మన తొలితరం ఎమ్మెల్యేలు
హాయ్ పిల్లలూ.. మన తొలి తరం ఎమ్మెల్యేలు ఎవరనేది మీకు తెలుసా? బ్రిటీష్ వారి పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదే్‌శ్‌కు నిర్వహించిన ఎన్నికల్లో మన జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలే ఉండేవి. 1952లో నిర్వహించిన ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి లక్ష్మీనారాయణరెడ్డి (ఇండిపెండెంట్), హిందూపురం నియోజకవర్గం నుంచి శివశంకరరెడ్డి (కాంగ్రెస్), మడకశిర నుంచి సిద్దనగౌడ (ఇండిపెండెంట్), కదిరి నుంచి కె.వి.వేమారెడ్డి (కాంగ్రెస్), ధర్మవరం నుంచి కె. శ్రీనివాసులు (ప్రజాపార్టీ), తాడిపత్రి నుంచి సి. సుబ్బారాయుడు (ప్రజాపార్టీ), అనంతపురం నుంచి తరిమెల నాగిరెడ్డి (కమ్యూనిస్టు), కళ్యాణదుర్గం నుంచి సందా నారాయణప్ప (కాంగ్రెస్) ఎన్నికకాగా, తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతప్ప (ఎస్టీ) ఎన్నికయ్యారు.