సిరిసిల్ల నియోజక వర్గ తొలి ఎమ్మెల్యే జువ్వాడి నర్సింగరావు గురువారం ఉదయం బేగంపేటలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
కరీంనగర్ (సిరిసిల్ల) : సిరిసిల్ల నియోజక వర్గ తొలి ఎమ్మెల్యే జువ్వాడి నర్సింగరావు గురువారం ఉదయం బేగంపేటలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి ఆయన స్వగ్రామం. రెండు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు సిరిసిల్ల సెస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు.
ఈయన మొదటిసారి 1962లో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థి గుడ్ల లక్ష్మీనర్సయ్యపై కాంగ్రెస్ తరపున గెలుపొందారు. మరుసటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 1972 ఎన్నికల్లో అప్పటి సీపీఐ అభ్యర్థి చెన్నమనేని రాజేశ్వర్‌రావుపై గెలుపొందారు. కాగా శనివారం తంగళ్లపల్లిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.