదా, సప్తరుషులను స్మరించుకునే ఋషిపంచమీ వ్రతం చేసుకునేది అందరూ! అంతేనా..? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని వరాహ, వామనావతారాలు ధరించింది నా మాసంలోనే కదా! ఇంకా పరివర్తన ఏకాదశి, అనంత పద్మనాభస్వామి వ్రతం, ఉండ్రాళ్ల తదియ వంటి ఎన్నో పర్వదినాలు కూడా నా హయాంలోనే కదా అందరూ జరుపుకునేది! ఒక్కోమాసం లో ఒక్కో దేవతకు ప్రాధాన్యమిచ్చే మన ఆచార సంప్రదాయాలు భాద్రపద మాసంలో పితృదేవతలకు పెద్దపీట వేశాయి. మీ మనుషులకు ఒక సంవత్సరం పితృదేవతలకు ఒకరోజుతో సమానం. అందుకే ఏడాదికోసారి వారికి తద్దినం పెట్టడం లేదా తర్పణలు విడవడం సంప్రదాయం. అయితే కొన్ని వర్ణాలలో ఇలా తద్దినాలు పెట్టే అవకాశం, అలవాటు ఉండదు. అటువంటివారు నేను జరిగే పౌర్ణమి వెళ్లిన పాడ్యమి నుంచి అమావాస్య వరకు... దీనికే మహాలయపక్షమనీ, పితృపక్షమనీ పేరులెండి. ఈ కాలంలో ఇతర లోకాలలో ఉన్న తలిదండ్రులు, తాతముత్తాతలు, ఇతర బంధుమిత్రులకు తర్పణ వదిలి, వారి పేరు మీదుగా పేదలను లేదా బంధుమిత్రులను పిలిచి అన్నం పెడుతుంటారు. అలా పెడితే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. మీ నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాల మాటెలా ఉన్నా, కనీసం పదిమంది పేద ల కడుపు నింపేందుకు అవకాశం కలుగుతున్నది నా మాసంలోనే కదా అనే ఆనందంతో నా గుండె నిండుతుంది. అసలు మీరు ఏ మర చి పని చేసినా భగవంతుడిపై విశ్వాసంతో మీ మీద మీరు పూర్తి నమ్మకంతో చేస్తే చాలు... అది విజయవంతమవుతుందని నేనంటాను. మీరేమనుకుంటారో మీ ఇష్టం. అన్నట్టు నన్ను భద్రకరమైన మాసమని కూడా అంటారు మరి మీకు తెలుసో లేదో! - డి.వి.ఆర్. -
ఎస్ఐని నీళ్లలో ముంచి.. చంపబోయారు!
మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో నలుగురు యువకులు కలిసి ఓ ఎస్ఐని నీళ్లలో ముంచి.. చితక్కొట్టి చంపేయబోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సెల్ఫోన్లో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా వ్యాపించింది. నిమజ్జనం ప్రక్రియ మధ్యలో ఆగడంతో.. దాన్ని తిరిగి ప్రారంభించడానికి నితిన్ ధాగ్లే (38) అనే ఎస్ఐ ప్రయత్నిస్తుండగా ఆయనను నలుగురు యువకులు చెరువులోకి తోసేశారు. వాళ్లలో ఒకడు ఆయనను నీళ్లలో ముంచి విపరీతంగా కొట్టాడు. ఆయన ఎలాగోలా బయటపడి, ప్రాణాలు దక్కించుకున్నారు. యువకులంతా పసుపుపచ్చరంగు టీషర్టులు, షార్ట్స్ ధరించి ఉన్నారు. తీస్‌గావ్ చెరువులో నిమజ్జనం కార్యక్రమాన్ని కొంతమందితో కూడిన బృందం ఆపినట్లు మంగళవారం రాత్రి 9.30 గంట ప్రాంతంలో పోలీసులకు ఫోన్ వచ్చింది. జరి మరి గణేశ్ ఉత్సవ్ మండల్‌కు చెందిన సభ్యులుగా అనుమానిస్తున్న యువకులు అక్కడ బారికేడ్ పెట్టి, తమ విగ్రహాన్ని అక్కడే ఉంచేసి మొత్తం నిమజ్జనానికి అడ్డుగా ఉన్నారు. వాళ్లను కూడా క్యూలో రమ్మని ఎస్ఐ ధాగ్లే చెప్పగా, వాళ్లు వినిపించుకోలేదు. దాంతో ఆయన ఎలాగైనా నిమజ్జనం కొనసాగేలా చూడాలని ప్రయత్నించారు. దాంతో ఆ నలుగురూ ఒక్కసారిగా ముందుకు దూకి ధాగ్లేను చెరువులోకి తోసేశారు. వాళ్లలో ఒకడు ధాగ్లే మీదకు దూకి.. ఆయనను ముంచేయడానికి ప్రయత్నించాడు. ఆయన ఎలాగోలా బయటకు వచ్చినా, మిగిలిన ముగ్గురూ బయట కూడా కొట్టారు. -
ఆసక్తిని రేకెత్తిస్తోన్న‘మఫ్టీ’ పోస్టర్
బెంగళూరు : ఉగ్రం, రథావర తదితర హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న శ్రీమురళి కొత్త చిత్రం మఫ్టీకి సంబంధించిన పోస్టర్ ను వినాయక చవితి సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేశారు. నర్తన్ దర్శకత్వంలో జయణ్ణ భోగేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీమురళికి జోడీగా మాస్టర్‌పీస్ ఫేమ్ శాన్వి శ్రీవాత్సవ్ హీరోమాన్గా నటించనుంది. అంతేకాకుండా కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో నటిస్తుండడంతో ఆయన అభిమానులతో పాటు, శ్రీమురళి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితిని పుసరస్కరించుకొని విడుదల చేసిన పోస్టర్ ఇరువురి హీరోల అభిమానులతో పాటు శాండల్ఉడ్ జనాలను కూడా ఆకర్షిస్తూ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. -
ప్రత్యేక హోదా గణపతి
నెల్లూరు(బృందావనం): ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇక్కట్లు చూడలేక గణనాథుడు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాడు. అవును. ఆంధ్రుల హక్కును గుర్తుచేస్తూ ఒక చేతిలో 'హోదా' ఫ్లకార్డు, రెండో చేతిలో జాతీయ జెండా పట్టుకున్న గణపతి ప్రతిమ అందరినీ ఆకర్శిస్తోంది. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరుకు చెందిన స్వర్ణకారుడు షేక్ ముసవ్వీర్ వినూత్న రీతిలో వెండితో ప్రత్యేక హోదా గణనాథుని సూక్ష్మరూపాన్ని తీర్చిదిద్దాడు. దీనిని తయారు చేయడానికి మూడు రోజులు శ్రమించానని చెప్పిన ముసవ్వీర్ చెప్పారు. ఐదు సెంటీమీటర్ల ఎత్తు, మూడు సెంటీమీటర్ల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ హోదా వినాయకుడి తయారీకి 1.5 మిల్లీగ్రాముల వెండిని వినియోగించానని ఆయన తెలిపారు. రాష్ట్రానికి హోదా ఇచ్చేలా కేంద్ర పాలకుల మనసు మార్చాలని తాను గణనాథుని వేడుకున్నట్లు ముసవ్వీర్ పేర్కొన్నారు. -
కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- తొలిరోజు రాత్రి హంసవాహనంపై విహరించిన గణనాథుడు - ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి ఐరాల (చిత్తూరు జిల్లా) : కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఏకదంతుడి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం గ్రామోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేశారు. అన్వేటి మండపంలో ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషిక పటాన్ని ఉంచి గణపతి పూజ, స్వస్తివాచనం, నవగ్రహ సంధి, పుణ్యాహవచనంలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కోసం ఉదయం స్వాతి నక్షత్రం, కన్యాలగ్నంలో 7 గంటల నుంచి 8 గంటల మధ్య ధ్వజస్తంభంపై మూషికపటాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై ఊరేగారు. కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లెకు చెందిన శీరికరుణీక వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. -
వినాయక చవితి మిమిక్రీ మేళా.
-
బాలాపూర్‌లో వినాయక చవితికి భారి ఏర్పాట్లు
-
వినాయక చవితి అంతరార్థం
భారతీయులు జరుపుకునే పండుగలన్నీ కూడా ఎన్నో ప్రయోజనాలని సాధించటానికి ఉద్దేశింపబడినాయి. వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, పర్యావరణ, మానవీయ, అభివృద్ధి జరగటానికి దోహదపడే విధంగా పండుగ చేసుకునే పద్ధతిని ఏర్పరచటం జరిగింది. అందులోని అంతరార్థాన్ని తెలుసుకుంటే పండగ పరమార్థం తెలుస్తుంది. జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. వినాయక చవితి పిల్లలు సంబరంగా చేసుకునే పండగ. విద్యాధిదేవత కనుక ఆయన్ని పూజిస్తే చదువు బాగా వస్తుందని పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. పూజ అయినాక పుస్తకాలకి పూజ చేసి, వినాయకుడి ముందు గుంజీలు తీస్తారు. ఆయనకి ఇష్టమట! కారణం.... మన శరీరంలో భూతత్త్వాన్ని నియంత్రించే మూలాధారానికి అధిపతి గణపతి. ఆ చక్రం శరీరాకృతిని, దానికి హేతువులైన ఎముకలని, కండరాలని నియంత్రిస్తుంది. కుదురు కలిగేట్టు చేస్తుంది. పిల్లలకి ఇవి అత్యావశ్యకాలు కదా! అవి సరిగా ఉండాలంటే మూలాధారం సరిగ్గా పని చేయాలి. గుంజీలు మూలాధారాన్ని చక్కబరుస్తాయి. అందుకని గణపతి ఎదుట పిల్లల చేత గుంజీలు తీయిస్తారు. (పెద్దలు చేస్తే కూడా మంచిదే ననుకోండి) ఇది వైయక్తికం. గణపతి అనే పేరు ఎందుకొచ్చిందంటే... గణం అంటే సమూహం. ఎక్కడెక్కడ సమూహాలు ఏకోన్ముఖంగా పని చేయాలో అక్కడ వాటి చేత పని చేయించే శక్తికి గణపతి అని సంకేతించారు. దేవత గణాలు, మన శరీరలో ఉండే విభిన్న అవయవాలకి సంబంధించిన కణాల సముదాయాలు అక్షరాల సముదాయాలు, సంగీతంలో ఉండే స్వరాల సముదాయాలు... ఇలా ఎన్నో! వాటిని చెదిరి పోకుండా, ఒకే లక్ష్యం వైపు నడిపించ గల శక్తి. గణపతిని పూజించి ఆ తత్త్వాన్ని తెలుసుకున్న వారికి సమూహాలని, అంటే గుంపుని, లేదా మందని తన వెంట నడిపించటం తెలుస్తుంది. ఈ పండుగలో ఇమిడి ఉన్న ఖగోళ విజ్ఞానం: భారతదేశం లోని మహర్షులు ఖగోళ విజ్ఞానాన్ని కూడా పురాణ గాథలుగా మలచి ఇచ్చారు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందు తూర్పున ఆకాశంలో ఏనుగు తొండం ఆకారంలో ఒక నక్షత్ర సముదాయం, దానికి కిందగా మూషిక ఆకారం కల నక్షత్ర సముదాయం కనపడుతాయి. మొత్తం దృశ్యం మూషికం మీద ఏనుగు తొండం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సూర్యోదయానికి ముందుగా కనిపించే నక్షత్రానికి సంబంధించిన దేవతని ఆనాడు ఆరాధించాలని ఋగ్వేదోక్తి. భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యోదయానికన్న ముందు తూర్పున హస్తానక్షత్రం ఉదయిస్తుంది కనుక ఆ నాటి దైవతం హస్తిముఖుడు. హస్తి ముఖమున్న దైవతం గణపతి అవటం వల్ల ఆనాడు పూజించటం సంప్రదాయమయింది. ఫాలచంద్రుడు: సూర్యాస్తమయం తరువాత హస్తానక్షత్రం పైన చంద్రోదయం అవుతుంది. చూడటానికి చంద్రుడు గజముఖుడి నుదురులాగా ఉంటుంది. అప్పుడు ఆకాశం వినాయకుని స్వరూపం లాగా దర్శన మిస్తుంది. మధ్యలో ఒక చుక్క ఉండి విశాలమైన ఆకాశం వినాయకుడి బొజ్జలాగా దర్శనమిస్తుంది. ఈశాన్యం నుండి నైరుతి వరకు ఒక పట్టి లాగా విస్తరించిన పాలపుంత యజ్ఞోపవీతం లాగా కనిపిస్తుంది. ఈశాన్యంలో గుంపుగా ఉండే నక్షత్రాలు పడగెత్తిన పాముతల లాగా ఉండి నాగ యజ్ఞోపవీతం అనిపిస్తుంది. అందుచేత భాద్రపద శుద్ధ చవితినాడు పూజించే దైవతాన్ని, హస్తి ముఖుడు, మూషిక వాహనుడు, లంబోదరుడు, నాగ యజ్ఞోపవీతుడు మొదలైన నామాలతో పిలవటం జరుగుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనేది విష్ణువుకి సంబంధించిన స్తుతి గణపతిది కాదు అనిపించి, అన్న వారు కూడా ఉన్నారు. బుధగ్రహానికి అధిష్ఠాన దైవం విష్ణువు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. అందుకే వినాయకుణ్ణి కూడా విష్ణువుగా (సర్వవ్యాపి అనే అర్థంలో) స్తుతించటం చూస్తాం. శుక్లాంబర ధరం... అనే శ్లోకం ఈ అర్థం లోనే అన్వయం చేసుకోవాలి. పత్రి పూజ: బుద్ధుడికి ప్రీతి పాత్రమైన రంగు ఆకుపచ్చ. ఈ కారణంగానే ఆకుపచ్చరంగులో ఉండే అన్ని రకాల పత్రులతోనూ వినాయకుడికి పూజచేసే ఈ సంప్రదాయంలో పిల్లలకి ఈ ఋతువులో మొలకెత్తి పెరిగే మొక్కలని పరిచయం చెయ్యటం, వేటిని ఉంచాలో, వేటిని పనికి రావని తీసేయ్యాలో తెలియచెప్పాలన్న అంతరార్థముంది. అంతేకాదు, ఈ 21 పత్రుల నుండి వచ్చే గాలి పర్యావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది. నిమజ్జనం చేసినప్పుడు నీటిని శుభ్రపరచి, కొంతకాలం నీటిలో క్రిమికీటకాదులు చేరకుండా కాపాడుతుంది. నిమజ్జనం: సాధారణంగా తొమ్మిది లేదా ఏడు, ఐదు, మూడు రోజులు పూజించిన వినాయకుణ్ణి నిమజ్జనం చేయటం సంప్రదాయం. ఇది మరి ఏ ఇతర పూజల్లోనూ కనపడదు. చెరువులోని మట్టితోచేసిన గణపతిని మళ్ళీ ఓషధులతో కలిపి నీటిలో కలపటం పర్యావరణ పరిరక్షణే. ఈ ప్రక్రియలో భూమి పొరలు చక్కగా పైకి కిందకి సరిచెయ్యబడటం జరుగుతుంది. శ్యమంతకోపాఖ్యానం: ఈ కథ ఎవరికిచ్చిన సౌకర్యాన్ని (వరాన్ని) వారే ఉపయోగించుకోవాలని, శుచిగా లేని వారు పవిత్రమైన , విలువైన వాటిని ధరిస్తే మేలు కలుగకపోగా కీడు కలుగుతుందని, అతి విలువైన దేదైనా లభిస్తే దానిని రాజుకి (ప్రభుత్వానికి) అందిస్తే అందరికి ఉపయోగ పడుతుందని, ఇవ్వకుండా తామే ఉంచుకుంటే అది ప్రాణాంతకం కూడా అవవచ్చునని తెలియ చేస్తోంది. ఇది తెలుసుకుంటే వినాయక వ్రత ఫలితం పూర్తిగా లభిస్తుంది. తెలిసిచేసుకుంటే వినాయకచవితి మనకి ఎన్నో విషయాలని నేర్పుతుంది. జీవితాలని సరిదిద్దుతుంది. ఇంతకూ వినాయకుడు బ్రహ్మచారా? కాదా? హస్తానక్షత్రం కన్యారాశికి చెందింది. ఈ కారణంగా వినాయకుణ్ణి బ్రహ్మచారిగా, తరచూ బాలుడుగా వర్ణించటం కనపడుతుంది. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటే పండితుడు అని కూడా అర్థం. బుద్ధి బాగా వికసించిన వాడు అని ఆ మాటకి అర్థం. బుద్ధిని ఆశ్రయిస్తే సిద్ధి లభిస్తుంది. దానివల్ల క్షేమం, లాభం కలుగుతాయి. అందుకే సిద్ధి బుద్ధి, వినాకుడి భార్యలు (శక్తులు) గా, క్షేముడు, లాభుడు కుమారులు (వినాయకుడి పూజకి ఫలితాలు) గా ప్రతీకాత్మకంగా చెప్పబడింది. వినాయకుడికి భార్యాపిల్లలు ఉన్నారనటంలోని అంతరార్థం ఇదే. - డా. ఎన్. అనంతలక్ష్మి -
వినాయక చవితి, బక్రీద్లకు పటిష్ట భద్రత
ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష సాక్షి, హైదరాబాద్: వినాయకచవితి, బక్రీద్ వరుస పండుగల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ అనురాగ్‌శర్మ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు పోలీసు ప్రధాన కార్యాలయం లో సోమవారం డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు, లౌడ్‌స్పీకర్ల నిర్వహణ, నిమజ్జనం తదితర విషయాలపై సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, అవసరమైతే మత పెద్దలను సమావేశపరిచి వారి సహకారం తీసుకోవాలన్నారు. ఇటీవల ముగిసిన కృష్ణా పుష్కరాల భద్రతపై అనురాగ్‌శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, భక్తులకు ఆటంకాలు కలగకుండా పోలీసులు తీసుకున్న చర్యలు అత్యద్భుతమని కితాబిచ్చారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఎస్పీలు రెమా రాజేశ్వరీ, ప్రకాశ్‌రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనర్లు మహేశ్ భగవత్, నవీన్‌చంద్, శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, డీఐజీలు అకున్‌సబర్వాల్, కల్పననాయక్ పాల్గొన్నారు. -
బొజ్జ గణపయ్యలు సిద్ధమయ్యారోచ్
-
29న గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశం
హైదరాబాద్: జంట నగరాల్లో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 29న సచివాలయంలో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు సీ బ్లాక్ నాలుగో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగే ఈ సమావేశానికి గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జంట నగరాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇరిగేషన్, జీహెచ్ఎంసీతో పాటు పోలీసు అధికారులు ఇందులో పాల్గొంటారు. ఏర్పాట్లకు సంబంధించిన అధికారులందరూ హాజరు కావాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన విభాగం అంతర్గత మెమో జారీ చేసింది. గత ఏడాది గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశంలో సీట్ల కేటాయింపుపై అభ్యంతరాలు, అసంతృప్తి కారణంగా వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈసారి సాధారణ పరిపాలనా విభాగం అధికారులు సమావేశానికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలను సైతం ముందుగానే సభ్యులకు అందజేయడం గమనార్హం. -
గౌరీపుత్రుని ఉత్సవం..గంగకు కారాదు ఉపద్రవం..
పీఓపీ విగ్రహాలతో జలవనరులు కలుషితం మట్టి ప్రతిమలే మేలంటున్న పర్యావరణవేత్తలు రావులపాలెం : గణనాథుని వ్రతం సందర్భంగా రకరకాల ఫలాలు, పత్రి వాడడంలో ప్రకృతికీ, మనిషికీ ఉన్న అవినాభావ అనుబంధపు మర్మం దాగి ఉందంటారు. అయితే..అదే వినాయకచవితి సందర్భంగా ఏటా వేలాది సంఖ్యలో రసాయనాలతో కూడిన ఆ గౌరీపుత్రుని ప్రతిమలను గంగలో నిమజ్జనం చేస్తూ ప్రకృతికి నష్టం చేస్తున్నారని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసే గణేశ ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. మట్టి విగ్రహాలను వాడండని మెుత్తుకుంటున్నారు. అయినా ఆట్టే ప్రయోజనం ఉండడం లేదు. అప్పటికే భక్తులు, ఉత్సవ కమిటీల ఆర్డర్లపై వేలాది పీఓపీ విగ్రహాలు తయారై మార్కెట్లోకి వచ్చేస్తాయి. అందుకే మట్టి విగ్రహాలపై ప్రచారం ముందస్తుగానే చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. విగ్రహాల తయారీదారులను చైతన్యపర్చడంతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.. ఈ ఏడాది సెప్టెంబర్ 5న వినాయక చవితి కాగా ఇప్పటికే రావులపాలెం కేంద్రంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. రావులపాలెం, కొత్తపేట సెంటర్లలో రాజస్థాన్‌కు చెందిన కొందరు రోడ్డు పక్కన తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసుకుని జిప్సం వినాయక విగ్రహాల తయారీ మొదలు పెట్టారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోని ఈ పీఓపీ గణనాథుల విగ్రహాలను చూసిన ప్రజలు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ స్థాయిలో మట్టి విగ్రహాలు తయారు చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. మట్టి విగ్రహాలే శ్రేష్టం మట్టితో తయారుచేసి విగ్రహాలు చెరువుల్లో, కాలువల్లో, నదుల్లో నిమజ్జనం చేసినా ఎటువంటి హానీ ఉండదు. జిప్సంతో చేసిన విగ్రహాలు నీటిలో కరిగితే అనేక అనర్థాలు వస్తాయి. కాల్షియం, సల్ఫేట్ లాంటి అనేక రసాయనాలను వేడి చేసి తయారు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నీటిలో కరగక పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. పీఓపీ విగ్రహాలతో నీరు కలుషితమై జలచరాలపై ప్రభావం పడుతుంది. పీఓపీ విగ్రహాల వల్ల హానికర జిప్సం, మెగ్నీషియం, కాల్షియం, లెడ్, ఆర్గానిక్, ఇనుము లాంటి వాటితో పాటు రంగులు, రసాయనాలు నీటిలోకి చేరతాయి. ఈ నీరు తాగినా, నీటిలోని జలచరాలను తిన్నా అల్సర్, క్యాన్సర్, కామెర్లు, మెదడు, నరాల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చవితి సందర్భంగా వాడవాడలా భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు పోటీ పడటం కూడా ఒక రకంగా జిప్సం విగ్రహాలను తయారీని ప్రోత్సహిస్తోంది. నిజానికి పాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటే మట్టి విగ్రహాలకు ఖర్చు తక్కువ అవుతుంది. మట్టి విగ్రహాలను నీటిలో కరిగిపోయే పసుపు, కుంకుమ, వాటర్ పెయింట్స్ రంగులతో ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు. పీఓపీ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను గురించి వినాయక చవితి రోజు సమీపించాక హడావిడి చేయడం కాకుండా ఇప్పుడే ప్రజల్లో చైతన్యం కలిగించాల్సి అవసరం ఎంతైనా ఉంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి పర్యావరణాన్ని అన్ని విధాలా పరిరక్షించాలి. మొక్కలు నాటడంతో ఆక్సిజన్ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేసే ఏసీలు, ఫ్రిజ్‌ల లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తగ్గించాలి. నీరు కాలుష్యం కాకుండా ఉండాలంటే ప్రధానంగా జిప్సం విగ్రహాలను తయారీని తగ్గించి మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి. – కోట సోమేశ్వరరావు, రావులపాలెం పోటీ కాదు..భక్తి ప్రధానం ఎంత భారీ విగ్రహం పెట్టామన్న పోటీ తత్వాన్ని వీడి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలి. భక్తి ప్రధానమన్న అంశాన్ని గుర్తించాలి. పర్యావరణానికి ముప్పు కలిగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించి మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉత్సవ మండపాల్లో ఏర్పాటు చేయడానికి ఉత్సవ కమిటీలు చొరవ చూపాలి. – ఎస్వీఆర్ కృష్ణారెడ్డి, ఊబలంక -
తెలుగింటి పచ్చడి భలే టేస్టీ..
రెండేళ్లుగా హైదరాబాద్ నా హోమ్ టౌన్ అయిపోయింది. నా సొంత ఊరు ఢిల్లీకి చుట్టపు చూపుగా వెళ్లి రావడం తప్ప.. అక్కడున్న రోజులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందుకే ఇక్కడికి మకాం మార్చేయాలనుకున్నా. ప్రస్తుతానికైతే అద్దె ఇంట్లో ఉంటున్నా. త్వరలో సొంత ఇల్లు కొనుక్కుంటాను. తెలుగు పరిశ్రమకు దగ్గరగా ఉండాలనే ఆకాంక్షతో పాటు ఈ సిటీ చాలా నచ్చింది. అందుకే ఇక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిపోయా. తెలుగు కూడా కొంచెం కొంచెం మాట్లాడగలుగుతున్నా. షూటింగ్లో భాగంగా నేను హైదరాబాద్‌లో చాలా ప్లేసెస్‌కి వెళ్లాను. వంటకాల గురించి చెప్పాలంటే.. తెలుగింటి పచ్చళ్లు భలే రుచిగా ఉంటాయి. నాకిక్కడ ఎక్కువగా నచ్చేవి అవే. పండగలప్పుడు సిటీ చాలా సందడిగా ఉంటుంది. వినాయక చవితి చెప్పక్కర్లేదు. రంజాన్ మాసంలో ఓల్డ్ సిటీకి కొత్త కళ వచ్చేస్తుంది. నేను ఢిల్లీ అమ్మాయినే అయినా ఇప్పుడు ‘హైదరాబాదీ గాళ్’ అనిపించుకోవడం కూడా ఆనందంగా ఉంది. ఓవరాల్‌గా హైదరాబాద్‌లో నా జీవితం చాలా హాయిగా ఉంది. రాశిఖన్నా -
లడ్డూ కాదు.. ప్రజల ప్రాణాలే ముఖ్యం
ఇక మీదట ఖైరతాబాద్ గణేశ్ లడ్డూ పంపిణీని నిలిపివేస్తామని డీసీపీ కమలాసన్ రెడ్డి ప్రకటించారు. ప్రతిసారీ ఈ ప్రసాదం పంపిణీలో తొక్కిసలాట జరిగే అవకాశం ఎక్కువగానే ఉందని ఆయన అన్నారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని తెలిపారు. ఇకపై గణేశ్ ప్రసాదం పంపిణీ జరగకుండా నిర్వాహకులతో మాట్లాడతామన్నారు. శుక్రవారం నాడు గణేశ్ లడ్డూ ప్రసాదం పంపిణీ సందర్భంగా తీవ్ర తొక్కిసలాట జరిగి, లాఠీ చార్జీ చేయాల్సి రావడం.. దాంతో ఒక భక్తుడికి తల కూడా పగలడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఎట్టకేలకు మొదలైన మహాగణేశుడి శోభాయాత్ర
ఖైరతాబాద్‌లో కొలువైన మహాగణపతి శోభాయాత్ర ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో మొదలైంది. వాస్తవానికి ఉదయం 9 గంటలకే ప్రారంభం అవుతుందని తొలుత భావించినా, ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడంతో బాగా ఆలస్యమైంది. అంతకుముందు 59 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపైకి చేర్చి వెల్డింగ్ తదితర పనులు పూర్తి చేశారు. కాగా, ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశు పాల్గొన్నాడు. ముందుగా ఖైరతాబాద్ గణపతికి పూజలు చేసిన హిమాంశు, తాను ప్రతిసారీ ఇక్కడ విగ్రహాన్ని దర్శించుకుంటున్నాను గానీ, నిమజ్జనానికి వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పాడు. తాత, నాయనమ్మలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని పూజించినట్లు తెలిపాడు. -
అశ్లీల నృత్యాలు వద్దన్నందుకు పోలీసులను కొట్టారు
హిజ్రాలతో అశ్లీల నృత్యాలు ఆపు చేయించేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఎస్సై సహా ముగ్గురిని రాళ్లతో కొట్టారు. పోలీసు జీపును ధ్వంసం చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. మండలంలోని పాకాలపల్లెపాలెంలో గణేశ్ మంటపం వద్ద ఆదివారం రాత్రి హిజ్రాలతో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆపాలని గ్రామస్తులను కోరారు. వారు నిరాకరించటంతో లాఠీచార్జికి పూనుకున్నారు. దీంతో రెచ్చిపోయిన స్థానికులు దాడికి యత్నించగా పోలీసులు పరుగెత్తారు. రాళ్ల దాడిలో హోంగార్డు ఉపేంద్ర తలకు తీవ్రంగా, ఎస్సై రమణయ్యకు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసు జీపును కూడా ధ్వంసం చేశారు. ఘటన సమాచారంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులను కూడా గ్రామస్తులు కొంతసేపు నిర్బంధించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గ్రామంలో సుమారు 70 మంది పోలీసులను మోహరించారు. డీఎస్పీ జి.శ్రీనివాసరావు గ్రామానికి చేరుకుని, గ్రామస్తులతో మాట్లాడారు. దాడికి కారకులను తమకు అప్పగించాలని ఆయన గ్రామపెద్దలను కోరారు. అయితే, రాత్రి చీకట్లో పోలీసులను గాయపరిచి, జీపును ధ్వంసం చేసిన వారెవరో తమకు తెలియదని..కావాలంటే గ్రామస్తులందరినీ స్టేషన్‌కు తీసుకెళ్లాలని వారు సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. -
నాతో పాటు ఆకాశం కూడా కన్నీరుపెట్టింది
వినాయక చవితితో చాలామందికి సెంటిమెంటు పరంగా అనుబంధం ఉంటుంది. అందులోనూ ఇంట్లో పిల్లలు స్వయంగా వినాయకుడి బొమ్మలు చేయడం మొదలైన తర్వాత ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు కష్టపడి, ఎంతో ఇష్టపడి సరదాగా బొమ్మ చేసుకుని, దానికి మనసారా పూజలు అర్పించిన తర్వాత.. ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలంటే పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా కొంత బాధపడతారు. సరిగ్గా తనకు అలాంటి బాధే ఉంటుందని చెబుతోంది నటి, దర్శకురాలు రేణు దేశాయ్. ప్రతిసారీ వినాయక నిమజ్జనం సమయంలో తనకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుందని.. ఈసారి మాత్రం ఆకాశం కూడా తనతో పాటు ఏడ్చేసిందని ఆమె ట్వీట్ చేశారు. తన కారు అద్దాల మీద పడుతున్న వానను ఫొటో తీసి పోస్ట్ చేశారు. ఈసారి తన కొడుకు అకీరా, కూతురు ఆద్య కలిసి ఎలాంటి ప్లాస్టిక్, థర్మోకోల్ వాడకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాన్ని తయారుచేశారంటూ అంతకుముందు మురిసిపోతూ రేణు దేశాయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Every year,every single year my eyes tear up&this year d sky cried with me too! #Ganpati #visarjan #GanpatiBappaMorya pic.twitter.com/OZKy9Qzw74 — renu (@renuudesai) September 18, 2015 -
తిలక్ అరుదైన ఫోటోలు మీకోసం..
విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణపతి, గణనాధుడు.. రకరకాల పేర్లతో ఆ దేవదేవుణ్ణి మనం కొలుస్తున్నాం. ఏ పనిని మొదలు పెట్టినా విఘ్నాలు రాకుండా ఉండాలని ఆ గణపతిని పూజిస్తాం. ప్రతి ఇంట్లోనే కాకుండా గణనాధుడు ఇప్పుడు వాడవాడలా పూజలు అందుకుంటున్నాడు. అయితే వినాయక చవితి సామూహిక ఉత్సవాలు ఎప్పుడు, ఎలా మొదలయ్యాయో తెలుసా? చవితి పర్వదినాన్ని సామూహికంగా జరుపుకునే అతి పెద్ద పండుగా మార్చిన ఘటన మాత్రం లోకమాన్య బాలగంగాధర తిలక్‌కు దక్కుతుంది. స్వాతంత్ర్య సమర పోరాటంలో భాగంగా 1893లో సామూహిక గణపతి ఉత్సవాలను ప్రారంభించారు. మొదట మహారాష్ట్రలో ప్రారంభమైన సామూహిక వినాయక చవితి వేడుకలు దేశమంతా విస్తరించాయి. కాగా 1857 మొదటి స్వాతంత్ర్య సమరం తర్వాత బ్రిటిష్ వారు దేశంలో రాజకీయ సభలు, సమావేశాలను నిషేధించారు. అయితే మత పరమైన వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ నేపథ్యంలో గణపతి పూజలు ఇంటికే పరిమితం చేయకుండా సామూహికంగా జరుపుకుంటే ప్రజల్లో ఐక్యత, జాతీయ భావం పెరుగుతుందని తిలక్ భావించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాల ద్వారా అంతర్లీనంగా దేశభక్తిని ప్రభోదించారు. ఈ సందర్భంగా తిలక్ చవితి ఉత్సవాల్లో పాల్గొన్న అరుదైన ఫోటోలు మీ కోసం... -
సల్మాన్ ఇంట వినాయక చతుర్ధి వేడుకలు
-
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
జి.మాడుగుల : నుర్మతి గ్రామంలో గురువారం వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పా టు చేసిన వినాయక విగ్రహాన్ని సమీపంలోని గెడ్డలో నిమజ్జనానికి గురువారం సాయంత్రం ఊరేగింపుగా తీసుకెళ్లారు. గెడ్డలో దిగిన అంగనేని సన్యాసినాయుడు (26)నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. శుక్రవారం ఉదయం మృతదేహం బయటపడడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కలువ పువ్వుల కోసమని వెళ్లి దుర్మరణం ఎస్.రాయవరం : దార్లపూడి లింగాల చెరువులో శుక్రవారం కలువ పువ్వులు కోసేందుకు దిగిన యువకుడు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... వినాయక చవితి పర్వదిన వేడుకల్లో పూజకు అవసరమైన కలువ పువ్వులు తీసుకొచ్చి విక్రయించేందుకు బంగారి నూకరాజు(25) చెరువు వద్దకు వెళ్లాడు. చెరువులో దిగి పువ్వులు కోస్తుండగా ఊబిలో కూరుకుపోయి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నూకరాజును రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దురదృష్టవశాత్తూ నూకరాజు అప్పటికే మృతిచెందాడు. వీఆర్వో పార్వతి సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ రామారావు కేసు నమోదు చేశారు. -
వినాయకుడి వేడుకల్లో బాలీవుడ్ తారలు
-
వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌లో వినాయక చవితి వేడుకలు
-
జూనియర్ పవన్‌లు ఏం చేశారు?
వినాయకచవితి వచ్చిందంటే పిల్లలకు పండగే. గణపతిని రకరకాలుగా అలంకరించడానికి పొద్దున్నే లేచి.. స్నానం చేసి రెడీ అయిపోతారు. తమకు చేతనైన రీతిలో అందంగా గణేశుడికి అలంకారాలు చేసి మురిసిపోతారు, మురిపిస్తారు కూడా. ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని తయారు చేయడం ఇప్పుడు అందరికీ బాగా అలవాటైంది. ఎలాంటి ప్లాస్టిక్ పదార్థాలు, కృత్రిమ రంగులు ఉపయోగించకుండా.. మట్టితోను, అందుబాటులో ఉన్న రంగులతోను వినాయకుడి విగ్రహాలను చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, ఆద్య ఇద్దరూ కలిసి మంచి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. పుణెలో తల్లి రేణు దేశాయ్ వద్ద ఉంటున్న అకీరా, ఆద్య కలిసి ఎలాంటి థర్మోకోల్, ప్లాస్టిక్ డెకరేషన్లు ఉపయోగించకుండా గణపతిని తయారు చేశారు. కొబ్బరి కాయలు, పూలు, పళ్లతో పూజ చేసుకున్నారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్వీట్ చేశారు. తమ పిల్లల కళను అందరికీ పరిచయం చేశారు. Tiny ecofriendly Ganpati Bappa made by Akira & Aadya :) No thermocol or plastic decorations:) #GanpatiBappaMorya pic.twitter.com/ewSBbUBPlE — renu (@renuudesai) September 17, 2015 -
వాళ్లు శపించగలరు.. జాగ్రత్త!
వినాయక చవితి రోజున వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాంచి జోరు మీద ఉన్నట్లున్నారు. ముందుగా వినాయకుడిని రకరకాల వెరైటీ కోరికలు కోరి, దేవుడికే అమ్మో అనిపించేలా చేసిన వర్మ.. ఆ తర్వాత హీరో మంచు విష్ణు మీద సెటైర్లు వేశాడు. ఏదో వినాయక చవితి వచ్చింది కదాని అందరికీ శుభాకాంక్షలు చెబుదామని మంచు విష్ణు ట్విట్టర్లో ఓ కామెంట్ పెట్టాడు. తన రహస్య స్నేహితుడు, దీర్ఘ కాల అభిమాన దేవుడు గణేశుడి దీవెనలు అందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు. గణపతి బప్పా మోరియా అంటూ అందరినీ పలకరించాడు. అయితే, కాసేపటికల్లా వర్మ ఆ ట్వీట్ చూశాడు. ''నీ రహస్య స్నేహితుడు, అభిమాన దేవుడు ఎవరో అందరికీ తెలియనివ్వకు. అలా తెలిస్తే తిరుపతి, యాదగిరిగుట్టలకు జెలసీ వచ్చి, నిన్ను శపించగలవు జాగ్రత్త..'' అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసి జనమంతా నవ్వుకున్నారు. Praying my secret friend and long time favorite Lord Ganesha for his blessings to all. Ganapathi Bappa Moriya!!!!! — Vishnu Manchu (@iVishnuManchu) September 17, 2015 @iVishnuManchu Better not let everyone know ur secret faviourate or thirupathi and Yadagiri Gutta might become jealous and curse you — Ram Gopal Varma (@RGVzoomin) September 17, 2015 -
ముస్తాబైన ఖైరతాబాద్ గణపయ్య
-
వినాయక చవితి శుభాకాంక్షలు
-
పత్రం పుష్పం ఫలం
ఉగాదితో కొత్త సంవత్సరం మొదలైనా... మన జీవితాల్లో ఎలాంటి విఘ్నాలూ లేకుండా ఉండడానికి మనం చేసుకునే మొదటి పండుగ వినాయక చవితి. మంచి మాట తెలుసుకోడానికి... మంచి బాటలో నడవడానికి మంచివారుగా బతకడానికి... గణనాథుడు నృత్త, గీత, వాద్యాలతో వినోదాత్మకంగా మనకు జ్ఞానం ప్రసాదిస్తాడన్నది నమ్మకం. పత్రం, పుష్పం, ఫలం... ఇవేవీ లేకపోయినా తోయం... అంటే... గరిటెడు జలంతో కూడా సంతృప్తి పడే జనదేవుడు లంబోదరుడు... వరసిద్ధి వినాయకుడు. ఈ పది రోజులూ ఆయనే ప్రతి వీధికీ కళ. అందుకే మా పాఠక దేవుళ్లకు ఇవాళ్టి ఫ్యామిలీ కళకళ. పత్రం దండాలయ్య ఉండ్రాళ్లయ్యా... దాదాపు పాతికేళ్లు అయ్యింది ఈ పాట వచ్చి. ఇప్పటికీ చవితి పందిళ్లలో మోగుతూనే ఉంటుంది. ఏ కవికైనా ఇది సంతోషం కలిగించే అంశమే. ‘కూలీ నెం.1’ సినిమాలో ఈ పాట ఒక టీజింగ్ సందర్భంలో వస్తుంది. బాగా డబ్బు, అహంకారం ఉన్న ఒక అమ్మాయి రైల్వే కూలీలు చేస్తున్న గణేశ్ ఊరేగింపునకు అడ్డం వస్తుంది. అంతకు ముందే ఆమె ప్రవర్తన గురించి విన్న హీరో దీనిని చాన్స్‌గా తీసుకుని టీజ్ చేస్తూ పాట పాడతాడు. పైకి ఇది టీజింగ్ సాంగ్లా అనిపించినా, అర్థం చూస్తే శాశ్వతంగా నిలిచే భక్తిగీతంలా రాయాలని నిశ్చయించుకున్నా. ఆ విధంగానే వచ్చింది. ‘చిన్నారి ఈ చిట్టెలుకరా భరించెరా లంబోదర... పాపం కొండంత నీ పెనుభారం... ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మధన్యం’ అనే పల్లవి ఎలుకకు వర్తిస్తుంది, హీరోయిన్‌కూ వర్తిస్తుంది. హీరోయిన్ను మర్చిపోవచ్చు. ఎలుకను మర్చిపోరు గదా. ‘శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం... ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం’... అనే లైన్లు హీరోయిన్‌కి వర్తిస్తాయి, వినాయకునికీ చంద్రునికీ మధ్య జరిగిన కథనూ చెబుతాయి. ఈ రెండో అర్థం వల్లే పాట ఇప్పటికీ నిలుచుందని అనుకుంటున్నాను. ఇళయరాజా ఇచ్చిన పల్లవికి చెన్నైలో కూచుని రాసిన పాట ఇది. బాలూ గళం, కోరస్, కంపోజిషన్ అందులో ఉండే సెలెబ్రేషన్ మూడ్ పాటను శాశ్వతం చేశాయి. ఈ పాటే కాదు చాలా సినిమాల్లో దైవప్రస్తావన ఉండే పాటలు అనేకం రాశాను. కాని నాది ఒక రకంగా నిరీశ్వరవాదం. నా దైవానికి రూపం లేదు. ఇది నాస్తికత్వం కాదు. నా దృష్టిలో దైవాన్ని బాహ్యంగా చూడటం కాదు లోలోపల చూడాలి. అందుకే నేను దేవతా మూర్తులను వివిధ బాధ్యతలు నిర్వహించే కార్యనిర్వహణాధికారులుగా చూస్తాను. ఇన్ఛార్జ్లన్న మాట. నిర్వికల్ప సమాధి అంటారు. ఈ స్థితికి చేరుకున్నప్పుడే దైవాన్ని, మనల్ని కూడా ఒకసారి దర్శిస్తాం. నా దృష్టిలో పూజలు, పండుగలు దుష్కార్యాల నుంచి కాసేపు మనసు మళ్లించడానికి ఉద్దేశించినవే. కాని దైవానికి చేరువ కావాలంటే బాహ్య బంధనాల నుంచి విముక్తి పొంది అంతఃస్వేచ్ఛను అనుభవించాలంటే ఇవి చాలవు. లోపలి ప్రయాణం సాగాలి. ఈ మాటను చెప్పడానికే నేను ‘శివదర్పణం’ గ్రంథం రాశాను. అందులో శివుణ్ణి ఒక వేటగాడిగా భావిస్తూ ‘నా మనసే ఒక కారడవి. అందులో కోర్కెలనే క్రూరమృగాలు విషసర్పాలు తిరుగుతున్నాయి. వాటిని వేటాడు’ అని వేడుకున్నాను. ప్రతి మనిషి కోరుకోవాల్సింది ఇదే. మనలో ప్రతి ఒక్కరం అంతర్గత సమృద్ధితో సంపదతో తులతూగాలని వినాయకచవితి సందర్భంగా ఆశిస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. - సిరివెన్నెల సీతారామశాస్త్రి పుష్పం జైజై గణేశా.. జై కొడతా గణేశా... ‘జై చిరంజీవ’ సినిమా కోసం ఈ పాట సిట్యుయేషన్‌ను క్రియేట్ చేసి హీరో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ పాడాలి అని చెప్పారు. ఏం స్తుతిస్తాడు... ఎలా స్తుతిస్తాడు... ఆ స్తుతిలో నుంచి ప్రేక్షకులకు ఏం సందేశం ఇవ్వాలి అనేది ఇక నా తలనొప్పి. కాని కవి కన్ను అనేది ఒకటి ఉంటుంది. దానికి దృష్టిలోపం, చత్వారం లేకపోతే ప్రతి సన్నివేశంలో ఏదో ఒక అర్థాన్ని వెతుకుతుంది. ఆ సమయంలో ఈ లోకంలో ఉన్న చెత్త నాకు గుర్తుకు వచ్చింది. ఈ చెత్తను వినాయకునికి గుర్తు చేయాలి. ఆయన తొండంతో కుంభవృష్టిని కురిపించి దానిని కడిగేయించాలి అనిపించింది. అందుకే పల్లవిలో ‘లోకం నలుమూలలా లేదయ్యా కులాసా... దేశం పలువైపులా ఏదో రభస... మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా... పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా’ అన్నాను. ‘చిట్టి ఎలుకను ఎక్కి, గట్టి కుడుములు మెక్కి ఈ చిక్కు విడిపించడానికి రమ్మ’ని పిలిచాను. పల్లవి ఓకే. చరణంలో ఏం చెప్పాలి? వినాయకుడు కుమారస్వామి సహిత శివపార్వతుల పటం చూడండి. వారి వాహనాలు గమనించండి. వాస్తవంగా అయితే ఒక వాహనానికీ మరో వాహనానికీ వైరం ఉంది. కాని అవి కలిసి మెలిసి లేవూ. మనమెందుకు కొట్టుకుంటున్నాం. అదే మొదటి చరణంలో చెప్పాను. ‘నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా... ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా... పలుజాతుల భిన్నత్వం కనిపి స్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా’... మనకెందుకు లేదు సోదరభావం అని నిలదీశాను. బాగుందనిపించింది. ఈ స్ఫూర్తితో మేం ఉంటాం కాని మాకో బెడదుంది దానిని తొలగించు అని రెండో చరణంలో చెప్పాను. దాదాల నుంచి లంచాలు మరిగిన నాయకుల నుంచి రక్షించమని కోరుకున్నాను. కాని అక్కడ నాకు తోచిన చమత్కారం ఏమిటంటే ‘ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా’ అనడం. నిజంగానే ఇప్పుడు కూడా ధరలు చుక్కల్లోనేగా ఉన్నాయి. కందిపప్పు కిలో రెండు వందలని విన్నాను. మనం వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తాం. కాని ఈ సందర్భంగా చేయాల్సింది మనలోని చెడును ముంచడం మనలోని అహాన్ని వంచడం. ఆ మాటను కూడా చెప్పాను. ఈ పాట జనానికి బాగా నచ్చింది. వినాయకుని మంటపాల్లో జేజేలు అందుకుంటూనే ఉంది. మరో విషయం ఏమిటంటే చిన్నప్పటి నుంచి నేను విఘ్నేశ్వరుడి భక్తుణ్ణి. మా ఊరి చెరువు దగ్గర మంచి నల్లరేగడి మట్టి దొరికేది. దానిని తీసుకొచ్చి నా స్వహస్తాలతో వినాయకుడి ప్రతిమను చేసి ఇంట్లో ఒక గుడిలాంటిదే మెయింటెయిన్ చేసేవాణ్ణి. ఆయన దయ వల్ల నాకు బుద్ధి లభించింది. పాటల రచయిత కావాలనే కోరికా సిద్ధించింది. అందరికీ హ్యాపీ వినాయక చవితి. - చంద్రబోస్ ఫలం తిరు తిరు గణనాథ... వినాయక చవితి అనగానే నాకు మా వూరు ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) పక్కన ఉండే చిట్టడివి గుర్తుకు వస్తుంది. ఆ రోజు పిల్లలందరికీ ఆ అడవిలోకి వెళ్లే పర్మిషన్ దొరుకుతుంది. మరి పత్రి తేవాలి కదా. అందరం సరదాగా పోలోమంటూ పోయి పత్రి తెచ్చేవాళ్లం. మా బ్రాహ్మణ కుటుంబం కాబట్టి దర్బలో ఇంట్లోనే ఉండేవి. నేను మరీ భక్తుణ్ణి కదా. అంత భక్తిశ్రద్ధలతో చిన్నప్పుడు పూజలూ అవీ చేసిన గుర్తు లేదు. అయినప్పటికీ ఆ వినాయకుడి దయ వల్ల చదువు బాగా వచ్చింది. అయితే నాగార్జున యూనివర్సిటీలో బి.టెక్ చేరాక చదువుపై శ్రద్ధంతా పోయింది. వినాయకుడు అనగానే చదువు గుర్తుకొస్తుంది కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను. ‘100% లవ్’ సినిమాలో నేను రాసిన పాటలో కూడా ఇదంతా కనిపిస్తుంది. ఆటపాటల్లో హాయిగా ఉండాలనుకునే యూత్‌కి బాబోయ్ ఈ పరీక్షల భారం లేకుండా హాయిగా మార్కులొస్తే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఆ మూడే పాట పల్లవిలో కనిపిస్తుంది. ‘తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై.. ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై’ అని ఉంటుంది పల్లవి. కాని చరణం అంతకన్నా సరదాగా ఉంటుంది. ‘చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూనివ్వు కనులారా చదివింది ఒకసారే ఐనా కల్లోను మరిచిపోని మెమరీనివ్వు’.... ఇలా ఉంటుంది చరణం. ఇందులో ‘ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్కు’ అడగడం ‘ఆన్సర్ షీటు మీద ఆగిపోని పెన్ను’ అడగడం కనిపిస్తుంది. రెండో చరణంలో ఇంకా సింపుల్ కోరికలు ఉంటాయి. ‘తలలే మార్చిన తండ్రిగారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు’ అని చెప్తూ కనుక మా తలరాతలు బాగుండేలా చూడు స్వామి అని వేడుకుంటుంది హీరోయిన్. ‘పేపర్లో ఫొటోలు ర్యాంకులెవ్వరడిగారు పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు’ అనడం ఒక చమక్కు. అప్పటికే కొన్ని మాంటేజస్ తీసి కొన్ని రఫ్నోట్స్లు సుకుమార్‌గారు తయారు చేశారు. ఆ మాంటెజస్కు తగినట్టుగా ఆ రఫ్నోట్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో రాసిన పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ బాణి, దానికి హరిణి గొంతు రాణించాయి. తమన్నా, నాగచైతన్య కూడా ఈ పాటలోని సన్నివేశాలను బాగా పండించారు. క్లాసికల్ బాణీలో ఉన్న ఈ పాట ఇంత పెద్ద హిట్ కావడం నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు రామ్ నటించిన ‘గణేశ్’ సినిమాలో కూడా వినాయకుడి మీద ఒక పాట రాశాను. మాలాంటివాళ్లకు పాటే దైవం. మంచి పల్లవి తడితే అదే పెద్ద ప్రసాదం. మీ అందరినీ ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. - రామజోగయ్యశాస్త్రి -
మార్కెట్లకు రేపు సెలవు
వినాయక చవితి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్ఎస్ఈ), విదేశీ మారక ద్రవ్య మార్కెట్లతో సహా అన్ని రకాల మార్కెట్లకు గురువారం సెలవు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కమోడిటీ మార్కెట్లు కూడా సెలవు ఉంటుందని తెలిపారు. -
మట్టి గణపతినే పూజిద్దాం..!
-
ఆరగించవయ్యా...ఓ బొజ్జ గణపయ్య...
ఏకదంతుడు, వక్రతుండుడు, లంబోదరుడు, గజాననుడు, విఘ్ననాయకుడు... ఎన్ని పేర్లతో పిలిచినా పలుకుతాడు... ఏ నైవేద్యం పెట్టినా మారు మాటాడక ఆర గిస్తాడు... సామాన్యుడైనా... సంపదలు కలిగినవాడైనా..అందరూ పెట్టేవి ఉండ్రాళ్లే... ఒక్కోరాష్ర్టంలో ఒక్కో రకంగా తయారవుతాయి ఈ ఉండ్రాళ్లు...రేపు వినాయకచవితి... ఈ సందర్భంగా వినాయక నైవేద్యాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం... వేయించిన ఉండ్రాళ్లు కావలసినవి: గోధుమపిండి - పావు కేజీ బెల్లం పొడి - 100 గ్రా. కొబ్బరి తురుము - 100 గ్రా. ఏలకుల పొడి - టీ స్పూను నూనె - వేయించడానికి తగినంత నువ్వులు - 100 గ్రా. (దోరగా వేయించాలి) జాజికాయ పొడి - చిటికెడు ఉప్పు - చిటికెడు తయారీ : ముందుగా గోధుమపిండిని శుభ్రంగా జల్లించి, అందులో టీ స్పూను నూనె, చిటికెడు ఉప్పు జత చేసి ఉండలు లేకుండా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి సుమారు అరగంటసేపు నాననివ్వాలి. బాణలిలో బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, ఏలకుల పొడి, జాజికాయ పొడి వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి సన్న మంట మీద సుమారు పావు గంట సేపు ఉడికించాలి. కలిపి ఉంచుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలు చేసి, చిన్న పూరీలా ఒత్తి, బెల్లం మిశ్రమం అందులో ఉంచి, నాలుగువైపులా పువ్వు ఆకారంలో వచ్చేలా మూసేయాలి. (ఎక్కడా రంధ్రం లేకుండా చూడాలి. ఖాళీలు ఉంటే, స్టఫ్ చేసిన పదార్థం బయటకు వచ్చేస్తుంది). ఇలా అన్నీ తయారుచేసుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఒక్కో మోదకం వేసి దోరగా వేయించి తీసేయాలి. వినాయకుడికి నివేదన చేసి ప్రసాదంగా భుజించాలి. బనానా షీరా కావలసినవి : బొంబాయి రవ్వ - కప్పు, నీళ్లు - 2 కప్పులు, అరటి పండు - 1 (మెత్తగా గుజ్జు చేయాలి), నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి = టీ స్పూను, జీడిపప్పులు - 15, కిస్మిస్ - 15 తయారీ : బాణలిలో నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్మిస్లు వేసి వేయించి పక్కన ఉంచాలి. బొంబాయిరవ్వ వేసి దోరగా వేయించాక, నీళ్లు పోయాలి. రవ్వ బాగా ఉడికిన తరవాత అరటి పండు గుజ్జు, ఏలకుల పొడి, పంచదార వేసి బాగా కలపాలి. పదార్థాలన్నీ బాగా కలిసి ఉడికిన తర్వాత కిందకు దింపేయాలి. వేడివేడిగా వడ్డించాలి. బెల్లం ఉండ్రాళ్లు కావలసినవి : బియ్యప్పిండి - కప్పు, నీళ్లు - ముప్పావు కప్పు, ఏలకుల పొడి - అర టీ స్పూను, బెల్లం పొడి - కప్పు, నెయ్యి - టీ స్పూను, పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు, సెనగపప్పు - టేబుల్ స్పూను తయారీ : సెనగపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి. (నీళ్ల తడి ఉండకూడదు) బాణలిలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు కలిపి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగించి దింపేయాలి. బియ్యప్పిండి, ఏలకుల పొడి, కొబ్బరి తురుము జతచేసి బాగా కలపాలి. సెనగ పప్పు జత చేసి మిశ్రమాన్ని మెత్తగా అయ్యేలా బాగా కలపాలి. నెయ్యి జత చేసి మరోమారు కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఇడ్లీ రేకులలో వీటిని ఉంచి, కుకర్‌లో పెట్టి, ఆవిరి మీద సుమారు ఏడెనిమిది నిమిషాలు ఉడికించి దించేయాలి. పాఠోళీ కావలసినవి : పసుపు ఆకులు - 10 పెద్దవి, 20 చిన్నవి, బియ్యప్పిండి - రెండు కప్పులు ఉప్పు - అర టీ స్పూను, నీళ్లు - సుమారు ఒకటిన్నర కప్పులు ఫిల్లింగ్ కోసం : పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు, బెల్లం తురుము - 2 కప్పులు ఏలకుల పొడి - టీ స్పూను, జాజికాయ పొడి - చిటికెడు తయారీ : ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలాగ గట్టిగా కలిపి సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. ఫిల్లింగ్ కోసం తీసుకున్న పదార్థాలను కలిపి పక్కన ఉంచాలి. పసుపు ఆకులను నీళ్లలో శుభ్రంగా జాడించి, బాగా తుడిచి పక్కన ఉంచాలి. ఆకు మధ్యలో ఈనెలా ఎత్తుగా ఉండే భాగాన్ని చాకుతో జాగ్రత్తగా తీసేయాలి. బియ్యప్పిండిని ఆకు మీద సమానంగా పరవాలి. మధ్య భాగంలో ఫిల్లింగ్ పదార్థం తగు పరిమాణంలో ఉంచాలి. ఆకుని మధ్యకు మడిచి అంచులను గట్టిగా ఒత్తాలి. ఇలా అన్నీ తయారుచేసుకుని ఒక్కో ఆకుని ఇడ్లీ రేకులలో ఉంచి కుకర్‌లో పెట్టి ఆవిరి మీద సుమారు పావుగంటసేపు ఉడికించి దింపేయాలి. (విజిల్ పెట్టకూడదు) కొద్దిగా చల్లారాక వీటిని ఆకుల నుంచి వేరు చేసి పాలతో కాని, నెయ్యితో కాని అందించాలి. -
ఆకుపచ్చని గణేశుడు.. ఆండ్రాయిడ్‌లో ఒదిగాడు..
నాచారం: నగర వాసులకు పర్యావరణ స్పృహ అధికం. ప్రకృతిని కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను, ఎకో ఫ్రెండ్లీ ప్రతిమలను ప్రతిష్టించాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ విధానాన్ని గత కొన్నేళ్లుగా పాటిస్తున్నవారూ ఉన్నారు. నాచారం బాబానగర్‌కు చెందిన సూర్య శుభకర విఘ్న వినాయక అసోషియేషన్ ఆర్గనైజర్ సూర్యప్రకాష్ ఆరేళ్లుగా వినూత్న రీతిలో పర్యావరణ గణేష్ విగ్రహాలను రూపొందిస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ ఏడాది వినాయక చవితికి 30 వేల దారం రీళ్లను వినియోగించి 12 అడుగుల ‘త్రెడ్ ఆండ్రాయిడ్ గణేష్’ను తయారు చేశారు. ఇందు కోసం ఆకుపచ్చని దారాన్ని వాడారు. ఈ విగ్రహాన్ని బాబానగర్‌లో ప్రతిష్టించనున్నట్టు వివరించారు. అంతేకాదు.. పర్యావరణ ప్రేమికులు ఎవరన్నా కోరితే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు తయారు చేసి ఇస్తున్నారు. ఇందుకు కేవలం తయారీ ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు లక్ష కుందన్స్‌తో ‘కుందన్ గణేష్’, 70 వేల శివలింగాలతో లింగ గణేష్, పేపర్ టీకప్స్ గణేష్‌ను కూడా తయారు చేశారు. ఈ పర్యావరణ సహిత విగ్రహాల తయారీలో తనకు మనోజ్, శేఖర్, బాలకృష్ణ, నర్సింగ్, సంజిత్, రాజు, పట్టి తదితర 15 మంది విద్యార్థులు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. -
'పర్యావరణాన్ని పరిరక్షిద్దాం'
సుల్తానాబాద్ (కరీంనగర్) : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సమిష్టిగా గణేషుని మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకోవాలని సీఐ తులా శ్రీనివాస్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం పీస్‌కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందున మైక్సెట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోరారు. మతసామరస్యాన్ని పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద మద్యం, అశ్లీలతకు తావివ్వరాదని సూచించారు. -
వినాయక చవితి వస్తే చేపలకు పండగే..!
వినాయక చవితి నవరాత్రులు వస్తున్నాయంటే సందడే సందడి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ హడావుడే. ఇటీవల వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేలా మట్టితో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల తయారీపై జనంలో అవగాహన కల్పించడం కూడా మొదలైంది. ఇందులో భాగంగా ఈసారి గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరైన ముంబైలో అటు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు.. సముద్రంలో నివసించే చేపలకూ ప్రయోజనం కలిగేందుకు కొత్త పద్ధతులను పరిచయం చేస్తున్నారు ముంబైకి చెందిన స్ప్రౌట్స్ ఎన్విరాన్మెంట్ ట్రస్ట్ సభ్యులు. ఎండిన మొక్కజొన్న, బచ్చలికూర మొదలైన పదార్థాలతో ప్రతిమలను తయారు చేస్తున్నారు. ఆయా పదార్థాలను ఉచితంగా హోం డెలివరీ కూడా చేస్తున్నారు. ప్రతియేటా గణేష్ చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకొని దాదాపు లక్షన్నర విగ్రహాలను ముంబైలోని పలు నదులు, చెరువులు, సముద్రంలో నిమజ్జనం చేస్తుంటారు. ఈసారి మాత్రం ఈ నిమజ్జనం... నీటిలోని చేపలకు నిజమైన పండుగ అయ్యే అవకాశాన్ని సంస్థ సభ్యులు కల్పిస్తున్నారు. ఆహార పదార్థాలతో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడంతో.. అవి కరిగి చేపలకు ఆహారంగా మారుతున్నాయి. నాలుగైదేళ్లుగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల రూపకల్పనలో వివిధ కొత్త పంథాలను పరిచయం చేసిన సంస్థ.. ఈసారి కాలుష్య రహితంతో పాటు, చేపలకూ ఆహారాన్నందించేలా ఈ గింజ ధాన్యాల విగ్రహాలను పరిచయం చేశారు. మొదట్లో ఆహార పదార్థాలను విగ్రహాల్లో నింపడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. పదార్థాలు ఫంగస్ పట్టకుండా ఉండేందుకు పలు ప్రయోగాలు చేశారు. చివరికి ఎండబెట్టిన వాటిని వినియోగించడంతోపాటు, మార్కెట్లో విరివిగా దొరికే పదార్థాల వినియోగంతో, అవి నిల్వ ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పదార్థాలను కాగితాల్లో చుట్టి, పదిరోజుల పాటు ఎండబెట్టి వాటిని వినియోగిస్తున్నట్లు స్ప్రౌట్స్ ఎన్విరాన్మెంట్ ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి గత 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ సంస్థ.. మొదట్లో మూడు నాలుగేళ్ల పాటు నిమజ్జనం తర్వాత బీచ్‌లను క్లీన్ చేయడంలో ఉత్సాహంగా పనిచేసేది. అయితే కేవలం బీచ్ లు శుభ్రం చేయడం వల్ల కాలుష్యాన్ని పూర్తిగా దూరం చేయలేమని, నీటి కాలుష్యాన్ని అరికట్టడానికి మరింత కృషి అవసరమని గుర్తించారు. కాలుష్యకారకమైన వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని తగ్గించడంలో కృషి మొదలు పెట్టి, అందులో భాగంగానే ఈసారి గింజధాన్యాలు, మొలకలతో విగ్రహాల తయారీకి రూపకల్పన చేశారు. ముందుగా విగ్రహాలు తయారుచేసే వారిలో అవగాహన కల్పించి హానికారక రంగుల వినియోగాన్ని తగ్గించి సహజ రంగులతో పాటు మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించారు. కొనుగోలుదారుల్లో కూడా అవగాహన కల్పించి 10-15 అడుగుల ఎత్తుండే హానికారక విగ్రహాలకు బదులుగా రెండడుగుల కాలుష్యరహిత విగ్రహాలు కొనేలా ఒప్పించడంలో సంస్థ సక్సెస్ అయ్యింది. -
విజయవాడలోనూ భారీ వినాయకుడు
ఖైరతాబాద్ తరహాలో 63 అడుగుల విగ్రహం 6,300 కిలోల తాపేశ్వరం లడ్డూ ఖైరతాబాద్ విగ్రహ శిల్పుల ఆధ్వర్యంలోనే నిర్మాణ పనులు విజయవాడ బ్యూరో : వినాయక చవితి వస్తుందంటే చాలు మనకు హైదరాబాద్‌లోని గణేష్ నిమజ్జనం సందడి గుర్తుకొస్తుంది. అందులోను ఖైరతాబాద్ వినాయకుడిది ప్రత్యేక స్థానం. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఖైరతాబాద్ తరహా రికార్డు స్థాయి వినాయకుడు ఉండేలా విజయవాడలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లుగా విశాఖలోని గాజువాక సెంటర్లో భారీ వినాయకుడిని ఏర్పాటు చేసి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే రాజధాని ప్రాంతమైన విజయవాడలో అచ్చంగా ఖైరతాబాద్ వినాయకుడి తరహాలోనే భారీ పందిరి వేస్తున్నారు. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ఆవరణలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జూలై 12న చేపట్టిన వినాయకుడి విగ్రహ ప్రతిష్ట పనులు ఈ నెల 15న నాటికి పూర్తి అవుతాయని గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యాక్షుడు ఫణిరాజు తెలిపారు. ఈ విగ్రహాన్ని కూడా ఖైరతాబాద్ విగ్రహాన్ని తయారు చేస్తున్న చెన్నై శిల్పులే రూపొందిస్తుండటం విశేషం. నాట్య గణపతి భారీ విగ్రహం చుట్టూ అష్టలక్ష్మిదేవి విగ్రహాలను తీర్చిదిద్దనున్నారు. విగ్రహాల తయారీకే సుమారు రూ.55 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి లడ్డూ అందిస్తున్న తాపేశ్వరం సురుచి స్వీట్స్ వారే విజయవాడ విఘ్నేశ్వరుడికి 6,300కిలోల లడ్డూ ప్రసాదం తయారు చేయనున్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న గణపతి విగ్రహం 63 అడుగులు ఎత్తు ఉంటుంది, అయితే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం మాదిరిగా ఇక్కడ విఘ్నేశ్వరుడిని ఊరేగించకుండా ప్రతిష్టించిన చోటనే నిమజ్జనం చేయనున్నారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించి ఈ నెల 27వ తేదీన ఉన్న చోటనే నీటి యంత్రాలతో నిమజ్జనం చేయనున్నారు. -
'వినాయక చతుర్థి సందర్భంగా జంతువధ నిషేధం'
కలెక్టరేట్ (హైదరాబాద్): వినాయకచవితి, బక్రీదుల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో జంతువధను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌బొజ్జా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్లాటర్ హౌస్‌ల నిర్వాహకులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు వహించి అధికారులకు సహకరించాలని కోరారు. జంతువులను, పక్షులను ప్రార్థన స్థలాల్లో, జన సముదాయాల్లో ప్రదర్శించడం, పండుగ రోజుల్లో బలి ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. వినాయకచవితి ఉత్సవాలు సెప్టెంబరు 17 నుంచి 27 వరకు నిర్వహిస్తామని.. సెప్టెంబరు 24న బక్రీద్ పండుగ వస్తున్నందున సంబంధిత అధికారులు మందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. -
నిమజ్జనానికి దారేది
వినాయక విగ్రహాల నిమజ్జనంపై తర్జనభర్జన బెంగళూరు పద్ధతులు పరిశీలించిన అధికారులు నగరంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం సిటీబ్యూరో: గణేశునివిగ్రహాల నిమజ్జనం విషయం ప్రస్తుతం గేటర్‌లో చర్చనీయాంశంగా మారింది. వినాయక చవితి నెల రోజులు కూడా లేదు. ఇప్పటి నుంచే నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. మరోవైపు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాగర్ జలాల కాలుష్యానికి గల కారణాల్లో విగ్రహాల నిమజ్జనం కూడా ఒకటని ప్రభుత్వం గుర్తించింది. సాగర్ ప్రక్షాళనతో పాటు భవిష్యత్‌లో ఇందిరా పార్కులో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని గత ఏడాది ప్రకటించింది. ఇంతవరకూ దానిపై ఎలాంటి కార్యాచరణ లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అంతేకాదు.. బెంగళూరు తరహాలో సాగర్‌లో ఒక మూలన నిమజ్జనానికి వీలవుతుందేమో చూడాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. దీంతో ముగ్గురు అధికారుల బృందం ఇటీవల బెంగళూరును సందర్శించి వచ్చింది. అక్కడి నిమజ్జనం తీరుతెన్నులను, చెరువులను వారు పరిశీలించారు. అక్కడి పద్ధతులు ఇక్కడ అమలు చేయగలరో లేదో చెప్పగలిగే పరిస్థితిలో మాత్రం లేరు. ఎందుకంటే నగరంలో నిమజ్జనం వివిధ విభాగాలతో ముడిపడి ఉంది. సాగర్ నిర్వహణ, నిమజ్జనానంతరం వ్యర్థాల తరలింపు తదితర అంశాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటు వంటివి నీటి పారుదల శాఖ చూస్తోంది. క్రేన్లకు అవసరమైన వేదికలు, సాఫీ ప్రయాణానికి రహదారుల నిర్వహణ పనులను జీహెచ్ఎంసీ చూస్తోంది. విగ్రహాల ఎత్తే సమస్య బెంగళూరులో విగ్రహాల ఎత్తు తక్కువ. దీంతో చెరువుల్లోనే నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ గరిష్టంగా 8 అడుగులకు మించి విగ్రహాలు ఉండవు. ఇక్కడ వాటి ఎత్తుకు సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకోవాలో స్పష్టత లేదు. బెంగళూరులో నిమజ్జనానికి చెరువుల ఒడ్డున ప్రత్యేకంగా కొలనులు నిర్మించారు. అక్కడ దాదాపు 40 చెరువుల వద్ద ఇలాంటివి ఉన్నాయి. నిమజ్జనానికి చెరువు నీటిని కొలనులోకి మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తారు. అంతే కాదు. చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. నిమజ్జనం అనంతరం కొలను నీటిని ప్రత్యేక నాలాల ద్వారా వెలుపలికి పంపిస్తారు. ఈ చర్యలతో అక్కడ జలాలు కలుషితం కావడం లేదు. దాదాపు దశాబ్ద కాలంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇక్కడ ఇలా.. జీహెచ్ఎంసీ పరిధిలో 169 చెరువులు ఉన్నాయి. వీటిలో దాదాపు 40 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేయవచ్చునని అధికారుల అంచనా. ప్రస్తుతం సరూర్‌నగర్, కాప్రా చెరువుల్లో నిమజ్జనాలు చేస్తున్నారు. బెంగళూరు తరహాలో కొలనులు నిర్మించినా, విగ్రహాల ఎత్తు తగ్గనిదే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. నిర్ణీత విస్తీర్ణంలో నిర్మించే కొలనులో తక్కువ ఎత్తుంటేనే నిమజ్జనం సాధ్యమవుతుంది. గ్రేటర్లో విగ్రహాలు 20 నుంచి 60 అడుగుల వరకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు తరహాలోనగరంలోని వివిధ చెరువుల వద్ద నిమజ్జనానికి వీలవుతుందో లేదో అధ్యయనం చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇవే అంశాలను అధికారులు ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పొందుపరచినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో బెంగళూరులోనూ పెద్ద విగ్రహాలుండేవని... అక్కడ కూడా కోర్టు ఆదేశాల నేపథ్యంలో దాదాపు దశాబ్ద కాలంగా ఎత్తు తగ్గించారని అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. బెంగళూరులో అల్సూరు, శాంకే చెరువుల వద్ద ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీటిని ఎప్పటికప్పుడు కొలనుల నుంచి బయటకు తొలగిస్తారు. అల్సూరు చెరువు వద్ద విగ్రహాల తొలగింపు పనులకు 60 మంది కార్మికులు విధుల్లో ఉంటారు. ఓ వైపు నుంచి విగ్రహాలు చెరువులో పడుతుంటాయి. మరోవైపు నుంచి వాటిని తొలగిస్తుంటారు. అక్కడ 13 అడుగుల లోతుతో కొలను నిర్మించారు. నాలుగు వైపుల నుంచీ విగ్రహాలు నిమజ్జనం చేయవచ్చు. హైదరాబాద్ తరహాలో ఒక్కరోజేకాకుండా పండగ తర్వాత ప్రతిరోజూ అన్ని చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుంటారు. సాధారణంగా ఐదు, ఏడు, తొమ్మిది వంటి బేసి సంఖ్యల రోజుల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఎక్కువ ఎత్తున్న విగ్రహాలు లేనందువల్ల అల్సూరు చెరువు వద్ద కేవలం రెండు క్రేన్లతోనే నిమజ్జనం సాఫీగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మన నగరంలో చివరి రోజున హుస్సేన్‌సాగర్ వద్ద దాదాపు 50 క్రేన్లు 50 గంటల పాటు పని చేస్తుండటం తెలిసిందే. ఈసారికి ఇంతే.. వివిధ కారణాల నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పటిలాగే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు కొనసాగనున్నాయి. చెరువుల వద్ద ప్రత్యేక కొలనుల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. -
వినాయకచవితికి డీజేలకు అనుమతి లేదు
పాలమూరు : సుప్రీంకోర్టు ఆదేశానుసారం వినాయకచవితికి డీజేలు అనుమతించబోమని మహబూబ్‌నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించుకునే నిర్వాహకులు, ఆర్గనైజేషన్లు విధిగా వారి సమాచారాన్ని స్థానికంగా ఉన్న పోలీసులకు అందించాలని, ప్రతి వీధికి ఒక ఇన్చార్జి పోలీసు అధికారులను నియమించి బందోబస్తు నిర్వహించి వారికి రక్షణ కల్పిస్తామన్నారు. చెరువుల్లో నీళ్లు తక్కువగా ఉన్నాయని, మట్టి వినాయకులను పెట్టుకోవాలని సూచించారు. ఎత్తయిన విగ్రహాలు ప్రతిష్టించడంవల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, చిన్నవిగ్రహాలను ప్రతిష్టించుకోవాలన్నారు. సీఐలను, ఎస్ఐలు ప్రతి కాలనీకి ఒకరిని ఇన్చార్జిగా నియమించామని తెలిపారు. బలవంతపు చందాలు వసూలు చేస్తే చట్టరీత్య కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బలవంతంగా చందాలు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే చందా వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో శాంతి కమిటీ సమావేశాలు, ఆర్గనైజర్ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అందరు ఒకేరోజు వినాయక నిమజ్ఞనం చేయాలని, అందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐలు సీతయ్య, జ్యోతిలక్ష్మి పాల్గొన్నారు. -
వినాయక చవితికి 60 ప్రత్యేక రైళ్లు
♦ {పయాణికుల రద్దీని ద ృష్టిలో ఉంచుకునే: సెంట్రల్ రైల్వే ♦ నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం ముంబై : గణేశ్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 11 నుంచి 29వ తేదీ వరకు 01001 నంబర్ రైలు ముంబై సీఎస్టీ నుంచి అర్ధరాత్రి 12.20 బయలు దేరి మడ్గావ్కు మధ్యాహ్నం 2.30కు చేరుకుంటుంది. గురువారం మినహా ప్రతిరోజు ఈ సర్వీసు నడుస్తుంది. అలాగే రైలు నం 01002 మడ్గావ్ నుంచి మధ్యాహ్నం 2.40కి బయలుదేరి ఉదయం 4.25కు ముంబై సీఎస్టీ చేరుకుంటుంది. 01033 నంబరు రైలు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రతి గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు ముంబై నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.30 కు మడ్గావ్ చేరుకుంటుంది. అలాగే 01034 నంబర్ రైలు మడ్గావ్ నుంచి మధ్యాహ్నం 3.25కి బయలుదేరి ముంబై సీఎస్టీకి ఉదయం 4.25కు చేరుకుంటుంది. సెప్టెంబర్ 11 నుంచి 29వ తేదీ వరకు దాదర్ నుంచి సావంత్వాడీకి, సెప్టెంబర్ 12 నుంచి 30వ తేదీ వరకు సావంత్‌వాడీ నుంచి దాదర్‌కు వారానికి మూడు రోజులపాటు ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఆదివారం, మంగళవారం, శుక్రవారం 01095 నంబరు రైలు దాదర్ నుంచి సావంత్‌వాడీ బయలుదేరుతుంది. ఉదయం 7.50కి దాదర్ నుంచి బయలుదేరి సాయంత్రం 8.30కు సావంత్వాడీకి చేరుకుంటుంది. అలాగే సోమవారం, బుధవారం, శనివారం 01096 నంబరు రైలు సావంత్‌వాడీ నుంచి ముంబై బయలుదేరుతుంది. ఈ సేవలు నడుస్తాయి. సావంత్వాడీలో ఉదయం 4.50కి బయలుదేరి సాయంత్రం 3.50కి దాదర్ చేరుకుంటుంది. ఈ సేవలన్నీ స్పెషల్ చార్జీలతోటే నడుస్తాయని, బుకింగ్స్ 60 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. -
నేటి నుంచి బాలోత్సవ్
కొత్తగూడెం: జాతీయస్థాయి 23వ అంతర పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు (బాలోత్సవ్-2014)కు అంతా సిద్ధమైంది. విద్యార్థులు తమ ప్రతిభ చాటుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్తగూడెం క్లబ్ వేదికగా శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం నుంచే వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒక్కొక్కరిగా వస్తుండటంతో పట్టణంలో బాలల సందడి నెలకొంది. చిన్నారులకు ఆతిథ్యమిచ్చేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. మూడురోజుల పండుగను ముచ్చటగా జరుపుకుని ఆ మధురస్మృతులను తమ మదిలో దాచిపెట్టుకునేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఎంతో ఆసక్తికరంగా జరుగుతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. జాతీయస్థాయి పోటీలు కావడంతో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు విద్యార్థులు కూడా తమ ఎంట్రీలను నమోదు చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆరు రాష్ట్రాల నుంచి చిన్నారులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ప్రతిభాపాటవాలను ప్రదర్శించనున్నారు. వారిలోని సృజనాత్మకతను బయటపెట్టడంతో పాటు అది నలుగురికి ఉపయోగపడేలా ఈవెంట్లను సిద్ధం చేసుకున్నారు. చైతన్యాన్ని నింపేందుకు... మట్టి బొమ్మలు అనగానే గుర్తుకొచ్చేది వినాయక చవితి. పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను మట్టితో తయారుచేసి పర్యావరణాన్ని కాపాడాలంటూ చేసే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈసారి ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని బాలోత్సవ్‌లో మట్టి బొమ్మలు తయారు చేసే పోటీని నిర్వహిస్తున్నారు. ఎంతోమంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ బొమ్మలను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్లాస్టిక్, పీఓపీ ఇతర రకాల బొమ్మలు పెరిగిపోయిన నేపథ్యంలో మట్టి బొమ్మలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వ్యర్థంతో అర్థం’ అనే అంశం కూడా అందరిలో చైతన్యం నింపేదే. మనం ఎందుకూ పనికిరావనుకునే పదార్థాలు, వస్తువులతో విద్యార్థులు అద్భుతమైన ఆకృతులను తయారు చేసి ప్రదర్శిస్తారు. వీటిని చూసేందుకు వచ్చేవారు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురికాక తప్పదు. జానపదం వైపే మొగ్గు ఎక్కువ మంది విద్యార్థులు జానపద కళపై ఆసక్తి చూపుతున్నారు. జానపద నృత్యాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజులపాటు జరిగే జానపద నృత్య పోటీల్లో సుమారు 200కు పైగా ప్రదర్శనలు ఇస్తారు. పోటీల్లో అత్యంత ఆదరణ లభించేది కూడా ఈ జానపద నృత్యాలకే. ప్రేక్షకుల కేరింతలు జానపద నృత్య ప్రాంగణం హోరెత్తనుంది. అందర్నీ ఆకట్టుకునే నాటికలు బాలోత్సవ్‌లో అందర్నీ ఆకట్టుకునే వాటిలో నాటికలు కూడా ఉన్నాయి. నాటికల్లో భాగంగా బాల్య వివాహాలు, బాలల చదువు, మూఢ నమ్మకాలు, అమ్మాయిల చదువు వంటి అంశాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. హాస్య నాటికలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు చిన్నారి కళాకారులు సిద్ధమయ్యారు. ఇక్కడ ప్రదర్శించే ప్రతి నాటిక ఓ సందేశంతో కూడుకొని ఉంటుంది. -
రెండు రాష్ట్రాల్లో వైభవంగా నిమజ్జన వేడుకలు
-
నగర యాతన
చిన్నపాటి వర్షాలకే రోడ్లు ఛిద్రం గంటల తరబడి ట్రాఫిక్ జాం {పజలకు తప్పని కష్టాలు కానరాని పరిష్కార చర్యలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న సాధారణ వర్షాలకే రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఓ వైపు దెబ్బతిన్న రోడ్లు.. మరోవైపు మెట్రో పనుల్లో భాగంగా దారికి అడ్డంగా బారి కేడ్లు.. ఇవి కాక వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు... వినాయక చవితి, వారాంతపు సెలవు తర్వాత సోమవారం రోడ్లపైకి భారీగా చేరిన జనం... వెరసి ఎక్కడ పడితే అక్కడ గంట లకొద్దీ వాహనాలు బారులు తీరాయి. రద్దీని చూసి ఆర్టీసీ డ్రైవర్ దారి మళ్లించడంతో కంగారుపడిన ఓ వ్యక్తి బస్సు నుంచి దూకే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. నేరేడ్మెట్లో మరో యువతి మృతి చెందింది. నిన్నమొన్నటి వరకూ వాన జాడ లేక అల్లాడిపోయిన జనం... ఈ చినుకులను చూసి సంతోషించాలో... లేక నగరంలో ఎదురయ్యే ఇబ్బందులతో బాధ పడాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరో రెండు రోజులు వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే దుస్థితి నెలకొంది. ఏటా ఇవే దృశ్యాలు పునరావృతమవుతున్నా చక్కదిద్దే పనులు కనిపించడం లేదు. నాలుగు చినుకులకే గుంతలు తేలిన రోడ్లతో వాహనదారుల నడుములు విరుగుతున్నాయి. వర్షం వస్తే మన రోడ్ల గొప్పతనం తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లోని బాటిల్‌నెక్స్ వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. రహదారుల విస్తరణకు ప్రణాళికలు రూపొందించి ఏళ్లు గడుస్తున్నా కదలిక లేదు. భూసేకరణలో జాప్యం ఇందుకు ఒక కారణం కాగా, అధికారుల అశ్రద్ధ మరో కారణం. ఎటు చూసినా అదే సీను సోమవారం నగరంలో ఏ వైపు చూసినా బారులు తీరిన వాహనాలే. గంటల తరబడి ముందుకు కదల్లేని దుస్థితి.అటు నాగోల్ నుంచి ఇటు మెహదీపట్నం వరకూ... సికింద్రాబాద్ నుంచి మూసాపేట వరకూ అడుగడుగునా ట్రాఫిక్ జామ్. ఉప్పల్ చౌరస్తా, హబ్సిగూడ వీధి నెంబరు 8, ఐఐసీటీ, మెట్టుగూడ చౌరస్తా, శ్యాం లాల్ బిల్డింగ్, చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్, ఇమ్లిబన్, మూసాపేట-ఎర్రగడ్డ, సోమాజిగూడ, లక్డీకాపూల్, ముషీరాబాద్, రాజా డీలక్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్క్ రోడ్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు... జనమే జనం. ఏటా రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నా రోడ్ల దుస్థితిలో మార్పు లేదు. ఖర్చు ఘనం... ఈ ఏడాది ఇప్పటి వరకు రోడ్ల కోసం రూ.వంద కోట్లకు పైగా ఖర్చు చేశారు. రంజాన్, బోనాలు వంటి పండుగల పేరిట, పాట్‌హోల్స్ మరమ్మతుల పేరిట ఖర్చు చేశారు. అయినా పరిస్థితి షరా మామూలే. వర్షాకాలం కావడంతో రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలానికి ముందే పూర్తి స్థాయి మరమ్మతుల్లో విఫలమవుతున్నారు. దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. గడువుకు ముందే ... నగర రోడ్లపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల భారం.. వివిధ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం.. ప్రజల బాధ్యతారాహిత్యం వెరసి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ఐదేళ్లు మన్నిక ఉండాల్సిన బీటీ రోడ్లు రెండేళ్లు కూడా నిలవడం లేదు. దాదాపు 25 ఏళ్లు నిలవాల్సిన సీసీరోడ్లు అందులో సగం రోజులు కూడా ఉండటం లేదు. వాటర్‌బోర్డు, టెలికాం, విద్యుత్ శాఖలు తమ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతుండటంతో త్వరితంగా పాడవుతున్నాయి. -
తడిసి ముద్దయిన నగరం
పలుచోట్ల భారీ వర్షం సాక్షి,సిటీబ్యూరో: అల్పపీడన ప్రభావంతో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వినాయక చవితి వేడుకలకు వర్షంతో ఆటంకం ఏర్పడింది. దీంతో విగ్రహాలను మండపాలకు తరలించడం, పూజలు నిర్వహించడం వంటి సందర్భాల్లో భక్తులు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 వరకు నగరంలో 4.7 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదైనట్టు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆస్పత్రి గదుల్లోకి వరద నీరు.. వెంగళరావునగర్: గురువారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలోని పేయింగ్ గదుల్లోకి నీరు చేరింది. దీంతో శుక్రవారం రాత్రంతా నీరు బయటకు తోడుకుంటూ కునుకు లేకుండా గడపాల్సి రోగులు, వారి సహాయకులు గడపాల్సి వచ్చింది. సెల్లార్లో నిర్మించిన ఈ గదులన్నీ ఉపరితలానికి దాదాపు ఐదు అడుగుల దిగువున ఉండటంతో ఆస్పత్రి ఆవరణలో నుంచి, ఈఎస్ఐ ప్రధాన రోడ్డుగుండా పారే వాన నీరంతా గదుల్లోకి చేరుతోంది. -
గల్లీ గల్లీలో గణే శుడు
భారీగా మండపాల ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాల్లో భారీ సంఖ్యలో గణనాథులు కొలువుదీరారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మండపాల సంఖ్య గణనీయుంగా పెరిగింది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో వేలాది అపార్టుమెంట్లు ఉన్నాయి. అందువల్లనే జంట నగరాల్లో సుమారు లక్ష వినాయక మండపాలు ఏర్పాటైనట్లుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వర్గాలు పేర్కొంటున్నాయి. అపార్టుమెంట్లలోని గణేష్ మండపాలు అధికారిక లెక్కల్లోకి వచ్చే అవకాశం లేకపోవటంతో ఈ సంఖ్యలో తేడాలు ఉంటున్నాయుని తెలుస్తోంది. గత ఏడాది హైదరాబాద్ పరిధిలో 13,500, సైబరాబాద్ పరిధిలో 10,100 చొప్పున 23,600 వినాయక మండపాలు ఏర్పాటు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నివుజ్జన లెక్కల ప్రకారం ఇవి 60వేలుగా చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా అధికారిక వర్గాల లెక్కల ప్రకారం హైదరాబాద్ పరిధిలో 15వేలు, సైబరాబాద్ పరిధిలో 11వేల వినాయక మండపాలు ఏర్పాటయ్యూయి. ఖైరతాబాద్‌లో 60 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహం ఏర్పాటు చేయగా... మిగతా ప్రాంతాల్లో వివిధ రూపాల్లో... విభిన్న సైజుల్లో గణేశునిప్రతిష్ఠింపజేశారు. ఈసారి మట్టి విగ్రహాల సంఖ్య పెరిగింది. ఎనిమిది ప్రాంతాల్లోని పార్కుల్లో పండుగ రోజు ఇళ్లలో పూజకు ఉపయోగపడే 8 అంగుళాల నుంచి 3 అడుగుల వరకూ వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ పంపిణీ చేసింది. దీనికి రూ.6 లక్షలు వెచ్చించింది. గణేశుని సేవలో... వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, శాంతియత వాతావరణంలో నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను అనునిత్యం సయన్వయ పరుస్తూ, కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. మండపాలకు ఉచి త విద్యుత్తు ఇవ్వాలని కమిటీ విజ్ఞప్తి చేసిం ది. గతఏడాది మండపాల నిర్వాహకులు విద్యుత్తు ఛార్జీలకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చెల్లించారని.. ఈసారి ప్రభుత్వమే భరించాలని కోరుతోంది. ఊహించినంత లేదు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రప్రథమంగా జరుగుతున్న వినాయుక ఉత్సవాల సందర్భంగా మండపాలు పెరిగే అవకాశం ఉందని విగ్రహాల తయూరీదారులు, కళాకారులు భావించారు. ఈ నేపథ్యంలోనే 1.50 లక్షలకు పైగా విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో అవ్ముకానికి పెట్టారు. ఊహించిన స్థాయిలో వుండపాలు ఏర్పాటు కాకపోయేసరికి 50 వేలకు పైగా విగ్రహాలు నగరంలో మిగిలిపోయినట్టు తెలుస్తోంది. మొత్తం మీద గ్రేటర్లో లక్షకు పైగా వినాయుక వుండపాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. -
స్పెషల్ డైవ్ - జై..జై..గణేశా...