Narsinga Rao
-
కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు: ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్‌రావు
సాక్షి, హైదరాబాద్: బి.నర్సింగ్‌రావు... తెలంగాణ చిత్రానికి ప్రపంచస్థాయి గౌరవాన్ని తెచ్చిన ప్రముఖ దర్శకుడు. తెలుగు సమాజానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితుడు. ఆయన ఇటీవల సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 రోజులుగా తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ‘ఎక్కడ పుట్టిన కమలాలు మీరు’అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. తన పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరును గర్హిస్తూ ఆయన రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. లేఖలో ఏముందంటే.. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఆధునిక హంగులతో నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‘ నుంచే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తన పర్యవేక్షణలన్నీ కొనసాగిస్తోంది. వారికెందుకో నేను కూడా టార్గెట్ అయ్యాను. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా దాన్ని అడ్డుకుంటున్నారు. అవతలివాళ్లు మాట్లాడేది నాకు వినబడకుండా చేస్తున్నారు. 2014 నుంచి ఫోన్ టాపింగ్‌కు గురవుతోంది. 2018 జనవరి నుంచి నా ఫోన్ కాల్స్‌ను అడ్డుకుంటున్నారు. ఐదున్నరేళ్లుగా నాకు నరకం చూపిస్తున్నారన్నారు. రెండుసార్లు కేటీఆర్‌ను కలిసి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదు.’’అని పేర్కొన్నారు. అకారణంగా వేధిస్తున్నారు.. ప్రభుత్వం 8 ఏళ్లుగా తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తోందని నర్సింగ్‌రావు చెప్పారు. ఎవరితోనూ మాట్లాడనీయకుండా బంధువులు, స్నేహితులు, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన సంస్థలు, వ్యక్తులకు తనను దూరం చేస్తోందని, మానసికంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం ఫోన్‌పైనే ఆధారపడి కొనసాగుతోంది. అలాంటిది మొబైల్ ఫోన్‌ను తననుంచి దూరం చేసి ప్రభుత్వం తన జీవన గమనాన్నే అడ్డుకుంటోందని ఆయన ‘సాక్షి’తో వాపోయారు. ప్రపంచంతో తన సంబంధాలన్నీ నిలిచిపోయాయని, చివరకు బంధువుల్లో ఎవరైనా చనిపోయినా సమాచారం అందుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను డాక్టర్‌తో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేని పరిస్థితి. నన్ను కలిసేందుకు ఎవరైనా రావాలనుకున్నా ఫోన్లో ఆ విషయం చెప్పలేని స్థితి నెలకొంది’’అని వెల్లడించారు. ప్రభుత్వం తనను అకారణంగా వేధిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఇలాంటి దుస్థితిని ఎదుర్కోలేదన్నారు. -
రాష్ట్ర జడ్జీల సంఘం అధ్యక్షుడిగా నర్సింగరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా జిల్లా జడ్జి శ్రీ నందికొండ నర్సింగరావు ఎన్నికయ్యారు. ఈ నెల 15న జరిగిన ఎన్నికల ఫలితాలను ఆదివారం వెల్లడించారు. నర్సింగరావు 87 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారిని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జ్ రేణుక యార ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కాళ్లూరి ప్రభాకర్‌రావు, సుదర్శన్, ప్రధాన కార్యదర్శి–కోశాధికారిగా సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్, సహాయ కార్యదర్శులుగా కె. దశరథరామయ్య, జాబిశెట్టి ఉపేందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా శ్రీమతి శ్రీవాణి, మండ వెంకటేశ్వరరావు, అబ్దుల్ జలీల్, సాయికిరణ్, బి. సౌజన్య, బి. భవాని, రాజు ముదిగొండ, చందన, ఫర్హీం కౌసర్, ఉషశ్రీ, సంపత్, ప్రతిక్ సిహాగ్ ఎన్నికయ్యారు. వీరంతా రెండేళ్లపాటు ఈ పదవుల్లో ఉంటారు. కాగా, న్యాయమూర్తుల సంక్షేమం కోసం కృషి చేస్తానని నందికొండ నర్సింగరావు పేర్కొన్నారు. -
కేంద్రం సూచనలతోనే ఏపీలో ఆంక్షలు: నరసింగరావు
సాక్షి, విశాఖపట్నం: వినాయక చవితిపై దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు తెలిపారు. వినాయక చవితి పేరు చెప్పి ఏపీలో బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా కేసులు పెరిగితే బీజేపీ నేతలు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. కాగా త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఏపీలో కూడా కేంద్రం సూచనలతోనే వినాయక చవితిపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. అయితే ప్రజలు ఏమైనా పరవాలేదు, మాకు మత రాజకీయాలే ముఖ్యం అన్నట్లు రాష్ట్రంలోని బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు! -
రీ విజిట్..దూరం
అఫ్సర్ నలభై యేళ్ల సమగ్ర కవిత్వం (1979–2019) ‘అప్పటినుంచి ఇప్పటిదాకా’ ఈ శుక్రవారం సాలార్జంగ్ మ్యూజియంలో ఆవిష్కరణ అయింది. ప్రచురణ: చిత్రలేఖ ప్రొడక్షన్స్. దానికిముందు కవి జీవితపథాన్ని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు, ఒక వీడియో ప్రదర్శించారు(ప్రొడ్యూసర్: కిరణ్ చర్ల), కొన్ని కవితల్ని ఫ్రేములు కట్టి వేలాడదీశారు. ఏ కవి అయినా కలలుగనే, ఎంతటివారికైనా పట్టదేమో అనిపించేంతటి యోగం! సాహిత్య పోషకుడు బి.నర్సింగరావు ఇల్లే ఇది సాధ్యపడి ఉంటుంది. ఫ్రేముల్లోని ఒక కవిత: దూరం మరణాన్ని అడిగి ఓ మూడు క్షణాలు అరువు తెచ్చుకున్నాను. మరుక్షణం మరణం నెత్తిమీద నా నాలుగో క్షణాన్ని యుద్ధానికి పంపాను. తీగ మీద నడక ఎంత కష్టం! ప్రతీసారి తీగమీద ఆరేయలేక రాలిపోయిన ఎన్ని మాటల్ని ఎన్ని శ్వాసల్ని ఏరుకుని మళ్ళా జేబులో దోపుకొని వచ్చేస్తుంటానో! పలికిన మాటల మధ్య పలకని మాటల నిశ్శబ్దం బాధిస్తుంది. పెదాల చప్పుడొక్కటే విని గుండె చప్పుడిని సమాధి చేసుకుని వెనక్కి వచ్చేస్తాను. -అఫ్సర్ -
సౌదీలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి
సదాశివనగర్ మండలం అడ్లూరుఎల్లారెడ్డి గ్రామానికి చెందిన తోకల నర్సింగరావు(40) అనే వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతిచెందాడు. రెండు రోజుల క్రితమే నర్సింగ రావు మృతిచెందినట్లు అక్కడి వారు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం సౌదీ వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నర్సింగరావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణలు
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్ష పరుల రద్దీ మొదలైంది. ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ గురువారం ఉదయం ఏడుగంటల నుంచి ప్రారంభమైంది. ఐదు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాన్ని మహామంటపం సమీపంలోని హోమగుండం వెలిగించి అగ్నిప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో న ర్సింగరావు దంపతులు, అర్చకులు పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు 10వేల మంది దీక్ష ధారులు క్యూల్లో వేచి ఉన్నారు. -
సిరిసిల్ల తొలి ఎమ్మెల్యే మృతి
కరీంనగర్ (సిరిసిల్ల) : సిరిసిల్ల నియోజక వర్గ తొలి ఎమ్మెల్యే జువ్వాడి నర్సింగరావు గురువారం ఉదయం బేగంపేటలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి ఆయన స్వగ్రామం. రెండు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు సిరిసిల్ల సెస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. ఈయన మొదటిసారి 1962లో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థి గుడ్ల లక్ష్మీనర్సయ్యపై కాంగ్రెస్ తరపున గెలుపొందారు. మరుసటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 1972 ఎన్నికల్లో అప్పటి సీపీఐ అభ్యర్థి చెన్నమనేని రాజేశ్వర్రావుపై గెలుపొందారు. కాగా శనివారం తంగళ్లపల్లిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
నదిలో దిగి ఒకరి గల్లంతు
తగరపువలస (విశాఖపట్టణం): గోస్తనీ నదిలో స్నానానికి దిగి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. విశాఖప్టణం జిల్లా భీమిలి పట్టణం వలందపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు బుధవారం మధ్యాహ్నం తగరపువలస సమీపంలోని గోస్తనీ నదికి వెళ్లారు. లోపల దిగి స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. నర్సింగరావు(35) అనే వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోగా మిగతా ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. స్థానికుల సమాచారం మేరకు చిట్టివలస నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, ప్రవాహ వేగం చూసి నీటిలోకి దిగలేకపోయారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలించేందుకు గజ ఈతగాళ్లను రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. -
పుష్కరాలకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
గంటలో చేరుతామనగా ప్రమాదం యలమంచిలి వద్ద కారు బోల్తా ఒకరు మృతి.. నలుగురికి గాయాలు యలమంచిలి : గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి గాజువాక వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడి ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. యలమంచిలి సమీపంలో పెదపల్లి హైవే జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలిలా ఉన్నాయి...నిద్రమత్తులో డ్రైవర్ కళ్లుమూతపడటంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కగా ఉన్న లోయలోకి దూసుకుపోయి చెట్టును ఢీకొని పల్టీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడంతో ముందు సీటులో కూర్చున్న గాజువాక పంతులుగారి ప్రాంతానికి చెందిన లేళ్ల నర్సింగరావు (55) అక్కడికక్కడే దుర్మరణం పొందాడు. కారు నడుపుతున్న నర్సింగరావు కొడుకు కుమార్ లేళ్ల శ్రీధర్ రెండుకాళ్లు విరిగిపోయాయి. ఇదే కారులో ప్రయాణిస్తున్న దంపతులు కామశాని రత్నాకరరావు, కామశాని దేవిమణి, గాజువాక సరిగమవైన్స్ యజమాని గూడెల జయరామ్ తీవ్రగాయాలపాలయ్యారు. దేవిమణి తలకు, ఇతర శరీరభాగాలకు బలమైన గాయాలు తగిలాయి. జయరామ్ రెండుకాళ్లు, చేయి వేరిగిపోయాయి. రత్నాకరరావుకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం మేరకు యలమంచిలి సీఐ కె.వెంకట్రావు, పట్టణ ఎస్ఐ జి.బాలకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని గాజువాక సుప్రజా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో దేవిమణి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేర్ ఆస్పత్రికి తరలించినట్టు పట్టణ ఎస్ఐ బాలకృష్ణ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం నర్సింగరావు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బాలకృష్ణ చెప్పారు. -
పెట్రోల్ పోసి...నిప్పంటించి..!
వేర్వేరు చోట్ల దారుణాలు ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు నగరంలో కలకలం నిందితుల కోసం గాలింపు రాంగోపాల్‌పేట్: నగరంలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించారు. మహంకాళి, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో గురువారం చోటుచేసుకున్నఈ సంఘటనలు కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ... న్యూబోయిగూడలో నివసించే నర్సింగరావు (30) ప్రతి గురువారం బోయిగూడ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలోని సాయిబాబా గుడి వద్ద కొబ్బరి కాయలు విక్రయిస్తుంటారు. మిగిలిన రోజుల్లో బెలూన్ల వంటి చిన్నచిన్న వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆయనకు భార్య దుర్గాలక్ష్మితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా భార్యతో గొడవపడి ఇంటికి వెళ్లకుండా సాయిబాబా గుడి వద్ద ఫుట్‌పాత్‌పైనే నర్సింగరావు పడుకుంటున్నారు. బుధవారం రాత్రి అక్కడే పడుకోగా... అర్థరాత్రి 1.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యారు. బాధతో అతను కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు.. మార్కెట్ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే గురువారం తెల్లవారు జామున 3.30- 4 గంటల మధ్య ఓ ఆటో డ్రైవర్‌పై ఇదే తరహాలో దాడి జరిగింది.మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన ఆనంద్ (55) ఆటో డ్రైవర్. నూర్ఖాన్ బజార్లో ఆటో అద్దెకు తీసుకుని నడిపిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆయనకు భార్య శశికళ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గురువారం తెల్లవారు జామున ఆర్పీ రోడ్‌లోని బాటా చౌరస్తా వద్ద రోడ్డు పక్కన ఆటో ఆపి అందులోనేనిద్రిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆనంద్‌ను హుటాహుటిన పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహంకాళి ఏసీపీ ఎం.తిరుపతి వచ్చి బాధితులతో మాట్లాడి, వివరాలు సేకరించారు. బాధితుల వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ స్వీకరించారు. నర్సింగరావుకు 20 శాతం, ఆనంద్‌కు 50శాతం కాలిన గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం వారిని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. రెండు ఘటనలతో కలకలం కొద్ది గంటల వ్యవధిలో ఒకే తరహాలో రెండు ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ నెల 4నహనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో విజయ యాత్ర నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఈ సంఘటనలు చోటుచేసుకోవడం పోలీసుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనలపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్, మహంకాళి డివిజన్ ఎస్ఐలు, సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలను నియమించారు. సీసీ కెమెరాలో దృశ్యాలు ఈ రెండు ఘటనలకు సంబంధించి నిందితుల ఆచూకీ కోసం పరిసరాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సాయిబాబా గుడి వద్ద ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు రెండు, మూడుసార్లు అక్కడే తిరిగిన దృశ్యాలు ఉన్నాయి. అవి అంత స్పష్టంగా లేకపోవడంతో నిఫుణులతో వాటిని డెవలప్ చేయించే పనిలో పడ్డారు. బాటా వద్ద ట్రాఫిక్ కెమెరాలు పనిచేయకపోవడంతో అక్కడ కొంత ఇబ్బంది ఎదురవుతోంది. చిత్ర దర్గ ప్రాంతంలోని సీసీకెమెరాను పరిశీలిస్తున్నారు. -
అవినీతిని సహించను
‘సాక్షి’తో దుర్గగుడి ఈవో నర్సింగరావు విజయవాడ : శ్రీకనకదుర్గమ్మ ఆశీస్సులతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటానని ఇటీవల ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ నర్సింగరావు చెప్పారు. అవినీతిని సహించబోనని స్పష్టంచేశారు. ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. భక్తులు కూడా దేవస్థాన ఉద్యోగులకు సహకరించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయతీగా వ్యవహరించడం ద్వారా భక్తులకు దగ్గరవుతామని సిబ్బంది గుర్తించాలని చెప్పారు. సాక్షి : మూడు రోజుల క్రితం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి వాతావరణం ఎలా ఉంది? ఈవో : దేవస్థానం సిబ్బంది పనితీరు బాగుంది. కొన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి సమీక్ష చేశా. వారి తప్పొప్పులు తెలుసుకునేందుకు కొద్దిరోజులు పడుతుంది. అందరూ బాగా పనిచేస్తున్నారు. సాక్షి : అన్నదాన పథకంలో అవినీతి జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి..? ఈవో : నాణ్యమైన అన్నం భక్తులకు పెట్టాలి. నేను బాధ్యతలు స్వీకరించి మూడు రోజులైంది. ఈరోజే అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించాను. కొన్ని లోపాలున్నాయి. వాటిని త్వరలోనే సరిదిద్దుతా. నిత్యం నిఘా ఉంటుంది. ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తా. అటువంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపడతా. సాక్షి : ఆదాయం వచ్చే సీట్ల కోసం మీపై ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. నిజమేనా? ఈవో : ఎవరు ఏ సీట్లో ఉన్నా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. అవినీతికి పాల్పడినట్లు నాకు ఫిర్యాదు వస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. సాక్షి : ప్రొవిజన్ స్టోర్స్ ఇన్చార్జ్గా నాకే బాధ్యతలు ఇవ్వాలంటూ పలువురు మీపై ఒత్తిడి తెప్పిస్తున్నట్లు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం? ఈవో: ప్రొవిజన్ స్టోర్స్ ఇన్చార్జ్ ఎంతో జాగ్రత్తగా బాధ్యతలు నిర్వహించాలి. ఏ ఒక్క విషయంలో తప్పులు దొర్లినా తద్వారా దేవాలయానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఎంతోమంది భక్తులు లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు. వారికి దేవాదాయ శాఖ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి రానివ్వను. నాపై ఇంతవరకు ఎటువంటి వత్తిడి రాలేదు. సాక్షి : అర్చకుల్లో రెండు గ్రూపులు ఉన్నాయని, ఈవోను సైతం శాసించే స్థాయికి కొందరు అర్చకులు ఎదిగినట్లు సమాచారం..? ఈవో : ఈ విషయం నా దృష్టికి రాలేదు. కుటుంబం అన్న తరువాత చిన్నచిన్న పొరపొచ్చాలు రావడం సహజం. అర్చకులు కూడా దేవస్థానం అనే కుటుంబంలో సభ్యులే. స్పర్థలు వస్తుంటాయి. పోతుంటాయి. ఈ విషయాన్ని కూడా వారితో మాట్లాడి తెలుసుకుని అటువంటి పరిస్థితి ఉంటే సరిదిద్దేందుకు చర్యలు చేపడతా. సిబ్బందిని ఏకతాటిపై నడిపేందుకు చర్యలు తీసుకుంటాను. సాక్షి : దేవస్థానానికి దళారుల బెడద ఎక్కువగా ఉందని భక్తులు చెబుతున్నారు, షాపుల కేటాయింపు దగ్గర నుంచి టెండర్ల వరకు వారిదే హవా నడుస్తున్నట్లు విమర్శలున్నాయి? ఈవో : దళారుల మాటలు ఎవ్వరూ నమ్మవద్దు. ఇప్పటి వరకు ఏమి జరిగిందో నాకు తెలియదు. ఇక నుంచి దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దు. ఎవరికైనా ఏ పని ఉన్నా నేరుగా నన్నే కలిసి వారి సమస్యను చెప్పవచ్చు. ఇక టెండర్లకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారమే ముందుకు వెళతాం. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనివ్వను. సాక్షి : త్వరలో భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానుంది. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఈవో : భవానీ దీక్షల విరమణ కార్యక్రమం వచ్చే నెల 12 నుంచి 16 వరకు ఉంటుంది. ఏర్పాట్లను ఇంజినీరింగ్ విభాగం వారు చూస్తున్నారు. త్వరలోనే టెండర్ల విషయాన్ని ఫైనల్ చేస్తాం. -
కదం తొక్కిన యానిమేటర్లు
కలెక్టరేట్ ముట్టడి 300 మంది అరెస్టు, విడుదల విశాఖపట్నం : ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) యానిమేటర్లు బుధవారం కలెక్టరేట్ ఎదుటు కదం తొక్కారు. 15 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యానిమేటర్లపై రాజకీయ వేధింపులు, అధికారుల తొలగింపులు ఆపాలని, గుర్తింపు కార్డులు, నియామకపత్రాలు ఇవ్వాలని ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్ గేటు వద్ద నినాదాలు చేస్తూ బైఠాయించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ పది రోజులుగా ఐకేపీ యానిమేటర్లు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. నిత్యం మహిళా ఉద్ధరణపై ఉపన్యాసాలు చేస్తున్న సీఎం చంద్రబాబు మహిళలచేత వెట్టిచాకిరీ చేయించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. వీరి పోరాటానికి, న్యాయమైన సమస్యల పరిష్కారానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ యానిమేటర్లకు అభయ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా అధ్యక్షురాలు దాక్షాయిణి, సీఐటీయూ వర్కింగ్ కమిటీ కన్వీనర్ అరుణ, ఐకేపీ జిల్లా కార్యదర్శి, ఆర్. రామసుశీల, అధిక సంఖ్యలో ఐకేపీ యానిమేటర్లు పాల్గొన్నారు. -
మానోళ్లకు పెద్ద పదవులు?
జోగిపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా వారికి కీలక పదవు లు దక్కే అవకాశం ఉంది. గజ్వేల్ అసెంబ్లీ నుంచి గెలిచిన టీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో సీఎం పగ్గాలు చేపట్టనున్న విషయం తెల్సిందే. అయితే ప్రభుత్వ పాలనలో ప్రధాన భూ మికను పోషించే ప్రధాన కార్యదర్శి పదవి లేదా సీఎం పేషీలోని ముఖ్యమైన పదవుల కోసం జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరు కూడా జోగి పేట డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు కావడం గమనార్హం. జోగిపేట ప్రభుత్వ కళాశాలలో చదువుకుని ఐఏఎస్ పూర్తి చేసి ఉన్నత పదవుల్లో ఉన్న నర్సింగరావు, నాగిరెడ్డిల కు కొత్తగా ఏర్పడబో యే తెలంగాణ రాష్ట్రంలో కీలక పదవు లు దక్కనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నర్సింగరావు కోల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నా రు. కాగా వి.నాగిరెడ్డి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి గా కొనసాగుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామానికి చెందిన సింగాయిపల్లి నర్సింగ్‌రావు 1976-1979లో జోగిపేట ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కాగా అందోల్ ని యోజకవర్గంలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటకు చెందిన నాగిరెడ్డి 1975లో జోగిపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం కావడంతో వీరిద్దరికి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించేందుకు టీఆర్ఎస్ఎల్పీ నేత కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వీరిద్దరు కూడా జిల్లా కు చెందిన వారు కావడం విశేషం. ఇటీవల కేసీఆర్ గవర్నర్ వద్దకు వెళ్లిన సమయంలో నర్సింగరావు కూడా వెంట ఉన్న ట్టు సమాచారం. ఆయన్ను రాష్ట్ర సర్వీసులోకి తీసుకొచ్చేం దుకు సాంకేతిక సమస్యలు ఏమైనా ఎదురైతే నాగిరెడ్డి పేరును పరిశీలించనున్నారు. నాగిరెడ్డికి సీఎస్ లేదా సీఎం పేషీలో ఏదైనా ముఖ్య పదవిని కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. జోగిపేట కళాశాలకు చెందిన వీరిద్దరికి రాష్ట్రస్థాయిలో ముఖ్యపదవులు లభించనుండడంతో స్థానికులతోపాటు వారి స్నేహితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
అదనపు జేసీగా నర్సింగరావు
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌గా సీహెచ్ నర్సింగరావు నియమితులయ్యారు. విశాఖపట్నంలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్‌గా పనిచే స్తున్న ఆయనను జిల్లా అదనపు జేసీగా బదిలీ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బీఆర్ మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అదనపు జేసీగా నియమితులైన రెండో వ్యక్తి నర్సింగరావు. గతంలో అదనపు జేసీగా పనిచేసిన మిరియాల వెంకట శేషగిరిబాబు గతేడాది జూన్‌లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి జిల్లా రెవెన్యూ అధికారే ఇన్‌ఛార్జి జేసీగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నర్సింగరావు ఎంఏ బీఈడీ చదివారు. తొలుత రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం గ్రూప్ పరీక్షల్లో సబ్ రిజిష్ట్రార్ పోస్టింగ్ వచ్చినప్పటికీ చేరలేదు. 1990లో మళ్లీ గ్రూప్-2 పరీక్ష రాసి రెవెన్యూశాఖలో ప్రవేశించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మార్వోగా తొలి పోస్టింగ్ పొందారు. 12 ఏళ్లపాటు అక్కడే పనిచేశారు. 2002లో డెప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. అనంతరం విశాఖపట్నం ఉడా సెక్రటరీగా, రంపచోడవరం, కావలి, కందుకూరుల్లో ఆర్డీవోగా, విజయవాడ-శ్రీకాకుళం(ఆరు జిల్లాల) ఎండోమెంట్ మల్టీజోనల్ ఆఫీసర్‌గా, తూర్పుగోదావరి జిల్లాలోని సింహాచలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విశాఖ అర్బన్‌ల్యాండ్ సీలింగ్ విభాగంలో స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్‌గా పనిచే స్తూ ఇక్కడకు బదిలీ అయ్యారు. వారం రోజుల్లో విధుల్లో చేరనున్నట్టు ఆయన ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
హిజ్రాలపై చిన్నచూపు తగదు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:హిజ్రాలపై చిన్నచూపు తగదని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యు డు బి.ఎల్.నర్సింగరావు అన్నారు. మంగళవారం ఎన్సీఎస్ రోడ్డులో ఒక ఫంక్షన్ హాలులో హిజ్రాలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రధా న వక్తగా నర్సింగరావు మాట్లాడుతూ సమాజంలో హిజ్రాలను చిన్న చూపు చూడడం, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని అనుచితంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని చెప్పారు. అటువంటి సంఘటనలు తమ దృష్టికి తీసుకువస్తే తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో స్త్రీ, పురుషులతో సమానంగా హిజ్రాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు హిజ్రాలకు సరైన ఆదరణ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో స్త్రీ, పురుషులతో సమానంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఓటరు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇతర సంక్షేమ పథకాల అమలులో తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. హెల్పింగ్ హేండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఎక్కువ మంది హిజ్రాలున్నారని, వారికి స్వయం ఉపాధి కల్పించాలన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరి గా ఇక్కడ కూడా హిజ్రాల దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు హరీష్ రావు, రాజు, వన్‌టౌన్ ఎస్ఐ రమణయ్య, హిజ్రాస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు కుమారమ్మ, అధ్యక్షురాలు దవడ మీన, కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువు గట్టుపై ప్రత్యేక పూజలు పెద్ద చెరువు గట్టుపై నవదుర్గా ఆలయ నిర్మాణ పనులు విజయవంతం జరగాలని హిజ్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు కంటోన్మెంట్ నుంచి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ నవదుర్గ ఆలయాన్ని జూన్ 20వ తేదీలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామానికి చెందిన ఇటుక గ్రామస్థులు ఉచితంగా ఇటుకలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.నవదుర్గ విగ్రహాలను నాయుడు ఫంక్షన్ హాల్ అధినేత, ఆయన స్నేహితులు విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు.