first mla
-
సదాశివ రావు బాపు సాహెబ్ భోసలే మృతి
యశవంతపుర: దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది సదాశివ రావు బాపు సాహెబ్ భోసలే (101) కన్నుమూశారు. వృద్ధాప్యంతో బెళగావి తాలూకా కడోళి గ్రామంలో తన స్వగృహం లో గురువారం తుదిశ్వాస విడిచారు. 25 ఎకరాలు పేదలకు దానం చేశారు. భోసలే బెళగావి దక్షిణ, హిరేబాగేవాడి స్థానాల నుంచి కర్ణాటక శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు. భూదా నోద్యంలో పాల్గొనడమే కాకుండా తనకున్న 25 ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టారు. ఉత్తర కర్ణాటకకి అన్యాయం జరుగుతోందనే బాధతో 12 ఏళ్లపాటు అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. 1969లో ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్షను అనుభవించారు. తన స్వగ్రామంలో గాంధీ స్మారక నివాసాన్ని నిర్మించారు. భోసలే మృతికి గవర్నర్ వజూభాయ్ నివాళులు అర్పించారు. -
మన తొలితరం ఎమ్మెల్యేలు
హాయ్ పిల్లలూ.. మన తొలి తరం ఎమ్మెల్యేలు ఎవరనేది మీకు తెలుసా? బ్రిటీష్ వారి పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదే్శ్కు నిర్వహించిన ఎన్నికల్లో మన జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలే ఉండేవి. 1952లో నిర్వహించిన ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి లక్ష్మీనారాయణరెడ్డి (ఇండిపెండెంట్), హిందూపురం నియోజకవర్గం నుంచి శివశంకరరెడ్డి (కాంగ్రెస్), మడకశిర నుంచి సిద్దనగౌడ (ఇండిపెండెంట్), కదిరి నుంచి కె.వి.వేమారెడ్డి (కాంగ్రెస్), ధర్మవరం నుంచి కె. శ్రీనివాసులు (ప్రజాపార్టీ), తాడిపత్రి నుంచి సి. సుబ్బారాయుడు (ప్రజాపార్టీ), అనంతపురం నుంచి తరిమెల నాగిరెడ్డి (కమ్యూనిస్టు), కళ్యాణదుర్గం నుంచి సందా నారాయణప్ప (కాంగ్రెస్) ఎన్నికకాగా, తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతప్ప (ఎస్టీ) ఎన్నికయ్యారు. -
సిరిసిల్ల తొలి ఎమ్మెల్యే మృతి
కరీంనగర్ (సిరిసిల్ల) : సిరిసిల్ల నియోజక వర్గ తొలి ఎమ్మెల్యే జువ్వాడి నర్సింగరావు గురువారం ఉదయం బేగంపేటలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి ఆయన స్వగ్రామం. రెండు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు సిరిసిల్ల సెస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు. ఈయన మొదటిసారి 1962లో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థి గుడ్ల లక్ష్మీనర్సయ్యపై కాంగ్రెస్ తరపున గెలుపొందారు. మరుసటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 1972 ఎన్నికల్లో అప్పటి సీపీఐ అభ్యర్థి చెన్నమనేని రాజేశ్వర్రావుపై గెలుపొందారు. కాగా శనివారం తంగళ్లపల్లిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.