సాక్షి, విశాఖపట్నం: వినాయక చవితిపై దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు తెలిపారు. వినాయక చవితి పేరు చెప్పి ఏపీలో బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా కేసులు పెరిగితే బీజేపీ నేతలు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు.
కాగా త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఏపీలో కూడా కేంద్రం సూచనలతోనే వినాయక చవితిపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. అయితే ప్రజలు ఏమైనా పరవాలేదు, మాకు మత రాజకీయాలే ముఖ్యం అన్నట్లు రాష్ట్రంలోని బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
చదవండి: రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు!
Comments
Please login to add a commentAdd a comment